
కర్ణాటకు చెందిన నటి అభినయ తన చిరకాల ప్రియుడు, సన్నీ వర్మ (వేగేశ్న కార్తీక్)తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో ఏప్రిల్ 16న ఈ వేడుకు ఘనంగా జరిగింది. మార్చి 9న నిశ్చితార్థం జరిగింది. చాలా రోజులుగా ఆమె పెళ్లిపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన వారినే పెళ్లి చేసుకోబుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, అవన్నీ రూమర్స్ వరకే పరిమితం అయ్యాయి. 15 ఏళ్ల పాటు తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సన్నీ వర్మను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ నెల 20న రిసెప్షన్ నిర్వహించనున్నారు
'నేనింతే' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కింగ్, శంభో శివ శంభో వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా 'పని' అనే మలయాళ సినిమాలో ఆమె అద్భుతంగా నటించారని ప్రశంసలు కూడా దక్కాయి. అయితే, అందులో ఒక సీన్‌లో ఆమె బోల్డ్‌గా నటించడంతో దర్శకుడిపై విమర్శలు వచ్చాయి.
👉 : (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)