అమెజాన్‌లో అనుష్క సినిమా.. | Anushka Nishabdham Movie Release On OTT Platforms | Sakshi
Sakshi News home page

చర్చలు జరిగాయి.. ప్రకటనే తరువాయి

Published Sat, May 16 2020 8:40 PM | Last Updated on Sat, May 16 2020 8:47 PM

Anushka Nishabdham Movie Release On OTT Platforms - Sakshi

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా చాలా సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. ఈ లాక్‌డౌన్‌ కాలంలో అన్ని భాషల్లో కలిపి దాదాపు వంద సినిమాలు రిలీజ్‌ కాకుండా ఆగిపోయాయి. దీంతో విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రాలను ఏం చేయాలో దర్శకనిర్మాతలకు పాలుపోవడం లేదు. ఈ క్రమంలో దర్శకనిర్మాతలకు కనిపిస్తున్న ఒకే ఒక్క దారి డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌. ఎంతో రేట్‌ మాట్లాడుకొని ఓటీటీ వేదికగా విడుదల చేయాలని ముఖ్యంగా నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే పాపులారిటీ తగ్గుతుందనే భయాన్ని  నటీనటులు వ్యక్తపరుస్తున్నా, థియేటర్ల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నా నిర్మాతలు మాత్రం డిజిటల్‌లోనే విడుదల చేయాలని ఫిక్సవుతున్నారు. 

ఇప్పటికే పలు చిత్రాలు డిజిటల్‌ బాట పట్టగా మరికొన్ని చిత్రాలు సంప్రదింపుల దశలో ఉన్నాయి. ఈ క్రమంలో స్వీటీ అనుష్క శెట్టి నటించిన ‘నిశ్శబ్దం’ అమెజాన్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు చిత్ర యూనిట్‌ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని ఆమెజాన్‌లో జూన్‌ నెలలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు బావిస్తున్నారని తెలుస్తోంది. కాగా, ఈ సినమాకు రికార్డు స్థాయిలో డిజిటల్‌ హక్కులను ఆమెజాన్‌ కొనగోలు చేసిందని టాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక రిలీజ్ విషయం అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించాల్సిన అవసరం ఉంది.హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కేఎఫ్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మించింది.

చదవండి:
మహేశ్‌ కాదనడంతో చరణ్‌తో..
‘ఇస్తా.. మొత్తం తిరిగి ఇచ్చేస్తా’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement