అందం కోసం.. నిర్మాతలు కాదనగలరా? | Nishabdam Team Use CG For Anushka Buety | Sakshi
Sakshi News home page

అనుష్క అందం కోసం..

Published Mon, Jan 6 2020 8:31 AM | Last Updated on Mon, Jan 6 2020 8:31 AM

Nishabdam Team Use CG For Anushka Buety - Sakshi

సినిమా: అందం, అభినయంతో సినీప్రేక్షకులను అలరిస్తున్న నటి అనుష్క. అయితే ఎంత అందం ఉన్నా దానికి బరువు పెద్ద భారమే అవుతుంది. అలాంటి అందమైన నాజూకుతనాన్ని అనుష్క సైజ్‌ జీరో చిత్రం కోసం త్యాగం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత బరువు తగ్గడానికి నానా తంటాలు పడింది. కసరత్తులు, యోగా వంటివి చేయాల్సినంతా చేసింది. చివరికి అమెరికాకు వెళ్లి ఆధునిక వైద్యం చేయించుకుంది. ఇందు కోసం కొంత కాలం నటనకు దూరం అయింది కూడా. అయినా పెద్దగా ఫలితం లేకపోయింది. సైజ్‌ జీరో చిత్రం తరువాత బాహుబలి, బాహుబలి 2  చిత్రంల్లో నటించింది. అయితే బాహుబలి 2లో అనుష్కను స్లిమ్‌గా చూపించడానికి ఈ చిత్ర యూనిట్‌ గ్రాఫిక్స్‌ను ఉపయోగించక తప్పలేదు.

అందుకు భారీగానే ఖర్చు చేశారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు రాజమౌళి బహిరంగంగానే చెప్పారు. ఆ తరువాత అనుష్క నటించిన భాగమతి చిత్రానికి వీఎఫ్‌ఎక్స్‌తో అనుష్క బరువును మ్యానేజ్‌ చేశారు. తాజాగా ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రం సైలెన్స్‌. మొత్తం ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో నిశ్చబ్దం అనే పేరును నిర్ణయించారు. ఇందులో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోంది. అయితే ఇంతకు ముందు కంటే కొంచెం బరువు తగ్గిందని చెప్పవచ్చు. అయినా తనను సన్నగా చూపించాలని, బాహుబలి 2 చిత్రం తరహాలో గ్రాఫిక్స్‌ను ఉపయోగించాలని సైలెన్స్‌ చిత్ర నిర్మాతలకు అనుష్క చెప్పిందని సమాచారం. స్వయంగా ఆమె చెప్పడంతో నిర్మాతలు కాదనగలరా? ఇప్పుడు సైలెన్స్‌ చిత్రంలో అనుష్కను స్లిమ్‌గా, మరింత అందంగా చూపించడానికి చిత్ర వర్గాలు తంటాలు పడుతున్నారని సమాచారం. కాగా అనుష్క తదుపరి గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. అందుకు తనను తాను తయారు చేసుకునే పనిలో ఉందట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement