దుర్గావతి కాదు దుర్గామతి | Bhumi Pednekar Durgamati First Look is out | Sakshi
Sakshi News home page

దుర్గావతి కాదు దుర్గామతి

Published Tue, Nov 24 2020 12:16 AM | Last Updated on Tue, Nov 24 2020 12:16 AM

Bhumi Pednekar Durgamati First Look is out  - Sakshi

భూమి ఫెడ్నేకర్

అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన హారర్‌ థ్రిల్లర్‌ ‘భాగమతి’. 2018లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్‌. అశోక్‌ జి. దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్‌ అయింది. అనుష్క పోషించిన పాత్రలో భూమి ఫెడ్నేకర్‌ నటించారు. తెలుగు చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన అశోక్‌ ఈ రీమేక్‌ను కూడా డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమాకు ఇది వరకు ‘దుర్గావతి’ అని టైటిల్‌ పెట్టారు. తాజాగా ‘దుర్గామతి: ది మిత్‌’గా మార్చారు. అలాగే ఈ సినిమా కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు నిర్మాతల్లో ఒకరైన అక్షయ్‌ కుమార్‌. డిసెంబర్‌ 11న ఈ సినిమా అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement