Laila
-
‘లైలా’గా మారిన విశ్వక్ సేన్..కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)
-
'శబ్దం' టీజర్ విడుదల.. మరో హిట్ ఖాయం
హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'శబ్దం'. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే 'వైశాలి' సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆది పినిశెట్టి చాలా ఏళ్ల తర్వాత అరివళగన్ డైరెక్షన్లో 'శబ్దం' సినిమాలో నటించాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 7జి శివ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఆది పినిశెట్టితో పాటు ఈ చిత్రంలో లక్ష్మీ మేనన్, సిమ్రాన్, లైలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా క్రేజీగా ఉన్న ఈ ట్రైలర్‌ను తాజాగా విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ చిత్రం ఆత్మల వల్ల జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుందని టీజర్‌తో దర్శకుడు హింట్ ఇచ్చాడు. ఆత్మల గురించి పరిశోధించే పాత్రలో ఆది కనిపించాడు. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా రూపొందుతోంది. హాంటెడ్ హౌస్‌లో అతీంద్రియ సంఘటనలు చుట్టూ టీజర్ నడిచింది. ముఖ్యంగా టీజర్లో థమన్ అందించిన ప్రత్యేకమైన సౌండ్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయాని చెప్పవచ్చు. ఇందులోని బీజీఎమ్ చాలా కొత్తగా థమన్ అందించాడు. ముంబై, మున్నార్, చెన్నై తదితర ప్రదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం రూ.2కోట్ల బడ్జెట్‌తో 120ఏళ్ల నాటి లైబ్రరీ సెట్‌ను నిర్మించామని గతంలో చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పుడు అది టీజర్లో ప్రధాన హైలెట్‌గా నిలిచింది. టీజర్లో కెమెరామెన్ అరుణ్ బత్మనాభన్ ప్రతిభ మెరుగ్గానే ఉంది. ఈ సమ్మర్లోనే శబ్దం విడుదల కానుంది. -
లైలా.. ఓ అంబాసిడర్
సాక్షి, హైదరబాద్: లైలా ఓరుగంటి. ఒక ట్రాన్స్‌జెండర్. దశాబ్దాలుగా ట్రాన్స్జెండర్ల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత కోసం పని చేస్తున్న సామాజిక కార్యకర్త. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆమెను అంబాసిడర్‌గా నియమియారు. వివిధ సామాజిక వర్గాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, అన్ని వర్గాలకు చెందిన వారు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఎన్నికల కమిషన్ వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ చేపట్టిన క్యాంపెయిన్‌లో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి లైలా ఎన్నికల అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఎన్నికల కమిషన్ నిర్వహించే కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని కొనసాగించనున్నారు.‘తెలంగాణలో సుమారు 1.5 లక్షల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.కానీ ఓటర్లుగా నమోదైన వాళ్లు కనీసం 3 వేల మంది కూడా లేరు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది.’అని లైలా అభిప్రాయపడ్డారు. వివక్ష తొలగలేదు... చాలామంది ట్రాన్స్జెండర్లుగా జీవనం కొనసాగిస్తున్నప్పటికీ ఓటింగ్‌లో మాత్రం ‘పురుషులు’ లేదా ‘మహిళలు’గా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.‘ట్రాన్స్జెండర్లు’గా నమోదు కావడం లేదు. దీంతో సామాజికంగా లక్షన్నర మంది ట్రాన్స్జెండర్లు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో కేవలం 2,737 మంది మాత్రమే ట్రాన్స్జెండర్లుగా నమోదయ్యారు. ఈ వర్గంపైన ఉండే సామాజిక వివక్ష కారణంగా తమ ఉనికిని చాటుకొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. సాధ్యమైనంత వరకు గోప్యంగా జీవించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సంఖ్యరీత్యా మెజారిటీగా ఉండే ఓటర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపే రాజకీయ పారీ్టలు ట్రాన్స్జెండర్లను గుర్తించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ సామాజిక రుగ్మతను తొలగించుకొనేందుకు ప్రతి ట్రాన్స్‌జెండర్ ఓటరుగా నమోదు కావలసి ఉందని లైలా పేర్కొన్నారు. గత పదేళ్లలో ట్రాన్స్జెండర్ల సంఖ్య రెట్టింపయింది.‘అనేక రకాలుగా ‘ట్రాన్స్’గా జీవనం కొనసాగిస్తున్నవాళ్లు ఉన్నారు.కానీ కుటుంబం నుంచి ఎదురయ్యే వివక్ష, అవమానాల కారణంగా ఇళ్ల నుంచి బయటకు వచి్చన వాళ్లు నిర్భయంగా తమ ఉనికిని చాటుకోలేకపోతున్నారు.’ అని చెప్పారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కమ్యూనిటీకి చెందిన పుష్ప ఎన్నికల్లో పోటీ చేయగా, 2018లో జరిగిన ఎన్నికల్లో చంద్రముఖి ఎన్నికల బరిలో నిలిచారు. ట్రాన్స్ కమ్యూనిటీలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ఈ పోటీ ఎంతో దోహదం చేసిందని ఆ వర్గానికి చెందిన పలువురు అభిప్రాయపడ్డారు.ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ లైలాను అంబాసిడర్‌గా నియమించడాన్ని కూడా ట్రాన్స్జెండర్లు, సామాజిక సంస్థలు ఆహ్వానిస్తున్నాయి.కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో ఎంఏ చదివిన లైలా ... స్వచ్చంద సంస్థల ద్వారా ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. పథకాలు అందడం లేదు... వివిధ కారణాల వల్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఎలాంటి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేకుండా బతుకుతున్న తమను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, చదువుకున్న వాళ్లకు కూడా ఉద్యోగా లు లభించడం లేదని లైలా ఆవేదన వ్యక్తం చేసింది. దివ్యాంగులు, పేద మహిళలు, తదితర వర్గాలకు లభించే రాయితీ సదుపాయాలు కూడా తమకు అందడం లేదని, అణగారిన వర్గాలకు ఇళ్లు, ఇంటిస్థలాలు అందజేస్తున్నట్లుగానే తమకు కూడా సొంత ఇళ్లకు ఆర్ధికసహాయం అందజేయలని ఆమె కోరారు. ఈ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్ల సంఖ్య 1.50 లక్షలు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్లుగా నమోదైన ఓటర్లు : 2000 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారు : 2,885 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్న ట్రాన్స్జెండర్లు : 2,557 ప్రస్తుతం జరుగనున్న 2024 లోక్‌సభ ఎన్నికల కోసం నమోదైన ట్రాన్స్‌జెండర్ ఓటర్లు : 2,737. -
వినిపిస్తోందా.. మూడో స్వరం
ప్రజాస్వామ్య సౌధమైన శాసనసభలో మూడో స్వరం వినిపించేందుకు ట్రాన్స్జెండర్లు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వరంగల్ తూర్పు సెగ్మెంట్ నుంచి బీఎస్పీ అభ్యర్థి గా పోటీ చేసేందుకు రామన్నపేటకు చెందిన చిత్రపు పుష్పిత లయకు తాజాగా అవకాశం లభించగా, గత ఎన్నికల్లో గోషామహల్ నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థి గా పోటీ చేసిన చంద్రముఖి కూడా ఈసారి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక ట్రాన్స్జెండర్లతో పాటు ప్రజల్లో ఓటు అవగాహనకు రాష్ట్ర ఎన్నికల ప్రచార కర్తగా వరంగల్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ లైలాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించింది. ఆమె తమ కమ్యూనిటీ వారు ఓటు నమోదు చేసుకునేందుకు అవగాహన కలిగిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, వరంగల్/హైదరాబాద్ రాష్ట్రంలో సుమారు 50 వేల మందికి పైగా ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు స్వచ్చంద సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ ఓటర్లుగా నమోదైన వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ట్రాన్స్జెండర్ల పట్ల సమాజం నుంచి ఎదురయ్యే వివక్ష, అవమానాలు, వేధింపుల కారణంగానే చాలామంది ‘మగవారు’గానే మనుగడ కొనసాగిస్తున్నట్టు ఆయా సంస్థలు చెబుతున్నాయి. అన్ని జీవన సమూహాల్లాగే ట్రాన్స్జెండర్లు కూడా స్వేచ్ఛా యుతమైన జీవనాన్ని కొనసాగించే హక్కును కలిగి ఉన్నట్లు గతంలో వెలువరించిన సుప్రీంకోర్టు తీర్పు వారికి గొప్ప ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. మరోవైపు వివిధ స్వచ్చంద సంస్థలు, ప్రజాసంఘాలు, హక్కులసంఘాల నుంచి వారికి సంపూర్ణమైన మద్దతు, అండదండలు లభించాయి. దీంతో ట్రాన్స్ జెండర్లు సంఘటితమయ్యారు. తమ ఉనికిని బలంగా చాటుకొనేందుకు ఎన్నికలను ఒక అస్త్రంగా మలుచుకున్నారు. తీవ్రమైన వివక్ష, అణచివేతకు గురవుతున్న ట్రాన్స్జెండర్ల అస్తిత్వాన్ని చాటుకొనేందుకు, ఆకాంక్షలనువెల్లడించేందుకు చట్టసభలను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నట్లు చిత్రపు పుషి్పత లయ, చంద్రముఖి చెబుతున్నారు. బీఎస్పీ కార్యకర్త నుంచి అభ్యర్థిగా చిత్రపు పుష్పిత లయ ప్రస్థానం వరంగల్ రామన్నపేటకు చెందిన చిత్రపు పుష్పిత లయ బీఎస్పీ పార్టీ కార్యకర్తగా ఢిల్లీలో ఐదేళ్లు పనిచేశారు. ఆ తర్వాత డాక్టర్ అంబేడ్కర్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. రెండేళ్ల నుంచి వరంగల్ తూర్పు బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ట్రాన్స్జెండర్ల తరఫున తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థి గా చంద్రముఖి ట్రాన్స్జెండర్ల అస్తిత్వాన్ని చాటుకొనేందుకు మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు మువ్వల చంద్రముఖి వెల్లడించారు. భరతనాట్య కళాకారిణి. వ్యాఖ్యాత, సినీనటి అయిన చంద్రముఖి దశాబ్దకాలంగా ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రజాస్వామ్య సౌధంలో మూడోస్వరాన్ని వినిపించేందుకే 2018లో ట్రాన్స్జెండర్ల ప్రతినిధిగా, బీఎల్ఎఫ్ అభ్యర్థి గా గోషామహల్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమెకు 1125 ఓట్లు లభించాయి. ఈ సారి మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలనుకుంటున్నట్లు చెప్పారు. ఏ నియోజకవర్గం నుంచి అనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ఎన్నికల ప్రచారకర్తగా లైలా.. మహబూబాబాద్ జిల్లాలోని అన్నారం గ్రామానికి చెందిన లైలా అలియాస్ ఓరుగంటి లక్ష్మణ్ డిగ్రీ చదువుకునే రోజుల్లో హిజ్రావైపు మళ్లారు. పూర్తిస్థాయి ట్రాన్స్‌జెండర్‌గా మారి డబుల్ పీజీ కూడా చేశారు. 20 ఏళ్ల నుంచి మ్యారీ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవీ ప్రాజెక్ట్‌లో హెల్త్ వర్కర్‌గా పనిచేస్తూ వరంగల్‌లో ఉంటున్నారు. రాష్ట్ర హిజ్రాల వెల్ఫేర్ సంఘం సభ్యురాలుగా కూడా ఎన్నికయ్యారు. వారి కమ్యూనిటీ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రస్థాయిలో కృషి చేస్తున్నారు. ఈమె సేవలను గుర్తించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ ఏడాది సెపె్టంబర్ 19వ తేదీన ఎన్నికల ప్రచారకర్త (అంబాసిడర్)గా నియమించడం విశేషం. -
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్ జెండర్ లైలా
సాక్షి, వరంగల్: ‘చట్టసభల్లో రిజర్వేషన్‌తో అవకాశం కల్పిస్తే మేము రాజకీయంగా నిరూపించుకుంటూ.. సమాజానికి సేవ చేస్తాం’ అంటున్నారు.. రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్త, ట్రాన్స్‌జెండర్ లైలా. తొలిసారిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రచారకర్తగా ట్రాన్స్‌జెండర్ లైలా ఎంపికయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,600 మందికిపైగా ఉన్న ట్రాన్స్జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ట్రాన్స్ జెండర్ సంక్షేమ బోర్డు సభ్యురాలిగా కూడా ఉన్న లైలాతో ‘సాక్షి’ బుధవారం ముచ్చటించింది. వివరాలు ఆమె మాటల్లోనే.. సంఖ్య పెరిగితే ప్రత్యేక పథకాలు.. రాష్ట్రంలో ఉన్న మా కమ్యూనిటీ సమస్యలపై అవగాహన ఉంది. లక్ష వరకు మా సంఖ్య ఉన్నా.. ఓటరు జాబితాలో మాత్రం 2,033 మందే కనిపిస్తున్నారు. చాలామంది మేల్, ఫిమేల్గా నమోదు చేసుకున్నారు. అందుకే మా సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. మా మీద ఉన్న వివక్షతో కొంత మంది ట్రాన్స్‌జెండర్‌గా ఓటర్‌గా నమోదు చేసుకోవడం లేదు. గుర్తింపు, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో బయటకు చెప్పుకునేందుకు ఇష్టపడడం లేదు. 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కొంతమంది ధైర్యంగా ముందుకొచ్చి అదర్స్.. థర్డ్ జెండర్.. అనే కాలమ్‌లో ఓటరుగా నమోదు చేసుకున్నారు. మేమంతా 18 ఏళ్లు నిండిన వాళ్లమే. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా నా వంతు పాత్ర నిర్వర్తిస్తా. అప్పుడే ప్రభుత్వాలు మాకు ప్రత్యేక పథకాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బాధ్యతగా భావిస్తున్నా.. గొప్ప గొప్ప సెలబ్రిటీలు, హీరో హీరోయిన్లను ఎన్నికల ప్రచార కర్తలుగా తీసుకుంటున్న తరుణంలో ఓ ట్రాన్స్‌జెండర్ అయిన నన్ను ఓ ఐకాన్‌గా తీసుకోవడం అరుదైన అవకాశంగా.. గొప్ప బాధ్యతగా భావిస్తున్నా. ఇంత గుర్తింపునిచ్చిన ఎన్నికల కమిషన్‌కు ధన్యవాదాలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పోరాటాలు చేసి చాలావరకు సాధించుకున్నాం.. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త గుర్తింపు పెరిగింది. అధికారులు.. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల్లో ట్రాన్స్‌జెండర్స్‌పై అవగాహన పెరిగింది. కానీ, మార్పు రావాలంటే ప్రభుత్వాలు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి. అవకాశాలు ఇవ్వాలి. ప్రత్యేక గుర్తింపును ఇచ్చినప్పుడు మాత్రమే మరింత ముందుకెళ్లే.. అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ల వల్లనే ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. విద్య, ఉద్యోగం, వైద్యం, రాజకీయ రంగాల్లో కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చి ప్రోత్సహించాలి.. అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా.. అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా నిరూపించుకుంటాం.. అవకాశం ఏ రాజకీయ పార్టీ ఇచ్చినా.. చట్టసభల్లో ఉండాలని కోరుకుంటాం. మాకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే చట్టసభల్లో మాత్రమే మన పాలసీలు, జీఓలు వస్తుంటాయి. ఎక్కడైతే పాలసీలు తయారవుతున్నాయో అక్కడ మా వాయిస్ ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అవకాశం ఇచ్చినా.. మా కమ్యూనిటీ ఉపయోగించుకుంటుంది. మాకు అది అవసరం కూడా.. అదే సమయంలో ఎన్నికల ప్రచార కర్తగా ప్రతి ఒక్క అర్హులు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తా.. ఓటును వినియోగించడం ద్వారా సరైన సేవ చేసే వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని విడమరిచి చెబుతా. ఓటు గొప్ప ఆయుధం కాబట్టి ఓట్లు వేసే రోజు పోలింగ్ బూత్‌కు వెళ్లాలి. అప్పుడే సరైన ప్రజాస్వామ్యాన్ని, నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. సరైన నాయకుడు వస్తేనే మన జీవితాల్లో మార్పు వస్తుంది. -
డైరెక్టర్ కాళ్ల మీద పడ్డ హీరోయిన్.. ఈమెను గుర్తుపట్టారా?
అమాయకపు చూపులతో, నిష్కల్మషమైన చిరునవ్వుతో ప్రేక్షకుల మనసులు ఇట్టే గెలుచుకుంది లైలా. 'దుష్మన్ దునియా కా' అనే హిందీ చిత్రంతో వెండితెరపై తన ప్రయాణం మొదలైంది. కానీ తనకు స్టార్డమ్, అవకాశాలు వచ్చింది మాత్రం సౌత్‌లోనే! ఎగిరే పావురమా(1997) సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన లైలా.. పెళ్లి చేసుకుందాం, పవిత్ర ప్రేమ, శుభలేఖలు, నా హృదయంలో నిదురించే చెలి, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. 8 ఏళ్లు లవ్.. పెళ్లితో సినిమాలకు దూరం సౌత్‌లో తిరుగులేని హీరోయిన్గా పేరు తెచ్చుకున్న లైలా ఒకరిని గాఢంగా ప్రేమించింది. కానీ అది ఇండస్ట్రీ వ్యక్తిని కాదు.. బిజినెస్మెన్ మెహ్దీని! దాదాపు ఎనిమిదేళ్లపాటు వీరు ప్రేమించుకున్నారు. కెరీర్ ఊపు మీదున్న సమయంలో 2006లో అతడిని పెళ్లి చేసుకుంది. అయితే ఎంగేజ్మెంట్ మాత్రం పెళ్లికి నాలుగేళ్ల ముందే జరిగిపోయిందట. ఈ జంటకు ఇద్దరు అబ్బాయిలు సంతానం. పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేసిన లైలా 2022లో సర్దార్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. డైలాగ్స్ సరిగా చెప్పట్లేదని తిట్టిన డైరెక్టర్ తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. '2001లో నందా సినిమా చేసే సమయానికి నాకు తమిళ్ మాట్లాడటం ఇంకా రాలేదు. చాలా తప్పులు దొర్లేవి. డైలాగులు కూడా తప్పుతప్పుగా చెప్పేదాన్ని. దీంతో డైరెక్టర్ బాలా సర్ నన్ను పదేపదే తిట్టేవాడు. ఒకానొక దశలో నాకు విపరీతమైన కోపం వచ్చింది. నేనింక సినిమా చేయనని చెప్పేశాను. అప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చి బాలా మంచి డైరెక్టర్.. ఆయన దర్శకత్వంలో నువ్వు పని చేస్తే నీకు మంచి పేరు, గుర్తింపు వస్తుందని, నీ లైఫే మారిపోతుందని సర్ది చెప్పారు. ఆయన కోపం అర్థమై కాళ్ల మీద పడ్డా సరేనని నేను కూడా కోపాన్ని పక్కనపెట్టి సినిమాలో నటించాను. సినిమా రిలీజయ్యాక రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దామని తొలిరోజే థియేటర్‌కు వెళ్లాను. అక్కడ జనాల అరుపులు, కేకలు చూసి ఆశ్చర్యపోయాను. స్క్రీన్‌పై నేను ఇంత బాగా నటించానా? అని నేనే షాకయ్యాను. వెంటనే బాలా సర్ దగ్గరకు వెళ్లి నన్ను క్షమించండంటూ ఆయన కాళ్లపై పడ్డాను. మీ కోపం నాకిప్పుడు అర్థమైందని ఆయనతో చెప్పాను' అని పేర్కొంది లైలా. ఇక నందా సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు సైతం అందుకుంది లైలా. చదవండి: ఒకరితో సహజీవనం.. మరొకరితో పెళ్లి.. మోసం చేసిన నాయకుడు.. న్యాయం చేయాలని నటి ఆవేదన -
ఆది పినిశెట్టి చిత్రంలో నటి లైలా కీలక పాత్ర!
వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు అరివళగన్, నటుడు ఆది పినిశెట్టి కాంబినేషన్లో ఇంతకు ముందు ఈరం వంటి సక్సెస్ఫుల్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇదే కాంబినేషన్లో ఒక చిత్రం రూపొందుతోంది. ఇందులో ఆది పినిశెట్టికి జంటగా లక్ష్మీమీనన్ నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత లక్ష్మీమీనన్ ఈ చిత్రం ద్వారా రీఎంట్రీ అవుతున్నారు. ఈ చిత్రంతో దర్శకుడు అరివళగన్ నిర్మాతగాను మారడం మరో విశేషం. చదవండి: నేను నోరు విప్పితే.. మీరు ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పనా?: తమ్మారెడ్డి ఆయన ఆల్ఫా ఫ్రేమ్స్ సంస్థ 7జీ ఫిలింస్ శివతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో తాజాగా నటి లైలా చేరారు. ఇంతకుముందు తెలుగు, తమిళ భాషల్లో కథానాయక నటించిన ఆ తర్వాత పెళ్లి చేసుకుని దూరంగా ఉంటూ వచ్చారు. అలాంటిది చాలా గ్యాప్ తర్వాత వదంతి అనే వెబ్ సీరీస్‌లో మెరిసిన లైలా ఇటీవల కార్తీ కథానాయక నటించిన సర్దార్ చిత్రంలో ముఖ్యపాత్రలో మళ్లీ వెండితెరపై కనిపించారు. తాజాగా ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. చదవండి: రెండు నెలల క్రితమే నరేశ్-పవిత్ర పెళ్లి చేసుకున్నారా? అరె ఏంట్రా ఇది! ఈ విషయాన్ని చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఆమె పాత్ర ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుందని వారు చెప్పారు. ఇంతకుముందు కామెడీ హర్రర్ జానర్లో పలు చిత్రాలు వచ్చిన వాటికి పూర్తి భిన్నంగా ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు తెలిపారు. దీనికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఫస్ట్ పోస్టర్, టీజర్ విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని దర్శకుడు తెలిపారు. -
హీరోయిన్ లైలా ఏంటి ఇలా మారిపోయింది?
‘వైశాలి’ వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఆది పినిశెట్టి– దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘శబ్దం’. 7ఎ ఫిల్మ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్‌పై 7ఎ శివ నిర్మిస్తున్నారు. లక్ష్మీ మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నటి లైలా కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసి, ఆమె లుక్ రిలీజ్ చేశారు. ‘ ‘తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న చిత్రం ‘శబ్దం’. మునుపెన్నడూ చూడని కొత్త పాత్రలో లైలా కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: భానుప్రియ శివ, సంగీతం: తమన్, కెమెరా: అరుణ్ పద్మనాభన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్. బాలకుమార్, రచన– దర్శకత్వం–లైన్ ప్రొడ్యూసర్: అరివళగన్. The sets of #Sabdham just got brighter & bigger! Welcoming @Lailalaughs onboard!@dirarivazhagan @MusicThaman @7GFilmsSiva @Aalpha_frames #LakshmiMenon @KingsleyReddin @Dop_arunbathu @EditorSabu @Manojkennyk @stunnerSAM2 @Viveka_Lyrics @teamaimpr @decoffl pic.twitter.com/tCLjYXQKrW — Aadhi🎭 (@AadhiOfficial) March 9, 2023 -
హీరో శ్రీకాంత్‌ని ఇప్పటికీ ‘కొలబద్ద’అనే పిలుస్తా : లైలా
సీనియర్ హీరోయిన్ లైలా గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆప్పట్లో లైలాకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె కోసమే థియేటర్స్‌కి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. లైలాను తెలుగు తెరపై పరిచయం చేసింది ఎస్వీ కృష్ణారెడ్డి. 1997లొ ‘ఎగిరే పావురమా’ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ గోవా బ్యూటీ. ఈ సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటించాడు. సినిమా మొత్తం హీరోని ‘కొలబద్ద’అంటూ ఆటపట్టిస్తుంది హీరోయిన్. పిల్లలతో పద్యం కూడా పాడిస్తుంది. ఈ సీన్ ఇప్పటికీ నవ్వులు పూయిస్తుంది. అయితే సినిమాలో మాదిరే బయట కూడా శ్రీకాంత్‌ని అలానే ఆటపట్టిస్తుందట లైలా. ఇప్పటికీ శ్రీకాంత్‌ని ‘కొలబద్ద’అనే పిలుస్తుందట. 16 ఏళ్ల తర్వాత ‘సర్దార్’ ద్వారా మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది లైలా. కార్తి హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె ఓ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా చిత్రబృందం తాజాగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న లైలాను స్టేజ్ మీదకు పిలుస్లూ..‘కొలబద్ద’ అని అన్నారు యాంకర్. దీంతో లైలా పగలబడి నవ్వింది. ఆ డైలాగ్‌ని గుర్తు చేస్తూ.. ఇప్పటికీ శ్రీకాంత్‌ని ఆ పేరుతోనే పిలుస్తానని చెప్పుకొచ్చింది. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ సర్దార్ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్, నేను నటించిన శివపుత్రుడు దీపావళి కి విదుదలై ఘన విజయం సాధించింది. సర్దార్ కూడా అదే రోజు వస్తోంది. దీపావళి నా పుట్టిన రోజు కూడా. కార్తి గారు అద్భుతంగా నటించారు. మిత్రన్ గారు చాలా మంచి సినిమాని తీశారు. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి’అని కోరారు. -
మళ్లీ మురిపి'స్టారు'
ఇదండీ విషయం! అభినయానికి వయసుండదు.వయసుకి అందం ఉంటుంది.తారలు... నిజమే తారలు మాసిపోరు.నాటి తారలే నేటి అభినయ తారలు.అపుడు మెరిశారు ఇప్పుడు మురిపిస్తారు. గ్లామర్ ఇండస్ట్రీలో స్పాట్లైట్ ఎప్పుడూ ఒకరి మీదే ఉండదు. ఫోకస్ ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. హీరోయిన్ల విషయంలో అయితే మరీనూ. హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా చిన్నది. ఐదూ పదేళ్ల తర్వాత తెరమరుగవుతుంటారు. కొందర్ని ఇండస్ట్రీ దూరం జరిపితే, కొందరేమో ఇండస్ట్రీకే దూరం జరుగుతారు. కేవలం కొందరు హీరోయిన్లు మాత్రమే దీనికి మినహాయింపు. కాలానుగుణంగా సీతాకోక చిలుకలో మార్పులొచ్చినట్టు వీళ్ల కెరీర్ సైకిల్లో మార్పులొస్తుంటాయి. పాత్రలకు ప్రమోషన్లు వస్తుంటాయి. గ్యాప్‌కి గ్యాప్ ఇచ్చి ఈ యాక్టర్స్ ఎప్పుడు తిరిగొచ్చినా కెమెరాలు మరింత ఫోకస్‌తో వీళ్ల మీద దృష్టి పెడతాయి. ప్రేక్షకుడి కళ్లు మరింత మెరుపుతో వీళ్లను చూస్తాయి. ఈ నటీమణులు మళ్లీ తిరిగి రావడానికి.. స్క్రిప్ట్ కారణం కావొచ్చు, సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ వస్తుందని దర్శక–నిర్మాతలు అనుకోవచ్చు. మరే కారణం అయినా కావచ్చు. ప్రస్తుతం కొందరు హీరోయిన్లు తిరిగి తెర మీద కనిపించడానికి రెడీ అవుతున్నారు. అలా చాలా గ్యాప్ తర్వాత తెలుగు తెరపై మళ్లీ మెరవడానికి సిద్ధమైన నటీమణులపై స్పెషల్ స్టోరీ. సౌందర్య లహరి ‘పెళ్లి సందడి’ సినిమాలో శ్రీకాంత్ స్వప్న సుందరిగా నటించారు దీప్తీ భట్నాగర్. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు కూడా స్వప్న సుందరిగా మారిపోయారామె. అ సినిమా తర్వాత ‘ఆటో డ్రైవర్, మా అన్నయ్య, కొండవీటి సింహాసనం’ సినిమాల్లో కనిపించారామె. 2002 తర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు దీప్తి. ఇçప్పుడు నూతన దర్శకుడు పవన్ సుందర్ దర్శకత్వం వహిస్తున్న ‘కిట్టీ పార్టీ’ సినిమాతో కమ్‌బ్యాక్ చేస్తున్నారు. ఇది దీప్తీకి తెలుగులోనే కమ్‌బ్యాక్ కాదు యాక్టర్‌గానే కమ్‌బ్యాక్. 2004 తర్వాత ఏ భాషలోనూ ఆమె సినిమా చేయలేదు. ఫిర్ ప్యార్ కరేంగే మైనే ప్యార్ కియా అని సల్మాన్, భాగ్యశ్రీతో చెప్పారు. సినిమా బ్లాక్‌బస్టర్. హిందీ రానీ వాళ్లు కూడా భాగ్య శ్రీతో మైనే ప్యార్ కియా అన్నారు. ఆ సినిమా నార్త్, సౌత్‌లో సూపర్ పాపులారిటీ తెచ్చిపెట్టింది భాగ్యశ్రీకి. ఆ తర్వాత తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ ‘ఓంకారం’ (కన్నడ బ్లాక్‌బస్టర్ ‘ఓం’ తెలుగు రీమేక్) చేశారు. ఆ వెంటనే బాలకృష్ణతో ‘రాణా’ సినిమా చేశారు. ఇప్పుడు సుమారు 21ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో కనిపించబోతున్నారు భాగ్యశ్రీ. ‘కిట్టీ పార్టీ’ చిత్రంలో భాగ్యశ్రీ కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. రైలు పట్టాల మీద పరిగెడుతూ ‘మాఘమాసం ఎప్పుడొస్తుందో...’ అని పాట పాడిన లైలా అందరికీ గుర్తే. ‘ఎగిరే పావురమా’ సినిమాలో ఓ సూపర్ హిట్ సాంగ్ ఇది. చిన్న పిల్లలాంటి గొంతు ఆమె ప్రత్యేకం. తెలుగులో ‘ఉగాది, పెళ్ళి చేసుకుందాం, పవిత్ర ప్రేమ’ వంటి సినిమాలు చేశారు. ఇప్పుడు లైలా తెలుగుకు తిరిగొస్తున్నారా? అంటే దానికి కొంచెం టైమ్ ఉన్నట్టుంది. ప్రస్తుతానికి తమిళంలో రీ–ఎంట్రీ ఇస్తున్నారు. పదమూడేళ్ల తర్వాత తమిళ సినిమాలో నటిస్తున్నారు లైలా. ‘అలీసే’ అనే క్రైమ్ డ్రామాలో కీలక పాత్రలో కనిపించనున్నారు లైలా. ఈ సినిమాకు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాత. రాజకీయాల్లో చురుకుగా ఉండటంతో తెలుగు స్క్రీన్‌పైన జయప్రదను ప్రేక్షకులు మిస్ అయ్యారు. 2007లో బాలకృష్ణ ‘మహారథి’ సినిమా తర్వాత తెలుగులో ఆమె సినిమాలేవీ చేయలేదు. తమిళ, హిందీ, కన్నడంలో ఒకటీ అరా సినిమాలు చేశారు కానీ తెలుగు తెరపై కనిపించలేదామె. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన ‘శరభ’ సినిమాలో కీలక పాత్రతో రీ–ఎంట్రీ ఇచ్చారు జయప్రద. ఇటీవల రిలీజైన ‘సువర్ణ సుందరి’లో కూడా కీలక పాత్ర చేశారామె. 18 ఏళ్లకు మళ్లీ ‘20వ శతాబ్దం, పద్మావతి కల్యాణం, బావ నచ్చాడు’ సినిమాల్లో కనిపించిన సుమన్ రంగనాథ్ గుర్తుండే ఉంటారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు కనిపించడానికి రెడీ అయ్యారు. ‘బావ నచ్చాడు’ తర్వాత సుమన్ రంగనాథ్ మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. కానీ కన్నడ, తమిళ, హిందీల్లో సినిమాలు చేస్తున్నారామె. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘కిట్టీ పార్టీ’లో సుమన్ రంగనాథ్ కీలక పాత్ర చేస్తున్నారు. 18 ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో తెలుగు తెరపై కనిపించనున్నారు. ఎటూ వెళ్లిపోలేదు ‘గ్రీకువీరుడు...’ అంటూ ‘నిన్నే పెళ్లాడతా’లో కాబోయే వాడి కోసం పాడిన టబు మనందరికీ గుర్తే. గర్వం అణచడానికి గణపతి విగ్రహాన్ని తనతో మోయించిన ‘కూలీ నెం 1’ కూడా గుర్తే. ‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ కవ్వించిన సిసింద్రీని కూడా మరచిపోలేం. పుండరీక రంగనాథుడిని మోహంలో ముంచెత్తిన మోహినిని మరచిపోవడం సాధ్యమా? ఇలా వెంకటేశ్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ అందరితో కథానాయికగా నటించిన టబు దర్శనాలు ఈ మధ్య తెలుగు తెరకు తగ్గాయి. 2008లో చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో చేసిన ‘ఇదీ సంగతి’ తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదామె. ‘నిన్నే పెళ్లాడతా’లో నాగార్జున పాడిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ని టబు ఫ్యాన్స్ ‘ఎటో వెళ్లిపోయింది టబు’ అని పాడుకున్నారు. కానీ జస్ట్ బాలీవుడ్లో అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నారు టబు. ఎటూ వెళ్లిపోలేదు. ఇంతకీ సంగతేంటంటే... సుమారు పదకొండేళ్ల తర్వాత త్రివిక్రమ్– అల్లు అర్జున్ సినిమాలో నటిస్తున్నారామె. తన సినిమాల్లో కీలక పాత్రల కోసం ఒకప్పటి హీరోయిన్లని తీసుకోవడం త్రివిక్రమ్ స్టైల్ అనుకోవచ్చు. ‘అత్తారింటికి దారేది’లో నదియా, ‘అజ్ఞాతవాసి’లో ‘ఖుష్బూ’ని చాలా గ్యాప్ తర్వాత నటింపజేశారు త్రివిక్రమ్. తాజాగా అల్లు అర్జున్ సినిమాతో టబుని తిరిగి తీసుకొచ్చారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి తల్లిగా లేక అత్తయ్య పాత్రలో టబు కనిపిస్తారని సమాచారం. ఫైర్ బ్రాండ్ ఈజ్ బ్యాక్ తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పాపులారిటీ తీసుకొచ్చిన ఫైర్ బ్రాండ్ హీరోయిన్ విజయశాంతి. యాక్షన్, రివల్యూషనరీ సినిమాలతో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. విజయ్‌శాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాలను చూడటం తమ ‘కర్తవ్యం’గా భావించి థియేటర్స్‌వైపు వెళ్లారు ప్రేక్షకులు. 2006లో చేసిన ‘నాయుడమ్మ’ తర్వాత విజయశాంతి సినిమాలకే బ్రేక్ ఇచారు. పాలిటిక్స్‌లో బిజీగా మారారు. మళ్లీ 13 ఏళ్ల విరామం తర్వాత స్క్రీన్ మీద కనిపించడానికి రెడీ అయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ద్వారా విజయశాంతి మళ్లీ రీ–ఎంట్రీ ఇస్తున్నారు. విజయశాంతి తొలి చిత్రం ‘కిలాడీ కృష్ణుడు’ సినిమాలో హీరో కృష్ణ. ఇప్పుడు రీ–ఎంట్రీ చేస్తున్న సినిమాలో హీరో ఆయన తనయుడు మహేశ్ కావడం విశేషం. కృష్ణ దర్శకత్వం వహించి, నటించిన ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో విజయశాంతి హీరోయిన్. అందులో మహేశ్ బాలనటుడిగా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘సరి లేరు నీకెవ్వరు’లో మహేశ్ పాత్రతో సమానంగా ఆమె పాత్ర కూడా ట్రావెల్ అవుతుందని తెలిసింది. ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
తిరిగొస్తున్నారు
‘ఎగిరే పావురమా, పెళ్లి చేసుకుందాం, మిస్టర్ అండ్ మిస్ శైలజా కృష్ణమూర్తి’ చిత్రాల ద్వారా హీరోయిన్ లైలా సుపరిచితురాలే. తమిళ, కన్నడ భాషల్లోనూ హిట్ చిత్రాల్లో నటించారామె. 2006లో వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు. గతేడాది తమిళంలో ఓ టీవీ షోలో జడ్జిగా కనిపించారు. తాజాగా తమిళ చిత్రం ‘అలీసా’ ద్వారా నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయనున్నారట. యువన్ శంకర్ రాజా నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా మని చంద్రు అనే నూతన దర్శకుడు పరిచయం కానున్నారు. ఈ సినిమా కాకుండా ‘కండ నాళ్ ముదల్’ సీక్వెల్లో కూడా లైలా యాక్ట్ చేయబోతారనే వార్త ప్రచారంలో ఉంది. మరి తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తారా? చూద్దాం. -
డైరెక్షన్ చేయాలనుంది
‘ఎగిరే పావురమా, ఉగాది, పెళ్లి చేసుకుందాం, ఖైదీగారు, పవిత్రప్రేమ, శివ పుత్రుడు’ వంటి చిత్రాలతో నటిగా మంచి పాపులారిటీ సంపాదించారు లైలా. 2006లో వ్యాపారవేత్త మెహ్దిన్ని వివాహం చేసుకొని సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టారామె. అయితే, పన్నిండేళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారట లైలా. సినిమాల్లో కమ్‌బ్యాక్ గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘దక్షిణ రాష్ట్రాల నుంచి మళ్లీ చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ, మంచి రోల్‌తో కమ్‌బ్యాక్ చేయాలని ఎదురుచూస్తున్నాను. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయితే ఇంకా సరదాగా ఉంటుంది. భవిష్యత్తులో డైరెక్షన్ కూడా చేయాలనే ఉద్దేశం ఉంది’’ అని పేర్కొన్నారు. మరి ఎలాంటి క్యారెక్టర్‌తో లైలా తిరిగొస్తారో వేచి చూడాలి. -
చిన్నారి లేఖకు స్పందించిన ఆర్బిఐ గవర్నర్
కిందటి సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం డాలరుకి రూపాయి మారకం విలువను పెంచడానికి ఎంతో ప్రయత్నం చేసింది. తగ్గిపోతున్న రూపాయి విలువను ఎలా పెంచాలా అని తర్జనభర్జన పడింది. ఆ విషయం తెలుసుకున్న పదేళ్ల బాలిక 20 డాలర్ల నోటును రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌కి పంపుతూ, దేశ ఆర్థికవ్యవస్థను బాగుచేయమని ఒక ఉత్తరం రాసింది. రఘురామ్ రాజన్ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా 2013, సెప్టెంబరు 4 వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ మరుసటి రోజే లైలా ఇందిరా ఆల్వా ఆయనకు ఒక ఉత్తరం పంపింది. ‘‘నేను వార్తలలో మన ఆర్థికవ్యవస్థ కుంటుపడుతోందని విన్నాను. అలాగే డాలర్‌కి రూపాయి మారకం విలువ పడిపోతుందని కూడా విన్నాను’’ అని రాసింది. ఢిల్లీ శివార్లలోని గుర్గావ్లో నివసిస్తున్న లైలాకు కూడా మిగతా అందరి బాలికల్లాగే స్నేహితులతో ఆడుకోవడమంటే చాలా ఇష్టం. ఇంకా చదువుకోవడం, పాటలు పాడటం, గిటార్ వాయించడం, ఈత కొట్టడం... ఇలా ఎన్నో. అయితే కిందటి వేసవికాలంలో మన ఎకానమీ గురించి, ప్రతిరోజూ డాలర్‌తో రూపాయి విలువ తగ్గిపోతోందనీ, కరెంట్ అకౌంట్లో లోటు నానాటికీ పెరిగిపోతోందనీ, ఇటువంటి వార్తలు వినవలసి వచ్చినందుకు చాలా బాధ పడింది. ఆమె తల్లిదండ్రులు తెచ్చిన అనేక వార్తాపత్రికలు చదివి కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంది. ‘‘లంచగొండితనం, ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోందని నాకు తెలుసు. ఈ విషయం నేను వార్తాపత్రికల్లో చదివాను, మా తల్లిదండ్రులు కూడా చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు’’ అంటోంది లైలా. ‘‘ప్రజలకు సుఖంగా జీవించడానికి తగినంత ఆదాయం లేదు. వారంతా పేదరికంలోనే జీవిస్తున్నారు’’ అని బాధపడుతోంది లైలా. లైలా తల్లి ప్రియా సోమయ్యా ఆల్వా , ఆమె భర్త తరచుగా లైలాతోను, పదమూడుసంవత్సరాల ఆమె అన్నయ్యతోనూ వార్తల గురించి చర్చిస్తుంటారు. ‘‘కిందటి సెప్టెంబర్, మేమంతా భోజనాలు చేస్తూ మాట్లాడుకుంటున్నాం. నేను మా వారు డాలర్ ధర గురించి చర్చించుకుంటున్నాం. మిస్టర్ రాజన్ రిజర్వ్‌బాంక్ గవర్నరుగా పదవీబాధ్యతలు తీసుకుంటున్నారని వార్తలో చూశాం’’ అన్నారు. మరుసటి రోజు, లైలా స్కూల్ నుంచి తిరిగి వచ్చాక, ఆమె తల్లితో ‘‘నేను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కి ఉత్తరం రాస్తాను. ఆయన మన ఎకానమీని ఇంప్రూవ్ చేస్తారు’’ అని చెప్పింది. ‘‘అలాగే. నువ్వు చిన్న పిల్లవు, నువ్వు ఏం కావాలనుకుంటే అది చెయ్యొచ్చు’’ అంది ప్రియా. ‘‘డా.రఘురామ్‌రాజన్! దయచేసి మీరు కొత్త కొత్త ఆలోచనలతో మన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయండి. విదేశాల నుంచి ప్రజలంతా భారతదేశానికి రావాలని కోరుకుంటున్నాను. అంతేకాని మన దేశం గురించి ఏ ఒక్కరూ లంచగొండి దేశమనీ, చెత్త నిండిన దేశమనీ భావించకూడదు’’ అని ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం ఇటీవలే ఆమె చదువుతున్న స్కూల్ మ్యాగజీన్లో ప్రచురించారు. తాను 20 డాలర్ల నోటును ఇవ్వడానికి నిశ్చయించుకుంది. ఆ నోటు కూడా ... సెలవులకు కిందటి సంవత్సరం ఇజ్రాయెల్ వెళ్లినప్పుడు ఆమెకు తల్లిదండ్రులు ఇచ్చారు. ఆ నోటును ఇప్పుడు బ్యాంకుకి ఇవ్వాలనుకుంటోంది లైలా. దేశానికి ఈ నోటుతో ఎంతో అవసరం ఉందని భావించింది. ‘‘ఏదైనా సరే చిన్న మొత్తంతో ప్రారంభమై పెద్ద మొత్తంగా చేకూరుతుందని చాలామంది చెబుతుంటారు. అందుకే నేను 20 డాలర్ల నోటు ఇద్దామని నిశ్చయించుకున్నాను. ప్రజలకు సరైన ఆలోచనా ధోర ణి ఉంటే, వారు ఈ మొత్తాన్ని పెద్ద మొత్తంగా చేయగలరు. ప్రతిఒక్కరూ ఎంతో కొంత సహాయం అందచేసి, మన ఆర్థికవ్యవస్థను మెరుగుపరచి, దేశ ప్రగతికి పాటుపడాలని కోరుకుంటున్నాను’’ అంటుంది లైలా. పది రోజుల తర్వాత, ఒక అధికారిక ఉత్తరం లైలా పేరుతో వచ్చింది. ఆ ఉత్తరం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ ఉత్తరం రిజర్వ్‌బ్యాంక్ నుంచి వచ్చింది. ‘‘నీ ఆలోచనకు నేను చలించిపోయాను. ప్రస్తుతం దేశానికి ఇదొక పెద్ద సవాలు. నిస్సందేహంగా మన ఆర్థికవ్యవస్థ మెరుగుపడుతుంది’’ అని సమాధానమిచ్చారు ఆ ఉత్తరంలో. ఆ కవర్లో లైలా పంపిన 20 డాలర్ల నోటు కూడా ఉంది. ‘‘నేను నీకు 20 డాలర్ల నోటు వెనక్కు పంపుతున్నాను. ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచడానికి రిజర్వ్‌బ్యాంక్ దగ్గర తగినంత నిధులు ఉన్నాయి’’ అని రాస్తూ, ఈసారి ముంబై వచ్చినప్పుడు తనను కలవమన్నారు. ‘‘నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది’’ అంది లైలా తనకు వచ్చిన జవాబు చూస్తూ. ‘‘రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌కి ఉత్తరం రాయడం సర్వసాధారణం అయ్యి ఉండవచ్చు. నా ఉత్తరం నిజంగా ఆయన చదవలేదనుకున్నాను. ఎవరికో చెప్పి సమాధానం రాయించి ఉంటారు’’అనుకుంది లైలా ఆమెకు తను పంపిన 20 డాలర్ల నోటు వెనక్కు రావడం ఆనందంగా లేదు. ‘‘బహుశ ఇలా తీసుకోవడం వాళ్లకి చిన్నతనం కావచ్చు’’ అనుకుంది. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం, ‘‘దేశానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా సహాయపడతారు’’ అని ఆమెను సముదాయించారు. కిందటి నవంబరులో లైలా తండ్రి వ్యాపార నిమిత్తం ముంబై వెళ్లారు. తండ్రితో పాటు లైలా కూడా ముంబై వెళ్లింది, గవర్నర్‌ని కలవడానికి. ‘‘లైలాకి ఎంతో ఆనందం కలిగింది. ఆర్బిఐ బిల్డింగ్ చూడగానే మురిసిపోయింది. కాయిన్ మ్యూజియం చూసింది. డ బ్బును ఒకరి నుంచి ఒకరికి ఎంత సులువుగా అందచేయవచ్చో అక్కడ చూసింది. ఆమెకు అన్నిటి కంటె వింత మామా గురించి’’ అన్నారు ప్రియా. ‘‘ఆయన చాలా పొడవుగా వున్నారు’’ కళ్లు ఇంతింత చేసుకుని చెప్పింది లైలా. ‘‘మేమిద్దరం ఫొటో తీయించుకున్నాం. ఆయన పొడుగ్గా జెయింట్లా వున్నారు’’ అంది లైలా. రాజన్‌తో ఆమె సమావేశమైనప్పుడు, ఆమె ‘‘ఆర్బిఐ పేదల కోసం ఎందుకని ఎక్కువ నోట్లు ప్రింట్ చేయదు’’ అని ప్రశ్నించింది. అప్పుడు ఆయన ద్రవ్యోల్బణం గురించి, డబ్బు ఏ లెక్కన అచ్చు వేస్తారో ఆమెకు వివరంగా చెప్పారు. ఆయన వెనక ఉన్న గోడ మీద ఉన్న చిత్తరువులు చూసి, ‘‘ఒక్క లేడీ గవర్నర్ కూడా లేరేంటి?’’ అని ప్రశ్నిస్తే, ‘‘బహుశ భవిష్యత్తులో నువ్వే అవుతావేమో’’ అన్నారు రాజన్. ఆమెను పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే, ‘‘ నాకు మాత్రం ముందుగా ఫొటోగ్రాఫర్ కావాలని కోరికగా ఉంది. ఆ తరువాత గాయనిగా! బహుశ ఆ తరువాత గవర్నర్ అవుతానేమో’’ అని సమాధానమిచ్చింది. ప్రస్తుం ఆమె ఆర్థికవ్యవస్థ మీద మరీ దృష్టి సారించట్లేదు. కిందటి సంవత్సరం డాలర్‌కి 70 రూపాయలు. ప్రస్తుతం ఆ ధర 60 రూపాయలకు చేరుకుంది. 20 డాలర్ల నోటు గురించి ప్రస్తుతం ప్రశ్నిస్తే, ఒకప్పుడు తాను ఆ నోటును రూపాయలలోకి మార్చి, ఖర్చు చేయాలనుకుంది, కానీ ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకుంది. ‘‘ఉత్తరంతో పాటు ఈ నోటును ఫ్రేమ్ చేయించాలనుకుంటున్నాను’’ అంటోంది లైలా. -
నచ్చిన పాత్రలే చేస్తా
నటి లైలా గుర్తుందా? 2000 ప్రాంతంలో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన నటి లైలా. ముంబయికి చెందిన ఈ బ్యూటీ తొలుత ఎగిరే పావురం చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత తమిళం, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషలలో నటించింది. కోలీవుడ్‌లో పితామగన్, నందా, దీనా, దిల్ అంటూ పలు హిట్ చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి స్ప్రింగ్‌లో ఉండగానే వివాహం చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టింది. ఇద్దరు బిడ్డలకు తల్లి కూడా అయ్యింది. అలాగే చాలామంది సీనియర్ హీరోయిన్ల మాదిరిగానే ఈమె కూడా మళ్లీ ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా నటి లైలాతో చిన్న భేటి.... పెళ్లికి ముందు లైలాకు ఆ తర్వాత లైలాకు తేడా? పెళ్లికి ముందు పూర్తిగా నటిగానే పరుగులెత్తాను. ఇప్పుడు కుటుంబం, పిల్లల సంరక్షణతో బిజీగా ఉన్నాను. కొంచెం బాధ్యత కూడా పెరిగింది. అనూహ్యంగా మళ్లీ ఇప్పుడు బుల్లితెరపై ఆసక్తి చూపడానికి కారణం? ప్రస్తుతం ఎక్కువ కమిట్మెంట్స్ పెట్టుకోవడం సాధ్యం కాదు. సినిమాపై అధిక దృష్టి సారించాలనుకోవడం లేదు. అందువల్లనే బుల్లితెరను ఎంచుకున్నాను. ఇది కొత్త అనుభవం. చాలా సంతోషంగా ఉంది. నాకు సమయం, సౌలభ్యంగా ఉంటేనే బుల్లితెర కార్యక్రమాలు అంగీకరిస్తున్నాను. కోలీవుడ్ అభిమానులను మిస్ అవుతున్న ఫీలింగ్ లేదా? అలాంటి ఫీలింగ్ ఉంది. ఇక్కడి కొందరు స్నేహితులు, సన్నిహితులతో తరచూ మాట్లాడుతునే ఉన్నాను. ప్రస్తుతం టీవీ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల చెన్నైకి రాకపోకలు అధికమయ్యాయి. మీరే చిన్న అమ్మాయిలా ఉన్నారు. మీకు ఇద్దరు పిల్లలంటే ఆశ్చర్యంగా ఉంది? మునుపటి లైలా వేరు. ఇప్పటి లైలా వేరు. ముందే చెప్పినట్లుగా చాలా బాధ్యతలు పెరిగాయి. సహాయానికి మనుషులున్నా పిల్లల పోషణను నేనే చూసుకుంటాను. ఇదో కొత్త ప్రపంచం. ఎంతగానో ఆస్వాదిస్తూ జీవిస్తున్నాను. సినిమాల్లో అక్క, వదిన పాత్రల్లో నటించడానికి సిద్ధమేనా? అయ్యయ్యో. నా అభిమానులకు అలాంటి కష్టాన్ని కల్పించను. నాకలాంటి ఆసక్తి లేదు. మంచి బలమైన పాత్ర లభిస్తే నటిస్తాను. డబ్బు కోసం ఏ పాత్ర పడితే ఆ పాత్ర అంగీకరించను.