మాస్ కా దాస్ 'విష్వక్ సేన్' వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తన కొత్త సినిమా 'లైలా' నుంచి అదిరిపోయే సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలా మూవీకి దర్శకత్వం వహించే భాద్యత కొత్తవారికి ఇవ్వడంతో విష్వక్‌పై ప్రశంసలు వచ్చాయి. దర్శకుడిపై హీరో పెట్టకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ.. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ అందరిలోనూ ఆసక్తిని పెంచింది.
ఇప్పుడు 'సోను మోడల్' అంటూ సాగే ఈ పాటకు విష్వక్ లిరిక్స్ ఇవ్వడం ప్రత్యేకంగా నిలిచింది. అందుకు తగినట్లు నారాయణన్ రవిశంకర్, రేష్మా శ్యామ్ ఆలపించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి లైలా రానుంది.
Comments
Please login to add a commentAdd a comment