![Badmaashulu Movie Teaser Launch](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/Badmashulu.jpg.webp?itok=HwpU4Pbi)
మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వంలో బి. బాలకృష్ణ, సి. రామశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు రాగ్ మయూర్ మాట్లాడుతూ– ‘‘బద్మాషులు’ టీజర్ చాలా ఆర్గానిక్‌గా ఉంది. స్వచ్ఛమైన వినోదంతో రూపొందుతోన్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు.
శంకర్ చేగూరి మాట్లాడుతూ– ‘‘టీజర్ జస్ట్ ఒక ఫ్లేవర్ మాత్రమే. సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో లీడ్ రోల్ చేసే చాన్స్ ఇచ్చిన శంకర్‌గారికి కృతజ్ఞతలు. మా చిత్రాన్ని అందరూ స΄ోర్ట్ చేయాలి’’ అన్నారు మహేశ్ చింతల. ‘‘ఈ చిత్రంలో ఆరోగ్యకరమైన వినోదం పండించాం. తప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని విద్యాసాగర్ కారంపురి తెలిపారు. ‘‘నాకు ఈ మూవీ చేసే చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అని కెమేరామేన్ వినీత్ పబ్బతి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment