జనవరి 31న ‘నిశ్శబ్దం’గా.. | Nishabdham Movie Will Be Releasing On 31st January | Sakshi
Sakshi News home page

అనుష్క ‘నిశ్శబ్దం’ డేట్‌ ఫిక్స్‌

Published Mon, Dec 2 2019 2:19 PM | Last Updated on Mon, Dec 2 2019 4:51 PM

Nishabdham Movie Will Be Releasing On 31st January - Sakshi

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. కోన వెంకట్‌ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. అనుష్కతో పాటు మాధవన్‌, అంజలి, షాలినీ పాండే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా సినిమా విడుదల తేదిని చిత్ర బృందం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 31న ప్రపంచ వ్యాప్తంగా ‘నిశ్శబ్ధం’విడుదల కానుందని చిత్ర బృందం వెల్లడించింది. 

తెలుగులో ‘నిశ్శబ్దం’, మిగతా భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా కథ అమెరికాలోని సియోటల్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంది. ఇక ఇందులో అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భాగమతి చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో ‘నిశ్శబ్ధం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement