Hindi Remake
-
బేబమ్మగా ఖుషీ
దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ల చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ‘ఉప్పెన’ హిందీ రీమేక్‌లో నటించనున్నారని టాక్. వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ (2021) తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కరోనా సమయంలో విడుదలైన ఈ మూవీ రూ. 100 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రంలో బేబమ్మగా తనదైన నటనతో అలరించిన కృతీ శెట్టి ప్రేక్షకుల మనసుల్లో బేబమ్మగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ హిట్ మూవీని నిర్మాత బోనీ కపూర్ హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ విషయాన్ని పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తెలుగులో అంగీకరించిన రెండో చిత్రం సందర్భంగా చెప్పారట బోనీ. ‘దేవర’ (ఎన్టీఆర్ హీరో) మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు జాన్వీ. ఈ సినిమా షూటింగ్లో ఉండగానే రామ్ చరణ్‌తో నటించే క్రేజీ ఆఫర్ సొంతం చేసుకున్నారీ బ్యూటీ. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ్రపారంభోత్వంలో జాన్వీ కపూర్‌తో పాటు ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన అతిథులతో సరదాగా ముచ్చటించిన బోనీ కపూర్.. ‘‘బుచ్చిబాబు తీసిన ‘ఉప్పెన’ సినిమా చూశాను. కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచన ఉంది. మా చిన్నమ్మాయి ఖుషీ కపూర్‌ని ‘ఉప్పెన’ మూవీ చూడమని చెప్పాను’’ అన్నారట. దీంతో ‘ఉప్పెన’ బాలీవుడ్ రీమేక్‌లో హీరోయిన్గా ఖుషీ నటిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
లవ్ టుడే హిందీ రీమేక్‌లో ఆమిర్ ఖాన్ కొడుకు, శ్రీదేవి కూతురు
ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ప్రేమికులు కానున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించి, స్వీయదర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘లవ్ టుడే’ హిందీ రీమేక్‌లో ఈ ఇద్దరూ నటించనున్నారు. రూ. ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను ఫ్యాంటమ్ స్టూడియోస్ దక్కించుకుంది. అప్పట్నుంచి ‘లవ్ టుడే’ హిందీ రీమేక్‌లో నటించనున్నారంటూ పలువురు హిందీ యువ హీరో హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా జునైద్ ఖాన్, ఖుషీ కపూర్ ఈ ప్రాజెక్ట్‌కి సైన్ చేశారని లేటెస్ట్ టాక్. దర్శకుడు అద్వైత్ చందన్ ఈ సినిమాను తెరకెక్కిస్తారట. -
రాజమౌళి, ప్రభాస్ ఎంట్రీతో పూర్తిగా మారిపోయిన హిందీ ఛత్రపతి లెక్కలు
-
ప్రభాస్ సినిమా రీమేక్ కష్టాలు బెల్లంకొండపై తీవ్రంగా ట్రోల్
-
ఫారిన్ స్టోరీ.. బాలీవుడ్ మూవీ
విదేశీ కథలపై హిందీ దర్శక–నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు పది విదేశీ చిత్రాలు రీమేక్ రూపంలో హిందీ తెరపై కనిపించనున్నాయి. ఆ ఫారిన్ చిత్రాల్లోని కథలు ఇండియన్ ఆడియన్స్‌కు దగ్గరగా ఉండటంతో రీమేక్ చేస్తున్నారు. ఇక ఫారిన్ స్టోరీతో రీమేక్ అవుతున్న బాలీవుడ్ మూవీస్ గురించి తెలుసుకుందాం. స్పానిష్ స్పోర్ట్స్ అండ్ కామెడీ డ్రామా ‘చాంపియన్స్’ (2018) హిందీ రీమేక్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లుగా ఆమిర్ ఖాన్ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ మెయిన్ లీడ్ రోల్ చేయనున్నారని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా కోసం ఆమిర్, సల్మాన్‌లు కలిసి చర్చించుకున్నారు. ఈ చిత్రానికి ఆమిర్ నిర్మాతగా మాత్రమే వ్యవహరించాలనుకుంటున్నారట. ఒకవైపు ఈ రీమేక్ గురించి చర్చిస్తూనే మరోవైపు సౌత్ కొరియన్ డిటెక్టివ్ డ్రామా ‘వెటరన్’ (2015) హిందీ రీమేక్‌లో నటించేందుకు సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపిస్తున్నారని టాక్. ‘వెటరన్’ హిందీ రీమేక్ హక్కులను బాలీవుడ్ దర్శక –నిర్మాత అతుల్ అగ్ని హోత్రి దక్కించుకున్నారు. ఇక అమెరికన్ కామెడీ డ్రామా ‘ది ఇంటర్న్’ (2015) హిందీ రీమేక్‌లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లీడ్ రోల్స్ చేయనున్నారు. ఈ రీమేక్‌కి అమిత్ శర్మ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ సినిమా నుంచి దీపికా తప్పుకునే ఆలోచనలో ఉన్నారని, అందుకే షూటింగ్ ఆరంభించలేదని టాక్. కాగా, ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ట్రాన్స్పోర్టర్’ (2002) హిందీ రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారు నిర్మాత విశాల్ రానా. ఇందులో హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్లలో ఎవరో ఒకరు నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. అలాగే అమెరికన్ సూపర్‌హిట్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘ర్యాంబో’ రీమేక్‌లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించనున్నారని ప్రకటన వచ్చిoది. ఇక షాహిద్ కపూర్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ‘బ్లడీ డాడీ’ అనే సినిమా రూపొందుతోంది. ఇది ఫ్రెంచ్ ఫిల్మ్ ‘స్లీప్‌లెస్ నైట్’ (2011)కు రీమేక్ అనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. అదే విధంగా సౌత్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లైండ్’ (2011) హిందీ రీమేక్‌లో సోనమ్ కపూర్ లీడ్ రోల్ చేస్తున్నారు. అలాగే ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘కోడ’ (2021) రీమేక్‌ను దర్శకుడు విశాల్ బాల్ తెరకెక్కించనున్నారని, అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ ‘కిల్ బిల్’ (2003) రీమేక్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందనుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇలా విదేశీ చిత్రాల హిందీ రీమేక్ జాబితాలో మరికొన్ని కూడా ఉన్నాయి. -
సల్మాన్.. ఆమిర్... ఓ సినిమా!
సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్లు కలిసి ఓ సినిమా చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. స్పానిష్ ఫిల్మ్ ‘చాంపియన్స్’ హిందీ రీమేక్‌ను నిర్మించి, నటించా లనుకున్నారు ఆమిర్. అయితే ఇప్పుడు ఈ రీమేక్‌కు సల్మాన్ ఖాన్ బాగుంటారని భావించారట. ఈ సినిమా గురించి చర్చించడానికి సల్మాన్‌ను ఇంటికి ఆహ్వానించారట ఆమిర్. కాగా తాను నటించిన ‘ది ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ ‘లాల్‌సింగ్ చడ్డా’ సరిగ్గా ఆడకపోవడంతో వెంటనే మరో రీమేక్‌లో నటించాలనే నిర్ణయాన్ని ఆమిర్ మార్చుకున్నారట. అందుకే హీరోగా నటించాల్సిందిగా సల్మాన్‌ను రిక్వెస్ట్ చేశారని టాక్. -
అందుకే ‘జెర్సీ’లో నటించనని చెప్పా: రష్మిక వివరణ
Rashmika Mandanna Was 1st Choice For Shahid Jersey: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన జెర్సీ ఈ నెల 22న విడుదలై బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఇందులో షాహిద్ నటకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో షాహిద్ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటున్నాయి. తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన నేచులర్ స్టార్ నాని జెర్సీకి ఇది హిందీ రీమేక్ అనే విషయం తెలిసిందే. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీ ఇదే పేరుతో ఈ మూవీని రీమేక్ చేశాడు. ఇందులో షాహిద్ 40 ఏళ్ల వయసులో భారత జట్టులో స్థానం సంపాదించి కొడుకు కోరికను నెరవేర్చిన అర్జున్ తల్వార్ అనే తండ్రి పాత్రలో కనిపించాడు. చదవండి: నా తండ్రి గుర్తింపుతో బతకాలని లేదు: వేదాంత్ షాకింగ్ కామెంట్స్ ఈ క్రమంలో షాహిద్ పోషించిన భావోద్వేగ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయినప్పటికీ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో షాహిద్ భార్యగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకుర్ నటించింది. అయితే మొదట ఈ పాత్ర కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను సంప్రదించారట చిత్ర బృందం. అయితే తను ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై రష్మిక స్పందించింది. ఐఏఎన్ఎస్తో ముచ్చటించిన రష్మిక హిందీ జెర్సీ ఆఫర్‌పై నోరు విప్పింది. తనకు హిందీ జెర్సీ ఆఫర్ వచ్చిందని, కానీ దాన్ని తిరస్కరించానని తెలిపింది. చదవండి: షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన అనుపమకు షాకిచ్చిన ఫ్యాన్స్ ‘ఎందుకంటే నేను ఇప్పటి వరకు చేసినవన్ని కమర్షియల్ సినిమాలే. అలాంటి నేను జెర్సీలాంటి చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది. జెర్సీ మంచి సినిమా కాదు అని నేను అనడం లేదు. ఇది రియలిస్టిక్ చిత్రం. జెర్సీ తెలుగు వెర్షన్లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించారు. ఆ పాత్రకు తనకన్న గొప్పగా ఎవరూ నటించలేరని నా ఉద్దేశం. అందుకే ఈ పాత్రకు నేను కరెక్ట్ కాదని అనిపించింది. అనుకుంటే నేను ఈ సినిమాలో నటించేదాన్నే. కానీ నా వల్ల దర్శక-నిర్మాతలు నష్టపోకూడదనుకున్న. ఈ సినిమా కోసం వారికి నాకంటే బెటర్ ఆప్షన్స్ ఎన్నో ఉండోచ్చు కదా. అందుకే ఈ సినిమాకు నో చెప్పాను’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం రష్మిక తెలుగు పుష్ప 2తో పాటు హిందీలో యానిమల్ చిత్రాలతో బిజీగా ఉంది. -
సూర్య మూవీని హిందీలో రీమేక్ చేస్తున్న అక్షయ్, షూటింగ్ షురూ
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సురారై పోట్రూ (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓటీటీలో విడుదలైన ఈ మూవీ అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోయింది. ఇందులో సూర్య కెప్టెన్ గోపీనాథ్ అనే వ్యాపార వేత్త పాత్రలో నటించాడు. ‘సింప్లీ ఫై’ అనే పుస్తకం ఆధారం తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే కొన్ని రోజులగా ఈ మూవీ హిందీ రీమేక్‌పై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిందీలో రీమేక్ చేస్తున్నట్లు తాజాగా సూర్య ట్విటర్ వేధికగా వెల్లడించాడు. చదవండి: నాకెప్పటికీ ఆ స్కూల్ డేస్ అంటే అసహ్యం: షాహిద్ కపూర్ ‘మరో కొత్త ఆరంభానికి మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం కావాలి’ అంటూ అక్షయ్ ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు. ఇందులో అక్షయ్ సరసన రాధిక మదన్ నటిస్తోంది. ఈ రోజు మూవీ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. హీరోయిన్ రాధిక కొబ్బరికాయ కొడుతున్న వీడియోను అక్షయ్ షేర్ చేశాడు. ఇదే వీడియో సూర్య రీట్వీట్ చేశాడు. కాగా తెలుగులో ఈ సినిమా దర్శకత్వం వహించిన సుధాకొంగర హిందీ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తోంది. 2డీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్‌పై తెలుగు, తమిళంలో ఈ సినిమాను నిర్మించిన సూర్య హిందీలో కూడా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు. Proud and heart filled 😊❤️…!🙏🏽 https://t.co/ivLwgt5FZH — Suriya Sivakumar (@Suriya_offl) April 25, 2022 -
రక్తంతో తడిసిన హృతిక్ రోషన్.. బర్త్‌డే స్పెషల్ ట్రీట్
Hrithik Roshan First Look As Vedha Out From Vikram Vedha: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన చిత్రం సూపర్ హిట్ చిత్రం 'విక్రమ్ వేద'. ఈ సినిమాకు అశేష ప్రేక్షధారణ లభించిన సంగతి తెలిసిందే. అంతటి ఘన విజయాన్ని సాధించిన ఈచిత్రాన్ని హిందీలో రీమెక్ చేస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి నటించిన వేద పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో, గ్రీక్ గాడ్‌గా పేరొందిన హృతిక్ రోషన్ అలరించనున్నాడని సమాచారం. జనవరి 10న హృతిక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్. 'విక్రమ్ వేద' హీందీ రీమెక్ నుంచి హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ ఫస్ట్ లుక్‌లో హృతిక్ రఫ్ లుక్‌లో అట్రాక్టీవ్‌గా కనిపిస్తున్నాడు. నల్లని కళ్లద్దాలు, గడ్డం, నల్లటి కుర్తాలో రక్తంతో తడిసిన 'వేద' పాత్రను పరిచయం చేసింది చిత్ర బృందం. ఈ సినిమాను తమిళలో రూపొందించిన దర్శకుడు పుష్కర్ గాయత్రి ఈ హిందీ రీమెక్కు డైరెక్షన్ చేయనున్నాడు. ఈ సినిమాలో మాధవన్ నటించిన విక్రమ్ రోల్లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటివరకు సైఫ్ ఫస్ట్ లుక్ ఇంకా రాలేదు. అయితే ఇవాళ హృతిక్ బర్త్‌డే స్పెషల్ ట్రీట్‌గా వెద ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఇందులో రాధికా ఆప్టే కూడా కీలక పాత్రలో మెరవనుంది. वेधा . VEDHA#vikramvedha pic.twitter.com/4GDkb7BXpl — Hrithik Roshan (@iHrithik) January 10, 2022 ఇదీ చదవండి: నోట్లో థర్మామీటర్‌తో జాన్వీ.. కరోనాగా అనుమానం -
భీమిలి బీచ్‌లో ‘ఛత్రపతి’
సాక్షి,భీమునిపట్నం(విశాఖపట్నం): భీమిలి బీచ్‌లో శుక్రవారం షూటింగ్ సందడి నెలకొంది. తెలుగులో ప్రభాస్ నటించిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో అదే పేరుతో తీస్తున్న సినిమా షూటింగ్ జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను దర్శకుడు వి.వి.వినాయక్ తెలిపారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా, బెల్లంకొండ సురేష్ నిర్మాత. హీరోయిన్ ముసరత్ బంచా, హీరో తల్లిగా భాగ్యశ్రీ నటిస్తుండగా ఇంకా శరత్ ఖేలేఖర్, రాజేష్‌శర్మ, రాంజేంద్ర గుప్తా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 10 వరకు ఇక్కడ షూటింగ్ నిర్వహిస్తారు. వినాయక్‌ను కలిసిన మంత్రి ముత్తంశెట్టి షూటింగ్లో ఉన్న దర్శకుడు వినాయక్‌ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక్ తనకు మంచి మిత్రుడని తెలిపారు. స్వయం కృషితో గొప్ప దర్శకునిగా ఎదిగారని భీమిలిలో జరిగే ఈ సినిమా కచ్చితంగా మంచి హిట్ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ఆయనకు హిందీలో తొలి సినిమా అని అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుని గుర్తింపు పొందుతారని అన్నారు. చదవండి: Allu Arjun-Priyamani: ప్రియమణిపై ‘హాట్’ కామెంట్స్ చేసిన బన్నీ -
బాలీవుడ్‌లోకి ఆర్ఎక్స్ 100, అల వైకుంఠపురములో.. టైటిల్స్ ఇవే
టాలీవుడ్ స్టోరీలు బాలీవుడ్ కి వెళుతున్నాయి. మన కథలు బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. రస్టిక్ లవ్ స్టోరీస్ ని మాత్రమే కాదు తెలుగులో సక్సెస్ అయిన కమర్షియల్ చిత్రాల్ని కూడా బాలీవుడ్ మేకర్స్ అస్సలు వదిలిపెట్టడం లేదు. అలాంటి రెండు రీమేక్స్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం.. షెహజాదా... అంటే యువరాజు అని అర్థం. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అల వైకుంఠపురములో చిత్రానికి ఇది బాలీవుడ్ రీమేక్. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు టీ సిరీస్, బ్రాత్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. అల్లు అర్జున్ పోషించిన పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు. కృతీ సనన్ హీరోహిన్ గా యాక్ట్ చేస్తోంది. టబు పోషించిన పాత్రలో మనీషా కోయిరాల కనిపించబోతుంది. షెహజాదా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అంతేకాదు 2022 నవంబర్ 4న షెహజాదా రిలీజ్ కాబోతున్న ప్రకటించింది మూవీ టీమ్. తడప్.. తెలుగులో స్టన్నింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆర్ఎక్స్100 కు హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాని మిలన్ లూద్రియా డైరెక్ట్ చేస్తున్నాడు. అషన్ శెట్టి, తారా సుతారియా హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 3న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. -
‘కాటమరాయుడు’ రీమేక్‌ని పక్కన పెట్టిన సల్మాన్, కారణం ఇదేనా?
సౌత్ సైడ్ ఏదైనా మూవీ హిట్ అయితే చాలు. బాలీవుడ్ లో సల్మాన్ అలెర్ట్ అయిపోతాడు. వెంటనే రీమేక్ రైట్స్ కొనుగోలు చేస్తాడు. అలా సౌత్ లో సూపర్ హిట్టైన వీరమ్ మూవీని, గతంలోనే సల్మాన్ బాలీవుడ్ లోకి రీమేక్ చేయాలనుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నాడట. ఆ సౌత్ రీమేక్ ను పక్కన పెట్టాడట. 2014లో విడుదలైన వీరమ్ చిత్రం కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళ స్టార్ హీరో అజిత్ ఊరమాస్ లుక్ కు కోలీవుడ్ ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. 80 కోట్లకు పైగా వసూళ్లను అందించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో కాటమరాయుడు పేరుతో రీమేక్ అయింది. హిందీలో సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దీవాళి పేరుతో రీమేక్ చేయాలనుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కాని ఇప్పుడు ఈ రీమేక్ ఆగిపోయిందని బాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది ఈద్ కానుకగా సల్మాన్ ఓటీటీలో రిలీజ్ చేసిన న్యూ మూవీ రాధే. ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది. దాంతో సల్మాన్ షాక్ కు గురైయ్యాడని సమాచారం. తాను చేస్తున్న, చేయాల్సిన ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టాడట. అందులో భాగంగా అంతిమ్, టైగర్ 3 చిత్రాలు తప్పితే మిగితా ప్రాజెక్ట్స్ అన్నిటినీ హోల్డ్ లో పెట్టాడట. కాటమరాయుడు హిందీ రీమేక్ ను క్యాన్సిల్ చేసాడట. ప్రస్తుతం సల్మాన్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ లో మాస్టర్ రీమేక్, దబాంగ్ 4, కిక్ 2, చిత్రాలు ఉన్నాయి. మరి వీటి సంగతి ఏంటి అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తోంది. ఓటీటీలోకి మరో మూవీ ఈద్ కానుకగా రాధే ను ఇటు ఓటీటీలోను, అటు థియేటర్స్ లోనూ ఒకేసారి రిలీజ్ చేసాడు సల్మాన్. ఇప్పుడు ఇదే ఫార్మాట్ లో అంతిమ్ కూడా విడుదల కానుందట. దేశంలో పూర్తిస్థాయిలో థియేటర్స్ తెరుచుకోకపోవడంతో, సింగిల్ స్క్రీన్స్, జీ5 యాప్ లో అంతిమ్ మూవీ ఒకేసారి విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ మూవీలో సల్మాన్, ఆయన బావమరిది ఆయుష్ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో గ్యాంగ్ స్టర్ రోల్ ను ఆయుష్, అలాగే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను సల్మాన్ చేస్తున్నాడు. -
హిందీ సూరరై పోట్రుకు లైన్‌క్లియర్
Madras High Court Green Signal To Remake Of Soorarai Pottru: సూరరై పోట్రు చిత్రం హిందీ రీమేక్‌కు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాలు.. కథనాయకుడు సూర్య తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన చిత్రం సూరరై పోట్రు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించడం తెలిసిందే. ఈ చిత్రాన్ని సూర్య అబున్డంటియా ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయరాదని, కెప్టెన్ గోపీనాథ్ బయోపిక్ ఆధారంగా రచించిన సింప్లిఫై పుస్తక హక్కులు తమకు చెందినవి అంటూ సిఖ్యా ఎంటర్టైన్మెంట్ సంస్థ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి ప్రతిగా 2డి ఎంటర్టైన్మెంట్ సంస్థ చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. వాదనల అనంతరం న్యాయమూర్తి బుధవారం 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. -
'అల.. వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌లో బన్నీ!
అల్లు అర్జున్‌కి దక్షిణాదిలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన స్టైలిష్ లుక్స్, నటనతో సౌత్ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన తాజాగా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారట. అది కూడా ‘అల.. వైకుంఠపురములో’ సినిమా రీమేక్‌తో అని సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘షాజాదే’ (యువరాజు) పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. కార్తీక్ ఆర్యన్, కృతీ సనన్ జంటగా రోహిత్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అల్లు అరవింద్, ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పరేశ్ రావల్, మనీషా కొయిరాల ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో అతిథి పాత్ర చేయాలని అల్లు అర్జున్‌ని చిత్రవర్గాలు కోరగా, ఆయన పచ్చజెండా ఊపారని టాక్. తెలుగులో ‘అల.. వైకుంఠపురములో’ అతిథి పాత్ర లేదు. మరి ‘షాజాదే’లో అతిథి పాత్రను జోడించి ఉంటారా? ఉంటే.. ఆ పాత్రను అల్లు అర్జున్ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. -
బెల్లంకొండ ఛత్రపతి హిందీ రీమేక్.. లాంఛ్ చేసిన రాజమౌళి
అల్లుడు శీను సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో బెల్లంకొండ నటించనున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కునున్న ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్చల్ అవుతున్నాయి. 2005లో తెలుగులో విడుదలైన ఛత్రపతి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. ఛత్రపతి హిట్‌తో మాస్ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. దాదాపు 16 ఏళ్ల అనంతరం ఈ సినిమా హిందీ రేమేక్ ద్వారా బాలీవుడ్లో ఎంట్రీకి సిద్ధమయ్యాడు బెల్లంకొండ. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కోర్టు మెట్లు ఎక్కనున్న రాధికా ఆప్టే?
కోర్టు మెట్లు ఎక్కనున్నారు హీరోయిన్ రాధికా ఆప్టే. ఏదైనా కేసులో ఇరుక్కున్నారా? అంటే.. కాదు. కొత్త సినిమా కోసం కోర్టులో లాయర్‌గా వాదించనున్నారు. తమిళ హిట్ ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్‌లోనే ఆమె ఈ పాత్రలో కనిపించే అవకాశం ఉంది. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన పాత్రను హృతిక్ రోషన్, మాధవన్ పాత్రను సైఫ్ అలీఖాన్ చేయనున్నారు. తమిళంలో శ్రద్ధా శ్రీనాథ్ చేసిన లాయర్ పాత్రను హిందీలో రాధికా ఆప్టే చేయనున్నారట. కథ ప్రకారం మాధవన్ భార్య శ్రద్ధా శ్రీనాథ్. సో.. హిందీలో సైఫ్‌కి జోడీగా రాధిక కనిపిస్తారన్న మాట. మాతృకకు దర్శకత్వం వహించిన పుష్కర్–గాయత్రి ద్వయమే రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. సెప్టెంబరులోపు చిత్రీకరణను ఆరంభించాలనుకుంటున్నారు. -
హిందీలోకి ‘సూరరై పోట్రు’, బాలీవుడ్‌లోకి నిర్మాతగా సూర్య ఎంట్రీ
హీరో సూర్య ఇటీవల నటించిన తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో డబ్ అయిన సంగతి తెలిసిందే. సూర్య, జ్యోతికలు కలిసి నిర్మించిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఓటీటీలో విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తెలుగు తమిళంలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు సూర్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సూర్య, జ్యోతిక, రాజశేఖర్ పాండియన్లు సంయుక్తంగా ఈ మూవీని అబన్డంతియ ఎంటర్టైన్మెంట్స్పై బాలీవుడ్లో నిర్మించబోతున్నారు. ఈ రీమేక్ ద్వారా హీరో సూర్య బాలీవుడ్‌లోకి నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. దర్శకుడు సుధా కొంగర బాలీవుడ్‌లోనూ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇక హీరో ఎవరన్నది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. హీరో, నటీనటులు ఎవరన్నది త్వరలోనే అధికారిక ప్రకటన వెలువనుంది. Excited to announce our association with @Abundantia_Ent lead by @vikramix for #SooraraiPottru in Hindi, Directed by #SudhaKongara@CaptGopinath#Jyotika @rajsekarpandian @ShikhaaSharma03 @2D_ENTPVTLTD pic.twitter.com/ECjSpO9OOT — Suriya Sivakumar (@Suriya_offl) July 12, 2021 -
‘హిట్’ రీమేక్‌లో హీరోయిన్గా దంగల్ నటి ఖరారు!
ఇటీవల కాలంలో చిన్న సినిమాలు కంటెంట్ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి సక్సెస్‌ను అందుకుంటున్నాయి. దీనికి ఉదాహరణ ఇటీవల వచ్చిన ఉప్పెన. ఇది చిన్న సినిమే అయినప్పటికీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా టాలీవుడ్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కంటెంట్ చిత్రాలు ఇతర భాషల్లో కూడా రీమేక్ అవుతున్నాయి. ఇప్పటికే అర్జున్ రెడ్డి మూవీ హిందీలో కబీర సింగ్‌గా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకోవడంతో ఇక బాలీవుడ్ మన తెలుగు సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న మన సినిమాలను హిందీలో రీమేక్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ అండ్ టాలెంటెట్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ మూవీ కూడా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. హిందీ రాజ్‌కుమార్ రావు హీరోగా తెరకెక్కతున్న ఈ రీమేక్‌లో.. తాజాగా హీరోయిన్ను కూడా ఖారారు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. దంగల్ మూవీ నటి సన్యా మల్హోత్రాను హీరోయిన్గా ఫైనల్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. కాగా దంగల్‌లో ఆమె ఆమీర్ ఖాన్‌కు కూతురిగా కనిపించిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డితో పాటు జెర్సీ, బ్రోచేవారేవరురా, అలా వైకుంఠపురంలో, డీజే, నంది, రవితేజ ఖిలాడీ మూవీలో కూడా హందీ రీమేక్‌కు క్యూలో ఉన్నాయి. -
అమీర్‌తో ఖాన్‌కు ఫ్రెండ్‌గా నాగ చైతన్య..
గురువారం నుంచి నాగచైతన్య హిందీ సంభాషణలు పలుకుతున్నారు. అలాగే యుద్ధం కూడా చేస్తున్నారు. హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’ కోసమే ఇదంతా. ఇందులో చైతూ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ లీడ్ రోల్లో హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. లాల్‌సింగ్ చద్దా (ఆమిర్ పాత్ర పేరు) ఆర్మీలో ఉన్నప్పుడు అతని స్నేహితుడి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలిసింది. చైతూది కూడా ఆర్మీ మ్యాన్ పాత్ర అని టాక్. అందుకే ప్రత్యేకంగా ట్రైనర్‌ని పెట్టుకుని, మేకోవర్ అయ్యారని తెలిసింది. గురువారం లడఖ్‌లో ఆరంభమైన ఈ సినిమా సెట్స్‌లోకి ఆమిర్ ఖాన్, నాగచైతన్య తదితరులు ఎంటరయ్యారు. కొన్ని టాకీ సీన్స్‌తో పాటు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఈ సీన్స్‌ని హాలీ వుడ్ స్టంట్ మాస్టర్స్ డిజైన్ చేస్తున్నారట. దాదాపు 20 రోజులు ఈ చిత్రీకరణలో పాల్గొంటారట నాగచైతన్య. -
అజయ్ దేవగణ్ భార్యగా కాజల్..
హిందీ హీరో అజయ్ దేవగణ్‌తో కాజల్ అగర్వాల్ రెండోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. హిందీ ‘సింగం’ చిత్రంలో అజయ్‌తో తొలిసారి నటించారు కాజల్. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2011లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంతో మంచి జోడీ అనిపించుకున్న అజయ్–కాజల్ దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి కలసి నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ ‘ఖైదీ’ హిందీ రీమేక్‌లోనే ఈ ఇద్దరూ జంటగా నటించనున్నారని టాక్. అయితే తమిళ వెర్షన్లో హీరోయిన్ పాత్రకు స్థానం లేదు. కానీ బాలీవుడ్‌కి తగ్గట్టు కథను మార్చిన నేపథ్యంలో కథానాయిక పాత్రకు అవకాశం ఉందని సమాచారం. హీరో పాత్రకు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను జోడించారట. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో అజయ్ భార్యగా కాజల్ అగర్వాల్ కనిపించనున్నారని ఓ వార్త హల్చల్ చేస్తోంది. -
‘ఛత్రపతి’ కోసం రూ.3 కోట్లతో ఆరు ఎకరాల్లో భారీ సెట్!
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘ఛత్రపతి’ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో డా. జయంతి లాల్ గడ ఈ రీమేక్‌ని నిర్మించనున్నారు. తెలుగు ‘ఛత్రపతి’కి కథ అందించిన విజయేంద్రప్రసాద్ హిందీకి తగ్గట్టు కొన్ని మార్పులతో కథను తయారు చేస్తున్నారట. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో 3 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆరు ఎకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ సునీల్‌బాబు ఓ విలేజ్ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 22న షూటింగ్ ఆరంభం కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈలోపు అకాల వర్షాల వల్ల ఈ సెట్ బాగా దెబ్బతింది. దీంతో ఈ సెట్‌ను పునరుద్ధరించే పనిలో పడ్డారు. ఈ సెట్‌ని మళ్లీ సెట్ చేసి, కోవిడ్ పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. -
హిందీలో రీమేక్ కానున్న సౌత్ చిత్రాలు: హీరోలు ఎవరంటే?
దక్షిణానికి.. ఉత్తరానికి హద్దు చెరిగిపోయింది. సినిమా దగ్గర చేసేసింది. ఇక్కడ హిట్ అయిన సినిమా అక్కడ అక్కడ హిట్ అయిన సినిమా ఇక్కడ... ఇప్పుడు రీమేక్ జోరు పెరిగింది. సౌత్‌లో వచ్చిన పలు హిట్ చిత్రాలు హిందీలో రీమేక్ కానున్నాయి. మరి.. హిందీ రీమేక్‌లో నటించనున్న కథానాయకుడు కౌన్? ఆ విషయంలోనే బాలీవుడ్ నిర్మాతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. హీరో ఎవరు? అనేది తర్వాత తెలుస్తుంది. రీమేక్ కానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. వెండితెరపై నవ్వులు కురిపించి బాక్సాఫీస్‌ను కాసులతో నింపిన తెలుగు హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ రీమేక్‌కు ‘దిల్’ రాజు, బోనీకపూర్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనీజ్ బాజ్మీ తెరకెక్కిస్తారు. కానీ ఈ రీమేక్‌లో ఎవరు హీరోలుగా నటిస్తారు? అనే విషయంపై ఇప్పటివరకు ఓ స్పష్టత రాలేదు. ఒక దశలో వెంకటేష్, అర్జున్ కపూర్ (నిర్మాత బోనీకపూర్ తనయుడు) పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ‘ట్యాక్సీవాలా’ వంటి హిట్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్లో వచ్చిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా దక్షిణాది భాషల్లో విడుదల కాకముందే హిందీ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు బాలీవుడ్ బడా దర్శక–నిర్మాత కరణ్ జోహార్. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ హిందీ రీమేక్‌లో హీరో ఎవరు? అసలు సెట్స్‌పైకి వెళుతుందా? అనే విషయంపై ఇప్పటివరకు ఓ స్పష్టత అయితే రాలేదు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో 2019లో విడుదలైన ‘మత్తువదలరా’ ఒకటి. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి తనయుడు శ్రీ సింహా ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యారు. రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం హిందీ రీమేక్‌కి కూడా రితేషే దర్శకుడు. కానీ ఇందులో హీరో ఎవరు? అనే విషయంపై మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 2019లో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను దర్శక–నిర్మాత నటుడు అజయ్ దేవగన్ దక్కించుకున్నారు. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో అభయ్ డియోల్ మెయిన్ లీడ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ దర్శకుడు ఎవరు? సినిమాలోని మిగతా నటీనటుల గురించిన నెక్ట్స్ అప్డేట్ రాలేదు. అటు తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించిన ‘విక్రమ్ వేదా’ చిత్రం బంపర్ హిట్. ఈ సినిమా హిందీ రీమేక్‌ను పుష్కర్ గాయత్రి ద్వయమే డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఇందులో హీరోలుగా ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ఐదేళ్లుగా కొందరి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్, హీరో విజయ్ కాంబినేషన్లో వచ్చిన తమిళ ‘కత్తి’ చిత్రం సూపర్ హిట్. ఈ సినిమా తెలుగు రీమేక్ ‘ఖైదీ నంబరు 150’లో చిరంజీవి హీరోగా నటించారు. అయితే తమిళ ‘కత్తి’ హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మాత్రం తమ సినిమాలో హీరో ఎవరో చెప్పలేదు. జగన్ శక్తి హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తారని, ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తారనే వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇక కార్తీ కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్ ‘ఖైదీ’ (2019) సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను అజయ్ దేవగన్ సొంతం చేసుకున్నారు. కానీ ఇందులో అజయే హీరోగా నటిస్తారా? లేక మరో హీరో ఎవరైనా చేస్తారా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మరోవైపు మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ది కూడా ఇదే పరిస్థితి. ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం చేజిక్కించుకున్నారు. మరి.. హిందీ రీమేక్‌లో జాన్ నటిస్తారా? లేదా? అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇంకా మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్ ‘అంజామ్ పతిరా’, ‘దృశ్యం 2’, ‘ఫోరెన్సిక్’ చిత్రాలు హిందీలో రీమేక్ కానున్నాయి. కుంచకో బోబన్ నటించిన ‘అంజామ్ పతిరా’ రీమేక్‌ను రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్, ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్, ఏపీ ఇంటర్నేషనల్ సంస్థలు నిర్మిస్తాయి. దర్శకులు, నటీనటుల వివరాలు రావాల్సి ఉంది. ‘ఫోరెన్సిక్’ రీమేక్‌కు విశాల్ ఫరియా దర్శకుడు. ఇందులో విక్రాంత్ మెస్సీ హీరోగా నటిస్తారనే ప్రచారం సాగింది. మోహన్‌లాల్ ‘దృశ్యం 2’ హిందీ రైట్స్‌ను కుమార్ మంగత్ పాతక్ దక్కించుకున్నారు. హిందీ ‘దృశ్యం 1’లో నటించిన అజయ్ దేవగనే ‘దృశ్యం 2’లో కూడా నటిస్తారనే ప్రచారం సాగుతున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలే కాదు.. మరికొన్ని సౌత్ హిట్ సినిమాల రీమేక్ హక్కులను బాలీవుడ్ తారలు, దర్శక నిర్మాతలు దక్కించుకున్నారు. అయితే ‘కథానాయకుడు కౌన్’ అనేది మాత్రం నిర్ణయించలేదు. బహుశా కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఈ రీమేక్స్‌లో హీరోలుగా ఎవరు నటిస్తారు? అనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
హిందీలోకి దృశ్యం 2: హీరోపై రాని క్లారిటీ!
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటీటీలో విడుదలైన మలయాళ ‘దృశ్యం 2’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. పనోరమ స్టూడియోస్ ఇంటర్నేషన్ సంస్థ నిర్మాతలు కుమార్ పాఠక్, అభిషేక్ పాఠక్ ‘దృశ్యం 2’ హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. ‘‘దృశ్యం 2’ మంచి హిట్ సాధించింది. ఇలాంటి కథలు మరింతమంది ప్రేక్షకులకు చేరాలనే ఉద్దేశంతో హిందీ రీమేక్ హక్కులను తీసుకున్నాం’’ అన్నారు కుమార్, అభిషేక్. అయితే హిందీ రీమేక్‌లో ఎవరు హీరోగా నటిస్తారు? అనే విషయంపై సరైన స్పష్టత ఇవ్వలేదు నిర్మాతలు. ఇక మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రధారులుగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో 2013లో ‘దృశ్యం’ చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లోనే ‘దృశ్యం 2’ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్‌లో వెంకటేష్ హీరోగా నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. చదవండి: హిట్ రిపీట్ అవుతుందా? -
‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్, హీరో ఎవరో తెలుసా!
ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీసుకు బాగానే కలిసోచ్చిందని చెప్పుకొవచ్చు. లాక్డౌన్ తర్వాత విడుదలైన మొదటి సినిమా ‘క్రాక్’ సూపర్ హిట్‌గా నిలిచి శుభారంభాన్ని ఇచ్చింది. ఇక ఆ తర్వాత విడుదలైన ‘ఉప్పెన’ చిత్రం ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇక మార్చిలో విడుదలైన ‘జాతి రత్నాలు’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫుల్లెన్త్ కామెడీతో ఈ మూవీ ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పటికే ‘క్రాక్’, ‘ఉప్పెన’ సినిమాలను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘జాతి రత్నాలు’ మూవీ కూడా ఈ జాబితాలో చేరింది. తాజా బజ్ ప్రకారం ఈ మూవీని హిందీలో రీమేక్ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరోను కూడా కన్ఫామ్ చేసినట్లు సమాచారం. అయితే ‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్‌కు కూడా అనుదీప్‌యే డైరెక్టర్‌గా వ్యవహరించన్నాడట. ఇందులో హీరోను కూడా నవీల్ పొలీశెట్టిని అనుకుంటున్నట్లు టాలీవుడ్లో టాక్. కాగా గతంలో నవీల్ పోలీశెట్టి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘చిచోరే’ మూవీలో సహానటుడిగా కనిపించిన విషయం తెలిసిందే. అందుకే ‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్‌ను కూడా నవీన్‌నే హీరోగా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉందట. అయితే దర్శకుడు అనుదీప్ ఇప్పటికే జాతి రత్నాలు మూవీకి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను అనుదీప్ పూర్తి చేసినట్లు సమాచారం. చదవండి: ‘జాతిరత్నం’ రేటు పెరిగింది.. మూడో సినిమాకే అన్ని కోట్లా? జాతిరత్నాలు.. అసలు ఏంటా కామెడీ: టీమిండియా క్రికెటర్ -
కథ నాది, మీకు హక్కు లేదు, అర్థం అవుతుందనుకుంటా: శంకర్
వరుస వివాదాలతో దర్శకుడు శంకర్ అల్లాడిపోతున్నారు. హీరో రామ్‌చరణ్‌తో శంకర్ సినిమాను అనౌన్స్ చేయగానే ‘కమలహాసన్‌తో తాము నిర్మిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేయనిదే ఎక్కడికీ కదలడానికి లేదు’ అని లైకా ప్రొడక్షన్స్ కేసు నమోదు చేసింది. ఇది ఇలా ఉండగా, తమిళ చిత్రం ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) హిందీ రీమేక్‌ను హీరో రణ్‌వీర్‌సింగ్‌తో చేయనున్నట్టు బుధవారం నాడు శంకర్ ప్రకటించడం మరో సంచలనమైంది. ఇప్పుడు ఆ ప్రకటన కూడా వివాదాస్పదమైంది. శంకర్ ప్రకటించి 24 గంటలు గడవకముందే అప్పట్లో ‘అన్నియన్’ చిత్రాన్ని నిర్మించిన ‘ఆస్కార్’ రవిచంద్రన్ ఆ కథ హక్కులు తనవి అంటూ ఘాటుగా లేఖ పంపారు. ఆ వెంటనే శంకర్ దానికి తన స్పందనగా మరో ఘాటైన ప్రత్యుత్తరం ఇచ్చారు. ఈ వివాదం సినీసీమలో గురువారం పెద్ద చర్చనీయాంశమైంది. నన్నడగకుండా ఎలా తీస్తారు? – ‘అన్నియన్’ నిర్మాత రవిచంద్రన్ ‘నా ఊహలకు తగ్గట్టు పవర్ఫుల్ హీరో దొరికాడు. హిందీలో నా ‘అన్నియన్ ’ అతనే’ అని దర్శకుడు శంకర్ ఇలా ప్రకటించారో, లేదో అలా వివాదం మొదలైంది. ‘‘నన్ను సంప్రదించకుండానే రీమేక్‌ని ప్రకటిస్తారా?’ అంటూ ‘అన్నియన్ ’ చిత్ర నిర్మాత ‘ఆస్కార్’ వి. రవిచంద్రన్ మండిపడ్డారు. దర్శకుడు శంకర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఓ లేఖను కూడా విడుదల చేశారు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే... ‘‘మీరు (శంకర్) ‘అన్నియన్ ’ ఆధారంగా హిందీలో ఓ సినిమాను అనౌన్స్ చేయడం తెలిసి, షాక్ అయ్యాను. ‘అన్నియన్ ’కు నేను నిర్మాతని అని మీకు గుర్తుండే ఉంటుంది. ఈ స్టోరీ లైన్ పై పూర్తి స్థాయి హక్కులను రచయిత సుజాత (దివంగత రచయిత సుజాతా రంగరాజన్ )కు డబ్బు చెల్లించి నేను సొంతం చేసుకున్నాను. ఇందుకు ఆధారాలు కూడా నా వద్ద భద్రంగా ఉన్నాయి. ‘అన్నియన్ ’ స్టోరీలైన్ కు సంబంధించిన పూర్తి హక్కులు నావే. నా అనుమతి లేకుండా ఈ స్టోరీలైన్ తో రీమేక్ సినిమా చేయాలనుకోవడం చట్టరీత్యా నేరం. మీ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ సక్సెస్ కాకపోవడంతో ఆందోళనలో ఉన్న మీకు ‘అన్నియన్ ’కు దర్శకుడిగా అవకాశం ఇచ్చింది నేనే. ఈ సినిమా సక్సెస్ఫుల్ దర్శకుడిగా మీ స్టార్‌డమ్‌ను పెంచింది. ఇందులో ‘అన్నియన్ ’ నిర్మాతగా నా సపోర్ట్ ఉంది. కానీ ఇదంతా మరచిపోయి నన్ను సంప్రదించకుండానే మీరు హిందీ రీమేక్‌ను అనౌన్స్ చేశారు. ఎప్పుడూ నైతిక విలువలను పాటించే మీరు, మీ స్థాయిని తగ్గించుకునేలా ఇలా చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడడం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘అన్నియన్ ’ హక్కులు నా దగ్గర ఉన్నాయి గనుక, హిందీ రీమేక్ ఆలోచనను విరమించుకోవాలని సలహా ఇస్తున్నా’’ అని పేర్కొన్నారు రవిచంద్రన్ . కథ... స్క్రీన్ ప్లే...డెరెక్షన్ నావి! – దర్శకుడు శంకర్ ‘అన్నియన్ ’ హక్కులు తనవేనంటూ ఓ బహిరంగ లేఖ విడుదల చేసిన నిర్మాత రవిచంద్రన్ కు దర్శకుడు శంకర్ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ‘‘ఆ ‘అన్నియన్ ’ కథ హక్కులు మీవి (రవిచంద్రన్) అంటూ... పంపిన మెయిల్ చూసి షాక్ అయ్యాను. కథ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై శంకర్ అనే టైటిల్‌తోనే ఆ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేను నేను ఎవరికి అప్పగించ లేదు. ఆ స్క్రిప్ట్ నిజానికి రచయిత సుజాత గారిదని మీరు అనడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆయన ఆ సినిమాకు డైలాగ్స్ మాత్రమే రాశారు. అందుకే, ఆయనకు సినిమాలో డైలాగ్ రైటర్‌గా క్రెడిట్ ఇవ్వడం జరిగింది. డైలాగ్స్ మినహా... ‘అన్నియన్ ’ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, హీరో క్యారెక్టరైజేషన్ ఇలా దేనిలోనూ సుజాత గారి ప్రమేయం లేదు. ‘అన్నియన్ ’కు దర్శకుడిగా నాకే కాదు. నిర్మాతగా మీకూ పేరు వచ్చింది. నిర్మాతగా సినిమా స్క్రిప్ట్‌పై మీకు హక్కు లేదు. నిరాధారమైన ఆరోపణలను ఇకనైనా మానుకోండి. మీరు చెబుతున్న అవాస్తవాలు నా భవిష్యత్ ప్రాజెక్ట్స్‌ను ప్రభావితం చేయవు. నా వివరణ మీకు పాజిటివ్‌గానే అర్థం అవుతుందని అనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు శంకర్. కమల్ వస్తే... శంకర్ రెడీనే! ‘అన్నియన్’ వివాదం ఇలా ఉండగా... ‘ఇండియన్ 2’ను పూర్తి చేయకుండా, శంకర్ మరో సినిమాను డైరెక్షన్ చేయకూడదని కోరుతూ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బుధవారం విచారణ జరిగింది. శంకర్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ, ‘‘లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు ఆరోపించినట్లు ‘ఇండియన్ 2’ను శంకర్ మధ్యలో వదిలేయలేదు. ఆ సినిమా షూటింగ్‌కు విదేశీ సాంకేతిక నిపుణులు కావాలి. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితులకు అనుగుణంగా ఫారిన్ టెక్నీషియన్స్‌తో షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టడం అంత ఈజీ కాదు. ఇండియాలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న పెద్ద డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌ను రెండేళ్ళుగా ఓ ప్రొడక్షన్ హౌస్ ఖాళీగా ఉంచడం కరెక్ట్ కాదు. జూన్‌లో కూతురి పెళ్ళి పెట్టుకున్నప్పటికీ, కమల్‌హాసన్ గనక షూటింగ్‌కు వస్తే ‘ఇండియన్ 2’ను పూర్తి చేయడానికి శంకర్ సిద్ధంగానే ఉన్నారు’’ అని కోర్టుకు విన్నవించుకున్నట్లు కోడంబాకమ్ సమాచారం. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘ఇండియన్ ’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ను అనౌన్స్ చేశారు శంకర్. తొలిపార్టులో హీరోగా నటించిన కమల్‌హాసనే మలిపార్టులో కూడా హీరోగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఆ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరగడం, కమల్ హాసన్ మొన్నటివరకు రాజకీయంగా బిజీగా ఉండటంతో ఇప్పటికే 60 శాతం దాకా పూర్తయిన ‘ఇండియన్ 2’కు బ్రేక్ పడింది.