2008లో ఓ వ్యక్తిని ప్రేమించా: అనుష్క | Anushka Shetty Open Up Her Love Story | Sakshi

నేనూ ప్రేమలో పడ్డా: అనుష్క

Mar 21 2020 10:14 AM | Updated on Mar 21 2020 12:45 PM

 Anushka Shetty Open Up Her Love Story - Sakshi

సాక్షి, చెన్నై: సినీ తారల వ్యక్తిగత విషయాలపై అందరికీ ఆసక్తే. ఇక వారి ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలు అయితే హాట్‌ టాపిక్‌ అనే చెప్పుకోవచ్చు. గత ప్రముఖ హీరోయిన్‌ అనుష్క  కొంతకాలంగా పలు వదంతులను చవిచూశారు. ప్రేమలో ఉన్నట్లు ఓసారి, డేటింగ్‌లో ఉందంటూ మరోసారి, పెళ్లి కుదిరిందంటూ... ఇలా రూమర్స్‌ హల్‌చల్‌ చేశాయి కూడా. అయితే వాటిపై అనుష్క పలుసార్లు వివరణ ఇచ్చినా.. ఆ పుకార్లకు కామాలే, కానీ ఫుల్‌స్టాప్ పడటం లేదు. 

అప్పట్లో బాహుబలి హీరో ప్రభాస్‌తో ప్రేమలో ఉందని, ఆ తర్వాత ఓ ప్రముఖ క్రికెటర్‌తో రిలేషన్‌షిప్‌ కొనసాగించదని వార్తలు వచ్చాయి. ఇవి సరిపోవన్నట్లు జడ్జిమెంటల్‌ హై క్యా దర్శకుడు ప్రకాశ్‌ కోవెలమూడిని పెళ్లి చేసుకోనుందన్న ఊహాగానాలు వినిపించాయి. మధ్యలో ఓ వ్యాపారవేత్తతోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిందన్న వార్తలకూ కొదవ లేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు వినీవినీ అనుష్కకు విసుగెత్తిపోయారు. (నాకు మూడు నాలుగు సార్లు పెళ్లి చేశారు)

దీని గురించి ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తనకంటూ సొంత జీవితం ఉందని, అందులోకి కొందరు వేలుపెట్టే ప్రయత్నాలు నచ్చడం లేదన్నారు. తన ప్రేమ,పెళ్లి గురించి వదంతులు ప్రచారం చేసేవారందరికీ చెప్పేదేమిటంటే తానూ ఒక్కప్పుడు ప్రేమలో పడినట్లు తెలిపారు. 2008లో ఓ వ్యక్తిని ప్రేమించానని, అది తీయని ప్రేమ అని పేర్కొన్నారు. అయితే  ఆ ప్రేమ కొనసాగలేదని, కొన్ని అనివార్య పరిస్థితుల్లో విడిపోయామని చెప్పారు. తాను ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరన్నది చెప్పడం ఇష్టం లేదని అనుష్క తెలిపారు. అలాగే ప్రభాస్‌ తాను మంచి స్నేహితులమని అన్నారు. (అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క)

కాగా టాలీవుడ్‌లో ‘సూపర్‌’  చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అనుష్క తాజాగా ‘నిశ్శబ్దం’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రెండేళ్లు విరామం తరువాత ఆమె ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే షూటింగ్‌లలో గాయాల కారణంగా కొంత విరామం వచ్చినట్లు అనుష్క చెప్పారు. ఇక అనుష్క లీడ్‌ రోల్‌లో హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’.. క్రితి ప్రసాద్‌ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్‌ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదలవుతోంది. కాగా త్వరలో దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శతక్వంలో నటించడానికి రెడీ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. (పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అనుష్క)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement