‘‘నా కెరీర్‌లో యాక్షన్ టచ్‌తో రూపొందిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఫ్యామిలీ ఫిల్మ్ ‘లైలా’. చాలా క్లీన్‌గా ఉంటుంది. ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కోసం లైలాగా రెడీ కావడానికి రెండు గంటలు పట్టేది. నిజంగా అమ్మాయిలకు హ్యాట్సాఫ్ చెప్పాలి’’ అని హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) అన్నారు.
రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, ఆకాంక్షా శర్మ జంటగా నటించిన చిత్రం ‘లైలా’( Laila). సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘ఇచ్చుకుందాం బేబీ...’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు. పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటని ఆదిత్య ఆర్కే, ఎంఎం మానసి ఆలపించారు.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘లైలా’లో మోడల్ సోనూ, లైలా అనే రెండు పాత్రల్లో నటించా. వాలెంటైన్స్ డే కి సింగిల్స్ తమకు ఎవరూ లేరని బాధపడుతుంటారు. ఈ వాలెంటైన్స్ డే కి మీకు లైలా ఉంది. అమ్మాయిలు సింగిల్ అని అనుకుంటే మీకు సోను మోడల్ వున్నాడు.(నవ్వుతూ). మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఫిబ్రవరి 14కి కలుద్దాం’ అన్నారు.
‘‘లైలా’ కథ ఇద్దరు ముగ్గురు హీరోలకు చెప్పాను. లేడీ గెటప్ వేయడం అంత ఈజీ కాదు. సినిమా అంటే పిచ్చి ఉంటేనే చేయగలరు. అలాంటి పిచ్చి ఉన్న విశ్వక్ దొరికారు’’ అని రామ్ నారాయణ్ చెప్పారు.
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. రామ్ కథ చెప్పిన తర్వాత కొందరు హీరోలకు అప్రోచ్ అయ్యాను. లేడి క్యారెక్టర్ ని చేయగలుగుతామా లేదా అనుకునే టైంలో విశ్వక్ ఇలాంటి క్యారెక్టర్ కోసం తను ఎదురుచూస్తున్నాని చెప్పి సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇది మంచి క్యారెక్టర్ గా తన కెరీర్ లో నిలిచిపోతుంది. యూత్ ట్యాలెంట్ తో ఈ సినిమా కోసం పని చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.
లిరిక్ రైటర్ పూర్ణచారి మాట్లాడుతూ... ధమ్కి లో ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ నేనే రాశాను, అది వంద మిలియన్స్ కొట్టింది. ఇప్పుడీ ఈ సాంగ్ కి రెండు వందల మిలియన్స్ కి మించి రావాలని కోరుకుంటున్నాను. ఈ పాట రాసే అవకాశం ఇచ్చిన విశ్వక్ గారికి, నిర్మాత సాహు గారికి, డైరెక్టర్ రామ్ గారికి థాంక్ యూ. ఈ సినిమాని పెద్ద చేస్తారని కోరుకుంటున్నాను' అన్నారు
Comments
Please login to add a commentAdd a comment