ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నిలదొక్కుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. ఐదేళ్ల క్రితం ఫలక్‌నుమా దాస్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈయన తర్వాత ఎన్నో రకాల ప్రయోగాలు చేశాడు. యాటిట్యూడ్ చూపించే విశ్వక్ కేవలం మాస్ సినిమాలకే సెట్టవుతాడన్న అభిప్రాయాలను అశోకవనంలో అర్జున కల్యాణం మూవీతో తప్పని రుజువు చేశాడు.
లైలాగా మారిన హీరో
ఈ ఏడాది గామితో హిట్ కొట్టి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పర్వాలేదనిపించిన ఈ హీరో తాజాగా సరికొత్త ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాడు. ఇందులో లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ మూవీకి లైలా అనే టైటిల్ ఖరారు చేశారు. బుధవారం ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా ఆకాంక్ష శర్మను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం నాడు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఫస్ట్ లుక్ రిలీజ్
ఈ మేరకు రిలీజ్ డేట్‌తో కూడిన ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్ కళ్లు మాత్రమే చూపించారు. ఇది చూసిన నెటిజన్లు హీరోయిన్లు సైతం కుళ్లుకునేంత అందంగా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ నిర్మించనుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
చదవండి: కన్నబిడ్డను కాటికి పంపించాలనుకున్నా: పాకిస్తాన్ నటి
Comments
Please login to add a commentAdd a comment