కామెడీ షోలో లేడీ గెటప్స్ వేసిన సాయి తేజ ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిపోయాడు. ప్రియాంక సింగ్‌గా పేరు మార్చుకున్న అతడు తనకు వచ్చిన ఆఫర్‌ను అందిపుచ్చుకుని బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొన్నాడు. అయితే ప్రియాంక సింగ్ ఎవరో తనకు తెలీదని, ఆమెకు సపోర్ట్ చేయమని తెలంగాణ రాష్ట్ర సమితి హిజ్రా ఫౌండర్ చంద్రముఖి షాకింగ్ కామెంట్స్ చేశారు.
"ట్రాన్స్‌జెండర్‌గా మారడం అంటే అంత ఈజీ కాదు. నాలో అమ్మాయి లక్షణాలు ఉన్నాయని సైక్రియాట్రిస్ట్‌కు చెప్తే అతడు ఓ రెండేళ్లపాటు ఆడపిల్లలా బట్టలు వేసుకోమంటాడు. రెండేళ్లు కౌన్సిలింగ్ ఇస్తాడు. దీని తర్వాత కూడా అమ్మాయిగానే ఉండాలనిపిస్తే అప్పుడు సర్జరీ చేయించుకోమంటారు. అంతేకానీ 24 గంటలు చీర కట్టుకొని బాడీలో ఫెమినిటీని పెంచుకోవడం వేరు, పుట్టినప్పుడే ఫెమినిటీతో పుట్టడం వేరు. కొందరు ఆడపిల్ల గెటప్స్ వేస్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని పూర్తిగా ఆడపిల్లగా మారి ఇంకా ఎక్కువ సంపాదిద్దాం అనుకుంటారు. అక్కా నాకు ఆడపిల్లలా అవ్వాలని ఉందని ఎందరో నా సోషల్ మీడియా అకౌంట్లలో కామెంట్లు పెడుతూ ఉంటారు.సెక్స్ వర్క్ చేసో, అడుక్కునో బతకడం కన్నా ఉద్యోగం చేసి బతకమని కౌన్సెలింగ్ ఇస్తుంటాను. అలాగయితేనే జీవితంలో గౌరవంగా బతుకుతారని చెప్తాను.
బిగ్‌బాస్ షోలోకి ట్రాన్స్‌జెండర్లను తీసుకొస్తున్నారు. గతంలో తమన్నా, ఈసారి ప్రియాంకను తెచ్చారు. అయితే ఆమె గురించి నాకు పెద్దగా తెలీదు. కేవలం టీవీలో చూడటం వరకే తెలుసు, అది కూడా సాయిగానే తెలుసు. తను ట్రాన్స్‌జెండర్ అయ్యారని నాకు తెలియదు. మా కమ్యూనిటీలో ఉండి ఉంటే మా సపోర్ట్ ఉండేది. లేదు కాబట్టి ఎటువంటి సపోర్ట్ ఉండదు. గతంలో తమన్నా బిగ్‌బాస్‌కు వెళ్లినప్పుడు సపోర్ట్ చేశా. ఎందుకంటే ఆమె మా కమ్యూనిటీలో ఉంది కాబట్టి! ఇప్పటికీ తమన్నా, నేను మంచి స్నేహితులం" అని చెప్పుకొచ్చారు చంద్రముఖి.
Comments
Please login to add a commentAdd a comment