
అనుష్క
సంక్రాంతి పండక్కి అందరూ సొంత ఊర్లకు ప్రయాణం అయ్యారు. పండగ రోజులు కుటుంబంతో గడపడానికి ప్లాన్ వేసుకున్నారు. అనుష్క కూడా సంక్రాంతిని కుటుంబంతో కలిసి చేసుకోబోతున్నారట. ఆమె నటించి తాజా సినిమా ‘నిశ్శబ్దం’ ఈనెల 31న రిలీజ్ కానుంది. హేమంత్ మధుకర్ దర్శకుడు. మాధవన్, అంజలీ, షాలినీ పాండే ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలు కాలేదు.
సంక్రాంతి సెలవుల్ని ఫ్యామిలీతో గడపడానికి బెంగళూరు వెళ్లారు అనుష్క. అమ్మానాన్న, ఇద్దరు అన్నయ్యలతో పొంగల్ చేసుకోబోతున్నారట. సినిమా షూటింగ్స్ లేదా ప్రమోషన్స్‌తో పండగలకు ఇంట్లో ఉండే వీలు చాలా తక్కువగా దొరుకుతుంది హీరోయిన్లకు. ఈ అవకాశాన్ని కుటుంబంతో కలిసి పూర్తిగా ఆస్వాదిస్తారని ఊహించవచ్చు. పండగ పూర్తయిన తర్వాత నుంచి ‘నిశ్శబ్దం’ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటారట అనుష్క. ఈ సినిమా తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో థ్రిల్లర్ చిత్రంలో నటించనున్నారామె.
Comments
Please login to add a commentAdd a comment