
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించింది. ఇందులో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో అభిమానులను అలరించనున్నారు. ఈ నేపథ్యంలోనే లైలా మూవీ రిలీజ్‌కు ముందు అభిమానులకు విజ్ఞప్తి చేశారు మన యంగ్ హీరో. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'అందరికీ నమస్తే. ఫైనల్‌గా లైలా విడుదలవుతోంది. కానీ మధ్యలో చాలా అపార్థాలు జరిగాయి. మా టీమ్ తరఫున క్షమాపణలు చెప్పాను మా తప్పు లేకపోయినా. అందరం కోపాలు తగ్గించుకుని.. మిస్ అండర్‌స్టాండిగ్స్ తగ్గించుకోవాలి. నేను మీలో ఒకడిని. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి పాత్రలు చేయగలను. మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాం. నేను గెలిస్తే మీరు గెలిచినట్లే. చాలామంది కొత్త నటులు, డైరెక్టర్ లైఫ్ ఈ సినిమాపై ఆధారపడి ఉంది. ఇప్పటికైనా అందరం కలిసి సినిమాను గెలిపిద్దాం. మీ అందరి ఆశీస్సులు కూడా కావాలి' అంటూ వీడియోను పోస్ట్ చేశారు.
పృథ్వీ వ్యాఖ్యలతో వివాదం..
లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో టాలీవుడ్ నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్స్‌పై లైలా చిత్రబృందం స్పందించింది. హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి క్షమాపణలు చెప్పారు. మా ఈవెంట్‌లో జరిగినందువల్లే మేము క్షమాపణలు చెబుతున్నట్లు విశ్వక్ సేన్ వెల్లడించారు. తాజాగా నటుడు పృథ్వీ సైతం తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరారు.
#laila pic.twitter.com/pc1Mcpq6ho
— VishwakSen (@VishwakSenActor) February 13, 2025
Comments
Please login to add a commentAdd a comment