venkatesh
-
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై అనిల్ రావిపూడి.. రిలీజ్ ఎప్పుడంటే?
వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam Movie). ఈ మూవీతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు వెంకీమామ. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.200 కోట్లక దిశగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని తెగ చూసేస్తున్నారు. ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో ఇటీవల హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.(ఇది చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా!)అయితే ఈ మూవీకి వస్తున్న ఆదరణ చూసి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. యాంకర్ సుమతో ఇంటర్వ్యూకు హాజరైన అనిల్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం -2 కథ అక్కడి నుంచే మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. మళ్లీ సంక్రాంతికే వస్తామని అనిల్ రావిపూడి అన్నారు. ఈ సినిమా చేసేందుకు స్పేస్ ఉందని.. రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి.. అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుందని అన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మరో మిరాకిల్‌తో మీ ముందుకు వస్తామని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అద్భుతంగా ఉందంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఐదు రోజుల్లోనే రూ.161 కోట్లు వసూలు చేసింది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.ఓవర్సీస్లో రికార్డ్ వసూళ్లు..సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓవర్సీస్ ఆడియన్స్ కోసం అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ కాగా.. ఈ సినిమా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సైతం పొంగల్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఈ మూవీ కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రక్షించాాలకుంటాడు.ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. సంక్రాంతికి వస్తున్నాం 2 కథ అక్కడ మొదలవుతుంది - #AnilRavipudi#SankranthikiVasthunam#Venkatesh #AishwaryaRajesh #MeenakshiChaudhary #TeluguFilmNagar pic.twitter.com/ekTYLB9cpQ— Telugu FilmNagar (@telugufilmnagar) January 19, 2025 -
'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లి రాజు.. తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్!
వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది పొంగల్ కానుకగా ఈనెల 14న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే వందకోట్లకు వసూళ్లతో సంక్రాంతి రేసులో అదరగొడుతోంది.అయితే ఈ మూవీ ఎంత హిట్టయిందో.. అదే రేంజ్లో ఫేమస్ అయ్యాడు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమాల. ఈ మూవీ వెంకటేశ్ కుమారుడిగా నటించిన రేవంత్ (బుల్లిరాజు) ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. బుల్లిరాజుగా సినీ ప్రియులను మెప్పించారు. తన మాటలు, డైలాగ్‌లతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఇటీవల సక్సెస్ మీట్లోనూ రేవంత్ మరోసారి సందడి చేశారు.అయితే తాజాగా బుల్లిరాజుతో కొందరు అభిమానులు వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. అతనితో సెల్ఫీలు దిగేందుకు కొందరు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. అయితే ఇదే క్రమంలో బుల్లిరాజు ఇబ్బందిగా ఫీలవుతున్నా కూడా వారు వదల్లేదు. దయచేసి నన్ను వదిలేయండి అని బుల్లిరాజు చెప్పినా వారస్సలు పట్టించుకోలేదు. చిన్న పిల్లాడితో ఇలా వ్యవహరించడం ఏంటని పలువురు నిలదీస్తున్నారు. జరగండి.. నేను వెళ్లాలి అని బుల్లిరాజు చెబుతున్నా వినకుండా అతనితో ఫోటోలు తీసుకున్నారు. చిన్న పిల్లాడు అని చూడకుండా ఈ పైత్యం ఏంటని పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్ నిర్మించారు.#BulliRaju with items 😍 who are harassing #SankranthikiVasthunam pic.twitter.com/CTqfFrv79L— Aristotle (@goLoko77) January 19, 2025 -
ఫ్లాప్స్, ట్రోలింగ్‌తో డిప్రెషన్లో.. ఇప్పుడు వరుస హిట్స్‌తో దూకుడు (ఫోటోలు)
-
సంక్రాంతికి వస్తున్నాం రికార్డు వసూళ్లు..3 రోజుల్లోనే భారీ మైల్ స్టోన్..
-
బాబీ నెక్స్ట్ సినిమా ఏ హీరోతో..?
-
‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఇది తెలుగు ప్రేక్షకుల విజయం: వెంకటేశ్
‘‘కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయం మరోసారి రుజువు చేసింది. ఇది మా విజయమే కాదు.. ఇంత గొప్పగా సపోర్ట్, లవ్ చేసిన తెలుగు ఆడియన్స్, ఫ్యాన్స్ సక్సెస్. ఇది తెలుగు ప్రేక్షకుల విజయం’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది.ఈ సందర్భంగా నిర్వహించిన ‘΄పొంగల్ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్’లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ అనిల్, నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్గార్లకు, సినిమా యూనిట్‌కి థ్యాంక్స్. ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరూ మనస్ఫూర్తిగా ఫోన్ చేసి సినిమా బాగుందని అభినందిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని చెప్పారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘మేము ఊహించినదానికంటే సినిమాని ఎక్కువ స్థాయికి తీసుకెళ్లిన తెలుగు ప్రేక్షకులకు నా పాదాభివందనాలు. ఈ సినిమాతో నా కెరీర్లో ఎనిమిది సక్సెస్‌లు అంటున్నారు... ఆడియన్స్ సపోర్ట్ లేకపోతే నాకు ఈ విజయం వచ్చేది కాదు’’ అన్నారు.‘‘వెంకటేశ్‌గారు నిర్మాతల బాగు కోరుకుంటారు. కాబట్టే ఇప్పటికీ కాలర్ ఎగరేస్తూ ముందుకు వెళ్తున్నారు’’ అని శిరీష్ పేర్కొన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘అనిల్, వెంకటేశ్‌గారి కాంబినేషన్లో సినిమా అంటే పాజిటివ్ వైబ్రేషన్. ఇది మాకు బ్లాక్ బస్టర్ ΄పొంగల్’’ అని చెప్పారు. ‘‘నేను చేసిన భాగ్యం పాత్ర క్రెడిట్ అంతా అనిల్గారికే దక్కుతుంది’’ అన్నారు ఐశ్వర్యా రాజేశ్. ఈ వేడుకలో నటులు అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ వడ్లమాని, మురళీధర్ గౌడ్, కెమెరామేన్ సమీర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్ తమ్మిరాజు, రచయితలు అజ్జు మహాకాళి, నాగ్, సాయి కృష్ణ తదితరులు మాట్లాడారు. -
'సంక్రాంతికి వస్తున్నాం' బాక్సాఫీస్.. మూడు రోజుల్లోనే క్రేజీ మార్క్!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా ఈ మూవీ దూసుకెళ్తోంది. ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.కాగా.. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మూడు రోజులకే వందకోట్ల మార్క్‌ను అధిగమించి మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.ఓవర్సీస్లో రికార్డ్ స్థాయి వసూళ్లు..సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓవర్సీస్ ఆడియన్స్ కోసం అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ కాగా.. ఈ సినిమా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సైతం పొంగల్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఈ మూవీ కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రక్షించాాలకుంటాడు.చదవండి: కట్టెల పొయ్యిపై చేపల పులుసు వండిన నాగ చైతన్యఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ.Any centre, single hand ~ Victory @venkymama 🔥🔥🔥106Cr+ Gross worldwide in 3 Days for #BlockbusterSankranthikiVasthunam ❤️🔥❤️🔥❤️🔥The OG of Sankranthi has set the box office on fire, bringing festive celebrations alive in theatres 💥— https://t.co/ocLq3HYNtH… pic.twitter.com/AR5ZlaPvjR— Sri Venkateswara Creations (@SVC_official) January 17, 2025 -
సారీ చెప్పిన చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు.. ఎందుకో తెలుసా?
సంక్రాంతికి ఆడియన్స్‌ను ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తోన్న చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం పొంగల్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంకేముంది అనిల్- వెంకటేశ్ కాంబోపై మరోసారి ప్రశంసలు కురుస్తున్నాయి.అయితే ఈ సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్(బుల్లి రాజు). తన క్యూట్ క్యూట్ మాటలతో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. అంతకుముందు మూవీ ఈవెంట్లో మాట్లాడిన బుల్లి రాజు మరోసారి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్లో సందడి చేశాడు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపించాడు. అంతే కాకుండా నాలా ఎవరూ కూడా పాడై పోవద్దంటూ పెద్ద సలహానే ఇచ్చాడు. ఇంతకీ అదేంటో చూద్దాం.బుల్లి రాజు మాట్లాడుతూ..' అందిరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మీరందరు థియేటర్స్‌కు వెళ్లి సినిమాను ఆదరించినందుకు థ్యాంక్స్. అలాగే నాలా ఓటీటీలు చూసి ఎవరూ పాడైపోవద్దు. ఒక మేసేజ్ ఇవ్వడం కోసమే ఇలా చేశాం. ఇలా అవుతుందని అనుకోలేదు. ఈ సినిమాలో నా పాత్రను ఎవరూ ఫాలో అవ్వొద్దు. అందుకు మీ అందరికీ సారీ. అనిల్ సార్ మీరు నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. మీ గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అందరితో బాగా కలిసిపోయాను.' అని అన్నారు. రేవంత్ పాత్రపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ..' బుల్లి రాజు నువ్వు బాగా చేశాం. యూఎస్‌తో పాటు రెండు రాష్ట్రాల ప్రజలు నిన్ను మెచ్చుకుంటున్నారు. నువ్వు బాగా చదువుకో. మంచి సినిమాలు చేయి. ఈ బుడ్డోడి పాత్ర ఏంటంటే.. పిల్లలు ఓటీటీ చూస్తే పరిస్థితి ఏంటనేది చూపించాం. అక్కడ వినిపించే బూతులు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే మేసేజ్ కోసమే అలా చేశాం. అంతేకానీ బుల్లిరాజుతో అలా మాట్లాడించాలని కాదు' అని క్లారిటీ ఇచ్చారు. కాగా.. వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతికి సరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదరగొట్టింది. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. -
బ్లాక్‌బస్టర్ పొంగల్.. కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే?
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అంటారు. గతేడాది సంక్రాంతికి సైంధవ్‌తో పలకరించాడు విక్టరీ వెంకటేశ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. ఈసారి తన ఎవర్గ్రీన్ జానర్ కామెడీనే నమ్ముకున్నాడు. అలా అనిల్ రావిపూడితో సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunam Movie) చేశాడు. ఈ మూవీ జనవరి 14న విడుదలైంది. అలా ఈసారి సంక్రాంతికి వస్తూనే పండగ కళను తీసుకొచ్చారు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవడానికి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ ఎదుట క్యూ కడుతున్నారు.రెండు రోజుల్లోనే రూ.77 కోట్లుమొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం చిత్రయూనిట్ ఈసారి బ్లాక్‌బస్టర్ పొంగల్ సెలబ్రేట్ చేసుకుంటోంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు రూ.32 కోట్లు వసూలు చేసింది. అంటే రెండు రోజుల్లోనే రూ.77 కోట్ల కలెక్షన్స్ సాధించింది. బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఆడిస్తున్న వెంకీ మామ రెండు రోజుల్లో రూ.100 కోట్ల మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది.తగ్గని డాకు మహారాజ్ జోరుమరోవైపు నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా (Daaku Maharaaj Movie) కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. తొలి రోజు రూ.56 కోట్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. జనవరి 12న రిలీజైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే సెంచరీ క్లబ్‌లోకి చేరింది. డాకు మహారాజ్ రూ.105 కోట్లు రాబట్టిందంటూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. అంతేకాదు, ఈ సినిమాను తమిళంలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. జనవరి 17 నుంచి తమిళనాడులోని థియేటర్లలో డాకు మహారాజ్ ప్రత్యక్షం కానుందని వెల్లడించారు. KING OF SANKRANTHI #DaakuMaharaaj has turned into a CELEBRATION with the audience's love ❤️#BlockbusterHuntingDaakuMaharaaj crosses 𝟏𝟎𝟓 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐢𝐧 𝟒 𝐝𝐚𝐲𝐬 sweeping all territories into his zone 🪓🔥𝐓𝐇𝐄 𝐇𝐔𝐍𝐓 𝐈𝐒 𝐎𝐍 ~ Book… pic.twitter.com/JPF8US64bO— Sithara Entertainments (@SitharaEnts) January 16, 2025The ‘VICTORY RAMPAGE’ continues at the box office 🔥🔥🔥77CRORE+ Worldwide Gross in 2 days for #BlockbusterSankranthikiVasthunam ❤️🔥And Day3 already begun on a sensational note 💥💥#SankranthikiVasthunam IN CINEMAS NOW 🫶Victory @venkymama @anilravipudi @aishu_dil pic.twitter.com/IfkZ1tSa1q— Sankranthiki Vasthunam (@SVMovieOfficial) January 16, 2025 The sensation that shook the box office and won hearts in Telugu 😎Now ready to ROAR in Tamil from tomorrow! 🔥Experience the #BlockbusterHuntingDaakuMaharaaj with your loved ones ❤️#DaakuMaharaaj ❤️🔥𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna @thedeol @dirbobby… pic.twitter.com/0Vg08BOWNY— Sithara Entertainments (@SitharaEnts) January 16, 2025 చదవండి: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. షాకయ్యా: జూనియర్ ఎన్టీఆర్ -
సంక్రాంతి ప్రత్యేకం
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగతో చిత్ర పరిశ్రమకు ప్రత్యేక అనుబంధం ఉంది. సంక్రాంతి సందర్భంగా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు సైతం పోటీపడుతుంటారు. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని తమ సినిమాల నుంచి ప్రత్యేక పోస్టర్స్, లుక్స్‌ని విడుదల చేశారు పలువురు మేకర్స్. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం... రాజా సాబ్ ఆగయాప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో రూపొందుతోన్న ‘రాజా సాబ్’ నుంచి ప్రభాస్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పండుగ కళ కనిపిస్తున్న ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. షూటింగ్ తుదిదశలో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.అందమైన లైలాహీరో విశ్వక్ సేన్ లైలాగా మారారు. ఆయన అబ్బాయిగా, అమ్మాయిగా నటించిన చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆకాంక్షా శర్మ హీరోయిన్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీలో తొలిసారి లైలా అనే అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమా నుంచి లైలాగా విశ్వక్ సేన్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. జాస్మిన్ వచ్చేశారు‘బబుల్ గమ్’ మూవీ ఫేమ్ రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. ‘కలర్ ఫోటో’ మూవీతో జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ , టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా సాక్షి సాగర్ మదోల్కర్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఆమె జాస్మిన్ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొని, పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. సంతానప్రాప్తిరస్తువిక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతానప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా నుంచి విక్రాంత్, చాందినిల స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేసింది యూనిట్. ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. -
సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీమామ కెరీర్లోనే ఆల్‌టైమ్ రికార్డ్
వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతికి సరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదరగొట్టింది. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. 'పండగకి వచ్చారు.. పండగని తెచ్చారు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.(ఇది చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)'సంక్రాంతికి వస్తున్నాం' కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు.ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. పండగకి వచ్చారు ~ పండగని తెచ్చారు ❤️🔥❤️🔥❤️🔥#SankranthikiVasthunam grosses 45CRORE+ Worldwide on its first day at the box office🔥Victory @VenkyMama’s ALL TIME CAREER HIGHEST OPENING EVER 💥💥#BlockbusterSankranthikiVasthunam IN CINEMAS NOW 🫶@anilravipudi @aishu_dil… pic.twitter.com/V8A7Tha5lE— Sri Venkateswara Creations (@SVC_official) January 15, 2025 -
వెంకటేశ్ మూవీలో బుడ్డోడు.. క్యూట్ స్పీచ్‌తో అదరగొట్టేశాడు!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ సంక్రాంతికి థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈనెల 14న విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. ఈ సంక్రాంతికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికిందని టాలీవుడ్ సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ చిత్రంలో అందరినీ ఆకట్టుకున్నాడు ఓ బుడ్డోడు. వెంకటేశ్ కుమారుడిగా ఈ మూవీలో కనిపించిన రేవంత్ భీమల(బుల్లి రాజు) అనే చైల్డ్ ఆర్టిస్ట్ సంక్రాతికి వస్తున్నాం మూవీ ఈవెంట్లో సందడి చేశాడు. సినిమాలో మాత్రమే కాదు.. వేదికపై కూడా తన మాటలతో అందరికీ నవ్వులు తెప్పించాడు. ఇంతకీ ఆ బుడ్డోడు ఏమన్నాడో మీరు చూసేయండి.సక్సెస్ మీట్లో రేవంత్ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం.. నేను ఈ మూవీలో వెంకటేశ్ గారికి కుమారుడిగా చేశాను. వెంకటేశ్ లాంటి గొప్ప యాక్టర్‌తో పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో పనిచేసిన క్షణాలను నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన అనిల్ సార్‌కు థ్యాంక్స్. పటాస్ మూవీ నుంచి మీకు నేను పెద్ద ఫ్యాన్‌ను. మీనాక్షి మేడం, ఐశ్వర్య మేడంతో నేను చాలా ఎంజాయ్ చేశాను. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. దిల్ రాజు సార్, శిరీష్ సార్‌కు చాలా థ్యాంక్స్. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ చాలా థ్యాంక్స్. మేము సంక్రాంతికి వస్తున్నాం.. మీరు సంక్రాంతికి రండి అని మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ బుడ్డోడి స్పీచ్‌పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
మేము అనుకున్నదే జరిగింది..ఆనందంగా ఉంది: వెంకటేశ్
సంక్రాంతి పండక్కి మంచి ఫ్యామిలీ సినిమా ఇవ్వాలని అనుకొని ‘సంక్రాంతికి వస్తున్నాం’ చేశాం. ఇలాంటి ఓ మంచి సినిమా వస్తే ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారని తెలుసు. మేం అనుకున్నదే జరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్, నా ఫ్యాన్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఫ్యామిలీ సినిమా చేసిన ప్రతిసారి ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయడం, వారిలో నవ్వులు చూడటం ఆనందంగా ఉంటుంది’ అన్నారు విక్టరీ వెంకటేశ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’( Sankranthiki Vasthunam). అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది.(చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో వెంకటేశ్(venkatesh) మాట్లాడుతూ.. ‘మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రియాక్షన్స్ అన్నీ జెన్యూన్ గా ఉన్నాయి. మేము మంచి ఫ్యామిలీ సినిమా ఇవ్వాలనే దిగాం. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం, అదే రోజున వచ్చి ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అనిల్ నా కెరీర్ లో మరో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇది తన కెరీర్ లో కూడా బిగ్ బ్లాక్ బస్టర్. దిల్ రాజు, శిరీష్ కు ఇది మరో బిగ్ హిట్. ఐశ్వర్య, మీనాక్షి టీం అందరి విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. అందరికీ చాలా థాంక్స్' అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) మాట్లాడుతూ.. బెసికలీ టెక్నికలీ కలర్ ఫుల్లీ హౌస్ ఫుల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగల్(నవ్వుతూ). బెనిఫిట్ షోలకి ఫ్యాన్స్ యూత్ వెళ్తుంటారు. ఫస్ట్ టైం ఉదయం నాలుగున్నర షోలకి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ రావడం ఈ సినిమా ద్వారా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మాకు. థియేటర్లో ప్యాక్డ్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్స్. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకున్నాం. పండగ రోజులు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది వెంకీ సార్ పొంగల్. మా సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అన్నారు.నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. మా కాంబినేషన్ లో ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్. ఎఫ్ 2 ని వారంలో సింపుల్ గా దాటేసి అద్భుతాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్లాక్ బస్టర్ సంక్రాంతి చేసిన అనిల్ కి, వెంకటేష్ గారికి, హీరోయిన్స్ కి, ప్రేక్షులందరికీ థాంక్ యూ. నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఉన్న సినిమా ఇది. ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేయండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. ప్యాక్డ్ థియేటర్స్ లో చూసినప్పుడు ఆ ఫన్ వేరుగా ఉంటుంది. అందరికీ థాంక్ యూ' అన్నారు. ఈ సక్సెస్ మీట్లో హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌తో పాటు నిర్మాత శిరీష్ కూడా పాల్గొన్నారు. -
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ
టైటిల్: ‘సంక్రాంతికి వస్తున్నాం’నటీనటులు: వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, వీకే నరేశ్, వీటీ గణేష్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర లిమాయే తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: శిరీష్, దిల్ రాజుదర్శకత్వం: అనిల్ రావిపూడిసంగీతం: భీమ్స్ సిసిరిలియోసినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డిఎడిటర్: తమ్మిరాజువిడుదల తేది: జనవరి 14, 2025ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Review). రిలీజ్ విషయంలో చివరిది అయినా.. ప్రమోషన్స్‌లో మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే ఇదే ముందంజలో ఉంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్ మరే సినిమాకు చేయలేదు. దానికి తోడు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ అదిరిపోవడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీ గ్యారెంటీ’ అనిపించుకున్న వెంకటేశ్ ఖాతాలో మరో ‘ ఫ్యామిలీ విక్టరీ’ పడిందా రివ్యూలో చూద్దాం.కథేంటేంటే.. డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు. కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు. ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని కథలు మన ఊహకందేలా సింపుల్‌గా ఉంటాయి. సినిమా ప్రారంభం మొదలు ఎండ్ వరకు ప్రతీది అంచనాకు తగ్గట్టే ఉంటాయి. కానీ తెరపై చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. పాత కథ, రొటీన్ సీన్లే అయినప్పటికీ ఎంటర్టైన్ అవుతుంటాం. అలాంటి సినిమాలను తెరకెక్కించడం అనిల్ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. సింపుల్ పాయింట్‌ని తీసుకొని రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. గత సినిమాల మాదిరే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. టైటిల్ మాదిరే సంక్రాంతికి అసలైన సినిమా ఇది.(Sankranthiki Vasthunam Review)అనిల్ రావిపూడి(Anil Ravipudi) రిలీజ్ ముందే సినిమా కథంతా చెప్పేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోనూ అదే చేశాడు. ట్రైలర్లోనే కథంతా చెప్పేశాడు. హీరోహీరోయిన్ల క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తాయో కూడా ప్రమోషన్స్‌లోనే చెప్పేశాడు. స్టోరీ మొత్తం తెలిసినా కూడా తెరపై ఆ కథను చూసి ఎంజాయ్ చేయాలని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు. దానికి కారణం.. ఈ కథ మెయిన్ పాయింట్. భార్య, భర్త, ప్రియురాలు.. ఈ మూడు పాత్రలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కనిపిస్తాయి. వాళ్ల మధ్య వచ్చే ప్రతీ సీన్ మన నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం. అలాంటి పాయింట్ పట్టుకోవడమే అనిల్ రావిపూడి సక్సెస్. ఓ ఫ్యామిలీ స్టోరీకి ఓ వెరైటీ ఇన్వెస్టిగేషన్ యాడ్ చేసి ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనాన్ని నడిపించాడు. ఆకెళ్ల కిడ్నాప్ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఈ కిడ్నాప్ సీన్‌ని కూడా ఎంటర్టైనింగ్గానే తీర్చిదిద్ది.. కథనం మొత్తం ఫుల్ కామెడీ వేలో సాగుతుందనే ముందే చెప్పేశాడు దర్శకుడు. ఆ తర్వాత రాజు ఫ్యామిలీ పరిచయం నవ్వులు పూయిస్తుంది. వైడీ రాజు కొడుకు బుల్లిరాజు పండించే కామెడీకి పడిపడి నవ్వుతారు. వైడీ రాజు ఇంటికి మీనాక్షి వచ్చిన తర్వాత కామెడీ డోస్ డబుల్ అవుతుంది. ఒక పక్క భార్య, మరో పక్క మాజీ ప్రియురాలుతో హీరో పడే బాధ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఆహ్లాదకరమైన పాటలు... పొట్టచెక్కలయ్యే కామెడీ సీన్లతో ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. జైలర్ జార్జ్ ఆంటోనీ(ఉపేంద్ర లిమాయే)తో వచ్చే కొన్ని సీన్లు అంతగా ఆకట్టుకోవు. ఆస్పత్రి సీన్ కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. ‘ఆవకాయ’ సీన్‌కు అయితే పడిపడి నవ్వుతారు. క్లైమాక్స్‌ని పకడ్బందీగా రాసుకున్నాడు. క్లైమాక్స్ యాక్షన్ సీన్ అయితే అదిరిపోతుంది. అక్కడ వెంకటేశ్ చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా.. మగవాళ్లకు మనో ధైర్యాన్ని ఇచ్చేలా ఆ డైలాగ్స్ ఉంటాయి. ముగింపులో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. మొత్తంగా సంక్రాంతికి చూడాల్సిన మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పాత్రను వెంకటేశ్(Venkatesh) చేస్తే ఎలా ఉంటుందో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రంలోనే చూసేశాం. ఆయన కామెడీ టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా వెంకీ అలాంటి పాత్రే చేశాడు. మాజీ ప్రియురాలు, భార్య మధ్య నలిగిపోయే యాదగిరి దామోదర రాజు పాత్రలో ఒదిగిపోయాడు. ఇద్దరి ఆడాళ్ల మధ్య నలిగిపోతూ నవ్వులు పూయించాడు. యాక్షన్‌తో అలరించడమే కాకుండా పాట పాడి ఆకట్టుకున్నాడు. ఇక చదువురాని పల్లెటూరి అమ్మాయి, రాజు భార్య భాగ్యంగా ఐశ్వర్య రాజేశ్ తనదైన నటనతో ఆకట్టుకుంది.రాజు మాజీ ప్రియురాలు, ఐపీఎస్ అధికారి మీనాక్షిగా మీనాక్షి చౌదరి అదరగొట్టేసింది. తొలిసారి ఇందులో యాక్షన్ సీన్ కూడా చేసింది. ఇక వీరందరితో పాటు ముఖ్యంగా మట్లాడుకోవాల్సిన మరో పాత్ర బుల్లి రాజు. ఈ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ ఒదిగిపోయాడు. ఇంత మంది స్టార్స్ ఉన్నప్పటికీ.. తనదైన నటనతో అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగాడానికి బుల్లిరాజు పాత్ర కూడా ఒక ప్రధాన కారణం. ‘కొరికేస్తా.. కొరికేస్తా’ అంటూ ఈ బుడ్డోడు చేసిన కామెడీకి ప్రేక్షకులు పలగబడి నవ్వారు. నరేశ్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా భీమ్స్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్. అద్భుతమైన పాటలతో పాటు అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు. ‘గోదారి గట్టు మీద...’పాటతో పాటు ప్రతి పాట తెరపై చూసినప్పుడు మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్విటర్ రివ్యూ
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు కొన్ని చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. సంకాంత్రికి వస్తున్నాం సినిమా కథ ఏంటి..? ఎలా ఉంది..? వెంకీ, అనిల్ కాంబో ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడిందా లేదా..? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్‌లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది. సినిమా ఎంటర్టైనింగ్గా ఉందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. రొటీన్ కథ అయినప్పటికీ కామెడీ బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. #SankranthikiVasthunamDone with my show 💯2nd half is hilarious 🤣 That avakaya episode is too goodAlthought it felt lengthy at parts, @AnilRavipudi handled last 30 minutes very well and ended with a messageMy rating would be 3.5/5Families gonna have a feast in… pic.twitter.com/HtUK07VSmT— INNOCENT EVIL 😈 (@raju_innocentev) January 14, 2025 ఇప్పుడే సినిమా చూశాను. సెకండాఫ్ హిలేరియస్. అవకాయ ఎపిసోడ్ అదిరిపోయింది. అయితే కొన్ని సీన్లు సాగదీతగా ఉన్నాయి. చివరి 30 నిమిషాలు అనిల్ రావిపూడి చక్కగా హ్యాండిల్ చేశాడు. ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా ఇది అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్‌ఇచ్చాడు.#SankranthikiVasthunam is a timepass festive family entertainer with the only motive being to entertain. The film flows in a Typical zone that Director Ravipudi follows similar to F2. The comedy works well in parts but is over the top and irritates a bit in others. Production…— Venky Reviews (@venkyreviews) January 13, 2025 సంక్రాంతికి వస్తున్నాం టైంపాస్ కామెడీ సినిమా. పండక్కి వినోదాన్ని అందించే చిత్రం. ఎఫ్2 మాదిరే హిలేరిస్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు అనిల్ రావిపూడి. పార్టులుగా చూస్తే కామెడీ బాగా వర్కౌట్ అయింది. ప్రొడక్షన్ క్యాలిటీస్ అంతగా బాగోలేవు. సినిమాలో పెద్ద కథ కూడా ఉండదు. లాజిక్స్ గురించి పట్టించుకోవద్దు. వెంకటేశ్ తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఈ పండక్కి ఫ్యామిలీస్‌కి ఈ సినిమా మంచి ఛాయిస్ అంటూ మరో నెటిజన్ 2.75 రేటింగ్ ఇచ్చాడు.#SankranthikiVasthunam Liked it! Baagundi!A hilarious entertainer with mediocre story but makes you laugh out loud❤️The theme itself has a lot of potential to make you chuckle, #Venkatesh & #AnilRavipudi are very successful in it#AishwaryaRajesh is impressive👌FUN GUARANTEED! pic.twitter.com/J8AVr2Nei5— Sanjeev (@edokatile) January 14, 2025CLEAN HIT 🎯 🎯 #SankranthikiVasthunam is a fun family Entertainer with Anil Ravipudi's racyscreenplay and songs.🥵🎶🎶It's a Good Family Entertainer 3.5/5 Rating 🤞🤙#SankranthikiVasthunamreview #makarsankranti2025 #Pongal#HappyLohri #MahaKumbh2025 #MakaraSankranti2025 pic.twitter.com/2tJWwcbzTz— Ashok (@imashok1234) January 14, 2025#SankranthikiVasthunam - Family Entertainer!Anil Ravipudi succeeds in entertaining his target audience with a fun film. Bheems music and songs💥Family audience elaago hit ichestharu🫡#SankranthikiVasthunamReview #SankranthikiVasthunnam#VenkyMama #Venkateshdaggubati https://t.co/SHy9jWy6r4 pic.twitter.com/Vokja82Kdi— IndianCinemaLover (@Vishwa0911) January 14, 2025#Bheemsceciroleo music is very good - foot tapping and BGM is 🔥Except some over the top scenes ( as expected ) everything goes according to @AnilRavipudi 's meter and should score a hit for this pongal too.#SankranthikiVasthunam #SankranthikiVasthunamreview— Shiva Kumar Grandhi (@sivakumargrandh) January 13, 2025#SankranthikiVasthunamReview - For Families!Positives:- Venky Mama 👌❤️ - Bheems' Music and Songs ❤️❤️ - Comedy Scenes 😂 Negatives:- Over-the-top Scenes,Especially in the Second Half - Predictable PlotAn Enjoyable Entertainer for Families! Follow 👉…— Movies4u Reviews (@Movies4uReviews) January 13, 2025 -
సంక్రాంతికి మంచి మూవీతో వస్తున్నాం: వెంకటేశ్
‘‘సంక్రాంతికి వస్తున్నాం’ బాగా వచ్చింది. మీరంతా మీ ఫ్యామిలీతో థియేటర్స్‌కు వచ్చి, మా సినిమాని ఎంజాయ్ చేయండి’’ అన్నారు వెంకటేశ్. ఆయన హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం నేడు (మంగళవారం) విడుదలవుతోంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బ్లాక్‌బస్టర్ మ్యూజికల్ నైట్’ ఈవెంట్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహా సినిమాలను నా ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. అనిల్ ప్రతి సీన్‌ని అద్భుతంగా తీశాడు. మళ్లీ మేము సంక్రాంతికి మంచి సినిమాతో వస్తున్నాం’’ అన్నారు. ‘‘వెంకటేశ్‌గారితో నేను చేసిన మూడో ఫిల్మ్ ఇది. ఆడియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. ఈ సినిమా నా కెరీర్లోనే బెస్ట్ ఎంటర్టైనర్గా నిలవనుంది’’ అని తెలిపారు అనిల్ రావిపూడి.‘‘వెంకటేశ్‌గారితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నా కల నిజమైనట్లుగా ఉంది’’ అని పేర్కొన్నారు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. ‘‘ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు ‘దిల్’ రాజు. ఈ వేడుకలో నటుడు ఉపేంద్ర లిమాయే, సింగర్ రమణ గోగుల, లిరిక్ రైటర్స్ రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్ తమ్మిరాజు, డీవోపీ సమీర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. -
నాంపల్లి కోర్టు వార్నింగ్.. దగ్గుబాటి హీరోలపై కేసు నమోదు
టాలీవుడుకు చెందిన దగ్గుబాటి వెంకటేష్,సురేష్, రానాలపై కేసు నమోదైంది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. దక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేసినందుకు వారిపై కేసు నమోదైంది. దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, రానా, అభిరామ్‌పై 448, 452,458,120బి సెక్షన్లపై కేసు నమోదైంది.వివాదం ఏంటి..?డెక్కన్ కిచెన్ లీజు విషయంలో ఆ హోటల్ యజమాని నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య వివాదం ఏర్పడింది. ఫిలిం నగర్‌లోని వెంకటేష్‌కు చెందిన స్థలంలో నందకుమార్ వ్యాపారం నిర్వహించేవాడు. లీజు విషయంలో ఇద్దరి మధ్య విబేదాలు రావడంతో హోటల్ యజమానీ కోర్టుకు వెళ్లాడు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి అక్రమంగా బిల్డింగ్ కూల్చివేశారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. న్యాయస్థానం సూచనల మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.దగ్గుబాటి ఫ్యామిలీ ఏం చెబుతుంది..?జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ రోడ్డు నంబర్ ఒకటిలో వెంకటేష్‌కు చెందిన 1000 గజాలు స్థలాన్ని సుమారు ఆరేళ్ల క్రితం నందకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. అక్కడ డెక్కన్ కిచెన్ పేరుతో ఆయన ఒక రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ స్థలానికి పక్కనే ఉన్న రానాకు చెందిన స్థలాన్ని కూడా నందకుమార్ లీజుకు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడే వారి మధ్య వివాదం తలెత్తింది. రానా నుంచి తీసుకున్న స్థలం లీజు పూర్తి అయింది. కానీ, ఆ స్థలంలో నందకుమార్ నిర్మాణాలు చేయడంతో రానా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆపై జీహెచ్ఎంసీ అధికారులు నందకుమార్‌కు నోటీసులు జారీ చేసి డెక్కన్ కిచెన్ నిర్మాణాలను కూల్చివేశారు. కానీ, దగ్గుబాటి కుటుంబ సభ్యులు 60 మంది బౌన్సర్లతో తన రెస్టారెంట్‌ను కూల్చివేశారని నాంపల్లి కోర్టును నందకుమార్ ఆశ్రయించారు. ఈ స్థలం విషయంలో నందకుమార్‌పై కూడా కేసు నమోదు అయింది. దగ్గుబాటి కుటుంబానికి చెందిన స్థలాన్ని నందకుమార్ తన స్థలంగా చెప్పుకుంటూ మరో ఇద్దరికి లీజుకు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై రెండు కేసులో నమోదు అయ్యాయి. -
అలాంటి నటన నాకు రాదు: హీరో వెంకటేశ్
‘‘జీవితాన్ని హాయిగా.. సంతోషంగా జీవించాలి. అత్యాశలకు పోకూడదు. అతిగా ఆలోచించకూడదు. మన ఆలోచనలు సానుకూలంగానే ఉండాలి. అదే సమయంలో మనం ఏదైనా కోరుకుంటున్నప్పుడు ఆ పనిని నిజాయితీతో చేయాలి. క్రమశిక్షణగా ఉండాలి... కష్టపడాలి. అప్పుడు సాధ్యమౌతుంది. లైఫ్‌లో ఎప్పుడూ హోప్‌ను కోల్పోకూడదు. నా లైఫ్‌లో సినిమా ప్రమోషన్స్ అయినా, మరేదైనా నేను పెద్దగా ప్లాన్ చేసి చేయను. అలా ప్లాన్ చేసి చేస్తే అది యాక్టింగ్ అవుతుంది. అలాంటి నటన నాకు రాదు. వాస్తవానికి దగ్గరగా, సహజంగా ఓ ఫ్లోలో నా ధోరణిలో ముందుకు వెళ్తుంటాను’’ అన్నారు హీరో వెంకటేశ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో వెంకటేశ్ చెప్పిన సంగతులు.⇒ నా కెరీర్లో సంక్రాంతికి వచ్చిన మెజారిటీ సినిమాలు విజయం సాధించాయి. ఇప్పుడు ‘సంక్రాంతి వస్తున్నాం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ పండక్కి పర్ఫెక్ట్ ఫిల్మ్. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సినిమాలో చిన్న క్రైమ్ ఎలిమెంట్ ఉంది. అయినా ఇది మంచి వినోదాత్మక చిత్రం. క్లైమాక్స్‌లో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు, యూత్... ఇలా అందరూ ఎంజాయ్ చేసే ఫిల్మ్ ఇది. సినిమాలోని కొన్ని సీన్స్‌లో సంక్రాంతి పండగ సన్నివేశాలు ఉన్నాయి. అందుకే ఈ మూవీకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పెట్టడం జరిగింది⇒ నాది, దర్శకుడు అనిల్‌ది సూపర్‌హిట్ కాంబినేషన్. మాజీ పోలీసాఫీసర్, అతని మాజీ ప్రేయసి, అతని భార్య... మధ్యలో ఓ క్రైమ్‌స్టోరీ... ఇలా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా లైన్ తను చెప్పగానే చాలా కొత్తగా అనిపించింది. మినిమమ్ గ్యారెంటీ సినిమా అని తెలిసిపోయింది. సినిమాలో కామెడీ రొటీన్‌గా ఉండదు. కొత్త కామెడీ స్టయిల్ ట్రై చేశాం. ఆడియన్స్‌కు నచ్చుతుందనే అనుకుంటున్నాం. అలాగే అనిల్‌తో నాకు మంచి ర్యాపో కుదిరింది. తనతో మూవీస్‌ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాలో హీరోయిన్స్ ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షీ చౌదరి బాగా నటించారు. ఇద్దరి క్యారెక్టర్స్ క్రేజీగా ఉంటాయి. ⇒ నాన్నగారు (నిర్మాత డి. రామానాయుడు) స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్, సినిమా ప్రొడక్షన్ వంటి అంశాలను చర్చిస్తున్నప్పుడు నేను పాల్గొనేవాడిని. అయితే నేను అప్పటికి సినిమాల్లోకి రాలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో ఇప్పటి ప్రముఖ సంగీత దర్శకులతో మ్యూజిక్ సిట్టింగ్స్ చేశాను. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘బ్లాక్‌బస్టర్ పొంగల్’ సాంగ్ విన్నప్పుడు ఈ సాంగ్ నేనే పాడాలనుకున్నాను... పాడాను. సాంగ్స్‌లో ఎక్కువగా ఇంగ్లిష్ పదాలే ఉన్నాయి కాబట్టి నాకు సులభంగా అయిపోయింది. అయితే మిగతా పాటలకు కూడా మంచి స్పందన వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో చాలా కష్టపడ్డాడు. అలాగే కొంత గ్యాప్ తర్వాత రమణ గోగులగారు మా సినిమాలో పాట పాడటం హ్యాపీగా అనిపించింది. ‘గోదారి గట్టు, మీనూ, బ్లాక్‌బస్టర్ పొంగల్...’ పాటలు బ్లాక్‌బస్టర్ కావడం అనేది ఆడియన్స్ గొప్పతనం. ⇒ ‘సీతమ్మ వాకిట్లో..’ చిత్రం నుంచి ‘దిల్’ రాజుగారితో నా జర్నీ కొనసాగుతోంది. వారి బ్యానర్లో నేను చేసిన సినిమాలన్నీ బాగా ఆడాయి. ఆయనకు మరిన్ని విజయాలు రావాలి. నా తర్వాతి సినిమా కోసం సురేష్ప్రొడక్షన్, సితార, మైత్రీ, వైజయంతి మూవీస్ సంస్థల్లో కథల పై వర్క్ జరుగుతోంది. ఇక ‘రానా నాయుడు 2’ సిరీస్ మార్చిలో స్ట్రీమింగ్ కావొచ్చు. -
క్లైమాక్స్ చాలా సర్ ప్రైజ్ చేస్తుంది :వెంకటేశ్
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో వెంకటేశ్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ నా కెరీర్లో వస్తున్న మరో సంక్రాంతి సినిమా ఇది. ఒక క్లీన్ ఎంటర్ టైనింగ్ ఫిల్మ్ తో రావడం చాలా ఆనందంగా ఉంది. లిటిల్ క్రైమ్ ఎలిమెంట్ న్యూ జానర్ కూడా ఉంది. సినిమా జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. అంతా పాజిటివ్ గా ఉంది. నా కెరీర్ లో సంక్రాంతికి వచ్చిన మోస్ట్ ఫిలిమ్స్ చాలా బాగా ఆడాయి. ఈ సినిమా కూడా అద్భుతంగా ఆడుతుందనే నమ్మకం ఉంది. → ఈసారి ప్రమోషన్స్ చాలా ఎనర్జిటిక్ గా చేయడానికి ప్రత్యేక కారణమేది లేదు. నేచురల్ గా జరిగింది. మ్యూజిక్ చాలా నచ్చింది. నాకు డ్యాన్స్ చేయడం ఇష్టం. కొన్ని మ్యూజిక్ ట్యూన్స్ వినగానే క్రేజీగా అనిపించింది. అలాగే డైరెక్టర్ అనిల్, ఇద్దరు హీరోయిన్స్.. లైవ్లీ టీం కుదిరింది. ప్రమోషన్స్ లో ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాం. ప్రమోషన్స్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేయడం హ్యాపీగా ఉంది.→ ఇందులో రమణ గోగుల గారు పాడిన పాట పెద్ద హిట్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత ఆయన నా సినిమాకి పాడారు. పాటకు అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది.→ ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్.. ఈ లైనే చాలా ఫ్రెష్ గా అనిపించి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేయాలనుకున్నా. మినిమం గ్యారెంటీ అని అక్కడే తెలిసిపోయింది. అనిల్ నాది సూపర్ హిట్ కాంబినేషన్. మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. పెర్ఫార్మెన్స్ వైజ్ ఇందులో కామెడీ స్టయిల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చాలా షటిల్ గా కొత్తగా ట్రై చేశాం. ఫ్రెష్ సీన్స్ ఉంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. అనిల్ తో మంచి రేపో కుదిరింది. తనతో మూవీస్ కంటిన్యూ చేయాలని ఉంది.→ భీమ్స్ చాలా హార్డ్ వర్క్ చేసి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. తనకి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో చేశాడు. ఫస్ట్ ట్యూన్ వినగానే హిట్ అనుకున్నాం. అది సూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అది ఆడియన్స్ గొప్పదనం. గోదారి గట్టు పాట 85 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. అన్ని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.→ సినిమాని ఫాస్ట్ గా ఫినిష్ చేయడం హ్యాపీగా అనిపించింది. అనుకున్నదాని ప్రకారం అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఓ మంచి చిత్రంతో వస్తున్నాం. క్లైమాక్స్ చాలా సర్ప్రైజ్ చేస్తుంది. పిల్లలు, పెద్దలు, యూత్ అందరూ ఎంజాయ్ చేస్తారు. → ప్రస్తుతం ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వలేదు.సురేష్ ప్రొడక్షన్, సితార వంశీ, మైత్రీ, వైజయంతి మూవీస్ లో కథల పై వర్క్ జరుగుతుంది. ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. -
ఆ సాంగ్ విని అర్థరాత్రి రెండు గంటలకు డ్యాన్స్ చేశా: వెంకటేశ్
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో విక్టరీ వెంకటేశ్(venkatesh) ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. యూట్యూబ్‌లో మిలియన్లకొద్ది వ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ పాట మొదట వెంకటేశ్‌తో పాడించాలని అనుకోలేదట మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో. దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా ఆ ఆలోచన లేదట. కానీ వెంకటేశ్ పాడతానని అనడంతో ట్రై చేశారట. అది కాస్త బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ పాట గురించి వెంకటేశ్ కూడా మాట్లాడారు. తనకు బాగా నచ్చడంతోనే ఆ పాట పాడినట్లు చెప్పాడు. అంతేకాదు ఆ పాట వినగానే తెలియకుండా డ్యాన్స్ చేశాడట.‘అనిల్ రావిపూడి(Anil Ravipudi) నాకు ఈ పాటను షేర్ చేసి వినమని చెప్పారు. అర్థరాత్రి 2 గంటలకు ఆ సాంగ్ వింటూ తెలియకుండా డాన్స్ చేశాను. ఎదో క్రేజీ ఎనర్జీ ఆ సాంగ్ లో ఉంది. సరదాగా నేనే పాడతానని అన్నాను. ఆ రోజు గొంతు బాగానే ఉంది. ఇంగ్లీష్ వర్డ్స్ ఉండటంతో నాకు ఇంకా ఈజీ అయ్యింది’ అని వెంకటేశ్ అన్నారు. అలాగే రమణ గోగుల పాడిన పాటకు బాగా నచ్చిందని, చాలా గ్యాప్ తర్వాత ఆయన నా సినిమాకి పాట పాడడం, దానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందన్నారు.ముచ్చటగా మూడోదిఅనిల్ రావిపూడి, వెంకేటశ్లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు కూడా దిల్ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన చిత్రాలే. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సూపర్ హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఈచిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది.ప్రమోషన్స్‌లో సూపర్ హిట్ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు పోటీ పడ్డాయి. అందులో మొదటి చిత్రం గేమ్ ఛేంజర్ అల్రెడీ రిలీజైంది. రేపు(జనవరి 12) బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఒక రోజు గ్యాప్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’రిలీజ్ అవుతుంది. అయితే ఈ మూడు సినిమాల ప్రమోషన్లలో విషయంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ముందంజలో ఉంది. అన్నింటికంటే చివరిగా రిలీజ్ అవుతున్నప్పటికీ.. మిగతా రెండు సినిమాల కంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించాయి. డిఫరెంట్ ప్రమోషన్స్‌తో సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లారు. ఒక పక్క అనిల్ రావిపూడి హీరోయిన్లు, మరోపక్క విక్టరీ వెంకటేశ్, అందరూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని చేశారు. కేవలం ఇంటర్వ్యూలో మాత్రమే కాకుండా టీవీ షోలు, కామెడీ షోలు అన్నింటిల్లోనూ పాల్గొన్నారు. వెంకటేశ్ అయితే గతంలో ఎప్పుడు లేనివిధంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి ప్రమోషన్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కూడా అదే స్థాయిలో రానిస్తుందో లేదో మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. -
తెల్ల కల్లు, మటన్ ముక్క.. దిల్ రాజు కామెంట్స్ వైరల్
ఈ సంక్రాంతికి మూడు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే వాటిల్లో డాకు మహారాజ్ మినహా మిగతా రెండు సినిమాలకు దిల్ రాజే(Dil Raju) నిర్మాత. జనవరి 10న గేమ్ ఛేంజర్, 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు వరుస ఇంటర్వ్యూలో ఫుల్ బిజీ అయిపోయారు. ఒక పక్క ఇంటర్వ్యూలు ఇస్తునే మరోపక్క ప్రీరిలీజ్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లను నిర్వహిస్తూ రెండు సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నాడు.ఈ ప్రయత్నం దిల్ రాజు ఫూర్తిగా సఫలం అయ్యాడు. తన రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేశాడు.(చదవండి: అలాంటి ప్రశ్నలు అడగొద్దని చెప్పానుగా.. రజనీ అసహనం)ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’( Sankranthiki Vasthunam Movie) అనే సినిమా విషయంలో ముందు నుంచి దూకుడుగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఒకపక్క అనిల్ రావిపూడి, మరోపక్క వెంకటేశ్ సినిమా ప్రమోషన్స్‌ని తమ భుజాన వేసుకున్నారు. అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక తాజాగా నిజమాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..ఆంధ్రాలో సినిమాలకు వైబ్ ఉంటే.. తెలంగాణలో కల్లు, మటన్ కు వైబ్ ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దిల్ రాజు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అసలేం జరిగిదంటే..సినిమా గురించి మాట్లాడేందుకు దిల్ రాజు స్టేజ్ ఎక్కగానే.. ‘సర్.. స్పీచ్ మాములుగా ఉండొద్దు.. ఒక్క దెబ్బకు వైరల్ అయిపోవాలి’ అంటూ యాంకర్ శ్రీముఖి రిక్వెస్ట్ చేసింది. దిల్ రాజు అదే జోష్‌లో తెలంగాణ యాసలో మాట్లాడుతూ రెచ్చిపోయారు. ‘ఏం దావత్ చేద్దామా..? చెట్లళ్లలకు పోదామా..? అని ఆడియన్స్‌ని అడిగాడు .ఆ తర్వాత స్టేజ్ పైనే ఉన్న వెంకటేశ్(venkatesh)ని చూస్తూ.. ‘సర్ మా నిజమాబాద్‌లో తెల్ల కల్లు ఫేమస్. పొద్దునపూట నీర తాగితే వేరే లెవెల్లో ఉంటుంది. మావోళ్లకు( తెలంగాణ) సినిమా అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు.. ఆంధ్రకు వెళ్తే సినిమాకు ఓ స్ఫెషల్ వైబ్ ఇస్తారు.. తెలంగాణలో మటన్, తెల్లకల్లుకే వైబ్ ఇస్తారు’ అని దిల్ రాజు అనడంతో హీరోతో సహా ఆడియన్స్ అంతా గట్టిగా నవ్వారు.ముచ్చటగా మూడో చిత్రం..విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన మూడో చిత్రమే ‘సంక్రాంతికి వస్తున్నాం’. అంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు సూపర్ హిట్ కొట్టాయి. బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ తీసిన తర్వాత అనిల్ నుంచి వస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా రిలీజైన ఈ చిత్రం ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. వెంకీ, అనిల్ తరహా కామెడీతో ట్రైలర్‌ని కట్ చేశారు. ట్విస్ట్‌లు, థ్రిల్స్, యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నిజామాబాద్‌లో పెట్టిన తన సినిమా కార్యక్రమంలో జనాల రెస్పాన్స్ పెద్దగా లేదని తెలంగాణలో సినిమాల కంటే కల్లు, మటన్ అంటే వెంటపడతారని మాట్లాడిన దిల్ రాజు pic.twitter.com/5W2AOhgDWG— Telugu Scribe (@TeluguScribe) January 7, 2025 -
వెంకి మామతో ‘రాములమ్మ’ఫ్యామిలీ.. లంగా ఓణిలో మరింత అందంగా మెరిసిపోతున్న శ్రీముఖి (ఫోటోలు)
-
‘సంక్రాంతి..’చూడండి..మాములుగా ఉండదు: వెంకటేశ్
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Movie). మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసి, చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చె΄్పారు. అలాగే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని సోమవారం రాత్రి నిజామాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ–‘‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఈ సంక్రాంతికి వస్తున్నాం. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఈ చిత్రం తీశాడు అనిల్. మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి.. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సంక్రాంతికి వస్తున్న ‘గేమ్ చేంజర్, ‘డాకు మహారాజ్’ సినిమాలు కూడా విజయం సాధించాలి. ‘దిల్’ రాజు, శిరీష్‌లతో ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. మా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చూడండి.. మామూలుగా ఉండదు’’ అన్నారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ లో ఇంతకు ముందు ఫిదా వేడుక చేశాం. అనిల్ నిజామాబాద్ లో వేడుక చేద్దామని అన్నారు. వెంకటేష్(Venkatesh) గారు అనిల్ శిరీష్ వారి భుజాన వేసుకొని 72 రోజుల్లో ఇంత పెద్ద సినిమాని ఫినిష్ చేశారు. పూర్తిస్థాయిలో ఓ సినిమా వేడుక నిజామాబాద్ లో జరగడం ఇదే ఫస్ట్ టైం. సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.1980లో ఇక్కడ రూపాయి టికెట్ తో నేను శిరీష్ సినిమాలు చూసేవాళ్ళం. అలా సినిమాలపై ఇష్టం ఏర్పడింది. మా 58వ సినిమా ఈవెంట్ ఇక్కడ చేయడం మాకు చాలా గర్వంగా వుంది. ఎంతోమంది హీరోలు, దర్శకులు సపోర్ట్ చేస్తే ఈ స్థాయిలో వున్నాం. అనిల్ మా బ్యానర్ లో ఆరు సినిమాలు చేసి ఒక పిల్లర్ లా నిలబడ్డారు. తను ఒకొక్కమెట్టు ఎదుగుతూ టాప్ డైరెక్టర్ గా అయ్యారు. ఈ ఏడాది మా సంస్థకు బ్లాక్ బస్టర్ పొంగల్ ఇయర్. పాన్ ఇండియా సినిమా గేమ్ చెంజర్ 10న రిలీజ్ అవుతుంది. మా బ్యానర్ లో ఎఫ్ 2 ఎఫ్ 3 లాంటి సూపర్ హిట్స్ చేసిన వెంకటేష్ గారి సంక్రాంతి వస్తున్నాం సినిమా జనవరి 14న వస్తోంది. అలాగే డాకు మహారాజ్ ని నైజంలో మేము రిలీజ్ చేస్తున్నాం. అందుకే ఇది మాకు బ్లాక్ బస్టర్ పొంగల్. ఐశ్వర్య రాజేష్ సహజంగా నటించింది. ఆ పాత్ర చాలా నచ్చుతుంది. మీనాక్షి(Meenakshi Chaudhary) పోలీస్ క్యారెక్టర్ అలరిస్తుంది. రామానాయుడు గారు నిర్మాతగా చరిత్ర సృష్టించారు. వెంకటేష్ గారి కలియుగ పాండవులు ఫోటో చూసి ఆయనకి ఫ్యాన్ అయ్యాను. సినిమా ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయ్యాను. వారిద్దరూ నా అభిమాన హీరోలు. వెంకటేష్ గారు వుంటే నిర్మాత సెట్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఆయనే అన్నీ జాగ్రత్తగా చూసుకుంటారు. మా బ్యానర్ లో నాలుగు సినిమాలు చేసిన హీరో వెంకటేష్ గారు. నిర్మాతని ప్రేమగా చూసుకునే హీరో ఆయన. వెంకటేష్ గారికి థాంక్ యూ సో మచ్. అనిల్ అద్భుతంగా సినిమా తీశాడు. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్. పాటలు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అన్నీ పేర్చుకొని సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తీసుకురాబోతున్నాడు అనిల్. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ వెరీ మచ్' అన్నారు. ‘ట్రైలర్ లో చూసింది ఇంతే సినిమాలో చాలా చాలా వుంది. ఇది టిపికల్ జోనర్ సినిమా. వెంకటేష్ గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. సినిమాలో చాలా ట్విస్ట్ లు టర్న్స్ వుంటాయి. ఖచ్చితంగా పండక్కి చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాం. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. దిల్ రాజు గారి బ్యానర్ లో ఇది నా ఆరో సినిమా. నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఈ సినిమాలో పని చేసిన అందరూ సపోర్ట్ గా నిలుచారు. ఐస్వర్య, మీనాక్షి చాలా చక్కగా నటించారు. వెంకటేష్ గారు మనందరికీ నచ్చే వెంకీ మామ. ఆయన కెరీర్ లో చాలా గొప్ప పాత్రలు చేశారు. ఆయన కెరీర్ లో ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. వెంకటేష్ గారు ప్రాణం పెట్టి పని చేస్తారు. ప్రమోషన్స్ లో కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆయనకు థాంక్ యూ. మా టీం అందరికీ థాంక్ యూ. థాంక్ యూ నిజామాబాద్. సంక్రాంతికి మీ ఫ్యామిలీ అంతా కట్టకట్టుకొని థియేటర్స్ కి వచ్చేయండి. కడుపుబ్బా నవ్వించి బయటికి పంపుతాం. జనవరి 14 సంక్రాంతికి వస్తున్నాం డోంట్ మిస్. థాంక్ ' అన్నారు -
వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ HD మూవీ స్టిల్స్