అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి(Sridevi) గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. బాల తారగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె మూలాలు తమిళనాడులోనే అన్నది తెలిసిందే. తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాలలో బాల తారగా నటించి అందరి మన్ననలను పొందిన శ్రీదేవి ఆ తర్వాత కథానాయకిగా తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో నటించి అగ్ర కథానాయకిగా రాణించారు. అలాంటి శ్రీదేవి వారసురాలుగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) మొదట హిందీలో కథానాయకిగా తెరంగేట్రం చేసిన ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమపైన దృష్టి సారించారు. అలా ఆమె తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటించి ఇక్కడ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు.
తాజాగా మరో స్టార్ హీరో రామ్ చరణ్ సరసన నటించడానికి సిద్ధమవుతున్నారు. దీంతో మరిన్ని అవకాశాలు జాన్వీ కపూర్ వైపు చూస్తున్నాయి. అలా త్వరలోనే కోలీవుడ్‌లో ఎంటర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇక తిరుపతి , తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రం అంటే జాన్వీకి చాలా ఇష్టం. గతంలో తన అమ్మగారు శ్రీదేవి నిత్యం తిరుమల వచ్చేవారు. ఆమె మరణం తర్వాత జాన్వీ ప్రతి ఏడాదిలో శ్రీవారిని నాలుగైదు సార్లు దర్శించుకుంటుంది. ముఖ్యంగా తన తల్లి పుట్టిన రోజు, వర్ధంతి రోజు కచ్చితంగా తిరుమలకి వెళ్లి దైవదర్శనం చేసుకోవడాన్ని ఆనవాయితీగా పెట్టుకుంది. అంతేకాదు ఆ సమయంలో ఈమె తిరుపతి నుంచి కాలినడకన 3550 మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటారు.
ఇటీవల కొత్త ఏడాది ప్రారంభ సమయంలో కూడా జాన్వీ కపూర్ తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల అంటే ఈమెకు ఎంతో ఇష్టమో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు..? డెస్టినేషన్ ప్లేస్ ఏమైనా ఉందా..? అని జాన్వీని ప్రశ్నించారు. తన వద్దకు పెళ్లి ప్రస్తావన రాగానే తాను తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నానని పేర్కొంది. అదేవిధంగా భర్త పిల్లలతో కలిసి తిరుమలలో జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు తన మనసులోని కోరికను బయటపెట్టింది.
నిజంగా ఇదే జరగాలని నేను ఎప్పుడూ కోరుకుంటానని ఆమె తెలిపింది. జాన్వీ మాటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటి తరం హీరోయిన్లు డెస్టినేషన్ పెళ్లి పేరుతో ఇతర దేశాలలో ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ, జాన్వీ మాత్రం తిరుమలలో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో తనలోని ఆధ్యాత్మిక భక్తిని చాటుకుంది.
Comments
Please login to add a commentAdd a comment