Madhavan
-
మిరాకిల్ మేన్‌గా మాధవన్
ఆర్. మాధవన్(R. Madhavan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘జి.డి.ఎన్’ అనే టైటిల్ ఖరారైంది. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా, మిరాకిల్ మేన్, వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూరు’ వంటి పేర్లను గడించిన గోపాల స్వామి దొరైస్వామి నాయుడు(Gopala Swamy Doraiswamy Naidu) (జీడీఎన్) జీవితం ఆధారంగా ‘జి.డి.ఎన్’(GDN) మూవీ తెరకెక్కుతోంది. ఈ బయోపిక్కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా టైటిల్ లోగో రిలీజ్ చేసి, ప్రియమణి, జయరాం, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.ఇక పెద్దగా చదువుకోకపోయినా ఆటోమొబైల్, అగ్రికల్చర్, టెక్స్టైల్, ఫొటోగ్రఫీ వంటి సెక్టార్స్‌లో కొన్ని పరికరాల ఆవిష్కరణలు చేశారు జీడీఎన్. ఈ మధ్యకాలంలో మాధవన్ నటిస్తున్న రెండో బయోపిక్ ఇది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమా (2022)లో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేసి మెప్పించారు మాధవన్. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో బయోపిక్‌లో మాధవన్ నటిస్తుండటం విశేషం. మరి... వెండితెరపై మిరాకిల్ మేన్‌గా మాధవన్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి. -
ఖరీదైన బైక్ కొన్న మాధవన్.. భారత్‌లో మొదటి వ్యక్తిగా రికార్డ్
జాతీయ ఉత్తమ నటుడు ఆర్ మాధవన్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దాదాపుగా 7 భాషాల సినిమాల్లో నటించిన అతితక్కువ భారతీయ నటుల్లో ఆయన కూడా ఒకరు. ఆయనకు బైకులంటే చాలా ఇష్టం. ఆస్ట్రియన్ మోటార్ సైకిల్ రంగంలో బిగ్గెస్ట్ బ్రాండ్‌గా గర్తింపు ఉన్న బ్రిక్ట్సన్ క్రోమ్‌వెల్ 1200 సీసీ బైక్‌ను మాధవన్ కొనుగొలు చేశారు. రెట్రో డిజైన్‌తో పాటు ఆధునిక ఇంజనీరింగ్ వర్క్ స్టైల్‌తో ఉన్న ఈ బైక్‌ను కొనుగోలు చేసిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు.ఆస్ట్రియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బ్రిక్ట్సన్ అధికారికంగా భారతదేశంలో తన విక్రయాలను ప్రారంభించింది. నటుడు ఆర్. మాధవన్ తొలి బైక్ క్రోమ్‌వెల్ 1200 సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న వాహనాన్ని కొనుగోలు చేశారు. మోటోహాస్ భాగస్వామ్యంతో బ్రిక్ట్సన్ భారతదేశంలో అడుగు పెడుతోంది. బెంగళూరు, కోల్హాపూర్, గోవా, అహ్మదాబాద్, సంగ్లీ వంటి నగరాల్లో డీలర్‌షిప్‌లను ఇప్పటికే ఏర్పాటు చేసింది. జైపూర్, మైసూర్, కోల్‌కతా, పూణే, ముంబైలలో షోరూమ్‌లు రానున్నాయి. ఈ బైక్ కంపెనీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించనున్నారు. కొత్త బైక్‌పై తన కుమారుడు వేదాంత్ పేరును చేర్చాడు.ఇండియన్ మార్కెట్లో ఈ బైక్ ధర రూ. 7.84 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. హై-పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిల్ విభాగంలో ఇది ఒక ఆకర్షణీయమైన ఎంపిక అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బ్రిక్ట్సన్ క్రోమ్‌వెల్ 1200 సీసీ ఇంజన్‌తో కలిగి ఉండి 108Nm టార్క్‌తో పనిచేస్తుంది. నిస్సిన్ బ్రేక్‌లు, బాష్ ABS, KYB అడ్జస్టబుల్ సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, యాంటీ-థెఫ్ట్ కీ సిస్టమ్, TFT డిస్ప్లే, పిరెల్లి ఫాంటమ్ ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ప్రీమియం ఫీచర్లతో బైక్ ఉంది. -
లెక్క సరిచేశాడు
ఓటీటీ(ott)లో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం హిసాబ్ బరాబర్(hisaab barabar) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ ప్రపంచంలో ఆశ లేని మనిషి ఉండడు. కానీ అత్యాశ మాత్రం అనర్ధదాయకం. అందరూ బాగుండాలి... అందులో మనముండాలి అనుకుంటే పర్లేదు. కొంతమంది మాత్రం నేను బాగు పడాలంటే పదిమంది నాశనం కావాలి అని అత్యాశకు లోనవుతుంటారు. అటువంటి వారు తమకు ఎవరూ ఎదురు రారు అనుకుంటూ విర్రవీగుతుంటారు. అలా విర్రవీగేవారికి ఓ సామాన్యడు ఇచ్చే అనుకోని ఝలక్కే ఈ ‘హిసాబ్ బరాబర్’ చిత్రం. జీ5 ఓటీటీ వేదికగా తెలుగులోనూ లభ్యమవుతోంది. ‘హిసాబ్ బరాబర్’ కథ విషయానికొస్తే... ఇది ఓ సామాన్యుడి కథ. రాధేమోహన్ శర్మ ఓ టికెట్ కలెక్టర్. అతనికి ఒక్కడే కొడుకు. భార్య విడిపోతుంది. ఇక రాధేమోహన్ కు అద్భుతమైన టాలెంట్ ఒకటుంది. అదే అతని లెక్కల చాతుర్యత.ఎటువంటి లెక్కనైనా అవలీలగా చెప్పేస్తాడు. చిన్న పైసా కూడా నష్టపోడు. అటువంటి రాధేమోహన్ బ్యాంకు అకౌంటులో అనూహ్యంగా ఓ 27 రూపాయలు తేడా వచ్చి కనపడకుండా పోతుంది. దాంతో బ్యాంకు అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేస్తాడు. బ్యాంకు అధికారులు ఈ ఫిర్యాదును తాత్సారం చేస్తున్న విషయం గమనించి అదే బ్యాంకుకు సంబంధించిన ఇతరుల అకౌంట్లో కూడా 27 రూపాయలు కట్ అయినట్టు కనిపెడతాడు. రాధేమోహన్ కథ 27 నుండి మొదలై కొన్ని వేల కోట్ల దాకా వెళుతుంది. దీంతో ఇదో పెద్ద స్కామ్ అని నిర్ధారణకు వచ్చి పై అధికారులకు సమాచారమిస్తాడు. ఈ విషయం సదరు బ్యాంకు అధికారుల నుండి ఆ బ్యాంకు ఓనరుకు తెలుస్తుంది. ఇక ఆ పై బ్యాంకు ఓనరుకు రాధేమోహన్కు మధ్య యుద్ధం మొదలవుతుంది.కోట్లకు అధిపతి అయిన బ్యాంకు ఓనరును 27 రూపాయలు పోగొట్టుకున్న రాధేమోహన్ ఎలా ఎదుర్కొన్నాడనేది సినిమాలోనే చూడాలి. రూపాయి అయినా కోటి రూపాయలైనా దేని విలువ దానిదే, కాగితంలో నంబరు విలువను పెంచుతుందే కానీ కాగితమైతే మారదు. పైన చెప్పుకున్నట్టు ఎవరి కష్టం వారిది, ఎవరి ఫలితం వారిది. ఈ రోజు వరించిన విజయానికి ఆనందిస్తే రేపు అపజయాన్ని కూడా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ‘హిసాబ్ బరాబర్’ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ మంచి సందేశంతో ముగుస్తుంది. రాధేమోహన్పాత్రలో ప్రముఖ నటుడు మాధవన్ జీవించారు. సినిమాలో తన లెక్కే కాదు అందరి లెక్క సరిచేశాడు. వీకెండ్‌కి వాచబుల్ మూవీ. – ఇంటూరు హరికృష్ణ -
24 ఏళ్ల తర్వాత కలిసిన హీరోహీరోయిన్
రొమాంటిక్ సినిమాల్లో 'సఖి' క్రేజ్ వేరే లెవల్. పేరుకే డబ్బింగ్ సినిమా గానీ తెలుగులోనూ కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా ఇందులో హీరోహీరోయిన్లుగా చేసిన మాధవన్, షాలినీకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది దాదాపు 24 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిశారు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)సందర్భంగా ఏంటో తెలీదు గానీ మాధవన్‌ని చాన్నాళ్ల తర్వాత కలిసి షాలినీ.. రెండు ఫొటోలు పోస్ట్ చేసింది. దీనికి 'ఎండ్రెండుం పున్నాగై' అని క్యాప్షన్ పెట్టింది. 'ఎప్పటికీ నవ్వడం' అని తెలుగులో దీనికి అర్థం. తమ అభిమాన జోడీని దాదాపు 24 ఏళ్ల తర్వాత చూసిన ఫ్యాన్స్.. సంతోషాన్ని ఆపుకోలేకపోతున్నారు. కామెంట్స్ పెడుతూ తమ ప్రేమని చూపిస్తున్నారు.ఇక మాధవన్ సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉండగా.. షాలినీ తమిళ హీరో అజిత్ ని 2000లో పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది.(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు) View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022) -
హీరో మాధవన్ ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్ తెలిస్తే..నోరెళ్లబెడతారు!
సినీ నటులకు గ్లామర్ ఎంతో ముఖ్యమో తెలిసిందే. అందుకోసం ఫుడ్ దగ్గర నుంచి ఫిట్నెస్ వరకు ప్రతి విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటారు. కొందరూ ప్రత్యేకంగా డైటిషన్లు, ఫిటెనెస్ శిక్షకుల సలహాలు, సూచనలు పాటిస్తారు. వాళ్ల లైఫ్‌స్టైలే చాలా డిఫెరెంట్‌గా ఉంటుంది. ఇక వాళ్లు మనలా ఇడ్లీ, దోసలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ల జోలికిపోరు వెజ్ సలాడ్ లేదా ఫ్రూట్ సలాడ్స్, స్మూతీ వంటి వాటిని తీసుకుంటుంటారు. కానీ ఈ కోలీవడ్ నటుడు మాధవన్ మాత్ర మన పూర్వీకుల నాటి బ్రేక్‌ఫాస్ట్‌ని ఇష్టంగా తింటాడట. అదేంటంటే..కేరళ రాష్ట్రమంతటా ఇష్టంగా ఆస్వాదించే 'పజంకంజి'నే మాదవ్ ఎంతో ఇష్టంగా తింటారటా. ఇదే తన అల్పాహారమని ఆయన చెబుతున్నారు. పజమ్కంజి అంటే మన పూర్వీకుల నాటి బ్రేక్‌ఫాస్ట్‌గా చెప్పొచ్చు. వాళ్లు పొద్దుపొద్దనే తినే రాత్రి భోజనం. తెలుగు నాట దీన్ని చద్దిన్నం అని పిలుస్తారు. కేరళలో దీన్ని 'పజంకంజి' అని పిలుస్తారు. దీన్ని ఎలా తయారు చేస్తారంటే..రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజి నీటిలో పులియబెట్టి పొద్దునే కొద్దిగా పెరుగు, తగినన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుని తింటారు. ఇక్కడ మనం అన్నం వండగా వేరు చేసేదాన్ని గంజి అని అంటాం. దీన్నే కేరళలో కంజి అని పిలుస్తారు. ఇది శరీరానికి చలువ చేస్తుంది. చెప్పాలంటే సమ్మర్లో బెస్ట్ బ్రేక్ఫాస్ట ఇదే. ఆరోగ్య ప్రయోజనాలు..శరీరానికి తక్షణ శక్తిన అందిస్తుంది. ఇందులో 340 కేలరీలు ఉన్నాయి.విటమిన్ బీ వంటి ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి. నీరసం నుంచి త్వరితగతిన కోలుకోవడానకి ఉపయోగపడుతుంది. అలసట, జీర్ణ సమస్యలకు సహాయపడుతుంది. చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ పులియబెట్టిన గంజి అన్నాన్ని కేరళలో ఒకప్పుడూ చాలామంది ఇష్టంగా తినే వంటకంగా పేరుగాంచింది. రాను రాను దీనికి ఆదరణ కోల్పోయింది. అలాంటి పూర్వకాలం నాటి వంటకాన్ని నటుడు మాధవన్ ఇష్టంగా తింటానని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేగాదు ఇటీవల దీనిలో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించి పలు రెస్టారెంట్లు తమ మెనూలో దీన్ని కూడా చేర్చి సర్వ్ చేయడం ప్రారంభించాయి. (చదవండి: రష్యన్ మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ మృతి..మరో రైడింగ్ గ్రూప్..!) -
జిమ్ లేదు..సర్జరీ లేదు.. అలా 21 రోజుల్లోనే బరువు తగ్గాను: మాధవన్
‘‘వ్యాయామం చేయలేదు. రన్నింగ్ చేయలేదు. సర్జరీ అసలే లేదు. మెడికేషన్ పాటించలేదు... కానీ 21 రోజుల్లోనే పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాను. బాగా బరువు తగ్గిపోయాను’’... ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాలో తన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ గురించి మాధవన్ చెప్పిన మాటలు ఇవి. ఈ ఆసక్తికరమైన విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాధవన్ వెల్లడించగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాధవన్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన బయోగ్రాఫికల్ డ్రామా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా మాధవన్ ఈ సినిమాను తెరకెక్కించి, టైటిల్ రోల్ చేశారు. ఈ చిత్రంలో మాధవన్ వివిధ వయస్సుల్లో కనిపిస్తారు. కొన్ని సన్నివేశాల్లో బాగా బరువు పెరిగి, పొట్ట ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. ఈ లుక్ నుంచి మాధవన్ మళ్లీ తన సాధారణ లుక్కు మారేందుకు కేవలం 21 రోజులు మాత్రమే పట్టిందట. ఆ మార్పు గురించి మాధవన్ మాట్లాడుతూ– ‘‘నేనొక డాక్టర్లా మాట్లాడుతున్నానని అనుకోవచ్చు. నా శరీరానికి ఏది మంచి ఆహారమని భావించానో దాన్నే తిన్నాను. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’కి దర్శకత్వం వహిస్తున్నప్పుడు కాస్త పొట్టతో కనిపించేవాడిని. ఆ తర్వాత 21 రోజులకు నార్మల్‌గా మారిపోయాను. ఇదంతా నేను తీసుకున్న ఆహారం వల్లే జరిగిందని అనుకుంటున్నాను. చెప్పాలంటే నా జీవితంలోనే సైన్స్ ఓ భాగమైపోయిందని అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా ‘ఎక్స్’ వేదికగా ఈ విషయంపై మాధవన్ స్పందిస్తూ– ‘‘అప్పుడప్పుడూ ఉపవాసం ఉన్నాను. ఆహారాన్ని 45 నుంచి 60 సార్లు బాగా నమిలాను (మీ ఆహారాన్ని తాగండి... నీటిని నమలండి). సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకే రోజులోని నా చివరి భోజనం పూర్తయ్యేది. జ్యూస్‌లు ఎక్కువగా తాగాను. ఆకుపచ్చ కూరగాయలు తిన్నాను. ఉదయాన్నే సుదీర్ఘంగా నడిచేవాడ్ని. నిద్రపోవడానికి 90 నిమిషాల ముందు ఏ స్క్రీనూ చూడలేదు. రాత్రివేళ గాఢంగా నిద్రపోతాను. నా శరీరానికి, నా ఆరోగ్యానికి, నా జీవన శైలికి, జీవక్రియకు తగ్గట్లుగా ఆహారాన్ని తీసుకున్నాను. దాంతో క్రమ క్రమంగా మార్పు వచ్చింది’’ అన్నారు. No exercise, No running... 😏21 நாட்களில் மாதவன் உடல் மாற்றம், அது எப்படி சாத்தியம்? 🤔 pic.twitter.com/ssrATrqOnr— Aadhavan (@aadaavaan) July 17, 2024 -
ఓటీటీకి రూ.200 కోట్ల హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
అజయ్ దేవ్‌గణ్, తమిళ స్టార్లు జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైతాన్. ఇటీవల థియేటర్లలో రీలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మార్చి 8న విడుదలై ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో సైతాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్కు రానుందని టాక్ నడుస్తోంది. కాగా.. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మే 3వ తేదీ నుంచి సైతాన్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్ అయితే థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. వర్ష్ అనే గుజరాతీ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని వికాస్ బహ్ల్, జ్యోతి దేశ్‌పాండే, అజయ్ దేవ్‌గణ్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో జానకీ బోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించగా.. అమిత్ త్రివేదీ సంగీతం అందించారు. -
యంగ్ హీరోలకు ధీటుగా మాధవన్.. ఫిట్నెస్ రహస్యం ఇదే!
కోలీవుడ్ నటుడు రంగనాథ్ మాదవన్ తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించి, విమర్శకుల ప్రశంసలందకున్నారు. మాధవన్ తన అభినయ నటనకుగానూ రెండు ఫిలింఫేర్ పురస్కరాలు అందుకున్నాడు. దాదాపు ఏడు భాషల్లో నటించారు. ఆయన రచయిత కూడా. మాధవన్ సినీ ప్రయాణం టీవీ సీరియల్ నుంచి మొదలై అలా 2000లో వచ్చిన 'అలై పాయుదే; అదే తెలుగులో 'చెలి'(2001) మూవీ నుంచి వెనుతిరిగి చూడకుండా విజయపథంలోకి దూసుకుపోయారు. ఐదు పదుల వయసుకు చేరువైన మాధవన్ ఇప్పటికీ యువ హీరోలకు ధీటుగా మంచి స్మార్ట్ లుక్‌లో కనిపిస్తారు. అంతలా గ్లామరస్‌గా కనిపించడానికి మాధవన్ ఫాలో అయ్యే డైట్, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా! వర్కౌట్లు.. మాదవన్ ఫిట్నెస్కి పెట్టింది పేరు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాడు. చక్కటి బాడీ మెయింటెయిన్ చేసేందుకు కఠిన వర్కౌట్లు డైలీ లైఫ్‌లో భాగం. దాదాపు 30 నిమిషాల పాటు కార్డియో సెషన్ ప్రారంభిస్తాడు. ముఖ్యంగా రన్నింగ్, సైక్లింగ్, ఎలిప్టికల్ మెషీన్ వంటివి ఉంటాయి. ఆయన స్క్వాట్లు, డెడ్‌లిఫ్ట్‌లు, పుల్ అప్స్లు తప్పనిసరిగా చేస్తాడు. అవి అతని హృదయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అంతేగాదు ప్రతి వ్యాయామాన్ని కనీసం మూడు నుంచి నాలుగు సెట్ల వారీగా ప్రతిసెట్లో కనీసం ఎనిమిది నుంచి 12 కసరత్తుల చొప్పున చేస్తారు. అలాగే ఒత్తడిని దూరం చేసుకునేలా ధ్యానం వంటివి చేస్తారు సముతుల్య ఆహారం, పోషకాలతో కూడిన ఆహారాలను డైట్లో ఉండేలా చూసకుంటారు. కానీ తినాలనుకున్నది మాత్రం కడుపు నిండుగా తింటాని చెబుతున్నాడు మాధవన్. అయితే అందుకు తగ్గట్టుగానే కసరత్తులు కూడా చేస్తానని అంటున్నాడు. డైట్.. చికెన్, చేపలు, కాయధాన్యాలు, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటారు. శక్తినిచ్చేలా బ్రౌన్ రైస్, క్వినోవా, చిలగడదుంప, తదితరాలను తీసుకుంటారు. అలాగే ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయాలు ఉండేలా చూసుకుంటారు. పైగా శరీరానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అందేలా జాగ్రత్త పడతారు. తన వ్యక్తిగత ఫిట్నెస్ నిపుణుడు సాయంతోనే మంచి డైట్ ఫాలో అవుతారు మాధవన్. (చదవండి: కట్టెల పొయ్యి, బొగ్గుల మీద చేసిన వంటకాలు తినకూడదా?) -
స్టార్ హీరో పక్కన సినిమా ఛాన్స్.. నో చెప్పిన 'సూర్య' చెల్లెలు
మాధవన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో 'అమృత' సినిమా తెలుగులో వచ్చింది. తమిళ టైగర్స్ నేపథ్యంలో తెరకెక్కిన 'అమృత' సినిమా ఒక మాస్టర్ పీస్‌లా నిలిచిపోయింది. తమిళ్లో మొదట 'కన్నతిల్ ముత్తమిట్టల్' అనే పేరుతో విడుదలైంది. ఈ సినిమాకు ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు , మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ , ఏడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు, ఆరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఉత్తమ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది . ఈ అవార్డ్స్ చాలు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి. ఇలాంటి సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్‌ను బృందా శివకుమార్ మిస్ చేసుకుంది. కోలీవుడ్ టాప్ హీరోలు అయిన సూర్య, కార్తీలకు ఆమె ముద్దుల చెల్లెలు అనే విషయం తెలిసిందే. మాధవన్ సరసన సిమ్రాన్ అదిరిపోయే నటనతో మెప్పించిన సిమ్రాన్ స్థానంలో బృందా ఉండాల్సింది. డైరెక్టర్ మణిరత్నం కూడా బృందా అయితే సరిగ్గా కథకు సెట్ అవుతుందని అనుకున్నారట.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సూర్య, కార్తీ ఇద్దరూ కోలీవుడ్ సినిమాల్లో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కార్తీ.. నేడు పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్నాడు. మొదట్లో తనకు నటించడం తెలియదనే విమర్శలను ఎదుర్కొన్న సూర్య నేడు కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. కానీ ఒక్కగానొక్క సోదరి మాత్రం సినీరంగంలో గాయనిగా అరంగేట్రం చేసి పలు చిత్రాల్లో పాటలు కూడా పాడింది. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అదే విధంగా, బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర తమిళ వెర్షన్లో అలియా భట్‌కి బృందా డబ్బింగ్ కూడా చెప్పింది. ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఉన్న బృందా శివకుమార్‌కి హీరోయిన్గా అవకాశం వచ్చినా ఆమె తిరస్కరించింది. అందుకు తగ్గట్టుగానే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'కన్నతిల్ ముత్తమిదళ్' (అమృత) చిత్రంలో మాధవన్ సరసన నటించేందుకు బృందాని మొదట సంప్రదించారు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సుధా కొంగర ద్వారా బృందాతో సంప్రదింపులు జరిపారు. కానీ తనకు నటనపై ఆసక్తి లేదని బృందా రిజెక్ట్ చేయడంతో సిమ్రాన్‌ను ఆ పాత్రలో తీసుకున్నారు. మణిరత్నం తెరకెక్కించిన 'కన్నతిల్ ముత్తమిట్టల్' చిత్రంలో నటించే అవకాశాన్ని సూర్య చెల్లెలు తిరస్కరించిందనే వార్త అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. -
ఆ టాలెంట్ మళ్లీ చూపిస్తున్న స్టార్ హీరో
మాధవన్ నిజంగా అదృష్టవంతుడే. బహుభాషా నటుడు, దర్శకుడు, నిర్మాత. తాజాగా కథకుడిగానూ మారారు. రన్, ఆలైపాయుదే, ఆయుధ మిన్నలే, ఎళుత్తు, యావరుమ్ నలమ్ ఇలా పలు హిట్ చిత్రాల్లో నటించిన ఈయన.. హిందీ, ఇంగ్లీష్ చిత్రాలలోనూ నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. ఇటీవల 'రాకెట్రీ' మూవీతో దర్శకుడిగాను సక్సెస్ అయ్యారు. తమిళ, హిందీ భాషల్లో తీసిన ఈ చిత్రానికి కథకుడు, నిర్మాత, హీరో ఇతడే కావడం విశేషం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) మాధవన్ ప్రస్తుతం తమిళంలో 'టెస్ట్' చిత్రం చేస్తున్నాడు. మరో మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇంతకు ముందు ధనుష్ హీరోగా 'తిరు' అనే సూపర్‌హిట్ తీసిన మిత్రన్ జవహర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి హీరో మాధవన్ కథ అందించడం విశేషం. కాగా ఈ చిత్రానికి 'అదృష్టశాలి' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో కన్నడ బ్యూటీ షర్మిళ మంద్రే నైతిక హీరోయిన్. రాధిక శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుగుతోంది. (ఇదీ చదవండి: హనీమూన్‌కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) -
వరుస ఫ్లాపులు.. ‘తగ్గేదేలే’ అంటున్న హీరోయిన్!
కొందరు హీరోలు మాత్రమే ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పాపులారిటీ పొందుతుంటారు. ఇక అలాంటి హీరోయిన్లు కొందరు ఉన్నారు. ఇందులో బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్ ఒకరు. ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆమె తరచూ వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటుంది. హిందీ, తెలుగు, తమిళం ఇలా బహుభాషా నటిగా రాణిస్తున్న కంగనా రనౌత్‌లో ఒక నిర్మాత, దర్శకురాలు ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈమె మంచి విజయాన్ని అందుకుని చాలా కాలమే అయ్యింది. ఇటీవల అన్ని అపజయాలను ఎదుర్కొన్నారు. హిందీలో తాజాగా నటించిన తేజాస్ చిత్రం ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆ మధ్య తమిళం, హిందీ భాషల్లో నటించిన భారీ చిత్రం తలైవి పూర్తిగా నిరాశపరిచింది. ఇటీవల కంగనా రనౌత్ టైటిల్ పాత్రను పోషించిన చంద్రముఖి–2 చిత్రం ప్లాప్ అయ్యింది. అయినా ఈమెకు అవకాశాలు వస్తునే ఉన్నాయి. తాజాగా మరో తమిళ చిత్రంలో నటించే అవకాశం కంగనా రనౌత్‌ను వరించింది. ఇందులో నటుడు మాధవన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. హిందీ చిత్రం తను వెడ్స్ మను తరువాత ఈ జంట నటిస్తున్న చిత్రం ఇది. కాగా ఇంతకు ముందు కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన తలైవి చిత్ర దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. హిందీలో కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ నటిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ రెండు చిత్రాల రిజల్ట్ కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ చిత్రం విజయం కంగనా రనౌత్‌కు చాలా ముఖ్యం. -
ఆదాయపు పన్ను శాఖ పనితీరుపై స్పందించిన నటుడు మాధవన్
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుచేసిన మూడు వారాల్లోనే తనకు నగదు రీఫండ్ అయిందని నటుడు మాధవన్ అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఆదాయపు పన్ను శాఖ పనితీరును ప్రశంసించారు. మాధవన్‌కు చెందిన ల్యూకోస్ ఫిల్మ్స్ కంపెనీ ఇటీవల ఆదాయపు పన్ను రిటర్న్న్ దాఖలు చేసింది. ఎలాంటి చిక్కులు లేకుండా మూడు వారాల్లోనే ఆదాయపు పన్ను శాఖ నుంచి రీఫండ్ పొందడంతో ఆయన స్పందించారు. అక్టోబర్ 31 వరకు రికార్డు స్థాయిలో 7.85 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన మొత్తం 7.78 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే ఇదే ఆల్ టైమ్ హై అని ఐటీ శాఖ చెప్పింది. The income tax refund for our company was received within 3 weeks after filing of return for AY 2023-24. The speed and promptness is simply unheard of ..The efficiency and transparency of the income tax department is unbelievable. Totally impressed and flabbergasted .… — Ranganathan Madhavan (@ActorMadhavan) November 13, 2023 -
ప్రభాస్,రష్మిక,నాగ్ ఏం చదివారు.. ఏ కాలేజీనో తెలిస్తే ఆశ్చర్యపోతారు
దక్షిణ భారత చలనచిత్రంలో చాలా మంది నటీనటులు అద్భుతమైన నటనతో మిలియన్ల కొద్ది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు. సౌత్ ఇండియాలో ప్రతిభావంతులైన నటులకు కొదువ లేదు.. ఒక రకంగా నటీనటుల ఆయుధాగారం అని కూడా చెప్పవచ్చు. వారి నటనా నైపుణ్యాలతో ఇండస్ట్రీలో ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, ఈ నటీనటుల విద్యాపరమైన విషయాలు చాలా మందికి అంతగా తెలియదు. దక్షిణ భారతదేశంలోని కొంతమంది పాపులర్ యాక్టర్స్ విద్యాపరమైన విజయాలను మీరూ తెలుసుకోండి. సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది అందాల భామ సాయిపల్లవి. ఈ సినిమాతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది సాయిపల్లవి. ఆమె సహజమైన నటనా శైలికి అనేక రకాల భావోద్వేగాలను చిత్రీకరించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఆమె జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ కళాశాల (TBILISI State Medical University) నుంచి MBBS లో పట్టా పొందారు. వైద్యవిద్య పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించమని అడిగాడు. అలా ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రభాస్ సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా రేంజ్‌ను దాటి హాలీవుడ్‌పై కన్నేసిన స్టార్ హీరో ప్రభాస్. మొదట బాహుబలితో తన రేంజ్ ఏంటో భారతీయ సినిమాకు పరిచయం చేశాడు ప్రభాస్. కల్కి చిత్రంతో హాలీవుడ్లో కూడా పాగా వేయాలనే ప్లాన్‌లో ఆయన ఉన్నారు. ప్రభాస్ తన ప్రాథమిక విద్యను డి.ఎన్.ఆర్ స్కూల్ భీమవరంలో పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో టెక్నాలజీ (బీటెక్)లో బ్యాచిలర్ డిగ్రీని పొందారని మీకు తెలుసా..? గోపిచంద్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ ప్రభాస్‌కు మంచి స్నేహితులు రకుల్ ప్రీత్ సింగ్ మనలో చాలా మందికి గణితం ఎప్పుడూ భయంకరమైన సబ్జెక్ట్ అనే అభిప్రాయం ఉంటుంది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేసింది. ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది. ఆమె జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా సాదించింది. రష్మికా మందన్న నేషనల్ క్రష్ రష్మికా మందన్న సౌత్ ఇండియాలో మొదటి గుర్తింపు వచ్చినా పుష్ప సినిమాతో బాలీవుడ్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. రష్మిక కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో జన్మించింది. ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. తర్వాత బెంగళూరులోని M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. అలా ట్రిపుల్ గ్రాడ్యుయేట్ సాదించింది. నాగార్జున అక్కినేని భారతీయ సినిమాకు నటుడు, నిర్మాత నాగార్జున అక్కినేని అందించిన సహకారం అసాధారణమైనది. ఆయన ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్నాడు. ఆయన విద్యా ప్రయాణం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. USAలోని మిచిగాన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (M.S.) పూర్తి చేశాడు కార్తీ తమిళ స్టార్ నటుడు కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో సూర్య తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు. అతను చెన్నైలోని క్రెసెంట్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. USAలోని న్యూయార్క్‌లోని బింగ్హామ్టన్ విశ్వవిద్యాలయం నుంచి పారిశ్రామిక ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. విక్రమ్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో విభిన్నమైన నటుడిగా చియాన్ విక్రమ్‌కు గుర్తింపు ఉంది. తన సహజమైన నటనా శైలికి ప్రేక్షకులు ఫిదా అవుతారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాలలో ఆయన నటించారు. చియాన్ ఇంగ్లీష్ లిటరేచర్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాడు. తర్వాత చెన్నైలోని లయోలా కాలేజీ నుంచి MBA పట్టా పొందాడు. మాధవన్ రంగనాథన్ మాధవన్ ప్రముఖ భారతీయ నటుడే కాదు ఒక రచయిత, సినీ నిర్మాత కూడా. ఆయన రెండు ఫిలింఫేర్ పురస్కారాలు, ఒక తమిళనాడు రాష్ట్ర ఫిలిం పురస్కారం అందుకున్నారు. దాదాపుగా 7 భాషా సినిమాల్లో నటించిన అతితక్కువ భారతీయ నటుల్లో నటుల్లో ఆయన ఒకరు. బీహార్‌లో తమిళ కుటుంబంలో ఆయన జన్మించారు. , కొల్హాపూర్‌లోని రాజారాం కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. తర్వాత ముంబైలోని కిషిన్‌చంద్ చెల్లారం కళాశాల నుంచి పబ్లిక్ స్పీకింగ్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా పొందాడు ఆయన ఒక వక్త కూడా. -
ముంబయికి షిఫ్ట్ అయిన ఫ్యామిలీ.. సూర్య ఏమన్నారంటే!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లోనూ సూర్య సినిమాలకు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం కంగువా చిత్రంలో నటిస్తోన్న సూర్య కొన్ని నెలలుగా ముంబయిలో ఉంటున్న సంగతి తెలిసిందే. తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి ముంబయిలో ఉంటున్నారు. సూర్యకి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గతంలో చెన్నై వదిలిపెట్టి.. పూర్తిగా ముంబయికి షిఫ్ట్ అయ్యారని పలుసార్లు కథనాలొచ్చాయి. కానీ వీటిపై ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. అయితే తాజాగా ముంబయిలో ఓ ఫ్యాన్స్ మీట్‌కు హాజరైన సూర్య ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడో తెలుసుకుందాం. (ఇది చదవండి: మెహర్ రమేశ్.. కమెడియన్‌గా నటించాడని మీకు తెలుసా?) అభిమానుల మీట్లో సూర్య మాట్లాడుతూ..' తాను ముంబైలో ఉండడం లేదని అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. తన కూతురు, కొడుకు చదువు కోసమే ఇక్కడ ఉంటున్నాం. తాను ఇప్పటికీ తమిళనాడులోనే ఉంటున్నానని నటుడు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి జీవితంలో కొత్తది నేర్చుకోవాలనే తపనతో ఉన్నానని వెల్లడించారు. అందుకే తన సహచరుడు మాధవన్‌తో కలిసి గోల్ఫ్ ఆడుతున్నాట్లు తెలిపారు. కాగా.. మాధవన్, సూర్య మంచి స్నేహితులు. కాగా.. జ్యోతికను 2006లో సూర్య వివాహం చేసుకున్నారు. కాగా.. ఇటీవలే కమల్ హాసన్ విక్రమ్‌లోని రోలెక్స్ క్యారెక్టర్ ఆధారంగా ఒక సినిమా కోసం లోకేష్ కనగరాజ్ తనను సంప్రదించారని సూర్య పేర్కొన్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రేజీ రోల్ చిత్రంపై క్లారిటీ!) -
మరో శాస్త్రవేత్త బయోపిక్‌లో మాధవన్
తమిళసినిమా: వైవిధ్య భరిత కథా పాత్రపై ఆసక్తి చూపే నటుడు మాధవన్. మొదట్లో లవర్‌బాయ్‌గా అలరించిన ఈయన ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనూ తన సత్తా చాటుకుంటున్నారు. అలా ఇటీవలే ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త నంబినారాయణన్ జీవిత చరిత్రను రాకెట్రీ నంబి ఎఫెక్ట్ పేరుతో స్వీయ దర్శకత్వంలో నిర్మించి టైటిల్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా మరో తమిళ ప్రముఖ శాస్త్రవేత్త జీడీ నాయుడు బయోపిక్‌లో నటించడానికి సిద్ధం అవుతున్నారన్నారు. ఈ చిత్రాన్ని మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. అందులోభాగంగా జీడీ నాయుడు పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేవా సంఘాలతో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా నటుడు మాధవన్ ప్రస్తుతం యారడీ నీ మోహిని, తిరుచిట్రంఫలం చిత్రాల ఫేమ్ మిత్రన్ ఆర్. జవహర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఆయన జీడీ నాయుడు బయోపిక్‌లో నటించడానికి సిద్ధమవుతారని సమాచారం. -
కొత్త కబురు
హీరో మాధవన్ కొత్త కబురు చెప్పా రు. తన తర్వాతి సినిమా డైరెక్టర్ మిత్రన్‌తో చేయనున్నట్లు పేర్కొన్నారాయన. తమిళ చిత్ర పరిశ్రమలో గత ఏడాది హిట్ కొట్టిన చిత్రాల్లో ‘తిరుచిత్రంబలం’ (తెలుగులో ‘తిరు’) ఒకటి. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా హిట్ కావడంతో మిత్రన్‌కి మరో మంచి అవకాశం లభించింది. మాధవన్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘‘దర్శకుడు మిత్రన్‌తో సినిమా చేయడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు మాధవన్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. -
రాకెట్రీ సినిమా కోసం హీరో మాధవన్ ఇల్లు అమ్మేశాడా?
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాకెట్రీ:ది నంబి ఎఫెక్ట్. హీరో ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ సినిమా అందరికీ చేరువవ్వాలని ఎంతగానో తాపత్రయపడ్డాడు మ్యాడీ. అనుకున్నట్లే అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో విజయవంతంగా దూసుకుపోయి చిత్రయూనిట్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. అయితే మాధవన్ రాకెట్రీ సినిమా బడ్జెట్ కోసం నిధులు సేకరించే క్రమంలో తన ఇంటినే అమ్మేశాడంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. నిజానికి రాకెట్రీ సినిమాకు తొలుత మాధవన్ దర్శకుడు కాదని, ఓ ప్రముఖ డైరెక్టర్ ఈ సినిమాను చేయాల్సి ఉండగా అప్పటికే చేతిలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో రాకెట్రీ నుంచి తప్పుకున్నాడని, దీంతో మ్యాడీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడరి సదరు కథనం పేర్కొంది. మరోవైపు అతడి కొడుకు వేదాంత్ స్విమ్మింగ్‌లో దేశం తరపున పాల్గొని బంగారు పతకాలు సాధించాడంటూ మ్యాడీ కుటుంబాన్ని కీర్తించింది. తాజాగా దీనిపై హీరో మాధవన్ స్పందించాడు.. 'ఓరి దేవుడా.. నేనేదో గొప్ప త్యాగం చేశానని మీరు నన్ను ఆకాశానికి ఎత్తేయొద్దు. ఎందుకంటే నేను నా ఇల్లే కాదు, దేన్నీ కోల్పోలేదు. దేవుడి దయ వల్ల రాకెట్రీ సినిమాలో పాలుపంచుకున్న అందరూ ఈ ఏడాది ఎక్కువ ఆదాయపన్ను చెల్లించనున్నారు. అంత గొప్పగా, గర్వించదగ్గ లాభాలు వచ్చాయి. నేను ఇప్పటికీ నా ఇంటిని ప్రేమిస్తున్నాను, అదే ఇంట్లో నివసిస్తున్నాను కూడా!' అని ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాడు మ్యాడీ. Oh Yaar. Pls don’t over patronize my sacrifice. I did not lose my house or anything. In fact all involved in Rocketry will be very proudly paying heavy Income Tax this year. Gods grace 😃😃🙏🙏🇮🇳🇮🇳🇮🇳We all made very good and proud profits. I still love and live in my house .🚀❤️ https://t.co/5L0h4iBert — Ranganathan Madhavan (@ActorMadhavan) August 17, 2022 చదవండి: రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఈ రెండు చిత్రాలకు సీక్వెల్ తీసే ధ్యైర్యం చేస్తారా? -
రజనీకాంత్ కాళ్లు మొక్కిన హీరో మాధవన్
కోలీవుడ్ హీరో మాధవన్ నటించిన తాజా చిత్రం రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో రిలీజై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించాడు రజనీకాంత్. అనంతరం మాధవన్‌కు శాలువా కప్పి సత్కరించాడు. ఈ ఆనందకర క్షణాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు మాధవన్. 'ఒక లెజెండ్ ఆధ్వర్యంలో వన్ మ్యాన్ ఇండస్ట్రీ, లెజెండ్ రజనీకాంత్ నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడం మర్చిపోలేను' అంటూ వీడియో షేర్ చేశాడు మాధవన్. ఈ వీడియోలో రజనీకాంత్ పాదాలను తాకి ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు మ్యాడీ. ప్రస్తుతం రాకెట్రీ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. When you get the blessings from a one man industry & the Leagend himself in the presence on @NambiNOfficial -it’s a moment etched for eternity-Thank you for you kindest words on #Rocketry & the affection @rajinikanth sir.This motivation has completely rejuvenated us. We love you pic.twitter.com/ooCyp1AfWd — Ranganathan Madhavan (@ActorMadhavan) July 31, 2022 View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) చదవండి: నెల రోజులైనా కాకముందే ఓటీటీలోకి వారియర్! హీరోయిన్ కొడుకుగా నటించి చివరకు ఆమెనే పెళ్లాడిన నటుడు! -
ఓటీటీలో వచ్చేస్తున్న ‘రాకెట్రీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
విలక్షణ నటుడు ఆర్ మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జులై 1న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ని దక్కించుకుంది. మాధవన్ టేకింగ్,యాక్టింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 40 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. (చదవండి: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ) ఇప్పటి వరకు థియేటర్స్‌లో సందడి చేసిన ఈ చిత్రం.. ఇక ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 26 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ అధికారికంగా తెలియజేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ని విడుదల చేసింది. రితా మాధవన్, వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సిమ్రాన్, రవి రాఘవేంద్ర, మిషా ఘోషాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. hop on for a space adventure 🚀#RocketryOnPrime, July 26 pic.twitter.com/W3JDZEz2eD — amazon prime video IN (@PrimeVideoIN) July 20, 2022 (చదవండి: చేయని నేరానికి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు.. నంబి నారాయణన్ రియల్ స్టోరీ) -
థియేటర్లో ఆ సీన్ మళ్లీ మళ్లీ ఎలా చూశావు?: నెటిజన్‌కు హీరో ప్రశ్న
కోలీవుడ్ స్టార్ మాధవన్ నటించిన లేటెస్ట్ మూవీ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మాధవన్ ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా తీయడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. జూలై 1న విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి. ఆయన అభిమానులైతే గొప్ప సినిమా చేశావంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. 'నిన్న రాకెట్రీ సినిమా చూశాను. చివరి సీన్ ఏదైతే ఉందో దాన్ని పదేపదే చూశాను. మీ తొలి దర్శకత్వమే అద్భుతంగా ఉంది. ఇక నటనకు కొంచెం కూడా వంక పెట్టాల్సిన పని లేదు' అంటూ హీరో మాధవన్‌ను ట్యాగ్ చేశాడు. దీంతో మాధవన్ ఈ ట్వీట్‌పై స్పందిస్తూ.. 'నువ్వు ఒక్క సన్నివేశాన్నే పదే పదే ఎలా చూడగలిగావు?' అని ప్రశ్నించాడు. దీంతో అడ్డంగా దొరికిపోయాననుకున్న నెటిజన్ వెంటనే తన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఇతర నెటిజన్లు నెట్టింట వైరల్ చేశారు. సినిమా వచ్చి కేవలం వారం రోజులు మాత్రమే అవుతోంది. థియేటర్లలో విజయవంతంగా ఆడుతున్న ఈ మూవీ ఇప్పుడప్పుడే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మరి అతడు నచ్చిన సన్నివేశాన్ని పదే పదే చూశాడంటే అది థియేటర్లో సాధ్యపడదు. అంటే అతడు పైరసీ ద్వారా సినిమా చూశాడని ఇట్టే తెలిసిపోతుంది. అతడికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా మ్యాడీ కౌంటర్ ఇవ్వడంతో నెటిజన్లు పడీపడీ నవ్వుతున్నారు. 😂😂 nice question pic.twitter.com/kY9a8um3Bb — Praveen Kumar (@by_PraveenKumar) July 8, 2022 చదవండి: ప్రేయసితో హృతిక్ రోషన్ రోడ్ ట్రిప్, వీడియో చూశారా? తనకన్నా ఆరేళ్లు చిన్నవాడితో ఆరేళ్లు డేటింగ్, పిల్లలు పుట్టాక పెళ్లి -
‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ
టైటిల్ : ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ నటీనటులు : ఆర్. మాధవన్, సిమ్రన్ , సూర్య, గుల్షన్ గ్రోవర్, రజిత్ కపూర్, రవి రాఘవేంద్ర తదితరులు నిర్మాణ సంస్థలు : కలర్ ఫిల్మ్స్, వర్ఘీస్ మూలన్ పిక్చరర్స్ నిర్మాతలు: సరితా మాధవన్, మాధవన్, వర్ఘీస్ మూలన్, విజయ్ మూలన్ రచన,దర్శకత్వం : ఆర్ మాధవన్ సంగీతం : శ్యామ్. సీఎస్ సినిమాటోగ్రఫీ : సిర్షా రే ఎడిటర్ : బిజిత్ బాలా విడుదల తేది : జులై 1, 2022 ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. ఈ లిస్ట్‌లో ఓ సైంటిస్ట్ కూడా చేరాడు. ఆర్ మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 1)థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? నంబి నారాయణన్‌గా మాధవన్ ఏ మేరకు మెప్పించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమ కథంతా ఇంటర్వ్యూగా సాగుతుంది. ఓ టీవీ చానల్లో హీరో సూర్య నంబి నారాయణన్(మాధవన్)ని ఇంటర్వ్యూ చేస్తూ.. తన జీవితం ఎలా సాగింది? ఇస్రోలో ఎలా చేరారు? తనపై వచ్చిన ఆరోపణలు ఎలా ఎదుర్కొన్నాడు తదితర విషయాలను అడుగుతారు. 1966లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరుతాడు నంబి నారాయణన్. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సీటీలో రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ చదివేందుకు స్కాలర్షిప్ పొందారు. అక్కడ సానా ఆఫర్ వచ్చిన సున్నితంగా తిరస్కరించి తిరిగి ఇండియాకు వచ్చిన మళ్లీ ఇస్రోలో చేరుతారు.. స్వదేశీ రాకెట్లను అభివృద్ది చేసే ప్రాజెక్ట్‌లో భాగంగా రష్యా డెవలప్ చేసిన క్రయోజెనిక్ ఇంజన్స్‌ని భారత్ తీసుకురావాలనుకుంటారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌కు భారత రాకెట్ సాంకేతిక విషయాలను చేరవేశారనే నెపంతో అరెస్ట్ అవుతారు. ఆ తర్వాత నంబి నారాయణన్ జీవితం ఎలా మలుపు తిరిగింది? అరెస్ట్ తర్వాత కేరళ పోలీసుల చేతిలో నంబి ఎలాంటి చిత్రహింసలు అనుభవించారు? తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను నుంచి ఎలా విముక్తి పొందారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. భారత అంతరిక్ష పరిశోధన రంగం అభివృద్ధిలో విశేష కృషి చేసిన వ్యక్తుల్లో నంబి నారాయణన్ ఒకరు. దేశం కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆఫర్‌ని తిరస్కరించి ఇస్రోలో చేరారు. అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో ఆయన దేశ ద్రోహం కేసును ఎదుర్కొన్నారు.తర్వాత ఆయనపై వేసిన దేశ ద్రోహం కేసును సుప్రీం కొట్టి వేసింది.నంబి నారాయణన్ మీద ఆరోపణలూ చెదిరిపోయిన తర్వాత భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇలా ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన ఆయన జీవితాన్ని మాధవన్ వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు.ఫస్టాఫ్ అంతా స్వదేశీ రాకెట్లను అభివృద్ది కోసం నంబి నారాయణన్ చేసిన కృషిని చూపించారు. సెకండాఫ్‌లో తప్పుడు కేసు వల్ల ఆయనతో కుటుంబ సభ్యులు ఎలాంటి అవమానాలకు గురయ్యారు? చివరకు నిర్థోషిగా ఎలా బయటకు వచ్చారనే విషయాలను చాలా భావోద్వేంగా చూపించారు.అయితే ఫస్టాఫ్ అంతా అంతరిక్ష పరిశోధన, ప్యూయల్ టెక్నాలజీ, వికాస్ ఇంజన్ అభివృద్ది తదితర అంశాలను లోతుగా చూపించడంతో డ్యాక్యూమెంటరీ ఫీల్ కలుగుతుంది. రాకెట్ సైన్స్ సామాన్య ప్రేక్షకులకు అంతగా అర్థం కాదు..కానీ దానితోనే నంబి నారాయణన్ జీవితం సాగింది కాబట్టి కచ్చితంగా వాటిని చూపించాల్సిందే. దర్శకుడు అదే పని చేశారు. ఇక సెకండాఫ్ మొత్తం చాలా భావోద్వేగంగా సాగుతుంది. దేశం కోసం అన్ని త్యాగాలు చేసిన నంబి నారాయణన్.. దేశద్రోహి కేసు కింద అరెస్ట్ కావడం.. ఆ సమయంలో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఎలాంటి మానసిక క్షోభని అనుభవించారు, నిర్దోషిగా బయటకు రావడమే కాకుండా దేశ మూడో అత్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్’ అందుకున్న సీన్స్ చాలా భావోద్వేగాన్ని కలిగించేలా అద్భుతంగా తెరకెక్కించారు. ‘ఒక రాకెట్ కూలిపోతే రియాక్ట్ అయ్యే మాకు.. ఒక మనిషి కూలిపోతే రియాక్ట్ అవడం తెలియదు’ అంటూ తోటి సైంటిస్టుల గురించి నంబి చెప్పె డైలాగ్, ఒక వీధి కుక్కను కొట్టి చంపాలనకుంటే దానికి పిచ్చి అన్న పట్టం కడితే సరిపోతుంది..అదేవిధంగా ఒక మనిషిని తనకు తెలియకుండా కొట్టాలంటే దేశద్రోహి అనే పట్టం కడితే సరిపోతుంది’ అని హీరో సూర్య చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేస్తాయి కూడా. దేశం కోసం కష్టపడిన మీ ఓ గొప్ప శాస్త్రవేత్తని అన్యాయంగా తప్పుడు కేసులో ఇరికించారే అనే ఫీల్‌తో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో తెలియదు కానీ.. మాధవన్ చాలా నిజయతీగా, ఉన్నతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎవరెలా చేశారంటే.. నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ నటించడం కంటే ఒదిగిపోయాడు. ఈ సినిమా కోసం దర్శకుడిగా, నటుడిగా మాధవన్ పడిన కష్టమంతా తెరపై కనిపించింది. యంగ్ లుక్‌తో పాటు ప్రస్తుతం నంబి నారాయణన్ ఎలా ఉన్నారో.. అలానే తెరపై చూపించే ప్రయత్నం చేశారు. దాని కోసం మాధవన్ చాలా కష్టపడ్డారు. పొట్టపెంచడం, పంటి వరుసను మార్చుకోవడం.. గెడ్డం పెంచడం ..ఇలా చాలా విషయాల్లో మాధవన్ డేరింగ్ స్టెప్స్ వేశాడు. ఎమోషనల్ సీన్స్‌ని చక్కగా పండించారు. అబ్దుల్ కలాంగా గుల్షన్ గ్రోవర్ , నంబిని ఇంటర్వ్యూ చేసే హీరోగా సూర్య(హిందీలో షారుఖ్) చక్కగా నటించారు. ఇక సినిమాకు మరో ప్రధాన బలం శ్యామ్. సీఎస్ సంగీతం. చక్కటి నేపథ్య సంగీతంతో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు.సిర్షా రే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
చేయని నేరానికి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు.. నంబి నారాయణన్ రియల్ స్టోరీ
1994 నవంబర్ 30.. అప్పటి వరకు ఆయన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త. యావత్ భారత్ ఆయనపై ప్రశంసలు జల్లు కురిపించింది. ఆయన కనిపెట్టిన ‘వికాస్’ ఇంజన్ అద్భుతమైనదని ప్రపంచమంతా కొనియాడింది. కానీ ఒకే ఒక ఘటనతో ఆయన జీవితం తలకిందులైపోయింది. దేశం కోసం అహర్నిశలు శ్రమించిన ఆయనను ‘దేశద్రోహి’ అన్నారు. చేయని తప్పుకు 50 రోజులు జైలులో పెట్టి నరకం చూపించారు. చివరకు నిర్థోషిగా బయటకు రావడమే కాకుండా.. దేశ మూడో అత్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్’ అందుకున్నారు. ఆయనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. విలక్షణ నటుడు మాధవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నంబి నారాయణన్ గురించి.. నాసా ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించి.. నంబి నారాయణన్ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. 1941 డిసెంబర్ 12న తమిళనాడులో జన్మించారు. ఆయన తల్లిదంద్రులు కొబ్బరి పీచు వ్యాపారం చేసేవారు. ఐదుగురి బాలికల తర్వాత ఆయన పుట్టాడు. ఇంట్లో అందరికంటే చిన్నవాడైన నారాయణన్.. చదువులో మాత్రం బాగా రాణించేవాడు. ఇంజనీరింగ్ పూర్తి చేశాక.. కొంతకాలం స్థానికంగా ఉండే చక్కెర కర్మాగారంలో పనిచేశారు. 1966లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సీటీలో రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ చదివేందుకు స్కాలర్షిప్ పొందారు. 1966లో నంబి నారాయణన్ నాసాలో ఉద్యోగ అవకాశం లభించినా.. దేశం కోసం సున్నితంగా తిరస్కరించి తిరిగి ఇస్రోలో చేరారు. అక్కడ విక్రమ్ సారాబాయి, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు. స్వదేశీ రాకెట్లను అభివృద్ది చేసే ప్రాజెక్ట్‌లో నారాయణన్ కీలక పాత్ర పోషించారు. ప్యూయల్ టెక్నాలజీని ఇస్రోకు అందించాలనుకున్నాడు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే క్రయోజెనిక్ ఇంజిన్స్. ఈ టెక్నాలజీ అప్పట్లో మనకు అందుబాటులో లేదు. దీంతో రష్యాతో రూ.235 కోట్ల ఒప్పందం కుదుర్చుకొని ఈ టెక్నాలజీని దిగుమతి చేసుకోవాలనుకున్నారు. ఈమేరకు సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ఆ సమయంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చేయని తప్పుకు నంబి నారాయణన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది? 1994 నవంబర్ 30న నంబిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు నెల రోజుల ముందు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లోనే ఉన్నారంటూ మాల్దీవులకు చెందిన మహిళ మరియమ్ రషీదా, ఫయూజియ్యా హసన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆ మహిళలిద్దరు భారత రాకెట్ సాంకేతిక విషయాలను పాకిస్తాన్‌కు చేరవేస్తున్నారని తేలింది. అంతేకాదు వీరికి ఇస్త్రోలో పని చేస్తున్న శాస్త్రవేత్తలు సహకరిస్తున్నారని మీడియాతో వార్తలు వచ్చాయి. ఆ మహిళలు వేసిన వలలో నంబి నారాయణన్ కూడా ఉన్నారని కేరళ పోలీసులు అభియోగాలు మోపారు. దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేసి 50 రోజులు జైల్లో పెట్టి విచారణ పేరుతో నరకం చూపించారు. దేశం గర్వించదగ్గ సైంటిస్ట్ అని కొనియాడిన మీడియానే ఆయన్ను ‘దేశద్రోహి’గా చూపించింది. గూఢచారి, దేశద్రోహి అంటూ అనేకమంది ఆయనను నిందించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తే ఆయన ఇంటిపై దాడి చేశారు. న్యాయమే గెలిచింది దేశం కోసం నాసా ఆఫర్‌ని తిరస్కరించిన నంబి నారాయణన్‌కు.. అసలు తనని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా మొదట్లో అర్థం కాలేదు. పోలీసులు ఎంత హింసించిన నేరం ఒప్పుకోలేదు. అరెస్టయిన నెల రోజుల తర్వాత ఈ కేసు కేరళ ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి సీబీఐకు బదిలీ అయింది. 1995 జనవరి 19న ఆయనకు బెయిల్ వచ్చింది. సీబీఐ విచారణలో నంబి నారాయణన్ ఎలాంటి తప్పు చేయలేదని తేలింది. సీబీఐ తమ నివేదికను 1996 ఏప్రిల్‌లో కేరళ హైకోర్టుకు సమర్పించింది. ఇస్రోకు చెందిన సమాచారం పాకిస్తాన్‌కు వెళ్లినట్లు ఎక్కడ ఆధారాలు లేకపోవడంతో నంబి నారాయణన్‌తో పాటు మరో ఐదుగురికి కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో నంబి నారాయణన్ తిరిగి ఇస్రోలో చేరారు. సీబీఐ ఈ కేసును మూసివేసినా.. అప్పటి కేరళ ప్రభుత్వం మళ్లీ తెరిచేందుకు ప్రయత్నించింది. ఈ కేసుని మళ్లీ విచారించాలని కోరుతూ..1998లో సుప్రీకోర్టు మెట్లు ఎక్కింది. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును తిరస్కరించింది. తనపై అక్రమంగా కేసును బనాయించి, వేధించిన కేరళ ప్రభుత్వంపై డాక్టర్ నారాయణన్ కేసు వేశారు. నారాయణన్‌కు రూ.50 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు 2018లో ఆదేశించింది. అంతేకాదు తప్పుడు కేసు బనాయించడంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. తన తప్పును తెలుసుకున్న కేరళ ప్రభుత్వం కోర్టు ఆదేశించిన పరిహారానికి అదనంగా రూ.1.3 కోట్లు అదనంగా ఇస్తామని 2019లో ప్రకటించింది. 2019లో భారత ప్రభుత్వం నారాయణన్ని ‘పద్మభూషణ్’తో సత్కరించింది. నారాయణన్‌పై కుట్ర పన్నిందెవరనే విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. గుఢచార్యం కేసు వెనుక అమెరికా హస్తం ఉందని కేరళ హైకోర్టు ఎదుట నారాయణన్ అనుమానం వ్యక్తం చేశారు. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మాధవన్‌ను చూసి ఒక్కసారిగా షాకైన సూర్య, వీడియో వైరల్
వైవిధ్యమైన పాత్రలు, కథలతో అలరిస్తుంటాడు మాధవన్. తాజాగా ఆయన రాకెట్రీ అనే బయోపిక్‌తో రాబోతున్నాడు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాన్ని ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో మాధవన్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. పాత్ర కోసం మ్యాడీ తనని తాను పూర్తిగా మేకోవర్ చేసుకున్నాడు. అచ్చం నంబి నారాయణ్‌లా తెల్ల జుట్టు, కళ్లద్దాలతో కనిపించనున్నాడు. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే అయితే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన స్టార్ హీరో సూర్య షూటింగ్ చూసేందుకు నంబి నారాయణ్‌తో కలిసి సెట్‌కు వెళ్లిన ఓ దృశ్యం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. సెట్లోకి అడుగుపెట్టగానే నంబి నారాయణన్ గేటప్ ఉన్న మాధవన్‌ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఒక్క క్షణం ఎవరూ నిజమైన నంబి నారాయణ్ అని గుర్తు పట్టలేదనేంతగా ఓ షాకింగ్ లుక్ ఇచ్చాడు. ఇక సెట్స్‌లోని సూర్య, నారాయణ్ రాగానే కూర్చి నుంచి లేచి ఇరువురి స్వాగతం పలికాడు మ్యాడీ. అనంతరం సూర్యను తన స్నేహితుడు అంటూ నారాయణ్‌కు పరిచయం చేశాడు. చదవండి: కొత్త కారు కొన్న బిగ్‌బాస్ బ్యూటీ, ధరెంతో తెలుసా? ఇక ఆయన సూర్యను పలకరిస్తూ.. మీ సినిమాలు చాలా బాగుంటాయని, మీ నటన అద్భుతమని కొనియాడారు. అంతేకాదు మీ నాన్నగారు(శివకూమార్) దర్శకత్వం కూడా తనకు బాగా నచ్చుందని చెప్పడంతో సూర్య ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా తమిళం, తెలుగులో చేస్తున్న సూర్య పాత్రలో హిందీలో షారుక్ ఖాన్ పోషిస్తున్నాడు. ఇక నంబి నారాయణ్ భార్య పాత్రలో సీనియర్ నటి సిమ్రాన్ కనిపించనుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 1న విడుదలకు సిద్ధమవుతుంది. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) -
సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచార కేసు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి పి.పి. మాధవన్(71)పై ఢిల్లీ పోలీసులు అత్యాచార కేసు నమోదైంది. జాబ్ ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని మాధవన్ తనను బెదిరించి లోబర్చుకున్నారంటూ ఓ మహిళ (26) ఫిర్యాదు చేసిందని పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఆమె భర్త కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ హోర్డింగులు ఏర్పాటు చేసేవాడని, 2020లో చనిపోయాడని అన్నారు. భర్త చనిపోయాక ఆర్థిక పరిస్థితి బాగోలేక.. కాంగ్రెస్ ప్రతినిధులను కలిశానని, వాళ్లు మాధవన్ నెంబర్ ఇచ్చారని, పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబర్చుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు జూన్ 25వ తేదీన ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ఒకరోజు నన్ను కలవడానికి పిలిచాడు. అతను నన్ను కారులో ఎక్కించుకోవడానికి వచ్చి.. తన డ్రైవర్‌ను కారు వదిలి వెళ్ళమన్నాడు. నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేను అభ్యంతరం చెప్పడంతో కోపం వచ్చి నన్ను ఒంటరిగా రోడ్డుపై వదిలేశాడు అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే కేవలం కాంగ్రెస్ పార్టీ పరువు తీసేందుకే ఇది నిరాధారమైన ఆరోపణ. అందులో వాస్తవం లేదు. ఇది పూర్తి కుట్ర అని పీపీ మాధవన్ చెప్తున్నారు. -
సూర్య, షారుక్ పైసా కూడా తీసుకోలేదు: హీరో
ప్రఖ్యాత ఇస్రో శాస్తవేత్త నంబి నారాయణన్లోని నెగెటివ్ కోణాన్ని తమ సినిమాలో చూపించినట్లు నటుడు మాధవన్ తెలిపారు. ఈయన తొలిసారిగా మెగాఫోన్ పట్టి స్వీయ నిర్మాణంలో కథానాయకుడిగా నటించిన రాకెట్రీ చిత్రాన్ని పాన్ఇండియా మూవీగా తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందించారు. ఈ సినిమా జులై ఒకటో తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం మాధవన్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత చరిత్ర తెరకెక్కించే ముందు తాను ఆయన్ని కలిశానని చెప్పారు. ఆయన చెప్పిన వివరాలు తనను ఆశ్చర్యచకితుడిని చేశాయన్నారు. భారతదేశానికి సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేశారన్న ఆరోపణతో జైలులో చిత్రహింసలు అనుభవించి బయటకు వచ్చిన తరువాత తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకున్న నంబి నారాయణన్ గొప్పతనాన్ని మాత్రమే కాకుండా ఆయనలోని నెగెటివ్ కోణాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. సహజత్వం కోసం తాను ఎలాంటి విగ్గు లేకుండా నంబి నారాయణన్‌లా తయారయ్యానని చెప్పారు. ఇందులో నటుడు షారుక్‌ఖాన్, సూర్య అతిథి పాత్రల్లో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా మరీ నటించారని చెప్పారు. చదవండి: ఓటీటీలోనూ 'ఆర్ఆర్ఆర్' రికార్డు.. ‘సమ్మతమే’ మూవీ రివ్యూ -
థామస్ కుక్‌లో ప్రమోటర్ వాటా అప్
ముంబై: ప్రమోటర్ సంస్థలలో ఒకటైన ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్(మారిషస్).. తాజాగా వాటాను పెంచుకున్నట్లు ఓమ్ని చానల్ ట్రావెల్ కంపెనీ థామస్ కుక్ (ఇండియా) పేర్కొంది. దీంతో ఫెయిర్‌బ్రిడ్జ్ వాటా 70.58 శాతం నుంచి 72.34 శాతానికి బలపడినట్లు వెల్లడించింది. మిగిలిపోయిన దాదాపు రూ. 133 కోట్ల విలువైన ఐచ్చిక మార్పిడికి వీలు కల్పించే క్యుమిలేటివ్ రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లకు బోర్డు సబ్‌కమిటీ ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. తద్వారా 2.8 కోట్ల ఈక్విటీ షేర్లను ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్ తాజాగా పొందినట్లు తెలియజేసింది. దీంతో షేరుకి రూ. 47.3 ధరలో మొత్తం రూ. 436 కోట్ల విలువైన రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు 9.2 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్పు చెందినట్లు వెల్లడించింది. వెరసి ప్రమోటర్ల వాటా 72.34 శాతానికి చేరినట్లు వివరించింది. ట్రావెల్, తత్సంబంధ సర్వీసుల విభాగాలలో కనిపిస్తున్న వేగవంత వృద్ధిపట్ల ప్రమోటర్లకున్న విశ్వాసాన్ని ఇది ప్రతిఫలిస్తున్నట్లు థామస్ కుక్ (ఇండియా) ఎండీ మాధవన్ మీనన్ పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో థామస్ కుక్(ఇండియా) షేరు ఎన్ఎస్ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 56 దిగువన ముగిసింది. -
ఆ సినిమా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు: మాధవన్
Madhavan Rocketry The Nambi Effect Showing In Cannes Festival 2022: టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో మంచి గుర్తింపు ఉన్న నటుడు మాధవన్. ఇప్పటి వరకు హీరోగా, నటుడిగా అలరించిన మాధవన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మాధవన్ మొదటిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్'. ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో మాధవన్ చిత్రం 'రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్'ను ప్రదర్శించారు. అనంతరం ఈ కార్యక్రమంలో నిర్వహించిన చర్చలో భాగంగా మాధవన్‌తోపాటు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, నంబి నారాయణ్ చిత్ర నిర్మాత శేఖర్ కపూర్, గీత రచయిత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాధవన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'ఆర్యభట్ట నుంచి సుందర్ పిచాయ్ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇండియాకి చెందిన అనేక వ్యక్తులకు ఎన్నో అసాధరణమైన చరిత్ర ఉంది. వీరికి సినీతారలు, నటీనటుల కంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు. యువతకు వారెంతో స్ఫూర్తి. కానీ ఇలాంటి వారిపై మేము సినిమాలు తీయడం లేదు.సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుతాలు సృష్టించి వరల్డ్‌వైడ్‌గా గుర్తింపు పొందిన వ్యక్తులను సినీ ప్రొడ్యూసర్స్ గుర్తించడం లేదు. క్రిస్టోఫర్ నోలాన్ సినిమాకు రివ్యూ ఇవ్వడానికి సమీక్షకులు భయపడతారు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు అర్థంకాకో, ఏదో ఒకటి రాసి ఫూల్ అవ్వడానికి ఇష్టపడరు. నిజం చెప్పాలంటే ఆయన తెరకెక్కించిన 'ఇన్సెప్షన్' నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. కానీ ఆయనకు సైన్స్‌పై ఉన్న పరిజ్ఞానం వల్ల ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది.' అని మాధవన్ తెలిపాడు. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) -
కాన్స్ చిత్రోత్సవంలో మన తారలు
ప్రతిష్టాత్మక కాన్స్ చలన చిత్రోత్సవానికి రంగం సిద్ధమైంది. 75వ కాన్స్ చలన చిత్రోత్సవం ఈ నెల 17 నుంచి 28 వరకు జరగనుంది. ఈ వేడుకల తొలి రోజు భారతదేశం తరఫున అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, పూజా హెగ్డే రెడ్ కార్పెట్‌పై సందడి చేయనున్నారు. వీరితో పాటు శేఖర్ కపూర్, తమన్నా, నయన తార, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) చైర్మన్ ప్రసూన్ జోషి, సీబీఎఫ్సీ బోర్డు సభ్యురాలు వాణీ త్రిపాఠి తదితరులు కనిపిస్తారు. ఈ టీమ్‌కు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సారథ్యం వహిస్తారు. ఇక దీపికా పదుకోన్ ఈసారి కాన్స్ ఉత్సవాల్లో జ్యూరీ సభ్యురాలిగా పాల్గొననుండటం విశేషం. ఈ వేడుకల్లో ‘క్లాసిక్ సినిమా’ విభాగంలో సత్యజిత్ రే తీసిన ‘ప్రతిధ్వని’ స్క్రీనింగ్ అవుతుంది. అలాగే నటుడు మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మే 19న ప్రదర్శితం కానుంది. భారత ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నంబి నారాయణన్ పాత్రను మాధవన్ పోషించారు. అలాగే ఢిల్లీకి చెందిన షౌనక్ సేన్ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ప్రదర్శితం కానుంది. కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’ ట్రైలర్ కూడా విడుదల కానుంది. -
నా తండ్రి గుర్తింపుతో బతకాలని లేదు: వేదాంత్ షాకింగ్ కామెంట్స్
R Madhavan Son Vedaant Shocking Comments: నటుడు, హీరో ఆర్ మాధవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెలి, సఖీ వంటి ప్రేమకథ చిత్రాల్లో నటించి లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు మాధవన్. ఈ క్రమంలో అతడికి సౌత్‌లో విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం సినిమాల్లో అతిథి పాత్రలు, ప్రతి కథానాయకుడిగా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్ తండ్రి బాటలో నడవకుండ స్పోర్ట్స్‌లో రాణిస్తోన్న సంగతి తెలిసిందే. స్విమ్మింగ్‌లో ఇప్పటికే అతడు జాతీయ, అంతర్జాతీయ పథకాలు సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. చదవండి: షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన అనుపమకు షాకిచ్చిన ఫ్యాన్స్ ఇటీవల జరిగిన డానిష్ ఓపెన్ అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నమెంట్లో రెండు(గోల్డ్, సిల్వర్) పథకాలు సాధించి మెరిశాడు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో వేదాంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. తన తండ్రి నీడలోనే బతకాలనుకోవడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘నేను హీరో మాధవన్ కొడుకుగానే ఉండిపోవాలనుకోవడం లేదు. ఆయన నీడలోనే బతకాలి, ఎదగాలని లేదు. నాకంటూ సొంతంగా ఓ గుర్తింపు ఉండాలనుకుంటున్నా’ అని వ్యాఖ్యానించాడు. చదవండి: హిందీలో కేజీఎఫ్ 2 సక్సెస్‌పై అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. అలాగే ‘నా తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను సంరక్షిస్తూనే ఉన్నారు. నాకు కావాల్సినవన్ని సమకూరుస్తున్నారు. నా కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా నా కోసమే దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యారు. 2026లో జరగబోయే ఒలింపిక్స్ కోసం నన్ను సన్నద్ధం చేస్తున్నారు. దానికోసం దుబాయ్‌లో నేను శిక్షణ తీసుకోవాల్సి ఉంది. అందుకోసం నాన్న, అమ్మ కూడా నాతో పాటు దుబాయ్‌కి షిఫ్ట్ అయ్యారు’ అంటూ వేదాంత్ చెప్పుకొచ్చాడు. ఇక కొడుకు మాటలకు మాధవన్ మురిసిపోయాడు. వేదాంత్ సినిమా రంగంలోకి రాకపోవడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, తనకు ఏది ఇష్టమో అదే చేయమన్నానని, తనకి పూర్తి స్వేచ్చా ఇవ్వడం తండ్రిగా తన బాధ్యత అని మాధవన్ పేర్కొన్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వరుస పథకాలతో సత్తా చాటుతోన్న మాధవన్ తనయుడు
R Madhavan Son Wins Gold Medal in Danish Open: స్టార్ హీరో మాధవన్ కొడుకు వేదాంత్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.స్విమ్మింగ్‌లో రాణిస్తున్న వేదాంత్ ఇప్పటికే భారత్‌కు పలు పతకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేదాంత్ డెన్మార్క్‌లో జరుగుతున్న డానిష్ స్విమ్మింగ్ ఓపెన్ పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నాడు. వరుస విజాయలతో దూసుకుపోతూ భారత్‌కు పథకాలను అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ పోటీలో వేదాంత్ ఆదివారం రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే పోటీలో సోమవారం గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ విషయాన్ని మాధవన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. కొడుకు వేదాంత్‌కు గోల్డ్ మెడల్ ప్రకటిస్తున్న వీడియోను మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. చదవండి: గంజాయి సరఫరా కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్ ‘మీ అందరి ఆశీర్వాదం, ఆ దేవుడి దయ వల్ల వేదాంత్ వరస విజాయలను అందుకుంటున్నాడు. ఈ రోజు గోల్డ్ మెడల్ సాధించాడు. ఇక ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వేదాంత్ గురువు ప్రదీప్‌కు కూడా థ్యాంక్స్ చెప్పాడు’ అంటూ పోస్ట్ పంచుకున్నాడు. కాగా డానిష్ ఓపెన్ 2022లో వేదాంత్ 800 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్లో మొదటి స్థానంలో నిలిచాడు. ఆదివారం కేవలం 10మిల్లీ సెకన్ల తేడాతో గోల్డ్ కోల్పోయిన వేదాంత్ సోమవారం సక్సెస్ ఫుల్‌గా రేసును పూర్తి చేసి భారత్ తరుపున బంగారు పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా పలువరు ప్రముఖులతో పాటు నెటీజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: R Madhavan: స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటిన హీరో మాధవన్ కొడుకు View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) -
సిల్వర్ మెడల్.. హీరో మాధవన్ కొడుకుపై ప్రశంసలు
స్టార్ హీరో మాధవన్ కొడుకు వేదాంత్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.స్విమ్మింగ్‌లో రాణిస్తున్న వేదాంత్ ఇప్పటికే భారత్‌కు పలు పతకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి స్విమ్మింగ్ పోటీల్లో దేశానికి సిల్వర్ మెడల్‌ను సాధించాడు. డెన్మార్క్‌లో జరిగిన డానిష్ స్విమ్మింగ్ ఓపెన్‌లో మాధవన్ కొడుకు వేదాంత్ రజత పతకం సాధించి సత్తా చాటాడు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరిగిన డానిష్ ఓపెన్ స్విమ్మింగ్ మీట్లో 1500 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్లో వేదాంత్ ఈ ఘనత సాధించాడు. ఈ విషయాన్ని మాధవన సోషల్ మీడియా వేదికగా పంచుకొని ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా మాధవన్ తన కొడుకు ఫోటోను మాత్రమే కాకుండా బంగారు పతకం సాధించిన సాజన్ ప్రకాష్‌ను కూడా అభినందించాడు. ఇక ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వేదాంత్ గురువు ప్రదీప్‌కు కూడా థ్యాంక్స్ చెప్పాడు. With all your blessings & Gods grace🙏🙏 @swim_sajan and @VedaantMadhavan won gold and silver respectively for India, at The Danish open in Copenhagen. Thank you sooo much Coach Pradeep sir, SFI and ANSA.We are so Proud 🇮🇳🇮🇳🇮🇳🙏🙏 pic.twitter.com/MXGyrmUFsW — Ranganathan Madhavan (@ActorMadhavan) April 16, 2022 -
వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే..
ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వినోదాన్ని అందించే ప్రధాన వేదికలుగా మారాయి. ఈ ఓటీటీల ద్వారా వినోదమే కాకుండా మంచి మార్కెటింగ్, బిజినెస్ కూడా ఏర్పడుతోంది. దీంతో చిన్న హీరోలు, నటులే కాకుండా పెద్ద హీరోలు సైతం ఓటీటీ బాట పడుతున్నారు. సూర్య, నాని వంటి తదితర హీరోల సినిమాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లతో కూడా అలరించారు కొందరు స్టార్ హీరోలు. విభిన్నమైన కథలను వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచే అవకాశం ఓటీటీలకు ఉండటంతో సై అంటున్నారు కథానాయకులు. మనోజ్ భాయ్పాయ్, కెకె మీనన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పంకజ్ త్రిపాఠి వంటి పాపులర్ యాక్టర్స్‌కు పోటీ ఇస్తున్నారు ఈ పెద్ద హీరోలు. 1. అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా వెండితెరకు పరిచయమైన అభిషేక్ బచ్చన్ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత రెండేళ్లలో అభిషేక్ సినిమాలన్నీ నేరుగా ఓటీటీలోనే విడుదలయ్యాయి. 2020లో వచ్చిన 'బ్రీత్: ఇన్టు ది షాడోస్' వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగు పెట్టాడు అభిషేక్ బచ్చన్. 2. సైఫ్ అలీఖాన్ వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతిపెద్ద బాలీవుడ్ స్టార్లలో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. తన హ్యాండ్సమ్ లుక్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను, అభిమానులను ఎంతో అలరించాడు. 2018లో రిలీజైన 'సేక్రేడ్ గేమ్స్' వెబ్ సిరీస్ ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కోల్కీ కొచ్చి వంటి భారీ తారాగణం నటించింది. తర్వాత 2020లో ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్ కూడా వచ్చింది. 3. అజయ్ దేవగణ్ 'ఆర్ఆర్ఆర్'లో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించిన బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అజయ్ దేవగణ్ తాజాగా వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సైకాలాజికల్, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్' అనే వెబ్ సిరీస్‌లో అజయ్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా అలరించాడు. మార్చి 4, 2022న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌లో టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశీ ఖన్నా హీరోయిన్గా నటించడం విశేషం. 4. వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్ 'ప్రిన్స్'గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు వివేక్ ఒబెరాయ్. బాలీవుడ్ చాక్లెట్ బాయ్‌గా పేరొందిన ఈ హీరో రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'రక్త చరిత్ర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నెగెటివ్ పాత్రలు పోషిస్తున్న వివేక్ 2017లో 'ఇన్సైడ్ ఎడ్జ్' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎక్కాడు. క్రికెట్ నేపథ్యంతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇప్పటికీ 3 సీజన్లు రిలీజ్ చేసింది. 5. మాధవన్ విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మాధవన్ ఒకరు. తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో నటించి ఆకట్టుకున్న మాధవన్‌ను చాక్లెట్ బాయ్ అని పిలిచేవారు. ఈ 51 ఏళ్ల హీరో ఇటీవల 'డీకపుల్డ్' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. 2018లో విడుదలైన 'బ్రీత్' వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకు ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే.. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. -
హీరో మాధవన్ తనయుడు వేదాంత్ అరుదైన రికార్డు, ఎంపీ ప్రశంస
హీరో మాధవన్ కుమారుడు వేదాంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ 7 జాతీయ అవార్డులను గెలిచి అరుదైన ఘనత సాధించాడు. తన కృషితో కుటుంబంతో పాటు దేశం పేరును మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాడు వేదాంత్. ఇటీవల ముగిసిన 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్స్ 2021లో మొత్తం ఏడు పతకాలను గెలుచుకున్నాడు. అతి చిన్న వయసులోనే వేదాంత్ సాధించిన ఘనతను ప్రశంసిస్తూ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ ఓ ట్వీట్ చేశారు. చదవండి: యూట్యూబ్ ఛానళ్లకు మంచు విష్ణు హెచ్చరిక, అలా చేస్తే చర్యలు.. మాధవన్, వేదాంత్‌లు కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేస్తూ ‘గుడ్ జాబ్ వేదాంత్. నువ్వు దేశం గర్వించేలా చేశావు. నిన్ను చూసి గర్వపడుతున్నాం. అలాగే నీ పెంపకం చూసి కూడా’ అంటూ ఈ సందర్భంగ తండ్రి మాధవన్‌పై కూడా ప్రశంసలు కురిపించారు. కాగా బెంగళూరు వేదికగా బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్లో జరిగిన ఈ పోటీలో వేదాంత్ నాలుగు రజత పతకాలతో పాటు మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఈ పోటీలో వేదాంత్ మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 800 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 1500 ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 4×100 ఫ్రీస్టైల్ రిలే, 4×200 ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్లలో రజత పథకాలు గెలుచుకున్నాడు. చదవండి: భార్యకు కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన నటుడు ఇదిలా ఉంటే వేదాంత్ సాధించిన ఘనతను ప్రశసింస్తూ పలువురు నెటిజన్లు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘16 ఏళ్ల వేదాంత దేశం కోసం పతకం సాధిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించారు. ఇప్పుడు ఆర్యన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో అప్పీల్ చేయబోతున్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత మార్చిలో వేదాంత కాంస్య పతకాన్ని సాధించి తన తండ్రి గర్వపడేలా చేశాడు. లాత్వియన్ ఓపెన్ స్విమ్మింగ్ ఛాంపియన్ ఈవెంట్లో వేదాంత్ పతకం సాధించాడు. మాధవన్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. Good job Vedant. We are proud of you and your upbringing. 🙏 pic.twitter.com/6SNVJI51w1 — Abhishek Singhvi (@DrAMSinghvi) October 24, 2021 -
తేజస్ ప్రధాన విడి భాగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: పూర్తి స్వదేశీ సాంకేతికతతో నిర్మితమవుతున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌కు అవసరమైన ప్రధాన భాగం (సెంట్రల్ ఫ్యూజలాజ్ యూనిట్) దేశీయంగా సిద్ధమైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వీఈఎం టెక్నాలజీస్‌లో తయారైన తొలి సెంట్రల్ ఫ్యూజలాజ్ యూనిట్‌ను సోమవారం తేజస్ రూపొందిస్తున్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు అందజేశారు. వీఈఎం టెక్నాలజీస్ సీఎండీ వెంకటరాజు చేతుల మీదుగా తొలి యూనిట్ దస్తావేజులను హెచ్ఏఎల్ సీఎండీ ఆర్.మాధవన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. కేంద్రం ఇటీవల ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని హెచ్ఏఎల్ 2011లోనే ప్రారంభించిందని పేర్కొన్నారు. తేజస్‌లోని ప్రధాన భాగాలను ఐదు ప్రైవేట్ కంపెనీలు చేపట్టాయని, మధ్య భాగమైన సెంట్రల్ ఫ్యూజలాజ్ యూనిట్ తయారీని వీఈఎం టెక్నాలజీస్ తక్కువ సమ యంలో పూర్తి చేసిందని కొనియాడారు. ఎల్సీఏ మార్క్–1 కోసం మొత్తం 83 యూనిట్లు అవసరం కాగా, కొన్ని మార్పులతో ఎల్సీఏ మార్క్–2 కోసం మరో 120 యూనిట్ల అవసరమని చెప్పారు. నావికాదళం, ఇతర విమానాల కోసం మరో 100 యూనిట్లు కావాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
హీరో రామ్ మూవీలో విలన్‌గా మాధవన్, స్పందించిన నటుడు!
తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్లో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా ఓ మాస్ మసాలా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌కు జోడిగా ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం లాక్డౌన్ అనంతరం సెట్స్‌పైకి రానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా హీరో మాధవన్‌ను తీసుకోనున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమార్స్‌పై మాధవన్ స్పందించాడు. లింగుస్వామి తెలుగు మూవీలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంగా లేదని సోషల్ మీడియా వేదిక వెల్లడించాడు. మ్యాడి ట్వీట్ చేస్తూ.. ‘అద్భుతమైన డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్లో నటించాలని నాకూ ఉంది. అయితే కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న తెలుగు సినిమాలో నేను విలన్‌గా నటిస్తున్నానంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. ఇది కేవలం పుకారు మాత్రమే’ అంటూ స్పష్టం చేశాడు. Would so love to work with @dirlingusamy and recreate the magic cause he is such a wonderful, loving man too… unfortunately no truth in the news doing the rounds recently, of us doing a telugu film together with en as an antagonist ❤️❤️❤️🙏🙏🙏 — Ranganathan Madhavan (@ActorMadhavan) June 12, 2021 -
వాల్ డిస్నీ అండ్ స్టార్ ఇండియా విరాళం
ముంబై: కరోనా వైరస్‌పై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా మరో కంపెనీ ముందుకొచ్చింది. వాల్ డిస్నీ అండ్ స్టార్ ఇండియా సంస్థ తన వంతు సాయంగా రూ.50 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ నిధులతో కోవిడ్ చికిత్సలో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, బైప్యాప్, వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాలతో పాటు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేంత వరకు భారత ప్రజలతో కలిసి సాగుతామని కంపెనీ అధ్యక్షుడు కె.మాధవన్ తెలిపారు. -
నటుడు మాధవన్‌కు కరోనా.. ఫన్నీగా ట్వీట్
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖ నటీనటులకు సైతం కరోనా సోకతుంది. తాజాగా నటుడు మాధవన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా మాధవన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే కరోనా సోకిందనే విషయాన్ని కాస్త ఫన్నీగా షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్‌తో 'త్రీ ఇడియట్స్' చిత్రంలో కలిసి నటించిన మాధవన్..అందులోని ఓ ఫోటోను షేర్ చేస్తూ..రాంచో(3 ఇడియట్స్ లో అమీర్ పాత్ర పేరు)ను ఫర్హాన్( మాధవన్ పేరు) ఫాలో అవుతుంటే.. వైరస్(బొమన్ ఇరానీ) మా ఇద్దరి వెంట పడేవాడు. అయితే ఈసారి వాడికి(కరోనా వైరస్‌కు) మేము చిక్కాము. ఆల్ ఈజ్ వెల్. త్వరలోనే కరోనా వైరస్‌కి కూడా త్వరలో చెక్ పడుతుంది. మాతో పాటు రాజు రాకూడదని అనుకుంటున్నాము. అందరికీ థ్యాంక్స్. నా ఆరోగ్యం బావుంది అని మాధవన్ పేర్కొన్నారు. అయితే కరోనా విషయంలోనూ మాధవన్ చూపించిన సెన్సాఫ్ హ్యూమర్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. కాగా బుధవారం నటుడు అమీర్ ఖాన్..తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉన్నట్లు, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని అతని మేనేజర్ తెలిపారు. Farhan HAS to follow Rancho and Virus has always been after us BUT this time he bloody caught up. 😡😡😄😄BUT-ALL IS WELL and the Covid🦠 will be in the Well soon. Though this is one place we don’t want Raju in😆😆. Thank you for all the love ❤️❤️I am recuperating well.🙏🙏🙏 pic.twitter.com/xRWAeiPxP4 — Ranganathan Madhavan (@ActorMadhavan) March 25, 2021 చదవండి : ప్రపోజ్ డే: హీరోకు వెరైటీ లవ్ ప్రపోజల్ వామ్మో! షారుక్‌కు అంత రెమ్యునరేషన్ కావాలంట -
మ్యాడీ షో స్పాయిలర్, ఛీ నిరుత్సాహపరిచాడు..
హీరో మాధవన్ (మ్యాడీ) తాజా చిత్రం ‘మారా’ ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైంలో విడుదలైన సంగతి తెలిసిందే. మాలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన రోమాంటిక డ్రామా ‘చార్లీ’ని దర్శకుడు దిలీప్ కుమార్ తమిళంలో ‘మారా’ పేరుతో తెరకెక్కించాడు. జనవరి 8న అమెజాన్ ప్రైంలో విడుదలైన ఈ సినిమాపై మూడుకు పైగా రేటింగ్‌తో పాజిటివ్ రెస్పాన్స్ అందుకోగా తాజాగా ఓ అభిమాని మాత్రం మ్యాడీపై విమర్శలు గుప్పించాడు. ఇక అది చూసి మ్యాడీ ఇచ్చిన సమాధానం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ‘మారా బిలో యావరేజ్ మూవీ. చార్లీ సినిమా మొదటి 30 నిమిషాల తర్వాత కూడా ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడి ఉంటారు. నిజంగా మాధవన్ షో స్పాయిలర్, అంతగా ఆయన పాత్ర నిరుత్సాహపరిచింది’ అంటూ ట్వీట్ చేశాడు. (చదవండి: నెటిజన్‌కు రివర్స్ కౌంటరిచ్చిన హీరో) #Maara completely floored by its sheer magic. It’s poetic, feel good n brings a tear with a smile. @ActorMadhavan #MouliSir @ShraddhaSrinath n the entire team, What a show! Marvellous!!!! #Director @dhilip2488 you are brilliant 👏👏👏👏💐💐💐❤️❤️❤️❤️ — KhushbuSundar ❤️ (@khushsundar) January 11, 2021 ఇక దీనికి మాధవన్ ‘హో మిమ్మల్ని నిరుత్సాహపరిచినందకు క్షమిచండి. మరోసారి ఈ తప్పు జరకుండా చూసుకుంటా. తదుపరి సినిమాలో మంచి ప్రదర్శన ఇస్తాను’ అంటూ చేతులు జోడించిన ఏమోజీతో సమాధానం ఇచ్చాడు. అయితే మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘చార్లీ’ని డైరెక్టర్ దిలీప్ కుమార్ ‘మారా’ పేరుతో తమిళంలో రీమేక్ చేశాడు. చార్లీలో హీరో దుల్కర్ సల్మాన్, పార్వతీలు లీడ్రోల్లు పోషించగా మారాలో మాధవన్, శ్రద్దా శ్రీనాథ్ నటించారు. కాగా ఓటీటీలో విడుదలైన మారా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇందులో మ్యాడీ పాత్ర చాలా అద్బుతంగా ఉందని, మాధవన్ తన నటనతో ‘మారా’కు జీవం పోశాడంటూ సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేగాక ఇందులోని పలు సన్నివేశాల్లో మ్యాడీ ఎనర్జీటిక్, ఉల్లాసవంతమైన నటనతో హైలెట్‌గా నిలిచాడాని ప్రశంసిస్తున్నారు. ఇక మౌలీ, షీవాద నాయర్, అభిరామీ, అలెగ్జాండర్ బాబులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. (చదవండి: రతన్ టాటా బయోపిక్.. అది నేను కాదు..) -
'మాధవన్ మద్యం, డ్రగ్స్‌కు బానిసయ్యాడు!'
సినీ సెలబ్రిటీలు ట్రోలింగ్ బారిన పడటం సర్వసాధారణమైంది. తాజాగా ఈ లిస్టులో హీరో మాధవన్ వచ్చి చేరారు. ప్రస్తుతం తను నటించిన మారా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఆయనను సోషల్ మీడియాలో ఓ నెటిజన్ కించపరుస్తూ మాట్లాడింది. "మ్యాడీ(మాధవన్)కి పెద్ద అభిమానిని. కానీ అతడు తాగుడుకు బానిసై, డ్రగ్స్‌కు అలవాటు పడుతూ అటు కెరీర్‌ను, ఇటు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం చూడలేకపోతున్నాను. రెహ్నా హై తేరా దిల్ మే.. చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టినప్పుడు ఎలా ఉండేవాడు? ఇప్పుడెలా తయారయ్యాడు? అసలేం చేస్తున్నాడనో అతడి ముఖం చూస్తేనే తెలుస్తోంది" అని కామెంట్ చేసింది. మీ పేషెంట్లను చూస్తుంటే జాలేస్తోంది.. సాధారణంగా ఇలాంటి నెగెటివిటీని సెలబ్రిటీలు పెద్దగా పట్టించుకోరు. కానీ మాధవన్‌కు మాత్రం ఈ కామెంట్ చూడగానే కోపం నషాళానికంటింది. దీంతో ఆమె వ్యాఖ్యాలకు ధీటుగా కౌంటర్లిస్తూ ట్వీట్ చేశారు. "ఓహో.. ఇదన్నమాట మీరు చేసేది? పాపం, మీ పేషెంట్లను చూస్తుంటే నాకు జాలేస్తోంది. నాకు తెలిసి నువ్వు వీలైనంత త్వరగా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడం మంచిది" అంటూ వ్యంగ్యంగా కౌంటరిచ్చారు. అటు మాధవన్ అభిమానులు కూడా హీరోను సమర్థిస్తూ సదరు నెటిజన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. బాలీవుడ్లో ఎవరో డ్రగ్స్ తీసుకున్నారని మా హీరోను అనుమానిస్తే బాగోదని హెచ్చరిస్తున్నారు. ఆమెకేదైనా చూపు మందగించిందేమోనని కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: సారీ బాస్, ఎస్ బాస్.. 30 ఏళ్లు ఇవే డైలాగులు) సైంటిస్ట్ మూవీలో మాధవన్ ఇదిలా వుండగా మాధవన్ ప్రస్తుతం 'మారా' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం జనవరి 8న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్, పార్వతి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం 'చార్లీ'కి ఇది రీమేక్. ఇందులో స్టాండప్ కమెడియన్ అలెగ్జాండర్ బాబు కూడా నటించారు. ప్రస్తుతం మాధవన్ 'రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. (చదవండి: నాకు నీ గురించి అన్నీ తెలుసు: చై) Oh .. So that’s your diagnoses ? I am worried for YOUR patients. 😱😱😱😱. May be you need a Docs appointment. . https://t.co/YV7dNxxtew — Ranganathan Madhavan (@ActorMadhavan) January 5, 2021 -
రతన్ టాటా బయోపిక్.. అది నేను కాదు..
పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పేరుతో రానున్న బయోపిక్‌లో తను నటించడం లేదని హీరో మాధవన్ స్పష్టం చేశారు. రతన్ టాటా జీవిత కథ నేపథ్యంలో త్వరలో ఓ బయోపిక్ తెరకెక్కనుందని, ఇందులో ఒకప్పటి లవర్ బాయ్ మాధవన్ నటిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన ఓ పోస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తపై తాజాగా మాధవన్ స్పందిస్తూ శనివారం ఓ ట్వీట్ చేశారు. ‘హే దురదృష్టవశాత్తు ఇది నిజం కాదు. కొంతమంది అభిమానుల తమ కోరిక మేరకు ఈ పోస్ట్‌ను సృష్టించి వైరల్ చేస్తున్నట్టున్నారు. అంతే తప్పా ఇందులో ఏమాత్రం నిజం లేదు. దీనికి సంబంధించి ఏ ప్రాజెక్ట్ ఇంతవరకు నా దగ్గరికి రాలేదు.. కనీసం చర్చ కూడా జరగలేదు’ అంటూ మాధవన్ ట్వీట్ చేశారు. (చదవండి: మాధవన్ టెన్త్ మార్కులు తెలుసా!) Hey unfortunately it’s not true. It was just a wish at some fans will made the poster. No such project is even on the pipeline or being discussed. https://t.co/z6dZfvOQmO — Ranganathan Madhavan (@ActorMadhavan) December 11, 2020 అయితే దర్శకురాలు సుధ కొంగర పారిశ్రామిక వేత్త రతన్ టాటా జీవిత కథ ఆధారం ఓ బయోపిక్‌ను రూపొందిస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆమె పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆమె రతన్ టాటా బయోపిక్‌ను లైకా ప్రోడక్షన్లో నిర్మిస్తున్నారని, ఈ చిత్రంలో 2021లో షూటింగ్‌ను కూడా జరుపుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మాధవన్ ఫొటో ఉన్న ఓ పోస్టర్‌పై రతన్ టాటా అని రాసి ఉన్న ఓ పోస్ట్ నెట్టింటా హల్చల్ చేస్తోంది. కాగా ఇటీవల మాధవన్, స్వీటీ అనుష్కలు జంటగా నటించిన ‘నిశ్శబ్ధం’ మూవీ ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క మాటలు రాని, వినికిడి లోపం ఉన్న కళాకారిణిగా నటించారు. (చదవండి: ఆ విషాదంపై రతన్ టాటా భావోద్వేగం) -
బుల్లితెరపై నిశ్శబ్దం...
మూగ, చెవుడు ఉన్న ఒక క్యారెక్టర్ అనగానే అది చేయడానికి స్టార్ హీరోయిన్లు పెద్దగా సాహసించరు. కానీ అనుష్క ఈ సాహసం చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే అనుష్క ఎప్పుడూ ముందుటారన్న సంగతి తెలిసిందే. అందుకే చాలా గ్యాప్ తర్వాత అనుష్క సినిమా చేస్తుంది, అది కూడా మూగ, చెవుడు క్యారెక్టర్ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తన పక్కన హీరోగా ఒకప్పటి లవర్ బాయ్ మాధవన్ అని చెప్పగానే సినిమాకు హైప్ రెట్టింపయ్యింది. సినిమా షూటింగ్ పూర్తవ్వగానే ఒకొక్క అప్డేట్ బయటకి వచ్చింది. (మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్) తీరా రిలీజ్ డేట్ ప్రకటించగానే లాక్డౌన్ అంటూ ఎవ్వరూ ఊహించని విధంగా 8 నెలల బ్రేక్ వచ్చింది. థియేటర్లు తెరుచుకుంటాయేమో.. నిశ్శబ్ధాన్ని ప్రేక్షకులు వెండితెరపై చూసే అవకాశం వస్తుందేమో అని మూవీ టీమ్ అంతా ఆసక్తిగా ఎదురుచూసింది. ఎంతకీ థియేటర్లు తెరచుకునే పరిస్థితి కనబడకపోవడంతో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల అయ్యింది. నటీనటుల యాక్టింగ్ తప్ప ఇంకా ఏ విభాగంలోనూ సినిమాకు మంచి మార్కులు పడలేదు. షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల, మైఖేల్ మాడ్సెన్ కీలక పాత్రల్లో కనిపించిన ఈ సినిమా చిత్రీకరణ మొత్తం అమెరికాలోనే జరిగింది. తన పాత్ర కోసం అనుష్క ప్రత్యేక శిక్షణ తీసుకుంది. పెయింటింగ్‌లో మెలకువలు నేర్చుకుంది. ఇంత చేసినా సినిమాకు ప్రాణం లాంటి క్లైమాక్స్‌ను దర్శకుడు హేమంత్ మధుకర్ సరిగా చూపించలేకపోయాడు. అందుకే దీనికి ప్రేక్షకుల దగ్గరి నుంచి మంచి స్పందన రాలేదు. ఓటీటీలో అంతగా ఆదరణ పోందలేని ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై రాబోతుంది. ఇటీవల నిశ్శబ్దం శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకుంది. అనుష్క దీని తర్వాత రెండు సినిమాలను ఓకే చేశారని, అందులో ఒకటి ఈ సంవత్సరం సెట్స్‌పైకి వెళ్లనుందని ఒక ఇంటర్వ్యూలో ఆమె బయటపెట్టారు. (బాహుబలి తిరిగొచ్చాడు) -
ఫలితాన్ని దాచలేం: కోన వెంకట్
‘‘ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూడటం ఒక కిక్. అలా కుదరకపోతే టీవీలో చూస్తాం. కరెంట్ పోతే ఫోన్లో చూస్తాం. కానీ ఉత్కంఠ ఒక్కటే. ఎమోషన్ కనెక్ట్ అయితే ఏ స్క్రీన్ అయినా ఒక్కటే. సినిమా కూడా అంతే’’ అన్నారు రచయిత కోన వెంకట్. అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించాయి. ఈ సినిమా అక్టోబర్ 2న అమేజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రచయితగా, నిర్మాతగా వ్యవహరించిన కోన వెంకట్ ‘సాక్షి’కి చెప్పిన విశేషాలు. మూకీ టు టాకీ ‘నిశ్శబ్దం’ని ముందు మూకీ సినిమాగా అనుకున్నాం. స్క్రీన్ ప్లే కూడా పకడ్బందీగా ప్లాన్ చేశాం. కానీ అనుష్క పాత్ర ఒక్కటే వినలేదు... మాట్లాడలేదు.. మిగతా పాత్రలు ఎందుకు సైలెంట్‌గా ఉండాలి? అనే లాజికల్ క్వశ్చన్‌తో మూకీ సినిమాను టాకీ సినిమాగా మార్చాం. రచయితగా నాకూ సవాల్ దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ కథ ఐడియా చెప్పగానే నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఐడియాను కథగా మలిచి స్క్రీన్ ప్లే చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. మేమిద్దరం మంచి మిత్రులం కావడంతో వాదోపవాదనలు చేసుకుంటూ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచాం. షూటింగ్ ఓ పెద్ద ఛాలెంజ్ ఈ సినిమా మొత్తాన్ని అమెరికాలోనే పూర్తి చేశాం. అది కూడా కేవలం 60 రోజుల్లోనే. కానీ అలా చేయడానికి చాలా ఇబ్బందులుపడ్డాం. థ్రిల్లర్ సినిమా షూట్ చేయడానికి వాతావరణం కీలకం. అమెరికాలో శీతాకాలంలో తీయాలనుకున్నాం. మా అందరికీ వీసాలు వచ్చేసరికి అక్కడ వేసవికాలం వచ్చేసింది. రోజూ ఉదయాన్నే రెండుమూడు గంటలు ప్రయాణం చేసి లొకేషన్స్‌కి వెళ్లి షూట్ చేశాం. వేరే దారిలేకే ఓటీటీ ‘నిశ్శబ్దం’ చిత్రం రిలీజ్ ఫి్ర» వరి నుంచి వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో అయోమయం. మరీ ఆలస్యం చేస్తే కొత్త సినిమా చుట్టూ ఉండే హీట్ పోతుంది. అది జరగకూడదని ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఓటీటీకి వెళ్లకూడదని చాలా విధాలుగా ప్రయత్నించాం. ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇలా చేస్తున్నాం. కచ్చితంగా థియేటర్ అనుభూతి ఉండదు. కానీ సినిమా తీసిందే ప్రేక్షకుల కోసం. వాళ్లకు ఎలా అయినా చూపించాలి కదా. ఓటీటీలో ‘నిశ్శబ్దం’ మొదటి బ్లాక్‌బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. ఫలితాన్ని దాచలేం థియేట్రికల్ రిలీజ్ అయితే కలెక్షన్స్‌ని బట్టి సినిమా హిట్, ఫ్లాప్ చెప్పొచ్చు. ఓటీటీలో అలా ఉండదు. ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని చెప్పేస్తారు. బావుంటే అభినందనలు ఉంటాయి. లేదంటే చీల్చి చండాడేస్తారు. ఈ లాక్‌డౌన్‌ను నేను ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఉపయోగించుకున్నాను. లాక్డౌన్ తర్వాత మనం చెప్పే కథల్లో చాలా మార్పు ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. కచ్చితంగా కొత్త ఐడియాలు మన తెలుగులోనూ వస్తాయి. ‘నిశ్శబ్దం’ కూడా అలాంటి సినిమాయే అని నా నమ్మకం. కోన 2.0 వస్తాడు ► లాక్డౌన్లో కొన్ని కథలు తయారు చేశాను ► లాక్డౌన్ తర్వాత అందరిలోనూ కొత్త వెర్షన్ బయటకి వస్తుంది అనుకుంటున్నాను. అలానే కోన వెంకట్ 2.0 కూడా వస్తాడు ► కరణం మల్లీశ్వరి బయోపిక్ సినిమా బాగా ముస్తాబవుతోంది ► దేశం మొత్తం ఆశ్చర్యపడే కాంబినేషన్ ఒకటి ఓకే అయింది. ఆ వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను ► సంక్రాంతికి థియేటర్స్ ఓపెన్ అయి, ప్రేక్షకులందరూ తండోపతండాలుగా థియేటర్లకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. -
సెన్సార్ పూర్తి.. సస్పెన్స్ అలానే ఉంది!
అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్ పాత్రలో నటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’తో థియేటర్స్‌లో సందడి చేసేవారు అనుష్క అండ్ టీం. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా అన్ని థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్రం మంగళవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హెమంత్ మధుకర్ తన ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి: నటుడు సూర్యకు గాయాలు..!) ‘మా రెండు చిత్రాలు తెలుగులో నిశ్శబ్దం, సైలెన్స్ చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా చూశాక బోర్డు సభ్యుల స్పందన చూసి చాలా ఆనందం వేసింది. ఈ సినిమాను తొలుత థియేటర్లోనే విడదుల చేయాలని సలహా ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు’ అంటూ హేమంత్ మధుకర్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడి ట్వీట్ ఆసక్తిరేపుతోంది. ఇక షూటింగ్‌లకు, థియేటర్లకు అనుమతుల్వివ్వాలని టాలీవుడ్ ప్రముఖులు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్న విషయం తెలిసిందే. దీంతో ఓటీటీలో విడుదల చేసే ప్రక్రియను కొన్నిరోజుల పాటు నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. (బన్నీ సినిమాలో యాంకర్ సుమ!) Both our films #nishabdham Telugu and #silence given U/A censor certificate and I am overwhelmed by the response of the #cencorboard panel members and my sincere thanks to them for there advice to release the film first in theatre 🙏 pic.twitter.com/bIZTOvjY7q — Hemantmadhukar (@hemantmadhukar) May 26, 2020 ‘మా చిత్రం ‘నిశ్శబ్దం’ విషయంలో మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకే మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. చాలా కాలం పాటు అందుకు పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రం.. అప్పుడు ఓటీటీ గురించి ఆలోచిస్తాము. అప్పుడు అదే బెస్ట్ అని అనుకుంటాము’ అంటూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ కొద్దిరోజుల క్రితం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలపై ఇప్పట్లో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. థియేటర్లపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాతే ‘నిశ్శబ్దం’ విడుదలపై ఆలోచించాలని చిత్రబృందం భావిస్తుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_841250433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
డీల్ కుదిరినట్లే.. రేపోమాపో ప్రకటన?
స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నిశ్శబ్దం’. మాధవన్, అంజలి, షాలిని పాండే తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా థియేటర్లకు తాళం పడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పటికే పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా మరోసారి వాయిదా పడింది. లాక్డౌన్ పొడగింపు, ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో దర్శకనిర్మాతలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సమయాన్ని క్యాష్ చేసుకునేందుకు ఓటీటీ సంస్థలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. విడుదలకు సిద్దంగా ఉండి లాక్‌డౌన్‌తో విడుదల కాకుండా ఆగిపోయిన చిత్రాలకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఒకటిరెండు చిన్న సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై విడుదల అయ్యాయి. అయితే తాజాగా ఓ సంస్థ నిశ్శబ్దం సినిమాతో డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుష్క, మాధవన్, అంజలి వంటిస్టార్లు నటించడం, సౌతిండియాలో ఈ సినిమాపై క్రేజ్ ఎక్కువగానే ఉండటంతో ‘నిశ్శబ్దం’కు భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు థియేటర్లోనే విడుదల చేస్తామని భీష్మించుకొని కూర్చున్న చిత్రబృందం కాస్త మెత్తపడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం డీల్ చివరి దశలో ఉందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: పవర్ స్టార్ సరసన అనుష్క? ‘డియర్ విజయ్.. నేనర్థం చేసుకోగలను’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_541241401.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘మార్చి 6న మధ్యాహ్నం 12:12 గంటలకు’
అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. కోన వెంకట్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అనుష్కతో పాటు మాధవన్, అంజలి, షాలినీ పాండే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌కు మంచి టాక్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. అయితే ‘నిశ్శబ్దం’ ఫ్యాన్స్‌కు సైలెన్స్ సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. నిశ్శబ్దం తెలుగు ట్రైలర్‌ను మార్చి 6న మధ్యాహ్నాం 12:12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా చిత్ర ట్రైలర్‌ను తెలుగులో నేచురల్ స్టార్ నాని విడుదల చేస్తాడని తెలిపింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు చిత్ర విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమా కథ అమెరికాలోని సియోటల్ బ్యాక్ డ్రాప్లో సాగుతుంది. ఇక ఇందులో అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటిస్తున్నారు. చదవండి: హ్యపీ బర్త్‌డే స్వీటెస్ట్ అమృత సుకుమార్ అభినందనను మర్చిపోలేను -
సమ్మర్లో నిశ్శబ్ధం
అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ శుక్రవారం ‘నిశ్శబ్దం’తో థియేటర్స్‌లో సందడి చేసేవారు అనుష్క. సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమాను ఫిబ్రవరి 20కి పోస్ట్‌పోన్ చేశారన్నది నిన్న మొన్నటి వార్త. అయితే 20న కూడా నిశ్శబ్దం సందడి ఉండదని తాజా సమాచారం. ఏప్రిల్ నెలకు ఈ సినిమా వాయిదా పడిందని భోగట్టా. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్ పాత్రలో నటించారు. ఈ చిత్రం జనవరి 31న విడుదల కాకపోవడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అవ్వకపోవడమే అని తెలిసింది. అందుకే శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 20న విడుదల చేయాలనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్‌కి మరో వారం అవసరం అయ్యేలా ఉండటంతో ఫిబ్రవరి 28వ తేదీన తీసుకువద్దాం అనుకున్నారు చిత్రబృందం. కానీ మార్చి మొదటివారం నుంచి పరీక్షల సీజన్ మొదలవుతోంది. సినిమా కలెక్షన్లపై పరీక్షల ప్రభావం పడే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు అనడంతో మళ్లీ విడుదలను వాయిదా వేశారని తెలిసింది. ఈ సినిమాను సమ్మర్లో తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించుకుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అందుకు ఏప్రిల్ 2 కరెక్ట్ డేట్ అని, సమ్మర్‌కి కరై్టన్ రైజర్‌లా ఈ సినిమా ఉంటుందని టీమ్ భావించి ఆ డేట్‌ని కన్ఫర్మ్ చేశారట. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్. కెమెరా: షానీ డియోల్. -
ఫైట్స్, చేజింగ్స్‌కు రెడీ అవుతున్న స్వీటీ
అరుంధతి, బాహుబలి, భాగమతి.. ఇవి నటి అనుష్క సినీ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రాలు. ఇలా అందాలారబోత పాత్రల నుంచి అభినయ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిన నటి అనుష్క. తెలుగు, తమిళం భాషల్లో తనకంటూ ఒక ఇమేజ్ను సంపాదించుకున్న ఈ స్వీటీ తాజాగా సైలెన్స్ చిత్రంతో బాలీవుడ్‌ను టచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. అవును భాగమతి చిత్రం తరువాత ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రం సైలెన్స్. తెలుగులో నిశ్శబ్దం పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సైలెన్స్ పేరుతో రూపొందుతోంది. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో మాధవన్, అంజలి, షాలినీపాండే ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న సైలెన్స్ చిత్రం త్వరలోనే తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్న అనుష్క తాజాగా దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతోంది. ఇదీ లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీన్ని వేల్స్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ భారీ బడ్జెట్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇందులో అనుష్కకు ఫైట్స్, చేజింగ్స్ అంటూ యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని సమాచారం. సాధారణంగా పాత్రలో ఇమిడిపోవడానికి శ్రాయశక్తులా కృషి చేసే అనుష్క ఇంతకుముందు బాహుబలి, రుద్రమదేవి వంటి చిత్రాల కోసం కత్తిసాము, గుర్రపుస్వారీ వంటి విద్యలో శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ మధ్య సైజ్ జీరో చిత్రం కోసం ఏకంగా 80 కిలోల వరకూ బరువును పెరిగింది. ఆ తరవాత ఆ బరువును తగ్గించుకోవడానికి పడరాని పాట్లు పడింది. చివరికి అమెరికా వెళ్లి బరువు తగ్గించుకుందని సమాచారం. దీంతో అనుష్క కొన్ని చిత్రాల అవకాశాలనూ కోల్పోయిందనే ప్రచారం ఆ మధ్య జోరుగా సాగింది. కాగా తాజాగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించే చిత్రం కోసం యాక్షన్ సన్నివేశాల కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అన్నట్టు దీనికి బాలీవుడ్ దర్శక, రచయిత గోవింద్ నిహలాలీ కథను అందిస్తున్నారని తెలిసింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. ఇక స్వీటీ యాక్షన్ అవతారం చూడడానికి మనం కూడా వేచి చూద్దాం. -
రూ.500 కోట్లు దాటిన ‘పెప్స్’ వ్యాపారం
సాక్షి బెంగళూరు: వ్యాపారంలో ఎంతమందికి చేరువయ్యామన్నదే ప్రధానమని పెప్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ కె.మాధవన్ చెప్పారు. సంస్థ 14వ వార్షికోత్సవం సందర్భంగా గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... శరీరానికి నిద్ర ప్రధానం కాబట్టి ఎలాంటి పరుపు కొనాలనే దానిపై ప్రస్తుతం ఎందరినో సంప్రదించాల్సి వస్తోందని చెప్పారు. గత 14 ఏళ్లలో దేశ వ్యాప్తంగా లక్షల మంది పెప్స్ పరుపులు కొన్నారని తెలియజేశారు. రూ.4 కోట్లతో వ్యాపారం ప్రారంభించగా.. 14 ఏళ్లలో రూ.500 కోట్లకు చేరామని చెప్పారాయన. ‘‘కొత్త పరుపు కొనడంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. పరుపు ఎత్తు కీలకం. నేలమట్టం నుంచి 24 అంగుళాల ఎత్తులో ఉండటం శ్రేయస్కరం’’ అని వివరించారు. పరుపులు పాతబడిన వెంటనే మార్చుకోవాలని.. పదేళ్లకు మించి వినియోగించరాదని సూచించారు. భారతదేశంలో కోల్‌కతా, కోయంబత్తూరు, ఢిల్లీ, పుణేలో ఉత్పత్తి కేంద్రాలున్నాయని తెలియజేశారు. గ్రామ స్థాయి వరకు చేరవేయడమే లక్ష్యం పెప్స్ పరుపులను పట్టణాల నుంచి గ్రామ స్థాయి వరకు చేరవేయడమే లక్ష్యమని పెప్స్ ఇండస్ట్రీస్ జేఎండీ జి.శంకర్‌రామ్ చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో పెప్స్ శాఖలు ప్రాచుర్యం పొందాయని, ఏపీలో కోస్తా ప్రాంతంలో వ్యాపారం బాగుందని చెప్పారు. రాయలసీమలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రస్తుతం విదేశీ మెటీరియల్‌పై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నా.. పెప్స్ పరుపులకు మాత్రం ఆదరణ తగ్గలేదని చెప్పారాయన. -
అందరూ..అనుమానితులే..
సాక్షి, హైదరాబాద్ : ‘భాగమతి’, ‘అరుంధతి’ లాంటి సినిమాలో విలక్షణ నటనతో ఆకట్టుకున్న హీరోయిన్ అనుష్కశెట్టి అభిమానులకు మరోసారి కనువిందు చేయనుంది. అవును.. అనుష్క అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'నిశ్శబ్ధం' (సాక్షి, మ్యూట్ ఆర్టిస్ట్ ట్యాగ్‌లైన్) సినిమా టీజర్‌ను బుధవారం లాంచ్ చేసింది. మోషన్ టీజర్‌తో ఆకట్టుకున్న చిత్ర యూనిట్ తాజాగా టీజర్‌ను ఆద్యంతం ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‌గా రూపొందించారు. అంతేకాదు ఈ సినిమా టీజర్లో అనుష్క 'సాక్షి' పాత్రలో దివ్యాంగురాలిగా స్వీటీ అద్భుత నటనతో మెప్పించబోతున్నారు. గోపీ సుందర్ బీజీఎం కూడా బాగానే భయపెడుతోంది. హాలీవుడ్ స్టార్ మైకేల్ మ్యూటసన్ ముఖ్యపాత్ర పోషించడం మరో విశేషం. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ సారధ్యంలో అనుష్క, మాధవన్ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం నిశ్శబ్దం. ఈ సినిమాలో అంజలి, షాలినీ పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తెలుగు, తమిళం, ఇంగ్లిష్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
'పుత్రోత్సాహంలో ప్రముఖ హీరో'
చెన్నై: ఆసియా ఏజ్ గ్రూప్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రముఖ హీరో మాధవన్ తనయుడు వేదాంత్ రజతం సాధించాడు. తన కుమారుడి విజయం పట్ల మాధవన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన కుమారుడితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. దేవుడి అనుగ్రహంతో భారత్‌కు తన కుమారుడు ఆసియా క్రీడల్లో రజత పతకం అందించడం సంతోషకరమని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో వేదాంత్ విజయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గొప్ప విజయాన్ని సాధించిన వేదాంత్, మాధవన్‌కు అభినంధనలు తెలియజేస్తున్నట్లు నటుడు రాహుల్‌రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సందేశాన్ని పోస్ట్ చేశాడు. అద్భుత విజయంతో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడంటూ పలువురు అభిమానులు వేదాంత్‌ను కొనియాడారు. ఇక బాలీవుడ్ భామ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజీవ్కుంద్రా వేదాంత్‌ను రాక్‌స్టార్‌తో పోల్చడం విశేషం. కాగా మాధవన్ పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా వెబ్ సిరీస్‌లోను నటించాడు. ఇటీవల కాలంలో బాలీవుడ్ బాద్షా షారూఫ్ఖాన్ జీరో సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన మాధవన్.. ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో రాకెట్రీ ద నంబీ ఎఫెక్ట్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నంబీ నారాయణన్ అనే ఇస్రో శాస్త్రవేత్త పాత్రలో మాధవన్ నటిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషలలో త్వరలోనే విడుదల కానుండడం విశేషం. View this post on Instagram India gets her Silver medal at the Asian Age Games . Gods grace .. Vedaants first official medal representing India .🙏🙏🙏🙏 A post shared by R. Madhavan (@actormaddy) on Sep 25, 2019 at 8:29pm PDT -
అనుష్క ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
భాగమతి సినిమా తరువాత అనుష్క వెండితెరపై కనిపించలేదు. చాలా గ్యాప్ తీసుకున్న స్వీటీ.. ‘నిశ్శబ్దం’ అనే బహుభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటున్న నిశ్శబ్దం మూవీ నుంచి అనుష్క ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు నిర్మాతలు ముహుర్తాన్ని ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 11న ఉదయం 11.11నిమిషాలకు అనుష్క ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో అనుష్క మూగ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మాధవన్, అంజలి, షాలినీ పాండే నటిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. Unveiling #AnushkaShetty's first look from @nishabdham on Sept 11th at 11:11 am! Get ready to meet her!! #NishabdhamFLOnSept11th pic.twitter.com/eZtRr1Gbx0 — Nishabdham Movie (@nishabdham) September 5, 2019 -
గోల్డ్ సాధించిన హీరో తనయుడు
టీ.నగర్: నేషనల్ జూనియర్ స్విమ్మింగ్ పోటీలో నటుడు మాధవన్ కుమారుడు రికార్డు సాధించాడు. మూడు బంగారు, ఒక వెండి పతకాన్నిన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ గత ఏడాది అంతర్జాతీయ స్థాయిలో థాయ్‌లాండ్‌లో జరిగిన ఈత పోటీలో పాల్గొని కాంస్య పతకం అందుకున్నాడు. ఇదిలాఉండగా ప్రస్తుతం జాతీయ స్థాయి ఈత పోటీలో వేదాంత్ మూడు బంగారు, ఒక వెండి పతకాన్ని చేజిక్కించుకున్నాడు. దీంతో అతను పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. దీనిగురించి నటుడు మాధవన్ తన సోషల్ వెబ్సైట్ పేజీలో దేవుని ఆశీర్వాదంతోను, మీ అందరి ఆశీస్సులతోను తన కుమారుడు జాతీయ స్థాయి రికార్డును సాధించడం సంతోషంగా ఉందన్నారు. -
తగ్గానండి!
అమెరికా పోలీసాఫీసర్ల చట్టాలను బాగా స్టడీ చేస్తున్నారు మన తెలుగు అమ్మాయి అంజలి. అక్కడి చట్టాలతో ఇక్కడి అమ్మాయికి పనేంటా అని ఆలోచనలో పడ్డారా? మరేం లేదు.. ఆమె ‘నిశ్శబ్దం’ సినిమాలో అమెరికన్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలుగా ‘నిశ్శబ్దం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. ఇటీవలే ఓ పాటను కూడా చిత్రీకరించారు. మాధవన్, అనుష్కలపై ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బధిర యువతి (చెవుడు, మూగ) పాత్రలో అనుష్క నటిస్తున్నారు. ఇటీవలే అంజలిపై కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో చేస్తున్న పోలీసాఫీసర్ పాత్ర కోసం ఆమె ఎనిమిది కిలోల బరువు కూడా తగ్గారు. అంతే కాదండోయ్... కెరీర్లో అంజలి తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ‘‘నిశ్శబ్దం’ సినిమాలో యూఎస్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాను. ఈ పాత్ర కోసం ఫిజికల్‌గా కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యంగా అమెరికా పోలీసుల బాడీ లాంగ్వేజ్, వారి చట్టాల గురించి స్పెషల్ కోర్స్ తీసుకున్నాను’’ అన్నారు అంజలి. -
ఆ కోరిక అనుష్కకూ పుట్టిందా?
తమిళసినిమా: మనిషి ఆశాజీవి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరైనా తనకెలాంటి ఆశ లేదంటే అది నిజం కాదు. ఇకపోతే స్వీటీగా దక్షిణాది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్న బ్యూటీ అనుష్క. ఇప్పుడీ అమ్మడికీ ఒక ఆశ పుట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ అమ్మడు తమిళం కంటే తెలుగు చిత్రాలనే ఎక్కువగా నమ్ముకుంది. అనుష్కకు నేమ్, ఫేమ్ తీసుకొచ్చిందీ తెలుగు చిత్ర పరిశ్రమనే. కోలీవుడ్‌లో సింగం చిత్రంతోనే విజయానందాన్ని ఆశ్వాదించింది. ఈ అందాలరాశిలోని అభినయాన్ని బయటకు తీసిందీ టాలీవుడ్‌నే. అరుంధతి చిత్రాన్ని, అందులోని అనుష్క నటనను ఎవరూ మర్చిపోలేరు. అలాంటి నటి భాగమతి చిత్రం తరువాత రెండేళ్లు ముఖానికి రంగేసుకోలేదు. ఇంజిఇడపళగి చిత్రంలోని పాత్ర కోసం పెంచుకున్న బరువును తగ్గించుకోవడానికి అనుష్క చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు గత అందాలను సంతరించుకున్న అనుష్క తాజాగా సైలెన్స్ అనే సైంటిఫిక్, సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే ఈ బ్యూటీ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న చారిత్రక కథా చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించేసింది. అయితే ఈ చిత్ర షూటింగ్ చివరి రోజునే అనుష్క గాయాలపాలైందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈమెను వైద్యులు రెండు వారాల వరకూ విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తింది. సైలెన్స్ చిత్ర షూటింగ్ కోసం అమెరికాలో ఉండడంతో తన గురించి జరుగుతున్న ప్రచారం గురించి పట్టించుకోకపోతే ఇంకా రచ్చ చేస్తారనుకుని తాను బాగానే ఉన్నానని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ సంగతి ఇలా ఉంటే ఆ అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం సైలెన్స్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిషు అంటూ నాలుగు భాషల్లో తెరకెక్కుతోంది. నటుడు మాధవన్ హీరోగా నటిస్తున్న ఇందులో నటి అంజలి, శాలినిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. నటి అనుష్క ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ హాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశం వస్తే నటించాలని ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొంది. ఇంతకు ముందు తాను దక్షిణాది చిత్రాలతోనే సంతృప్తిగా ఉన్నానని తెలిపింది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ ఆశనే వ్యక్తం చేయడం విశేషం. బాలీవుడ్ బ్యూటీస్ ప్రియాంకచోప్రా, దీపికా పదుకొనే వంటి వారు హాలీవుడ్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకోవడం, తాజాగా నటి శ్రుతిహాసన్ కూడా ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటించే అవకాశాన్ని రాబట్టుకోవడంతో హాలీవుడ్ ఆశ పుట్టి ఉండవచ్చునంటున్నారు సినీ వర్గాలు. ఇప్పుడు సైలెన్స్ చిత్రంతో తొలిసారిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతోంది కాబట్టి తదుపరి హాలీవుడ్‌పై గురి పెట్టాలన్న ఆలోచనకు వచ్చి ఉండవచ్చునని చర్చ జరుగుతోంది. -
నేను బాగానే ఉన్నా: అనుష్క
‘భాగమతి’గా వెండితెరపై అనుష్క కనిపించి ఏడాది దాటిపోయింది. మరో చిత్రం ఒప్పుకోవడానికి చాలా టైమ్ తీసుకున్న స్వీటీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సైరా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే అనుష్కకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్న సమయంలో ఆమెకు గాయాలయ్యాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. సైరా షూటింగ్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తైయిందని కెమెరామెన్ రత్నవేలు సోషల్ మీడియా వేదికగా తెలపడం.. అనుష్క సైతం ప్రస్తుతం సైలెన్స్ అనే బహుభాషా చిత్ర షూటింగ్లో బిజీగా ఉందని ప్రకటించడంలో సైరా షూటింగ్లో గాయపడిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది. ఈ వార్తలపై అనుష్క సోషల్‌మీడియాలో స్పందిస్తూ.. ‘నేను ఆరోగ్యంగా ఉన్నాను. సియాటెల్‌లో షూటింగ్ చేస్తు సంతోషంగా ఉన్నాను. లవ్యూ ఆల్’ అంటూ పోస్ట్ చేసింది. హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న సైలెన్స్ చిత్రంలో మాధవన్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. View this post on Instagram 😘😘 A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on Jun 26, 2019 at 11:15pm PDT -
‘మీ జంట ఎల్లప్పుడూ అందంగానే ఉంటుంది’
నటి సిమ్రాన్‌తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న విషయాన్ని హీరో మాధవన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన అప్‌కమింగ్ మూవీ రాకెట్రీకి సంబంధించిన విశేషాల్లో భాగంగా సిమ్రాన్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ పదిహేనేళ్ల తర్వాత తిరు, ఇందిర శ్రీమతి, శ్రీ నంబి నారాయణన్‌గా’ అంటూ రాకెట్రీ మూవీలో సిమ్రన్ క్యారెక్టర్‌ను రివీల్ చేశాడు. ఈ క్రమంలో.. ‘మీ జంట ఎల్లప్పుడూ అందంగానే ఉంటుంది’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత సంఘటనల ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా బుల్లితెర ద్వారా గుర్తింపు పొందిన ఉత్తరాది భామ సిమ్రాన్.. తర్వాతికాలంలో బాలీవుడ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దక్షిణాదిన కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్న ఈ అమ్మడు టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అయితే కొంతకాలంగా టీవీ షోలతో బిజీగా ఉన్న సిమ్రన్.. ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇటీవల రజనీకాంత్ పేట సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక గతంలో బాలచందర్ పార్థలే పరవశం, మణిరత్నం కన్నాతిల్ ముథమిట్టల్ సినిమాల్లో మాధవన్‌కు జంటగా నటించిన ఆమె.. తాజాగా సైంటిస్ట్ బయోపిక్‌లో మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. నారాయణన్ పాత్రలో మాధవన్ నటిస్తుండగా.. ఆయన భార్య పాత్రలో సిమ్రన్ కనిపించనున్నారు. కాగా ఈ చిత్రానికి అనంత మహదేవన్‌తో పాటు మాధవన్ కూడా దర్శకుడిగా పని చేయాలనుకున్నారు. అయితే మహదేవన్ తప్పుకోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. View this post on Instagram 15 years later . Thiru and Indira turn into Mr. & Mrs. Nambi Narayanan. 🙏🙏🚀🚀#rocketryfilm @actormaddy #actormaddy #rocketrythenambieffect #15yearslater @SimranbaggaOffc @vijaymoolantalkies @simranrishibagga A post shared by R. Madhavan (@actormaddy) on Jun 14, 2019 at 10:34pm PDT -
‘నిశబ్ధం’ మొదలైంది!
భాగమతి సినిమా తరువాత వెండితెర మీద కనిపించని అనుష్క, కొత్త సినిమాను ప్రారంభించారు. లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్యూటీ కొత్త సినిమాలో తన కొత్త లుక్‌లో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తెలుగులో ‘నిశబ్ధం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇతర భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బహుభాషా నటుడు మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా మరో కీలక పాత్రలో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ కనిపించనున్నారు. ఈ సినిమాకు ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకుడు. కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
మౌనం వీడారు
ఈపాటికి యూఎస్‌లో సైలెంట్‌గా ‘సైలెన్స్’ టీమ్ షూటింగ్ చేసుకుంటూ ఉండాల్సింది. కానీ జరగలేదు. ఈ విషయంపై ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న టీమ్ ఇప్పుడు మౌనం వీడారు. ఈ నెలాఖర్లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘సైలెన్స్’ చిత్రం తెరకెక్కనుంది. అనుష్కా, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజులతో పాటు హాలీవుడ్ యాక్టర్ మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య తారాగణంగా కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 24న ప్రారంభించనున్నట్లు దర్శకుడు హేమంత్ వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ అంతా ఆల్మోస్ట్ యూఎస్‌లోనే జరగుతుందని తెలిసింది. కొంతమంది అమెరిక్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ‘సైలెన్స్’ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
వయసు తగ్గింది
సౌత్ ఇండస్ట్రీల్లోని హ్యాండ్సమ్ హీరోల్లో మాధవన్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. అటువంటి ఆయన తాజాగా మరో పదేళ్లు వెనక్కివెళ్లిపోయారు అంటున్నారు ఆయన ఫ్యాన్స్. మాధవన్ ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణ్ బయోపిక్‌తో బిజీబిజీగా ఉన్నారు. ఆ సినిమాలో నారాయణ్ యువకుడిగా ఉన్నప్పటి సన్నివేశాలు చిత్రీకరించడానికి క్లీన్ షేవ్ చేసుకున్నారు మాధవన్. ఆ ఫొటో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే.. ‘భలే యంగైపోయారే!’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ యంగ్ లుక్ గురించి మాధవన్ మాట్లాడుతూ– ‘‘అమ్మ రెండేళ్ల నుంచి క్లీన్షేవ్ చేసుకోమని పోరుపెడుతోంది. నంబీ నారాయణ్ కోసం చేయాల్సి వచ్చింది. నంబీ యంగ్ ఎపిసోడ్‌ను ఫ్రాన్స్‌లో చిత్రీకరించనున్నాం’’ అన్నారు. -
వెంకీ–రోహిత్ ఓ రీమేక్?
విక్రమ్, భేతాళ కథలను ఆధారంగా తీసుకొని తమిళంలో దర్శకద్వయం పుష్కర్–గాయత్రి తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌వేదా’. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వంద కోట్లు కూడా సాధించింది. ఈ సినిమా తెలుగులో రీమేక్ కాబోతోందని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్గా ఈ రీమేక్‌లో వెంకటేశ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తారని సమాచారం. వీవీ వినాయక్ దర్శకుడు అని తెలిసింది. మాధవన్ చేసిన పాత్రను నారా రోహిత్, విజయ్ సేతుపతి రోల్లో వెంకటేశ్ కనిపిస్తారని సమాచారం. గతంలో వెంకటేశ్ – వీవీవినాయక్ కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్మీ’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
మోదీకే మద్దతిస్తానన్న సెలబ్రిటీ..
సాక్షి, ముంబై : దేశంలో ప్రజాస్వామ్య బలోపేతానికి తాను ప్రధాని నరేంద్ర మోదీని సమర్ధిస్తానని నటుడు మాధవన్ చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో మా బాధ్యతను గుర్తుచేసినందుకు ధన్యవాదాలంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి మాధవన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బలోపేతానికి మీరు సాగిస్తున్న కృషికి సహకారం అందించడం తన విధి అన్నారు. కాగా, పౌరులు తమకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మాధవన్‌తో పాటు అనుపమ్ ఖేర్, శేఖర్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు పిలుపు ఇచ్చారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేసేలా ప్రచారం చేపట్టాలని ప్రధాని మోదీ ట్విటర్లో పలువురు నటులకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో బాలీవుడ్ నటులు స్పందించారు. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని తమకు ఇష్టమైన సర్కార్‌ను ఎన్నుకుంటామని, భారత సోదరులందరినీ దేశ ప్రజాస్వామ్య పతాక సమున్నతంగా ఎగిరేలా రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతున్నానని అనుపమ్ ఖేర్ ప్రధాని ట్వీట్‌కు బదులిచ్చారు. ఫిల్మ్‌మేకర్ శేఖర్ కపూర్ స్పందిస్తూ దేశ రాజ్యాంగం మనకు ప్రాధమిక హక్కులతో పాటు కొన్ని బాధ్యతలనూ నిర్ధేశించిందని చెప్పుకొచ్చారు. మనమంతా ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. -
హీరోయిన్ అనుష్క మూగబాసలు
ముద్దబంతి పువ్వులో మూగ బాసలు అని పాటలో విన్నాం. ఇక హీరోయిన్ అనుష్క మూగబాసలు చూడబోతున్నాం. అవును అనుష్కను వెండితెరపై చూసి ఏడాది పైనే అవుతోంది. ఇది ఆమె అభిమానులకు నిరాశ కలిగించే విషయమే అవుతుంది. భాగమతి తరువాత ఏ చిత్రంలోనూ నటించని ఆ స్వీటీ పెరిగిన తన బరువును తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడిందనే ప్రచారం జోరుగానే జరుగుతోంది. అంతే కాదు ఆ మధ్య ఆలయ దర్శనం చేసుకుంటే, అనుష్క దోశ నివారణ పూజలు నిర్వహించిందని, త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందనిలాంటి నిరాధార వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోని ఈ బ్యూటీ ఆ మధ్య బరువు తగ్గడం కోసం విదేశాలకు వెళ్లింది. అక్కడ ఆమె ప్రయత్నం ఫలించి నాజూగ్గా రెట్టించిన అందాన్ని పోగేసుకుని తిరిగొచ్చింది. తాజాగా సైలెన్స్ అనే త్రిభాషా చితంలో నటించడానికి సిద్ధమైంది. మాధవన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు రానా అతిథి పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జరుగుతోంది. హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఇందులో నటి అనుష్క మూగ, చెవుడు కలిగిన యువతిగా నటించబోతోందట. ఇందుకుగానూ ఈ అమ్మడు మూగ భాషలో శిక్షణ పొందుతోంది. అమెరికాలో మూగ భాషలో తర్ఫీదు తీసుకుంటుందని సమాచారం.అసలు మాటలే లేకుండా తన సైగలతో, ముఖ కవళికలతో సైలెన్స్ చిత్రం ద్వారా అలరించడానికి ఈ బ్యూటీ తయారవుతోందన్నమాట. -
ఆ వార్తల్లో నిజం లేదు
తమిళంలో ‘విక్రమ్‌వేదా’ (2017) చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన ఈ చిత్రానికి పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించారు. వైనాట్ స్టూడియో ప్రతినిధి శశికాంత్ నిర్మించారు. ‘విక్రమ్‌వేదా’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. దీంతో ఈ చిత్రం ఇతర భాషల్లో రీమేక్ కానుందని వార్తలు వచ్చాయి. ఇటీవల ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ, రాజశేఖర్ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై వైనాట్ స్టూడియోస్ ప్రతినిధులు తమ సంస్థ ట్వీటర్ అకౌంట్ ద్వారా వివరణ ఇచ్చారు. ‘‘విక్రమ్‌వేదా’ తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ, రాజశేఖర్ నటించబోతున్నారన్న వార్తల్లో నిజం లేదు. అవి పుకార్లు మాత్రమే. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు ఇంకా మా వద్దే ఉన్నాయి. మేం అధికారిక ప్రకటన ఇచ్చేంతవరకు ఇలాంటి వార్తలను నమ్మవద్దని కోరుతున్నాం’’ అన్నారు. -
మ్యాడసన్ @ సైలెన్స్
అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు ముఖ్య తారలుగా హేమంత్ మధుకర్ తెరకెక్కించనున్న చిత్రం ‘సైలెన్స్’. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించనున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడసన్ నటించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ‘కిల్ బిల్, హేట్‌ఫుల్ ఎయిట్, రిసర్వోయర్ డాగ్స్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించారు మ్యాడసన్. ‘‘టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తారు. ఓ వినూత్నమైన సినిమాను చూశామనే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుందని ఆశిస్తున్నాం. యూఎస్ఏలోని సీయోటల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు చిత్రీకరణ జరపబోతున్నాం. ఈ సినిమా టీజర్‌ను మేలో యు.ఎస్.ఏలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఎస్ అండ్ ఎస్.. గెస్ట్‌గా యస్!
ఎస్ అండ్ ఎస్.. షారుక్ ఖాన్ అండ్ సూర్య.. గెస్టులుగా నటించడానికి ‘యస్’ అన్నారట. ఏ సినిమా అంటే ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’లో. ప్రముఖ మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. నంబి నారాయణన్ పాత్ర పోషించడంతో పాటు ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నారు మాధవన్. శాస్త్రవేత్త పాత్రలో ఒదిగిపోవడానికి మాధవన్ కాస్త బరువు తగ్గారు. గడ్డం పెంచారు. నెరిసిన గడ్డంతో కనిపించనున్నారు. ఒక నటుడు పాత్రను ప్రేమిస్తే ఎంతలా ఒదిగిపోతాడో చెప్పడానికి తాజాగా మాధవన్ గెటప్ ఓ ఉదాహరణ. ఆ సంగతలా ఉంచితే.. ఈ చిత్రంలో ఒక అతిథి పాత్ర ఉందట. ఆ పాత్రను ఇటు తమిళ్ అటు హిందీ వెర్షన్లో పేరున్న నటుడు చేస్తే బాగుంటుందని మాధవన్ భావించారట. షారుక్ ఖాన్, సూర్య అయితే న్యాయం జరుగుతుందని ఇద్దరినీ అడిగారని సమాచారం. మాధవన్ అడగ్గానే కాదనకుండా షారుక్, సూర్య నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బోగట్టా. ఈ ఇద్దరూ నటిస్తే కథకు బలం చేకూరడంతో పాటు తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతోంది కాబట్టి ఆయా భాషల్లో సినిమా బిజినెస్‌కి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
థామస్ కుక్ చేతికి డిజిఫొటో
ముంబై: పర్యాటక సేవలందించే థామస్ కుక్ ఇండియా గ్రూప్...ఇమేజింగ్ సొల్యూషన్స్, సేవలందించే డిజిఫొటో ఎంటర్టైన్మెంట్ ఇమేజింగ్(డీఈఐ)లో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు విలువ రూ.289 కోట్లని థామస్ కుక్ ఇండియా తెలిపింది. ఈ కొనుగోలుకు నియంత్రణ సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొంది. డీఈఐలో వాటా కొనుగోలుతో కొత్త వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నామని థామస్ కుక్ ఇండియా సీఎమ్‌డీ మాధవన్ మీనన్ తెలిపారు. ప్రస్తుతం 25 దేశాల్లో నిర్వహిస్తున్న పర్యాటక సేవలకు అనుబంధంగా కొత్త అవకాశాలను ఈ కొనుగోలు అందించగలదని పేర్కొన్నారు. సింగపూర్, యూఏఈ, హాంగ్‌కాంగ్, మకావూ, చైనా, అమెరికా తదితర 14 దేశాల్లో 250 నగరాల్లో 120 మంది భాగస్వాములతో డీఈఐ కార్యకలాపాలు నిర్వహిస్తోందని, గత ఏడాదిలో 36 లక్షల లావాదేవీలను నిర్వహించిందని పేర్కొన్నారు. థామస్ కుక్‌తో అనుబంధం కారణంగా తమ స్థానం మరింత పటిష్టమవుతుందని డీఈఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కె. రామకృష్టన్ తెలిపారు. -
సైలెంట్‌గా ఉన్నారు
సినిమాలో కీలక పాత్ర ఉంది. నిడివి తక్కువే. మామూలుగా అయితే కొందరు ఆర్టిస్టులు నిడివి గురించి ఆలోచించిన నో అంటారు. కానీ నో ప్రాబ్లమ్ నేనున్నా అంటారు రానా. ఇంతకుముందు చాలా సినిమాల్లో అతిథిగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ చాలా సినిమాల్లో గెస్ట్‌గా కనిపించారు. లేటెస్ట్గా అనుష్క, మాధవన్ సైలెంట్ థ్రిల్లర్ చిత్రంలోనూ అతిథిగా కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ విషయం గురించి సైలెంట్‌గా ఉన్నారు. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందట. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మాధవన్, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న సైలెంట్ థ్రిల్లర్ ‘సైలెన్స్’. కోన వెంకట్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ అమెరికాలో జరగనుంది. హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ‘బాహుబలి’ తర్వాత అనుష్క, రానా స్క్రీన్ షేర్ చేసుకోబోయే చిత్రమిది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం మార్చిలో ప్రారంభం కానుంది. -
అనుష్క న్యూ లుక్.. ఇది జస్ట్ ఝలక్
జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క.. తిరిగి స్లిమ్ లుక్‌లోకి వచ్చేందుకు చాలా కాలంగా కష్టపడుతోంది. ముఖ్యంగా బాహుబలి 2, సింగం 3 సినిమాల్లో అనుష్క లుక్ పైగా విమర్శలు వినిపించటంతో ఇక స్వీటీ కెరీర్ ముగిసినట్టే అని భావించారు. తరువాత వచ్చిన భాగమతిలో అనుష్క కాస్త తగ్గినట్టుగా కనిపించినా గతంలో కనిపించినంత గ్లామరస్‌గా మాత్రం కనిపించలేదు. దీంతో మరోసారి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన స్వీటీ ప్రస్తుతం తన లుక్ మీద దృష్టి పెట్టింది. తాజాగా బయటకు వచ్చిన అనుష్క ఫొటోలు అభిమానులకు షాక్ ఇచ్చాయి. వైట్ డ్రెస్‌లో స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్న అనుష్క లుక్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ లుక్ పై అనుష్కతో సినిమాను నిర్మిస్తున్న కోన వెంకట్ స్పందించారు. ‘ఇది జస్ట్ ఝలక్ అంతే.. సినిమాలోతన ఫైనల్ లుక్ కోసం వెయిట్ చేయండి. స్వీటీ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా కనిపించబోతోంది’ అంటూ ట్వీట్ చేశారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో మాధవన్ కీలక పాత్రలో నటించనున్నారు. అనుష్కతో పాటు అంజలి, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోన వెంకట్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
గడ్డకట్టే చలిలో స్వీటీ!
భాగమతి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క త్వరలో మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బహుభాషా నటుడు మాధవన్ కీలక పాత్రలో నటించనున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తెలుగు, తమిళ, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటీనటులు పనిచేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం విదేశాల్లో జరగనుందట. ఇప్పటికే ఆ లోకేషన్లు కూడా ఫైనల్ చేశారు. వీటిలో కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మైనస్ డిగ్రీలలో ఉంటుందని, అంత చలిలో కూడా షూటింగ్ చేసేందుక అనుష్క అంగీకరించిందని తెలుస్తోంది. ఈ సినిమాకు సైలెన్స్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ మూవీలో అనుష్కతో పాటు అంజలి, షాలినీ పాండేలు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
కనుక్కోండి చూద్దాం
... అనేది మీ ముందున్న సవాల్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత సంఘటనల ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నారాయణన్ పాత్రలో మాధవన్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కంప్లీట్‌గా నారాయణన్ లుక్‌లోకి మారిపోయారాయన. ఇక్కడున్న ఫొటోని షేర్ చేసి, ఎవరో కనిపెట్టగలరా? అంటూ తన నయా లుక్‌ను విడుదల చేశారు మాధవన్. అచ్చంగా నంబి నారాయణన్‌లానే మౌల్డ్ అయ్యారు కదూ. ఈ చిత్రానికి అనంత మహదేవన్‌తో పాటు మాధవన్ కూడా దర్శకుడిగా చేయాలనుకున్నారు. అయితే మహదేవన్ తప్పుకోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయి దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
రీల్ సైంటిస్ట్.. రియల్ సైంటిస్ట్
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీ రాజకీయా క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. ఈ లిస్ట్‌లో ఓ సైంటిస్ట్ కూడా చేరబోతున్నాడు.ఆర్ మాధవన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న సినిమా రాకెట్రీ. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మాధవన్ చూపిస్తున్న డెడికేషన్ అందరిని విస్మయానికి గురిచేస్తుంది. ఇప్పటికే తన లుక్కు సంబంధించిన అప్డేట్స్తో ఆకట్టుకుంటున్న మాధవన్ తాజాగా తన ఫైనల్ లుక్‌ను రివీల్ చేశాడు. అచ్చు నంబి నారాయణన్‌లా మారిపోయాడు మాధవన్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. -
సోలో డైరెక్టర్‌గా..
నంబీ నారాయణ్ బయోపిక్కు అనంత్ మహాదేవన్‌తో పాటు ఓ దర్శకుడిగా వ్యవహరిస్తున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు మాధవన్. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కు పూర్తి స్థాయి డైరెక్టర్‌గా వ్యవహరించి సినిమాను పూర్తి చేస్తారట. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్’. ‘‘అనంత్ అద్భుతమైన ఫిల్మ్ మేకర్. కొన్ని అనివార్య కారణలతో దర్శకుడు అనంత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ సినిమాను నేను డైరెక్ట్ చేయనున్నాను’’ అని పేర్కొన్నారు మాధవన్. ఈ సినిమాలో మాధవన్ సరసన సిమ్రాన్ హీరోయిన్గా కనిపించనున్నారు. సమ్మర్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
సైంటిస్ట్‌తో జోడీ
సినిమాల ఎంపికలో కథానాయిక సిమ్రాన్ స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. గతేడాది ‘సీమరాజా’ అనే తమిళ సినిమాలో విలన్‌గా నటించారామె. ఈ ఏడాది రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట’ చిత్రంలో ఒక కథానాయికగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పుడు ఆమె మాధవన్ సరసన నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాధవన్ హీరోగా నటిస్తున్నారు. అనంత్ మహాదేవన్, ఆర్. మాధవన్ దర్శకులు. ఈ సినిమాలో సిమ్రాన్ కథానాయికగా నటించబోతున్నారని తాజా కోలీవుడ్ టాక్. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా సమ్మర్లో విడుదల కానుంది. -
ఆ నలుగురూ ముఖ్యులు
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి పేరున్న నటుడు మాధవన్. ‘బాహుబలి’ ముందు వరకూ అనుష్క దక్షిణాది వరకే పరిమితం. ఆ సినిమా తర్వాత ఉత్తరాదిన కూడా పేరు తెచ్చుకున్నారు. తెలుగమ్మాయి అంజలికి సౌత్‌లో మంచి పేరుంది. ఇక ‘అర్జున్‌రెడ్డి’తో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు షాలినీ పాండే. ఈ నలుగురూ ముఖ్య తారలుగా తెరకెక్కుతున్న చిత్రం మార్చిలో ప్రారంభం కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అమెరికాలో జరిగే షూటింగ్‌తో ప్రారంభం కానుంది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో తీయనున్నామని చిత్రనిర్మాతలు తెలిపారు. అలాగే తెలుగు, తమిళ, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పని చేస్తారు. తొలి క్రాస్ ఓవర్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజులు ముఖ్య పాత్రలు చేస్తారు. కోన వెంకట్, షనిల్ డియో, గోపీ మోహన్, నీరజ కోన, గోపీసుందర్ టెక్నీషియన్లుగా చేయనున్నారు. త్వరలోనే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. మార్చిలో ప్రారంభం అయ్యే ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేస్తామన్నారు. -
అనుష్క సినిమాలో మరో ఇద్దరు భామలు
భాగమతి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క త్వరలో మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బహుభాషా నటుడు మాధవన్ కీలక పాత్రలో నటించనున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తెలుగు, తమిళ, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటీనటులు పనిచేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు అంజలి, షాలిని పాండేలు కూడా నటిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎక్కువగా భాగం విదేశాల్లో షూటింగ్ జరపుకోనున్న ఈ చిత్రం మార్చి నెలలో అమెరికాలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
హాలీవుడ్ టచ్
హారర్ చిత్రం ‘భాగమతి’ తర్వాత ‘సైలెంట్’ అనే మూకీ థ్రిల్లర్‌లో కనిపించనున్నారు అనుష్క. మాధవన్ హీరోగా ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కోన వెంకట్ నిర్మాణంతో పాటు రచయితగానూ వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి. క్రాస్ఓవర్ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. అంటే కేవలం కొంతమంది మన భాష నటులు మిగతా అంతా వేరే భాష నటులు కనిపిస్తారు. ఇందులో హాలీవుడ్ నటుల టచ్ ఎక్కువగానే కనిపించనుంది. ‘కిల్‌బిల్’లాంటి క్లాసిక్ హిట్ చిత్రంలో నటించిన మైఖెల్ మేడ్సన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారట. ‘కిల్ బిల్ ఫస్ట్ పార్ట్’తోపాటు ‘ఫారెస్ట్ ఆఫ్ లివింగ్ డెడ్, ఫ్రీ విల్లీ 2’ చిత్రాల్లో కనిపించారు మైఖెల్. మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ అమెరికాలోనే జరుపుకోనుంది. ఈ చిత్రం కోసం అనుష్క బరువు తగ్గి, కొత్త లుక్‌లో కనిపించనున్నారని కోన వెంకట్ పేర్కొన్నారు. -
కొత్త లుక్‌లో..
ఏడాది కావస్తోంది అనుష్క స్క్రీన్‌పై కనిపించి. ‘భాగమతి’ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. సినిమాల్లోనే కాదు.. బయట కూడా ఎక్కడా కనిపించలేదు. కోన వెంకట్ నిర్మాణంలో రూపొందనున్న సైలెంట్ థ్రిల్లర్ ‘సైలెన్స్’లో నటించడానికి అంగీకరించారు కానీ ఆ చిత్రం షూటింగ్ స్టార్ట్ కావడానికి టైమ్ ఉంది. ఈ సినిమాలో కంప్లీట్ న్యూ లుక్‌లో కనిపించే విషయంపై శ్రద్ధ పెట్టారట అనుష్క. అందుకే మీడియా బయట ఎక్కడా కనిపించడం లేదు. మాధవన్, అనుష్క ముఖ్య పాత్రల్లో ‘వస్తాడు నా రాజు’ చిత్రానికి దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ ఈ సినిమాకు దర్శకుడు. కోన వెంకట్ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ లేటెస్ట్ థ్రిల్లర్ గురించి కోన వెంకట్ మాట్లాడుతూ – ‘‘తెలుగులో రాబోతున్న తొలి క్రాస్ఓవర్ చిత్రం ‘సైలెన్స్’. (మన భాష నటులతో సమానంగా లేదా ఎక్కువ సంఖ్యలో వేరే ప్రాంతం, భాష నటులు సినిమాలో కనిపించడాన్ని క్రాస్ఓవర్ అంటారు). అనుష్క, మాధవన్ మరో ఇద్దరు ప్రముఖ ఆర్టిస్టులు మినహా ఈ సినిమాలో మొత్తం హాలీవుడ్ నటులు కనిపించనున్నారు. ఎక్కువ శాతం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. వచ్చే ఏడాది మార్చిలో షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రం కోసం అనుష్క ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆమె సరికొత్త లుక్ కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది’’ అన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
విలన్‌గా మరో మూవీ.. క్లారిటీ ఇచ్చిన హీరో
హీరోలుగా మంచి ఫాంలో ఉన్న నటులు కూడా ఇటీవల ప్రతినాయక పాత్రల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తాజాగా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు విలన్‌గా పరిచయం అయ్యాడు మాధవన్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాదించకపోయినా మాధవన్ నటనకు మంచి పేరు వచ్చింది. దీంతో మరిన్ని సినిమాల్లో మాధవన్ ప్రతినాయక పాత్రల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో మాధవన్ విలన్‌గా నటిస్తున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై స్పందించిన మాధవన్ తాను రవితేజ సినిమాలో నటించటం లేదని.. ఆ వార్తల్లో నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. -
కొత్త లుక్
ఇస్రోకి (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) చెందిన ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. టైటిల్ రోల్లో మాధవన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మేకోవర్ పనుల్లో బీజీగా ఉన్నారాయన. ఈ మేకోవర్‌కు చెందిన ఓ వీడియోను మాధవన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నా క్యారెక్టర్‌కు చెందిన కొత్త లుక్ కోసం రెడీ అవుతున్నాను. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా అనంత్ మహాదేవన్‌తో పాటు హీరో మాధవన్ కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండటం విశేషం. ఈ చిత్రాన్ని సమ్మర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కాకుండా మాధవన్, అనుష్క ప్రధాన తారలుగా ‘సైలెన్స్’ అనే కొత్త చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. -
మ్యూజికల్ రైడ్
ఈ ఏడాది అరడజను తెలుగు సినిమాలకు సంగీతం అందించి మంచి ఊపు మీద ఉన్నారు మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్. అటు మాలీవుడ్‌లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తున్న గోపీసుందర్ తాజాగా మరో తెలుగు సినిమాకు స్వరాలు సమకూర్చడానికి సిద్ధం అయ్యారు. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్కా, మాధవన్ ప్రధాన పాత్రలుగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘సైలెన్స్’ అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించనున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది యూఎస్‌లో ప్రారంభం కానుంది. ‘‘తెలుగులో ఇప్పటికే గోపీ సుందర్ మంచి సంగీతం అందించారు. ఆయన మా సినిమాకు మ్యూజిక్ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు హ్యాపీ. మంచి మ్యూజికల్ రైడ్‌గా ఉంటుందీ చిత్రం’’ అన్నారు కోన వెంకట్.