అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. కోన వెంకట్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుష్కతో పాటు మాధవన్, అంజలి, షాలినీ పాండే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌కు మంచి టాక్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. అయితే ‘నిశ్శబ్దం’ ఫ్యాన్స్‌కు సైలెన్స్ సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్.
నిశ్శబ్దం తెలుగు ట్రైలర్‌ను మార్చి 6న మధ్యాహ్నాం 12:12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా చిత్ర ట్రైలర్‌ను తెలుగులో నేచురల్ స్టార్ నాని విడుదల చేస్తాడని తెలిపింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు చిత్ర విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమా కథ అమెరికాలోని సియోటల్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంది. ఇక ఇందులో అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటిస్తున్నారు.
చదవండి:
హ్యపీ బర్త్‌డే స్వీటెస్ట్ అమృత
సుకుమార్ అభినందనను మర్చిపోలేను
Comments
Please login to add a commentAdd a comment