హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా? | Sakshi
Sakshi News home page

Anushka Shetty: లేటు వయసులో అనుష్క శెట్టి పెళ్లికి రెడీ.. నిజమేంటి?

Published Sun, May 19 2024 7:28 AM

Anushka Shetty Marriage With Kannada Producer Latest

అందం, అభినయం.. ఇలా రెండింటిలోనూ కేక పుట్టించే టాలెంట్ ఉన్న బ్యూటీ అనుష్క శెట్టి. గతంలో ఆమె నటించిన సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. ప్రస్తుతం ఈమె చాలావరకు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన అనుష్క.. 40 ఏళ్లు దాటినా సరే ఇప్పటికే సింగిలే. ఈ క్రమంలో చాలాసార్లు పెళ్లి రూమర్స్ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఏకంగా ఓ నిర్మాతతో ఏడడుగులు వేయబోతుందని అంటున్నారు. ఇందులో నిజమెంత?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?)

'బాహుబలి'తో పాన్ ఇండియా రేంజులో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. ఈ మూవీ చేస్తున్న టైంలోనే 'సైజ్ జీరో'లో నటించింది. ఇందులో పాత్ర కోసం భారీగా బరువు పెరిగింది. ఆమె జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఇదే. సినిమా హిట్ అవ్వలేదు. అప్పటి నుంచి అనుష్క కూడా బరువు తగ్గట్లేదు. దీంతో చాలావరకు అవకాశాలు తగ్గిపోయాయి. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మలయాళం ఓ మూవీ చేస్తోంది.

హీరోయిన్లలో అనుష్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పొచ్చు. ఈమె వయసు ఇప్పుడు 42 ఏళ్లు. ఈమె-ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే చాలాసార్లు పుకార్లు వచ్చాయి. తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. టాలీవుడ్ దర్శకుడితోనూ పెళ్లంటూ గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ అది అబద్ధమని తేలింది. ఇప్పుడు అలా మరోసారి టాక్ మొదలైంది. అనుష్క త్వరలో పెళ్లికి రెడీ అయిందని, కన్నడ నిర్మాతతో ఏడడుగులు వేయనుందని అంటున్నారు. ఇది కూడా కేవలం ఓ రూమర్‌లానే అనిపిస్తుంది. కొన్నిరోజులాగితే నిజమేంటనేది తెలిసిపోతుంది.

(ఇదీ చదవండి: మళ్లీ ట్విట్టర్‌లోకి నాగబాబు.. వివాదాస్పద ట్వీట్‌ తొలగింపు)

Advertisement
 
Advertisement
 
Advertisement