చంద్రముఖి సినిమాలో వారాయ్.. సాంగ్ ఎంతో ఫేమస్. ఇందులో జ్యోతిక డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్‌ను మాటల్లో వర్ణించలేం. ఈ ఒక్క పాట సినిమాను మరో మెట్టు ఎక్కించింది. తాజాగా ఈ సాంగ్ గురించి కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. రారా(వారాయ్.. నానుడి తేడి) పాట షూటింగ్ సమయంలో నన్ను ఎంతగానో విమర్శించారు. నిజానికి జ్యోతికకు క్లాసికల్ డ్యాన్స్ రాదు. దీనివల్ల ఆమెకు డ్యాన్స్ నేర్పించడానికి కొంత సమయం పట్టింది.
రెండు రోజుల్లో పూర్తి
తర్వాత రెండు రోజుల్లో సాంగ్ పూర్తి చేశాం. రిజల్ట్ మాత్రం అద్భుతంగా వచ్చింది. ఆ పాట ఎడిటింగ్ అయిపోయే సమయానికి జ్యోతిక స్టూడియోలోనే ఓ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చింది. నాట్యమే తెలియనివారు నా శిక్షణ వల్ల అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? చంద్రముఖి మలయాళ వర్షన్ చూడకుండానే ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాను. ప్రత్యేకంగా ఈ పాటను మాత్రమే ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు.
కొరియోగ్రాఫర్ ఎలా అయ్యానంటే?
కమల్ హాసన్ 'పున్నగి మన్నన్' మూవీకి రఘు మాస్టర్ కొరియోగ్రాఫర్. కానీ అప్పుడు ఆయనకు ఓ తెలుగు సినిమా చేయాల్సి ఉండటంతో పున్నగి చిత్రాన్ని నాకు అప్పగించాడు. అప్పటికి నేనింకా డ్యాన్స్ స్కూల్‌లో స్టూడెంట్‌ను మాత్రమే కావడంతో కమల్ హాసన్ సహా అందరూ భయపడ్డారు. తీరా నా డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు అని కళా మాస్టర్ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment