Laila Movie
-
'లైలా' కలెక్షన్స్.. విశ్వక్ సేన్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్
లైలా సినిమా విశ్వక్ సేన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. చిత్రపరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీగా విశ్వక్ సినిమాలకు రిటర్న్స్ వస్తాయని నిర్మాతలు నమ్ముతారు. అందుకే ఆయన ఏడాదికి సుమారు నాలుగు చిత్రాలు చేయగలుగుతున్నాడు. అయితే, నటుడు పృథ్వీరాజ్ లైలా ఈవెంట్లో చేసిన రాజకీయ కామెంట్లు లైలాకు తీరని నష్టాన్ని మిగిల్చింది. అతగాడి చవకబారు వ్యాఖ్యలపై సోషల్ మీడియా భగ్గుమంది. ఫైనల్లీ పృథ్వీరాజ్ లెంపలేసుకున్నా ఫలితం లేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.లైలా కోసం లేడీ గెటప్‌తో విశ్వక్ సేన్ ప్రేక్షకులను మెప్పించాడు. తెరపై తన నటన గురించి పేరు పెట్టాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్ర ఉన్నా సరే ఈజీగా చేసేస్తాడు. లైలా విజయం కోసం ఆయన తీవ్రంగానే కష్టపడ్డాడు. రకరకాల ప్రమోషన్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ సమయంలో మార్కెట్లో పెద్ద సినిమా కూడా లేదు. ఈజీగా బాక్సాఫీస్ వద్ద లైలా సందడి ఉంటుందని అందరూ అంచనా వేశారు. కేవలం పృథ్వీరాజ్ వ్యాఖ్యలతో నిర్మాతకు తీరని నష్టాన్ని మిగిల్చింది.ఫిబ్రవరి 14న విడుదలైన లైలా ఇప్పటి వరకు రూ. 3 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. విశ్వక్ సేన్ కెరీర్లోనే అతి తక్కువ వసూళ్లు సాధించిన సినిమా ఇదే కావడం విశేషం. నిర్మాతకు కూడా భారీగా నష్టాన్ని తెచ్చిపెట్టింది. శని, ఆదివారాల్లో అయినా బాక్సాఫీస్ వద్ద కోలుకుంటుందని మేకర్స్ భావించారు. కానీ వీకెండ్లో చాలా చోట్ల షోలు రద్దయ్యాయి. దీంతో లైలా ప్రయాణం దాదాపు ముగిసిపోయింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా కొంత మేరకు లాస్ కవర్ చేసుకున్నా కూడా నిర్మాతకు థియేట్రికల్‌గా సుమారు రూ. 10 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్టు తెలుస్తోంది.లైలా నిర్మాత సాహు గరపాటి సినిమాల గురించి చూస్తే.. మజిలీ, భగవంత్ కేసరి లాంటి హిట్లతో గుర్తింపు పొందారు. చిరంజీవి - అనిల్ రావిపూడి దర్శకత్వంలో భారీ సినిమా నిర్మించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. హీరో విష్వక్ సేన్ కూడా దర్శకుడు అనుదీప్‌తో ఒక సినిమా లైన్లో పెట్టేశాడు. దీని తరువాత భీమ్లా నాయక్ డైరక్టర్ సాగర్‌కు విశ్వక్ ఓకె చెప్పారు. -
బాయ్ కాట్ లైలా.. ఆ సినిమాపై చూపిన ప్రభావం ఎంత ?
-
Laila Review: ‘లైలా’ మూవీ రివ్యూ
టైటిల్: లైలానటీనటుటు: విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, పృథ్వీ రాజ్ తదితరులునిర్మాణ సంస్థ:షైన్ స్క్రీన్స్నిర్మాత: సాహు గారపాటిదర్శకత్వం: రామ్ నారాయణ్సంగీతం: జేమ్స్ లియోన్సినిమాటోగ్రఫీ:రిచర్డ్ ప్రసాద్విడుదల తేది: ఫిబ్రవరి 14యంగ్ హీరో విశ్వక్ సేన్ జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. సినిమా హిట్టా, ఫట్టా అన్నది పక్కన పెడితే..ఏడాదికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఈ మధ్యే మెకానిక్ రాకీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం విశ్వక్‌ని తీవ్ర నిరాశ పరిచింది. దీంతో ‘లైలా’పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘లైలా’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? విశ్వక్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. (Laila Movie Review)కథేంటంటే..సోను మోడల్(విశ్వక్ సేన్)(Vishwak Sen) హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లర్ రన్ చేస్తుంటాడు. ఆ చుట్టు పక్కల మహిళలకు సోను మోడల్ అంటే విపరీతమైన గౌరవం ఉంటుంది. తన కస్టమర్లను అందంగా రెడీ చేయడమేకాదు..కష్టం వచ్చినప్పడు ఆదుకుంటాడు కూడా. అలా ఓ కస్టమర్‌కి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఆమె భర్త చేస్తున్న ఆయిల్ బిజినెస్‌కి తన ఫోటో వాడుకోమని సలహా ఇస్తాడు. స్థానిక మహిళల భర్తలతో పాటు అక్కడి ఎస్సై శంకర్(పృథ్వీ)కి సోను అంటే నచ్చదు. మరోవైపు ఓల్డ్ సిటీలోనే మేకల బిజినెస్ చేసే రుస్తుం(అభిమన్యు సింగ్) కూడా సోనుపై పగ పెంచుకుంటాడు. ఓ సారి సోను చేయని నేరంలో ఇరుక్కుంటాడు. పోలీసులతో పాటు రుస్తుం మనుషులు కూడా అతని కోసం గాలిస్తారు. దీంతో సోను గెటప్ మార్చి లైలా(Laila Movie Review)గా మారుతాడు. అసలు సోనుపై వచ్చిన ఆరోపణలు ఏంటి? చేయని నేరంలో సోనును ఇరికించిందెవ్వరు? రుస్తుం సోను కోసం ఎందుకు గాలిస్తున్నాడు? లైలాగా మారిన తర్వాత సోనుకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. జెన్నీ(ఆకాంక్ష శర్మ)తో ప్రేమాయణం ఎలా సాగింది? చివరకు తనను తప్పుడు కేసులో ఇరికించిన వారిని లైలా ఎలా పట్టుకుంది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..‘కర్మలో కారం పొడి ఉంటే పళ్లెంలోకి పరమాన్నం ఎలా వస్తుంది’ అన్నట్లుగా.. కథలోనే కొత్తదనం లేనప్పుడు ఎన్ని ‘గెటప్’లు వేసినా డిఫరెంట్ సినిమా చూశామనే ఫీలింగ్ ఎలా వస్తుంది? లైలా సినిమా పరిస్థితి అలానే ఉంది. హీరోలు లేడి గెటప్పులు వేయడం కొత్త కాదు. కానీ మాస్ ఇమేజ్ ఉన్న విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరో లేడీ గెటప్ అనగానే..ఇదేదో డిఫరెంట్ చిత్రంలా ఉందే అనుకున్నారంతా. తీరా సినిమా చూశాక..‘గెటప్’లోనే కొత్తదనం.. అంతకు మించి ఏమి లేదు. లుక్ పరంగా లైలా కొంతవరకు బాగానే ఉంది కానీ, ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానంలోనే లోపం ఉంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అందించకుండా రొట్ట రొటీన్ సీన్లతో చాలా ‘జాగ్రత్త’గా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. ఆయన రాసుకున్న కామెడీ సీన్లను చూసి నిజంగానే ‘నవ్వుకుంటారు’. డబుల్ మీనింగ్ డైలాగ్స్ విని ‘జబర్దస్త్’లాంటి షోలను గుర్తు చేసుకుంటారు. అడల్ట్ కామెడీ ఉంటే చాలు సినిమా ఆడేస్తుందనుకున్నాడేమో.. ఫోకస్ అంతా దానిపైనే పెట్టాడు. కథలో సీరియస్ నెస్ లేదు..కామెడీలో కొత్తదనం లేదు. ఇక హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది.వాస్తవానికి ఈ సినిమాలో పేరుకే విశ్వక్ సేన్ హీరో. కానీ కీలక సన్నివేశాలన్నీ అభిమన్య సింగ్, సునిశిత్ పాత్రలతోనే ఉంటాయి. అభిమన్యు పాత్రకు విశ్వక్‌తో సమానంగా స్క్రీన్ స్పేస్ ఉంది. సునిశిత్ తెరపై కనిపించేది తక్కువే కానీ... కీలక సన్నివేశాల్లో ఆయనే కనిపిస్తాడు. ఇక హీరోయిన్ని అందాలను ప్రదర్శించడానికి తప్ప.. నటనకు స్కోప్ ఉన్న ఒక్క సీన్ రాసుకోలేదు. ఫస్టాఫ్ అంతా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా సాగుతుంది. సోను మోడల్ బ్యూటీ పార్లర్ పెట్టడానికి గల కారణాన్ని బలంగా చూపించలేకపోయారు. హీరోయిన్‌తో లవ్‌ట్రాక్ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఆయిల్ బిజినెస్, ఎస్సై శంకర్ ఎపిసోడ్ అనీ.. బోరింగ్‌గా సాగుతాయి. లైలా ఎంట్రీతో సెకండాఫ్‌పై కాస్త ఆసక్తి కలుగుతుంది. కానీ ఆ పాత్ర చుట్టు అల్లుకున్న కథ మళ్లీ రోటీన్‌గానే అనిపిస్తుంది. ఒకనొక దశలో లైలా పాత్రలో విశ్వక్‌ని చూడలేకపోతాం. ఇంటర్వెల్ సీన్‌తోనే సెకండాఫ్ ఎలా ఉంటుంది? క్లైమాక్స్ ఏంటనేది అర్థమైపోతుంది. ఫ్యామిలీతో కలిసి చూడలేని విధంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్, అడల్ట్ కామెడీ ఉంటుంది. పోని అది యూత్కైనా నచ్చేలా ఉంటుందా అంటే అదీ లేదు.మదర్ సెంటిమెంట్ రొటీన్‌గానే ఉన్నా .. కొంతవరకు ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. విశ్వక్ ఎప్పటిలాగే తన పాత్ర కోసం బాగానే కష్టపడ్డాడు. సోను మోడల్‌గా, లైలాగా రెండు విభిన్నమైన పాత్రలు పోషించి..తనదైన నటనతో వేరియేషన్ చూపించాడు. లైలా లుక్‌లో బాగున్నా.. నటనలో మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఇక హీరోయిన్ ఆకాంక్ష శర్మ జెన్నీ పాత్రకు ఉన్నంతలో న్యాయం చేసింది. అయితే ఆమెను నటన కంటే అందాల ప్రదర్శనకే ఎక్కువగా వాడేసుకున్నారు. రుస్తుం పాత్రలో అభిమన్యుసింగ్ చక్కగా నటించాడు. అతని కెరీర్లో ఇదొక డిఫరెంట్ పాత్ర. యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయిన సునిశిత్.. తన ఒరిజినల్ క్యారెక్టర్ని చేశాడు.కామాక్షి భాస్కర్ల డీ గ్లామర్ రోల్ చేశారు. సురభి ప్రభావతితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.జేమ్స్ లియోన్ సంగీతం జస్ట్ ఓకే. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. నేపథ్య సంగీతం కూడా ఆశించిన స్థాయిలో ఉండదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Laila Movie X Review: ‘లైలా’ మూవీ ట్విటర్ రివ్యూ
మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం ‘లైలా’(Laila Movie). ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూన్నారు. ‘లైలా సినిమా కథేంటి? ఎలా ఉంది? విశ్వక్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్‌లో ఈ సినిమాకు మిశ్రమ టాక్ వస్తుంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే..బాగోలేదని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు. కథలో కొత్తదనం లేదని.. విశ్వక్ సేన్ తప్ప సినిమా చెప్పుకోవడానికి ఏమి లేదని అంటున్నారు.#LailaMovie విశ్వక్ సేన్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి, చూడడానికి ఏమి లేదు. మరీ ముఖ్యంగా కథ, ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి కాలం నాటి స్టోరి.. స్ర్కీన్ ప్లే.. మ్యూజిక్ సో.. సో.. డైరక్షన్ 👎👎 @VishwakSenActor కష్టం వృథా అయింది… లేడి గెటప్ లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు.#Laila - 2/5 pic.twitter.com/q7QK9oqylP— తార-సితార (@Tsr1257) February 14, 2025‘లైలా సినిమాలో విశ్వక్ సేన్ తప్ప చెప్పుకోవడానికి, చూడడానికి ఏమి లేదు. మరీ ముఖ్యంగా కథ ఎప్పుడో పాత చింతకాయ పచ్చడిలా ఉంది. స్క్రీన్‌ప్లే, మ్యూజిక్ కూడా యావరేజ్, విశ్వక్ సేన్ కష్టం వృథా అయిపోయింది. లేడీ గెటప్‌లో విశ్వక్ బాగున్నాడు’ అంటూ ఓ నెటిజన్ 2 రేటింగ్ ఇచ్చాడు. Decent 1st Half, Sonu model killed with the characterization and some decent comedy scenes!! Expecting a huge comedy riot in 2nd Half😂❤️Pure @VishwakSenActor Domination !!#Laila pic.twitter.com/zw8EzBxzZv— Shiva Akunuri (@AkunuriShivaa) February 13, 2025 ఫస్టాఫ్ డీసెంట్‌గా ఉంది. సోనూ మోడల్ పాత్ర అందరిని ఆకట్టుకుటుంది. కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. సెకండాఫ్‌లో ఎక్కువ కామెడీ ఆశిస్తున్నా. ఇప్పటి వరకు విశ్వక్ సేన్ ఒక్కడే అందరిని డామినేట్ చేశాడు’ అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.#Laila Roddest movie in #VishwakSen career! Not one positive scene. Cringey comedy scenes, full double and vulgar dialogues and horrendous story. Contender for the worst Telugu movie ever made. How did he agree to this. Epic disaster! 0.25/5 pic.twitter.com/t8xPnnj1hX— AllAboutMovies (@MoviesAbout12) February 14, 2025 విశ్వక్ కెరీర్లో రాడ్ మూవీ లైలా. ఒక్క పాజిటివ్ సీన్ కూడా లేదు. క్రింజ్ కామెడీ సీన్స్, డబుల్ మీనింగ్, వల్గర్ డైలాగ్స్ తప్ప కథేమి లేదు. విశ్వక్ ఈ స్టోరీని ఎలా ఒప్పుకున్నాడో తెలియదు అంటూ మరో నెటిజన్ 0.25 రేటింగ్ ఇచ్చాడు.🙆🙆🙆🙆🙆#Laila is a complete disappointment, lacking a single memorable scene.Total movie 👎Chapri scenes and cringe comedy ULTRA DISASTER MOVIE 😭🤦🙏👎👎 pic.twitter.com/O3h4D4C3id— TollywoodGozzip (@TollywoodGozzip) February 14, 2025 లైలా నిరుత్సాహపరిచింది.గుర్తించుకునేలా ఒక్క సన్నివేశం కూడా లేదు. క్రింజ్ కామెడీ, వల్గర్ సన్నివేశాలు మినహా చెప్పుకోవడానికి ఏమి లేదు. అల్ట్రా డిజాస్టర్ మూవీ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.Pure GUTS! @VishwakSenActor has NAILED the lady getup role, showcasing CLASS ACTING! 🔥🔥🔥🔥🔥 A one-man show, Babu! 👌👌🫡🫡 #Laila #MassKadas pic.twitter.com/eE1hxxuvsV— kiran (@abburi_k) February 13, 2025 విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో అదరగొట్టేశాడు. క్లాస్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. లైలా కంప్లీట్‌గా విశ్వక్ వన్ మ్యాన్ షో. సినిమా బాగుంది అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.#Laila - A clueless film where everything from writing to direction to music to actors' performances failed. A bad first half followed by a pretty bad second half made the film a forgettable outing for Vishwak Sen and the team. #Laila pic.twitter.com/4ukkOWJ1wR— Prashanth VK 18 (@PrashanthSSMB28) February 14, 2025#Laila - పూర్తిగా దారి తప్పిన సినిమా 2/5 లైలా అనే సినిమా కథా రచన నుండి దర్శకత్వం, సంగీతం, నటుల అభినయం వరకు ప్రతీ అంశంలో విఫలమైంది. సినిమా చూసేంతసేపూ ఏదైనా ఆసక్తికరమైన సన్నివేశం వస్తుందా అని ఎదురుచూసినా, అసలు ఎక్కడా కూడా కథ పట్టుదలగా కొనసాగలేదు.మొదటి భాగం పూర్తిగా అర్ధరహితమైన… https://t.co/UGMETZ3vx2— TollywoodRulz (@TollywoodRulz) February 14, 2025#LailaReview:Positives:• Vishwak Sen’s performance in parts 👍• BGM & a few comedy scenes 👍• Beauty parlour setup 👍Negatives:• Lackluster Direction & Screenplay • Outdated Story• Zero impactful Scenes• Senseless Comedy • Poorly written characters & villains…— Movies4u Official (@Movies4u_Officl) February 13, 2025#LAILA : A DECENT ONE WITH MASS KA DASS OUTSTANDING PERFORMANCE 💥💥🔥🔥🔥❤️🔥❤️🔥Mainly @VishwakSenActor is the BIGGEST PLUS FOR THIS FILM 🎥 ON SCREENS SONGS ARE SUPERB 👌With GOOD PRODUCTION VALUES ❤️🔥❤️🔥❤️🔥💥💥👍👍ENTERTAINMENT WORKED OUT 👍👌Our Rating : 2.75/5 👍👍💥… pic.twitter.com/8r3NAouTk5— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) February 14, 2025 -
Prudhvi Raj: అందరికీ క్షమాపణలు.. బాయ్‌కాట్ లైలా కాదు ఇకపై వెల్కమ్ లైలా..
-
క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్.. ఈ బుద్ధి ముందుండాలి!
లైలా సినిమా (Laila Movie) ఈవెంట్లో నోటిదురుసు ప్రదర్శించి విమర్శలపాలయ్యాడు నటుడు పృథ్వీరాజ్. అతడి చవకబారు వ్యాఖ్యలపై సోషల్ మీడియా భగ్గుమంది. లైలా సినిమాను బహిష్కరించాలన్న డిమాండ్ మొదలైంది. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అతడు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపాడు.వ్యక్తిగతంగా తనకు ఎవరి మీదా ద్వేషం లేదని, తన వల్ల సినిమా దెబ్బతినకూడదని అందరికీ క్షమాపణలు చెప్తున్నానన్నాడు. సినిమాను చంపొద్దని వేడుకున్నాడు. బాయ్‌కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అనాలని సూచించాడు. ఫలక్‌నుమాదాస్ కంటే లైలా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించాడు. ఇది చూసిన జనాలు.. ఇప్పటికైనా పృథ్వీ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఈ బుద్ధేదో ముందే ఉండుంటే గొడవ ఇక్కడిదాకా వచ్చేదికాదుగా అని గట్టి పెడుతున్నారు.విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన లైలా మూవీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తోంది.చదవండి: సుకుమార్ ఇంట వ్రతం.. ఫోటోలు షేర్ చేసిన తబిత -
చీర, హై హిల్స్ వేసుకొని ఫైట్ చేశా: విశ్వక్ సేన్
‘ఆర్టిస్ట్ గా కొన్ని పాత్రలు చేయాలని ప్రతి నటుడికి ఉంటుంది. భామనే సత్యభామనే, మేడం, చిత్రం భళారే విచిత్రం, రెమో సినిమాలు చూసినప్పుడు ఆర్టిస్టుగా ఇలాంటి గెటప్ చేయాలని ఉండేది. అలాగే ఆడియన్స్ ఇప్పుడు కొత్త కథలని, థీమ్స్ ని కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమాలురాక దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతుంది. ఈ జనరేషన్ లో ఒక హీరో అమ్మాయి పాత్ర వేయడం గత 20 ఏళ్లుగా మనం చూడలేదు. ఆ లోటుని భర్తీ చేయాలని ఒక మంచి కథ రావడంతో ‘లైలా’ చేయడం జరిగింది’ అని అన్నారు హీరో విశ్వక్ సేన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘లైలా’. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విశ్వక్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ తొలిసారి ఈ సినిమా కోసం లేడీ గెటప్ వేశాడు. మెకప్కే దాదాపు రెండున్నర గంటల సమయం పట్టేది. మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు.చాలా నేచురల్ గా వచ్చింది. → లైలా క్యారెక్టర్ లో ఫైట్ కూడా చేశాను. చీర, హై హిల్స్ లో ఫైట్ ఎంత కష్టంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. దాన్ని ఒక స్టైల్ లో చేసాము. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.→ లైలా పాత్రతో పాటు సోను మోడల్ క్యారెక్టర్ కూడా అందరికి నచ్చుతుంది. పబ్లిసిటీలో లైలా డామినేట్ చేస్తుంది. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మాత్రం సోను క్యారెక్టర్ ని కూడా చాలా ఇష్టపడతారు. ఫస్ట్ హాఫ్ లో సోను మోడల్ లైఫ్ స్టైల్ ని తన క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేస్తారు.→ డైరెక్టర్ కథ చెప్పినంత సేపు విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి నవ్వులు జనాలకి ఎందుకు ఇవ్వకూదని అనిపించింది. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ చాలా సీరియస్ గానే వింటాను. కానీ ఈ కథ విన్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. ఇది అడల్ట్ సినిమా కాదు. యూత్ ఫుల్ కంటెంట్‌తో తెరకెక్కించాం. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్.→ ఈ సినిమాకి లిరిక్స్ రాశాను.‘మొహమాటం ఏమీ లేదు. నేను రాస్తాను. బాగుంటే పెట్టుకోండి ’అని డైరెక్టర్ తో చెప్పాను.ఆయనకిపెట్టడం జరిగింది. నాకు రాయడం ఇష్టం.→ లైలా గెటప్ లో నన్ను చూసి ఇంట్లో వాళ్లు చాలా ఎంజాయ్ చేశారు. నవ్వులు వెక్కిరింతలు అన్నీ జరిగాయి. మా అక్క మమ్మీ మ్యాచింగ్ చీరలు కట్టుకొని షూటింగ్‌కి వచ్చారు(నవ్వుతూ..)→ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన చిరంజీవి గారు.. లైలాని చూడగానే నాకే కొరకాలనిపిస్తుందని' చెప్పడం బెస్ట్ కాంప్లిమెంట్. లైలా నా కెరీర్ లో గుర్తిండిపోయే సినిమా అవుందనే నమ్మకంతో చేశాను.→ లైలాని బిగ్ స్క్రీన్ పైనే చూడాలి. అయితే లైలా గెటప్ మళ్ళీ వెయ్యాలని ఉంది. ఇందులో సీక్వెల్ కి పనికొచ్చే మంచి క్లిప్ హ్యంగర్ సీన్ ఉంది. మంచి రెస్పాన్స్ వస్తే సెకండ్ వీక్ లో యాడ్ చేస్తాం. -
హీరోని వెతకడం సవాల్‌గా అనిపించింది: రామ్ నారాయణ్
‘‘లైలా’(laila) చిత్రకథని ఇద్దరు ముగ్గురు యువ హీరోలకి చెప్పా. కథ వారికి నచ్చినప్పటికీ లైలా అనే లేడీ గెటప్ వేసేందుకు ఆసక్తి చూపలేదు. ఈపాత్ర చేయడానికి చాలా ధైర్యం కావాలి. అందుకే హీరోని వెతకడం సవాల్‌గా అనిపించింది. నిర్మాత సాహుగారికి ఈ కథ బాగా నచ్చి, విశ్వక్ సేన్‌గారికి చెప్పమని సలహా ఇచ్చారు. విశ్వక్‌గారు కథ వినగానే.. ఇలాంటి లేడీ గెటప్ వేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను.మనం ఈ సినిమా చేస్తున్నాం అన్నారు’’ అని డైరెక్టర్ రామ్ నారాయణ్(Ram Narayan) చెప్పారు. విశ్వక్ సేన్(Vishwak Sen), ఆకాంక్షా శర్మ జంటగా నటించిన చిత్రం ‘లైలా’. సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ నారాయణ్ మాట్లాడుతూ– ‘‘‘బట్టల రామస్వామి బయోపిక్, దిల్ దివాన, ఉందిలే మంచి కాలం’ సినిమాలకు మ్యూజిక్ చేశాను.దర్శకుడిగా నా తొలి చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్’ (2021) మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత ఓ యునిక్ స్టోరీగా ‘లైలా’ రాశా. హీరో లేడీ గెటప్ వేయడం వంటి చిత్రాలు ఈ మధ్య రాలేదు. ఆ నేపథ్యంలో వస్తున్న వినోదాత్మక చిత్రమిది. ఇందులో సోను మోడల్, లైలాగా విశ్వక్ నటించారు. ఈ చిత్రంలో ఎమోషన్, యాక్షన్, రొమాన్స్... ఇలా అన్నీ ఉన్నాయి’’ అని చెప్పారు. -
మీ అందరికీ క్షమాపణలు.. మా సినిమాతో అతనికి సంబంధం లేదు: విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా లైలా టీమ్ హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈవెంట్లో టాలీవుడ్ నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. దీంతో ఆయన చేసిన కామెంట్స్‌పై లైలా చిత్రబృందం స్పందించింది. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి క్షమాపణలు చెప్పారు. మా ఈవెంట్లో జరిగినందువల్లే మేము క్షమాపణలు చెబుతున్నట్లు విశ్వక్ సేన్ వెల్లడించారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన లైలా మూవీ టీమ్ టాలీవుడ్ నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చారు.విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తి మాట్లాడిన వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. పృథ్వీ మాట్లాడిన విషయం మాకు తెలీదు. ఎందుకంటే నా ఈవెంట్లో జరిగినందువల్లే మీ అందరికీ సారీ చెబుతున్నా. అతను నటించాడు సినిమాలో. రెండు రోజుల్లో మా సినిమా జనాల్లోకి వెళ్తోంది. కానీ నా సినిమాను చంపేయకండి. ఏ వ్యక్తితో మాట్లాడి మేము ఈ విషయాన్ని లాగదలుచుకోవడం లేదు. సపోర్ట్ లైలా అంతే. అతను మాట్లాడిన దానికి.. మా సినిమాకు సంబంధం లేదు. సినిమా ఈవెంట్లో పాలిటిక్స్, నంబర్స్ గురించి మాట్లాడటం తప్పే. చాలా కష్టపడి సినిమా తీశాం. నేను ఈ వివాదం ఇంతటితో ముగిస్తున్నా. మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దంటూ' అభిమానులకు విజ్ఞప్తి చేశారు.నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో బాయ్‌కాట్ లైలా ట్రెండ్ అవ్వడం చూసి షాక్‌కు గురయ్యాం. అది మాకు తెలిసి జరగలేదు. సినిమాని అందరూ సినిమాగా చూడండి. గెస్ట్లుగా వచ్చిన వాళ్లు ఏమి మాట్లాడతారో మాకు తెలీదు' అని అన్నారు.పాలిటిక్స్ నంబర్స్ గురించి మాట్లాడటం తప్పే.. దానికి నేను క్షమాపణ చెప్తున్నా 🙏 - Mass Ka Das #VishwakSen#Laila #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/Ug5vuKKySM— Telugu FilmNagar (@telugufilmnagar) February 10, 2025 -
బాలయ్య కాంపౌండ్‌లోకి చిరు?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సాధారణంగా వివాదాస్పద అంశాల జోలికి పోరు. సందర్భం ఏదైనా సరే ఆయన ప్రసంగాలు ఎప్పుడూ చాలా సెన్సిబుల్‌గా, ఆలోచింపజేసేవిగా ఉంటాయి. తన వయసుకు తగ్గట్టుగా, సినీ పరిశ్రమలోని యువతరానికి దిశానిర్ధేశ్యం చేసే విధంగా మాట్లాడడానికే ఆయన ఇటీవల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. గత కొంత కాలంగా చిన్నా పెద్దా తేడా లేకుండా ఆయన యువ హీరోల ప్రీ రిలీజ్లు, ఆడియో రిలీజ్లు, జర్నలిస్ట్‌ల బుక్ రిలీజ్లు... ఇలా వీలైనన్ని కార్యక్రమాలకు హాజరవుతూ వారిని ఆశీర్వదిస్తూ ప్రస్తుతం పరిశ్రమకు పెద్ద దిక్కు లేని లోటు తీరుస్తున్నారు. నిజానికి సుదీర్ఘ సినీ ప్రయాణం చేసిన చిరంజీవి లాంటి సీనియర్ నటులు ఎవరైనా చేయాల్సిన పని అదే. మరీ ముఖ్యంగా ఎవరి అండా లేకుండా ఎన్నో కష్టనష్టాలు, వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని ఎన్నెన్నో ఎత్తుపల్లాలు చూసిన చిరంజీవి లాంటి వారి మార్గదర్శకత్వం యువ తరానికి ఎప్పుడూ కావాల్సిందే అనడంలో సందేహం లేదు.నిన్నటి తరం హీరోలు ఆ విధంగా నేటి తరాన్ని గైడ్ చేయడం ఎంతైనా అవసరం. అందుకు తగిన సత్తా, అందుకు తగినంత అనుభవం...వీటన్నింటినీ మించి నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా ఉండే స్వభావం వల్ల చిరంజీవి మాత్రమే అందుకు అర్హులు కూడా. ఆయనతో సమకాలీకుడైనప్పటికీ బాలకృష్ణ లో ఆ పాత్ర పోషించగల నేర్పు, ఓర్పు లేవు. ఆయనకు ఉన్న నోటి దురుసుతనం కావచ్చు, ప్రసంగాల్లో అపరిపక్వత కావచ్చు... ఆయన యువతరానికి మార్గదర్శకత్వం వహించడానికి నప్పరు. ఇక వెంకటేష్, నాగార్జునలకు సైతం ఆ శక్తి, ఆసక్తి కూడా లేవు కాబట్టి వారు చేయలేరు...చేయరు. ఈ పరిస్థితుల్లో పరిశ్రమకు పెద్ద సంఖ్యలో వస్తున్న యంగ్ టాలెంట్‌కు చిరంజీవి మాటలు శిరోధార్యంగా అనిపిస్తాయి.అయితే ఇంతటి బాధ్యతను అప్రయత్నంగానే తలకెత్తుకున్న చిరంజీవి ప్రసంగాలు ప్రవర్తన ఇటీవల దారి తప్పుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. తాజాగా లైలా(Laila Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్లో అసలు ఈయన చిరంజీవేనా లేక బాలయ్యగా మారిపోయారా అన్నట్టుగా ప్రవర్తించారు. సినిమాలో విష్వక్సేన్ పాత్ర గురించి చెబుతూ అమ్మాయి గెటప్‌లో అందంగా ఉన్నాడు అని చెప్పి సరిపెట్టకుండా పదే పదే భలే ఉన్నాడు బుగ్గ కొరికేయాలని అనిపించింది మగవాళ్ల మనసు దోచుకుంటాడు... అంటూ బబర్థస్త్ కామెడీకి తీసిపోకుండా మాట్లాడడం ఆశ్చర్యకరం. అలాగే ఆ సినిమా హీరోయిన్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా చిరంజీవి స్పందించిన విధానం ఆయన నైజానికి విరుద్ధంగా కనిపించింది. ఆమెతో నాతో చేయి కలిపావుగా ఇక గుర్తుండిపోతావు, థాంక్యూ అంటూ అనడం, ఇక సుమను లండన్‌కు తీసుకెళతానంటూ సందర్భం లేకుండా మాట్లాడడం... ఆయన స్థాయికి తగ్గట్టుగా అనిపించదు.ఈ ఈవెంట్ ప్రారంభంలో తాను బాలయ్య కాంపౌండ్ హీరో అయిన విష్వక్సేన్ సినిమా వేడుకకు రావడం గురించి వినిపించిన వ్యాఖ్యానాలపై చిరంజీవి మాట్లాడారు. పరిశ్రమ మొత్తం ఒకే కుటుంబం అంటూ చెప్పుకొచ్చారు. ఆ సంగతి ఎలా ఉన్నా... ఈ ఫంక్షన్లో ఆయన తీరు చూస్తే... ఆయన కూడా బాలయ్య కాంపౌండ్‌లో చేరిపోయారా అన్నట్టుగా ఉందని కొందరు సినీజీవులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి తాను పోషిస్తున్న పెద్దన్న పాత్రకు వన్నె తెచ్చే విధంగా తన ప్రవర్తనను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. -
‘లైలా’ ప్రీ రీలిజ్ ఈవెంట్ మెరిసిన ఆకాంక్ష శర్మ (ఫొటోలు)
-
‘లైలా’ మెగా మాస్ ఈవెంట్ ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
-
లేడీ గెటప్‌లో అదరగొట్టిన విశ్వక్ సేన్ ‘లైలా’మూవీ HD (ఫొటోలు)
-
విశ్వక్ సేన్ 'లైలా'మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'మా మధ్య కాంపౌండ్స్ వేయకుర్రి'.. విశ్వక్ సేన్ అదిరిపోయే రిప్లై
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున అభిమానులను పలకరించనున్నారు. విశ్వక్ విభిన్నమైన పాత్రతో ఫ్యాన్స్‌ను అలరించనున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు.అయితే ఈవెంట్లో విశ్వక్ సేన్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. మీరు ఈవెంట్స్కైనా నందమూరి హీరోలను పిలుస్తుంటారు కదా? సడన్‌గా మెగాస్టార్(బాస్)ను పిలిచారు? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి విశ్వక్ సేన్ తనదైన స్టైల్లోనే అదిరిపోయే సమాధానం ఇచ్చారు. మాకు ఉన్నది ఒక్కటే కాంపౌండ్ అని విశ్వక్ సేన్ స్పష్టం చేశారు. మీరే మా మధ్య ఏదేదో సృష్టించవద్దని కోరారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ..' మా మధ్యలో కాంపౌండ్లు వేసేది మీరే. మాకు ఉన్నది ఇంటి కాంపౌండ్ ఒక్కటే. ఇక్కడ కంపౌండ్ లాంటివి ఏం లేవు. ఇండస్ట్రీ అంతా ఒక్కటే. బాస్ ఇజ్ బాస్. ప్రతిసారి వారిని ఇబ్బంది పెట్టి మా ఈవెంట్స్‌కు పిలవం కదా. మా నాన్న గారికి రాజకీయాల నుంచి చిరంజీవితో పరిచయం ఉంది. ఆ టైమ్‌లో మా డాడీ మలక్‌పేట్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నా చిన్నప్పటి నుంచి వారి మధ్య మంచి రిలేషన్ ఉంది. కానీ మీరు వచ్చి ఇక్కడ లేనీ పోనీ కాంపౌండ్స్ వేయకండి. మీరు వచ్చి మధ్యన లేనివీ సృష్టించకండి. ఇండస్ట్రీలో ఎప్పటికైనా మేమంతా ఒక్కటే. మేము మంచి ఉద్దేశంతో సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు వారిని పిలుస్తాం. అంతే తప్ప ఇక్కడ అలాంటివే ఉండవు. మీరొచ్చి దాంటో ఏమీ వేయకుర్రి ' అని కాస్తా గట్టిగానే బదులిచ్చారు. రిపోర్టర్: ఏ EVENT కి అయినా నందమూరి HEROS ని పిలుస్తారు.. ఈసారి #Chiranjeevi గారు ఎందుకు?#VishwakSen: మీరు COMPOUND అనకండి.. నాకున్నది మా ఇంటి COMPOUND మాత్రమే.. #Laila #NandamuriBalakrishna #JrNTR #TeluguFilmNagar pic.twitter.com/a6NQeMjo9j— Telugu FilmNagar (@telugufilmnagar) February 6, 2025 -
విశ్వక్ సేన్ 'లైలా'.. ట్రైలర్ వచ్చేసింది
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం లైలా. ఈ మూవీ లేడీ పాత్రలో అభిమానులను అలరించనున్నాడు మన యంగ్ హీరో. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం రోజున థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో లైలా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది. ట్రైలర్ చూస్తే అభిమానులకు ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఖాయంగా కనిపిస్తోంది. లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ నటన అద్భుతమైన ఫర్మామెన్స్తో ఆకట్టుకున్నాడు. ఈ ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఫ్యాన్స్‌ను అలరించనుంది. సోనూ మోడల్‌గా మాస్ కా దాస్ అభిమానులకు లవర్స్ డే రోజున అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు. ఇంకేందుకు ఆలస్యం లైలా కోసం వెయిట్ చేస్తున్న మజ్నులంతా ట్రైలర్ చూసేయండి. The fun and humor will go to the next level with Laila and Sonu Model 💥💥💥The entertaining #LailaTrailer out now ❤🔥▶️ https://t.co/ytb4SlU2qV#Laila GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th 🌹 @RAMNroars #AkankshaSharma @sahugarapati7 @Shine_Screens @leon_james… pic.twitter.com/Pf9QSZOfnn— VishwakSen (@VishwakSenActor) February 6, 2025 -
‘లైలా’గా రెడీ కావడానికి రెండు గంటలు పట్టేది : విశ్వక్ సేన్
‘‘నా కెరీర్లో యాక్షన్ టచ్‌తో రూపొందిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఫ్యామిలీ ఫిల్మ్ ‘లైలా’. చాలా క్లీన్‌గా ఉంటుంది. ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కోసం లైలాగా రెడీ కావడానికి రెండు గంటలు పట్టేది. నిజంగా అమ్మాయిలకు హ్యాట్సాఫ్ చెప్పాలి’’ అని హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) అన్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, ఆకాంక్షా శర్మ జంటగా నటించిన చిత్రం ‘లైలా’( Laila). సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘ఇచ్చుకుందాం బేబీ...’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు. పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటని ఆదిత్య ఆర్కే, ఎంఎం మానసి ఆలపించారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘లైలా’లో మోడల్ సోనూ, లైలా అనే రెండు పాత్రల్లో నటించా. వాలెంటైన్స్ డే కి సింగిల్స్ తమకు ఎవరూ లేరని బాధపడుతుంటారు. ఈ వాలెంటైన్స్ డే కి మీకు లైలా ఉంది. అమ్మాయిలు సింగిల్ అని అనుకుంటే మీకు సోను మోడల్ వున్నాడు.(నవ్వుతూ). మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఫిబ్రవరి 14కి కలుద్దాం’ అన్నారు. ‘‘లైలా’ కథ ఇద్దరు ముగ్గురు హీరోలకు చెప్పాను. లేడీ గెటప్ వేయడం అంత ఈజీ కాదు. సినిమా అంటే పిచ్చి ఉంటేనే చేయగలరు. అలాంటి పిచ్చి ఉన్న విశ్వక్ దొరికారు’’ అని రామ్ నారాయణ్ చెప్పారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. రామ్ కథ చెప్పిన తర్వాత కొందరు హీరోలకు అప్రోచ్ అయ్యాను. లేడి క్యారెక్టర్ ని చేయగలుగుతామా లేదా అనుకునే టైంలో విశ్వక్ ఇలాంటి క్యారెక్టర్ కోసం తను ఎదురుచూస్తున్నాని చెప్పి సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇది మంచి క్యారెక్టర్ గా తన కెరీర్ లో నిలిచిపోతుంది. యూత్ ట్యాలెంట్ తో ఈ సినిమా కోసం పని చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.లిరిక్ రైటర్ పూర్ణచారి మాట్లాడుతూ... ధమ్కి లో ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ నేనే రాశాను, అది వంద మిలియన్స్ కొట్టింది. ఇప్పుడీ ఈ సాంగ్ కి రెండు వందల మిలియన్స్ కి మించి రావాలని కోరుకుంటున్నాను. ఈ పాట రాసే అవకాశం ఇచ్చిన విశ్వక్ గారికి, నిర్మాత సాహు గారికి, డైరెక్టర్ రామ్ గారికి థాంక్ యూ. ఈ సినిమాని పెద్ద చేస్తారని కోరుకుంటున్నాను' అన్నారు -
విశ్వక్ సేన్ 'లైలా' సినిమా పాట విడుదల (ఫొటోలు)
-
ఆ ఫోటోను దేనికి పడితే దానికి వాడకండి: విశ్వక్ సేన్ విజ్ఞప్తి
మాస్ కా దాస్ 'విశ్వక్ సేన్ మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఏడాది లవర్స్ డే కానుకగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్తో అభిమానులను పలకరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇచ్చుకుందాం బేబీ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను విశ్వక్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీలో తన పాత్ర గురించి మాట్లాడారు. ముఖ్యంగా అమ్మాయి గెటప్‌లో ఉన్న ఫోటోను దేనికి పడితే దానికి వాడకండి అని అభిమానులకు సలహా ఇచ్చారు. పర్లేదు.. కత్తిలా ఉందని పొగిడి కామెంట్ చేసి అక్కడికి వదలేయండి అంటూ నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.కాగా.. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.#Vishwaksen about #Laila Make-over 😂🖤 pic.twitter.com/2BQYHIq1po— Rebel 🦁 (@Setti_Tweetz) January 23, 2025 -
విష్వక్ సేన్ 'లైలా' సాంగ్ రిలీజ్.. ప్రత్యేకత ఎంటో తెలుసా..?
మాస్ కా దాస్ 'విష్వక్ సేన్' వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తన కొత్త సినిమా 'లైలా' నుంచి అదిరిపోయే సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలా మూవీకి దర్శకత్వం వహించే భాద్యత కొత్తవారికి ఇవ్వడంతో విష్వక్పై ప్రశంసలు వచ్చాయి. దర్శకుడిపై హీరో పెట్టకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ.. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఇప్పుడు 'సోను మోడల్' అంటూ సాగే ఈ పాటకు విష్వక్ లిరిక్స్ ఇవ్వడం ప్రత్యేకంగా నిలిచింది. అందుకు తగినట్లు నారాయణన్ రవిశంకర్, రేష్మా శ్యామ్ ఆలపించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి లైలా రానుంది. -
చెప్పిన సమయానికే వస్తున్న లైలా.. రిలీజ్ ఎప్పుడంటే?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల మెకానిక్ రాకీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ లైలా రిలీజ్‌కు రెడీ అవుతోంది. సోమవారం చిత్రయూనిట్ లైలా విడుదల తేదీ ప్రకటించింది. మాస్ కా దాస్‌ను సరికొత్త అవతారంలో చూడనున్నారు. ఈ ప్రేమికుల దినోత్సవానికి లైలా మీ ముందుకు వచ్చేస్తోంది. 2025లో ఫిబ్రవరి 14న లైలా విడుదల కానుంది అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.రామ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. ఆకాంక్ష శర్మ కథానాయికగా నటిస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్లోనూ కనిపించనున్నాడు. ఇకపోతే విశ్వక్.. జాతిరత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్‌తో ఫంకీ సినిమా చేస్తున్నాడు. MASS KA DAS in never seen before AVATARS 😎This Valentine's Day, it's going to be an entertaining blast in theatres 💥#Laila GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 14th ❤🔥First Rose of Laila out for New Year 2025 🌹#LailaFromFeb14'Mass Ka Das' @VishwakSenActor… pic.twitter.com/ZprdOvH3kN— Shine Screens (@Shine_Screens) December 16, 2024చదవండి: ఆరు ఐటం సాంగ్స్ పెట్టమన్నారు.. ఇప్పటికీ ఏం మారలేదు! -
లైలాగా టాలీవుడ్ హీరో.. హీరోయిన్లే కుళ్లుకునేలా..
ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నిలదొక్కుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. ఐదేళ్ల క్రితం ఫలక్‌నుమా దాస్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈయన తర్వాత ఎన్నో రకాల ప్రయోగాలు చేశాడు. యాటిట్యూడ్ చూపించే విశ్వక్ కేవలం మాస్ సినిమాలకే సెట్టవుతాడన్న అభిప్రాయాలను అశోకవనంలో అర్జున కల్యాణం మూవీతో తప్పని రుజువు చేశాడు. లైలాగా మారిన హీరోఈ ఏడాది గామితో హిట్ కొట్టి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పర్వాలేదనిపించిన ఈ హీరో తాజాగా సరికొత్త ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాడు. ఇందులో లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. ఈ మూవీకి లైలా అనే టైటిల్ ఖరారు చేశారు. బుధవారం ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా ఆకాంక్ష శర్మను హీరోయిన్గా తీసుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం నాడు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫస్ట్ లుక్ రిలీజ్ఈ మేరకు రిలీజ్ డేట్‌తో కూడిన ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్ కళ్లు మాత్రమే చూపించారు. ఇది చూసిన నెటిజన్లు హీరోయిన్లు సైతం కుళ్లుకునేంత అందంగా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ నిర్మించనుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.చదవండి: కన్నబిడ్డను కాటికి పంపించాలనుకున్నా: పాకిస్తాన్ నటి