
ఆ సినిమాను ప్రశంసించిన శంకర్
చెన్నై: మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ సినిమా సాలా ఖదూస్ పై ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ సినిమా తమిళ వెర్షన్ 'ఇరుది సుట్రు' ను ప్రముఖ దర్శకుడు శంకర్ కొనియాడారు. ఈ సినిమా దర్శకురాలు, నటీనటులు, సంగీత దర్శకుడి పై తన అధికారిక ట్విట్టర్ లో ప్రశంసల జల్లు కురిపించారు.
*మహిళలకు ఒక వందనం ' డైరెక్టర్ సుధ ప్రయత్నం చాలా బావుంది అంటూ ట్విట్ చేశారు. మాధవన్, రితికీ నటన అద్భుతంగా ఉందని, సంతోష్ అందించిన సంగీతం చాలా బావుందంటూ తన సంతోషాన్ని ప్రకటించారు.
కాగా చెన్నైలోని మురికివాడల నుంచి మట్టిలోని ఓ మాణిక్యాన్ని వెలికితీసి, బాక్సింగ్ చాంపియన్‌గా తీర్చిదిద్దిన బాక్సింగ్ కోచ్ జీవితం చుట్టూ నడిచే సినిమా ఇరుది సుట్రు. తెలుగుదర్శకురాలు సుధ కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికై పలు సంచలనాలను నమోదు చేసింది. ఈ సినిమాకోసం భారీగా బరువు తగ్గి హీరో మాధవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు, రియల్ లైఫ్ బాక్సర్ అయిన రితికా సింగ్ మహిళా బాక్సర్ పాత్ర పోషించారు. అటు ఈ సినిమాను తాను చూడాలనుకుంటున్నానంటూ బాక్సింగ్ యోధుడు కూడా మైక్ టైసన్ సోషల్ మీడియాలో ఆసక్తిని ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
"Irudhi suttru" - 'A salute to women'. Great effort by the director Sudha. Superb performance by Rithika n Maddy. Good music by Santhosh.
— Shankar Shanmugham (@shankarshanmugh) February 6, 2016