![Producer Sahu Garapati About Vishwak Sen Laila](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/saahu.jpg.webp?itok=S_SORZAD)
‘‘హీరో లేడీ గెటప్ వేసిన ‘భామనే సత్యభామనే, మేడమ్’ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించి, హిట్స్‌గా నిలిచాయి. ఈ సెంటిమెంట్‌తో ‘లైలా’(Laila) మూవీ కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే తెలుగులో ఈ తరహా సినిమాలు వచ్చి కూడా చాలా కాలం అయింది. దీంతో ‘లైలా’ మూవీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు నిర్మాత సాహు గారపాటి. విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘లైలా’. ఆకాంక్షా శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో కామాక్షీ భాస్కర్ల, అభిమన్యు సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో నిర్మాత సాహు గారపాటి(Producer Sahu Garapati) మాట్లాడుతూ– ‘‘యూత్ టార్గెట్‌గా చేసిన ‘లైలా’ని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో హీరో లేడీ క్యారెక్టర్ (లైలా) కూడా చేశారు. ఈ క్యారెక్టర్ కోసం ముందుగా కొందరు హీరోలను అనుకున్నాం. విశ్వక్ ఈ కథ వినగానే ‘ఇది నేను చేయాల్సిన క్యారెక్టర్’ అన్నారు.
హీరో తొలి భాగం సోనూగా, రెండో భాగం లైలాగా మారతాడు. లైలాగా హీరో ఎందుకు మారాడు? అనేది ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక ప్రస్తుతం నిర్మాత పరిస్థితి ఏమీ బాగోలేదు. అనుకున్న బడ్జెట్‌లో సినిమాను నిర్మించగలిగితే ఓకే. ‘లైలా’ని అనుకున్న బడ్జెట్‌లోనే తీశాం. చిరంజీవిగారితో అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మేం చేయనున్న నెక్ట్స్ మూవీ జూన్ లేదా జూలైలో ప్రారంభం అవుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చేస్తున్న సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment