టాలీవుడ్‌లో ఇప్పుడదే ట్రెండ్‌.. చిన్నోడు.. పెద్దోడు.. మళ్లీ వచ్చేస్తున్నారు..! | Seethamma Vakitlo Sirimalle Chettu Movie Re-Release On This Date | Sakshi
Sakshi News home page

Seethamma Vakitlo Sirimalle Chettu: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. రీ రిలీజ్ ఎప్పుడంటే?

Published Fri, Feb 21 2025 7:38 PM | Last Updated on Fri, Feb 21 2025 7:57 PM

Seethamma Vakitlo Sirimalle Chettu Movie Re-Release On This Date

టాలీవుడ్ ప్రియులను అలరించిన చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ముందు వరుసలో ఉంటుంది. విక్టరీ వెంకటేశ్, మహేశ్ బాబు అన్నతమ్ముళ్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో శిరీష్ నిర్మించారు. 2013లో సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సినీ ప్రియులను మెప్పించింది.

తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్‍కు సిద్దమైంది. ఇటీవల పలు సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్‌ చేసే ట్రెండ్‌ టాలీవుడ్‌లో నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని మరోసారి బిగ్‌ స్క్రీన్‌పై చూసే అవకాశం ఫ్యాన్స్‌కు దక్కనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. మార్చి 7న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు థియేటర్లలో సందడి చేయనుందని పోస్ట్ చేసింది. ఈ ప్రకటనతో వెంకటేశ్, మహేశ్ బాబు ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement