స్వీటీ అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన చిత్రంలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్‌డౌన్ కారణంగా థియేటర్లకు తాళం పడటంతో విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఈ సినిమా దర్శకనిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. (ఆ విషయంలో తగ్గేది లేదన్న స్వీటీ )
నిశ్శబ్దం సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు సినీ నిర్మాతలు రెడీ అయ్యారు. అంతేగాక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు(సెప్టెంబర్17) రానుంది. కాగా నిశ్శబ్దం మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. అయితే అక్టోబర్ 2న 'నిశ్శబ్దం'ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఓటీటీలో నేరుగా విడుదలవుతున్న తెలుగు సినిమాల్లో రెండో పెద్ద సినిమాగా గుర్తింపు పొందుతుంది. ఇప్పటికే నాని, సుధీర్‌బాబు నటించిన ‘వీ’ సినిమా విడుదలైంది. (అమెజాన్‌లో అనుష్క సినిమా..)
Comments
Please login to add a commentAdd a comment