మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం లైలా. గతేడాది మెకానిక్ రాకీతో అలరించిన హీరో.. ఈ లవర్స్ డే రోజున ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా కనిపించనుంది.
తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. లైలా టీజర్ చూస్తుంటే ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లోనూ ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. 'మనకు తెల్లగా చేసుడే కాదు.. తోలు తీసుడు కూడా వచ్చు' అనే డైలాగ్ మాస్ కా దాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా టీజర్ చూసేయండి. కాగా.. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.
Welcome to the world of #Laila filled with fun, action and romance ❤🔥
The Echipaad #LailaTeaser out now 💥💥
▶️ https://t.co/YHl8j4IgAK
GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th @RAMNroars #AkankshaSharma @leon_james @sahugarapati7 @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/OQ5I4yzaJN— VishwakSen (@VishwakSenActor) January 17, 2025
Comments
Please login to add a commentAdd a comment