ఈ సంక్రాంతికి మూడు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే వాటిల్లో డాకు మహారాజ్ మినహా మిగతా రెండు సినిమాలకు దిల్ రాజే(Dil Raju) నిర్మాత. జనవరి 10న గేమ్ ఛేంజర్, 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు వరుస ఇంటర్వ్యూలో ఫుల్ బిజీ అయిపోయారు. ఒక పక్క ఇంటర్వ్యూలు ఇస్తునే మరోపక్క ప్రీరిలీజ్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లను నిర్వహిస్తూ రెండు సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నాడు.ఈ ప్రయత్నం దిల్ రాజు ఫూర్తిగా సఫలం అయ్యాడు. తన రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేశాడు.
(చదవండి: అలాంటి ప్రశ్నలు అడగొద్దని చెప్పానుగా.. రజనీ అసహనం)
ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’( Sankranthiki Vasthunam Movie) అనే సినిమా విషయంలో ముందు నుంచి దూకుడుగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఒకపక్క అనిల్ రావిపూడి, మరోపక్క వెంకటేశ్ సినిమా ప్రమోషన్స్‌ని తమ భుజాన వేసుకున్నారు. అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక తాజాగా నిజమాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..ఆంధ్రాలో సినిమాలకు వైబ్ ఉంటే.. తెలంగాణలో కల్లు, మటన్ కు వైబ్ ఉంటుంది అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దిల్ రాజు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అసలేం జరిగిదంటే..
సినిమా గురించి మాట్లాడేందుకు దిల్ రాజు స్టేజ్ ఎక్కగానే.. ‘సర్.. స్పీచ్ మాములుగా ఉండొద్దు.. ఒక్క దెబ్బకు వైరల్ అయిపోవాలి’ అంటూ యాంకర్ శ్రీముఖి రిక్వెస్ట్ చేసింది. దిల్ రాజు అదే జోష్‌లో తెలంగాణ యాసలో మాట్లాడుతూ రెచ్చిపోయారు. ‘ఏం దావత్ చేద్దామా..? చెట్లళ్లలకు పోదామా..? అని ఆడియన్స్‌ని అడిగాడు .ఆ తర్వాత స్టేజ్ పైనే ఉన్న వెంకటేశ్(venkatesh)ని చూస్తూ.. ‘సర్ మా నిజమాబాద్‌లో తెల్ల కల్లు ఫేమస్. పొద్దునపూట నీర తాగితే వేరే లెవెల్‌లో ఉంటుంది. మావోళ్లకు( తెలంగాణ) సినిమా అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు.. ఆంధ్రకు వెళ్తే సినిమాకు ఓ స్ఫెషల్ వైబ్ ఇస్తారు.. తెలంగాణలో మటన్, తెల్లకల్లుకే వైబ్ ఇస్తారు’ అని దిల్ రాజు అనడంతో హీరోతో సహా ఆడియన్స్ అంతా గట్టిగా నవ్వారు.
ముచ్చటగా మూడో చిత్రం..
విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన మూడో చిత్రమే ‘సంక్రాంతికి వస్తున్నాం’. అంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు సూపర్ హిట్ కొట్టాయి. బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ తీసిన తర్వాత అనిల్ నుంచి వస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా రిలీజైన ఈ చిత్రం ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. వెంకీ, అనిల్ తరహా కామెడీతో ట్రైలర్‌ని కట్ చేశారు. ట్విస్ట్‌లు, థ్రిల్స్, యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
నిజామాబాద్‌లో పెట్టిన తన సినిమా కార్యక్రమంలో జనాల రెస్పాన్స్ పెద్దగా లేదని తెలంగాణలో సినిమాల కంటే కల్లు, మటన్ అంటే వెంటపడతారని మాట్లాడిన దిల్ రాజు pic.twitter.com/5W2AOhgDWG
— Telugu Scribe (@TeluguScribe) January 7, 2025
Comments
Please login to add a commentAdd a comment