అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌ | Anushka Nishabdam Movie Poster Released | Sakshi
Sakshi News home page

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

Published Sat, Jul 20 2019 6:48 PM | Last Updated on Sat, Jul 20 2019 6:48 PM

Anushka Nishabdam Movie Poster Released - Sakshi

తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ మరియు  మ‌ల‌యాళం భాష‌ల్లో నిశ్శబ్దం అనే చిత్రాన్ని చేస్తున్నారు అనుష్క. భాగమతి చిత్రం తరువాత మరే చిత్రాన్ని ఒప్పుకోని అనుష్క చాలా కాలం తరువాత ఈ బహుభాషా చిత్రానికి ఓకే చెప్పారు. ఇప్పటికే షూటింగ్‌ను శరవేగంగా కంప్లీట్‌ చేస్తున్న చిత్రయూనిట్‌ తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

అనుష్క సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పద్నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ షూటింగ్‌ ఎక్కువ భాగం అమెరికాలో సియాటెల్‌లోజరగ్గా.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా అక్కడే జరగనున్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో చేతి సైగలతో ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ఈ చిత్రంలో అనుష్క మూగ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాధవన్‌ ప్రత్యేకపాత్రలో నటస్తున్న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హేమంత్‌ మధుకర్‌ తెరకెక్కిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement