Chandramukhi
-
మరోసారి వివాదంలో నయనతార.. చంద్రముఖి నిర్మాతల నోటీసులు
హీరోయిన్ నయనతార (Nayanthara) మరోసారి వివాదంలో చిక్కుకుంది. తమ అనుమతి లేకుండా చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నిర్మాతలు నయనతారకు నోటీసులు పంపించారు. హీరోయిన్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తమకు రూ.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పగతోనే నోటీసులు పంపాడన్న నయన్కాగా తమ అనుమతి లేకుండా నానుమ్ రౌడీ దాన్ (నేనూ రౌడీనే) సినిమాలోని మూడు సెకన్ల క్లిప్స్‌ను తన డాక్యుమెంటరీ బియాండ్ ద ఫెయిరీ టేల్‌కు వాడుకున్నారంటూ ధనుష్ (Dhanush).. నయనతారకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే! తమపై కక్షగట్టే ధనుష్ నోటీసులు పంపించాడన్న నయనతార మరి ఇప్పుడెలా స్పందిస్తుందో చూడాలి!వివాదం ఎలా మొదలైందంటే?నయనతార జీవితంపై నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairytale) అనే డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఇందుకుగానూ కొన్ని సినిమా క్లిప్స్ వాడుకున్నారు. అందులో భాగంగా నేనూ రౌడీనే చిత్రంలోని మూడు సెకన్ల సన్నివేశం ఉపయోగించుకున్నారు. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకుడు కాగా ధనుష్ నిర్మాత. ఈ సినిమా చేస్తున్న సమయంలో విఘ్నేశ్- నయన్ లవ్‌లో పడ్డారు. చాలాకాలంపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2022లో పెళ్లి చేసుకున్నారు.(చదవండి: నేనూ మనిషినే.. ఏడ్చేసిన మాధవీలత)ధనుష్‌పై నయనతార ఆగ్రహంఈ విశేషాలను తన డాక్యుమెంటరీలో పొందుపరిచారు. అయితే నేనూ రౌడీనే సినిమా క్లిప్స్ తన అనుమతి లేకుండా వాడేయడంతో ధనుష్ రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశాడు. దీనిపై నయన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. తండ్రి, అన్నయ్య అండతో నువ్వు నటుడిగా ఎదిగావు. నేనూ ఏ బ్యాక్‌గ్రౌండ్‌లో లేకుండా ఈ సినీప్రపంచంలో పోరాడి ఈ స్థాయిలో ఉన్నాను. నా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు. దీని రిలీజ్ కోసం నాతోపాటు నా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నా మనసు ముక్కలైందినీకు మాపై పగ ఉండొచ్చు. కానీ దానివల్ల ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డవారి జీవితాలపైనే అది ప్రభావం చూపిస్తుంది. నా ఇతర సినిమా క్లిప్స్ వాడాం.. కానీ ఎంతో ప్రత్యేకమైన నేనూ రౌడీనే చిత్ర సన్నివేశాలు మాత్రం ఉపయోగించలేకపోయాం. ఈ సినిమా పాటలు మా డాక్యుమెంటరీకి బాగా సెట్టవుతాయి. కానీ ఎన్నిసార్లు అభ్యర్థించినా నువ్వు వాటిని వాడుకోవడానికి వీల్లేదనడం నా మనసును ముక్కలు చేసింది. బిజినెస్ లెక్కల పరంగా కాపీ రైట్ సమస్యలు వస్తాయని నువ్వు ఇలా చేసుంటావ్ అనుకోవచ్చు.ఇంత దిగజారుతావనుకోలేదుకానీ చాలాకాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్లే మేం బాధపడాల్సి వస్తోంది. నేనూ రౌడీనే షూటింగ్ టైంలో మేం మా ఫోన్లో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న వాళ్లందరి జీవితాల్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.చదవండి: నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు -
ఆ పాట టైంలో విమర్శలు.. డైమండ్ గిఫ్టిచ్చిన జ్యోతిక
చంద్రముఖి సినిమాలో వారాయ్.. సాంగ్ ఎంతో ఫేమస్. ఇందులో జ్యోతిక డ్యాన్స్, ఎక్స్ప్రెషన్ను మాటల్లో వర్ణించలేం. ఈ ఒక్క పాట సినిమాను మరో మెట్టు ఎక్కించింది. తాజాగా ఈ సాంగ్ గురించి కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. రారా(వారాయ్.. నానుడి తేడి) పాట షూటింగ్ సమయంలో నన్ను ఎంతగానో విమర్శించారు. నిజానికి జ్యోతికకు క్లాసికల్ డ్యాన్స్ రాదు. దీనివల్ల ఆమెకు డ్యాన్స్ నేర్పించడానికి కొంత సమయం పట్టింది. రెండు రోజుల్లో పూర్తితర్వాత రెండు రోజుల్లో సాంగ్ పూర్తి చేశాం. రిజల్ట్ మాత్రం అద్భుతంగా వచ్చింది. ఆ పాట ఎడిటింగ్ అయిపోయే సమయానికి జ్యోతిక స్టూడియోలోనే ఓ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చింది. నాట్యమే తెలియనివారు నా శిక్షణ వల్ల అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? చంద్రముఖి మలయాళ వర్షన్ చూడకుండానే ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాను. ప్రత్యేకంగా ఈ పాటను మాత్రమే ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు.కొరియోగ్రాఫర్ ఎలా అయ్యానంటే?కమల్ హాసన్ 'పున్నగి మన్నన్' మూవీకి రఘు మాస్టర్ కొరియోగ్రాఫర్. కానీ అప్పుడు ఆయనకు ఓ తెలుగు సినిమా చేయాల్సి ఉండటంతో పున్నగి చిత్రాన్ని నాకు అప్పగించాడు. అప్పటికి నేనింకా డ్యాన్స్ స్కూల్లో స్టూడెంట్ను మాత్రమే కావడంతో కమల్ హాసన్ సహా అందరూ భయపడ్డారు. తీరా నా డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు అని కళా మాస్టర్ చెప్పుకొచ్చింది. చదవండి: లైలాగా టాలీవుడ్ హీరో.. హీరోయిన్లే కుళ్లుకునేలా.. -
అకటా... నడిబజార్లో లక లక లక
‘కంటెంట్ క్రియేటర్లు తలుచుకుంటే వైరల్‌కు కొదవా!’ అన్నట్లుగా ఉంది పరిస్థితి. వీడియో వైరల్ చేయడానికి వారు చిత్రవిచిత్రములు చేయగలరని మరోసారి నిరూపించిన వైరల్ వీడియో ఇది.ప్రీతీ థాపాఅనే క్రియేటర్ చంద్రముఖి గెటప్‌లో డ్యాన్స్ చేసింది. ఇందులో వింతేముంది అనిపించవచ్చు. అయితే ప్రీతి డ్యాన్స్ చేసింది స్టేజీ మీద కాదు. ఇంట్లో కాదు. ఏకంగా అస్సాంలోని గువాహటి చౌరస్తాలో.ఈ వీడియోకు వచ్చిన విశేష ఆదరణ చూసి సంతోషంతో.... ‘గయ్స్, మీకు కృతజ్ఞతలు తెలియజేయడానికి నాకు మాటలు రావడం లేదు’ అని స్పందించింది ప్రీతి.‘మీకు సంతోషంతో మాటలు రాక΄ోవడం సరే, మాకు మాత్రం షాక్‌తో నోట మాట రాలేదు. రోడ్డుపై డ్యాన్స్ ఏమిటీ!’ అని వెక్కిరించారు కొందరు నెటిజనులు.‘మీ డ్యాన్స్ స్కిల్స్ సంగతి ఎలా ఉన్నా ముందు ట్రాఫిక్ రూల్స్‌ను ΄ాటించడం నేర్చుకోండి’ అని కొందరు సలహా ఇచ్చారు. -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
సినిమాల్లో గుర్తింపు రావడం సులభమే. కానీ దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం. హిట్ సినిమాలో నటించినా సరే క్రేజ్ అనేది కొనసాగాలంటే మరికొన్ని సక్సెస్ఫుల్ చిత్రాలు కూడా దక్కాల్సి ఉంటుంది. ఈ బ్యూటీది దాదాపు ఇలాంటి సమస్యే. అప్పట్లో తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో సెన్సేషన్ సృష్టించిన మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. మరి ఇంతలా చెప్పాం కదా. ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: లోక్‌సభ ఎన్నికల బరిలో టాలీవుడ్ హీరోయిన్.. ఆ స్థానంలో పోటీ?) పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ప్రహర్షిత. ఇలా చెబితే గుర్తురాకపోవచ్చు. 'చంద్రముఖి' సినిమాలో 'అత్తిందోమ్' పాటలో ఓ పాప కనిపిస్తుంది కదా! ఆమెనే ఈమె. అవును మీరు విన్నది నిజమే. అప్పట్లో బొద్దుగా ఉండే ఈ చిన్నారి.. ఈ మూవీ తర్వాత తమిళంలోనే వేలన్, రాజరాజేశ్వరి, సెల్వి చిత్రాల్లోనూ బాలనటిగా చేసింది. కాకపోతే 'చంద్రముఖి'కి వచ్చినంత గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది. 2021లో ప్రహర్షిత పెళ్లి చేసుకుంది. 2022లో ఓ పాప కూడా పుట్టింది. 18 ఏళ్లపాటు బుల్లితెరకు దూరమైన ఈమె.. ప్రస్తుతం ఓ తమిళ సీరియల్లో నటిస్తోంది. తాజాగా ఈమె ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమె ఎవరబ్బా అని అందరూ అనుకున్నారు. కాసేపటి తర్వాత 'చంద్రముఖి' చైల్డ్ ఆర్టిస్టా అని గుర్తుపట్టి షాకయ్యారు. (ఇదీ చదవండి: 'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ)) View this post on Instagram A post shared by Praharshetha (@official_bommi) -
వినిపిస్తోందా.. మూడో స్వరం
ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభలో మూడో స్వరం వినిపించేందుకు ట్రాన్స్జెండర్లు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వరంగల్ తూర్పు సెగ్మెంట్ నుంచి బీఎస్పీ అభ్యర్థి గా పోటీ చేసేందుకు రామన్నపేటకు చెందిన చిత్రపు పుష్పిత లయకు తాజాగా అవకాశం లభించగా, గత ఎన్నికల్లో గోషామహల్ నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థి గా పోటీ చేసిన చంద్రముఖి కూడా ఈసారి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక ట్రాన్స్జెండర్లతో పాటు ప్రజల్లో ఓటు అవగాహనకు రాష్ట్ర ఎన్నికల ప్రచార కర్తగా వరంగల్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ లైలాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించింది. ఆమె తమ కమ్యూనిటీ వారు ఓటు నమోదు చేసుకునేందుకు అవగాహన కలిగిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, వరంగల్/హైదరాబాద్ రాష్ట్రంలో సుమారు 50 వేల మందికి పైగా ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు స్వచ్చంద సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ ఓటర్లుగా నమోదైన వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ట్రాన్స్జెండర్ల పట్ల సమాజం నుంచి ఎదురయ్యే వివక్ష, అవమానాలు, వేధింపుల కారణంగానే చాలామంది ‘మగవారు’గానే మనుగడ కొనసాగిస్తున్నట్టు ఆయా సంస్థలు చెబుతున్నాయి. అన్ని జీవన సమూహాల్లాగే ట్రాన్స్జెండర్లు కూడా స్వేచ్ఛా యుతమైన జీవనాన్ని కొనసాగించే హక్కును కలిగి ఉన్నట్లు గతంలో వెలువరించిన సుప్రీంకోర్టు తీర్పు వారికి గొప్ప ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. మరోవైపు వివిధ స్వచ్చంద సంస్థలు, ప్రజాసంఘాలు, హక్కులసంఘాల నుంచి వారికి సంపూర్ణమైన మద్దతు, అండదండలు లభించాయి. దీంతో ట్రాన్స్ జెండర్లు సంఘటితమయ్యారు. తమ ఉనికిని బలంగా చాటుకొనేందుకు ఎన్నికలను ఒక అస్త్రంగా మలుచుకున్నారు. తీవ్రమైన వివక్ష, అణచివేతకు గురవుతున్న ట్రాన్స్జెండర్ల అస్తిత్వాన్ని చాటుకొనేందుకు, ఆకాంక్షలనువెల్లడించేందుకు చట్టసభలను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నట్లు చిత్రపు పుషి్పత లయ, చంద్రముఖి చెబుతున్నారు. బీఎస్పీ కార్యకర్త నుంచి అభ్యర్థిగా చిత్రపు పుష్పిత లయ ప్రస్థానం వరంగల్ రామన్నపేటకు చెందిన చిత్రపు పుష్పిత లయ బీఎస్పీ పార్టీ కార్యకర్తగా ఢిల్లీలో ఐదేళ్లు పనిచేశారు. ఆ తర్వాత డాక్టర్ అంబేడ్కర్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. రెండేళ్ల నుంచి వరంగల్ తూర్పు బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ట్రాన్స్జెండర్ల తరఫున తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థి గా చంద్రముఖి ట్రాన్స్జెండర్ల అస్తిత్వాన్ని చాటుకొనేందుకు మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు మువ్వల చంద్రముఖి వెల్లడించారు. భరతనాట్య కళాకారిణి. వ్యాఖ్యాత, సినీనటి అయిన చంద్రముఖి దశాబ్దకాలంగా ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రజాస్వామ్య సౌధంలో మూడోస్వరాన్ని వినిపించేందుకే 2018లో ట్రాన్స్జెండర్ల ప్రతినిధిగా, బీఎల్ఎఫ్ అభ్యర్థి గా గోషామహల్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 1125 ఓట్లు లభించాయి. ఈ సారి మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలనుకుంటున్నట్లు చెప్పారు. ఏ నియోజకవర్గం నుంచి అనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఎన్నికల ప్రచారకర్తగా లైలా.. మహబూబాబాద్ జిల్లాలోని అన్నారం గ్రామానికి చెందిన లైలా అలియాస్ ఓరుగంటి లక్ష్మణ్ డిగ్రీ చదువుకునే రోజుల్లో హిజ్రావైపు మళ్లారు. పూర్తిస్థాయి ట్రాన్స్‌జెండర్‌గా మారి డబుల్ పీజీ కూడా చేశారు. 20 ఏళ్ల నుంచి మ్యారీ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవీ ప్రాజెక్ట్‌లో హెల్త్ వర్కర్‌గా పనిచేస్తూ వరంగల్‌లో ఉంటున్నారు. రాష్ట్ర హిజ్రాల వెల్ఫేర్ సంఘం సభ్యురాలుగా కూడా ఎన్నికయ్యారు. వారి కమ్యూనిటీ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ఈమె సేవలను గుర్తించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ ఏడాది సెపె్టంబర్ 19వ తేదీన ఎన్నికల ప్రచారకర్త (అంబాసిడర్)గా నియమించడం విశేషం. -
Chandramukhi 2 Twitter Review: ‘చంద్రముఖి 2’ మూవీ రివ్యూ
సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార కలిసి నటించిన చిత్రం ‘చంద్రముఖి’. 2005లో విడుదలై న ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.దాదాపు 17 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా చంద్రముఖి 2ని తెరకెక్కించాడు దర్శకుడు పి.వాసు.ఇందులో హీరోగా రాఘవ లారెన్స్, నటించగా జ్యోతిక క్యారెక్టర్లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రానౌత్ నటించింది. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘చంద్రముఖి 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు ఎక్స్(ట్విటర్)వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. చంద్రముఖి 2 మూవీ ఎలా ఉంది? రాఘవ లారెన్స్, కంగన రనౌత్ ఏ మేరకు భయపెట్టారు? తదితర విషయాలు ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. Just hours remain until you can unravel Chandramukhi 2's mysteries and enjoy the hilarious comedy with Murugesan & co! 🚪🐾🤣 Have you got your tickets yet? 🎟️🍿#Chandramukhi2 🗝️ in cinemas near you from tomorrow. 📽️#PVasu @offl_Lawrence @KanganaTeam @mmkeeravaani… pic.twitter.com/TuRmoMxB5J — Lyca Productions (@LycaProductions) September 27, 2023 Today #Chandramukhi2 🎶 🎶 2nd Show Chusi intiki vellalante tadisipovali 👹 https://t.co/pEUKmsaNWN — koti (@koti7711) September 28, 2023 Finally #Chandramukhi first look is here straight from cinemas by fan. "Her screen presence as Chandra Mukhi is just 🔥Biggest Plus to the movie. 2nd half starts with a Bang🔥" ""@mmkeeravaani sir BGM🙏 Next level" #Chandramukhi2 #KanganaRanaut @KanganaTeam pic.twitter.com/R7IU2spYRV — Akansha Gill (@AakanshaGill) September 28, 2023 #chandramukhi2 review !!!! It is a world of p vasu and keeravani. . #Raghav , mahima , kids and Radhika did justice to the plot , Vadivelu brings his magic back !!!! #KanganaRanaut arrives in second half with her magnetic screen presence!!! She is completely ruling !! ⭐️⭐️⭐️⭐️ pic.twitter.com/9rsokRXZSI — vaibhav (@BhaktWine) September 28, 2023 #Chandramukhi2 First Half is Entertaining 🔥 #Vadivelu is back 😄 Queen #KanganaRanaut is yet to arrive! Blockbuster on its cards!!#RaghavaLawrence#PVasu#Chandramukhi2Review pic.twitter.com/tO5qgKztcj — FilmoPhile (@Filmophile_Man) September 28, 2023 It’s an interval and till here #Chandramukhi2 is a perfect family film with the brilliant acting of #RaghavaLawrence The first half has a strong hold The pre 𝗜𝗻𝘁𝗲𝗿𝘃𝗮𝗹 𝗦𝗲𝗾𝘂𝗲𝗻𝗰𝗲𝘀 are🔥🔥 🔥 🔥 Unexpected twist, Great surprise & treat awaiting for Kangana's fans pic.twitter.com/ilfY0vFY0K — Mr.Achiever (@MrAchiever0925) September 28, 2023 #Chandramukhi2 First Half is Entertaining 🔥 #Vadivelu is back Queen #KanganaRanaut is yet to arrive! Blockbuster on its cards!! #RaghavaLawrence #PVasu #Chandramukhi2Review @offl_Lawrence pic.twitter.com/mO4QcHVV0G — GK Videos (@GKVideos09) September 28, 2023 -
చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందంటే?
రజనీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చిత్రాల్లో చంద్రముఖి ఒకటి. ఈ సినిమా ఇప్పుడు వచ్చినా సరే చాలామంది టీవీలకే అతుక్కుపోతారు. అంతలా ప్రేక్షకాదరణ పొందిందీ మూవీ. రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు, నాజర్, వడివేలు ప్రధాన పాత్రలు పోషించారు. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2005లో విడుదలైంది. త్వరలోనే దీని సీక్వెల్ కూడా రిలీజ్ కానుంది. ఈ మూవీలో అత్తింధోం.. పాట చాలా ఫేమస్. ఈ పాటలో కనిపించే చిన్నారి గుర్తుందా? ముద్దుగా బొద్దుగా కనిపించే ఆమె పేరు ప్రహర్షిత శ్రీనివాసన్. బాలనటిగా ఎన్నో సినిమాలు, సీరియల్స్ చేసిన ఆమె తర్వాత ఎక్కువగా వెండితెరపై కనిపించనేలేదు. చంద్రముఖి 2 రిలీజ్‌కు రెడీ అవుతున్న సందర్భంగా ఈ చిన్నారి ఎలా ఉందోనని కొందరు నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. 2021లో ప్రహర్షిత పెళ్లి చేసుకోగా గతేడాది ఆమెకు కూతురు పుట్టింది. 18 ఏళ్లపాటు బుల్లితెరకు దూరంగా ఉన్న ఈమె తమిళంలో ఓ కొత్త సీరియల్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియాలో ఫోటోషూట్లు, కూతురితో ఆడుకున్న వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటోంది. తాజాగా ఆమె చంద్రముఖి సినిమాలో చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడెలా మారిపోయానో తెలియజేస్తూ వీడియో షేర్ చేసింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ వేరే లెవల్ అని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. View this post on Instagram A post shared by Praharshetha (@official_bommi) చదవండి: హైపర్ ఆది ఓవరాక్షన్.. ఇలాగైతే చిరంజీవికి కష్టమే -
జైలర్‌కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్‌కు అసూయ ఎందుకు?
చిత్ర పరిశ్రమంలో సెంటిమెంట్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఒక చిత్రం హిట్ అయితే ఆ తరహాలోనే చిత్రాలను నిర్మించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇకపోతే ప్రస్తుతం జైలర్ చిత్రంలో తమన్నా నటించిన కావాలా పాట ట్రెండింగ్‌గా మారింది. రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, తెలుగు నటుడు సునీల్, యోగిబాబు, రమ్యకృష్ణ, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తదితరులు ముఖ్యపాత్ర పోషించారు. (ఇదీ చదవండి: తరుణ్ ఎవరింటి అల్లుడు?) అయితే వీటన్నింటినీ తమన్నా నటించిన కావాలా పాట పక్కకు నెట్టేసింది. ఇంతకుముందు ఇదేవిధంగా అల్లు అర్జున్ పుష్పాలో సమంత నటించిన ఐటెం సాంగ్ ఊ అంటావా మామ ట్రెండ్ సెట్టర్‌గా మారింది. పలువురు స్టార్ హీరోయిన్ల నుంచి విదేశీ భామల వరకు ఈ పాటకు డాన్స్ చేసి ముచ్చట తీర్చుకున్నారు. ఇప్పుడు తమన్నా నటించిన కావాలా పాట కూడా కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. 52 ఏళ్ల రమ్యకృష్ణ కూడా ముచ్చటపడి ఈ పాటకు డాన్స్ చేయడం విశేషం. ఇకపోతే ఈ చిత్ర కథానాయకుడు రజనీకాంత్ కూడా కావాలా పాటపై తన అసూయను వ్యక్తం చేశారు. ఆరు రోజులు చిత్రీకరించిన ఈ పాటలో తనకు ఒక పూట కూడా నటించే అవకాశాన్ని కల్పించలేదనే నిష్టూరాన్ని ఇటీవల జరిగిన ఆడియో వేడుకలో వెలిబుచ్చారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో కావాలా అంటూ తెలుగు పదాలతో ఈ పాట మొదలవుతుంది. (ఇదీ చదవండి: తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా దిల్‌రాజు) ఇంతకుముందు కూడా రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి చిత్రంలో దేవుడ దేవుడా అనే పాట తెలుగు పదాలతో మొదలవుతుంది. ఆ పాట సూపర్ హిట్ కావడంతో పాటు చిత్రం కూడా ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ జైలర్ చిత్రానికి కూడా వర్క్ అవుట్ అవుతుందా..? లేదా..? అనే విషయం త్వరలో తేలిపోనుంది. -
వైరల్ వీడియో.. మెట్రోలోని ప్రయాణికులను హడలెత్తించిన చంద్రముఖి
మెట్రోలోని ప్రయాణికులను ఓ యువతి హడలెత్తించింది. చంద్రముఖి గెటప్ దర్శనమిచ్చి మెట్రో ప్రయాణిస్తున్న వారిని బెంబెలేత్తించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ యువతి చంద్రముఖి సీక్వెల్ అయిన బాలీవుడ్ హర్రర్, కామెడీ చిత్రం ‘భూల్ భూలయ్య’ సినిమాలోని ముంజులిక పాత్రలోని దుస్తులు ధరించి ఉంది. క్లాసికల్ డ్యాన్స్ దుస్తులతో.. జుట్టుని ముఖంపై వేసుకొని అచ్చం చంద్రముఖిలా బిత్తర చూపులు చూస్తూ మెట్రోలో కూర్చున్న వారిని భయపెట్టడానికి ప్రయత్నించింది. మెట్రో కంపార్ట్మెంట్లో ఒక్కొక్క ప్రయాణికుడి వద్దకు నడుచుకుంటూ వెళ్తూ వారిని పట్టుకొని భయపెట్టింది. అయితే యువతిని చూసిన పలువురు ప్రయాణికులు షాకవ్వగా ఓ వ్యక్తి భయంతో ముందుకు పరుగు తీయడం వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో యువతి ప్రవర్తనపై మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది దీన్ని ఫన్నీగా తీసుకొని నవ్వుతుంటే మరికొందరు బహరంగ ప్రదేశాల్లో ఈ పిచ్చి చేష్టలు ఏంటని మండిపడుతున్నారు. ‘ఇదే యాక్టింగ్ స్టేజ్ మీద చేసుంటే తప్పకుండా ఆమె మంచి నటిగా గుర్తింపు సాధించేది. డ్రామను థియేటర్లలో అభినందిస్తారు కానీ నిజ జీవితంలో కాదు. 50 రుపాయల ఓవర్ యాక్టింగ్. నాకు ఆశ్చర్యం వేస్తుంది.. ఆమె సెక్యూరిటీని దాటుకొని మెట్రోలో ఎలా ప్రయాణం చేయగలిగింది. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియరాలేదు. కాగా అక్షయ్ కుమార్, విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన భూల్ భూలయ్యా సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. 2007లో విడుదలైన ఈ సినిమాలో మంజులిక క్యారెక్టర్(చంద్రముఖి) అందరికీ గుర్తుండిపోయింది. ఈ పాత్రలో విద్యా బాలన్ అద్భుతంగా నటించింది. తరువాత 2022లో ఈ సినిమా సీక్వెల్ భూల్ భులయ్యా-2 వచ్చింది. ఇందులో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు నటించగా.. ఈ మూవీ కూడా బాలీవుడ్లో రికార్డ్ విజయాన్ని సాధించింది. View this post on Instagram A post shared by The RealShit Gyan (@the.realshit.gyan) -
చంద్రముఖిగా మారిన కంగనా రనౌత్.. షూటింగ్ ప్రారంభం
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తున్న తాజాచిత్రం చంద్రముఖి-2. లైకా ప్రొడక్షన్స్ భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాఘవా లారెన్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 2005లో విడుదలైన చంద్రముఖి చిత్రంలో రజనీకాంత్, జ్యోతిక నటించారు. కేవలం రూజ 9కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే రూ. 70 కోట్లుకు పైగా కలెక్షన్లను రాబట్టింది. తాజాగా ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. జ్యోతిక పాత్రలో కంగనా, రజనీకాంత్ పాత్రలో లారెన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్ ప్రారంభం అయినట్లు కంగనా తెలిపింది. ఇన్‌స్టా వేదికగా దీనికి సంబంధించిన ఫోటోను షేర్చేసుకుంది. -
చంద్రముఖిగా మారనున్న కంగనా రనౌత్!
వెండితెరపై లేటెస్ట్ చంద్రముఖిగా కనిపించనున్నారు కంగనా రనౌత్. రజనీకాంత్, జ్యోతిక, ప్రభు, నయనతార ప్రధాన పాత్రల్లో పి. వాసు దర్శకత్వంలో 2005లో వచి్చన ‘చంద్రముఖి’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ను తెరకెక్కిస్తున్నారు పి. వాసు. అయితే లీడ్ రోల్‌ను రాఘవా లారెన్స్ చేస్తున్నారు. కాగా అప్పటి ‘చంద్రముఖి’లో జ్యోతిక చేసిన చంద్రముఖి పాత్రకు సీక్వెల్లో కంగనాను తీసుకున్నారని తెలిసింది. ‘దర్శకులు పి. వాసుగారితో వర్క్ చేయనుండటం హ్యాపీగా ఉంది’ అని పేర్కొన్నారు కంగనా రనౌత్. డిసెంబరు తొలి వారంలో చెన్నైలో జరగనున్న ‘చంద్రముఖి 2’ చిత్రీకరణలో కంగనా పాల్గొంటారని టాక్. -
చంద్రముఖి-2లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్?
తమిళ సినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన చంద్రముఖి చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా దానికి సీక్వెల్ చంద్రముఖి –2 రూపొందుతోంది. లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని చంద్రముఖి చిత్రం దర్శకుడు పి.వాసునే తెరకెక్కిస్తున్నారు. దీనికి మరకతమణి (కీరవాణి) సంగీతాన్ని అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో నటి రాధిక, వడివేలు, రవిమరియ, మనోబాల తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. హారర్ర్, థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మైసూర్లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అక్కడ లారెన్స్, రాధికపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటోంది. కాగా చంద్రముఖి 2 చిత్రంలో సంచలన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముఖ్యపాత్రను పోషించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా ఈమె 2008 ధామ్ ధూమ్ అనే చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్లో అగ్ర కథానాయకగా ఎదిగారు. చాలా గ్యాప్ తరువాత తమిళంలో ఇటీవల విడుదలైన తలైవి చిత్రంలో జయలలితగా నటించి ప్రశంసలు అందుకున్నారు. దీంతో చంద్రముఖి 2 చిత్రంలో ఎలాంటి పాత్రలో నటించనున్నారన్నది ఆసక్తిగా మారింది.. -
చంద్రముఖి-2 కోసం రాఘవ లారెన్స్ డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన చంద్రముఖి చిత్రం అసాధరణ విజయాన్ని సాధించే విషయం తెలిసిందే. కాగా ఆ చిత్ర దర్శకుడు పి.వాసు తాజాగా దానికి సీక్వెల్‌గా చంద్రముఖి–2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నృత్య దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఈయన కండల వీరుడుగా మారడం విశేషం. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా ప్రకటన విడుదల చేశారు. అందులో చంద్రముఖి–2 చిత్రం కోసం తాను పూర్తిగా మేకోవర్ అవ్వాలని భావించానన్నారు. ఆ విధంగా తనను మార్చిన శిక్షకుడు శివ మాస్టర్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక రెండవ విషయాని కొస్తే ఇంతకాలంగా తన లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్‌కు పలువురు విరాళాలు అందిస్తూ వస్తున్నారన్నారు. మీ ఆదరణ, ఆర్థిక సాయంతోనే తాను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నానన్నారు. అవసరమైనప్పుడల్లా సాయం పొందానన్నారు. అయితే ఇకపై ట్రస్టుకు ఎవరు విరాళాలు పంపవద్దని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో తాను ఇప్పుడు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్నానని పలు చిత్రాలలో నటిస్తున్నానని చెప్పారు. దీంతో ఇకపై ప్రజలకు సేవలు అందించే పూర్తి బాధ్యతలు తానే చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన లక్ష్మీ మీనన్
అదృష్టం ఎప్పుడు ఎవరికి ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. హీరోయిన్ లక్ష్మీమీనన్‌కు అలాంటి అదృష్టమే పట్టిందనే టాక్ కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. కుంకీ చిత్రంతో హీరోయిన్గా కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ మలయాళ గుమ్మ ఆ చిత్రం అనూహ్య విజయం సాధించడంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా విశాల్, కార్తీ, విమల్ వంటి నటులతో జత కట్టి విజయాలను అందుకుంది. మంచి ఫామ్‌లో ఉండగా పదో తరగతి పరీక్షలు రాయాలంటూ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అది కాస్తా లాంగ్ గ్యాప్ అయ్యింది. ఆ తరువాత ఒకటి, అర చిత్రాలు చేసినా అవి ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో లక్ష్మీమీనన్ పేరు కోలీవుడ్‌లో దాదాపు మరుగున పడిపోయింది. అలాంటిది ఇప్పుడు సడన్ వార్తల్లో నానుతోంది. చంద్రముఖి–2 చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టిందనే ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా దర్శకుడు పూరి వాసు తెరకెక్కిస్తున్నారు. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నటి రాశీఖన్నాను నాయకిగా ఎంపిక చేసినట్లు మొదట ప్రచారం జరిగింది. ఆ తరువాత త్రిషను నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్ వైరల్ అయ్యింది. తాజాగా ఆ లక్కీఛాన్స్ నటి లక్ష్మీమీనన్‌ను వరించినట్లు సమాచారం. -
వచ్చేస్తోంది 'చంద్రముఖి 2'.. సీక్వెల్‌పై అధికారిక ప్రకటన
Raghava Lawrence Chandramukhi 2 Lyca Productions Official Announcement: సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయన తార కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిత్రం 'చంద్రముఖి'. 2005లో వచ్చిన ఈ మూవీకి పి. వాసు దర్శకత్వం వహించారు. కామెడీ, హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ వస్తే ఎంతో బాగుంటుందని సగటు ప్రేక్షకుడు కోరుకున్నాడు. అందుకు తగినట్లుగానే ఈ ఆల్‌టైమ్ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ వస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే హీరో, హీరోయిన్లు ఎవరు అనే అంశంపై స్పష్టత రాలేదు. కానీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. 'చంద్రముఖి' సినిమా విడుదలై సుమారు 17 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రానున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ 'లైకా ప్రొడక్షన్స్' అధికారికంగా తెలిపింది. అయితే ఈ సినిమాలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 'కాంచన' మూవీ సిరీస్‌లతో హారర్, కామెడీ అందించడంలో దిట్టగా లారెన్స్ నిరూపించుకున్నాడు. అందుకే ఇప్పుడు ఈ 'చంద్రముఖి 2'లో మేయిన్ రోల్లో లారెన్స్ నటించనున్నాడు. మొదటి సినిమాను డైరెక్ట్ చేసిన పి. వాసు ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. చంద్రముఖిలో తనదైన కామెడీని పండించిన వడివేలు ఈ సీక్వెల్లో అలరించనున్నాడు. అలాగే ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించునున్నారు. ఆర్డీ రాజశేఖర్ కెమెరామేన్‌గా బాధ్యలు చెపట్టగా, తోట తరణి ఆర్ట్ వర్క్‌ను చూసుకోనున్నారు. Elated to announce 🤩 our next Big project #Chandramukhi2 🗝️✨ Starring @offl_Lawrence & Vaigaipuyal #Vadivelu 😎 Directed by #PVasu 🎬 Music by @mmkeeravaani 🎶 Cinematography by @RDRajasekar 🎥 Art by #ThottaTharani 🎨 PRO @proyuvraaj 🤝🏻 pic.twitter.com/NU76VxLrjH — Lyca Productions (@LycaProductions) June 14, 2022 అయితే 'చంద్రముఖి' సినిమాను శివాజీ ప్రొడక్షన్స్ నిర్మించగా 'చంద్రముఖి 2'ను నిర్మించే బాధ్యతను మాత్రం 'లైకా ప్రొడక్షన్స్' తీసుకుంది. అయితే ఈ మార్పుకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండగా, ఇది బహుభాషా చిత్రంగా ఉంటుందా ? లేదా తమిళంలో మాత్రమే విడుదల చేస్తారా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఎదురుచూడాల్సిందే. ఇదిలా ఉంటే చంద్రముఖి తర్వాత వెంకటేశ్, పి. వాసు కాంబినేషన్లో 'నాగవల్లి' సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అప్పట్లో చంద్రముఖి సినిమాకు ఇదే సీక్వెల్‌గా ప్రచారం జరిగింది. కాకపోతే ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో ఇప్పుడు పక్కా స్క్రిప్ట్‌తో చంద్రముఖి 2ను రూపొందించనున్నారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. Positive Vibes ✨ & Happy Faces 😇 all around #Chandramukhi2 🗝️✨ Starring @offl_Lawrence & Vaigaipuyal #Vadivelu 😎 Directed by #PVasu 🎬 Music by @mmkeeravaani 🎶 Cinematography by @RDRajasekar 🎥 Art by #ThottaTharani 🎨 PRO @proyuvraaj 🤝🏻 pic.twitter.com/pf57zgJ7xC — Lyca Productions (@LycaProductions) June 14, 2022 -
ప్రియాంక సింగ్‌కు సపోర్ట్ చేయం: హిజ్రా ఫౌండర్
కామెడీ షోలో లేడీ గెటప్స్ వేసిన సాయి తేజ ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిపోయాడు. ప్రియాంక సింగ్‌గా పేరు మార్చుకున్న అతడు తనకు వచ్చిన ఆఫర్‌ను అందిపుచ్చుకుని బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో పాల్గొన్నాడు. అయితే ప్రియాంక సింగ్ ఎవరో తనకు తెలీదని, ఆమెకు సపోర్ట్ చేయమని తెలంగాణ రాష్ట్ర సమితి హిజ్రా ఫౌండర్ చంద్రముఖి షాకింగ్ కామెంట్స్ చేశారు. "ట్రాన్స్‌జెండర్‌గా మారడం అంటే అంత ఈజీ కాదు. నాలో అమ్మాయి లక్షణాలు ఉన్నాయని సైక్రియాట్రిస్ట్‌కు చెప్తే అతడు ఓ రెండేళ్లపాటు ఆడపిల్లలా బట్టలు వేసుకోమంటాడు. రెండేళ్లు కౌన్సిలింగ్ ఇస్తాడు. దీని తర్వాత కూడా అమ్మాయిగానే ఉండాలనిపిస్తే అప్పుడు సర్జరీ చేయించుకోమంటారు. అంతేకానీ 24 గంటలు చీర కట్టుకొని బాడీలో ఫెమినిటీని పెంచుకోవడం వేరు, పుట్టినప్పుడే ఫెమినిటీతో పుట్టడం వేరు. కొందరు ఆడపిల్ల గెటప్స్ వేస్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని పూర్తిగా ఆడపిల్లగా మారి ఇంకా ఎక్కువ సంపాదిద్దాం అనుకుంటారు. అక్కా నాకు ఆడపిల్లలా అవ్వాలని ఉందని ఎందరో నా సోషల్ మీడియా అకౌంట్లలో కామెంట్లు పెడుతూ ఉంటారు.సెక్స్ వర్క్ చేసో, అడుక్కునో బతకడం కన్నా ఉద్యోగం చేసి బతకమని కౌన్సెలింగ్ ఇస్తుంటాను. అలాగయితేనే జీవితంలో గౌరవంగా బతుకుతారని చెప్తాను. బిగ్‌బాస్ షోలోకి ట్రాన్స్జెండర్లను తీసుకొస్తున్నారు. గతంలో తమన్నా, ఈసారి ప్రియాంకను తెచ్చారు. అయితే ఆమె గురించి నాకు పెద్దగా తెలీదు. కేవలం టీవీలో చూడటం వరకే తెలుసు, అది కూడా సాయిగానే తెలుసు. తను ట్రాన్స్‌జెండర్ అయ్యారని నాకు తెలియదు. మా కమ్యూనిటీలో ఉండి ఉంటే మా సపోర్ట్ ఉండేది. లేదు కాబట్టి ఎటువంటి సపోర్ట్ ఉండదు. గతంలో తమన్నా బిగ్‌బాస్‌కు వెళ్లినప్పుడు సపోర్ట్ చేశా. ఎందుకంటే ఆమె మా కమ్యూనిటీలో ఉంది కాబట్టి! ఇప్పటికీ తమన్నా, నేను మంచి స్నేహితులం" అని చెప్పుకొచ్చారు చంద్రముఖి. -
చంద్రముఖి టు విక్రమార్కుడు.. ‘సీక్వెల్’పై కన్నేసిన దర్శకనిర్మాతలు
బాక్సాఫీస్ పై కాసుల వర్షాన్ని కురిపించిన సినిమాలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పుకోనక్కర్లేదు. అందుకే ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రస్తుతం సీక్వెల్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చంద్రముఖి సీక్వెల్ కు స్టార్ కాస్ట్ ఫైనల్ అవుతోంది. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 25 ఏళ్ల క్రితం దక్షిణాదిన సంచలన విజయం సాధించింది ప్రేమదేశం. ఇప్పుడు ఈ క్లాసిక్ లవ్ స్టోరీకి సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం మొదటి భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు కదీర్ రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుపుతున్నాడు. అంతా నూతన నటీనటులతో సీక్వెల్ ను తెరకెక్కించాలనుకుంటున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలన్ని ఆల్ మోస్ట్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరినవే. బాహుబలికి మాత్రమే రెండో భాగం తీసాడు జక్కన్న. నిజానికి తన చిత్రాల్లో ఈగకు సీక్వెల్ తీయాలన్నది రాజమౌళి కోరిక. అయితే ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేలా లేదు. మరోవైపు విక్రమార్కుడు సీక్వెల్ స్టోరీని రెడీ చేసేసారు కథారచయిత విజయేంద్రప్రసాద్. విక్రమార్కుడు చిత్రం తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ, హిందీ,బెంగాలీ బాషల్లోకి రీమేక్ అయింది. అన్ని చోట్ల మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికిప్పుడు ఈ మూవీ సీక్వెల్ ను రాజమౌళి డైరెక్టే చేసే అవకాశాలు తక్కువ. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో మూవీతో జక్కన్న బిజీగా ఉన్నాడు. మరి విక్రమార్కుడు సీక్వెల్ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తాడు అనేది ఆశక్తికరంగా మారింది. -
చంద్రముఖి సీక్వెల్లో అనుష్క! ఇక బొమ్మ దద్దరిల్లాల్సిందే
Anushka Shetty: సౌత్‌లో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాపులారిటీ దక్కించుకున్న అనుష్క నిశ్శబ్దం మూవీ తర్వాత మరే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా మరో సూపర్‌హిట్ చిత్రంతో అలరించేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌కు రెడీ అవుతున్నట్లు సమాచారం. డైరెక్టర్ పి. వాసు దర్శకత్వంలో లారెన్స్-అనుష్క కాంబినేషన్లో సినిమా రూపొందనుందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం అనుష్కని సంప్రదించారని, ఆమె కూడా ఈ చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కానుంది. చదవండి : 'త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ'..కానీ సినిమా కోసం కాదు షాకింగ్.. తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన స్టార్ హీరో -
చంద్రముఖి సీక్వెల్‌పై లారెన్స్ స్పందన
చైన్నై: సూపర్ స్టార్ రజినీకాంత్ బంపర్ హిట్ మూవీ ‘చంద్రముఖికి సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన చంద్రముఖి సినిమా అన్ని భాషలలో విజయవంతం సాధించింది. కాగా చంద్రముఖి సీక్వెల్ సినిమా వార్తను నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గతంలోనే చెప్పారు. అంతేకాదు, ‘చంద్రముఖి 2’లో తాను నటిస్తున్నట్టు లారెన్స్ ఇటీవలే ప్రకటించారు. గతంలో చంద్రముఖి సినిమాకి దర్శకత్వం వహించిన పి.వాసునే ఈ సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నట్టు చెప్పారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ నిర్మిస్తోందని తెలిపారు. లారెన్స్ ఈ సినిమా గురించి ప్రకటన చేసినప్పటి నుంచి రకరకాల రూమర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమాలో ప్రధాన కథానాయిక గురించి రూమర్లు వచ్చాయి. హీరోయిన్గా జ్యోతిక అని ఒకసారి, సిమ్రన్ అని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ రూమర్లపై తాజాగా రాఘవ లారెన్స్ స్పందించారు. తన ఫేస్బుక్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చారు. ‘చంద్రముఖి 2’ కథానాయిక గురించి చాలా రూమర్లు వస్తున్నాయి. జ్యోతిక మేడమ్, సిమ్రన్ మేడమ్ లీడ్ రోల్ చేస్తారని అంటున్నారు. కానీ, ఈ వార్తలన్నీ అసత్యాలు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే అధికారికంగా చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు ప్రకటిస్తామని లారెన్స్ తెలిపారు. -
లారెన్స్... లక లక లక
పదిహేనేళ్ల క్రితం రజనీకాంత్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘చంద్రముఖి’ చిత్రం విశేష ప్రేక్షకాదరణను దక్కించుకుని సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ తెరకెక్కనుంది. ‘చంద్రముఖి’ని డైరెక్ట్ చేసిన పి. వాసుయే సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ఈ రెండో భాగంలో నటించనున్నట్లు దర్శక–నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ తెలిపారు. అయితే పార్ట్1లో రజనీ లక లక లక అంటే పార్ట్2లో లారెన్స్ లక లక లక అంటారన్నమాట. ‘‘రజనీకాంత్‌గారి అనుమతితో పి. వాసుగారు దర్శకత్వం వహించనున్న ‘చంద్రముఖి 2’ చిత్రంలో నేను నటించబోతున్నాను. సన్ పిక్చర్స్ కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించనున్నారు’’ అని లారెన్స్ పేర్కొన్నారు. మూడు కోట్లు విరాళం మూడు కోట్ల రూపాయలను కరోనా వైరస్ రిలీఫ్ ఫండ్‌గా ఇస్తున్నట్లు వెల్లడించారు లారెన్స్. ఈ మూడు కోట్ల రూపాయల్లో యాభై లక్షలను పీఎమ్ కేర్స్ ఫండ్‌కు, యాభై లక్షలను తమిళనాడు ముఖ్య మంత్రి సహాయనిధికి, ఎఫ్ఈఎఫ్ఎస్ఐ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా)కు యాభై లక్షలను విరాళంగా ప్రకటించారు లారెన్స్. ఇంకా డ్యాన్సర్స్ యూనియన్‌కు 50లక్షలు, దివ్యాంగులకు పాతిక లక్షలు, తన స్వస్థలమైన రాయపురం దేశియానగర్లోని ప్రజలకు, దినసరి కార్మికులకు 75 లక్షలను విరాళంగా ఇవ్వబోతున్నారు. -
రా రా సరసకు రారా!
‘రారా సరసకు రారా...’ పాట సౌత్ ఇండస్ట్రీల్లో సూపర్ పాపులర్. ‘చంద్రముఖి’లోని ఈ పాటను, పాటలో జ్యోతిక గెటప్‌ను, ఆమె అభినయాన్ని ఎవరూ మర్చిపోలేరు. మలయాళ చిత్రం ‘మణిచిత్ర తాళ్’ ఆధారంగా కన్నడంలో ‘ఆప్తమిత్రన్’, తెలుగు/తమిళంలో ‘చంద్రముఖి’, హిందీలో ‘భూల్ బులేయ్య’, బెంగాలీలో ‘రాజ్మొహోల్’ సినిమాలు రూపొందాయి. హిందీ రీమేక్‌లో ‘రారా సరసకు రారా (‘మేరే డోల్నా సున్’) పాటలో విద్యా బాలన్ నర్తించారు. ఇప్పుడు ‘భూల్ బులేయ్య’ సీక్వెల్ ‘భూల్ బులేయ్య 2’లో ఆ పాట రీమిక్స్‌లో డ్యాన్స్ చేయనున్నారు టబు. దెయ్యం పట్టిన డ్యాన్సర్ గెటప్‌లో ‘రారా సరసకు రారా’ అని పాడనున్నారట. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు ముఖ్య తారలుగా అనీజ్ బజ్మీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 31న విడుదల కానుంది. -
లకలకలక.. చంద్రముఖి మళ్లీ వస్తోంది!
చంద్రముఖి కేవలం తమిళనాట మాత్రమే కాకుండా విడుదలైన ప్రతిభాషలోనూ విజయఢంకా మోగించింది. తమిళనాట 175 రోజులపాటు నిరంతరాయంగా ఆడి సరికొత్త రికార్డును తన పేరిట రాసుకుంది. చెన్నైలోని శాంతి థియేటర్లో 890 రోజులపాటు నిరంతరాయంగా ఆడి అందరి చేత ‘ఔర.. ఔరా’ అనిపించుకుంది. ఇక రజనీకాంత్ చెప్పే ‘లకలకలకలక..’ డైలాగ్ ఇప్పటికీ చాలామంద నోట్లో నానుతూనే ఉంది. ఈ సినిమాలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు, నజీర్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. 2005లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెక్కు చెదరకుండా నిలిచింది. సూపర్ డూపర్ హిట్ సాధించిన ఈ హారర్ మూవీకి సీక్వెల్ వస్తే బాగుండనేది ఎంతోమంది ప్రేక్షకుల కోరిక. ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా చంద్రముఖి 2 రానుందన్న వార్తలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళ దర్శకుడు పి.వాసు మాటలు దీనికి మరింత ఊతమిస్తున్నాయి. చంద్రముఖి సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన పి.వాసు దానికి సీక్వెల్ తీస్తున్నానని ప్రకటించాడు. దీనికి సంబంధించిన స్ర్కిప్ట్ దాదాపుగా సిద్ధమైనట్టేనని పేర్కొన్నాడు. ఈ సినిమాకోసం ప్రముఖ నిర్మాణ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అయితే సీక్వెల్లో రజనీకాంత్ కనిపిస్తారా, లేదా అన్న విషయాన్ని మాత్రం ఆయన దాటవేశారు. త్వరలోనే నటీనటులను వెల్లడించనున్నారు. చంద్రముఖి కథ ఇదీ.. ‘రాజాధిరాజ.. రాజమార్తాండ.. రాజ గంభీర.. రాజ కులతిలక.. వేంకటపతిరాజ.. బహుపరాక్, బహుపరాక్’ ఈ కూతలోనే ఎక్కడలేని రాజసం, ఠీవీ. రాజు కన్నుపడితే ఏదైనా సొంతం కావాల్సిందే. దక్కకపోయిందో.. అది బూడిద కావాల్సిందే. ఈ క్రమంలో రాజు కన్నేసిన చంద్రముఖి తనకు దక్కలేదన్న కోపంతో సజీవ దహనం చేస్తాడు. ఆ తర్వాతి కాలంలో ఆత్మగా మారిన చంద్రముఖి ఎన్ని సమస్యలను సృష్టించింది.. ఆ చంద్రముఖిని ఎలా అంతం చేశారన్నది మిగతా కథ. అటు కామెడీ, ఇటు హారర్ రెండింటిరీ బ్యాలెన్స్ చేస్తూ సాగుతుందీ చిత్రం. -
తార..తళుకుతార...నయనతార
ఎంత తేడా! ‘చంద్రముఖి’లో ‘నా పేరు దర్గా కాదు దుర్గ’ అని అమాయకంగా పలికిన అమ్మాయే...‘అనామిక’లో ఆవేశం మూర్తీభవించిన దుర్గావతారం ఎత్తింది. ఒకప్పుడు ‘తార తళుకు తార’ గ్లామర్ పాత్రల్లో మెరిసిన నయనతార...ఇప్పుడు తనదైన దారిలో పయనిస్తోంది. ‘లేడీ సూపర్‌స్టార్’ ఇమేజ్ దిశగా దూసుకెళ్తుంది. తాజాగా ‘అంజలి సి.బి.ఐ’గా అలరించిన నయన్ గురించి కొన్ని ముచ్చట్లు... మరింత స్పీడ్‌తో ‘ఇక సెలవా మరి’ అంటూ ఒక దశలో స్వల్ప విరామం తీసుకుంది నయన్. ఆ తరువాత సన్నిహితుల సలహాతో మళ్లీ నటించడం మొదలుపెట్టింది. ‘రెండోసారి ఆదరిస్తారా?’ అనే ప్రశ్న ఉదయించకముందే మరోసారి తన సత్తా చాటుకుంటుంది. ‘‘నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని రెట్టించిన ఉత్సాహంతో. బ్రాండ్ ఇమేజ్ ఫిల్మ్, ప్రైవేట్ ఫంక్షన్లకు నయనతార హాజరు కాదనే పేరు ఉంది. తన ‘బ్రాండ్ ఇమేజ్’ను మెల్లమెల్లగా పెంచుకోవడంలో భాగంగానే అలాంటి నిర్ణయం తీసుకుంది అంటారు సినీ విశ్లేషకులు. ఇక్కడ రెండు సినిమాలు చేయగానే బాలీవుడ్ బాట పట్టి అక్కడ ఫ్లాప్ ఎదురుకాగానే ‘ఏది ఏమైనా టాలీవుడే బెటర్’ అనే కథానాయికలను చూస్తుంటాం. అయితే నయన్ మాత్రం మొదటి నుంచి ‘సౌత్’నే నమ్ముకుంది. బాలీవుడ్ ప్రస్తావన వచ్చినప్పుడు... ‘‘ఇక్కడ పనిచేయడమంటే సొంత ఇంట్లో పనిచేస్తున్నంత సౌఖ్యంగా ఉంటుంది’’ అని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెబుతుంటుంది నయన్. ఒక్క హిట్టు చాలు! ఎప్పుడూ టాప్‌లో ఉండటం సాధ్యమేనా? సాధ్యమా అసాధ్యమా అనేది వేరే విషయంగానీ... గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటుంది నయన్.‘‘రెండు మూడు ఫ్లాప్‌లు వచ్చినా...ఒక హిట్ వస్తే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు’’ అంటోంది. ఆరోజుల్లోనే! పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లు ఎంచుకోవాలనే నిర్ణయం నిన్నా మొన్నటిది కాదు...చాలా సంవత్సరాల క్రితమే ఒక ఇంటర్వ్యూలో ‘‘తెర మీద అందంగా కనిపించాలనుకోవడం తప్పేమీ కాదు. అయితే నాలోని నటనకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను’’ అని చెప్పింది నయన్. ‘‘నయనతార క్రేజ్ యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌పై ఎక్కువగా ఉండటం వల్ల ఓపెనింగ్స్ పెద్ద ఎత్తున రావడానికి ఉపయోగపడుతుంది’’ అనేది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మాట. -
చేతబడి చేసి తీసుకెళ్లారు : చంద్రముఖి
బంజారాహిల్స్: గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్ధి, ట్రాన్స్‌జెండర్ ఎం.రాజేష్ అలియాస్ చంద్రముఖి(32) అదృశ్యంపై మిస్టరీ వీడింది. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చంద్ర ముఖి బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షం కావడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. తన కూతురు కనిపించడం లేదని చంద్రముఖి తల్లి హైకోర్టులో హెబియస్‌కార్పస్ పిటీషన్ దాఖలు చేయడంతో బుధవారం పోలీసులకు చెమటలు పట్టాయి. ఏమాత్రం ఆచూకి లేని చంద్రముఖిని గురువారం ఉదయంలోగా హైకోర్టులో ఎలా ప్రవేశపెట్టాలో తెలియక సతమతమయ్యారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా విడిపోయి తెలుగు రాష్ట్రాలను జల్లెడపట్టారు. ఎట్టకేలకు రాత్రి 11 ప్రాంతంలో చంద్రముఖి సికింద్రాబాద్‌లోని లంబా థియేటర్ సమీపంలో ఉన్నట్లు సమాచారం అంద డంతో పోలీసులు ఆమెను స్టేషన్‌కు ర ప్పించడంతో కథ సఖాంతమైంది. గురువారం ఉదయం ఆమెను హైకోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవే శపెట్టారు. అంతకుముందు ఆమె విలేకరులతో మాట్లా డుతూ.. ఆ రోజు ఉదయం 8 గంటలకు రూ.25 వేలు బ్యాంకులో జమ చేసేందుకు వెళుత్తుండగా ఓ ఆటో ఎక్కడం జరిగిందన్నారు. ఆ ఆటో వాల తనను కోఠిలోని ఓ వీధిలోకి తీసుకెళ్లాడని అక్కడ మరో ఆటో ఎక్కి ఎల్బీనగర్లో దిగానన్నా రు. అక్కడ బస్సు ఎక్కి విజయవాడలో, అక్కడి నుం చి తిరుపతి, అక్కడి నుంచి చెన్నై వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఎవరో తనను చేతబడి చేసి ముందుకు నడిపించినట్లుగా ఉందని చెప్పారు. -
చేతబడి చేసి తీసుకెళ్లారు
బంజారాహిల్స్: గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్ధి, ట్రాన్స్‌జెండర్ ఎం.రాజేష్ అలియాస్ చంద్రముఖి(32) అదృశ్యంపై మిస్టరీ వీడింది. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చంద్రముఖి బుధవారం రాత్రి 11.30గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షం కావడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. తన కూతురు కనిపించడం లేదని చంద్రముఖి తల్లి హైకోర్టులో హెబియస్‌కార్పస్ పిటీషన్ దాఖలు చేయడంతో బుధవారం పోలీసులకు చెమటలు పట్టాయి. ఏమాత్రం ఆచూకి లేని చంద్రముఖిని గురువారం ఉదయంలోగా హైకోర్టులో ఎలా ప్రవేశపెట్టాలో తెలియక సతమతమయ్యారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా విడిపోయి తెలుగు రాష్ట్రాలను జల్లెడపట్టారు. ఎట్టకేలకు రాత్రి 11 గంటల ప్రాంతంలో చంద్రముఖి సికింద్రాబాద్‌లోని లంబా థియేటర్ సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఆమె సన్నిహితులను అప్రమత్తం చేసిన పోలీసులు ఆమెను స్టేషన్‌కు రప్పించడంతో కథ సఖాంతమైంది. గురువారం ఉదయం ఆమెను హైకోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అంతకుముందు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఆ రోజు ఉదయం 8 గంటలకు రూ.25వేలు బ్యాంకులో జమ చేసేందుకు వెళుతుండగా సందులో ఓ ఆటో ఎక్కడం జరిగిందన్నారు. ఆ ఆటోవాల తనను కోఠిలోని ఓ వీధిలోకి తీసుకెళ్లాడని అక్కడ మరో ఆటో ఎక్కి ఎల్బీనగర్లో దిగానన్నారు. అక్కడ బస్సు ఎక్కి విజయవాడలో, అక్కడి నుంచి తిరుపతి, అక్కడి నుంచి చెన్నై వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా ఎవరో తనను చేతబడి చేసి ముందుకు నడిపించినట్లుగా ఉందని, మత్తులో ఉండి తాను ఎటు వెళ్తున్నానో, ఏ బస్సు ఎక్కుతున్నానో తెలియలేదన్నారు. కోఠిలో ఇద్దరు వ్యక్తులు తనను బెదిరించారని, మరోసారి చూస్తే వారిని గుర్తుపడతానన్నారు. నామినేషన్ వేసినప్పటి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయన్నారు. తన అజ్ఞాతం వెనుక, తనను చేతబడి చేయడం వెనుక కచ్చితంగా రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. అయితే ఆటోలో ఎక్కడం, బస్సులు ఎక్కడం అన్ని ప్రాంతాలు తిరగడం ఎలా సాధ్యమైందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె చెప్పే విషయాలపై పొంతన లేదని వారు పేర్కొన్నారు. ఏదైతేనేం చంద్రముఖి కనిపించడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. దీని వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
చంద్రముఖి వాంగ్మూలమే ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గం బీఎల్ఎఫ్ అభ్యర్థి ట్రాన్స్జండర్ చంద్రముఖి హైకోర్టుకు ఇచ్చిన వాంగ్మూలాన్నే ఫిర్యాదుగా పరిగణించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలంగాణ పోలీసుల్ని ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు భద్రత కావాలని చంద్రముఖి కోరితే ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు చంద్రముఖిని పోలీసులు గురువారం హైకోర్టు ధర్మాసనం ఎదుట హాజరుపర్చారు. ఎన్నికల్లో నామినేషన్ వేసిన తన కుమార్తె ఈ నెల 27 నుంచి అదృశ్యమైందని, ఆమె ఆచూకీ తెలియజేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరుతూ చంద్రముఖి తల్లి మువ్వల అనిత హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పరిష్కారమైనట్లుగా ప్రకటించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిల ధర్మాసనం గురువారం ప్రకటించింది. ఇద్దరు వ్యక్తులు తనను బెదిరించి దౌర్జన్యంగా ఆటో ఎక్కించి తీసుకువెళ్లారని చంద్రముఖి విచారణ సందర్భంగా చెప్పారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వ్యక్తి అదృశ్యానికి సంబంధించినది మాత్రమేనని, దీనితో బెదిరింపులకు సంబంధం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతోపాటుగా చంద్రముఖిని బెదిరించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ కల్పించుకుని..తనను బెదిరిస్తున్నారని చంద్రముఖి పోలీస్ స్టేషన్‌కు వచ్చి చెబుతున్నారని, తీరా అదే విషయంపై వాంగ్మూలం ఇవ్వడం లేదని చెప్పారు. దానికి ధర్మాసనం స్పందిస్తూ.. హైకోర్టు జ్యుడీయల్ రిజిస్ట్రార్ వద్ద బెదిరింపులు–అదృశ్యం కావడంపై చంద్రముఖి వాంగ్మూలం ఇవ్వాలని, దీని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. -
చంద్రముఖి వచ్చింది
సాక్షి, సిటీబ్యూరో/ బంజారాహిల్స్ : గోషామహల్ నుంచి బరిలోకి దిగిన బీఎల్ఎఫ్ అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్ రాజేశ్ అలియాస్ చంద్ర ముఖి బుధవారం రాత్రి 11:30 నిమిషాలకు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజులుగా సాగుతున్న అదృశ్యం కేసు కొలిక్కి వచ్చింది. చంద్రముఖికి లభిస్తున్న ఆదరణ, ప్రజల మద్ధతు, జాతీయ స్థాయిలో మీడియా నుంచి లభిస్తున్న ప్రచారం ప్రత్యర్థులకు కంటగింపుగా మారిందని, ఈ క్రమంలో ఆమెను పోటీ నుంచి తప్పించేందుకే కిడ్నాప్‌కు పాల్పడి ఉండవచ్చునని బీఎల్‌ఎఫ్‌కు సారథ్యం వహిస్తున్న తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. మరోవైపు గురువారం ఉదయం 10.15 గంటల వరకు చంద్రముఖిని హాజరుపర్చాలంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పోలీసుల ముమ్మర గాలింపు చంద్రముఖి అనుమానాస్పద అదృశ్యంపై బంజారాహిల్స్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు గాలింపును ముమ్మరం చేశారు. చంద్రముఖి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తును చేపట్టారు. మరోవైపు అన్ని పోలీస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అనంతపురం వెళ్లిన దర్యాప్తు బృందం.. అనంతపురానికి చెందిన వెంకట్‌యాదవ్ అనే వ్యక్తి నుంచి చంద్రముఖికి ప్రాణహాని ఉన్నట్లు సహచర ట్రాన్స్జెండర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనంతపురం వెళ్లారు. ఆమెతో సన్నిహితంగా ఉండే హిజ్రాలను సైతంపోలీసులు విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా మంగళవారం ఉదయం 7.05 గంటల ప్రాంతంలో ఆమె ఒంటరిగా మెట్లు దిగి కొద్దిదూరం వరకు తాను ఉన్న వీధిలోకి వెళ్లినట్లు కనిపించింది. తిరిగి 8 గంటల ప్రాంతంలో మరోసారి ఆమె రెడీ అయి ఇంట్లోంచి బయటికి ఒంటరిగానే వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం వల్ల కేసు పురోగతికి కొంత ఆటంకంగా మారినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఆందోళనలో ట్రాన్స్జెండర్లు.. చంద్రముఖి అదృశ్యం నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్లలో అభద్రతాభావం నెలకొంది. బుధవారం ఉదయమే పలువురు ట్రాన్స్జెండర్లు ముషీరాబాద్ గోల్కొండ క్రాస్‌రోడ్స్‌లోని బీఎల్ఎఫ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రముఖి అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గోషామహల్లో ఆమెకు లభిస్తున్న ఆదరణ, జాతీయ స్థాయిలో మీడియా విస్తృత ప్రచారం చూసి ఓర్వలేకనే పోటీ నుంచి తప్పించేందుకు కిడ్నాప్‌నకు పాల్పడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రముఖిని బలవంతంగా పోటీలోకి దిగిందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం, చట్ట సభల్లో తమ గొంతు వినిపించాలనే లక్ష్యంతోనే స్వచ్ఛందంగా పోటీకి దిగిందని సామాజిక కార్యకర్త సజయ తెలిపారు. విచారణ ప్రారంభించిన కోర్టు ఆమె తల్లి హైకోర్టులో దాఖలు చేసిన హేబియస్ కార్పస్ పిటీషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. జస్టిస్ చౌహాన్, జస్టిస్ సత్యనారాయణమూర్తి ఈ కేసును విచారించారు. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు అదృశ్యం కావడమేంటంటూ వారు విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది ఏ మాత్రం మంచిది కాదన్నారు. గురువారం ఉదయం చంద్రముఖిని తమ ఎదుట హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించారు. -
ఠాణాలో ప్రత్యక్షమైన చంద్రముఖి
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్థి ట్రాన్స్జండర్ చంద్రముఖి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో పోలీస్‌స్టేషన్‌లో ఆమె ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 2 రోజుల క్రితం చంద్రముఖి కనిపించకుండా పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ట్రాన్స్‌జండర్లు ఓ వైపు ఆందోళనకు దిగగా, మరోవైపు ఆమె తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. గురువారంలోగా చంద్రముఖిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించడంతో బంజారాహిల్స్ పోలీసులు హుటాహుటిన లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. ఇది జరిగిన 12 గంటల వ్యవధిలోనే చంద్రముఖి పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమైంది. ఆమె నోరు విప్పితేగానీ అసలు ఏం జరిగిందన్న విషయం తెలియదు. -
‘ట్రాన్స్ జెండర్ పోటీ చేయడం సహించలేకే ఇలా..’
సాక్షి, హైదరాబాద్ : బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రముఖి ఆచూకీ ఇంకా లభించలేదని బీఎల్ఎఫ్ ఛైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకొవడం లేదని తెలిపారు. ఇది పోలీసుల చేతకాని తనమేనని మండిపడ్డారు. ఒక ట్రాన్స్ జెండర్ పోటీ చేయడం సహించలేకే ఇలా చేశారన్నారు. గోశామహల్లో పోటీ చేయబోయే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు నేర చరిత్ర ఉందన్నారు. దేశంలో మొదటిసారి ఒక హిజ్రా ఎన్నికల్లో పోటీ చేయబోతోందని, ఆమెను కిడ్నాప్ చేయడం దురదృష్టకరమని టీమాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే చంద్రముఖి ఆచూకీ లభించడం లేదన్నారు. ఈ ఘటనపై ఏ రాజకీయ పార్టీ నుండి కనీసం స్పందన లేదని మండిపడ్డారు. చంద్రముఖి సమస్యపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. చంద్రముఖి విషయంలో టీఆర్ఎస్ బాధ్యత వహించాలన్నారు. కోర్టులో హెబియస్ కార్పస్ రిట్ వేశామని, చాలా ప్రజా సంఘాలు ఈ కేసులో ఇంప్లిడ్ అవుతామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య అభివృద్ధికి చంద్రముఖి ప్రతీక అని కొనియాడారు. ఒక ట్రాన్స్ జెండర్ కిడ్నాప్ జరిగితే ఎవరు స్పందించకపోవడం బాధాకరమని ట్రాన్స్ జెండర్ ప్రతినిధి లైలా అన్నారు. చంద్రముఖి చాలా ప్రోగ్రెసివ్ వ్యక్తి అని కొనియాడారు. దేశ వ్యాప్తంగా ఉద్యమాలకు పిలుపునిస్తామన్నారు. చంద్రముఖి పిరికి వ్యక్తి కాదని, ఖచ్చితంగా కిడ్నాప్ కి గురైందని తెలిపారు. చంద్రముఖి దొరికే వరకు గోశామహల్లో ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారని నిప్పులు చెరిగారు. మంగళవారం ఉదయం నుండి చంద్రముఖి కనపడడం లేదని, పౌర హక్కుల కోసం పోరాడే చంద్రముఖి కిడ్నాప్ కావడం దారుణమని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ కిడ్నాప్‌కు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చంద్రముఖికి వస్తున్న ఆదరణ తట్టుకోలేకే ప్రత్యర్థులు కిడ్నాప్ చేశారన్నారు. చంద్రముఖి బయపడి పారిపోయే వ్యక్తి కాదు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, లేదంటే దేశవ్యాప్త ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. -
ట్రాన్స్జెండర్లను మనుషులుగా గుర్తించాలి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: తెలంగాణలో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక చట్టం లేకపోవడం బాధాకరమని బీఎల్ఎఫ్ గోషామహాల్ ఎమ్మెల్యే అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్స్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రముఖి అన్నారు. నాల్సా తీర్పును అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజెఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌యూజె) సంయుక్త ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రముఖి మాట్లాడుతూ..ట్రాన్స్జెండర్లను కనీసం మనుషులుగా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. తల్లిదండ్రుల ఆదరణకు నోచుకోకుండా భిక్షాటన చేయాల్సి వస్తోందని వాపోయారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ కార్యక్రమాలు, నిర్ణయాల్లో ట్రాన్స్‌జెండర్స్‌కు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నా. రాబోయే రోజుల్లో ట్రాన్స్‌జెండర్స్ అందరం కలిసి ఒక పార్టీ పెడతామని చెప్పారు. మానవ హక్కులే ట్రాన్స్‌జెండర్స్ హక్కులుగా గుర్తించాలన్నారు. ప్రభుత్వంలో ఉన్న కొండా సురేఖ మా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మా ఉనికిని చాటుకోవడం కోసం పోటీ చేస్తున్నామని వివరించారు. గోషామహాల్ నియోజకవర్గంలో హిజ్రాలకు ఎంతో చరిత్ర ఉందని, అందుకే ఇక్కడినుంచి పోటీచేస్తున్నానన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగి ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, హెచ్‌యూజే అధ్యక్షులు బిఎల్‌ఎఫ్‌తో కలిసి పోరాటాలు చేశామని, వారి సంపూర్ణమద్దతు తమకు ఉందన్నారు. ట్రాన్స్జెండర్లు ఓటింగ్‌కు వెళితే ఓటింగ్‌కు హేళన చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని, అందుకే చాలామంది పోలింగ్‌కేంద్రాల వద్దకే వెళ్లడం లేదన్నారు. -
సభాముఖంగానూ గళమెత్తిన చంద్రముఖి..!
ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాడుతున్న చంద్రముఖి.. సభాముఖంగానూ తన గళం వినిపించేందుకు బీఎల్ఎఫ్ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేస్తున్నారు. చంద్రముఖి మువ్వల! ట్రాన్స్‌జెండర్ మాత్రమే కాదు. ప్రావీణ్యం గల భరతనాట్య కళాకారిణి. వ్యాఖ్యాత. సినీనటి. అంతేకాదు, ఒక దశాబ్దకాలంగా ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్త. చంద్రముఖి ఇప్పుడు మరో పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. చక్కటి రూపం, శ్రావ్యమైన గొంతుక ఉన్న చంద్రముఖి ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభలో తమ స్వరాన్ని వినిపించేందుకు, ట్రాన్స్జెండర్ల ప్రతినిధిగా ముందుకొస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఎల్ఎఫ్ (బహుజన లెఫ్ట్ ఫ్రంట్) అభ్యర్ధిగా గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, హక్కుల సంఘాల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగుతున్న మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ బహుశా చంద్రముఖే కావచ్చు. సామాజిక జీవనంలో ట్రాన్స్జెండర్లు కూడా భాగస్వాములేనని, వారిపై కొనసాగుతున్న అన్ని రకాల హింస, వివక్ష తొలగిపోవాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల అమలును ఆకాంక్షిస్తూ, వారి స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం, సమానత్వం కోసం ఒక నినాదమై చంద్రముఖి ముందుకొస్తున్నారు. అస్తిత్వానికి ప్రతీక ‘‘వందల ఏళ్లుగా హింసకు, అణచివేతకు గురవుతూనే ఉన్నాం. మహిళలపై కొనసాగుతున్న అన్ని రకాల అణచివేతలు ట్రాన్స్‌జెండర్లపైన కూడా ఉన్నాయి. సామాజికంగా తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నాం. కుటుంబాల బహిష్కరణకు గురవుతున్నాం. అడుగడుగునా అవహేళన. చూపులతో, సూటిపోటి మాటలతో, రకరకాల హావభావాలతో చేసే వెకిలి చేష్టలు. అన్ని రకాల వేధింపులను భరిస్తున్నాం. దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమాలు, ఆందోళనల ఫలితంగా సుప్రీం కోర్టు ట్రాన్స్జెండర్ల హక్కులను గుర్తించింది. సమాజంలో భాగమేనని చెప్పింది. ఏ వివక్షా లేని స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని అనుభవించే హక్కుకు భరోసాను ఇచ్చింది. కానీ ఆచరణలో ఆ ఆదేశాలు అమలుకు నోచడం లేదు. ప్రభుత్వాలు తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతున్నాయి. లక్ష మందికి పైగా ఉన్న తెలంగాణలో గత నాలుగున్నరేళ్లుగా మా సమస్యలపై గళమెత్తుతూనే ఉన్నాం. ఆందోళన చేస్తూనే ఉన్నాం. ఒక్క ట్రాన్స్జెండర్ల సమస్యలపైనే కాదు. సామాజిక జీవితంలో భాగంగా, బాధ్యత కలిగిన వ్యక్తులుగా అనేక రకాల సమస్యలపైనా మా కమ్యూనిటీ ఎప్పటికప్పుడు పోరాటాలు చేపడుతూనే ఉంది. ఎలాంటి అభివృద్ధికి, సంక్షేమానికి నోచని అణగారిన వర్గాలతో కలిసి పనిచేస్తున్నాం. ఈ క్రమంలో ట్రాన్స్జెండర్ల అస్తిత్వాన్ని చట్టసభల్లో ప్రతిబింబించేందుకు, మా సమస్యలను మరింత బలంగా వినిపించేందుకు ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాం’’ అంటున్నారు చంద్రముఖి. ‘‘వందల ఏళ్లుగా హిజ్రాలు ఈ సామాజిక జీవనంలో భాగంగానే ఉన్నారు. ఒకప్పుడు గౌరవప్రదంగా బతికినప్పటికీ ఇప్పుడు యాచకులుగా ఎంతో దయనీయమైన జీవితాలను గడుపుతున్నారు. ఇప్పటికైనా మా బతుకులు మారొద్దా...’’ అని ప్రశ్నిస్తున్న చంద్రముఖి డిగ్రీ పూర్తి చేశారు. ‘అలయన్స్ ఇండియా పహెచాన్’ అనే సంస్థలో కొంతకాలం పాటు ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేశారు. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. ఒక టీవీ చానల్లో వ్యాఖ్యాతగా ఆకట్టుకున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు భరతనాట్యంలో శిక్షణనిస్తున్నారు. హక్కులకు భరోసా కావాలి ‘‘మేమెందుకు యాచకులుగా బతకాలి. అందరిలాగే ఉద్యోగాలు, వ్యాపారాలు, రకరకాల వృత్తులు చేసుకొనే అవకాశాలు మాకెందుకు లభించకూడదు’’ అంటున్న చంద్రముఖి సమాజంలో తమ జనాభాకు అనుగుణమైన అవకాశాలు లభించాలని, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండాలని కోరుతున్నారు. ట్రాన్స్జెండర్ల గౌరవప్రదమైన జీవితం కోసం 2011లోనే ‘ తెలంగాణ హిజ్రా, ఇంటర్‌సెక్స్ ట్రాన్స్జెండర్సమితి’ని ఏర్పాటు చేశారు. ఒకవైపు తనకు నచ్చిన కెరీర్లో కొనసాగుతూనే మరోవైపు ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం జరుగుతున్న అన్ని పోరాటాల్లో భాగస్వామిగా నిలిచారు. ‘‘ట్రాన్స్జెండర్లుగా స్కూళ్లు, కాలేజీల్లో చదువుకోలేకపోతున్నాం. అనేక రకాల అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది. తమ కొడుకు ట్రాన్స్‌జెండర్ అని తెలియగానే ఆ కుటుంబాలు ఇళ్ల నుంచి బహిష్కరిస్తున్నాయి. అలా వీధిన పడ్డవాళ్లకు ఎక్కడా రవ్వంత ఆదరణ లభించదు. ఇటు కుటుంబం, అటు సమాజం బహిష్కరిస్తే మేము ఎక్కడికి వెళ్లాలి. అలా పుట్టడం మా తప్పా’’ అని అడుగుతున్న చంద్రముఖి ఆవేదన మాత్రమే కాదిది. వేలాది మంది ట్రాన్స్జెండర్ల హృదయ వేదన. తమ పోరాటం కేవలం తమకే పరిమితం కాకూడదని, అన్ని రాజకీయ పార్టీలు ట్రాన్స్జెండర్ల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని చంద్రముఖి కోరుతున్నారు. గెలుపుపై ధీమా బీఎల్ఎఫ్ అభ్యర్ధిగా గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్న చంద్రముఖి నవంబర్ 19న (నేడు) నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బీఎల్ఎఫ్ కూటమి పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా, హక్కుల సంఘాల మద్దతుతో పోటీకి దిగుతున్న తనను ప్రజలు ఆదరించాలని కోరుతున్నారు. తనను గెలిపిస్తే కేవలం ట్రాన్స్జెండర్ల ప్రతినిధిగానే కాకుండా గోషామహల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెబుతున్నారు. ‘‘అన్ని వర్గాల ప్రజల మద్దతు, ఆదరణ తమకు ఉందని, తప్పనిసరిగా గెలిచి తీరుతానని కూడా చంద్రముఖి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుర్తించండి చాలు ♦ అన్ని రాజకీయ పార్టీలు ట్రాన్స్జెండర్ల సమస్యలను తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో గుర్తించాలి. ♦ ‘సమాజంలో ట్రాన్స్‌జెండర్స్ అనే ఒక కమ్యూనిటీ ఉంది’ అని గుర్తిస్తే చాలు. అందరిలాగే వాళ్లు కూడా మనుషులేనని గౌరవిస్తే చాలు. ♦ అన్ని రకాల హింసల నుంచి, వివక్ష, అణచివేతల నుంచి విముక్తి లభించాలి. ♦ ట్రాన్స్‌జెండర్లందరికీ ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ♦ విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. ♦ అన్ని ఆసుపత్రుల్లో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలి. ♦ వయోధికులైన వారికి పెన్షన్ సదుపాయం అమలు చేయాలి. ♦ అన్నింటికీ మించి ప్రతి ట్రాన్స్‌జెండర్‌కు సామాజిక భద్రత కల్పించాలి. – పగిడిపాల ఆంజనేయులు, సాక్షి, హైదరాబాద్ -
గోషామహాల్ BLP ఆభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి
-
చంద్రముఖి పాత్రలో జేజెమ్మ?
‘చంద్రముఖి’ సినిమా అనగానే జ్యోతిక.. జేజెమ్మ అంటే అనుష్క గుర్తుకురాక మానరు. ‘చంద్రముఖి’ సినిమాలో చంద్రముఖిగా జ్యోతిక ఏ రేంజ్లో అలరించారో తెలిసిందే. వెంకటేష్ హీరోగా వచ్చిన ‘నాగవల్లి’ సినిమాలో జ్యోతిక పాత్రలో నాగవల్లిగా అలరించారు అనుష్క. తాజాగా మరోసారి జ్యోతిక పాత్రలో అనుష్క నటించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. జ్యోతిక ప్రధాన పాత్రలో జీవీ ప్రకాష్ హీరోగా బాలా దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘నాచియార్’. పోలీసు అధికారిణిగా జ్యోతిక పలికిన డైలాగ్స్ మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ అప్పట్లో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 16న విడుదలైన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారట. తెలుగు హక్కులను నిర్మాత కల్పన కోనేరు సొంతం చేసుకున్నారట. జ్యోతిక పాత్రకి స్వీటీ అయితేనే న్యాయం చేయగలరనీ, అప్పుడే తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ బాగా వస్తుందని అనుష్కతో చర్చలు జరిపారట. మరి అనుష్క గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా? లేదా? వేచి చూడాలి. -
నేను ఆరోగ్యంగా ఉన్నాను
-
నేను బతికే ఉన్నా : స్టార్ డైరెక్టర్
సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదే స్థాయిలో అనర్థాలు కూడా జరుగుతున్నాయి. ఆకతాయిలు పెట్టే పోస్ట్ లు ఒకోసారి వైరల్ అవ్వటం మూలంగా సెలబ్రిటీలకు ఇబ్బందులు తప్పటం లేదు. చంద్రముఖి సినిమాతో దక్షిణాది ఘనవిజయాన్ని అందుకున్న దర్శకుడు పి. వాసు చనిపోయారంటూ గళవారం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై పి వాసు క్లారిటీ ఇచ్చారు. ‘ఈ రోజు ఉదయం ఆరు కిలోమీటర్లు వాకింగ్ చేసి ఇంటికి వచ్చే సరికి నేను చనిపోయానంటూ వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసింది. వాట్సప్‌లోనూ చాలా మెసేజ్ లు వచ్చాయి. ఆ వార్తలు విని నాకు నవ్వొచ్చింది. నేను ఆరోగ్యం గా ఉన్న.. నా మీద ఇంతటి అభిమానం చూపిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు’ అంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు పి. వాసు. -
వయసుకు తొందరపాటు ఎక్కువ
చిత్రం: చంద్రముఖి రచన: భువనచంద్ర సంగీతం: విద్యాసాగర్ గానం: టిప్పు, బిన్నీ బాలకృష్ణన్ పి. వాసు దర్శకత్వంలో వచ్చిన ‘ఆప్తమిత్ర’ (తమిళ చంద్రముఖి) చిత్రంలో నేను రాసిన తెలుగు పాట ఇది. ఈ పాటతో నాకు తమిళనాడులో గుర్తింపు వచ్చింది. నేటికీ నన్ను చంద్రముఖి పాట రచయితగా పరిచయం చేస్తున్నారు. తెలుగులో వచ్చిన ‘చంద్రముఖి’లో నా పాటకి తమిళంలో వాలితో అనువాదం రాయించారు. చంద్రముఖి సాంఘిక చిత్రం. కానీ ఈ పాటను చారిత్రకంగా చూపాలి. ఆ కాలాన్ని ప్రతిబింబించేలా, ఈ కాలపు వాళ్లకి అర్థమయ్యేలా పదాలను ఎంపిక చేసుకున్నాను. నాట్యాచార్యుడిని ప్రేమించిన నర్తకి ప్రేమగా పిలవటం ఈ పాట సందర్భం. ‘రారా సరసకు రారా....’ అనే పల్లవితో పాట మొదలవుతుంది. తన ప్రాణం అతనిదే అంటుంది, తన ఊపిరిలో ఊపిరిగా కలిసిపొమ్మని పిలుస్తుంది. ‘నీ పొందునే కోరి అభిసారికై నేను వేచాను సుమనోహరా; కాలాన మరుగైన ఆనంద రాగాలు వినిపించ నిలిచానురా’ అంటూ అష్టవిధ నాయికలలో నాయకుడి పొందుకోరే ‘అభిసారిక’ ను ఇక్కడ ప్రస్తావించాను. అత్యంత ప్రియమైనవి ఎన్నటికీ మరుగున పడవనేది అక్షర సత్యం. అందుకే మరుగైన ఆనందరాగాలు అనే పదం ఇక్కడ ఉపయోగించాను. చరణంలో... ‘వయసు జాలమోపలేదురా మరులుగొన్న చిన్నదానరా; తనువు బాధ తీర్చ రావేరా రావేరా... సలసలసల రగిలిన పరువపు సొద ఇది; తడబడి తడబడి తపముల స్వరమిది’ అంటూ వయసుకుండే తొందరపాటును చూపడం కోసం ఎక్కువగా లఘువులు ఉపయోగించాను. పగలాగే ప్రేమ కూడా శక్తివంతమైంది. పగకు మూలకారణం ప్రేమ. త్రికరణశుద్ధిగా ప్రేమించిన చోట అనుమానానికి తావు ఉండదు. సాంఘిక ముద్ర కోసం మాత్రమే వివాహం చేసుకుంటారనే అంశాన్ని పరోక్షంగా ఇందులో చూపాను. తమది జన్మజన్మల బంధం అని చెబుతుంది. ‘నయనాల నడయాడు తొలి స్వప్నం, నీ వలపును మరచుట సులువా, ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక, సరసకు పిలిచితి విరసము తగదిక, బిగిబిగిబిగిబిగి సొగసుల మొరవిని, మిలమిల మగసరి మెరుపులు విరియగ రారా’ అంటూ రెండవ చరణంలో వారి అనుబంధాన్ని, విరహాన్ని, ఇద్దరూ కలవాలనే వారి బలమైన కోరికను చూపాను. తమిళనాడులో నాకు ఎంతో గుర్తింపు తెచ్చిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాట తమిళనాట టాప్ టెన్‌లో రెండవ స్థానంలో నిలిచింది. – సంభాషణ: డా. వైజయంతి -
లక లక లక...
1993... కేరళ... ఫాజిల్ టేబుల్ మీద ఫైల్స్ పేరుకుపోయున్నాయి. వాటిని కదిల్చి చాలా కాలమైనట్టుంది. కొంచెం దుమ్ము కూడా చేరుకుంది. ఫాజిల్ అంటే మలయాళంలో టాప్ డెరైక్టర్. ఆ రోజు ఏదో అవసరమై ఆ ఫైళ్లు కదిలించాడు ఫాజిల్. బాగా అడుగున రైటర్ మధు ముట్టమ్ రాసిన స్క్రిప్ట్ కనబడింది. కాసేపు అటూ ఇటూ తిరగేశాడు. తర్వాత ఆ కథలో లీనమైపోయాడు. ఓ పెద్ద బంగ్లా... నాగవల్లి అనే దెయ్యం... ఓ సైకాలజిస్ట్ ట్రీట్మెంట్... భలే ఉందే కథ అనుకున్నాడు ఫాజిల్. మధుకి కబురు వెళ్లింది. వెంటనే ఫాజిల్ ఆఫీసులో వాలిపోయాడు మధు. అతనా స్క్రిప్ట్ రాసి ఏడేళ్లవుతోంది. అప్పట్లో ఫాజిల్కిస్తే ‘ప్చ్’ అన్నాడు. ఇన్నాళ్లకు ఆ స్క్రిప్టుకు మోక్షం కలిగినట్టుంది. ఫాజిల్, మధు కలసి ఆ కథకు ‘నగిషీ’లు చెక్కడం మొదలుపెట్టారు. సినిమా స్టార్ట్. మలయాళ సూపర్‌స్టార్స్ మోహన్‌లాల్, సురేశ్ గోపీలు హీరోలు. నాగవల్లి ఆవహించే గంగ పాత్రలో శోభన. అదే ‘మణిచిత్ర తాళు’.అద్దిరిపోయింది... బాక్సాఫీస్. అవార్డులూ అంతే. శోభనకైతే బెస్ట్ యాక్ట్రెస్‌గా నేషనల్ అవార్డు. 2004... బెంగళూరు... కన్నడ సినిమా ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్ధన్ ప్రెసిడెంట్. మీటింగ్ జరుగుతోంది. సీనియర్ కమెడియన్ ద్వారకేశ్‌కి, ఫైనాన్షియర్స్‌కి మధ్య గొడవ. ఈ వివాదాన్ని విష్ణువర్ధన్ పరిష్కరించాలి. న్యాయం ఫైనాన్షియర్ల వైపే ఉంది. కానీ ద్వారకేశ్ తనకు బాగా కావాల్సినవాడు. పైగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడిప్పుడు. జాగ్రత్తగా డీల్ చేయాలి. విష్ణువర్ధన్ డీల్ చేశాడు. ఫైనాన్షియర్లకి ద్వారకేశ్ అప్పు తీర్చేశాడు. ద్వారకేశ్‌కి విష్ణువర్ధన్ డేట్లు ఇచ్చాడు... ఎప్పుడో ఒకప్పుడు సినిమా చేసుకోమని. కానీ, పీక మీద కూర్చున్నాడు ద్వారకేశ్. ఇప్పటికిప్పుడు సినిమా చేయమంటాడు. హౌ? కథ చేయాలంటే నెలలు పడుతుంది. దీనికి ఒకటే సొల్యూషన్. రీమేక్. డెరైక్టర్ పి.వాసుకి కబురెళ్లింది. ఆయన చెన్నై నుంచి బెంగళూరు వచ్చాడు. విష్ణువర్ధన్ అర్జెంట్‌గా సినిమా చేద్దామన్నాడు. ‘‘నా ఫ్రెండ్ ఫాజిల్ పదేళ్ల క్రితం ‘మణిచిత్ర తాళు’ సినిమా చేశాడు. చాలా బావుంటుంది. మీకు కొత్తగా ఉంటుంది’’ చెప్పాడు పి.వాసు. ‘‘ఇంకేం... నేను రెడీ’’ అన్నాడు విష్ణువర్ధన్. అదే ‘ఆప్తమిత్ర’. సైకియాట్రిస్టుగా విష్ణువర్ధన్. నాగవల్లి ఆత్మ ఆవహించే గంగ పాత్రలో సౌందర్య. 2004... ఆగస్టు 27 రిలీజ్. ఫస్ట్ వీక్ నో కలెక్షన్స్. కట్ చేస్తే... బాక్సాఫీస్‌కి వసూళ్ల దెయ్యం పట్టింది. ఎంతకూ వదలదే..! 2004 అక్టోబర్ 1... చెన్నై... టి.నగర్‌లోని శివాజీ గణేశన్ ఇల్లు. ఆ రోజు పెద్దాయన జయంతి. శివాజీ గణేశన్ కొడుకులు ప్రభు, రామ్‌కుమార్‌లు ఆ ఏర్పాట్లేవో చేస్తుంటే... అనుకోని అతిథిలా రజనీకాంత్. వీళ్లంతా కంగారుపడిపోయారు. హాల్లో ఉన్న శివాజీ గణేశన్ ఫొటోకి అంజలి ఘటిస్తున్నాడు రజనీ. అతని మనసు నిండా ఏదో వేదన. తన ఇంటికి భోజనానికి రమ్మని పెద్దాయన ఎన్నిసార్లు అడిగారో. కుదర్లేదు. ఇప్పుడిలా ఆయన లేనప్పుడు వచ్చాడు. రజనీలో అదే చింత. అక్కడే భోంచేసి బయటకు రాగానే మీడియావాళ్లు చుట్టుముట్టారు. మామూలుగా రజనీ మాట్లాడడు. దణ్ణం పెట్టి వెళ్లిపోతాడు. ఆ రోజు మాట్లాడాడు. ‘‘పెద్దాయన స్థాపించిన ‘శివాజీ ప్రొడక్షన్స్’లో సినిమా చేస్తున్నా’’ అని అనౌన్స్ చేశాడు. అందరూ షాక్. రెండేళ్ల నుంచీ రజనీ సినిమా చేయడం లేదు. 2002లో వచ్చిన ‘బాబా’ డిజాస్టర్. అందుకే ఈసారి పెద్ద హిట్టు సాధించాలనే కసి మీద ఉన్నాడు రజనీ. కె.ఎస్.రవికుమార్ డెరైక్షన్‌లో ‘జగ్గూభాయ్’ అనౌన్స్ చేశాడు. ఈ రెండింట్లో ఏది ఉంటుంది? బెంగళూరు వెళ్లాడు రజనీ. ముసలాడి గెటప్‌లో ‘ఆప్తమిత్ర’ సినిమాకెళ్లాడు. ఆ సినిమా చూస్తూ... జనాల చప్పట్లు చూస్తూ... ఏదో ఆలోచిస్తున్నాడు. తనకు రైట్ టైమ్‌లో రైట్ సినిమా. సింహం ఆకలి తీర్చే సినిమా. పి.వాసుకి కాల్ చేశాడు. ప్రభుకి కూడా కాల్ చేశాడు. ‘‘ఆప్తమిత్ర’ను మనం రీమేక్ చేస్తున్నాం’’ చెప్పాడు రజనీ. పి.వాసు కంగారుపడ్డాడు. ఇదే సినిమాను ప్రభుతో తమిళ్లో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా రజనీనే చేస్తానంటున్నాడు. ప్రభుకైతే కలో నిజమో అర్థం కావడం లేదు. ‘‘మరి ‘జగ్గూభాయ్’?’’ అంటూ నీళ్లు నమిలాడు పి.వాసు. ‘‘అది క్యాన్సిల్. మనం ‘ఆప్తమిత్ర’ చేస్తున్నాం.’’ రజనీ ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే. మణిచిత్ర తాళు... ఆప్తమిత్ర... ఈ రెండింటినీ మించేలా ఉండాలి రజనీ సినిమా. కథను మార్చకూడదు. కానీ రజనీ ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్పులు చేయాలి. పి.వాసు అదే చేస్తున్నాడు. రజనీ కూడా ఫుల్ ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఈచ్ అండ్ ఎవ్విర్‌థింగ్ అడుగుతున్నాడు. ‘‘దెయ్యం పేరు నాగవల్లి బాలేదు. రాజుల కాలంనాటి నర్తకి కాబట్టి... ఇంకా హెవీగా ఉండాలి.’’ రజనీ చెబితే తిరుగేముంది. ఇప్పుడు దెయ్యం నాగవల్లి కాదు... చంద్రముఖి.‘ఆప్తమిత్ర’లో విష్ణువర్ధన్ ‘హౌల హౌల...’ అంటుంటాడు. రజనీకి నచ్చలేదు. మార్చాలి. ఎప్పుడో చిన్నప్పుడు మరాఠీ నాటకంలో విలన్ మేనరిజమ్ గుర్తొచ్చింది. అదే ‘లక లక లక...’. గంగ పాత్రకు ఎవరిని తీసుకోవాలి? స్నేహ... రీమాసేన్... ఎవ్వరూ ఆనడం లేదు. ఎస్... సిమ్రన్ కరెక్ట్. దుర్గ పాత్రకు కొత్తమ్మాయి నయనతార. రజనీకి పెయిర్. గోల్డెన్ చాన్స్ అంటే ఇదే. తీరా రెండ్రోజులు షూటింగ్ చేశాక, షాకింగ్ న్యూస్... ‘చంద్రముఖి’ టీమ్‌కి. స్వీట్ న్యూస్... సిమ్రన్‌కి. ఆమె ప్రెగ్నెంట్. సినిమాను వదులుకోవాల్సిన పరిస్థితి. బ్యాడ్‌లక్. కానీ జ్యోతికది గుడ్‌లక్. ఆమెకి దక్కింది అవకాశం. హైదరాబాద్‌లో షూటింగ్. దాదాపుగా అంతా ఇక్కడే. కొంతవరకు మాత్రం చెన్నైలో. రెండు పాటలకు టర్కీ వెళ్లారు. ఎంత స్పీడ్‌గా అంటే... అంత స్పీడ్‌గా ఫినిష్ అయిపోయింది సినిమా. 19 కోట్ల బడ్జెట్ తేలింది. 2005 ఏప్రిల్ 14. తెలుగు, తమిళ భాషల్లో ‘చంద్రముఖి’ చూసి ప్రేక్షకులకు దిమ్మ తిరిగిపోయింది. 10... 20... 30... 40... 50... 60... 70... ఇలా కోట్లు వస్తూనే ఉన్నాయి. 50 రోజులు... 100 రోజులు... 200 రోజులు... చెన్నైలో శివాజీ గణేశన్ సొంత థియేటర్ ‘శాంతి’లో 804 రోజులాడి సౌత్ ఇండియా రికార్డ్ సృష్టించింది. త్యాగరాజ భాగవతార్ నటించిన తమిళ ‘హరిదాస్’ (1944 అక్టోబర్ 16 రిలీజ్) ఏకధాటిగా చెన్నైలోని బ్రాడ్వే థియేటర్లో 768 రోజులాడిన రికార్డు బద్దలు. మళ్లీ రజనీ హవా మొదలు. చంద్రముఖా మజాకా! లక లక లక... - పులగం చిన్నారాయణ వెరీ ఇంట్రస్టింగ్... * ‘మిస్టర్ పెళ్లాం’ తీసిన గవర పార్ధసారథికి శోభన క్లోజ్. ఢిల్లీలో నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్లో శోభన కలిసినప్పుడు, ‘‘మణిచిత్ర తాళు’ తెలుగులో రీమేక్ చెయ్య’’మని సలహా ఇచ్చింది. రిస్క్ అని వదిలేశారు పార్ధసారథి. తర్వాత ‘చంద్రముఖి’ని పి.కరుణాకర్‌రెడ్డి, ఎస్.రమేశ్ బాబులతో కలసి తెలుగులో డబ్ చేశారు. * ‘శివాజీ ప్రొడక్షన్స్’లో రజనీకాంత్ ‘మన్నన్’ సినిమా చేశాడు. ఆ సినిమా విజయోత్సవ సభలో ఇదే సంస్థలో 50వ సినిమా చేస్తానని రజనీ మాట ఇచ్చారు. ఆ రకంగా కూడా ‘చంద్రముఖి’ చేసి రజనీ మాట నిలబెట్టుకున్నారు. * పారితోషిక రూపంలోనూ, లాభాల్లో వాటా పరంగానూ ‘చంద్రముఖి’కి రజనీకాంత్‌కు 15 కోట్ల రూపాయల వరకూ ముట్టింది. అప్పట్లో అదే హయ్యస్ట్ రెమ్యూనరేషన్. * ‘చంద్రముఖి’ తెలుగు డబ్బింగ్ వెర్షన్లో సందర్భోచితంగా ‘వారాయ్... నాన్ ఉన్నై తేడీ...’ అనే తమిళ పాట పెట్టారు. ఇప్పటికీ ఆ పాట పాపులరే. తమిళ మాతృకలో ‘రారా... సరసకు రారా...’ అంటూ భువనచంద్ర రాసిన తెలుగు పాట పెట్టారు. * ‘మణి చిత్ర తాళు’ డీవీడీ చిరంజీవికిచ్చి తెలుగులో రీమేక్ చేద్దామన్నారు దర్శకుడు వీఎన్ ఆదిత్య. అయితే చిరంజీవి ఆసక్తి చూపించలేదు. ‘చంద్రముఖి’ రిలీజై ఘనవిజయం సాధించాక, చిరంజీవి స్వయంగా ఆదిత్యకు ఫోన్‌చేసి అతని జడ్జ్మెంట్ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారట. -
ప్రేమించి పెళ్లి చేసుకున్ :పరిటాల మంజుల
పాలకొల్లు అర్బన్ : చంద్రముఖి సీరియల్లో నటించడం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు అభిమానిగా మారడంతోపాటు తెలుగింటి కోడలినయ్యానని టీవీ సీరియల్ నటి పరిటాల మంజుల అన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు సారథ్యంలో కాపుగంటి రాజేంద్ర దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘గోకులంలో సీత’ షూటింగ్ నిమిత్తం పాలకొల్లు విచ్చేసిన ఆమె విలేకరులతో ముచ్చటించారు. బుల్లితెర నటిగా ఎలా అవకాశాలొచ్చాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా కన్నడంలో కొత్త నటీనటులతో సీరియల్ తీస్తున్నారని మా నాన్న మిత్రుడొకరు చెప్పారు. ఫొటో షూట్‌కి వెళ్లి తొలి ప్రయత్నంలోనే హీరోయిన్ పాత్ర దక్కించుకున్నాను. తెలుగులో బుల్లితెరకు ఎలా పరిచయమయ్యారు బెంగళూరులో ఆర్కా మీడియా సంస్థ ద్వారా తెలుగులో నటించే అవకాశం వచ్చింది. తెలుగులో తొలి సీరియల్ చంద్రముఖి. కుటుంబ నేపథ్యం నాన్న శివశంకర్ పోలీస్. అమ్మ పుష్ప గృహిణి. మేం నలుగురు ఆడపిల్లలం. నేను రెండో సంతానం. నాల్గో చెల్లి కీర్తి కూడా బుల్లితెర నటి. ఎన్ని సీరియల్స్ నటించారు కన్నడంలో మనయందు మూరుబాగిలు, ప్రేమ పిశాచిగలు, క్షణ-క్షణ, కాదంబరి, తులసి, కల్యాణి, రంగోలి, తెలుగులో చంద్రముఖి, అమ్మాయి కాపురం, చంద్రలేఖ, నీలాంబరి, ఇద్దరమ్మాయిలు, ఆకాశమంత, కాంచనగంగ, తరంగాలు, లేతమనసులు అన్నీ హీరోయిన్ పాత్రలే చేశా. కాంచనగంగలో విలన్ పాత్ర పోషించా. పేరుతెచ్చిన సీరియల్ చంద్రముఖి, 1,850 ఎపిసోడ్లతో ఆరున్నరేళ్లు సాగింది. మీది ప్రేమ వివాహమా నా సహచర నటుడు, సినీ రచయిత ఓంకార్ కుమారుడు నిరుపమ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అవార్డులు మాటే ంటి చంద్రముఖికి నాలుగు అవార్డులు అందుకున్నా. కాంచనగంగలో పాత్రకు పురస్కారం దక్కింది. డ్రీమ్ రోల్ ఒకే సీరియల్లో రెండు విభిన్న పాత్రలు (హీరోయిన్, విలన్) చేయాలని ఉంది. -
విలన్‌గా చేస్తా
అందరికీ అన్ని రకాల పాత్రలు అమరడం కష్టం. ఎన్ని చిత్రాలు చేసినా కొందరు తన నట దాహార్తిని తీర్చే పాత్ర లభించలేదని వాపోతుంటారు. కథానాయికల విషయానికొస్తే నటి త్రిష హీరోయిన్గా దశాబ్దకాలం పూర్తి చేసుకున్నా ఇప్పటికీ చెక్కుచెదరని సౌందర్యంతో ప్రకాశిస్తునే ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ పలు భాషా చిత్రాల్లో నటించారు. వాటిలో చాలా వరకు విజయం సాధించాయి. అయితే అవన్నీ ప్రేమికురాలి పాత్రలకు పరిమితమయ్యాయి. మొళి, చంద్రముఖి చిత్రాల్లో జ్యోతిక పాత్రల్లా, అరుంధతి చిత్రంలో అనుష్క పాత్ర మాదిరి త్రిషకు లభించలేదనే చెప్పాలి. దీంతో ఈ చెన్నై బ్యూటీకి వైవిధ్యభరిత పాత్రలు చేయాలనే కోరిక పుట్టిందట. దీనిపై త్రి ష మాట్లాడుతూ, తనలోని నటనా ప్రతిభను వెలికి తీసే పాత్ర ఇప్పటికీ లభించలేదన్నారు. మూస పాత్రల్లో నటించి బోర్ కొట్టిందని చెప్పారు. సవాల్‌తో కూడిన పాత్రల్లో నటించాలనుకుంటున్నట్లు తెలిపారు. అది ప్రతినాయకి పాత్ర అయినా చేయడానికి సిద్ధమేనంటున్న కోరిక నెరవేరేనా? ఎందుకంటే ఈ అందాల భామ విలనిజాన్ని ఆమె అభిమానులు హర్షిస్తారా? అన్నది సందేహమే. నటి త్రిషకు అరెస్టు వారెంటా? నటి త్రిషకు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో కల కలం పుట్టిస్తున్న టాపిక్ ఇదే. ఈ అందాల తార బాత్రూమ్లో జలకాలాడే దృశ్యాలు ఇంటర్నెట్ల్లోనూ, పత్రికల్లోనూ ప్రచారమై ఎనిమిదేళ్ల క్రితం సంచలనం సృష్టించింది. దీన్ని త్రిష తల్లి తీవ్రంగా ఖండించారు. అవి తన కూతురుకు సంబంధించిన ఒరిజినల్ దృశ్యాలు కావని మార్ఫింగ్ చేసిన నకిలీ దృశ్యాలంటూ, ప్రచురించిన ప్రత్రికపై చెన్నై ఎగ్మూర్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ కేసు విచారణ సమయంలో త్రిష తల్లి ఉమ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి త్రిష, ఆమె తల్లి ఉమపై అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన త్రిష తరపు న్యాయవాది కోర్టు త్రిషకు అరెస్టు వారెంట్ జారీ చేయలేదని ఆమె తల్లి ఉమకు అరెస్టు వారెంట్ జారీ చేసిందని వివరించారు. ఈ అరెస్టు వారెంట్‌ను చట్టపరంగా ఎదుర్కొంటామని అన్నారు.