akanksha sharma
-
విష్వక్ సేన్ 'లైలా' సాంగ్ రిలీజ్.. ప్రత్యేకత ఎంటో తెలుసా..?
మాస్ కా దాస్ 'విష్వక్ సేన్' వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తన కొత్త సినిమా 'లైలా' నుంచి అదిరిపోయే సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలా మూవీకి దర్శకత్వం వహించే భాద్యత కొత్తవారికి ఇవ్వడంతో విష్వక్పై ప్రశంసలు వచ్చాయి. దర్శకుడిపై హీరో పెట్టకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ.. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఇప్పుడు 'సోను మోడల్' అంటూ సాగే ఈ పాటకు విష్వక్ లిరిక్స్ ఇవ్వడం ప్రత్యేకంగా నిలిచింది. అందుకు తగినట్లు నారాయణన్ రవిశంకర్, రేష్మా శ్యామ్ ఆలపించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి లైలా రానుంది. -
లైలాగా టాలీవుడ్ హీరో.. హీరోయిన్లే కుళ్లుకునేలా..
ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నిలదొక్కుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. ఐదేళ్ల క్రితం ఫలక్‌నుమా దాస్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈయన తర్వాత ఎన్నో రకాల ప్రయోగాలు చేశాడు. యాటిట్యూడ్ చూపించే విశ్వక్ కేవలం మాస్ సినిమాలకే సెట్టవుతాడన్న అభిప్రాయాలను అశోకవనంలో అర్జున కల్యాణం మూవీతో తప్పని రుజువు చేశాడు. లైలాగా మారిన హీరోఈ ఏడాది గామితో హిట్ కొట్టి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పర్వాలేదనిపించిన ఈ హీరో తాజాగా సరికొత్త ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాడు. ఇందులో లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ మూవీకి లైలా అనే టైటిల్ ఖరారు చేశారు. బుధవారం ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా ఆకాంక్ష శర్మను హీరోయిన్గా తీసుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం నాడు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫస్ట్ లుక్ రిలీజ్ఈ మేరకు రిలీజ్ డేట్‌తో కూడిన ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్ కళ్లు మాత్రమే చూపించారు. ఇది చూసిన నెటిజన్లు హీరోయిన్లు సైతం కుళ్లుకునేంత అందంగా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ నిర్మించనుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.చదవండి: కన్నబిడ్డను కాటికి పంపించాలనుకున్నా: పాకిస్తాన్ నటి -
Akanksha Sharma: దివ్య కాంతుల్లో మెరిసిపోతున్న ఆకాంక్ష శర్మ (ఫోటోలు)
-
ఆ హీరోయిన్‌తో బ్రేకప్, వెంటనే మరొకరితో హీరో డేటింగ్?
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, బ్యూటిఫుల్ హీరోయిన్ దిశా పటానీలు బ్రేకప్ చెప్పుకున్నారంటూ గత కొంతకాలంగా ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే ఆమెకు దూరమైన సమయంలో టైగర్ మరో నటికి దగ్గరయ్యాడంటూ బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసనోవా మ్యూజిక్ వీడియోలో తనతో పాటు కలిసి నటించిన ఆకాంక్ష శర్మతో అతడు డేటింగ్ చేస్తున్నాడంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. వీరిద్దరూ ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్ 2.0 మ్యూజిక్ వీడియోలో కూడా కలిసి నటించారు. ఇకపోతే టైగర్ ష్రాఫ్ మళ్లీ ప్రేమలో పడ్డాడంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని కుండ బద్ధలు కొట్టేశాడు. ఆకాంక్షతో ప్రేమలో పడలేదని క్లారిటీ ఇచ్చిన టైగర్.. దిశాతో బ్రేకప్ నిజమేనా? కాదా? అన్నది మాత్రం స్పష్టతనివ్వలేదు. ఇకపోతే టైగర్ ష్రాఫ్ త్వరలో ఢీలా, గణపత్: పార్ట్ 1, బడేమియా చోటేమియా, రాంబో చిత్రాల్లో కనిపించనున్నాడు. చదవండి: ఘనంగా ప్రముఖ సీరియల్ నటి సీమంతం, ఫొటోలు వైరల్ పెళ్లి ఆలోచనలు లేవు.. మలైకాతో రిలేషన్‌పై హీరో కామెంట్స్ -
‘ఇక యువీ ప్రశాంతంగా ఉండగలడు’
ఢిల్లీ: గృహ హింస కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు చాలా పెద్ద ఊరట లభించిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండేళ్ల క్రితం సోదరుడు జోరావర్ భార్య ఆకాంక్ష శర్మ.. యువరాజ్‌తో పాటు అతని కుటుంబంపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే యువరాజ్‌పై పెట్టిన కేసులో ఎటువంటి వాస్తవం లేదని, లబ్ధి కోసమే అలా కేసు పెట్టినట్లు ఆకాంక్ష తెలిపినట్లు యువీ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దాంతో ఇక నుంచి యువరాజ్ ప్రశాంతంగా ఉండగలడని వారు తెలిపారు. ఇటీవల జోరావర్-ఆకాంక్ష సింగ్‌లు కోర్టు ద్వారా విడాకులు పొందిన సంగతి తెలిసిందే. అయితే 2017లో భర్తతో పాటు యువరాజ్ సింగ్, అతని తల్లి షబ్నామ్ సింగ్‌లపై ఆకాంక్ష గృహ హింస కేసు పెట్టారు. చట్టం నుంచి తప్పించుకోలేని సందర్భంలో యువరాజ్‌పై పెట్టిన కేసును ఆకాంక్ష ఉపసంహరించుకున్నారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘కోట్లాది అభిమానులున్న యువీ పేరును అడ్డం పెట్టుకుని మమ్మల్ని టార్గెట్ చేశారు. గృహ హింస పేరుతో యువీ ప్రతిష్టకు భంగం కల్గించాలని ఆకాంక్ష చూశారు. చట్టంపై నమ్మకంతో యువీ పోరాడాడు. యువీకి చివరి ఊరట లభించింది మేము యువీని చూసి గర్విస్తున్నాం’ అని కుటుంబ సభ్యులు తెలిపారు. -
'యువీపై ఎటువంటి కేసు నమోదు కాలేదు'
న్యూఢిల్లీ:టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ పై అతని మరదలు ఆకాంక్ష శర్మ గృహహింస కేసు పెట్టినట్లు వచ్చిన వార్తలను యువీ తరపు న్యాయవాది దమన్ బిర్ సింగ్ సోబ్తి ఖండించారు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. యువీపై ఆకాంక్ష ఎటువంటి కేసును పెట్టలేదని తాజాగా స్పష్టం చేశారు. దానిలో భాగంగానే అక్టోబర్ 21వ తేదీన యువరాజ్ కుటుంబ సభ్యులు కోర్టుకు హాజరుకావాలంటూ వచ్చిన వార్తలు కూడా నిజం కాదన్నారు. ఏ రకంగా చూసినా ఆకాంక్షను యువీ ఎప్పుడూ వేధించలేదని వివరణ ఇచ్చారు. నిన్న వెలుగుచూసిన వార్తలు కాలక్షేమం కోసం ఎవరో కావాలని చేసినవంటూ న్యాయవాది కొట్టిపారేశారు. జోరవర్-ఆకాంక్షలు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ గతంలోనే కోర్టును ఆశ్రయించారని, మరి అటువంటప్పుడు మళ్లీ గృహహింస కేసు వార్తలు రావడం అర్థరహితమన్నారు. చాల రోజుల నుంచి ఆకాంక్ష జరోవర్లు విడిగా ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే విషయంపై కోర్టులో కేసు నడుస్తోంది. ఆకాంక్ష వద్ద ఉన్న నగలను తిరిగి ఇచ్చేయాలని ఇటీవల యువరాజ్ తల్లి షబ్నం కూడా కేసు వేసింది. ఇదిలా ఉంచితే, బిడ్డ కావాలంటూ బిడ్డ కావాలంటూ జరోవర్, షబ్నం ఆకాంక్షపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఈ విషయంలో వారికి యువీ వత్తాసు పలుకుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆ క్రమంలోనే యువీపై గృహహింస కేసు నమోదైనట్లు మీడియాలో వెలుగుచూసింది. -
యువరాజ్‌పై గృహహింస కేసు..
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియ క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై గృహహింస కేసు నమోదైంది. సోదరుడు జోరవర్ సింగ్ భార్య, బిగ్ బాస్-10 కంటెస్టెంట్ ఆకాంక్ష శర్మ ఈ కేసు పెట్టారు. యువరాజ్‌సింగ్‌తో పాటు భర్త జోరవర్ సింగ్, అత్త షబ్నం సింగ్‌లపై కేసుపెట్టినట్లు ఆమె లాయర్ స్వాతి సింగ్ తెలిపారు. చాల రోజుల నుంచి ఆకాంక్ష జరోవర్లు విడిగా ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే విషయంపై కోర్టులో కేసు నడుస్తోంది. ఆకాంక్ష వద్ద ఉన్న నగలను తిరిగి ఇచ్చేయాలని ఇటీవల యువరాజ్ తల్లి షబ్నం కూడా కేసు వేసింది. అయితే ఈ గృహహింస కేసు యువరాజ్‌పై ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించగా.. శారీరక హింస కింద మాత్రమే ఈ కేసు నమోదు చేయరు మానసికంగా, ఆర్ధికంగా ఒత్తిడి తీసుకురావడం, అందుకు సహకరించిన వారిపై కూడా ఈ కేసు నమోదు చేయవచ్చిని లాయర్ స్వాతి తెలిపారు. బిడ్డ కావాలంటూ జరోవర్, షబ్నం ఆకాంక్షపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ విషయంలో యువీ వారి కుటుంబ సభ్యులకు వత్తాసు పలుకుతున్నాడు. అందుకే అతని పేరు జతచేయాల్సి వచ్చిందన్నారు. -
హాలీవుడ్ క్రైం సినిమా చూసి..
తన తల్లిదండ్రులతో పాటు సహజీవనం చేస్తున్న భాగస్వామి ఆకాంక్షా శర్మను కూడా చంపేసి, కాంక్రీటు సమాధి చేసిన ఉదయన్ దాస్.. అదంతా ఎందుకు, ఎలా చేశాడో ఇన్నాళ్లకు బయటపడింది. చిన్నతనంలో అతడిని తోటి పిల్లలు తరచు ఏడిపిస్తుండేవారట. దానివల్లే అతడు సైకోగా మారి ఉంటాడని పోలీసులు అంటున్నారు. 'డెవిల్స్ నాట్' అనే అమెరికన్ క్రైం సినిమా చూసిన తర్వాత.. దాంతో స్ఫూర్తి పొంది, అందులో చూపించినట్లుగానే హత్యలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఉదయన్‌ను బంకురా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య బంకురా పట్పటణానికి తీసుకొచ్చారు. చిన్నతనంలో కూడా ఇతడికి మంచి చెప్పుకోదగ్గ స్నేహితులంటూ ఎవరూ లేరు. నల్లగా ఉంటాడని అతడిని అందరూ ఏడిపించేవాళ్లు. దాంతో వాళ్లమీద పగ తీర్చుకోవాలని అనుకుంటూ.. చివరకు ఒక ఫ్రెండుకు సంబంధించిన ఆర్కూట్ అకౌంటును హ్యాక్ చేశాడు. అతడికి ఉన్నవాళ్లంతా వర్చువల్ స్నేహితులేనని, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కలిసినవాళ్లనే స్నేహితులుగా భావించేవాడు. అతడికి వేర్వేరు పేర్లతో మొత్తం 110 ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి. ఉదయన్ వద్ద మొత్తం 2500 హాలీవుడ్ సినిమాల కలెక్షన్ ఉంది. వాటిలో ఒకటైన డెవిల్స్ నాట్లో చూపించినట్లే ఆకాంక్షను చంపి, కాంక్రీటుసమాధి కట్టేశాడు. తాను ఐఐటీలో చదివినట్లు అతడు చెప్పాడు గానీ, నిజానికి చదువుల్లో బాగా వెనకబడి, కాలేజిలో కూడా పరీక్షలు ఫెయిలవ్వడంతో అతడిని బయటకు పంపేశారు. ఆకాంక్ష రాసినట్లుగా ఉన్న నాలుగు ఉత్తరాలను ఉదయన్ తన ఇంటి గోడలలో దాచిపెట్టగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత కథనాలు చదవండి.. ‘ఆన్లైన్’ ప్రేయసిని అతి దారుణంగా.. ప్రేయసిని చంపినట్టే, తల్లిదండ్రులను కూడా.. -
యువరాజ్ తల్లిపై ఆరోపణలకు సమాధానాలివే..
గురుగ్రామ్‌కు చెందిన అకాంక్ష శర్మ అనే యువతి ఓ టీవీ రియల్టీ షోలో భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తల్లి షబ్నంపై చేసిన ఆరోపణలు అవాస్తవమని షబ్నం తరఫు న్యాయవాది దమన్‌వీర్ సింగ్ సోబ్టీ స్పష్టం చేశారు. ఆకాంక్ష చేసిన ఆరోపణలు తప్పని షబ్నం న్యాయవాది ఆధారాలతో సహా సమాధానం ఇచ్చారు. యువరాజ్ సోదరుడు జోరావర్‌ను వివాహం చేసుకున్న ఆకాంక్ష, తమ పెళ్లి విచ్ఛిన్నం కావడానికి షబ్నం కారణమంటూ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. భర్తతో విడిపోయాక అతని కుటుంబం వారు తనకు నెలకు 3 వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారని, తాను చాలా ఇబ్బంది పడ్డానన్న ఆకాంక్ష ఆరోపణకు న్యాయవాది సమాధానమిస్తూ.. 2014 సెప్టెంబర్‌లో ఆకాంక్ష ఇంటి నుంచి వెళ్లిపోయాక షబ్నం ప్రతినెలా ఆమెకు 20 వేల రూపాయలు పంపేవారని, 2015 ఏప్రిల్ వరకు ఇలా డబ్బు పంపారని, అయితే అదనంగా డబ్బులు ఇవ్వాలని ఆకాంక్ష బెదిరించడంతో జొరావర్ కోర్టులో విడాకులు పిటిషన్ దాఖలు చేశాడని చెప్పారు. ఇది చండీగఢ్ కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఇక తాము హనీమూన్‌కు వెళ్లినపుడు షబ్నం తమ వెంట వచ్చారని, ఆమె తమ గదిలో పడుకుందని ఆకాంక్ష చేసిన ఆరోపణలకు బదులిస్తూ.. పెళ్లయ్యాక ఆకాంక్ష అనారోగ్యంతో ఉందని, ఈ విషయం ఆమె తల్లి మోనికకు చెప్పడంతో తన కుమార్తెకు సమస్య ఉందని అంగీకరించిందని, ఆకాంక్ష ఒంటరిగా వెళ్లరాదన్న మోనిక అభ్యర్థన మేరకు షబ్నం అన్ని ఖర్చులు భరించి, ఆ జంట వెంట గోవాకు షబ్నం, మోనిక వెళ్లారని దమన్‌వీర్ సింగ్ చెప్పారు. డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన బిల్లులు, ఫ్లయిట్ టికెట్లు, హోటల్ బిల్లులు అన్నీ ఆయన మీడియాకు చూపించారు.