Nishabdam Movie
-
పోలవరంలో హీరోయిన్ అనుష్క
సాక్షి, ఏలూరు : ప్రముఖ హీరోయిన్ అనుష్క బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మహా నందీశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ‘బాహుబలి’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన ప్రశాంతి త్రిపురనేని, మరో స్నేహితురాలుతో అనుష్క ఇక్కడకు వచ్చారు. పడవలో గోదావరిలో ప్రయాణించిన వీరంతా మాస్క్‌లు ధరించి ఉండటంతో వీరిని స్థానికులు త్వరగా గుర్తుపట్టలేకపోయారు. కాగా అనుష్క నటించిన నిశ్శబ్ధం చిత్రం ఓటీటీ ద్వారా విడుదలైన విషయం తెలిసిందే. (బుల్లితెరపై నిశ్శబ్దం...) -
బుల్లితెరపై నిశ్శబ్దం...
మూగ, చెవుడు ఉన్న ఒక క్యారెక్టర్ అనగానే అది చేయడానికి స్టార్ హీరోయిన్లు పెద్దగా సాహసించరు. కానీ అనుష్క ఈ సాహసం చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే అనుష్క ఎప్పుడూ ముందుటారన్న సంగతి తెలిసిందే. అందుకే చాలా గ్యాప్ తర్వాత అనుష్క సినిమా చేస్తుంది, అది కూడా మూగ, చెవుడు క్యారెక్టర్ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తన పక్కన హీరోగా ఒకప్పటి లవర్ బాయ్ మాధవన్ అని చెప్పగానే సినిమాకు హైప్ రెట్టింపయ్యింది. సినిమా షూటింగ్ పూర్తవ్వగానే ఒకొక్క అప్డేట్ బయటకి వచ్చింది. (మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్) తీరా రిలీజ్ డేట్ ప్రకటించగానే లాక్డౌన్ అంటూ ఎవ్వరూ ఊహించని విధంగా 8 నెలల బ్రేక్ వచ్చింది. థియేటర్లు తెరుచుకుంటాయేమో.. నిశ్శబ్ధాన్ని ప్రేక్షకులు వెండితెరపై చూసే అవకాశం వస్తుందేమో అని మూవీ టీమ్ అంతా ఆసక్తిగా ఎదురుచూసింది. ఎంతకీ థియేటర్లు తెరచుకునే పరిస్థితి కనబడకపోవడంతో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల అయ్యింది. నటీనటుల యాక్టింగ్ తప్ప ఇంకా ఏ విభాగంలోనూ సినిమాకు మంచి మార్కులు పడలేదు. షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల, మైఖేల్ మాడ్సెన్ కీలక పాత్రల్లో కనిపించిన ఈ సినిమా చిత్రీకరణ మొత్తం అమెరికాలోనే జరిగింది. తన పాత్ర కోసం అనుష్క ప్రత్యేక శిక్షణ తీసుకుంది. పెయింటింగ్‌లో మెలకువలు నేర్చుకుంది. ఇంత చేసినా సినిమాకు ప్రాణం లాంటి క్లైమాక్స్‌ను దర్శకుడు హేమంత్ మధుకర్ సరిగా చూపించలేకపోయాడు. అందుకే దీనికి ప్రేక్షకుల దగ్గరి నుంచి మంచి స్పందన రాలేదు. ఓటీటీలో అంతగా ఆదరణ పోందలేని ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై రాబోతుంది. ఇటీవల నిశ్శబ్దం శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకుంది. అనుష్క దీని తర్వాత రెండు సినిమాలను ఓకే చేశారని, అందులో ఒకటి ఈ సంవత్సరం సెట్స్‌పైకి వెళ్లనుందని ఒక ఇంటర్వ్యూలో ఆమె బయటపెట్టారు. (బాహుబలి తిరిగొచ్చాడు) -
కరోనా రోగికి వరం: ‘నిశ్శబ్దం’ సినిమా సూత్రం
సాక్షి, గాంధీ ఆస్పత్రి/హైదరాబాద్: అతడు బయటి వ్యక్తులతో మాట్లాడలేడు.. ఏ అవసరం ఉన్నా కుటుంబ సభ్యులు వివరిస్తారు.. కానీ అతడు కరోనా బారిన పడ్డాడు. మాటలు రాకపోవడంతో వైద్యులతో మాట్లాడలేడు. వైద్యులు చెప్పేది వినబడదు. సరిగ్గా చెప్పాలంటే ఇటీవల విడుదలైన ‘నిశ్శబ్దం’ సినిమాలోని అనుష్కలా అన్నమాట. సినిమాలో అనుష్క టెక్నిక్‌నే వినియోగించి ప్రాణాంతకమైన కరోనా వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తికి వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించారు. కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు. హైదరాబాద్ మణికొండకు చెందిన రామచంద్రన్(45) దివ్యాంగుడు. మాటలురావు.. వినబడదు. కరోనా పాజిటివ్ రావడంతో గతనెల 27వ తేదీన గాంధీ ఆస్పత్రిలో చేరాడు. రోగి సహాయకులకు అనుమతి లేకపోవడంతో రామచంద్రన్ ఒక్కడే వార్డులో అడ్మిట్ అయ్యాడు. అతడు మాట్లాడలేక పోవడం, చెప్పినా వినిపించకపోవడంతో అతడు ఇబ్బందులు పడ్డాడు. అతడి బదిర భాష వైద్యులకు అర్థం కాలేదు. మనసుంటే మార్గం ఉంటుందని భావించిన వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలను హావభావాలు, సంజ్ఞల ద్వారా వివరించారు. మరికొన్ని విషయాలను రోగి సెల్‌ఫోన్ నంబర్‌కు వాట్సాప్ చాట్ ద్వారా చెప్పారు. దీంతో వైద్యులు, రోగి మధ్య కమ్యూనికేషన్ కొంతమేర మెరుగైంది. శానిటేషన్, పేషెంట్ కేర్ టేకర్లు, వార్డ్‌బాయ్స్‌ల వద్దకు వచ్చేసరికి కమ్యూనికేషన్ సమస్య మొదలైంది. ఇటీవల విడుదలైన నిశ్శబ్దం సినిమాలో అనుష్క పాటించిన చిట్కాను ఇక్కడ వినియోగించారు. బాధితుడు తన మొబైల్లో ఇంగ్లిష్‌లో టైప్ చేస్తే, తెలుగులో బయటకు వినిపించే యాప్స్‌ను వినియోగించడంతో సమస్య పరిష్కారమైంది. రామచంద్రన్ పూర్తిగా కోలుకోవడంతో బుధవారం డిశ్చార్జి చేశారు. తనకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు, నోడల్ ఆఫీసర్ ప్రభాకర్‌రెడ్డి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ వినయ్‌శేఖర్‌తో పాటు వైద్యులు, సిబ్బందికి రామచంద్రన్, సోదరుడు రామానుజన్‌లు కృతజ్ఞతలు తెలిపారు. -
‘నిశ్శబ్దం’ సినిమాలో అనుష్క ఫోటోలు
-
మార్పు అవసరం
‘‘థియేటర్, ఓటీటీ.. రెండూ వేరు అయిన ప్పటికీ ఓటీటీలో సినిమాల విడుదలను పాజిటివ్‌గా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లాలంటే టెక్నాలజీ పరంగా ఆడియన్స్‌కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఇలాంటి మార్పులు రావడం అవసరం. వాటిని అందరూ స్వాగతించడం కూడా చాలా అవసరం’’ అన్నారు అనుష్క. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్ జంటగా అంజలి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. కోన ఫిల్మ్ కార్పొరేషన్ సహకారంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర ్భంగా అనుష్క చెప్పిన విశేషాలు. ‘భాగమతి’ చిత్రం తర్వాత కావాలని గ్యాప్ తీసుకున్నా. ఆ సమయంలో కోన వెంకట్‌గారు, హేమంత్ గారితో ‘నిశ్శబ్దం’ కథ వినిపించారు. ఇందులో నా పాత్ర వైవిధ్యంగా ఉండటంతో పాటు సినిమా కూడా బాగుంటుందని బలంగా అనిపించి, నటించడానికి ఒప్పుకున్నాను. తొలిసారి నేను నటించిన సినిమా ఓటీటీలో విడుదలవ్వడం నాకు కాస్త కొత్తగా అనిపిస్తోంది. ఈ చిత్రంలో నాది చెవిటి, మూగ అమ్మాయి పాత్ర. నేను ఈ సినిమా చేయడానికి కారణం నా పాత్రకున్న ప్రత్యేకతే. ఈ పాత్ర కోసం కొన్నాళ్లు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. అయితే షూటింగ్‌కి అమెరికా వెళ్లాక అందరూ ఎక్కువగా వాడే సైన్ లాంగ్వేజ్‌ని అక్కడి ఓ 14 ఏళ్ల అమ్మాయి దగ్గర శిక్షణ తీసుకుని నటించాను. మాధవన్‌గారితో నా కెరీర్ తొలినాళ్లలో నటించాను. మళ్లీ ఇన్నాళ్లకు నటించడం వండర్‌ఫుల్‌గా అనిపించింది. ఈ కథ కేవలం మా ఇద్దరి చుట్టూనే తిరగదు.. స్క్రీన్‌ప్లే ముందుకు నడిపించడంలో మిగతా పాత్రలు కూడా కీలకంగా మారుతుంటాయి. హేమంత్ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. ఈ ప్రయోగాత్మక కథని అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించడం అంత సులువు కాదు.. దానికి చాలా ప్యాషన్, ధైర్యం కావాలి.. ఆ రెండూ ఉన్న నిర్మాతలు విశ్వప్రసాద్, కోన వెంకట్గార్లు. థ్రిల్లర్ సినిమాలకి నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఓటీటీలో విడుదలవడంలో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఇదే. థియేటర్స్‌లో ఉండే సౌండ్ సిస్టమ్, ఆడియో క్వాలిటీని ప్రేక్షకులు మిస్ అవుతారు. అయితే హెడ్ ఫోన్స్, హోమ్ థియేటర్స్ ఈ లోపాన్ని కవర్ చేస్తాయి. మా సినిమాకు మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ పెద్ద ఎస్సెట్స్. గోపీ సుందర్ ఇచ్చిన ఆర్ఆర్ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. ఫార్వార్డ్ చేయకుండా ‘నిశ్శబ్దం’ సినిమాను ప్రేక్షకులంతా ఓ ఫ్లోలో చూడాలని మనవి చేస్తున్నా. -
నిశ్శబ్దం ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది
అనుష్క, మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడ్సన్, షాలినీ పాండే ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా చిత్రదర్శకుడు హేమంత్ మధుకర్ మీడియాతో చెప్పిన విశేషాలు. ► కమల్‌హాసన్ నటించిన ‘పుష్పక విమానం’ సినిమాలా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రయోగాత్మక సినిమాగా చేద్దామనుకుని కోన వెంకట్‌గారికి ఈ కథ చెప్పాను. కోనగారికి కథ నచ్చటంతో ఆయన ద్వారా అనుష్కగారికి, మిగతా నటీనటులకు ఈ కథ చెప్పి, ఒప్పించాను. ప్రయోగాత్మక చిత్రం అంటే నిర్మాతలు ముందుకు రారేమోనని కోన వెంకట్‌గారి సలహా మేరకు మూకీ సినిమాని కాస్తా డైలాగ్స్‌తో నింపి మెయిన్ పాత్ర అనుష్క క్యారెక్టర్‌ను మాత్రం మూకీగా ఉంచాను. అప్పుడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌గారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై సినిమాను నిర్మించటానికి ముందుకు వచ్చారు. ఆయనతో పాటు కోన ఫిల్మ్ కార్పోరేషన్ నిర్మాణ భాగస్వామిగా చేరటంతో మా ‘నిశ్శబ్దం’ తెరకెక్కింది. ► విజువల్‌గా గ్రాండ్‌గా కనిపించటంతో పాటు ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ రావటం కోసం, కథానుగుణంగా సినిమాను అమెరికాలో చిత్రీకరించాం. అమెరికాలో పుట్టిన ఇండియన్ అమ్మాయి పాత్ర అనుష్కది. అలాగే అన్ని ముఖ్యపాత్రలు అమెరికా నేపథ్యంలో ఉంటాయి. ఒరిజినాలిటీ మిస్ కాకూడదనే ఉద్దేశంతో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ను పూర్తి నిడివి ఉన్న పాత్రకోసం తీసుకున్నాం. ఒక హాలీవుడ్ నటుడు పూర్తి స్థాయిలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’ అని అనుకుంటున్నాను. ► ఈ సినిమాను కేవలం 55రోజుల్లో తీయగలిగానంటే దానికి కారణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలే. అమెరికాలో షూటింగ్ అంటే వీసాలు, లొకేషన్లు అని ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. నేను చెప్పిన కథను నమ్మి టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గార్లు ఏ లోటు లేకుండా చేయటం వల్లే ఈ సినిమా సాధ్యమయింది. ఈ సినిమాలోని సౌండ్, షానిల్ డియో కెమెరా వర్క్ గురించి సినిమా చూసిన తర్వాత అందరూ మాట్లాడతారని నమ్ముతున్నాను. సంగీత దర్శకుడు గిరీష్, గోపీసుందర్ నేపథ్య సంగీతం పోటాపోటీగా ఉంటాయి. -
బిగ్‌బాస్ షోలో కనిపించనున్న అనుష్క
థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేసేముందు చిత్రయూనిట్ హంగామా అంతా ఇంతా కాదు. ప్రచారానికి అవసరమయ్యే అన్ని దారులను భీభత్సంగా వాడేసుకుంటారు. కానీ కరోనా వల్ల థియేటర్లు తెరుచుకునే దారులు కనిపించకపోవడంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. అందులో అగ్రతార అనుష్క సినిమా "నిశ్శబ్ధం" కూడా ఉంది. ఇది అక్టోబర్ 2న విడుదల కానుంది. సుమారు రెండేళ్ల తర్వాత చేస్తున్న చిత్రం, అందులోనూ మూగ పెయింటర్‌గా భాగమతి సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఇంత ప్రత్యేకమైన ఈ సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నట్లే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఓ వార్త అందరినీ ఆకర్షిస్తోంది. 'నిశ్శబ్ధం' చిత్రయూనిట్ బిగ్‌బాస్ షోలోకి అడుగు పెట్టి నానా హంగామా చేయనుందని రెండు రోజులుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనిపై నిశ్శబ్ధం టీమ్ ఏమాత్రం స్పందించకుండా సైలెన్స్ పాటిస్తోంది. (చాలాసార్లు బతకాలనిపించలేదు: వితికా ) మరోవైపు ఆదివారం నాటి ఎపిసోడ్లో స్టేజ్‌పై అనుష్కను చూసి ఇంటిసభ్యులు సర్ప్రైజ్ అవడం ఖాయమంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అలాగే నాగ్, అనుష్కలను ఒకే ఫ్రేములో చూడబోతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం అనుష్క బిగ్‌బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనుందని చెప్తున్నారు. అదే నిజమైతే తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే రెండో మహిళా యాంకర్‌గా అనుష్క నిలిచిపోతుందని స్వీటీ అభిమానులు సంబరపడుతున్నారు. కాగా గత సీజన్లో నాగ్ విదేశాల్లో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటే అప్పుడు అతని స్థానంలో రమ్యకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా డాన్, కింగ్, ఢమరుకం వంటి పలు చిత్రాల్లో నాగ్ సరసన స్వీటీ జోడీ కట్టారు. (అనుష్క ‘నిశ్శబ్దం’ రిలీజ్ డేట్ వచ్చేసింది) -
కీలకం కానున్న 'అనుష్క' సాక్ష్యం
అనుష్క, మాధవన్ జంటగా నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం అక్టోబరు 2న విడుదలకు సిద్ధంగా ఉంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌ను హీరోలు రానా దగ్గుబాటి, విజయ్ సేతుపతి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో అనుష్క సాక్షి అనే దివ్యాంగురాలి పాత్రలో కనిపించనున్నారు. అనుష్క బెస్ట్ ప్రెండ్ పాత్రలో షాలిని పాండే నటించారు. ఓ హత్యకేసులో నిందితురాలిగా షాలినిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. మూగ, చెవిటి అమ్మాయిగా ఉన్న అనుష్క సాక్ష్యం ఈ కేసులో కీలకంగా మారనుంది. (నిశ్శబ్దం కూడా...) ఇక మాధవన్, అనుష్క ఓ దెయ్యముండే ఇంట్లోకి వెళతారు. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే సన్సెన్స్ కొనసాగేలా ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమాలో హాలీవుడ్ నటుడు అండ్రూ హడ్సన్, హీరోయిన్ అంజలి క్రైమ్ ఆఫీసర్లుగా కనిపించారు. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’ థియేటర్స్‌లో సందడిచేసేది. కానీ లాక్డౌన్ కారణంగా సినిమా విడుదలకు బ్రేక్ పడింది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో నిశ్శబ్దం సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. అక్టోబర్2న భారతదేశంతో పాటు 200 దేశాల్లో మా సినిమా విడుదల కానుంది. (ఓటీటీలో మొదటి బ్లాక్‌బస్టర్ మా ‘నిశ్శబ్దం’) -
ఫలితాన్ని దాచలేం: కోన వెంకట్
‘‘ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూడటం ఒక కిక్. అలా కుదరకపోతే టీవీలో చూస్తాం. కరెంట్ పోతే ఫోన్లో చూస్తాం. కానీ ఉత్కంఠ ఒక్కటే. ఎమోషన్ కనెక్ట్ అయితే ఏ స్క్రీన్ అయినా ఒక్కటే. సినిమా కూడా అంతే’’ అన్నారు రచయిత కోన వెంకట్. అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించాయి. ఈ సినిమా అక్టోబర్ 2న అమేజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రచయితగా, నిర్మాతగా వ్యవహరించిన కోన వెంకట్ ‘సాక్షి’కి చెప్పిన విశేషాలు. మూకీ టు టాకీ ‘నిశ్శబ్దం’ని ముందు మూకీ సినిమాగా అనుకున్నాం. స్క్రీన్ ప్లే కూడా పకడ్బందీగా ప్లాన్ చేశాం. కానీ అనుష్క పాత్ర ఒక్కటే వినలేదు... మాట్లాడలేదు.. మిగతా పాత్రలు ఎందుకు సైలెంట్‌గా ఉండాలి? అనే లాజికల్ క్వశ్చన్‌తో మూకీ సినిమాను టాకీ సినిమాగా మార్చాం. రచయితగా నాకూ సవాల్ దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ కథ ఐడియా చెప్పగానే నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఐడియాను కథగా మలిచి స్క్రీన్ ప్లే చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. మేమిద్దరం మంచి మిత్రులం కావడంతో వాదోపవాదనలు చేసుకుంటూ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచాం. షూటింగ్ ఓ పెద్ద ఛాలెంజ్ ఈ సినిమా మొత్తాన్ని అమెరికాలోనే పూర్తి చేశాం. అది కూడా కేవలం 60 రోజుల్లోనే. కానీ అలా చేయడానికి చాలా ఇబ్బందులుపడ్డాం. థ్రిల్లర్ సినిమా షూట్ చేయడానికి వాతావరణం కీలకం. అమెరికాలో శీతాకాలంలో తీయాలనుకున్నాం. మా అందరికీ వీసాలు వచ్చేసరికి అక్కడ వేసవికాలం వచ్చేసింది. రోజూ ఉదయాన్నే రెండుమూడు గంటలు ప్రయాణం చేసి లొకేషన్స్‌కి వెళ్లి షూట్ చేశాం. వేరే దారిలేకే ఓటీటీ ‘నిశ్శబ్దం’ చిత్రం రిలీజ్ ఫి్ర» వరి నుంచి వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో అయోమయం. మరీ ఆలస్యం చేస్తే కొత్త సినిమా చుట్టూ ఉండే హీట్ పోతుంది. అది జరగకూడదని ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఓటీటీకి వెళ్లకూడదని చాలా విధాలుగా ప్రయత్నించాం. ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇలా చేస్తున్నాం. కచ్చితంగా థియేటర్ అనుభూతి ఉండదు. కానీ సినిమా తీసిందే ప్రేక్షకుల కోసం. వాళ్లకు ఎలా అయినా చూపించాలి కదా. ఓటీటీలో ‘నిశ్శబ్దం’ మొదటి బ్లాక్‌బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. ఫలితాన్ని దాచలేం థియేట్రికల్ రిలీజ్ అయితే కలెక్షన్స్‌ని బట్టి సినిమా హిట్, ఫ్లాప్ చెప్పొచ్చు. ఓటీటీలో అలా ఉండదు. ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని చెప్పేస్తారు. బావుంటే అభినందనలు ఉంటాయి. లేదంటే చీల్చి చండాడేస్తారు. ఈ లాక్‌డౌన్‌ను నేను ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఉపయోగించుకున్నాను. లాక్డౌన్ తర్వాత మనం చెప్పే కథల్లో చాలా మార్పు ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. కచ్చితంగా కొత్త ఐడియాలు మన తెలుగులోనూ వస్తాయి. ‘నిశ్శబ్దం’ కూడా అలాంటి సినిమాయే అని నా నమ్మకం. కోన 2.0 వస్తాడు ► లాక్డౌన్లో కొన్ని కథలు తయారు చేశాను ► లాక్డౌన్ తర్వాత అందరిలోనూ కొత్త వెర్షన్ బయటకి వస్తుంది అనుకుంటున్నాను. అలానే కోన వెంకట్ 2.0 కూడా వస్తాడు ► కరణం మల్లీశ్వరి బయోపిక్ సినిమా బాగా ముస్తాబవుతోంది ► దేశం మొత్తం ఆశ్చర్యపడే కాంబినేషన్ ఒకటి ఓకే అయింది. ఆ వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను ► సంక్రాంతికి థియేటర్స్ ఓపెన్ అయి, ప్రేక్షకులందరూ తండోపతండాలుగా థియేటర్లకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. -
నిశ్శబ్దం కూడా...
ఇప్పటికే పలు చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడు ‘నిశ్శబ్దం’ కూడా విడుదల కానుంది. అనుష్క, మాధవన్ జంటగా అంజలి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ సహకారంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తెలుగులో ‘నిశ్శబ్దం’, తమిళ, మలయాళ భాషల్లో ‘సైలె¯Œ ్స’ పేరుతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ‘‘సస్పె¯Œ ్స, థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మాటలు రాని మరియు వినికిడి లోపం ఉన్న కళాకారిణిగా అనుష్క నటించారు’’ అన్నారు హేమంత్ మధుకర్. ‘‘భారతదేశంతో పాటు 200 దేశాల్లో మా సినిమా విడుదల కానుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. అనుష్క మాట్లాడుతూ– ‘‘నేనిప్పటివరకు చేసిన అన్ని పాత్రలతో పోలిస్తే ఈ చిత్రంలోని సాక్షి పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. నా కంఫర్ట్ జోన్ నుండి నన్ను బయటకు నెట్టివేసిన పాత్ర’’ అన్నారు. -
అనుష్క ‘నిశ్శబ్దం’ రిలీజ్ డేట్ వచ్చేసింది.
స్వీటీ అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్ పాత్రలో నటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’ థియేటర్స్‌లో సందడిచేసేది. కానీ లాక్డౌన్ కారణంగా సినిమా విడుదలకు బ్రేక్ పడింది. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయన్న దానిపై క్లారిటీ లేకపోవడంతో నిశ్శబ్దం సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. అక్టోబర్2న 'నిశ్శబ్దం'ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నట్లు నిర్మాత కోన వెంకట్ ప్రకటించారు. ఇప్పటికే ఆ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. దీంతో ఓటీటీ వేదికగా విడుదలవుతున్న తెలుగు సినిమాల్లో రెండో పెద్ద సినిమాగా నిశ్శబ్దం నిలవనుంది. ఇప్పటికే నాని, సుధీర్‌బాబు నటించిన ‘వీ’ సినిమా విడుదలైంది. పలు చిన్న సినిమాలు ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అవుతున్నా పెద్ద సినిమాలు మాత్రం కాస్త ఆచితూచి అడుగులేస్తున్నాయి. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం చిత్రంలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. (స్వీటీ మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం? ) 🤫🤫🤫🤫🤫 https://t.co/Imz8HJgU2h — kona venkat (@konavenkat99) September 18, 2020 -
ఓటీటీలో అనుష్క సినిమా.. రేపే క్లారిటీ!
స్వీటీ అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన చిత్రంలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్డౌన్ కారణంగా థియేటర్లకు తాళం పడటంతో విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఈ సినిమా దర్శకనిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. (ఆ విషయంలో తగ్గేది లేదన్న స్వీటీ ) నిశ్శబ్దం సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు సినీ నిర్మాతలు రెడీ అయ్యారు. అంతేగాక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు(సెప్టెంబర్17) రానుంది. కాగా నిశ్శబ్దం మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. అయితే అక్టోబర్ 2న 'నిశ్శబ్దం'ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఓటీటీలో నేరుగా విడుదలవుతున్న తెలుగు సినిమాల్లో రెండో పెద్ద సినిమాగా గుర్తింపు పొందుతుంది. ఇప్పటికే నాని, సుధీర్‌బాబు నటించిన ‘వీ’ సినిమా విడుదలైంది. (అమెజాన్‌లో అనుష్క సినిమా..) -
మహేశ్ డైరెక్షన్లో స్వీటీ చిత్రం?
‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవీ’, ‘భాగమతి’ వంటి సూపర్‌డూపర్‌హిట్ చిత్రాలతో ఫుల్ క్రేజ్ సాధించిన స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క. ఇప్పటికే దక్షిణాదిన భారీ బడ్జెట్‌తో కూడిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అయితే లాక్డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలా లేక ఓటీటీలో విడుదల చేయాలా అనేదానిపై దర్శకనిర్మాతలు తర్జనభర్జన పడుతున్నారు. (సెన్సార్ పూర్తి.. సస్పెన్స్ అలానే ఉంది!) అయితే ‘నిశ్శబ్దం’ సినిమా గురించి కాస్త పక్కన పెడితే.. అనుష్క మరో భారీ లేడీ ఓరియెంట్ చిత్రానికి కమిట్ అయిందని సమాచారం. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ నిర్మించనుందని టాక్. ఇప్పటికే యువీ క్రియేషన్స్‌లో మిర్చి, భాగమతి చిత్రాలను స్వీటీ చేసిన విషయం తెలిసిందే. సందీప్ కిషన్‌తో ‘రారా కృష్ణయ్య’ తీసిన పి. మహేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
సెన్సార్ పూర్తి.. సస్పెన్స్ అలానే ఉంది!
అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్ పాత్రలో నటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’తో థియేటర్స్‌లో సందడి చేసేవారు అనుష్క అండ్ టీం. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా అన్ని థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్రం మంగళవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హెమంత్ మధుకర్ తన ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి: నటుడు సూర్యకు గాయాలు..!) ‘మా రెండు చిత్రాలు తెలుగులో నిశ్శబ్దం, సైలెన్స్ చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా చూశాక బోర్డు సభ్యుల స్పందన చూసి చాలా ఆనందం వేసింది. ఈ సినిమాను తొలుత థియేటర్లోనే విడదుల చేయాలని సలహా ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు’ అంటూ హేమంత్ మధుకర్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడి ట్వీట్ ఆసక్తిరేపుతోంది. ఇక షూటింగ్‌లకు, థియేటర్లకు అనుమతుల్వివ్వాలని టాలీవుడ్ ప్రముఖులు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్న విషయం తెలిసిందే. దీంతో ఓటీటీలో విడుదల చేసే ప్రక్రియను కొన్నిరోజుల పాటు నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. (బన్నీ సినిమాలో యాంకర్ సుమ!) Both our films #nishabdham Telugu and #silence given U/A censor certificate and I am overwhelmed by the response of the #cencorboard panel members and my sincere thanks to them for there advice to release the film first in theatre 🙏 pic.twitter.com/bIZTOvjY7q — Hemantmadhukar (@hemantmadhukar) May 26, 2020 ‘మా చిత్రం ‘నిశ్శబ్దం’ విషయంలో మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకే మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. చాలా కాలం పాటు అందుకు పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రం.. అప్పుడు ఓటీటీ గురించి ఆలోచిస్తాము. అప్పుడు అదే బెస్ట్ అని అనుకుంటాము’ అంటూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ కొద్దిరోజుల క్రితం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలపై ఇప్పట్లో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. థియేటర్లపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాతే ‘నిశ్శబ్దం’ విడుదలపై ఆలోచించాలని చిత్రబృందం భావిస్తుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_841250433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ రియాక్షన్ మాకు ఆక్సిజన్
‘‘సినిమాలను థియేటర్స్‌లోనే చూడటం ఉత్తమం’’ అంటున్నారు రచయిత, నిర్మాత కోన వెంకట్. ‘‘మేం (సినిమా పరిశ్రమకు చెందిన అందరూ) ఎన్నో కష్టాలకు ఓర్చి, ఎంతో ఇష్టంతో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాం. సినిమా చూస్తున్నప్పుడు థియేటర్స్‌లో ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనే మేం చేసే పనికి స్ఫూర్తి, మాకు ఆక్సిజన్. థియేటర్స్‌లో సినిమాను చూసే అనుభూతిని ఏదీ (డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను ఉద్దేశించి కావొచ్చు) భర్తీ చేయలేదు. సినిమా అంటే సినిమా హాల్లోనే చూడాలి’’ అని ఆదివారం ట్వీట్ చేశారు కోన వెంకట్. ఈ సంగతి ఇలా ఉంచితే అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడసన్ ప్రధాన తారాగణంగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కోన వెంకట్ ఇలా స్పందించడంతో ‘నిశ్శబ్దం’ చిత్రం థియేటర్స్‌లోనే విడుదలవుతుందని ఊహించవచ్చు. -
అమెజాన్‌లో అనుష్క సినిమా..
కరోనా లాక్డౌన్ కారణంగా చాలా సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. ఈ లాక్డౌన్ కాలంలో అన్ని భాషల్లో కలిపి దాదాపు వంద సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. దీంతో విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రాలను ఏం చేయాలో దర్శకనిర్మాతలకు పాలుపోవడం లేదు. ఈ క్రమంలో దర్శకనిర్మాతలకు కనిపిస్తున్న ఒకే ఒక్క దారి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్. ఎంతో రేట్ మాట్లాడుకొని ఓటీటీ వేదికగా విడుదల చేయాలని ముఖ్యంగా నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే పాపులారిటీ తగ్గుతుందనే భయాన్ని నటీనటులు వ్యక్తపరుస్తున్నా, థియేటర్ల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నా నిర్మాతలు మాత్రం డిజిటల్లోనే విడుదల చేయాలని ఫిక్సవుతున్నారు. ఇప్పటికే పలు చిత్రాలు డిజిటల్ బాట పట్టగా మరికొన్ని చిత్రాలు సంప్రదింపుల దశలో ఉన్నాయి. ఈ క్రమంలో స్వీటీ అనుష్క శెట్టి నటించిన ‘నిశ్శబ్దం’ అమెజాన్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని ఆమెజాన్లో జూన్ నెలలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు బావిస్తున్నారని తెలుస్తోంది. కాగా, ఈ సినమాకు రికార్డు స్థాయిలో డిజిటల్ హక్కులను ఆమెజాన్ కొనగోలు చేసిందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక రిలీజ్ విషయం అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించాల్సిన అవసరం ఉంది.హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కేఎఫ్‌సీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించింది. చదవండి: మహేశ్ కాదనడంతో చరణ్‌తో.. ‘ఇస్తా.. మొత్తం తిరిగి ఇచ్చేస్తా’ -
డీల్ కుదిరినట్లే.. రేపోమాపో ప్రకటన?
స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నిశ్శబ్దం’. మాధవన్, అంజలి, షాలిని పాండే తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా థియేటర్లకు తాళం పడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా మరోసారి వాయిదా పడింది. లాక్డౌన్ పొడగింపు, ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో దర్శకనిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సమయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. విడుదలకు సిద్దంగా ఉండి లాక్‌డౌన్‌తో విడుదల కాకుండా ఆగిపోయిన చిత్రాలకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఒకటిరెండు చిన్న సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై విడుదల అయ్యాయి. అయితే తాజాగా ఓ సంస్థ నిశ్శబ్దం సినిమాతో డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుష్క, మాధవన్, అంజలి వంటిస్టార్లు నటించడం, సౌతిండియాలో ఈ సినిమాపై క్రేజ్ ఎక్కువగానే ఉండటంతో ‘నిశ్శబ్దం’కు భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు థియేటర్లోనే విడుదల చేస్తామని భీష్మించుకొని కూర్చున్న చిత్రబృందం కాస్త మెత్తపడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం డీల్ చివరి దశలో ఉందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: పవర్ స్టార్ సరసన అనుష్క? ‘డియర్ విజయ్.. నేనర్థం చేసుకోగలను’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_541241401.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వారికి అక్కాచెల్లెల్లు, పిల్లలు ఉండరా: అనుష్క
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న అనుష్క శెట్టి.. హీరోలతో సమానంగా పాపులారిటీ, పారితోషికం అందుకుంటున్నారు. తన 15 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తున్నారు. అయితే అనుష్క ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో.. ఆమెపై అంతే స్థాయిలో రూమర్లు ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా స్వీటీ పెళ్లిపై అనేక పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న పుకార్లు, వ్యక్తిగత విషయాలపై స్వీటీ పెదవి విప్పారు. (నేనూ ప్రేమలో పడ్డా: అనుష్క) ఆమె మాట్లాడుతూ.. ‘చిత్ర పరిశ్రమలో రూమర్లు సాధారణం. వాటి కోసం నేనేం చేయలేను. అయితే అలాంటి పుకార్లు ఎందుకు వ్యాప్తి చేస్తారో నాకు అర్థం అవ్వడం లేదు. నా పెళ్లి విషయంలో వచ్చిన పుకార్ల వల్ల నేను మొదట నిరాశపడ్డాను. అయినా ఇలా పుకార్లు సృష్టిస్తున్న వారికి అక్కాచెల్లెల్లు, పిల్లలు ఉండరా’ అని తనపై గాసిప్స్ క్రియెట్ చేస్తున్న వ్యక్తులపై స్వీటీ విరుచుకుపడ్డారు. అలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్‌ల వల్ల తీవ్రమైన వెన్నునొప్పికి గురయినట్లు, దాని నుంచి కోలుకోవడానికి మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకున్నట్లు తెలిపారు. టీవీ చూడటం, న్యూస్ పేపర్ చదవడం తనకు అలవాటు లేదని, తన స్నేహితులు పంపిన మెసెజ్‌ల ద్వారా ఈ పుకార్ల గురించి తెలుసుకుంటానని అనుష్క వెల్లడించారు. (అవి నా కుటుంబాన్ని బాధిస్తున్నాయి: అనుష్క) ముక్కు సూటిగా మాట్లాడతా ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై అనుష్క మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదని నేను చెప్పను. కానీ అదృష్టవశాత్తూ నేను ఎప్పుడూ దీన్ని ఎదుర్కోలేదు. నేను ఎప్పుడూ ముక్కుసూటిగా, స్పష్టంగా ఉంటాను. చిత్ర పరిశ్రమలో సులభ మార్గాల ద్వారా రాణించాలా.. లేదా కష్టపడి నిలదొక్కుకోవాలా అనేది నిర్ణయించుకోవాలి’ అని సూచించారు. ఇక అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న విడుదల కానుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. (చిత్రం పేరు మాత్రమే నిశ్శబ్దం..) -
2008లో ఓ వ్యక్తిని ప్రేమించా: అనుష్క
సాక్షి, చెన్నై: సినీ తారల వ్యక్తిగత విషయాలపై అందరికీ ఆసక్తే. ఇక వారి ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలు అయితే హాట్ టాపిక్ అనే చెప్పుకోవచ్చు. గత ప్రముఖ హీరోయిన్ అనుష్క కొంతకాలంగా పలు వదంతులను చవిచూశారు. ప్రేమలో ఉన్నట్లు ఓసారి, డేటింగ్లో ఉందంటూ మరోసారి, పెళ్లి కుదిరిందంటూ... ఇలా రూమర్స్ హల్చల్ చేశాయి కూడా. అయితే వాటిపై అనుష్క పలుసార్లు వివరణ ఇచ్చినా.. ఆ పుకార్లకు కామాలే, కానీ ఫుల్స్టాప్ పడటం లేదు. అప్పట్లో బాహుబలి హీరో ప్రభాస్‌తో ప్రేమలో ఉందని, ఆ తర్వాత ఓ ప్రముఖ క్రికెటర్‌తో రిలేషన్షిప్ కొనసాగించదని వార్తలు వచ్చాయి. ఇవి సరిపోవన్నట్లు జడ్జిమెంటల్ హై క్యా దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడిని పెళ్లి చేసుకోనుందన్న ఊహాగానాలు వినిపించాయి. మధ్యలో ఓ వ్యాపారవేత్తతోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిందన్న వార్తలకూ కొదవ లేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు వినీవినీ అనుష్కకు విసుగెత్తిపోయారు. (నాకు మూడు నాలుగు సార్లు పెళ్లి చేశారు) దీని గురించి ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తనకంటూ సొంత జీవితం ఉందని, అందులోకి కొందరు వేలుపెట్టే ప్రయత్నాలు నచ్చడం లేదన్నారు. తన ప్రేమ,పెళ్లి గురించి వదంతులు ప్రచారం చేసేవారందరికీ చెప్పేదేమిటంటే తానూ ఒక్కప్పుడు ప్రేమలో పడినట్లు తెలిపారు. 2008లో ఓ వ్యక్తిని ప్రేమించానని, అది తీయని ప్రేమ అని పేర్కొన్నారు. అయితే ఆ ప్రేమ కొనసాగలేదని, కొన్ని అనివార్య పరిస్థితుల్లో విడిపోయామని చెప్పారు. తాను ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరన్నది చెప్పడం ఇష్టం లేదని అనుష్క తెలిపారు. అలాగే ప్రభాస్ తాను మంచి స్నేహితులమని అన్నారు. (అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క) కాగా టాలీవుడ్లో ‘సూపర్’ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అనుష్క తాజాగా ‘నిశ్శబ్దం’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రెండేళ్లు విరామం తరువాత ఆమె ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే షూటింగ్లలో గాయాల కారణంగా కొంత విరామం వచ్చినట్లు అనుష్క చెప్పారు. ఇక అనుష్క లీడ్ రోల్లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’.. క్రితి ప్రసాద్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలవుతోంది. కాగా త్వరలో దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శతక్వంలో నటించడానికి రెడీ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. (పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అనుష్క) -
‘నిశ్శబ్దం’ సినిమా స్టిల్స్
-
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అనుష్క
వెండితెరలో శిఖరాగ్రాలను అందుకున్న హీరోయిన్ స్వీటీ అనుష్క. హీరోలతో సమానంగా పాపులారిటీ, పారితోషకాలు అందుకోగల అతి కొద్దిమంది టాలీవుడ్ హీరోయిన్లలో ఈమె ఒకరు. ఆమె సినిమా రంగంలోకి ప్రవేశించి 15 వసంతాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ అందచందాల్లోనూ, అభినయాల్లోనూ తనకు తానే సాటిగా నిలిచారు. అయితే ఆమెను కొన్ని సంవత్సరాలుగా ఓ విషయం వెంటాడి వేధిస్తోంది. దీనిపై ఆమె తాజాగా స్పందిస్తూ అది అంతలా బాధిస్తోంది తనను కాదని, తన కుటుంబాన్ని అని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆమె దేనికోసం మాట్లాడుతుందనుకుంటున్నారు.. ఇంకేముందీ పెళ్లిగోల... అప్పట్లో బాహుబలి హీరో ప్రభాస్‌తో ప్రేమలో ఉందని, ఆ తర్వాత ఓ ప్రముఖ క్రికెటర్‌తో రిలేషన్షిప్ కొనసాగించదని వార్తలు వచ్చాయి. ఇవి సరిపోవన్నట్లు జడ్జిమెంటల్ హై క్యా దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడిని పెళ్లి చేసుకోనుందన్న ఊహాగానాలు వినిపించాయి. మధ్యలో ఓ వ్యాపారవేత్తతోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిందన్న వార్తలకూ కొదవ లేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు వినీవినీ అనుష్కకు విసుగెత్తిపోయారు. (చిత్రం పేరు మాత్రమే నిశ్శబ్దం..) తన పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని కుండ బద్ధలు కొట్టారు. ‘ప్రేమ విషయాన్ని ఎవరూ దాయలేరు, అలాంటిది నేనెలా దాస్తాననుకున్నారు’ అని తిరిగి ప్రశ్నించారు. ఇంత సెన్సిటివ్ మ్యాటర్‌ను రచ్చకీడుస్తారేంటని మండిపడ్డారు. ‘నాకంటూ వ్యక్తిగత జీవితం ఉంది. అందులోకి ఎవరైనా తలదూర్చడం నాకు ఇష్టం ఉండదు. వివాహం అనేది జరగాల్సినప్పుడు జరుగుతుంది. అయినా ఈ వదంతులన్నీ ఎక్కడ నుంచి పుట్టుకొస్తాయో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఇలాంటి అసత్య ప్రచారాలను అస్సలు పట్టించుకోనివారిలో నేనూ ఒకదాన్ని. కానీ ఈ రూమర్స్ వల్ల నా కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు స్వీటీ. ‘నా పెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు విడిచిపెట్టాను. కాబట్టి నా వివాహం తప్పకుండా పెద్దలు కుదిర్చినదే అవుతుంది’ అని స్పష్టం చేశారు. (అనుష్క విషయంలో ఇదీ వదంతేనా?) -
టాప్ హీరోయిన్ అవుతావన్నాను
‘‘స్వీటీ (అనుష్క)ని ఫస్ట్ టైమ్ చూసినప్పుడే సౌత్‌లో టాప్ హీరోయిన్ అవుతావన్నాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ తను ఈ స్థాయికి వచ్చినందుకు గర్వంగా ఉంది. ప్రయత్నిస్తే సినిమాలు దొరుకుతాయి. కానీ, పాత్రలన్నీ నిన్ను (అనుష్క) వెతుక్కుంటూ వచ్చాయి.. ఏ హీరోయిన్‌కీ ఆ అవకాశం దక్కలేదు’’ అన్నారు డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు. అనుష్క లీడ్ రోల్లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. క్రితి ప్రసాద్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలవుతోంది. ‘సూపర్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనుష్క ఫిల్మ్ ఇండస్ట్రీలో 15ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘నా సినిమాల్లో హీరోయిన్లకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. కానీ, దేవసేన పాత్ర ఇచ్చినందుకు గర్వపడుతున్నా. ‘నిశ్శబ్దం’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి.. ఏప్రిల్ 2న సినిమా కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ‘‘హీరోయిన్లలో అనుష్కలాంటి మంచి అమ్మాయి ఉండటం అరుదు’’ అన్నారు డి. సురేశ్ బాబు. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఐదారు నెలల క్రితం జార్జియాకి వెళ్లాను. అక్కడ కారు డ్రైవర్, కేర్ టేకర్ గాజా ‘మీకు స్వీటీ (అనుష్క) తెలుసా?’ అన్నాడు. సర్ప్రైజింగ్గా అనిపించింది. ఓ తమిళ సినిమా షూటింగ్ కోసం అనుష్క జార్జియాలో ఉన్నప్పుడు గాజానే కారు డ్రైవర్, కేర్ టేకర్‌గా ఉండేవాడు. తన కారుని ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లిపోతే అనుష్క కొత్త కారు కొనిచ్చిందట. అంత మంచి అమ్మాయి. మంచి టీమ్‌తో తను చేసిన ‘నిశ్శబ్దం’ పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘స్వీటీ.. నీ కెరీర్లో మరో పదేళ్లలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంటావని కచ్చితంగా చెబుతున్నా’’ అన్నారు నిర్మాత పీవీపీ. ‘‘సూపర్’ సినిమా హీరోయిన్ కోసం ముంబై వెళ్లా. అక్కడ అనుష్క వచ్చింది. ఏం చేస్తుంటావని అడిగితే యోగా టీచర్ అంది. నాగార్జునగారికి చూపించి, ఆడిషన్స్ చేద్దామన్నాను.. చాలా బాగుంది.. ఏం పర్లేదు ఆడిషన్స్ వద్దన్నారాయన. వినోద్ బాల వద్ద నటన నేర్చుకుంది. ‘నిశ్శబ్దం’ బాగుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. అనుష్క మాట్లాడుతూ– ‘‘సూపర్’ నుంచి ‘నిశ్శబ్దం’ వరకూ ఎందరో డైరెక్టర్లు, నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి ఎంతో నేర్చుకున్నా. ఈ పదిహేనేళ్లలో మంచీ, చెడులు తెలిశాయి’’ అన్నారు. ‘‘అనుష్కగారితో ‘నిశ్శబ్దం’ సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్ ‘‘అనుష్క కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిలా నిలుస్తుంది’’ అన్నారు హేమంత్ మధుకర్. ‘‘అనుష్క నిజంగానే ‘లేడీ సూపర్‌స్టార్’. తన మంచి లక్షణాలతో ఓ పుస్తకం రాయొచ్చు’’ అన్నారు కోన వెంకట్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కిరణ్, శోభు యార్లగడ్డ, చార్మీ, ప్రశాంతి, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూఛిబొట్ల, డైరెక్టర్లు శ్రీవాస్, దశరథ్, వైవీఎస్ చౌదరి, వీరూ పోట్ల, హీరోయిన్ అంజలి పాల్గొన్నారు. -
ప్యాన్ ఇండియా
ఇంతకుముందు ప్రాంతీయ భాషల సినిమాలకు పరిమితులుండేవి. కేవలం రీజినల్ మార్కెట్టే ఆ సినిమాల మెయిన్ టార్గెట్. సినిమా కథలు కూడా కేవలం వాళ్లకే అన్నట్టుగా తయారయ్యేవి. కానీ గడిచిన నాలుగైదేళ్ల నుంచి ప్రాంతీయ భాషల సినిమాలకు పరిమితులు తొలగిపోయాయి. హద్దులు చెరిగిపోయాయి. ఈ మార్పులో ‘బాహుబలి’ కీలక పాత్ర పోషించిందని సందేహం లేకుండా చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకి అభిమానులు ఎక్కువయ్యారు. మన సినిమాకి ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టే మనవాళ్లు ప్యాన్ ఇండియా (దేశంలో ఎక్కువ భాషల్లో సినిమాని విడుదల చేయడం) సినిమాగా తీయడానికి సంకోచించడం లేదు. ఐదారు భాషల్లో ఏకకాలంలో సినిమాని విడుదల చేసి మార్కెట్‌ను విస్తృతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో సుమారు పది సినిమాలు ‘ప్యాన్ ఇండియా’ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రెడీ అవుతున్నాయి. వాటి వివరాలు. త్రిబుల్ ఆర్.. టార్గెట్ 10 ‘బాహుబలి’తో మార్కెట్ లెక్కలకి కొత్త రెక్కలిచ్చారు దర్శకుడు రాజమౌళి. కథ బావుంటే సినిమా ఏ ప్రాంతంలో తయారైనా ఆదరణ అంతటా లభిస్తుందని నిరూపించారు. ‘బహుబలి’ ఇచ్చిన నమ్మకంతోనే ప్రస్తుతం మరో ప్యాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ – రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. సుమారు 400 కోట్ల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. 1920ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దాదాపు పది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. డార్లింగ్.. టార్గెటింగ్ వరల్డ్ ‘బాహుబలి’తో నార్త్ ఆడియన్స్‌కి కూడా ప్రభాస్ డార్లింగ్ అయిపోయారు. ‘సాహో’ సౌత్‌లో అంచనాలను అందుకోలేకపోయినా నార్త్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ప్రస్తుతం రాధాకృష్ణతో ప్రభాస్ చేస్తున్న ‘ఓ డియర్’ ప్యాన్ ఇండియా మూవీ అయితే ఆ తర్వాత నాగ్ అశ్విన్‌తో దర్శకత్వంలో చేయనున్న సినిమా ప్యాన్ వరల్డ్. ‘ఓ డియర్’ సినిమా పీరియాడిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇక నాగ్ అశ్విన్‌తో చేయబోయేది సైన్స్ ఫిక్షన్ జానర్ సినిమా. ‘‘ఇది ప్యాన్ వరల్డ్ మూవీ’’ అంటున్నారు నాగ్ అశ్విన్. నిశ్శబ్దంగా... ‘బాహుబలి’ తర్వాత అనుష్క తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ కూడా పలు భాషల్లో రిలీజ్ కానుంది. పూర్తి స్థాయిలో అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే థ్రిల్లర్ చిత్రమిది. ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఇందులో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా నటించారు. సినిమాలో ఆమె చిత్రకారిణి. ఇది ‘క్రాస్ ఓవర్’ మూవీ. అంటే.. పలు భాషలకు చెందినవాళ్లు కలిసి ఒకే సినిమాలో నటించడం. ఈ సినిమాలో ఎక్కువమంది హాలీవుడ్ తారలు ఉండటం విశేషం. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇస్మార్ట్ మూవ్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఘనవిజయంతో దర్శకుడు పూరి జగన్నాథ్ డబుల్ ఎనర్జీతో ఉన్నారు. ఇస్మార్ట్ ప్లాన్ చేశారు. ఇప్పుడు యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో కలసి బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. దీని కోసం బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా వీళ్లకు తోడయ్యారు. అనన్యా పాండే కథానాయిక. హిందీ– తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. గ్రాండ్ కమ్‌బ్యాక్ మూడేళ్ల నుంచి మంచు మనోజ్ ఎనర్జీ స్క్రీన్ మీద కనిపించడం లేదు. అయితే కమ్‌బ్యాక్‌ను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మనోజ్. ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్‌తో ఓ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవలే ముహూర్తం జరుపుకుంది ఈ సినిమా. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ప్యాన్ కన్నప్ప ‘భక్త కన్నప్ప’ పై సినిమా చేయాలని కొంతకాలంగా వర్క్ చేస్తున్నారు మంచు విష్ణు. కన్నప్ప పాత్రలో నటించి ఈ సినిమాను నిర్మించనున్నారు. సుమారు 95 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ తీయనున్నారు. భారీ స్థాయిలో ఉండేలా ప్రీ– ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. హాలీవుడ్ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. డబుల్ ప్యాన్ హిందీ–తెలుగు–తమిళం ఇలా ఏ భాషలో అయినా కనిపిస్తూనే ఉంటారు రానా. కథ నచ్చితే పాత్ర ఏదైనా డబుల్ ఓకే అంటారాయన. ప్రస్తుతం రానా ‘అరణ్య’ అనే భారీ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. అడవులను రక్షించాలనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలోని పాత్ర కోసం 30 కిలోలు తగ్గారు రానా. హిందీ, తెలుగు, తమిళంలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అలాగే ‘హిరణ్య కశ్యప’ అనే పౌరాణిక చిత్రంలో కనిపించనున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందట. ఇది కూడా ప్యాన్ ఇండియా సినిమానే. మేజర్ ప్లాన్ పరిమిత బడ్జెట్, పరిమిత వనరులతో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు ‘అడవి’ శేష్. ‘క్షణం, గూఢచారి, ఎవరు’ సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. ఈసారి కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు, దేశవ్యాప్తంగా ఇండియన్ ఆడియన్స్‌ను తన మ్యాజిక్‌లో పడేయడానికి సిద్ధమయ్యారు శేష్. ముంబై తాజ్ హోటల్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్‌లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా శేష్ టైటిల్ రోల్లో ‘మేజర్’ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. కరణం.. ఆదర్శం ఒలింపిక్స్‌లో మన దేశానికి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతాకాన్ని తీసుకొచ్చారు కరణం మల్లీశ్వరి. ఎందరో క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారామె. ఆమె జీవితాన్ని స్క్రీన్ మీద చూపించాలనుకుంటున్నారు దర్శకురాలు సంజనా రెడ్డి. సుమారు 50 కోట్ల వ్యయంతో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందనుంది. నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఇవి కాకుండా మరికొన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో చెప్పాల్సిన కథలు రచయితల డ్రాయింగ్ రూమ్‌లో రెడీ అవుతూనే ఉండొచ్చు. ఇవన్నీ బాగా ఆడాలని, మన కథలు ప్రపంచస్థాయికి వెళ్లాలని, తెలుగు సినిమా పరిధి, స్థాయి, మార్కెట్, గౌరవం మరింత పెరగాలని ఆశిద్దాం. తెలుగు సినిమా జయహో! – గౌతమ్ మల్లాది -
ఆ అమ్మాయి ఒక్కటే చేసిందంటారా?
‘‘అక్కడ చీకట్లో ఎవరో ఎటాక్ చేశారంట.. కానీ ఎవరో ఏంటో కనిపించలేదంటున్నారు’, ‘ఒక ఘోస్ట్ ఇదంతా చేసిందని యాక్సెప్ట్ చెయ్యడానికి నా సెన్సిబిలిటీస్ ఒప్పుకోలేదు’, ‘నిన్న ఆర్ఫనేజ్‌కు వెళ్లిన మాకు చాలా షాకింగ్ విషయాలు తెలిశాయి’, ‘ఇదంతా ఓ పాతికేళ్ల అమ్మాయి ఒక్కటే చేసిందంటారా?’... వంటి ‘నిశ్శబ్దం’ చిత్రం ట్రైలర్‌లోని డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. క్రితి ప్రసాద్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను హీరో నాని తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసి, ‘‘ఇదిగో.. మా స్వీటీ (అనుష్క) స్వీటెస్ట్ ‘నిశ్శబ్దం’ ట్రైలర్.. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఇది’’ అన్నారు. ‘‘ఓ పాడుబడిన ఇంట్లో ఉన్న అనుష్క, మాధవన్ కొన్ని భయానకమైన విషయాలను చూస్తారు.. ఆ ఇంట్లో ఏముందోనని పోలీసుల అన్వేషణతో సినిమా నడుస్తుంది. మరో హీరోయిన్ అంజలి అమెరికన్ పోలీసాఫీసర్ పాత్రలో కనపడుతుంది. మాట్లాడలేని, చెవులు వినపడని బధిర అమ్మాయి సాక్షి పాత్రలో నటించిన అనుష్క తన సైగలతో అంజలికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటుంది. అసలు అనుష్క బెస్ట్ ఫ్రెండ్ సోనాలి ఎవరు? దెయ్యం ఇల్లు ఏంటి? అందులో జరిగే కథేంటి?’’ వంటి విషయాలన్నీ తెలియాలంటే ఏప్రిల్ 2 వరకూ ఆగాల్సిందే అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. మాధవన్, మైఖేల్ మ్యాడసన్, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: షానియల్ డియో, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
చిత్రం పేరు మాత్రమే నిశ్శబ్దం..
భాగమతి తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని హీరోయిన్ అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, అంజలి, షాలిని పాండే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ప్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం హీరో నాని విడుదల చేశారు. చిత్రబృందానికి బెస్ట్ విషేస్ తెలియజేశారు. ఈ చిత్రంలో అనుష్క మూగ చిత్రకారిణి పాత్రలో కనిపించనున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో చీకట్లో జరిగే దాడులపై విచారణ చేపట్టే అధికారిణిగా అంజలి కనిపించనున్నారు. (చదవండి : శింబుతో సెట్ అవుతుందా?) చిత్రం పేరు నిశ్శబ్దం అయినప్పటికీ.. ప్రేక్షకులను మాత్రం థ్రిల్‌కు గురిచేస్తుందని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ‘నిన్న నీ బెస్ట్ ఫ్రెండ్ సోనాలి ఎందుకు రాలేదు?’, ‘ఒక ఘోస్ట్ ఇదంతా చేసిందని యాక్సెప్ట్ చెయ్యడానికి నా సెన్సిబిలిటీస్ ఒప్పుకోలేదు’, ‘ఇదంతా ఓ పాతికేళ్ళ అమ్మాయి ఒక్కత్తే చేసిందంటారా?’ అనే డైలాగ్‌లు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. కాగా, టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్లు నిర్మిస్తున్న ఈ చిత్రం.. ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుండి. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, కోన వెంకట్ డైలాగ్ రైటర్‌గా ఉన్నారు. (చదవండి : అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క)