'లైలా' కలెక్షన్స్‌.. విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌ | Vishwak Sen Laila Movie Collections | Sakshi
Sakshi News home page

'లైలా' కలెక్షన్స్‌.. విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌

Published Tue, Feb 18 2025 8:01 AM | Last Updated on Tue, Feb 18 2025 9:06 AM

Vishwak Sen Laila Movie Collections

లైలా సినిమా విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. చిత్రపరిశ్రమలో మినిమమ్‌ గ్యారెంటీగా విశ్వక్‌ సినిమాలకు రిటర్న్స్‌ వస్తాయని నిర్మాతలు నమ్ముతారు. అందుకే ఆయన ఏడాదికి సుమారు నాలుగు చిత్రాలు చేయగలుగుతున్నాడు. అయితే, నటుడు పృథ్వీరాజ్‌ లైలా ఈవెంట్‌లో చేసిన రాజకీయ కామెంట్లు లైలాకు తీరని నష్టాన్ని మిగిల్చింది. అతగాడి చవకబారు వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా భగ్గుమంది. ఫైనల్లీ పృథ్వీరాజ్‌ లెంపలేసుకున్నా ఫలితం లేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

లైలా కోసం లేడీ గెటప్‌తో విశ్వక్‌ సేన్‌ ప్రేక్షకులను మెప్పించాడు. తెరపై తన నటన గురించి పేరు పెట్టాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్ర  ఉన్నా సరే ఈజీగా చేసేస్తాడు. లైలా విజయం కోసం ఆయన తీవ్రంగానే కష్టపడ్డాడు. రకరకాల ప్రమోషన్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ సమయంలో మార్కెట్‌లో పెద్ద సినిమా కూడా లేదు. ఈజీగా బాక్సాఫీస్‌ వద్ద లైలా సందడి ఉంటుందని అందరూ అంచనా వేశారు. కేవలం  పృథ్వీరాజ్‌ వ్యాఖ్యలతో నిర్మాతకు తీరని నష్టాన్ని మిగిల్చింది.

ఫిబ్రవరి 14న విడుదలైన లైలా ఇప్పటి వరకు రూ. 3 కోట్ల కలెక్షన్స్‌ మాత్రమే రాబట్టింది. విశ్వక్ సేన్ కెరీర్‌లోనే అతి తక్కువ వసూళ్లు సాధించిన సినిమా ఇదే కావడం విశేషం. నిర్మాతకు కూడా భారీగా నష్టాన్ని తెచ్చిపెట్టింది.  శని, ఆదివారాల్లో అయినా బాక్సాఫీస్‌ వద్ద కోలుకుంటుందని మేకర్స్ భావించారు. కానీ వీకెండ్‌లో చాలా చోట్ల షోలు రద్దయ్యాయి. దీంతో లైలా ప్రయాణం దాదాపు ముగిసిపోయింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా కొంత మేరకు లాస్ కవర్ చేసుకున్నా కూడా నిర్మాతకు థియేట్రికల్‌గా సుమారు రూ. 10 కోట్లకు పైగానే నష్టం వచ్చినట్టు తెలుస్తోంది.

లైలా నిర్మాత సాహు గరపాటి సినిమాల గురించి చూస్తే..  మజిలీ, భగవంత్ కేసరి లాంటి హిట్లతో గుర్తింపు పొందారు. చిరంజీవి - అనిల్ రావిపూడి దర్శకత్వంలో భారీ సినిమా నిర్మించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. హీరో విష్వక్ సేన్ కూడా దర్శకుడు అనుదీప్‌తో ఒక సినిమా లైన్‌లో పెట్టేశాడు. దీని తరువాత భీమ్లా నాయక్ డైరక్టర్ సాగర్‌కు విశ్వక్‌ ఓకె చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement