
‘‘మిస్టర్ రెడ్డి’ మూవీ టీమ్ చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది. దర్శకుడు వెంకట్ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. హీరో, నిర్మాత నరసింహా రెడ్డి యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉన్నారు. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పారు. గోల్డ్ మ్యాన్ రాజా (టి. నరసింహారావు–టీఎన్‌ఆర్) నటించి, నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’.
వెంకట్ వోలాద్రి దర్శకత్వంలో టీఎన్‌ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కి గడ్డం ప్రసాద్, పట్నం సునీతా రెడ్డి, నల్లగొండ గద్దర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గోల్డ్ మ్యాన్ రాజా మాట్లాడుతూ– ‘‘మిస్టర్ రెడ్డి’ టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నా. కొత్తవాళ్లమంతా చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహించాలి. త్వరలో విడుదల కానున్న మా సినిమాని ఆదరించాలి’’ అన్నారు. ‘‘ఈ చిత్రం కోసం మేమంతా కష్టపడి పని చేశాం. ఔట్‌పుట్ బాగా వచ్చింది’’ అని వెంకట్ వోలాద్రి పేర్కొన్నారు. ‘‘మిస్టర్ రెడ్డి’ లాంటి మంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు మహాదేవ్, అనుపమా ప్రకాశ్.
Comments
Please login to add a commentAdd a comment