
వెంకటేశ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam). ఈ సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని చిత్ర నిర్మాత ‘దిల్’ రాజు ప్లాన్ చేస్తున్నారని, ఈ దిశగా ఆయన ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారనే టాక్ తెరపైకి వచ్చింది.
ఈ హిందీ రీమేక్‌లో అక్షయ్ కుమార్(Akshay Kumar) అయితే బాగుంటుందని ‘దిల్’ రాజు భావిస్తున్నారట. కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో దక్షిణాది సినిమాల హిందీ రీమేక్స్‌లో నటించిన అక్షయ్ కుమార్ మరి... ఈ రీమేక్ చిత్రానికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
Comments
Please login to add a commentAdd a comment