
ఒకప్పటి హీరోయిన్ లైలా చాన్నాళ్ల తర్వాత రీసెంట్ గా మీడియా ముందుకొచ్చింది. తాను నటించిన 'శబ్దం' ప్రమోషన్లలో పాల్గొంది. తన గురించి బోలెడన్ని విషయాల్ని పంచుకుంది. ఈ క్రమంలోనే తనకు అరుదైన వ్యాధి ఉందని చెప్పి అందరికీ షాకిచ్చింది.
గోవాకు చెందిన లైలా.. 1996-2006 మధ్య కాలంలో తెలుగు, తమిళ భాషల్లో వరస సినిమాలు చేసింది. ఎగిరే పావురమా, పెళ్లి చేసుకుందాం, ఉగాది, ఖైదీ గారు, పవిత్రప్రేమ, లవ్ స్టోరీ 1999, శుభలేఖలు, నా హృదయంలో నిదురించే చెలి, శివపుత్రుడు తదితర చిత్రాల్లో నటించింది.
(ఇదీ చదవండి: సింగర్ కల్పనకు ఏమైంది? పోలీసుల అదుపులో భర్త)
2006లో ఇరానియన్ బిజినెస్ మ్యాన్ మెన్ మెహ్దినీని పెళ్లిచేసుకున్న తర్వాత పూర్తిగా నటనకు దూరమైంది. రీసెంట్ టైంలో కార్తి 'సర్దార్', విజయ్ 'ద గోట్' చిత్రాల్లో నటించింది. తాజాగా 'శబ్దం' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ చిత్ర ప్రమోషన్లలో తన నవ్వు వ్యాధి గురించి బయటపెట్టింది.
తాను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటానని, ఒక్క నిమిషం దాన్ని ఆపితే వెంటనే కన్నీళ్లు వచ్చేస్తాయని లైలా చెప్పింది. 'శివపుత్రుడు' షూటింగ్ టైంలో నిమిషం పాటు నవ్వకుండా ఉండాలని విక్రమ్ ఛాలెంజ్ చేయగా.. 30 సెకన్లకే ఏడ్చేశానని, దీంతో తన మేకప్ అంతా పాడైపోయిందని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు: హీరోయిన్ నయనతార)
Comments
Please login to add a commentAdd a comment