Actress Janhvi Kapoor Visits Tirumala On Her Birtday: అలనాటి అందాల తార, దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆదివారం జాన్వీ పుట్టినరోజు కావడంతో తెల్లవారుజామునే స్వామి సేవలో పాల్గొంది. తన స్నేహితురాలితో కలిసి మొక్కులు చెల్లించుకుంది. అచ్చమైన తెలుగమ్మాయిలా చీరకట్టులో కనిపించి ఆకట్టుకుంది. దర్శనానంతరం అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
కాగా జాన్వీ ప్రత్యేకమైన రోజుల్లో తిరుమలను దర్శించుకుంటుంది. ఇటీవలె శ్రీవారిని దర్శించుకున్న ఆమె మరోసారి పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు విచ్చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. థడక్ సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టిన జాన్వీ గుంజన్ సక్సేనా చిత్రంతో హిట్ అందుకుంది. త్వరలోనే తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment