
స్వీటీ అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్ పాత్రలో నటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’ థియేటర్స్‌లో సందడిచేసేది. కానీ లాక్‌డౌన్ కారణంగా సినిమా విడుదలకు బ్రేక్ పడింది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో నిశ్శబ్దం సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. అక్టోబర్2న 'నిశ్శబ్దం'ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నట్లు నిర్మాత కోన వెంకట్ ప్రకటించారు.
ఇప్పటికే ఆ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. దీంతో ఓటీటీ వేదికగా విడుదలవుతున్న తెలుగు సినిమాల్లో రెండో పెద్ద సినిమాగా నిశ్శబ్దం నిలవనుంది. ఇప్పటికే నాని, సుధీర్‌బాబు నటించిన ‘వీ’ సినిమా విడుదలైంది. పలు చిన్న సినిమాలు ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అవుతున్నా పెద్ద సినిమాలు మాత్రం కాస్త ఆచితూచి అడుగులేస్తున్నాయి. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం చిత్రంలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. (స్వీటీ మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం? )
🤫🤫🤫🤫🤫 https://t.co/Imz8HJgU2h
— kona venkat (@konavenkat99) September 18, 2020
Comments
Please login to add a commentAdd a comment