visit
-
రాష్ట్రపతి నిలయం సందర్శించిన యాంకర్ లాస్య మంజునాథ్ (ఫోటోలు)
-
సోమనాథుని సన్నిధిలో ప్రధాని మోదీ పూజలు
గిర్ సోమనాథ్: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయంలో పూజలు చేశారు. సోమనాథ్ క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అంతకుముందు ప్రధాని మోదీ జామ్‌నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమైన ‘వంతారా’ను సందర్శించారు. సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన తర్వాత మోదీ సమీపంలోని జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయమైన సాసన్ చేరుకున్నారు.ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Maha Kumbh Mela) ముగిసిన తర్వాత సోమనాథుణ్ణి పూజించాలనే తన సంకల్పంలో భాగంగా ఈ సందర్శన జరిగిందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. ‘కోట్లాది మంది దేశప్రజల కృషితో ప్రయాగ్‌రాజ్‌లో ‘ఐక్యతా మహాకుంభ్’ విజయవంతమయ్యింది. ఒక భక్తునిగా మహా కుంభమేళా అనంతరం 12 జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగమైన శ్రీ సోమనాథుణ్ణి(The Jyotirlinga of Sri Somanath) పూజించాలని నా మనస్సులో నిశ్చయించుకున్నాను’ అని తెలిపారు. ‘ఈ రోజు సోమనాథుని ఆశీస్సులతో నా సంకల్పం నెరవేరింది. దేశప్రజలందరి తరపున, నేను ఐక్యతా మహా కుంభ్ విజయాన్ని సోమనాథుని పాదాలకు అంకితం చేస్తున్నాను. అలాగే దేశప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం ససాన్లోని 'లయన్ సఫారీ'ని ప్రధానమంత్రి సందర్శించనున్నారు. అలాగే జాతీయ వన్యప్రాణి బోర్డు (ఎన్బీడబ్ల్యూఎల్) సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.ఇది కూడా చదవండి: India Bhutan Train : త్వరలో భారత్-భూటాన్ రైలు.. స్టేషన్లు ఇవే.. -
శ్రీ అమృతేశ్వర ఆలయంలో యాంకర్ సుమ
-
గుజరాత్ చేరుకున్న ప్రధాని మోదీ.. నేడు ’వంతారా’ సందర్శన
జామ్‌నగర్: మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) గుజరాత్ చేరుకున్నారు. శనివారం రాత్రి జామ్‌నగర్ సర్క్యూట్ హౌస్‌లో బస చేసిన ఆయన నేడు (ఆదివారం) రిలయన్స్ ఫౌండేషన్ జంతు రక్షణ, పునరావాస కేంద్రమైన ‘వంతారా’ను సందర్శించనున్నారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా గిర్ జిల్లాలోని ససన్ గిర్ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించి, జంగిల్ సఫారీ చేయనున్నారు. సోమవారం ప్రధాని మోదీ సోమనాథ్ మహాదేవ్ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటనపై గుజరాత్ మంత్రి ములుభాయ్ బేరా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని రాకకు సంబంధించి అన్ని సన్నాహాలు పూర్తి చేశామని, ఆయన జామ్‌నగర్, ద్వారక, గిర్ జిల్లాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరవుతారన్నారు.జంతు సంరక్షణ కేంద్రం సందర్శనఈ రోజు(ఆదివారం) సాయంత్రం ప్రధాని మోదీ జామ్‌నగర్(Jamnagar)లోని ‘వంతారా’ జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించనున్నారు. తరువాత ఆయన ససాన్ చేరుకుంటారు. అక్కడి అటవీ శాఖ కార్యాలయ అతిథి గృహం ‘సింగ్ సదన్’ను సందర్శిస్తారు. అలాగే ఈరోజు జరిగే సోమనాథ్ ట్రస్ట్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.జంగిల్ సఫారీ..మార్చి 3న ప్రధాని గిర్ జాతీయ ఉద్యానవనంలో జంగిల్ సఫారీలో పాల్గొంటారు. అక్కడి నుండి సింగ్ సదన్‌కు చేరుకుని ఎన్బీడబ్ల్యు సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో వన్యప్రాణులకు సంబంధించిన జాతీయ స్థాయి అంశాలపై చర్చించనున్నారు.సోమనాథ్ ఆలయంలో పూజలు అదే రోజున ప్రధాని ససాన్‌లో అటవీశాఖ సిబ్బందితో సంభాషించనున్నారు. తరువాత సోమనాథ్ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అనంతరం సోమనాథ్ నుండి రాజ్‌కోట్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు.ఇది కూడా చదవండి: సునీతా విలియమ్స్ రాకకు సమయం ఆసన్నం -
నేటి నుంచి ప్రధాని మోదీ గుజరాత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఈరోజు (శనివారం) నుంచి మూడు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్నారు. జునాగఢ్ జిల్లాలోని ససాన్‌లో జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు (ఎన్బీడబ్ల్యుఎల్) సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. జామ్‌నగర్‌లోని రిలయన్స్ ఫౌండేషన్ జంతు సంరక్షణ కేంద్రంను సందర్శించనున్నారు. అలాగే సోమనాథ్ ట్రస్ట్ సమావేశంలో కూడా పాల్గొననున్నారు.ప్రధాని మోదీ తన పర్యటనలో ఆదివారం జామ్‌నగర్‌లోని వంటారా జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం జంగిల్ సఫారీ చేయనున్నారు. గుజరాత్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎపీ సింగ్ మాట్లాడుతూ మార్చి ఒకటిన సాయంత్రం ప్రధాని జామ్‌నగర్(Jamnagar) చేరుకుంటారని, రాత్రికి అక్కడి సర్క్యూట్ హౌస్‌లో బస చేస్తారని తెలిపారు. మరుసటి రోజు వంటారా జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తారన్నారు. తరువాత జామ్‌నగర్ నుండి బయలుదేరి సాయంత్రం ససాన్ చేరుకుంటారు. అక్కడ ఆయన సోమనాథ్ ట్రస్ట్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.మార్చి 3న ప్రధాని మోదీ ఆసియా సింహాలకు నిలయమైన గిర్ జాతీయ ఉద్యానవనంలో జంగిల్ సఫారీని ఎంజాయ్ చేయనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయంలో పూజలు చేయనున్నారు. అలాగే అటవీ ఉద్యోగులతో మోదీ సంభాషించనున్నారు. అనంతరం సోమనాథ్ నుండి రాజ్‌కోట్ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి బయలుదేరుతారని సింగ్ తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఉదయాన్నే వర్షం.. వీడని చలిగాలులు -
భర్తతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హన్సిక (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ సినీ ప్రముఖులు (ఫోటోలు)
-
కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఐశ్వర్య రజినీకాంత్ (ఫోటోలు)
-
అమెరికాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
వాషింగ్టన్ డీసీ: ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత అమెరికాను సందర్శించిన కొద్దిమంది ప్రపంచ నేతలలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. Landed in Washington DC a short while ago. Looking forward to meeting @POTUS Donald Trump and building upon the India-USA Comprehensive Global Strategic Partnership. Our nations will keep working closely for the benefit of our people and for a better future for our planet.… pic.twitter.com/dDMun17fPq— Narendra Modi (@narendramodi) February 13, 2025ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య జరిగే సమావేశంలో అనేక ద్వైపాక్షిక అంశాలును చర్చించే అవకాశం ఉంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తున్న సమయంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.‘కొద్దిసేపటి క్రితమే వాషింగ్టన్ డీసీ చేరుకున్నాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసేందుకు,భారత్-యుఎస్ఎ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నాను. ఇరు దేశల ప్రజల ప్రయోజనం కోసం, అత్యుత్తమ భవిష్యత్తు కోసం కలిసి పనిచేయనున్నాం’ అని ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు.#WATCH वाशिंगटन, डीसी: प्रधानमंत्री नरेंद्र मोदी ब्लेयर हाउस पहुंचे। इस दौरान उन्होंने भारतीय समुदाय से मुलाकात की।प्रधानमंत्री मोदी 12-13 फरवरी को अमेरिका के दौरे पर हैं और अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप के साथ बैठक करेंगे।(सोर्स-डीडी/ANI) pic.twitter.com/G7OKQaVGK7— ANI_HindiNews (@AHindinews) February 12, 2025అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌ను కలుసుకున్నారు. అలాగే బ్లెయిర్ హౌస్ చేరుకున్న ప్రధాని ప్రవాస భారతీయులను కలుసుకున్నారు. ప్రధాని ఫిబ్రవరి 12-13 తేదీలలో అమెరికా పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు.ప్రధానిని స్వాగతించడానికి వాషింగ్టన్ డీసీకి తరలివచ్చిన ప్రవాస భారతీయులు ఆయనను చూడగానే ‘వందేమాతరం’,'భారత్ మాతా కీ జై' నినాదాలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికా పర్యటన జరుగుతోంది. అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. #WATCH | Washington, DC: Indian diaspora braves the harsh winters and gathers outside Blair House to welcome Prime Minister Narendra ModiA member of the Indian diaspora says, " ...We have people on crutches, and they have braved this great winter and snow...we are excited to… pic.twitter.com/Uie1b9p3lk— ANI (@ANI) February 12, 2025ఇది కూడా చదవండి: జేడీ వాన్స్ కుమారుని బర్త్‌డే వేడుకలకు ప్రధాని మోదీ -
ఫిబ్రవరిలో అమెరికాకు ప్రధాని మోదీ..!
వాషింగ్టన్:కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోదీ తొలిసారి అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఫిబ్రవరిలో మోదీ అమెరికా వెళ్లే అవకాశాలున్నాయి.ఈ పర్యటనపై ట్రంప్,మోదీ మధ్య ఫోన్లో చర్చ జరిగినట్లు వైట్‌హౌజ్ సోమవారం(జనవరి27) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ, ట్రంప్‌కు ఫోన్ చేసి అభినందించారు.ఈ సందర్భంగా వారిరువురి మధ్య ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే క్వాడ్ సదస్సు కూడా చర్చలో ప్రస్తావనకు వచ్చింది. మిడిల్ ఈస్ట్, యూరప్‌లో ప్రస్తుత పరిస్థితులపైనా ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.కాగా, భారత్ సభ్య దేశంగా ఉన్న బ్రిక్స్ కూటమిలోని దేశాలపై 100 శాతం దిగుమతి సుంకం విధిస్తానని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. దీనికి తోడు ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానంపైన భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
తిరుపతి తొక్కిసలాట - క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫోటోలు)
-
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రేణూ దేశాయ్, యాంకర్ రవి (ఫోటోలు)
-
Rashi Singh: తిరుమల మెట్లు ఎక్కిన హీరోయిన్ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిగ్‌బాస్ ఫేమ్ టేస్టీ తేజ, శోభ శెట్టి (ఫోటోలు)
-
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫొటోలు)
-
ఆస్ట్రేలియాలో భర్తతో విన్యాసాలు.. భయపడిపోయిన సోనాక్షి సిన్హ (ఫోటోలు)
-
కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్నను దర్శించుకున్న బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ (ఫోటోలు)
-
మల్లిఖార్జుని సన్నిధిలో నూతన దంపతులు చై- శోభిత (ఫోటోలు)
-
పులివెందులలో జననేత.. పలకరిస్తూ, యోగక్షేమాలు తెలుసుకుంటూ (ఫొటోలు)
-
రతన్ టాటాను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ
వడోదర: ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని వడోదరలో స్పానిష్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్‌తో కలిసి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) క్యాంపస్‌లో టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాను గుర్తుచేసుకుంటూ రతన్ టాటా ఈ రోజు మన మధ్య ఉండివుంటే, మరింత సంతోషించేవారన్నారు. సీ 295 ఫ్యాక్టరీ కొత్త భారతదేశానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు.టీఏఎస్ఎల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తన స్నేహితుడు పెడ్రో శాంచెజ్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. నేటి నుంచి భారత్, స్పెయిన్ మధ్య భాగస్వామ్యానికి కొత్త దిశానిర్దేశం ఏర్పడనుంది. సీ 295 రవాణా విమానాల తయారీ కోసం ఫ్యాక్టరీని ప్రారంభిస్తున్నాం. ఈ ఫ్యాక్టరీ భారతదేశం- స్పెయిన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ మిషన్‌ను బలోపేతం చేయనుందన్నారు.ఈ సందర్భంగా స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్ మాట్లాడుతూ నేడు మనం ఆధునిక పరిశ్రమను మాత్రమే ప్రారంభించడం లేదని, రెండు ప్రముఖ కంపెనీల మధ్య ఒక అసాధారణ ప్రాజెక్ట్ ప్రారంభమవడాన్ని చూస్తున్నామన్నారు. భారతదేశానికి, ప్రధాని మోదీ విజన్‌కు ఇది మరో విజయం అని అన్నారు. భారతదేశాన్ని పారిశ్రామిక శక్తిగా మార్చడం, పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెంచడంపై మోదీ దృష్టి సారించారన్నారు. ఇది కూడా చదవండి: స్పెయిన్ ప్రధానితో పీఎం మోదీ మెగా రోడ్ షో -
నేడు విజయనగరంలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (గురువారం) విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించనున్నారు. డయేరియా మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటల ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన వారి కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.కాగా, వైఎస్ జగన్ బుధవారం గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించారు. గుంటూరు జీజీహెచ్‌కు చేరుకున్న ఆయన.. టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబసభ్యులను పరామర్శించారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చేరుకున్న వైఎస్ జగన్.. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.ఇదీ చదవండి: చంద్రబాబుకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్ -
ఉద్రిక్తతల నడుమ ఉక్రెయిన్‌కు అమెరికా రక్షణ మంత్రి
కీవ్: రష్యాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్నారు. ఉక్రెయిన్ భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ పర్యటనలో లాయిడ్ ఆస్టిన్ ఉక్రేనియన్ నేతలతో ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొంటారు.I’m back in Ukraine for the fourth time as Secretary of Defense, demonstrating that the United States, alongside the international community, continues to stand by Ukraine. pic.twitter.com/0gCwAqqEpK— Secretary of Defense Lloyd J. Austin III (@SecDef) October 21, 2024తన పర్యటన సందర్భంగా ఆస్టిన్ ఒక ట్విట్టర్ పోస్టులో ‘అంతర్జాతీయ సమాజంతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తుందని తెలియజేయడానికే తాను నాల్గవసారి ఉక్రెయిన్‌కు తిరిగి వచ్చానని’ తెలిపారు. మరోవైపు రక్షణ కార్యదర్శి లాయిడ్ జె. ఆస్టిన్ III ఉక్రెయిన్‌కు చేరుకున్నారని, ఉక్రెయిన్ స్వాతంత్ర్య పోరాటానికి యునైటెడ్ స్టేట్స్ మద్దతును పునరుద్ఘాటించారని పెంటగాన్ ఒక ప్రకటనలో పేర్కొంది. రష్యా దురాక్రమణ నుండి ఉక్రెయిన్‌కు అవసరమైన భద్రతా సహాయాన్ని అందించడానికి యూఎస్ కట్టుబడి ఉందని పెంటగాన్ తెలిపింది. ఇది కూడా చదవండి: యాహ్యా సిన్వార్ మృతి.. హమాస్‌కు చీఫ్ లేనట్లే! -
బ్రిక్స్ సమ్మిట్: రష్యాకు బయలుదేరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రష్యాలో నేడు, రేపు(అక్టోబర్ 22, 23) జరిగే 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలోని కజాన్ నగరానికి తరలివెళ్లారు. రష్యాలో ప్రధాని మోదీ పర్యటన రెండు రోజులపాటు సాగనుంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. #WATCH | PM Narendra Modi leaves from Delhi for Russia to attend the 16th BRICS Summit, being held in Kazan, under the Chairmanship of Russia.The Prime Minister is also expected to hold bilateral meetings with his counterparts from BRICS member countries(Source - ANI/DD) pic.twitter.com/opQmNl6oPR— ANI (@ANI) October 22, 202416వ బ్రిక్స్ సదస్సు ‘సమాన రీతిలో ప్రపంచ అభివృద్ధి- భద్రత కోసం బహుపాక్షికతను బలోపేతం చేయడం’ అనే అంశంపై జరగనుంది. కాగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ వ్యవస్థాపక సభ్యులతో పాటు కొత్త సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అక్టోబరు 22న సమ్మిట్ ప్రారంభం కానున్నదని, తొలిరోజు సాయంత్రం నేతలకు విందు ఉంటుందన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో 23న ఉదయం క్లోజ్డ్ ప్లీనరీ, మధ్యాహ్నం ఓపెన్ ప్లీనరీ సెషన్ ఉంటుంది.#WATCH | Russia: Visuals from Kazan; billboards put up by Indian diaspora to welcome PM ModiPrime Minister Narendra Modi will visit Russia from 22-23 October 2024 at the invitation of Russian President Vladimir Putin, to attend the 16th BRICS Summit, which is being held in… pic.twitter.com/N5WHOl3Xrq— ANI (@ANI) October 21, 2024బ్రిక్స్ సదస్సుకు ముందు భారత్, చైనాల మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. 2020 నుంచి కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే దిశగా ముందడుగు పడింది. రెండు దేశాల మధ్య సైనిక, దౌత్య స్థాయిలో కసరత్తుల తర్వాత, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)పై పెట్రోలింగ్, సైనిక ఉద్రిక్తతను తగ్గించడానికి ఒప్పందం కుదిరింది.#WATCH | Russia: Visuals from Kazan, ahead of the BRICS summit 2024Prime Minister Narendra Modi will visit Russia from 22-23 October at the invitation of Russian President Vladimir Putin, to attend the 16th BRICS Summit, which is being held in Kazan, under the Chairmanship of… pic.twitter.com/fCKdFdT87B— ANI (@ANI) October 21, 2024ఇదిలా ఉండగా ప్రధాని మోదీ పర్యటనకు ముందు కజాన్‌లోని భారత కమ్యూనిటీకి చెందినవారు ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న దృశ్యాలు వెలికివచ్చాయి. బ్రిక్స్ గ్రూపులో 2010 నుండి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. తాజాగా ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఎఈ) దీనిలో చేరాయి.ఇది కూడా చదవండి: పాక్ సుప్రీం సీజే పదవీ కాలం ఇక మూడేళ్లే -
ట్రంప్ ‘మెక్‌డొనాల్డ్’ షోపై భారీ ట్రోలింగ్
న్యూయార్క్:అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆదివారం(అక్టోబర్ 20) పెన్సిల్వేనియాలోని మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లో సందడి చేశారు. అక్కడికి వచ్చిన కస్టమర్లకు ఫ్రెంచ్ ఫ్రైస్ వండి స్వయంగా వడ్డించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.POS Trump Staged the entire thing.The McDonalds was CLOSED.The “supposed customers” were vetted before drive thru He thinks we won’t notice Trump is the GOAT BALL LICKERThe People's President is Kamala pic.twitter.com/Q6txxKRDET— Larry (@SocratesBigBird) October 20, 2024ఈ దుమారానికి కారణం ట్రంప్ వెళ్లిన మెక్‌డొనాల్డ్ అవుట్లెట్ మేనేజర్ ఆదేశాలు బయటికి పొక్కడం. ఆదివారం సాయంత్రం 4 గంటల దాకా అవుట్లెట్ మూసి ఉంటుందని మేనేజర్ ఆదేశాల సారాంశం. ట్రంప్ రాకకు వీలుగా అవుట్‌లెట్‌ను మూసివేసినట్లు తెలుస్తోంది. మేనేజర్ ఆదేశాల కాపీ సోషల్ మీడియా వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. మెక్‌డొనాల్డ్‌లో జరిగింది కేవలం షో అని, సహజంగా జరిగింది కాదని డెమొక్రాట్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇదీ చదవండి: మెక్‌డొనాల్డ్‌లో ఫ్రెంచ్‌ఫ్రైస్ చేసిన ట్రంప్ -
రెండు రోజుల లావోస్ పర్యటనకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: 21వ ఆసియాన్-ఇండియా, 19వ తూర్పు ఆసియా సదస్సులలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం లావోస్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ లావోస్ పర్యటన ఆసియాన్ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ తన పర్యటన సందర్భంగా పేర్కొన్నారు.పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ లావోస్‌తో భారతదేశానికి సన్నిహిత సాంస్కృతిక, నాగరికత సంబంధాలు ఉన్నాయని ప్రధాని అన్నారు. లావోస్ ప్రధాని సోనెక్సా సిఫనాడోన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం వియంటియాన్ చేరుకోనున్నారు. అక్కడ జరిగే 21వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 19వ తూర్పు ఆసియా సదస్సులలో ప్రధాని పాల్గొంటారు.విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జైదీప్ మజుందార్ మాట్లాడుతూ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని హాజరుకావడం ఇది 10వ సారని తెలిపారు. ప్రధాని మోదీ, సిపాండన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం ఉంటుందని మజుందార్ తెలిపారు. సాంస్కృతిక ప్రదేశాల పునరుద్ధరణ, విద్యుత్ ప్రాజెక్టులు తదితర అనేక అంశాలపై చర్చజరగనున్నదని తెలిపారు. మయన్మార్‌లో కొనసాగుతున్న సంఘర్షణలపై ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ పర్యటలో చర్చించనున్నారని మజుందార్ తెలిపారు. ఇది కూడా చదవండి: డాలస్‌లో ఘనంగా 'గాంధీ శాంతి నడక-2024' -
శరన్నవరాత్రులకు వజ్రేశ్వరి దేవి ముస్తాబు
థానే: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేశంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలలో వజ్రేశ్వరి దేవి ఆలయం ఒకటి. నవరాత్రులలో ఈ అమ్మవారిని దర్శించుకుంటే సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని భక్తులు నమ్ముతారు. వజ్రేశ్వరి దేవి ఆలయం మహారాష్ట్రలోని వజ్రేశ్వరిలో ఉంది. ఈ నగరం ముంబైకి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని చిమాజీ అప్పా పేష్వా నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయాన్ని పోర్చుగీస్ వారు ధ్వంసం చేశారని చరిత్రకారులు అంటుంటారు. పిడుగుపాటు నుండి మాతా వజ్రేశ్వరి దేవి ప్రత్యక్షమై పలువురు రాక్షసులను అంతం చేసిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో వజ్రేశ్వరి దేవితో పాటు రేణుకా మాత, కాళికా మాత, మహాలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి.వజ్రేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో ఒక వేడి నీటి చెరువు ఉంది. దీనిలో స్నానం చేస్తే అనేక వ్యాధులు నయమవుతాయని స్థానికులు చెబుతుంటారు. నవరాత్రులలో ఇక్కడికి వచ్చే భక్తులు ఈ చెరువులో స్నానం చేసి, అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయ సౌందర్యం నవరాత్రులలో మరింత శోభాయమానంగా మారుతుంది. వజ్రేశ్వరిదేవి ఆలయానికి చేరుకోవాలంటే 52 మెట్లు ఎక్కాలి. నవరాత్రుల సమయంలో ఈ మెట్లను వేల రకాల పూలు, దీపాలతో అందంగా అలంకరిస్తారు.నవరాత్రులలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. సాయంత్రం హారతి సమయంలో ప్రాంగణం అత్యంత రద్దీగా మారుతుంది. వజ్రేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకోవాలంటే ముందుగా ముంబైకి చేరుకుని, అక్కడి నుంచి టాక్సీ సాయంతో ఆలయానికి రావచ్చు. మహారాష్ట్రలోని థానే నగరం నుండి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇది కూడా చదవండి: గయతో పాటు ఈ ప్రాంతాల్లోనూ పిండ ప్రదానాలు -
కంప్లీట్ టూర్ : రిషికేశ్, రుద్రాక్షలు స్పెషల్
అక్టోబర్ వస్తోంది. దసరా సెలవులు వస్తాయి. కాలేజ్, ఉద్యోగం స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం ఎటైనా టూర్‌కెళ్తే బావుణ్ననిపిస్తుంది. ఈ సీజన్లో మనదేశంలో ఏ ప్లేస్ బెస్ట్ అంటే ముందు రిషికేశ్ని గుర్తు చేసుకోవాలి. రిషికేశ్ టూర్ అంటే అట్లా ఇట్లా ఉండదు. ఒక అడ్వెంచరస్ టూర్, ఒక తీర్థయాత్ర, ఒక హనీమూన్ వెకేషన్, ఓ తథాత్మ్యత... అన్నీ కలిపిన తీర్థం, క్షేత్రం ఇది. గంగోత్రి నుంచి గంగానది కొండ వాలుల మధ్య ప్రవహిస్తూ నేల మీదకు వచ్చే వరకు ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటుంది. గంగోత్రి నుంచి రిషికేశ్కు 250 కిమీల దూరం ఉంటుంది. రిషికేశ్ పట్టణం సముద్రమట్టానికి పదకొండు వందల నుంచి పదిహేడు వందల అడుగుల ఎత్తులో విస్తరించి ఉంది. రిషికేశ్ వరకు గంగానది ఎక్కువ వెడల్పు లేకుండాపాయలాగ వేగంగా ప్రవహిస్తూ ఆకాశం నుంచి దూకుతున్నట్లే ఉంటుంది. అక్కడి నుంచి పాతిక కిలోమీటర్ల దూరాన ఉన్న హరిద్వార్ వరకు ప్రవాహం విశాలమవుతూ, పరుగు వేగం తగ్గుతుంటుంది. గంగానది కలుషితం కావడం హరిద్వార్ దగ్గర నుంచే మొదలవుతుంది. కాబట్టి అంతకంటే పైన రిషికేశ్ దగ్గర గంగాస్నానం చేయాలనుకుంటారు ఎక్కువ మంది. యువత అయితే గంగానదితోపాటు ఒక్క ఉదుటున భూమ్మీదకు దూకడం కోసం రిషికేశ్కు ఇరవై కిలోమీటర్ల పైకి వెళ్లి అక్కడి నుంచి రాఫ్టింగ్ మొదలు పెడతారు. రిషికేశ్‌లో రివర్‌రాఫ్టింగ్ నిర్వహించే సంస్థలు ప్రతి వీధిలోనూ కనిపిస్తాయి. బంగీ జంప్, ఫ్లయింగ్ పాక్స్ కూడా చేయవచ్చు. నగరం ఎంత ఇరుకుగా ఉంటుందో నది తీరాన గుడారాల్లో క్యాంపింగ్ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ కార్పొరేట్ విద్యాసంస్థలు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో కనిపిస్తాయి.లక్ష్మణ్ ఝాలాగంగానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరడానికి సస్పెన్షన్ బ్రిడ్జి ఉంది. దాని పేరు లక్ష్మణ్ ఝాలా. రామాయణ కాలంలో రాముడు, లక్ష్మణుడు, సీత కొంతకాలం ఇక్కడ నివసించారని చెబుతారు. సీత నది దాటడం కోసం లక్ష్మణుడు అడవి చెట్ల తీగలతో వంతెనను అల్లాడని, దాని పేరే లక్ష్మణ్ ఝాలా అని చెబుతారు. రిషికేశ్కు మరికొంత దూరంలో రామ్ ఝాలా ఉంది. అది రాముడు అల్లిన తీగల వంతెన. ఈ రెండు వంతెనలు నది దాటడానికి అనువుగా ఉండేవి. కాలక్రమంలో ఆ వంతెనల స్థానంలోనే ఇనుప వంతెనలు నిర్మాణం జరిగింది. పర్యాటకులు లక్ష్మణ్ ఝాలా మీద నుంచి అవతలి తీరానికి చేరి అక్కడి నుంచి పడవలో విహరిస్తూ ఇవతలి ఒడ్డుకు రావచ్చు. పడవలో మెల్లగా సాగుతూ ఒక ఒడ్డున మనుషులను, మరో ఒడ్డునున్న ఎత్తైన కొండలను, కొండవాలులో, నది తీరాన ఉన్న నిర్మాణాలను చూస్తూ ఉంటే ఒక్కసారిగా తుళ్లింతలతో యువకులు రివర్ రాఫ్టింగ్ చేస్తూ దూసుకొస్తారు. నదిలో బోట్ షికార్ టికెట్ల మీద ప్రభుత్వ నిఘా పెద్దగా ఉండదు. ప్రైవేట్ బోట్ల వాళ్లు ఒక్క ట్రిప్‌కి వేలల్లో అడుగుతారు. పెద్ద బోట్లలో వెళ్లడమే శ్రేయస్కరం. గంగ పరవళ్లు తొక్కుతుంటుంది. చిన్న పిల్లలతో వెళ్లిన వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.యోగా క్యాపిటల్రిషికేశ్, హరిద్వార్ రెండూ నేషనల్ హెరిటేజ్ సిటీలు. కేరళలో ఉన్నట్లే ఆయుర్వేద వైద్యం, పంచకర్మ చికిత్స కేంద్రాలుంటాయి. హిమాలయాల నుంచి సేకరించిన ఔషధ మొక్కలతో వైద్యం చేస్తారు. రిషికేశ్‌లో ఏటా యోగా, మెడిటేషన్ సెషన్లు జరుగుతాయి. భారత ప్రధాని కూడా రిషికేశ్ పర్యటన సందర్భంగా పట్టణంలోని ఒక గుహలో ధ్యానం చేశారు. భవబంధాలను వదిలి మోక్షసాధన కోసం జీవితంలో అంత్యకాలాన్ని ఇక్కడ గడపడానికి వచ్చేవాళ్లు కూడా ఉంటారు. రోజూ సాయంత్రం గంగాహారతి కనువిందు చేస్తుంది. నది మధ్యలో ధ్యానముద్రలో ఉన్న ఈశ్వరుని విగ్రహాన్ని చూడడానికి దగ్గరకు వెళ్లడం కంటే ఒడ్డున ఘాట్ నుంచి చూస్తేనే శిల్పసౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతాం. ఉత్తరాఖండ్ వర్షాకాలం వరదల బారిన పడుతుంటుంది. కానీ ఆ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు టూరిజమే. కాబట్టి సీజన్ వచ్చే సరికి టూరిస్టుల కోసం సిద్ధమైపోతుంది. అన్నట్లు ఈ టూర్ గుర్తుగా రుద్రాక్ష తెచ్చుకోవడం మర్చిపోవద్దు. మన దగ్గర జామచెట్లు ఉన్నట్లు ఎక్కడ చూసినా రుద్రాక్ష చెట్లే. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించే అద్భుతాలు మనవే!
ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు గుర్తింపునిచ్చే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌లో అత్యధికంగా భారతీయ సందర్శనీయ స్థలాలే ఉన్నాయి. దీనికి కారణం ప్రపంచంలో అతి ఎక్కువ మంది సందర్శిస్తున్న దర్శనీయ స్థలాలలో ఈ ప్రాచీన వారసత్వ సంపద ప్రముఖంగా నిలిచాయి.ఖజరహో శిల్పాలుదేశంలోనేకాదు ప్రపంచంలోనే ఎన్ని చారిత్రక కట్టడాలు ఉన్నా ఖజరహో శిల్పకళకు మరేదీ సాటిరాదని మరోసారి రుజువైంది. మధ్య ప్రదేశ్ ఛత్తర్పూర్ జిల్లాలో కొలువై ఉన్న ఖజరహోను ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించే కళా వైభవం గల స్థలంగా పేరొందింది. శిల్ప సోయగాలతో ఆకట్టుకునే ఖజరహో గ్రూప్ ఆప్ మాన్యుమెంట్స్ గురించి కళ్లారా చూడాల్సిందే తప్ప ఒక్క మాటలో వివరించలేం. అలాంటి ఖజరహో శిల్పాలతో పాటు బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్, సాంచీ అండ్ రాక్స్ షెల్టర్స్ ఆఫ్ భీమ్బెట్కా కూడా ఈ జాబితాలో ఉన్నాయి.ఎల్లోరా గుహలుమహారాష్ట్రాలోని ఎల్లోరా, అజంతా, ఎలిఫెంటా గుహలు, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌తో పాటు విక్టోరియన్ అండ్ ఆర్ట్ డెకో కూడా ఈ జాబితాలో ఉన్నాయి.నేషనల్పార్క్పింక్ సిటీగా పేరొందిన జైపూర్ సిటీ, రాజస్థాన్ హిల్ ఫోర్ట్స్, కొలడియో నేషనల్పార్క్. జంతర్ మంతర్‌ను ప్రపంచంలో ఎక్కువ మంది సందర్శించిన స్థలాలుగా పేరొందాయి. వెన్నెల దీపంయునెస్కో హెరిటేజ్ సైట్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సందర్శించిన జాబితాలో నాల్గవ స్థానంలో తాజమహల్. దీంతో పాటు ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ ఉన్నాయి.రాణీకి వావ్గుజరాత్లోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌లో రాణీ కి వావ్, ది హిస్టోరిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ అండ్ చంపనీర్–పవగడ్, ఆర్కియలాజికల్ పార్క్ లు ఉన్నాయి. -
నేడు హనుమాన్ ఆలయానికి సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయన జైలు నుంచి బయటకు రాగానే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారులలో ఉత్సాహం కనిపించింది. వర్షంలో తడుస్తూనే వారంతా కేజ్రీవాల్‌కు స్వాగతం పలికారు.సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12 గంటలకు హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆయనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా హాజరుకానున్నారు. సీఎం హనుమాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, పూజలు చేయనున్నారు.శుక్రవారం భారీ వర్షం కురుస్తున్నప్పటికీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు స్వాగతం పలికేందుకు తీహార్ జైలు వెలుపల అభిమానులు గుమిగూడారు. కేజ్రీవాల్‌కు ఆప్ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. డప్పుల దరువులు, నృత్యాలు, కేజ్రీవాల్‌కు మద్దతుగా పలికే నినాదాల మధ్య ఆ ప్రాంతమంతా ఉత్సాహంతో నిండిపోయింది. కేజ్రీవాల్‌కు మద్దతుగా పలు నినాదాలతో కూడిన పోస్టర్లు, బ్యానర్లను అభిమానులు ప్రదర్శించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా పార్టీ సీనియర్ నేతలు తదితరులు సీఎం కేజ్రీవాల్‌కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.ఇది కూడా చదవండి: ఆ కూడలికి భగత్ సింగ్ పేరు పెట్టండి: పాక్ కోర్టు -
కృష్ణలంకలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
ఉడుపిలో ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఈ ట్రిప్ చాలా స్పెషల్ (ఫొటోలు)
-
23 నుంచి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా పర్యటన
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 23 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆహ్వానం మేరకు ఆయన అమెరికా పయనమవుతున్నారు. రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 26 వరకు అమెరికాలోనే ఉండనున్నారు.ఈ పర్యటనలో రాజ్‌నాథ్ సింగ్ అమెరికా రక్షణ మంత్రితో సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుని జాతీయ భద్రతా వ్యవహారాల సహాయకుడు జేక్ సుల్విన్తో కూడా రక్షణ మంత్రి భేటీ కానున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేస్తుందని భావిస్తున్నారు. అమెరికా రక్షణ పరిశ్రమతో రక్షణ మంత్రి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. Defence Minister Rajnath Singh will be undertaking an official visit to the United States from August 23 to 26, on the invitation of the US Secretary of Defence Lloyd Austin. During the visit, the Raksha Mantri will hold a bilateral meeting with his US counterpart Secretary… pic.twitter.com/YV3vzUQrTw— ANI (@ANI) August 21, 2024 -
Raksha Bandhan 2024: కజిన్స్‌తో బెస్ట్ పర్యాటక ప్రదేశాలివే..! (ఫోటోలు)
-
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని మోదీ సందర్శించారు. అక్కడ సాగుతున్న సహాయక చర్యలు, బాధితుల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.#WATCH | Kerala: Prime Minister Narendra Modi visits the landslide-affected area in Wayanad. He is being briefed about the evacuation efforts. Governor Arif Mohammed Khan and Union Minister Suresh Gopi are also present. (Source: DD News) pic.twitter.com/rANSwzCcVz— ANI (@ANI) August 10, 2024 కేరళలో కొండచరియలు విరిగిపడి వందల మంది ప్రాణాలు కోల్పోయిన వయనాడ్ ప్రాంతంలో ప్రధాని మోదీ శనివారం(ఆగస్టు10) పర్యటిస్తున్నారు. పర్యటన కోసం కేరళలోని కన్నూర్ విమానాశ్రయానికి ఉదయం 11గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని చేరుకున్నారు. ఇక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్లో వయనాడ్ వెళ్లి ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని పరిశీలించారు. Kerala: Prime Minister Narendra Modi arrives at Kannur Airport; received by Governor Arif Mohammed Khan and CM Pinarayi VijayanPM Modi will visit Wayanad to review relief and rehabilitation efforts(Pics source: CMO) pic.twitter.com/sfbP5lm0HU— ANI (@ANI) August 10, 2024 -
10న ప్రధాని మోదీ వయనాడ్ సందర్శన
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10న కేరళలోని వయనాడ్‌లో పర్యటించనున్నారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. కేరళలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10న వయనాడ్‌లో పర్యటించనున్నారు. గతంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్‌లో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం కేరళలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.ఉత్తర కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో 10వ రోజు(గురువారం) కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న అవశేషాలను వెలికితీసేందుకు పెద్ద సంఖ్యలో స్నిఫర్ డాగ్‌లను మోహరించారు. ఐఎఎఫ్ హెలికాప్టర్లు చలియార్ నది వెంబడి ప్రాంతాలలో ప్రత్యేక శోధన బృందాలను ల్యాండ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలోని బాధితులకు తాత్కాలిక పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. పునరావాసం మూడు దశల్లో జరుగుతుందని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. -
ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపే ప్రదేశాలు..
-
ఉక్రెయిన్‌కు భారత ప్రధాని మోదీ
వచ్చే నెల (ఆగస్టు)లో ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. 2022లో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించబోవడం ఇదే తొలిసారి.ప్రధాని మోదీ ఇటీవలే రష్యా పర్యటన నుంచి తిరిగి వచ్చారు. ప్రధాని ఉక్రెయిన్ పర్యటన ఖరారైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆగస్టు 23న ఆయన ఉక్రెయిన్‌లో పర్యటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ ప్రధాని మోదీతో టెలిఫోన్లో సంభాషిస్తూ, తమ దేశాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.గత నెలలో ఇటలీలో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా కూడా ఈ ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ తాజా పరిస్థితులపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఇటీవలే రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. -
తిరుమలలో టాలీవుడ్ నిర్మాత సురేశ్ బాబు, తమన్, గోపిచంద్ మలినేని (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ సెలబ్రిటీలు (ఫొటోలు)
-
త్వరలో ప్రధాని మోదీ రష్యా పర్యటన.. షెడ్యూల్ ఖరారు
సాక్షి,న్యూఢిల్లీ : ఐదేళ్లు సుదీర్ఘ కాలం తర్వాత ప్రధాని మోదీ.. రష్యాలో పర్యటించనున్నారు. జులై 8,9 ఈ రెండు రోజుల పాటు రష్యాలో జరిగే భారత్-రష్యాల 22వ వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అభివృద్దిపై చర్చ జరగనుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.రష్యా పర్యటన అనంతరం మోదీ ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనతో 40ఏళ్ల చరిత్రలో భారత ప్రధాని తొలిసారి సందర్శించిన ఘనత దక్కనుంది.మోదీ చివరి సారిగా 2019లో రష్యా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో వ్లాడివోస్టోక్ నగరంలో నిర్వహించిన ఎకనమిక్స్ కంక్లేవ్‌లో పాల్గొన్నారు. తాజాగా మరోసారి రష్యాలో సందర్శించనున్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెటర్లు (ఫోటోలు)
-
కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శించుకున్న స్టార్ క్రికెటర్ స్మృతి మందాన (ఫొటోలు)
-
తిరుమలలో కొత్త గెటప్‌లో టాలీవుడ్ నటి హేమ (ఫోటోలు)
-
త్వరలో కొడుకు పెళ్లి.. కాశీలో సందడి చేసిన 'నీతా అంబానీ' (ఫొటోలు)
-
శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు..స్పెషల్ అట్రాక్షన్‌గా శ్రీలీల (ఫొటోలు)
-
వైష్ణోదేవి దర్శనానికి వందేభారత్... ఖర్చెంత?
వైష్ణో దేవి భక్తులకు ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. ఇకపై అమ్మవారి దర్శనాన్ని వందేభారత్ రైలు ద్వారా చేసుకోవచ్చని తెలిపింది. ఇది లగ్జరీ రైలు కావడంతో ప్రయాణికులకు పలు సౌకర్యాలు అందనున్నాయి. దీనిలో ప్రయాణించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా, ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు.వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీ నుండి ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కట్రాకు చేరుతుంది. అదే ఇతర రైలు అయితే ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి కట్రాకు సాయంత్రం ఆరు గంటలకు చేరుతుంది. అయితే ఈ మార్గంలో ప్రయాణించే వందే భారత్ ఛార్జీలు మిగిలిన రైళ్ల ఛార్జీల కంటే కొంచెం అధికం.ఢిల్లీ నుండి మాతా వైష్ణో దేవి కట్రా స్టేషన్‌కు ఇతర రైళ్ల టిక్కెట్ రూ. 990 వరకూ ఉంటుంది. అయితే వందే భారత్ చైర్ కార్లో రూ. 1610 టిక్కెట్‌తో కట్రాకు చేరుకోవచ్చు. ఎకనామిక్ చైర్ క్లాస్‌లో వెళితే ఒక్కో ప్రయాణికునికి రూ. 3005 చెల్లించాల్సి ఉంటుంది. వందే భారత్ రైలులో టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు సమీపంలోని రైల్వే స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లి సంప్రదించవచ్చు. లేదా ఆన్లైన్, ఆఫ్లైన్లలోనూ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)
-
Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)
-
రాష్ట్రపతి భవనంలో గదులెన్ని? లోపల ఏ విద్యాలయం ఉంది?
ఢిల్లీలోని రాష్ట్రపతి భవనానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ భవనం దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని నిర్మాణం 1912లో ప్రారంభమై, 1929లో పూర్తయింది. ప్రముఖ వాస్తుశిల్పి ఎడ్విన్ లుటియన్స్ ఈ భవనానికి రూపకల్పన చేశారు.రాష్ట్రపతి భవనంలో 340 గదులు ఉన్నాయి. ఈ గదులలో హిమాలయ బెడ్రూమ్ అద్భుతమైన లగ్జరీ బెడ్రూమ్గా గుర్తింపు పొందింది. లోపల ఒక పాఠశాల కూడా ఉంది. దీనిని తొలుత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయ అని పిలిచేవారు. ఇది 1946లో నిర్మితమయ్యింది. 1962లో కేంద్ర ప్రభుత్వం ఈ పాఠశాలను ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకి తెచ్చింది.2019లో ఢిల్లీ ప్రభుత్వం దీనిని కేంద్రీయ విద్యాలయంగా మార్చింది. నాటి నుండి దీనిని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయం అని పిలుస్తున్నారు. మిగిలిన కేంద్రీయ విద్యాలయాల మాదిరిగానే రాష్ట్రపతి భవనంలోని కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. -
Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
-
ఎండలు బాబోయ్.. ఇక్కడికి చెక్కేద్దామా!
-
Samyuktha Menon: తిరుమలలో విరూపాక్ష హీరోయిన్.. కాలినడకన స్వామివారి దర్శనం(ఫోటోలు)
-
శ్రీరామ నవమికి అయోధ్య వెళ్తున్నారా?.. వీటినీ సందర్శించండి!
అయోధ్యలో నూతన రామాలయం నిర్మితమయ్యాక భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. దేశవిదేశాల నుంచి కూడా భక్తులు శ్రీరాముని జన్మస్థలికి తరలివస్తున్నారు. ఏప్రిల్ 17న అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్యలో నూతన రామాలయంతో పాటు తప్పక సందర్శించాల్సిన మరికొన్ని స్థలాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1. హనుమాన్‌గర్హి అయోధ్యలో పురాతన సిద్ధపీఠం హనుమాన్‌గర్హి ఆలయం ఉంది. రామాలయాన్ని దర్శించుకునే ముందు భక్తులు హనుమాన్‌గర్హికి వెళ్లాలని స్థానికులు చెబుతుంటారు. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు హనుమాన్గర్హిని సందర్శిస్తారు. 2. కనక్ భవన్ త్రేతా యుగంలో పట్టపు రాణి కైకేయి.. సీతామాతకు ఈ రాజభవనాన్ని కానుకగా ఇచ్చారని చెబుతారు. కనక్భవన్లో శ్రీరామునితో పాటు సీతామాత, శ్రీరాముని నలుగురు సోదరుల విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. సీతారాముల దర్శనం, పూజల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కనక్ భవన్‌కు తరలివస్తుంటారు. 3. దశరథ్ మహల్ దశరథ్ మహల్ కూడా అత్యంత పురాతనమైనది. త్రేతా యుగానికి చెందినదని చెబుతారు. దశరథ మహారాజు ఈ రాజభవనంలో ఉండేవాడట. దరశరథుని కుటుంబమంతా ఈ ప్యాలెస్‌లో కనిపిస్తుంది. 4. నాగేశ్వర్ నాథ్ ఆలయం శ్రీరాముని కుమారుడైన కుశుడు నిర్మించిన నాగేశ్వర్ నాథ్ ఆలయం రామ్ కి పాడిలో ఉంది. శ్రావణమాసంలోను, శివరాత్రి సందర్భంగానూ లక్షలాది మంది భక్తులు నాగేశ్వర్ నాథ్ ఆలయానికి తరలివస్తుంటారు. 5. బహు బేగం సమాధి బహు బేగం సమాధి కూడా అయోధ్యలోనే ఉంది. పర్యాటకులు కుటుంబ సమేతంగా ఇక్కడి అందమైన పూల తోటకు వచ్చి సేద తీరుతారు. 6. సూర్య కుండ్ త్రేతా యుగంలో శ్రీరాముడు లంకను జయించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు, అయోధ్యవాసులతో పాటు దేవతలు ఆయనకు స్వాగతం పలికారు. ఆ సమయంలో సూర్యభగవానుడు కూడా ఒక నెలరోజుల పాటు అయోధ్యలో ఉన్నాడట. దీనికి గుర్తుగానే సూర్యకుండ్ నేటికీ ఇక్కడ కనిపిస్తుంది. ఇది దర్శన్ నగర్లో ఉంది. లేజర్ షో ద్వారా శ్రీరాముని కథను ఇక్కడ ప్రదర్శిస్తారు. 7. రామ్ కి పాడి రామ్ కి పాడిని అయోధ్యకు కేంద్ర బిందువుగా చెబుతారు. ఇక్కడ రామాయణాన్ని లేజర్ షో ద్వారా ప్రదర్శిస్తారు. ఈ ప్రదేశంలో దీపాల పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు రామ్ కి పాడికి తరలివస్తారు. ఇక్కడి సరయూమాతను పూజిస్తారు. 8. సరయూ తీరం పెద్ద సంఖ్యలో భక్తులు సరయూ తీరాన్ని చూసేందుకు తరలి వస్తుంటారు. సరయూ నది ఒడ్డున స్నానం చేయడం ద్వారా పాపాల నుండి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతుంటారు. 9. గుప్తర్ ఘాట్ గుప్తర్ ఘాట్ కూడా సరయూ నది ఒడ్డున ఉంది. ఈ ఘాట్ మీదుగానే శ్రీ రాముడు తన నివాసానికి వెళ్లేవాడని చెబుతుంటారు. గుప్తర్ ఘాట్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. -
ఎన్నికలయ్యాక రామ్‌లల్లా సన్నిధికి లాలూ
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైన తరువాత ఈ నెలలో తొలిసారిగా శ్రీరామ నవమి వేడుకలు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇదిలావుండగా రానున్న ఎన్నికల్లో బీజేపీకి రామాలయ అంశం కలిసివచ్చేదిగా కనిపిస్తోంది. దీంతో ఇతర పార్టీల నేతలు కూడా అయోధ్య రామాలయంవైపు దృష్టి సారిస్తున్నారు. తాజాగా బీహార్‌లోని పాటలీపుత్ర ఎంపీ మిసా భారతి మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు తాను కూడా త్వరలో అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించనున్నానని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నామని, ఎన్నికల అనంతరం రామాలయానికి వెళ్తామన్నారు. కాగా బీహార్ సీఎం నితీష్ కుమార్.. ప్రధాని మోదీ పాదాలను తాకడంపై మిసా భారతి మాట్లాడుతూ అది మన సంస్కృతి అని అన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రద్ధా దాస్.. కారణం ఇదే (ఫోటోలు)
-
Ekta-Anita: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉదయ్ కిరణ్ హీరోయిన్ (ఫొటోలు)
-
పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న రామ్ చరణ్ దంపతులు (ఫొటోలు)
-
త్వరలో పంటల పరిశీలనకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. సాగునీరు అందక భూగర్భ జలవనరులు కూడా అడుగంటిన పరిస్థితిలో రైతులతో ప్రత్యక్షంగా భేటీ కావాలని కేసీఆర్ భావిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్య టనలో భాగంగా భువనగిరి, ఆలేరు నియోజక వర్గాల్లో పంట పొలాలను పరిశీలించి రైతులతో భేటీ అవుతారు. ఏప్రిల్ మొదటి వారంలో కేసీఆర్ పర్యటన ఉంటుందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధులకు సూచనప్రా యంగా చెప్పారు. అత్యధికంగా బోర్లు వేసి నష్టపో యిన ముషంపల్లి నుంచి ఈ పర్యటన ప్రారంభమయ్యేలా కేసీఆర్ పర్యటన షెడ్యూలు ఉండే అవకాశముంది. కేసీఆర్ పర్యటన షెడ్యూ ల్‌తోపాటు రూట్‌మ్యాప్ ఖరారు చేసే బాధ్యతను జగదీశ్‌రెడ్డికి అప్పగించారు. మొదలైన లోక్‌సభ నియోజకవర్గ భేటీలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారైన నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా మంగళవారం భేటీలు ప్రారంభమయ్యాయి. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నేతలతో సోమవారం రాత్రి మాజీ మంత్రి హరీశ్‌రావు నివాసంలో కీలక భేటీ జరగ్గా, మంగళవారం ఉదయం సికింద్రాబాద్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. నల్లగొండ నియోజకవర్గ నేతల సమన్వయ భేటీ కూడా జగదీశ్‌రెడ్డి నివాసంలో మంగళవారం రాత్రి జరిగింది. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో బుధవారం తెలంగాణ భవన్లో భేటీ జరగనుంది. ఈ భేటీకి కేటీఆర్ హాజరవుతారు. ఇదిలాఉంటే మెదక్, చేవెళ్ల, పెద్దపల్లి తదితర లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోనూ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. -
Mrunal Thakur Photos: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న సీతారామం హీరోయిన్ (ఫోటోలు)
-
భూటాన్‌లో ప్రధానికి ఘనస్వాగతం
న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శుక్రవారం(మార్చ్ 22) ఉదయం భూటాన్ వెళ్లారు. ప్రధానికి భూటాన్‌లోని పారో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆ దేశ ప్రధాని షెరిగ్ టోబ్గే ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్‌తో ద్వైపాక్షిక సంబంధాల విషయమై ప్రధాని చర్చలు జరుపుతారు. భూటాన్ రాజుతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. గత వారమే భూటాన్ ప్రధాని భారత్‌లో ఐదు రోజుల పాటు పర్యటించి వెళ్లారు. నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింంది. భూటాన్‌తో భారత్ సంబంధాలు విశిష్టమైనవని తెలిపింది. కాగా, భూటాన్‌లో షెరిగ్ టోబ్గే ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరింది. ఇదీ చదవండి.. ప్రధాని మోదీ చెప్పినా నిర్ణయం మారదు -
నేడు జగిత్యాలకు ప్రధాని మోదీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ జగిత్యాలకు రానున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా సోమవారం జగిత్యాలలోని గీతా విద్యాలయ మైదానంలో విజయ సంకల్పసభ పేరుతో నిర్వహించతలపెట్టిన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రతా ఏర్పాట్లను నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్సీజీ)తోపాటు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. సభ బందోబస్తుకు 1,600 మందికిపైగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే హెలికాప్టర్ల ల్యాండింగ్ ట్రయల్స్, కాన్వాయ్ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించారు. మైదాన పరిసరాలను పూర్తిగా ఎన్ఎస్జీ బలగాలు తమ అ«దీనంలోకి తీసుకున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, పీఎఫ్ఐ, ఐఎస్ఐ తదితర ఉగ్రవాద సానుభూతిపరులకు పట్టున్న ప్రాంతం కావడంతో కేంద్ర, రాష్ట్ర అధికారులు భద్రత విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. అయితే జగిత్యాల విజయసంకల్ప సభకు వర్షం గండం పొంచి ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, 30–40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) ఆదివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వర్షం, ఈదురుగాలుల హెచ్చరిక నేపథ్యంలో అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్, కాన్వాయ్ మూమెంట్ విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యామ్నాయాలు సిద్ధం చేశారు. -
'గామి'తో సక్సెస్ కొట్టిన విశ్వక్ సేన్.. మూవీటీమ్‌తో తిరుమలలో సందడి (ఫోటోలు)
-
రేపు వైఎస్సార్ జిల్లాలో సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11వ తేదీన వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. సీఎం జగన్ 11వ తేదీ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. ముందుగా డాక్టర్ వైఎస్సార్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బనాన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌కు చేరుకుని ప్రారంభిస్తారు. అనంతరం డాక్టర్ వైఎస్సార్ జంక్షన్‌కు వెళ్లి ప్రారంభిస్తారు. అక్కడే సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభించిన తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్‌కు చేరుకుని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గాంధీ జంక్షన్‌కు చేరుకుని ప్రారంభించిన అనంతరం డాక్టర్ వైఎస్సార్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకుని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్–1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సంయూ గ్లాస్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ మెమోరియల్ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు. -
నేడు భారీ సొరంగాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మితమైన పొడవైన సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దేశానికి అంకితం చేయనున్నారు. ఈ సొరంగం 13 వేల అడుగుల ఎత్తులో నిర్మితమయ్యింది. ఈ డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్ అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమింగ్- తవాంగ్ జిల్లాలను కలుపుతుంది. భారత్‌ను చైనా భూభాగంతో విభజించే వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కి చేరుకోవడానికి ఈ సొరంగమే ఏకైక మార్గం. దీనితో పాటు ఇటానగర్‌లో 20కి పైగా ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్లలో రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం తేజ్‌పూర్ చేరుకున్న ప్రధానికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి కజిరంగా నేషనల్ పార్క్‌కు ప్రధాని చేరుకున్నారు. రాత్రి విశ్రాంతి అనంతరం (ఈరోజు)శనివారం ఉదయం కజిరంగా అభయారణ్యాన్ని సందర్శిస్తారు. అనంతరం ప్రధాని ఇటానగర్‌కు వెళతారు. ప్రముఖ అహోం యోధుడు లచిత్ బోర్ఫుకాన్ 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని శనివారం హోలోంగథర్లో ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. దీనికి 'శౌర్య విగ్రహం' అని పేరు పెట్టారు. జోర్హాట్లోని మెలాంగ్ మెటెల్లి పొతార్లో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. వర్చువల్ మాధ్యమం ద్వారా 18 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అసోంలో రూ. 768 కోట్ల వ్యయంతో డిగ్బోయ్ రిఫైనరీ విస్తరణ కోసం గౌహతిలో ఐఓసీఎల్‌కు చెందిన బెత్కుచి టెర్మినల్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. -
Janhvi Kapoor : పుట్టిన రోజు ప్రియుడితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
నేడు ‘విజన్ విశాఖ’.. పాల్గొననున్న సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం/కొమ్మాది: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇందుకోసం మంగళవారం ఉదయం 9.10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. రాడిసన్ బ్లూలో నిర్వహిస్తున్న ‘విజన్..విశాఖ’ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ‘భవిత’ పేరుతో చేపట్టిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేస్తారు. అనంతరం విశాఖ నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, కలెక్టర్ మల్లికార్జున, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ ప్రవీణ్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ సోమవారం పరిశీలించారు. రాష్ట్ర భవిష్యత్తు.. విశాఖ మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ విశాఖ నగరమేనని చెప్పారు. రాష్ట్రానికి విశాఖ గ్రోత్ ఇంజిన్ వంటిదన్నారు. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనేది సీఎం జగన్ ఆలోచన అని పేర్కొన్నారు. మంగళవారం రాడిసన్ బ్లూలో నిర్వహిస్తున్న ‘విజన్.. విశాఖ’ సదస్సులో సీఎం జగన్ పాల్గొని దాదాపు 2 వేల మంది పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమవుతారని తెలిపారు. గతంలో విశాఖ వేదికగా జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఒప్పందాల మేరకు అనేక పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చాయని వివరించారు. వాటిలో పలు పరిశ్రమలు ఇప్పటికే పనులు ప్రారంభించాయని పేర్కొన్నారు. ఎన్టీపీసీ రూ.లక్ష కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు ముందుకు వచి్చందన్నారు. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుతో పాటు ఫార్మా రంగంలో ఈ ప్రాంతానికి వస్తున్న పెట్టుబడుల గురించి పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ వివరిస్తారని తెలిపారు. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాయని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలను సీఎం జగన్ సదస్సులో వివరిస్తారని తెలిపారు. అలాగే గ్రేటర్ విశాఖ పరిధిలోని రూ.1,500 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేస్తారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ముడసర్లోవలో జీవీఎంసీ నూతన భవన నిర్మాణానికి, రూ.10 కోట్లతో టర్టెల్ బీచ్ ఏర్పాటుకు, వెంకోజీపాలెం నుంచి మారియట్ హోటల్ వరకు నిరి్మంచనున్న డబుల్ రోడ్డుకు, మధురవాడకు కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఏర్పాటు చేయనున్న వాటర్ సప్లై ప్రాజెక్టుకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రూ.98 కోట్లతో అభివృద్ధి చేసిన ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను సీఎం వర్చువల్‌గా ప్రారంభిస్తారని చెప్పారు. సచివాలయంపైనా తప్పుడు రాతలు సచివాలయ భవనాన్ని తాకట్టు పెట్టారంటూ కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాశాయని మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. ఈ తప్పుడు వార్తలపై ప్రభుత్వం ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తుందన్నారు. చంద్రబాబు హయాంలో సీఆర్డీఏ తీసుకున్న అప్పు తప్ప.. ఈ ప్రభుత్వం కొత్తగా అప్పు తీసుకోలేదని స్పష్టం చేశారు. విశాఖ అభివృద్ధి చెందకూడదనే దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు కేసులు పెట్టాయని మండిపడ్డారు. అయినా ముఖ్యమంత్రి జగన్ విశాఖను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారన్నారు. -
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భావోద్వేగం!
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదాయపు పన్ను శాఖ నూతన భవనాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. అనంతరం ఆమె గీతా ప్రెస్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సమయంలో ఆమె లీలా చిత్ర మందిర్ ఫోటో గ్యాలరీని చూసి, తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ తాతయ్య ఇంట్లో భక్త సూరదాస్తో పాటు బాలుని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడి చిత్రం ఉండేదని గుర్తు చేసుకున్నారు. అలాగే అక్కడి గ్యాలరీలోని పెయింటింగ్‌లను చూసి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. తన చిన్నతనంలో తన దగ్గర గీతా ప్రెస్‌కు చెందిన ఒక పుస్తకం ఉండేదని పేర్కొన్నారు. అదే సమయంలో ఆమె ఆరు అంగుళాల వ్యాసం కలిగిన చేతితో రాసిన గీతను లెన్స్ సహాయంతో చదివాక, ఇది ప్రత్యేకమైన కళాఖండమని పేర్కొన్నారు. ఆమె తమిళం, మలయాళంలో ముద్రితమైన శివపురాణం పుస్తకాన్ని కూడా చూశారు. గీతా ప్రెస్ చూశాక తన చిరకాల వాంఛ నెరవేరిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
నెల రోజుల్లో బాలరాముణ్ణి ఎందరు దర్శించుకున్నారు?
అయోధ్యలో రామమందిరం ప్రారంభమై నెల రోజులు గడిచింది. జనవరి 22న బాలరాముడు గర్భగుడిలో కొలువయ్యాడు. అయోధ్యకు రామభక్తుల ప్రవాహం నిరంతరం కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షలాది మంది రామభక్తులు తమ ఆరాధ్య దైవాన్ని సందర్శించుకుంటున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు అంటే జనవరి 22 నుండి ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల మంది రామభక్తులు రామ్‌లల్లాను దర్శించుకున్నారు. ఆలయం ప్రారంభమైన మొదటి 10 రోజుల్లో 25 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించుకున్నారు. గడచిన నెల రోజుల్లో వివిధ పార్టీల నేతలే కాకుండా బాలీవుడ్ తారలు కూడా ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫిబ్రవరి 11న దాదాపు 300 మంది శాసనసభ సభ్యులతో కలిసి రామమందిరాన్ని సందర్శించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా తన మంత్రివర్గంతో కలిసి బాలరాముణ్ణి దర్శించుకున్నారు. -
అయోధ్యకు సీమా హైదర్ పాదయాత్ర.. సీఎంకు అభ్యర్థన!
అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను దర్శించేందుకు సీమా హైదర్ పాదయాత్ర చేపట్టాలని సంకల్పించింది. ఇందుకోసం ఆమె ఉత్తరప్రదేశ్ సీఎం యోగి నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. యూపీకి చెందిన సచిన్‌పై ప్రేమతో పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్ తాను హిందూ ధర్మాన్ని అమితంగా గౌరవిస్తానని తెలిపింది. సీమా హైదర్ తాను కృష్ణ భక్తురాలిని చెప్పుకుంటుంది. ఫిబ్రవరి 14న ఆమె సుందరకాండ పఠిస్తూ వీడియోలో కనిపించింది. ఈ వీడిలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీమా హైదర్ తాను హిందువుగా మారినట్లు తెలిపింది. పాకిస్థాన్‌లో ఉన్నప్పడు కూడా తాను హిందువుల పండుగలను రహస్యంగా జరుపుకునేదానినని అమె వెల్లడించింది. సోషల్ మీడియాలో సీమాహైదర్‌కు అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో నేపాల్ మీదుగా అక్రమంగా భారతదేశానికి తరలివచ్చింది. ఆమె ప్రస్తుతం నోయిడాలో సచిన్‌తో కలిసి ఉంటోంది. కాలినడకన అయోధ్యకు వెళ్లాలనుకుంటున్న సీమా హైదర్ ఇందుకోసం యోగి ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది. సీమా హైదర్ భారత పౌరసత్వం కోసం ఆమె తరపు లాయర్ ప్రయత్నిస్తున్నారు. సీమ అయోధ్యకు వెళ్లేందుకు చట్టపరమైన ప్రక్రియ త్వరలో పూర్తి కానున్నదని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. కుటుంబ సభ్యులందరితో కలిసి రామ్‌లల్లా దర్శనానికి వెళ్లాలనుకుంటున్నట్లు సీమా మీడియాకు తెలిపింది. గ్రేటర్ నోయిడాలోని రబుపురా గ్రామం నుంచి అయోధ్య వరకు దాదాపు 645 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాలనుకుంటున్నట్లు ఆమె తెలిపింది. -
‘అహ్లాన్ మోదీ’కి 65 వేల రిజిస్ట్రేషన్లు
మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోదీకి అపరిమితమైన ఆదరణ ఉంది. యూఏఈలో జరగబోయే ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏకంగా 65 వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఫిబ్రవరి 13న అంటే నేడు (మంగళవారం) యూఏఈలో జరిగే ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇండియన్ పీపుల్ ఫోరమ్ ప్రెసిడెంట్, ‘అహ్లాన్ మోదీ’ ఇనిషియేటివ్ హెడ్ జితేంద్ర వైద్య ఈ ఈవెంట్ గురించి మీడియాకు తెలిపారు. ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమమని, ప్రవాస భారతీయుల కమ్యూనిటీ దీనికి సకల ఏర్పాట్లు చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 65 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అంతకుమించి జనం వస్తే, వసతి కల్పించలేమని, అందుకే రిజిస్ట్రేషన్లు ఇక నిలిపివేయాల్సి వచ్చిందని యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 13నుంచి ప్రారంభమయ్యే తన పర్యటనలో యూఏఈ, ఖతార్‌లోని ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. యూఏఈలో నిర్మితమైన హిందూ దేవాలయాన్ని 14న ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐదు వేల మంది భక్తులు హాజరుకానున్నరని అంచనా. 2015 తర్వాత ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించడం ఇది ఏడోసారి. -
నేడు సర్కారు మేడిగడ్డ టూర్!
సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు నేడు(మంగళవారం) కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. ఈ మేరకు సర్కారు ఏర్పాట్లు చేసింది. గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు లోపభూయిష్టమని.. ఈ విషయాన్ని చూపేందుకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను మేడిగడ్డకు తీసుకెళతామని నాలుగు రోజుల కింద సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఉదయం 10.15 గంటలకు సీఎం రేవంత్‌తోపాటు మంత్రులు ఉత్తమ్, వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లనున్నారు. సీఎం, మంత్రులు వస్తున్న నేపథ్యంలో.. బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సందర్శన తర్వాత సభ? సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధుల పర్యటన సందర్భంగా మేడిగడ్డ వద్ద అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. బ్యారేజీని పరిశీలించేందుకు వీలుగా.. బ్యారేజీ దిగువన, గోదావరి తీరానికి వెళ్లే మార్గాలను సిద్ధం చేస్తున్నారు. వ్యూపాయింట్ ప్రాంగణం వద్ద 3 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యారేజీ నిర్మాణ లోపాలు, ఇతర అంశాలపై ఇక్కడ సభ నిర్వహించి, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. మేడిగడ్డ టూర్ షెడ్యూల్ ఇలా.. సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మంగళవారం ఉదయం 10.15 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. మధ్యాహ్నం మూడున్నర గంటల కల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల వరకు బ్యారేజీని పరిశీలించి, నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సీఎం రేవంత్, మంత్రులు మీడియాతో మాట్లాడుతారు. రాత్రి 7 గంటలకు మేడిగడ్డ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. కేసీఆర్ మేడిగడ్డకు రావాలి: ఉత్తమ్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాత (ఆర్కిటెక్ట్) కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు రావాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా ప్రాజెక్టులు, బోర్డుకు అప్పగింత అంశంపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని (బీఆర్ఎస్ మద్దతుతో) ఆమోదించిన విషయాన్ని గమనించాలని కోరారు. సోమవారం అసెంబ్లీ వాయిదాపడ్డాక లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశం మొదలవుతుందని.. మేడిగడ్డ పర్యటన నిమిత్తం సభను వాయిదా వేసి, బయలుదేరుతామని వివరించారు. -
మాఘ పౌర్ణమి వేళ.. వారణాసికి మోదీ
ఫిబ్రవరి 24న మాఘ పౌర్ణమి.. ఆరోజున ప్రధాని నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. అలాగే గోవర్ధన్‌లో సంత్ రివిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతోపాటు ఆలయ అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ.50 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆలయ నిర్వాహకులు ప్రధాని మోదీకి ఆహ్వానం పంపారు. మోదీ పర్యటన ఇంకా ఖరారు కానప్పటికీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి కాశీకి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ పంచగంగా ఘాట్ వద్దనున్న బిందుమాధవ్ ఆలయాన్ని దర్శించే అవకాశాలున్నాయి. శైవ-వైష్ణవ ఐక్యతకు పునాదిగా నిలిచే ఈ ఆలయం విస్తరణ, అభివృద్ధి దిశగా ప్రధాని యోచిస్తున్నారని సమాచారం. -
నేడు ప్రధాని మోదీ ఒడిశా పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు(శనివారం) ఒడిశాలో పర్యటించనున్నారు. పశ్చిమ ఒడిశాలోని సంబల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ రూ.68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా వేదిక చుట్టూ డ్రోన్ కెమెరాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం ఝార్సుగూడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:15 గంటలకు సంబల్పూర్ వెళతారు. జగదీష్పూర్-హల్దియా, బొకారో-ధమ్రా పైప్‌లైన్ ప్రాజెక్ట్ (జెహెచ్‌బీడీపీఎల్)లోని 412 కిలోమీటర్ల పొడవైన ధమ్రా అంగుల్ పైప్‌లైన్ సెక్షన్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధాన మంత్రి ఊర్జా గంగ కింద రూ.2,450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఒడిశాను జాతీయ గ్యాస్ గ్రిడ్‌తో అనుసంధానిస్తుంది. అదేవిధంగా ముంబై-నాగ్‌పూర్-ఝార్సుగూడ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లోని నాగ్‌పూర్-జార్సుగూడ సహజ వాయువు పైప్‌లైన్ సెక్షన్‌కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 2,660 కోట్లకు పైగా ఖర్చు కానుంది. దీంతో ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో సహజవాయువు లభ్యత మెరుగుపడనుంది. అలాగే దాదాపు రూ. 28,980 కోట్ల విలువైన పలు విద్యుత్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. -
తిరుమల శ్రీవారి సేవలో స్నేహా రెడ్డి.. సోషల్ మీడియాలో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. తన పిల్లలు అయాన్, అర్హలతో ఉన్న ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె ఒక్కరే తిరుమలకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ కనిపించనుంది. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తిరుమలలో ప్రగతి, నందిని రెడ్డి స్నేహారెడ్డితో పాటు తిరుమలలో డైరెక్టర్ నందిని, నటి ప్రగతి కూడా కనిపించారు. వీరికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Allu Arjun Wife Sneha Reddy: శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి!https://t.co/jc53pf3pku#AlluArjun #allusnehareddy #SnehaReddy #tirumala #TTD #MovieNews #LatestNews #TeluguNews #SakshiNews #TrendingNews #LatestNewsToday #Trending — Sakshi (@sakshinews) January 29, 2024 -
రిపబ్లిక్ డే పరేడ్‌ను ప్రత్యక్షంగా చూడాలంటే..
దేశ రాజధాని ఢిల్లీలో రేపు (శుక్రవారం) గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దేశ ప్రజలు ఈ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘కర్తవ్య పథ్’లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే రీతిలో పలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను తిలకించాలనే ఆసక్తి కలిగినవారి కోసం ఈ వివరాలు.. పరేడ్ జరిగే సమయం రిపబ్లిక్ డే పరేడ్ జనవరి 26న ఉదయం 10:30 గంటలకు విజయ్ చౌక్ నుండి కర్తవ్య పథ్ వరకు సాగుతుంది. ఈ పరేడ్‌ను 77 వేల మంది కూర్చుని తిలకించవచ్చు. ఇందుకు ఏర్పాటు చేసిన కుర్చీలలో 42 వేల సీట్లను సాధారణ పౌరులకు కేటాయించారు. ఇది కూడా చదవండి: ‘కర్తవ్య పథ్’లోనే గణతంత్ర దినోత్సవాలు ఎందుకు? గణతంత్ర దినోత్సవ థీమ్ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ధీమ్ ‘వీక్షిత్ భారత్’,‘భారత్ - లోక్తంత్ర కి మాతృక’. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశ పాత్రను నొక్కి చెబుతుంది. ముఖ్య అతిథి ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన ముందుగా జనవరి 25న జైపూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అదే రోజున రాష్ట్రపతిని, ప్రధాని నరేంద్ర మోదీని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కలుసుకోనున్నారు. అనంతరం రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. జనవరి 26న ఆయన రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ఏర్పాటు చేసే ‘ఎట్ హోమ్’ రిసెప్షన్‌కు హాజరవుతారు. పరేడ్ టిక్కెట్ ధర ఎంత? ఎలా తీసుకోవాలి? రిపబ్లిక్ డే పరేడ్ టిక్కెట్లు రిజర్వ్డ్, అన్‌రిజర్వ్‌డ్‌గా ఉంటాయి. అన్రిజర్వ్డ్ సీట్లకు రూ. 500, రూ. 100 రూ. 20 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఈ టిక్కెట్లను ఎలా కొనుగోలు చేయాలంటే.. 1) రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 2) పేరు, ఈ- మెయిల్ ఐడీ, చిరునామా, మొబైల్ నంబర్ మొదలైన వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. మీ రిజిస్టర్డ్ కాంటాక్ట్ నంబర్లో వచ్చిన ఓటీపీని తెలియజేయడం ద్వారా మీ గుర్తింపును ధృవీకరించాల్సి ఉంటుంది. 3) పరేడ్‌లో ఎఫ్డీఆర్ రిపబ్లిక్ డే పరేడ్, రిపబ్లిక్ డే పరేడ్, బీటింగ్ ది రిట్రీట్ ఈవెంట్లు ఉంటాయి. దీనిలో టిక్కెట్ కొనుగోలుదారు తనకు కావలసిన ఈవెంట్‌ను ఎంచుకోవచ్చు. 4) టిక్కెట్ కొనుగోలుదారు తన ధృవీకరణ కోసం పేరు, చిరునామా, వయస్సు, లింగం, ఫోటో ఐడీ (డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్) జెరాక్స్ కాపీని సమర్పించాలి. 5) కొనుగోలు చేయాలనుకుంటున్న టిక్కెట్ల సంఖ్యను ఎంచుకోవాలి. టిక్కెట్ల వర్గం ప్రకారం చార్జీలను చెల్లించాలి. 6) టిక్కెట్ల చార్జీలను చెల్లించిన తర్వాత క్యూఆర్ కోడ్‌తో పాటు బుకింగ్ వివరాలు కలిగిన నిర్ధారణ ఇమెయిల్, ఎస్ఎంఎస్ అందుతుంది. 7) ఈ-టికెట్ హార్డ్ కాపీని అందుకున్నాక, టిక్కెట్ కొనుగోలుదారు తన ఒరిజినల్ ఫోటో. ఐడీలను పరేడ్‌లకు వెళ్లేటప్పుడు వెంట తీసుకువెళ్లాలి. వేదిక ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ప్రవేశం పొందవచ్చు. -
రేపు హైదరాబాద్‌కు ఖర్గే
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. పార్టీకి చెందిన పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే సమావేశంలో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పోలింగ్ బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, ఈ సమావేశం ఏర్పాట్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సమీక్షించారు. తన నివాసంలో మహేశ్‌తో సమావేశమైన రేవంత్ కార్యక్రమ ఏర్పాట్లు జరుగుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్స్ అందరూ సమావేశానికి హాజరు కావాలని ఈ సందర్భంగా రేవంత్ పిలుపునిచ్చారు. సీఎంను కలిసిన సలహాదారులు, ఎమ్మెల్సీలు కాగా, కొత్తగా నియమితులైన సలహాదారులు, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, ఇద్దరు ఎమ్మెల్సీలు మంగళవారం సీఎం రేవంత్‌ను కలిశారు. సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, హర్కర వేణుగోపాల్‌రావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవితో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్లు జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని సీఎం రేవంత్ అభినందించారు. అదే విధంగా దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం పట్ల సలహాదారులు, ఎమ్మెల్సీలు సీఎం రేవంత్‌కు అభినందనలు తెలిపారు. -
అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి?
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దీని తరువాత అంటే జనవరి 23 నుంచి అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. మరి అయోధ్యకు ఎలా వెళ్లాలి? అక్కడ రోజూ జరిగే పూజలేమిటి? రామాలయం సందర్శనలో ఎటువంటి విధివిధానాలు ఆచరించాలి? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. రైలు మార్గం రైలు మార్గం ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునేవారు దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా అయోధ్యకు చేరుకోవచ్చు. న్యూ ఢిల్లీ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకుంటే దాదాపు 10 గంటలపైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునేవారు సికింద్రాబాద్ నుంచి రైలులో గోరఖ్ పూర్ వెళ్లాలి. అక్కడి నుంచి అయోధ్యకు రైలు లేదా బస్సు ద్వారా అయోధ్యకు చేరుకోవచ్చు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు సికింద్రా బాద్ నుంచి గోరఖ్ పూర్‌కు వెళ్లే రైలు అందుబాటులో ఉంది. ఈ రైలులో 30 గంటల పాటు ప్రయాణం చేయాలి. ఇదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీదర్ అయోధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రతి సోమ, ఆదివారాలలో అందుబాటులో ఉంది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునే వారు ప్రతి శుక్ర, ఆది, సోమ వారాల్లో రైలు ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గం అయోధ్యకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో 40 గంటల ప్రయాణం అనంతరం ఢిల్లీకి చేరుకుంటారు. ఏసీ బస్సులో ఒకరికి టికెట్ ధర రూ. 6 వేలు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలనుకునే వారు నాగపూర్, జబల్ పూర్, ప్రయాగ్‌రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే మొత్తం 1305 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాలి. కాగా అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం సికింద్రా బాద్ నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. విమానయాన సంస్థలు కూడా స్పెషల్ ఫ్లైట్స్ ను నడిపేందుకు సిద్ధమయ్యాయి. విమానయానం విమానాల ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునే రామ భక్తులు హైదరాబాద్ శంశాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అయోధ్యకు నేరుగా వెళ్లేందుకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దీంతో శంశాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ, లేదా గోరఖ్ పూర్, లక్నో విమానాశ్రయాలకు చేరుకుని, అక్కడి నుంచి 140 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు బస్సు లేదా రైలులో ప్రయాణించే చేరుకోవచ్చు. దర్శనం ఎలా? అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్సైట్లో మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్‌తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియతో దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. ఆఫ్‌లైన్‌లో.. ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు పొందాలనుకున్నప్పుడు ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్‌తో పాటు ఐడీప్రూప్ ప్రూఫ్‌ను వెంట తీసుకువెళ్లాలి. సంప్రదాయ దుస్తులలో.. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్‌ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి రావాలి. పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా.. మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించి శ్రీరాముని దర్శనానికి రావచ్చు. అయోధ్యలో నిత్యపూజలు అయోధ్య రామాలయంలో బాలరామునికి రోజుకు ఐదుసార్లు హారతులు ఇవ్వనున్నారు. అయితే భక్తులు మూడు హారతులను మాత్రమే దర్శించుకోగలుగుతారు. ఈ హారతులు ఉదయం 6:30 గంటలకు, మధ్యాహ్నం 12:00 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు నిర్వహిస్తారు. ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6 నుండి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ఇది కూడా చదవండి: ప్రాణ ప్రతిష్ఠను ‘ప్రత్యక్షం’గా చూడటమెలా? -
Ekta Kapoor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ (ఫోటోలు)
-
PM Modi Sri Satyasai Tour: నేడు సత్యసాయి జిల్లాకు ప్రధాని మోదీ
శ్రీసత్యసాయి, సాక్షి: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు శ్రీసత్యసాయి జిల్లాకు రానున్నారు. పెనుకొండ నియోజకవర్గంలో పాలసముద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ (నాసిన్)ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపుతో.. రూ.541 కోట్ల అంచనాలతో ఈ నాసిన్ ఏర్పాటు కాబోతోంది. జిల్లాలోని గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మాణం పూర్తి చేశారు. ఐఏఎస్‌లకు ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్ తరహాలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్)కు ఎంపికైనవారికి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అన్నీ లోపలే.. శిక్షణ పొందేవారికి అన్ని అవసరాలు లోపలే తీర్చేవిధంగా నిర్మాణాలు జరిగాయి. అంతేకాదు ఆవరణలోనే సోలార్ సిస్టం కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. శిక్షణలో భాగంగా అవసరమైన విమానాన్ని తీసుకొచ్చారు. నాసిన్ కోసం ప్రత్యేక రైల్వేలైన్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాసిన్ సిబ్బంది పిల్లల విద్య కోసం సమీపంలోనే కేంద్రీయ విద్యాలయం మంజూరు చేశారు. ఇందుకోసం కావాల్సిన స్థలాన్ని రెవెన్యూశాఖ గుర్తించింది. మరోవైపు ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు. గవర్నర్, సీఎం హాజరు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మంగళవారం ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతోపాటు రక్షణ బలగాలు అక్కడికి చేరుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.30 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 2.30 గంటలకు నాసిన్ కేంద్రానికి వెళ్తారు. ముఖ్యమంత్రి 5.30 గంటలకు తాడేపల్లికి తిరుగు పయనం అవుతారు.మరోవైపు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌నజీర్ బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో నాసిన్ కేంద్రానికి చేరుకుంటారు. పీఎం పర్యటన ఇలా.. ప్రధానమంత్రి మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో పాలసముద్రం సమీపంలోని నాసిన్ కేంద్రానికి చేరుతారు. ప్రధాని సాయంత్రం 5.15 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో పుట్టపర్తి చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఈ పర్యటనలోనే.. లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించే అవకాశం ఉంది. ఇక ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి పర్యటన పురస్కరించుకుని పుట్టపర్తి విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు పోలీసు యంత్రాంగం చేపట్టారు. -
16న శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని పర్యటన
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం ప్రధాని పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌ను సందర్శిస్తారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటనకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. ప్రధాన మంత్రి పర్యటనలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రధాని పర్యటనకు పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని డీజీపీకి చెప్పారు. భద్రత, రవాణా, వసతి, వైద్యసేవలు వంటివి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి జిల్లా యంత్రాంగం తరఫున పాస్‌లు జారీ చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. ఈ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తొలుత జీఏడీ ముఖ్య కార్యదర్శి ఆర్.ముత్యాలరాజు శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఐబీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్, ఐ అండ్ పీఆర్ జేడీ పి.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు, ఎస్పీ మాధవరెడ్డి, ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, డీఎంఈ డాక్టర్ నరసింహం, ఐ అండ్ పీఆర్ జేడీ కస్తూరి, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ డి.మురళి వర్చువల్‌గా హాజరయ్యారు. ప్రధాని పర్యటన ఇలా 16న మధ్యాహ్నం ప్రధాని మోదీ పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌లోని యాంటీక్యూస్ స్మగ్లింగ్ స్టడీ సెంటర్‌ను, నార్కోటిక్స్ స్టడీ సెంటర్‌ను సందర్శిస్తారు. తర్వాత వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎక్స్– రే, బ్యాగేజ్ స్క్రీనింగ్ కేంద్రాన్ని సందర్శిస్తారు. తదుపరి అకాడమీ బ్లాకు వద్ద రుద్రాక్ష మొక్కలు నాటి, అక్కడ భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడతారు. వారితో గ్రూప్ ఫొటో దిగుతారు. అనంతరం 74, 75వ బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో ముఖాముఖిలో పాల్గొంటారు. తదుపరి పబ్లిక్ ఫంక్షన్లో ‘ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అకాడమీ కేంద్రానికి అక్రెడిటేషన్ సర్టిఫికెట్‌ను అందిస్తారు. ఆ తర్వాత జరిగే సభలో ప్రసంగించిన అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళతారు. -
పొత్తుల తక్కెడ.. బాబుతో పవన్ తాడోపేడో? (ఫొటోలు)
-
చెక్కేద్దామా.. అందమైన లోకానికి! (ఫోటోలు)
-
Chota K. Naidu: కుటుంబంతో తిరుమల శ్రీవారిని సందర్శించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ (ఫోటోలు)
-
Surekha-Supritha Visit Tirupati Temple: 2024లో తిరుపతికి ప్రముఖ నటి ఫస్ట్ ట్రిప్ (ఫోటోలు)
-
అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ..
రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌తో పాటు ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారు. అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ ఒక ట్వీట్ చేశారు. తాను ఈ రెండు రోజులు వైబ్రంట్ గుజరాత్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నానని, ఈ శిఖరాగ్ర సదస్సులో పలువురు ప్రపంచ నేతలు పాల్గొనడం సంతోషకరమని అన్నారు. తన సోదరుడు మహమ్మద్ బిన్ జాయెద్ రాక ప్రత్యేకమైనదని, వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌తో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. ఈ వేదిక గుజరాత్ అభివృద్ధికి ఎంతో దోహదపడింది. దీని ద్వారా చాలా మందికి అవకాశాలను సృష్టించినందుకు సంతోషిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతలతో సమావేశమవుతారని విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాన గ్లోబల్ కార్పొరేషన్ల సీఈవోలతో ప్రధాని భేటీ కానున్నారు. ప్రధాని మోదీ ‘గిఫ్ట్ సిటీ’ని సందర్శించనున్నారు. గ్లోబల్ ఫిన్‌టెక్ లీడర్షిప్ ఫోరమ్‌లో వ్యాపార ప్రముఖులతో భేటీ కానున్నారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ గాంధీనగర్‌లో 2024, జనవరి 10 నుండి 12 వరకు జరగనున్నదని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) తెలియజేసింది. ఈ కార్యక్రమం థీమ్ ‘గేట్‌వే టు ది ఫ్యూచర్’. దీనిలో 34 భాగస్వామ్య దేశాలు, 16 భాగస్వామ్య సంస్థలు పాల్గొననున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 9న ఉదయం 9:30 గంటలకు గాంధీనగర్‌లోని మహాత్మా మందిరానికి చేరుకుంటారు. అక్కడ ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. దీని తర్వాత గ్లోబల్ టాప్ కంపెనీల సీఈవోలతో సమావేశమవుతారు. Landed in Ahmedabad a short while ago. Over the next two days, will be taking part in the Vibrant Gujarat Summit and related programmes. It is a matter of immense joy that various world leaders will be joining us during this Summit. The coming of my brother, HH @MohamedBinZayed… pic.twitter.com/Ygaajg4TfM — Narendra Modi (@narendramodi) January 8, 2024 -
నీటి అడుగున ప్రధాని మోదీ సాహస క్రీడ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా సముద్రంలో నీటి అడుగున సాహస క్రీడలో స్వయంగా పాల్గొన్నారు. అక్కడి జల చరాలను, వాటి జీవనాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అరేబియా సముద్రంలో ఉల్లాసకరమైన అనుభవం సొంతం చేసుకున్నానంటూ మోదీ తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. లక్షద్విప్‌లో తన పర్యటన సందర్భంగా స్నాకలింగ్కు ప్రయత్నించానని తెలిపారు. న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష ద్విప్ పర్యటన సందర్భంగా సముద్రంలో నీటి అడుగున సాహస క్రీడలో స్వయంగా పాల్గొన్నారు. అక్కడి జలచరాలను, వాటి జీవనాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అరేబియా సముద్రంలో ఉల్లాసకరమైన అనుభవం సొంతం చేసుకున్నానంటూ మోదీ తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సముద్రం అడుగున తన సాహసానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. అడ్వెంచర్‌ను ఇష్టపడేవారికి లక్షద్వీప్ సందర్శన అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. లక్షద్విప్‌లో తన పర్యటన సందర్భంగా స్నాకలింగ్ను(నీటి అడుగున సాహసం) ప్రయత్నించానని తెలిపారు. అది మర్చిపోలేని అనుభవమని ఉద్ఘాటించారు. లక్షద్విప్ సముద్ర తీరాల్లో ఉదయం పూట నడక, బీచు ఒడ్డున కుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోలను సైతం మోదీ షేర్ చేశారు. ఆయన ఈ నెల 2, 3వ తేదీల్లో లక్షద్విప్‌లో పర్యటించారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. వివిధ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. లక్షద్వీప్ అందచందాలతోపాటు అక్కడి ప్రశాంతత మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయని పేర్కొన్నాను. అలాగే అక్కడి ప్రజలు చూపిన ఆత్మియత, గౌరవం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వివరించారు. లక్షద్విప్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ తెలిపారు. -
Jaya Krishna Latest Photos: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, రమేశ్ బాబు తనయుడు (ఫోటోలు)
-
మనసున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, భీమవరం: ఆపన్నులను ఆదుకోవడంలో ముందుండే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమవరం పర్యటనలోనూ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. శుక్రవారం నాటి భీమవరం పర్యటనలో అనారోగ్యంతో, ఇతరత్రా ఇబ్బందులతో బాధ పడుతున్న వారి గోడు విని అప్పటికప్పుడే సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అత్తిలి మండలం తిరుపతిపురానికి చెందిన గుడాల అపర్ణ జ్యోతి, దెందులూరు మండలం శ్రీరామవరంనకు చెందిన కంతేటి దుర్గాభవాని, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న భీమడోలు మండలం పూళ్లకు చెందిన అరుగుల లాజర్ తనయుడు, అదే గ్రామానికి చెందిన నూతుల మార్తమ్మ, యలమంచిలి మండలం దొడ్డిపట్లకు చెందిన చిల్లి సుమతి తనయునికి వైద్య సాయం నిమిత్తం ఆర్థిక సాయం, భర్త మృతి చెందిన నరసాపురం 29వ వార్డుకు చెందిన ఎల్లమల్లి అన్నపూర్ణ, ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చెందిన తేతలి గీతలకు పరిహారంగా ఆర్థిక సాయం అందజేశారు. నరసాపురం మండలం ఎల్బీ చర్లకు చెందిన కడలి నాగలక్ష్మికి భూపరిష్కారం నిమిత్తం ఆర్థిక సాయం అందించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి.ప్రశాంతి, జేసీ ఎస్.రామసుందర్‌రెడ్డిలు తొమ్మిది మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. -
కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ చేస్తాం: ఉత్తమ్
Updates: ఈఎన్సీ చీఫ్ మురళీధర్ కామెంట్లు.. ► మేడిగడ్డ బ్యారేజ్‌లో మొత్తం నాలుగు పిల్లర్లు 18,19,20,21 కుంగినాయి ► 20వ పిల్లర్ ఎక్కువగా 1.256 మీటర్ల మేర కుంగింది ► మూడు పిల్లర్లు పూర్తిగా తొలగించాల్సి వస్తుంది ► ఆ పిల్లర్లు తొలగించడం కష్టతరంగా మారింది ► ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ఈ పిల్లర్లల మీదే ఆధారపడి ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం తుగ్లక్ చర్య: కోమటిరెడ్డి వెంకటరెడ్డి ► కిందికి పోయినా వాటర్‌ను పైకి లిఫ్ట్ చేయడం ఏం పిచ్చి డిజైన్ ► వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు ► ఇంజనీరింగ్ అధికారులు వాస్తవాలు బయట పెట్టాలి ► అసెంబుల్డ్ మోటార్లతో వేల కోట్ల డబ్బు దోచుకున్నారు ► అప్పటి పాలకులు చెప్పినట్లు ఇంజనీరింగ్ అధికారులు ఎందుకు తలూపారు ► మీ మాట వినకపోతే లీవ్ పెట్టి వెళ్లి పోవాల్సింది ► ఎకరానికి 12 వేల ఖర్చు వస్తుంది రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్లు ► ప్రజల్లో చర్చ జరుగుతుందే నేను అడుగుతున్నా ► 152 మీటర్ల వరకు ప్రాజెక్టు ఎత్తు ఉండేలా నిర్మాణం ఉండాలని మహారాష్ట్రతో చర్చలు జరుగుతున్నాయి ► రాష్ట్రం ఏర్పడిన తర్వాత 148 మీటర్లకే ప్రాజెక్టు కట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకుంది. ► కేసీఆర్ తన మార్క్ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ► డయాఫ్రామ్ వాల్ కాంక్రీట్‌తో వేసి ఉంటే ఈ రోజు బ్యారేజ్‌లు డ్యామేజ్ అయ్యేవి కాదు. ► సీకెండ్ ఫైల్ ఫేలవ్వడం వల్లే బ్యారేజ్‌లు దెబ్బతిన్నాయి. ► ప్రాజెక్టు నిర్మాణంలో అప్ స్టీన్ కటాఫ్, డౌన్ స్టీన్ కటాఫ్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు ► ప్రమాదం ఉందని 2022 ఎప్రిల్ 28న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖలు రాసాడు.. అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదు. ► టెండర్లు పిలవడానికి చూపిన ఇంట్రెస్ట్... సేఫ్టీకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు ► వరద ఉధృతిని అంచనా వేయకుండా పంప్ హౌస్‌ల నిర్మాణం ఎలా చేసారు ► బ్యారేజ్‌లో ఇసక తీయాల్సిన అవసరం ఏమోచ్చింది.. తీసిన ఇసుకను ఏం చేసారు ► మునిగిపోయిన పంప్‌ల స్థానంలో కొత్త వాటి కోసం బడ్జెట్ అలకేషన్ చేయాలని మళ్ళీ ఫైల్‌ను ఫైనాన్స్ డిపార్టుమెంట్లో పెట్టారు ► 3 టీఏంసీ లిఫ్ట్ కోసం టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ ద్వారా ఎలా కాంటాక్ట్ ఇచ్చారు ► కాళేశ్వరంకు మీడియాను ఎందుకు నియంత్రించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్లు ► కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మా కాంగ్రెస్ అభిప్రాయం ఒకటే ► 38 వెల కోట్లతో 16.40 లక్షల ఎకరాల ఆయకట్టు కోసము వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయకట్టు ప్రణాళిక రూపొందించడం జరిగింది ► కానీ ప్రభుత్వం మారడం వల్ల ప్లాన్ మార్చి మేడి గడ్డ దగ్గర నిర్మించడం జరిగింది ► ఒక బ్యారేజ్ తుమ్మిడి హాట్టి దగ్గర అనుకున్నాం కానీ.. అన్నారం, సుందిల్ల ఇలా ఎక్కువ ప్రాజెక్ట్ లు నిర్మించడం వల్ల వ్యాయం పెరిగింది ► ఆనాడు 38 వెల కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఇప్పుడు 18 లక్షల ఎకరాల కు 80 వేల కోట్లు ఖర్చు చేశారు ► ప్రపంచం లోనే అతి పెద్ద ప్రాజెక్టు అని చెప్పారు.. అద్భుతం అన్నారు. ► కానీ మేడిగడ్డ డ్యామేజ్ కావడం దురదృష్టం ► అక్టోబర్ 21 నాడు ప్రాజెక్టు పెద్ద శబ్దంతో కుంగడం జరిగింది ► కానీ ఆనాటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నోరు మెదపలేదు ► ఎక్కడ రివ్యూ చేయలేదు,స్టేట్ మెంట్ ఇవ్వలేదు ► మా ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రాజెక్టు మొత్తం విషయంపై జ్యుడిషియల్ విచారణ చేపడతాం అని చెప్పాం చేపడతాం ► అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు కోవడానికి ఈ రోజు రావడం జరిగింది ► అధికారులతో రివ్యూ తరువాత తుది నిర్ణయం ప్రకటిస్తాం ► CWC అప్రోవల్ చేసింది రూ. 80 వెల కోట్లు కానీ ఇప్పుడు లక్షన్నర కోట్లు పెరిగింది. ► 38 వెల కోట్లు ప్రాజెక్ట్ ఈరోజు వరకు సుమారు 95 వేల కోట్ల ఖర్చు జరిగింది. ► కంట్రోల్ ఆడిట్ జనరల్ కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ► మేడి గడ్డ ఒక్కటే కాదు అన్నారం, కూడా నష్టం జరిగింది.. సుందిల్లను కూడా పరిశీలించాలి ► మూడు బ్యారేజీల రిపేర్‌కు అయ్యే ఖర్చు ప్రజల మీద భారమే అవుతుంది ► కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన డబ్బు మొత్తం వృధా ► పైగా ప్రజలపైన వడ్డీలు పడుతున్నాయి ► కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై జ్యుడీషియల్ విచారణ చేయబోతున్నాం ► ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపం జరిగింది ► డిజైన్ , నిర్మాణం ఫెయిల్ అయ్యాయి ► ENC మరోసారి రిటన్‌గా నివేదిక ఇవ్వాలి ► తుమ్మిడిహట్టి మరోసారి రీడిజైన్ చేయబోతున్నాం ► మాకు తుమ్మిడిహట్టి మీద పూర్తి అవగాహన ఉంది ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్లు ► అన్నారం, మేడిగడ్డ, సుంధిళ్ళ బ్యారేజ్లే కాళేశ్వరంకు కీలకం ► అందులో అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్‌లు డ్యామేజ్ అయ్యాయి ► బాంబు దాడులను తట్టుకునే విధంగా ప్రాజెక్టుల ను నిర్మిస్తారు ► అలాంటిది మేడిగడ్డ బ్యారేజ్ బాంబు దాడి వల్ల డ్యామేజ్ అయిందని ఎలా భావిస్తున్నారు ► ఇరిగేషన్ శాఖ లో 8 నుంచి 9 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి ► గత ప్రభుత్వం మాకు పెండింగ్ బిల్లులు వదిలిపెట్టి వెల్లింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఉండే కీలక అంశాలు ► గోదావరిలో వాటర్ ఎంత లభ్యం అవుతుంది ► ప్రాణహితకు కాళేశ్వరంకు మధ్య తేడా ఏంటి? ► రీ డిజైన్ చేయడానికి గల కారణాలు ఏంటి? ► ప్రాణహిత ద్వారా ఎంత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉండేది ► కాళేశ్వరం నిర్మాణం పూర్తయిన తర్వాత ఎంత నీరు ఇచ్చారు ► ఇప్పటి వరకు కాళేశ్వరం విద్యుత్ ఖర్చు ఎంత? ► మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ఏంటి? ► మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్టీకి ఇప్పుడు ఏం చేయాలి? మేడిగడ్డకు మంత్రుల బృందం ► హైదరాబాద్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్‌కు తెలంగాణ మంత్రుల బృందం బయలుదేరింది ► మంత్రుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ► మంత్రులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేకా వెంకట స్వామి. ► మేడిగడ్డకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి రోడ్డు మార్గంలో బయలుదేరారు. మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ►అక్టోబర్ 21న మెడగడ్డ పిల్లర్ కుంగిపోయింది. ►నవంబర్ 30న ఎన్నికలు డిసెంబర్ 3న ఫలితాలు, డిసెంబర్ 7వరకు కేసిఆర్ సీఎంగా ఉన్నారు ►కానీ కాళేశ్వరంపై ఒక్కసారి మాట్లాడలేదు. ఇది చాలా సిగ్గుపడాల్సిన సంఘటన ►అన్ని విషయాలు నిర్దారణ చేస్తాం.నిజానిజాలు అన్ని మీడియాకు వెల్లడిస్తాం ►మూడేళ్లలో ఈ ప్రోజెక్ట్ కుంగటం సిగ్గు చేటు. ఎవరు కట్టారో వారే బాధ్యత వహించాలి ►లక్ష కోట్ల ప్రోజెక్ట్ లో ఇంత భారీ అవినీతి జరిగింది ► మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన సమయం నుంచి బ్యారేజ్ చూడటానికి అనుమతి ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. మరో వైపు కుంగిన ప్రాంతాన్ని చూపిస్తామని చెప్పిన మంత్రులు మేడిగడ్డ పర్యటనకు బయలుదేరనున్నారు. అధికారులు బ్యారేజ్‌కు ఇరువైపులా బారికేడ్లతో మూసివేశారు. దీంతో మంత్రుల మేడిగడ్డ పర్యటన ఉత్కంఠగా మారింది. జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సందర్శనకు తెలంగాణ మంత్రులు వెళ్లనున్నారు. దీంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్థానిక అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పోన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాదు నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మేడిగడ్డకు చేరుకుంటారు. అనంతరం E-IN-C ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పైర్ ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష చేస్తారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి క్యాంపు కార్యాలయానికి తిరుగు ప్రయాణం కానున్నారు. -
నేడు ప్రధాని మోదీ వారణాసి రాక..
ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) యూపీలోని వారణాసికి రానున్నారు. ఆది, సోమవారాలలో ప్రధాని మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఉంటారు. డిసెంబర్ 17న తన కాశీ పర్యటనలో మొదటి రోజున ప్రధాని మోదీ.. నాడేసర్‌లో జరిగే వికాస్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం ప్రారంభిస్తారు. మరుసటి రోజు అంటే డిసెంబర్ 18న విహంగం యోగాకు చెందిన స్వర్వేద మహామందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. తరువాత బర్కిలో జరిగే బహిరంగ సభలో మిషన్-2024కు శంఖనాదం చేసిన అనంతరం ప్రసంగించనున్నారు. అలాగే కాశీ సంసద్ స్పోర్ట్స్ కాంపిటీషన్ విజేతలను కలుసుకోనున్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా తన పార్లమెంటరీ నియోజకవర్గానికి వస్తున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేశారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. బార్కి నుంచి ఢిల్లీ-వారణాసి వందే భారత్‌తో సహా ఐదు రైళ్లను ప్రారంభించనున్నారు. దీనితోపాటు రూ.19,150 కోట్ల విలువైన 37 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కటింగ్ మెమోరియల్ స్కూల్ గ్రౌండ్స్‌లో జరిగే భారత్ సంకల్ప్ యాత్రలో ప్రధాని మోదీ.. పీఎం ఆవాస్, పీఎం స్వనిధి, పీఎం ఉజ్వల తదితర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సంభాషించనున్నారు. ఇది కూడా చదవండి: కరోనా కొత్త వేరియంట్ కలకలం.. కేరళలో జేఎన్.1 కేసు నమోదు! -
కేసీఆర్‌కు ప్రముఖుల పరామర్శ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును బుధవారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, సినీ నటుడు నాగార్జున ఉన్నారు. కేసీఆర్‌ను పరామర్శించిన వారిలో రాష్ట్ర ప్రణాళిక బోర్డు మాజీ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఉన్నారు. -
అండగా నేనున్నా
సాక్షి తిరుపతి: అధైర్యపడొద్దు.. అండగా నేనున్నానంటూ తుపాను బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించి బాధితులను స్వయంగా కలుసుకుని పరామర్శించారు. పంట చేతికొచ్చే సమయంలో రైతన్నకు జరిగిన అపార నష్టాన్ని చూసి సీఎం జగన్ చలించిపోయారు. ఖరీఫ్ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, పంట నష్టపోయిన రైతులకు 80% రాయితీతో శనగ విత్తనాలను సరఫరా చేస్తామన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తీసుకొచ్చిన వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా అందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విపత్తు వేళ అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై బాధిత ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణకు చర్యలు తీసుకుందన్నారు. గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ తొలుత తిరుపతి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిలాల్లోని తుపాన్ బాధిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం కోట మండలం విద్యానగర్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామానికి చేరుకుని కోతకు గురైన స్వర్ణముఖి నది, వరి పంటలను పరిశీలించారు. స్వర్ణముఖి కోతకు గురి కావటానికి కారణాలను ఆరా తీశారు. బాలిరెడ్డిపాళెంలో తుపాను బాధితులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. చెప్పలేనంత బాధగా ఉంది.. 'ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలు జిల్లా మొత్తం సగటుతో పోల్చుకుంటే అందులో సగం ఈ నాలుగైదు రోజుల్లోనే కురిసింది. దాదాపు 40 – 60 సెంటీమీటర్ల వర్షం కురిసిన పరిస్థితి. మనందరికీ జరిగిన ఈ నష్టం, కష్టం చెప్పడానికి కూడా సాధ్యపడనంత బాధ కలిగిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 92 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 8,364 మందిని తరలించాం. 25 కిలోల రేషన్ బియ్యం, కేజీ కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిగడ్డలు, లీటరు పామాయిల్ చొప్పున దాదాపు 60 వేల మందికి పైగా బాధితులకు అందచేశాం. ఏ రాష్ట్రంలోనూ లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఒకటి ఉంది. అది.. వలంటీర్ వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ. అందువల్ల ఎవరికి ఎక్కడ ఏ నష్టం జరిగినా ఆందోళన చెందాల్సిన పనిలేదు.' అని సీఎం జగన్ తెలిపారు. 'ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ప్రతి ఒక్కరికీ భరోసా ఇచ్చి చెబుతున్నా. నాకు నష్టం జరిగింది.. కానీ ఎదుటివాడికి మాత్రమే సాయం వచ్చింది.. నాకు రాలేదని అనుకోవాల్సిన పని లేదు. ఏ ఒక్కరినీ నష్ట పోనివ్వం. ప్రతి ఒక్కరికీ మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది. పంపిణీ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 62 వేల కుటుంబాలకు రేషన్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఇంటికీ రూ.2,500 చొప్పున డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దానివల్ల ఇళ్లలోకి నీళ్లు వచి్చన వారికి, సామాన్లకు నష్టం జరిగిన వారికి, ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి కాస్తో కూస్తో ఉపశమనం కలుగుతుంది. ఇవాళ మొదలు పెడితే మరో నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చి ప్రతి ఇంట్లోనూ రూ.2,500 చొప్పున డబ్బులిచ్చే కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళతారు. ఈ జిల్లాల్లో స్టాండింగ్ క్రాప్ లేదు కాబట్టి కాస్తో కూస్తో ఊరట. పంటలు వేసి నష్టపోయిన వారికి 80 శాతం సబ్సిడీతో విత్తనాలను అందచేస్తాం. అన్నీ దగ్గరుండి కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. ఈ రోజు నుంచి వారంలోగా ప్రతి ఒక్కరికీ జరగాల్సిన మంచి జరుగుతుంది.' అని సీఎం జగన్ చెప్పారు. రెట్టించిన వేగంతో యంత్రాంగం 'తుపాన్ ప్రాంతాల్లో విద్యుత్తును చాలా వేగంగా పునరుద్ధరించారు. యంత్రాంగం అంతా ఇక్కడే నిమగ్నమై రెట్టించిన వేగంతో పని చేస్తున్నారు. ఇంకా కొన్ని కాలనీల్లో విద్యుత్తు లేని పరిస్థితి ఉంటే వలంటీర్ల ద్వారా వివరాలను సేకరించి కలెక్టర్లు సమస్యను పరిష్కరిస్తారు. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుందని మరోసారి చెబుతున్నా. ' అని అన్నారు. పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు సీఎం పర్యటనలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, కాకాణి గోవర్థన్‌రెడ్డి, తానేటి వనిత, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యేలు వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, మేకపాటి విక్రమ్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, ఎమ్మెల్సీలు చంద్రశేఖరరెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేరిగ మురళీధర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, స్వచ్ఛాంధ్ర రాష్ట్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం మీదే.. 'ఇక్కడికి రాకముందు స్వర్ణముఖి నదిలో కోత కారణంగా ఎలాంటి నష్టం జరిగిందో స్వయంగా చూశా. దానికి శాశ్వత పరిష్కారం వెతకాలని చెప్పా. హైలెవల్ బ్రిడ్జి కడితే బాగుంటుందని, అందుకోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఈ సమస్యను తీరుస్తూ హైలెవల్ బ్రిడ్జిని శాంక్షన్ చేస్తున్నా. జిల్లాలో 110 చెరువులు ఉండగా కొన్ని చోట్ల కోతకు గురయ్యాయి. రోడ్లు మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుడతాం. రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతుల కోసం రూ.32 కోట్ల ప్రతిపాదనలు అందాయి. యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేపట్టే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం మీది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ మంచే జరుగుతుంది. అంతేకానీ చెడు అనేది ఎప్పుడూ జరగదు. ఏ చిన్న సమస్యైనా, వాళ్లకు రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉంటే వెంటనే ‘జగనన్నకు చెబుదాం’ 1902 నంబర్‌కు ఫోన్ కొట్టండి. నా ఆఫీస్‌కే ఫోన్ వస్తుంది. తుపాన్ బాధిత ప్రాంతాల్లో అందరికీ అన్నీ అందించే బాధ్యతను కలెక్టర్ తీసుకుంటారు. నాలుగైదు రోజుల్లో వారి దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటా.' అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఆ పత్రికలు చదవొద్దు.. అపోహలు నమ్మొద్దు: సీఎం జగన్ -
చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రామ్ చరణ్, రాహుల్ ద్రావిడ్ (ఫొటోలు)
-
రేపు నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లాలో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి అవుకు రెండో టన్నెల్ వద్దకు చేరుకుని నీటిని విడుదల చేసి.. ఆ టన్నెల్‌ను జాతికి అంకితం చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటారు. సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటారు. -
Sai Dharam Tej Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)
-
Dhanya Balakrishna : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ధన్య భాలకృష్ణ (ఫొటోలు)
-
Akkineni Nagarjuna-Akhil: విశాఖ ఏయూలో నాగార్జున, అఖిల్ సందడి (ఫొటోలు)
-
నేడు హైదరాబాద్‌కు నడ్డా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా నేడు(ఆదివారం) రాష్ట్రానికి రానున్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో సకలజనుల విజయ సంకల్పసభ పేరిట నిర్వహిస్తున్న బహిరంగసభలు, రోడ్‌షోలలో ఆయన పాల్గొంటారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా నారాయణపేటకు చేరుకుని ఒంటిగంట నుంచి రెండుగంటల దాకా అక్కడి సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల దాకా చేవెళ్ల సభలో పాల్గొంటారు. సాయంత్రం 6.30 నుంచి మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో జరిగే రోడ్‌షోలలో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు బేగంపేటకు చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణమవుతారు. కాగా, సోమవా రం (20న) కొల్లాపూర్, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రచారం నిర్వహిస్తారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. -
బిర్సా ముండా ఎవరు? ప్రధాని మోదీ ఆయన జన్మస్థలికి ఎందుకు వెళుతున్నారు?
నేడు అమర వీరుడు బిర్సా ముండా జయంతి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (బుధవారం) జార్ఖండ్‌లోని బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతుకు వెళ్తున్నారు. జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో గల ఉలిహతును దేశ ప్రధాని సందర్శించడం ఇదే మొదటిసారి. ఉలిహతులో బిర్సా ముండాకు నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా రూ. 24 వేల కోట్ల విలువైన ట్రైబల్ మిషన్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ నేడు ముందుగా రాంచీలోని లార్డ్ బిర్సా ముండా మెమోరియల్ పార్క్, ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియాన్ని సందర్శించనున్నారు. అనంతరం బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతు గ్రామానికి చేరుకుని, అక్కడ బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. బిర్సా ముండా గిరిజనుల పాలిట హీరోగా నిలిచారు. గిరిజనులు అతనిని దేవుడిలా భావిస్తారు. బిర్సా ముండా 1875 నవంబర్ 15న జార్ఖండ్‌లోని ఉలిహతులో జన్మించారు. గిరిజన మత సహస్రాబ్ది ఉద్యమానికి నాయకత్వం వహించారు. అలాగే గిరిజన సమాజంలో ప్రబలంగా ఉన్న మూఢనమ్మకాలను తొలగించే ప్రచారాన్ని చేపట్టారు. భూస్వాముల ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. 1894లో బిర్సా ముండా ఆదాయ మాఫీ కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని ముండా తిరుగుబాటు లేదా ఉల్గులన్ అని పిలుస్తారు. 1895లో బ్రిటీష్ వారు బిర్సా ముండాను అరెస్టు చేశారు. జైలు నుండి విడుదలైన తర్వాత బిర్సా ముండా బ్రిటిష్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్‌కు వ్యతిరేకంగా గిరిజన సమాజాన్ని ఏకీకృతం చేశారు. 1899, డిసెంబరు 24న బిర్సా ముండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఈ నేపధ్యంలో బ్రిటీష్ వారు 1900, మార్చి 3న అతనిని అరెస్టు చేశారు. బిర్సాముండా 1900, జూన్ 9న రాంచీ జైలులో మరణించారు. ఆ సమయానికి బిర్సా ముండా వయసు కేవలం 25 సంవత్సరాలు. ఇది కూడా చదవండి: ఏడు దాటినా వీడని పొగమంచు.. దిక్కుతోచని ఢిల్లీ జనం! -
ఈ నెల 26న సీఎం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన
తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 26న పర్యటించనున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు విజయ్ గణేష్ మోహన్ వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఉదయం 10:15 గంటలకు తాడెపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. రాజానగరం మండలం దివాన్‌చెరువు డి.బి.వి.రాజు లే-అవుట్లో జరగనున్న విజయ్ గణేష్ మోహన్ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. అనంతరం తాడెపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇదీ చదవండి: ఎల్లుండి నుంచి వైఎస్సార్సీపీ బస్సు యాత్ర -
కాంగ్రెస్, బీజేపీల మాటలు నమ్మొద్దు
కోరుట్ల/మెట్పల్లి(కోరుట్ల): నిజాం చక్కెర ఫ్యాక్టరీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాటలను రైతులు నమ్మవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. స్వాతంత్య్రం రాక ముందే నిజాం చక్కెర ఫ్యాక్టరీలను నిజాం ప్రభువులు ఏర్పాటు చేస్తే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పిందని జీవన్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం వీటిని బీజేపీకి చెందిన మాజీ ఎంపీకి విక్రయించినప్పుడు ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు చోద్యం చూశా రా అని మండిపడ్డారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బతుక మ్మ మీద గౌరమ్మ బదులు ఇంకేదో పెట్టు కొని పండుగ చేసుకుంటామని జీవన్‌రెడ్డి వ్యాఖ్యా నించడం ఆయన వయసుకి, హోదాకి తగదని కవిత చెప్పారు. ఎన్నికల్లో గెలవడానికి దిగజారి పోయి బతుకమ్మను అవమానించిన ఆయనను జగిత్యాల ప్రజలు తిరస్కరించడం ఖాయమ న్నారు. నేడు మహారాష్ట్రకు కవిత సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఆదివారం జరిగే బతుకమ్మ సంబరాలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. అలాగే దత్తవాడ నుంచి సాయంత్రం ప్రారంభమయ్యే బతుకమ్మ శోభాయాత్రలో ఆమె పాల్గొంటారు. -
రేపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఈ నెల 19న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. ఆరోజు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఎమ్మిగనూరుకు చేరుకుంటారు. వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని.. జగనన్న చేదోడు పథకం కింద అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం జమ చేయనున్నారు. సభ అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. -
పని పూర్తి చేసే సంస్కృతి మాది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శంకుస్థాపన చేస్తే ఆ పనిని కచ్చితంగా పూర్తి చేయాలనే సంస్కృతిని తమ ప్రభుత్వం పాటిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ కీలకమని.. ఉత్పత్తి, సరఫరా నిరంతరాయంగా ఉంటే పరిశ్రమల వృద్ధికి ఆలంబన అవుతుందని చెప్పారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల యూనిట్‌ను ప్రస్తుతం ప్రారంభించుకున్నామని, త్వరలో రెండో యూనిట్ సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో అధిక భాగం తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. ధర్మాబాద్– మనోహరాబాద్– మహబూబ్‌నగర్– కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణతో రైళ్ల సరాసరి వేగం, రాష్ట్రంలో కనెక్టివిటీ మరింత పెరుగుతాయని చెప్పారు. మనోహరాబాద్– సిద్దిపేట మధ్య కొత్త రైల్వేలైన్‌తో పరిశ్రమలు, వ్యాపారానికి తోడ్పాటు అందుతుందన్నారు. ఇక ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాల నాణ్యత కోసం పీఎం ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ తీసుకొచ్చామని.. తెలంగాణలోని 20 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వివరించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తెలంగాణలో 50 పెద్ద ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో అవి కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అరి్వంద్, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి పసుపు రైతుల సన్మానం పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో పసుపు రైతులు నిజామాబాద్ సభా వేదికపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. పసుపు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేక దండ వేసి, పసుపు మొక్కలను అందించారు. మోదీ ఆ మొక్కలను పైకెత్తి ప్రదర్శించారు. తెలుగులో ప్రారంభించి.. ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పలుమార్లు ‘నా కుటుంబ సభ్యులారా..’అని ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు మోదీ.. మోదీ.. అంటూ బీజేపీ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తూ కనిపించారు. ఓ చిన్నారి భరతమాత వేషధారణలో వచ్చిన విషయాన్ని చూసి.. ‘‘ఓ చిన్ని తల్లి రూపంలో భారతమాత ఇక్కడికి వచ్చింది. ఆ చిన్నారికి నా తరఫున అభినందనలు..’’అని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ.. ప్రధాని మోదీ నిజామాబాద్‌లోని సభా స్థలిలో విడిగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రూ.8 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన మరో వేదికపై సభను ఉద్దేశిస్తూ రాజకీయ ప్రసంగం చేశారు. తొలి వేదికపై ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలివీ.. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌లో 800 మెగావాట్ల యూనిట్ జాతికి అంకితం. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలోని 20 జిల్లా ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు శంకుస్థాపన. ∙మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం.. సిద్దిపేట–సికింద్రాబాద్ రైలు సర్వీస్‌కు పచ్చజెండా.. ధర్మాబాద్ – మనోహరాబాద్ – మహబూబ్‌నగర్ – కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణ పనుల ప్రారంభం -
పసుపు బోర్డు..గిరిజన వర్సిటీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును, ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో.. రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతుంది. దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేయడంతోపాటు వినియోగించేది, ఎగుమతి చేసేది ఈ పంటే. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. దీనిపై పరిశోధనలు పెరిగాయి. పాలమూరు సభ సాక్షిగా ఇక్కడి పసుపు రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు (నేషనల్ టర్మరిక్ బోర్డు)ను ఏర్పాటు చేస్తాం. ములుగులో ట్రైబల్ వర్సిటీ.. ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రూ.900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీకి సమ్మక్క–సారలమ్మ పేరు పెడుతున్నాం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో వివిధ భవనాలను ప్రారంభించాం. హెచ్సీయూకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా కలి్పంచి, ప్రత్యేక నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. నారీశక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడం ద్వారా నవరాత్రులకు ముందే శక్తి పూజ స్ఫూర్తిని నెలకొల్పాం. వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమ రంగాలకు ప్రయోజనం తెలంగాణ ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేలా అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేయడం సంతోషంగా ఉంది. నాగ్‌పూర్–విజయవాడ కారిడార్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించాం. ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, ఒక టెక్స్టైల్ క్లస్టర్ ఉన్నాయి. దేశంలో నిర్మిస్తున్న ఐదు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే ఈ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేలాది మందికి ఉపాధి ఇచ్చేలా.. ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఇంధన భద్రతపై చర్చ జరుగుతోంది. కేవలం పరిశ్రమలకే కాకుండా ప్రజలకు కూడా ఇంధన శక్తిని అందిస్తున్నాం. దేశంలో 2014లో 14 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉంటే 2023 నాటికి 32 కోట్లకు పెరిగాయి. ఇటీవల గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా తగ్గించాం. దేశంలో ఎల్పీజీ వినియోగాన్ని పెంచడంలో భాగంగా పంపిణీకి సంబంధించి నెట్‌వర్క్‌ను విస్తరించాల్సి ఉంది. ఇందులో భాగంగా హసన్–చర్లపల్లి ఎల్పీజీ పైప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఇది ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో దోహదపడుతుంది. కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్ వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది..’’అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు ఇవీ.. రూ.3,397 కోట్లతో మూడు ప్యాకేజీలుగా వరంగల్ నుంచి ఖమ్మం వరకు చేపట్టనున్న ఎన్‌హెచ్–163 పనులు రూ.3,007 కోట్లతో మూడు ప్యాకేజీలుగా ఖమ్మం నుంచి విజయవాడ వరకు నిర్మించే ఎన్‌హెచ్–163జీ పనులు కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వరకు రూ.1,932 కోట్లతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభించినవి ఇవీ.. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు రూ.2,457 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల 365 బీబీ నంబర్ జాతీయ రహదారి మునీరాబాద్–మహబూబ్‌నగర్ రైల్వేలైన్‌లో భాగంగా జక్లేర్ నుంచి కృష్ణా వరకు రూ.505 కోట్లతో పూర్తి చేసిన కొత్త లైన్ రూ.81.27 కోట్లతో హెచ్‌సీయూలో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ భవనాలు రూ.2,166 కోట్లతో హసన్ (కర్ణాటక) నుంచి చర్లపల్లి వరకు నిర్మించిన ఎల్పీజీ పైప్‌లైన్ జాతికి అంకితం నారాయణపేట జిల్లాలోని కృష్ణా స్టేషన్ నుంచి కాచిగూడ–రాయచూర్– కాచిగూడ డీజిల్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) రైలు సర్విస్ ప్రారంభం -
Gautam Gambhir Visit Lord Balaji Temple In Tirumala: తిరుమలలో టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ (ఫొటోలు)
-
1న మోదీ షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 1న (అక్టోబర్) ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 11.20 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడికి దగ్గరలోనే ఉన్న ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్, రైల్వే, ఇతర శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలీకాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 3.05 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. మహబూబ్‌నగర్ శివార్లలోని భూత్పూర్లో మధ్యాహ్నం 3.15 నుంచి 4.15 గంటల వరకు జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు మహబూబ్‌నగర్ హెలీపాడ్ నుంచి హెలీకాప్టర్‌లో 5.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 5.10 గంటలకు ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. 3న మరోసారి రాష్ట్రానికి మోదీ అక్టోబర్ 3న ప్రధాని మోదీ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిజామాబాద్‌లో రోడ్‌షో, బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పసుపుబోర్డుకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. -
రథయాత్రలకు బీజేపీ రెడీ
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల రథయాత్రలకు రాష్ట్ర బీజేపీ సమాయత్తమైంది. డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశాలుండడంతో, షెడ్యూల్ వెలువడేలోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో బస్సుయాత్ర చేయాలని బీజేపీ సంకల్పించింది. ఈనెల 26న బాసర, సోమశిల ఆలయం (కొల్లాపూర్), భద్రాచలం రాములోరిగుడి నుంచి మూడు రథయాత్రలు ప్రారంభం కానున్నాయి. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ, ఇతర ముఖ్యనేతలు ఈ యాత్రల్లో పాల్గొంటారు. మొత్తం 119 నియోజకవర్గాల మీదుగా 19 రోజుల పాటు 4,040 కిలోమీటర్ల మేర ఈ యాత్రలు సాగనున్నాయి. ఈ మూడు యాత్రలు అక్టోబర్ 14న హైదరాబాద్‌కు చేరుకుంటాయి. యాత్రల ముగింపు సందర్భంగా నగరంలో జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశముంది. రథయాత్రలు ఇలా... రూట్–1 కొమురంభీం: ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలతోపాటు హైదరాబాద్ –1 ( మొత్తంగా 41 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అవుతాయి. ఇందులో హైదరాబాద్ పరిధిలోని 12 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం కిలోమీటర్లు :1,100) రూట్–2 కృష్ణా: ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలతోపాటు హైదరా బాద్–2(మొత్తంగా 39 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అవుతాయి. ఇందులో హైదరాబాద్ పరిధిలోని 6 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం కిలోమీటర్లు : 1,290) రూట్–3 గోదావరి: ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలతోపాటు హైద రాబాద్–3 (మొత్తంగా 39 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అవుతాయి. ఇందు లో హైదరాబాద్ పరిధిలోని 4 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం కిలోమీటర్లు : 1,650) -
అక్షరధామ్ ఆలయంలో రిషి సునాక్ ప్రార్ధనలు
ఢిల్లీ:బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తితో కలిసి ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. దాదాపు గంటపాటు దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హిందువుగా గర్విస్తున్నానని అన్నారు. 'నేను హిందువునని గర్విస్తున్నాను. అదే వాతావరణంలో పెరిగాను. ఇప్పటికీ అలానే ఉన్నాను. ఢిల్లీలో ఉండే ఈ రెండు రోజుల్లో ఒక మందిరాన్ని దర్శించాలని అనుకున్నాను.' అని రిషి సునాక్ అన్నారు. రిషి సునాక్ రాకతో దేవాలయంతో సహా పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. జీ20 సమావేశాలకు హాజరుకావడానికి శుక్రవారం ఢిల్లీకి వచ్చారు రిషి సునాక్ దంపతులు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే 'జై శ్రీరాం' అని పలకరిస్తూ కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే వారికి స్వాగతం పలికారు. రుద్రాక్ష, భగవద్గీత, హనుమాన్ చాలీసాను రిషి సునాక్ దంపతులకు అందించారు. శనివారం జీ20 సదస్సు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక చర్చలు జరిపారు రిషి సునాక్. వాణిజ్య, పెట్టుబడుల అంశంలో మరిన్ని ఒప్పందాలు చేసుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు. ఇదీ చదవండి: G20 Summit: రిషి సునాక్, అక్షతా మూర్తి పిక్ వైరల్.. -
అమ్మకానికి పాక్? సౌదీ యువరాజు పర్యటనలో పక్కా డీల్?
దిగజారుతున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి యావత్ ప్రపంచానికీ తెలిసిందే. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్ తరచూ ఇతర దేశాల ఆర్థికసాయం కోసం చేతులు జాస్తోంది. పాక్‌కు భారీగా ఆర్థిక సాయం అందిస్తున్న దేశాల్లో సౌదీ అరబ్ పేరు ముందుగా వినిపిస్తుంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ త్వరలో పాక్‌లో పర్యటించనున్నారు. ఆయన తన పర్యటనలో పాకిస్తాన్ కొనుగోలుకు డీల్ కుదుర్చుకోనున్నారనే ఊహాగాగాలు వినిపిస్తున్నాయి. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సెప్టెంబర్ రెండో వారంలో పాకిస్తాన్లో పర్యటించనున్నారు. మహ్మద్ బిన్ సల్మాన్ పర్యటన ఇస్లామాబాద్‌లో స్వల్ప సమయం మాత్రమే ఉంటుందని, నాలుగు నుంచి ఆరు గంటలకు మించి ఉండదని ఆయన సన్నిహితులు మీడియాకు తెలిపారు. సెప్టెంబరు 10న ఇస్లామాబాద్‌లో పర్యటన ముగించిన అనంతరం ఆయన తన భారత పర్యటనను ప్రారంభిస్తారు. ఎంబీఎస్ పేరుతో ప్రసిద్ది పొందిన క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్-ఉల్-హక్ కక్కర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అసిమ్ మునీర్‌లను కలుస్తారని సమాచారం. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ని కలవడం వెనుక తన ఇమేజ్ను పెంచుకోవడమే ప్రధాన ఉద్దేశమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్.. పాక్ ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నూతన ప్రభుత్వం ఎన్నికయ్యేవరకూ తెరవెనుక బాధ్యతలన్నీ మునీర్ తన భుజాలపై వేసుకున్నారు. కాగా న్యూ ఢిల్లీకి వెళ్లేముందు ప్రిన్స్ ఇస్లామాబాద్‌కు వెళ్లడంలో ప్రత్యేకత ఏమిలేదని, ఇది ఇది ఆయన పాటిస్తున్న సమభావన చర్య అని సన్నిహితులు పేర్కొన్నారు. పాక్‌ను ఆపద్ధర్మ ప్రభుత్వం నడుపుతున్న దశలో మహ్మద్ బిన్ సల్మాన్ పాకిస్తాన్‌ను సందర్శించడం వెనుకపెట్టుబడులకు సంబంధించి ఏవైనా మార్గాలు తెరుచుకుంటాయేమోననే అంచనా ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కాగా సౌదీ రాజు సన్నిహితులు మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ అమ్మకానికి ఉందని, సౌదీ అరేబియా రాజు కొనుగోలుదారులలో ఒకరని పేర్కొన్నారు. ప్రిన్స్ పర్యటనలో మరిన్ని వివరాలు తెలియవచ్చన్నారు. కాగా సౌదీ అరేబియా- పాకిస్తాన్ మధ్య ఉన్న స్నేహ పూర్వక వాతావరణం ఇందుకు సహరించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: జీ20 శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్ గైర్హాజరు! -
గ్రీస్‌లో జీఎంఆర్ మరిన్ని పెట్టుబడులు
ముంబై: గ్రీస్‌లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్న దేశీ దిగ్గజం జీఎంఆర్ గ్రూప్.. ఆ దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంది. కెలమాటా ఎయిర్‌పోర్ట్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం జీఈకే టెర్నా సంస్థతో కలిసి గ్రీస్‌లోని క్రెటె ప్రాంతంలో హెరాక్లియోన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు జీఎంఆర్ గ్రూప్ తెలిపింది. హెరాక్లియోన్ విమానాశ్రయ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఇంధన, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపార విభాగం చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా గ్రీస్ ప్రధాన మంత్రి నిర్వహించిన విందులో శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. భారత్, గ్రీస్ మధ్య కనెక్టివిటీ మెరుగుపడితే ఇరు దేశాల స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి, వ్యాపార అవకాశాల కల్పనకు తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. -
నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం జిల్లా కేంద్రం సూర్యా పేటలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ సముదాయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాకు తీసుకొచ్చినందున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నా రు. ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో 100 ఎకరాల్లో పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11:15 గంటలకు సీఎం కేసీఆర్ సూర్యాపేట పట్టణ కేంద్రానికి చేరుకొని, సాయంత్రం 4:50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. జాతీయ రహదారిపై నేడు వాహనాల మళ్లింపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ బహిరంగసభ నేపథ్యంలో వాహనాలను దారి మళ్లిస్తు న్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద నల్లగొండ వైపు మళ్లిస్తారు. ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల నుంచి ఖమ్మం రహదారి మీదుగా మళ్లించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబా ద్ వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్నగర్, మి ర్యాలగూడ మీదుగా నార్కట్‌పల్లి వైపు మళ్లిస్తారు. -
సౌదీలో ‘ఇండియా జేమ్స్ బాండ్’ ఏం చేస్తున్నారు?
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో బిజీగా ఉన్నారు. తొలుత ఆయన జెడ్డాలో ప్రారంభమైన ఉక్రెయిన్ శాంతి సదస్సులో పాల్గొన్నారు. రష్యా హాజరు కాకుండానే ఈ రెండు రోజుల సుదీర్ఘ సదస్సు ప్రారంభమైంది. అమెరికా, చైనా సహా దాదాపు 40 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ‘చర్చల ద్వారా వివాదాల పరిష్కారం’ దోవల్ ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడాన్ని చూస్తే.. భారత్ ఈ శాంతి ప్రయత్నాల్లో తన పాత్రను నొక్కి చెబుతోందన్న బలమైన సంకేతాన్ని పంపుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిగిన సమావేశాల్లో శాంతి, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే సూచించారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ కూడా తన గళాన్ని వినిపించింది. అయితే భారత్ నిరసన ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించినది కాదు. ఇది బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్‌కు సంబంధించినది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్‌ను కొనసాగించడంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ చేస్తున్న ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇస్తుందని అన్నారు. గల్ఫ్ దేశాలతో రైలు నెట్వర్క్ అనుసంధానం చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యూహాన్ని రూపొందించే ప్రక్రియలో అజిత్ దోవల్ సౌదీ అరేబియా పర్యటన ఒక భాగం. గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని నివారించేందుకు భారత్, అమెరికాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కూడా తరచూ సౌదీ అరేబియాను సందర్శిస్తున్నారు. గల్ఫ్ దేశాలపై చైనా ఆధిపత్యాన్ని తరిమికొట్టి, అమెరికా హవాను తిరిగి స్థాపించడమే ఈ సందర్శనల ప్రధాన లక్ష్యం. ఇందు కోసం సౌదీ అరేబియా- ఇజ్రాయెల్ మధ్య స్నేహం నెలకొల్పడంలో అమెరికా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా ప్రయత్నాల్లో భాగస్వామ్యం అమెరికా చేస్తున్న ఈ ప్రయత్నంలో భారత్ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. గల్ఫ్ దేశాలను రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానించడం ద్వారా తన వ్యూహాత్మక ఉనికిని బలోపేతం చేసుకునేందుకు భారతదేశం ప్రయత్నిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో రైలు మార్గం ఏర్పాటుపై భారత్ చర్చలు ప్రారంభించింది. అదే సమయంలో ఈ రైలు మార్గంలో సౌదీ అరేబియాను చేర్చాలనే దిశగా ఆలోచిస్తున్నారు. సౌదీ అరేబియా వరకు రైలు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపధ్యంలో భారత రైలు నెట్‌వర్క్‌లో సౌదీ అరేబియాను చేర్చాలని అజిత్ దోవల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్‌ను ‘జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా’ అని అభివర్ణిస్తుంటారు. ఇది కూడా చదవండి: గొప్పగా ప్రారంభమై.. అంతలోనే కనుమరుగై.. పాకిస్తాన్ హిందూ పార్టీ పతనం వెనుక.. -
వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తాను: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఖరారు అయ్యింది. ఆగష్టు 7, 8 తేదీల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. వరద ప్రభావిత జిల్లాలైన అల్లూరిసీతారామరాజు, ఏలూరు, ప.గో, తూ.గో, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారాయన. ఈ సందర్భంగా.. సహాయ, పునరావాస కార్యక్రమాలు సమర్థవంతంగా జరగాలని కలెక్టర్లను ఆదేశించారాయన. ‘‘ఎక్కడా కూడా విమర్శలకు తావులేకుండా చూడాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల సమయంలో కలెక్టర్లు సహా, అధికారులకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నాం. అవసరమైన వనరులను సమకూరుస్తూ మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నాం. టిఆర్-27 నిధులను సకాలంలో విడుదల చేస్తున్నాం. సహాయ, పునరావాస చర్యలు సమర్థవంతంగా చేపట్టేలా అన్నిరకాలుగా ప్రభుత్వం తోడుగా నిలిచింది. దీనితర్వాత, ఈ పనులు చేయడానికి కొంత సమయం ఇస్తున్నాం. ఆ తర్వాత నేను స్వయంగా వచ్చి ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మీరు సహాయ పునరావాస కార్యక్రమాలు ఏరకంగా చేపట్టారో స్వయంగా పరిశీలిస్తున్నాను. బాధితులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నాను. ఈసారికూడా నేను వస్తాను, క్షేత్రస్థాయిలో మీరు చేపట్టిన చర్యలు, అందించిన సహాయంపై సమీక్ష చేస్తాను అని ఆయన అధికారులకు తెలిపారు. ఉదారంగా వ్యవహరించండి వరద సహాయ కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించండి. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి సహాయం కోరుతామో అలాంటి సహాయమే అందించాలి. ఇంట్లోకి వరదనీరు వచ్చినా, అలాగే వరద కారణంగా సంబంధాలు తెగిపోయిన వారికి కచ్చితంగా నిర్ణయించిన రేషన్ అందించాలి. దీంతోపాటు తాగునీరు కూడా అందించాలి. ఈ సహాయం అదని వరద బాధిత కుటుంబం ఉండకూడదు. సహాయ శిబిరాల్లో ఉండి, వారు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2000, వ్యక్తులైతే రూ.1000లు ఇచ్చి పంపించాలి. కలెక్టర్లు బాగా చూసుకున్నారనే మాట వినిపించాలి అని అధికారులతో సీఎం జగన్ అన్నారు. ► వరద కారణంగా కచ్చా ఇల్లు పాక్షికంగానైనా, పూర్తిగా నైనా ధ్వంసం అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ వర్గీకరణ చేయొద్దు. వారందరికీ కూడా రూ.10 వేలు చొప్పున సహాయం అందించాలి. వరదనీరు తగ్గగానే పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగించండి. మిగిలిన ప్రాంతాలనుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య కార్మికులను తరలించండి. వైద్యశిబిరాలను కొనసాగించండి పీహెచ్‌సీల్లో, విలేజ్ క్లినిక్స్‌లో సరిపడా మందులు ఉండేలా చూసుకోండి. పాముకాట్లకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచేలా చూసుకోండి. పంట నష్టం, ఆస్తి నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్‌చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్‌కోసం జాబితాను ఉంచండి. అత్యంత పారదర్శకంగా పంటనష్టానికి, ఆస్తి నష్టానికి సంబంధించిన పరిహారం అందించండి. ► అవసరమైన చోట వెంటనే కొత్త ఇళ్లను మంజూరు చేయండి. ఏటిగట్లమీద ఉన్నవారికి పక్కా ఇళ్లను మంజూరు చేయండి. వరద వచ్చిన ప్రతిసారి వారు ఇబ్బందిపడకుండా… వారికోసం ఇళ్లను మంజూరుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లది. అలాంటి ప్రమాదకర ప్రాంతాల్లో ఉండేవారికి రక్షిత ప్రాంతంలో ఇళ్లు ఇవ్వాలి. వారికి శాశ్వతంగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత మనది. అవసరమైన స్థలాన్ని సేకరించి, వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లను మంజూరు చేయండి. పోలవరం ఎగువన తరచుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలకు ఆర్ అండ్ ఆర్ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వండి. పశువులకు గ్రాసం కొరతలేకుండా చూడండి. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు… తదితర నిర్మాణాల విషయంలో వెంటనే మరమ్మతులు చేపట్టాలి. వరద బాధిత ప్రాంతాల్లో రక్షిత తాగునీటి సరఫరాను కొనసాగించాలి. పరిస్థితి మెరుగుపడేంతవరకూ వారికి రక్షిత తాగునీటిని అందించాలి. ► సోమ, మంగళవారాల్లో నేను వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తాను. వరద బాధిత ప్రాంతాలకు నేను వచ్చినప్పుడు ఈ అంశాలకు సంబంధించి ఎవ్వరూ కూడా ఫిర్యాదులు చేయకూడదు. నేను ఎక్కడకు వచ్చేదీ కొన్ని ఆదివారం సాయంత్రం సీఎంవో అధికారులు మీకు వెల్లడిస్తారు. క్షేత్రస్థాయిలో వరద బాధితులకు అందిన సహాయ, పునరావాసం కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తాను అని కలెక్టర్లతో పేర్కొన్నారాయన. -
మహరాష్ట్రకు సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు (మంగళవారం) మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.15 గంటలకు కొల్లాపూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. కొల్లాపూర్‌లోని అంబాబాయి(మహాలక్ష్మి) దేవాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు సాంగ్లి జిల్లాలోని వటేగావ్ చేరుకుని మహారాష్ట్రలో పేరొందిన సామాజిక కార్యకర్త, రచయిత అన్నాభావు సాఠే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సాఠే నివాసానికి చేరుకుని కుటుంబసభ్యులతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా సాఠే కోడలు, మనవడితోపాటు వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతారని పార్టీ నేతలు వెల్లడించారు. మధ్యాహ్నం 1.30కు ఇస్తాంపూర్లోని షేత్కారి సంఘటన్ నేత రఘునాథ్ దాదాపాటిల్ నివాసంలో కేసీఆర్ భోజనం చేస్తారు. సాయంత్రం ఐదు గంటలకు కొల్లాపూర్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అన్నాభావు సాఠే మహారాష్ట్రలో పలు సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. సాఠే వర్దంతి కార్యక్రమంలో పాల్గొంటున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
వియత్నాం పర్యటనలో ఆర్థిక మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వియత్నాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వియత్నాం ప్రభుత్వ ప్రణాళిక, పరిశ్రమల డిప్యూటీ మినిస్టర్ డో తాన్హ్ ట్రంగ్ తో సమావేశమయ్యారు. ఇందులో వొకేషనల్ ట్రైనింగ్, పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన తోడ్పాటుపై ప్రధానంగా చర్చతో పాటు వియత్నాం నుంచి మరింత సహకారం దిశగా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు కోసం చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం వియత్నాం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ప్రెసిడెంట్ ట్రాన్ కోక్ ఫుంగ్ను మంత్రి కలిశారు. వియత్నాంలోని అతి పెద్ద వస్త్ర తయారీ పరిశ్రమ 'గార్కో 10'ను సందర్శించారు. టెక్స్ టైల్ కంపెనీ, 'గార్కో 10' సహకారంతో వృత్తివిద్య కళాశాలల ఏర్పాటు, పెట్టుబడుల అవకాశాలపైనా చర్చించారు. వీటితో పాటు హానోయ్ టెక్స్ టైల్ అండ్ గార్మెంట్స్ యూనివర్శిటీని విజిట్ చేశారు. టెక్స్ టైల్ రంగంలోని సాంకేతికత, ఫ్యాషన్ శిక్షణలో సహకారానికి గల అవకాశాలపై అధ్యయనం చేశారు. ఇందులో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు హాజరయ్యారు. హనోయిలోని ఇండియా హౌస్‌లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించడంతో పాటు భారత రాయబారి సందీప్ ఆర్యాను కలిశారు. చదవండి నెల్లూరు ఆసుపత్రిలో మరణాలపై క్లారిటీ.. ఆక్సిజన్ కొరతపై దుష్ప్రచారాన్ని ఖండించిన వైద్యులు -
దిల్లీ టూర్లో మధుమిత- శివబాలాజీ కపుల్స్ (ఫొటోలు)
-
Anchor Lasya: కడప దర్గాను దర్శించుకున్న యాంకర్ లాస్య (ఫొటోలు)
-
PM Modii US Visit: వైట్‌హౌస్‌లో అడుగడుగున మోదీకి ఘన స్వాగతం
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అడుగడుగున ఘన స్వాగతం లభిస్తోంది. అమెరికా వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు అధ్యక్షుడు జో బైడెన్. పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీ చేరుకున్న ప్రధాని మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు.. ఓ వైపు వర్షం పడుతున్నా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరు దేశాల జాతీయ గీతాలాపన నిర్వహించారు. మోదీ రాక కోసం వైట్ హౌస్ వద్ద ఎదురు చూస్తోన్న వందలాది మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ- బైడెన్ క్లుప్తంగా ప్రసంగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైట్‌హౌస్ సౌత్‌లాన్‌లో వేడుక సందర్బంగా ఎన్నారైలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పాస్‌లు ఉన్నవారిని అనుమతించారు. అమెరికా తెలుగు సంఘం సంఘం నాయకులు ప్రదీప్ కట్ట, విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ తుమ్మల, రఘువీరారెడ్డి, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మధుకర్ రెడ్డి, సుధాకర్ గట్టు, తెలంగాణ డెవలపర్ ఫోరం మాజీ అధ్యక్షుడు మురళీ చింతలపాణి, బీజేపీ మాజీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, రాజేందర్ రావు, భీమా పెంట, ఆదిత్య రాయుడు, కేఎస్ఎన్ రాజు, రామకృష్ణ, పృద్వీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (చదవండి: అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే) -
అమెరికా పర్యటన వేళ.. రష్యాతో బంధంపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..?
మోదీ అమెరికా పర్యటన వేళ.. రష్యాతో భారత్‌కు ఉన్న బంధంపై సర్వత్రా చర్చ నెలకొంది. ఈ నేపథ్యంలో రష్యాతో భారత్‌కు ఉన్న బంధంపై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ పెదవి విప్పారు. భారత్ ఎల్లప్పుడూ శాంతి పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. 'ఇండియాను తటస్థం అంటారు.. కానీ మా స్థితి అది కాదు.. మేము శాంతి పక్షాన నిలబడతామని' ప్రధాని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న తరుణంలో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ వైఖరి సరిగాలేదనే వాదనలను ప్రధాని మోదీ కొట్టిపారేశారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ప్రతీ దేశం గౌరవించాలని సూచించారు. ప్రతీ దేశ సార్వభౌమత్వాన్ని ఇతర దేశాలు గౌరవించాలని పేర్కొన్నారు. దేశాల మధ్య వివాదాలను శాంతియుతంగా చర్చలతో పరిష్కరించుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి భారత్ తగిన ప్రయత్నాలు చేస్తుందని స్పష్టం చేశారు. అయితే.. ఇటీవలి కాలంలో అమెరికాతో భారత్ బంధం మరింత బలోపేతమైంది. 2022 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం రికార్డ్ స్థాయిలో 191 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇండియాకు వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అమెరికా మూడో స్థానంలో ఉంది. అటు.. రష్యాతోనూ భారత్ మంచి సంబంధాలనే కొనసాగిస్తోంది. ఇండియా రక్షణ దిగుమతుల్లో 50 శాతం రష్యా నుంచి వస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు బయల్దేరారు. మూడురోజులపాటు ఆయన అక్కడ పర్యటిస్తారు. సతీసమేతంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అక్కడికి వెళ్తున్న సంగతి తెలిసిందే. ద్వైపాక్షిక ఒప్పందాల బలోపేతం ప్రధానాంశంగా అమెరికా పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ. ఇదీ చదవండి: PM Modi US Visit: అమెరికాకు బయల్దేరిన ప్రధాని మోదీ.. బిజీ బిజీ షెడ్యూల్ ఇలా -
చిన్న సమస్యను విపత్తుగా చూపిస్తున్నారు: సీఎం జగన్
సాక్షి, ఏలూరు: ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్న చిన్న సమస్యలు వస్తాయని.. వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగుతారని, ప్రాజెక్టులో ఇలాంటి ఒక చిన్న సమస్యను విపత్తుగా చూపించే దౌర్భాగ్యమైన మీడియా మన రాష్ట్రంలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో ఎగువ కాఫర్ డ్యాంలో ఖాళీలు వదిలేశారని, ఈ ఖాళీల గుండా వరద నీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. చిన్న సమస్యను పెద్ద విపత్తులాగా చూపిస్తున్నారు ఈఎస్‌ఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రంవాల్ దారుణంగా దెబ్బతిందని.. దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యం కావడమే కాకుండా రూ.2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఇది మాత్రం ఎల్లోమీడియాకు కనిపించలేదని, ఎందుకంటే.. రామోజీరావు బంధువులకే నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించారని ప్రస్తావించారు. ప్రాజెక్టు స్ట్రక్చర్‌తో ఏమాత్రం సంబంధం లేని గైడ్‌వాల్ వంటి చిన్న సమస్యను పెద్ద విపత్తులాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయినా దీన్నికూడా పాజిటివ్‌గా తీసుకుని తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పనుల పరిశీలన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమగ్రంగా పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, దెబ్బతిన్న డయాఫ్రం వాల్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. గత సీజన్లో అనూహ్యంగా వచ్చిన వరద విపత్తును తట్టుకునేందుకు పెంచిన ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు, ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న దిగువ కాఫర్ డ్యాం పనులను కూడా సీఎం దగ్గరుండి పరిశీలించారు. చదవండి: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం జగన్ అధికారులతో సమీక్ష అదే విధంగా గత ప్రభుత్వంలో ప్రణాళిక లోపం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను సీఎం జగన్ పరిశీలించారు. డయాఫ్రం వాల్ ప్రాంతంలో కొట్టుకుపోయిన ఇసుకను నింపే పనులను, వైబ్రో కాంపాక్షన్ పనులను పరిశీలించిన సీఎం.. డయాఫ్రం వాల్ ప్రాంతంలో పునర్ నిర్మాణాలు, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణలపై అధికారులతో చర్చించారు. అనంతరం ప్రాజెక్టు వద్ద అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జతన్ సమీక్షా సమావేశం నిర్వహించారు పోలవరం ప్రాజెక్టులో తొలిదశను పూర్తిచేయడానికి అవసరమైన నిధులను ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని అధికారులు వెల్లడించారు. రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థికశాఖ మెమోరాండం జారీచేసిందని, దీన్ని కేంద్ర జలశాఖకు లేఖద్వారా తెలిపిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రణాళిక లోపం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ప్రాంతంలో నిర్మాణాల కోసం అదనంగా రూ.9 వేల కోట్లు ఇందులో భాగంగా ఇచ్చిందని తెలిపారు. కాంపౌండ్‌వారీ బిల్లుల చెల్లింపు వల్ల ప్రాజెక్టు నిర్మాణాలు ఆలస్యం అవుతున్న విషయాన్నిపరిగణలోకి తీసుకుని దానికి కేంద్ర మినహాయింపులు కూడా ఇచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరాయంగా సంప్రదింపులు, చర్చలు జరిపి, ప్రత్యేక దృష్టిపెట్టడంతోనే ఇది సాధ్యమైందని అధికారులు తెలియజేశారు. గైడ్‌వాల్‌లో చిన్న సమస్యను విపత్తు మాదిరిగా చూపిస్తున్నారు: ►గైడ్‌వాల్‌పై సమీక్షా సమావేవంలో ప్రస్తావన. ►గైడ్‌వాల్ డిజైన్లన్నీ కేంద్ర జలసంఘం - సీడబ్ల్యూసీ ఖరారుచేసిందని, వారి ఆమోదంతోనే పనులు చేశామని అధికారులు వెల్లడించారు. ►ప్రస్తుతం వచ్చిన సమస్యను కూడా వారికి నివేదించామని తెలిపారు. ► దీన్ని సరిదిద్దడం పెద్ద సమస్యకాదని, సీడబ్ల్యూసీ పరిశీలన కాగానే వారి సూచనల మేరకు వెంటనే మరమ్మతులు చేస్తామని చెప్పారు. కీలక పనుల్లో గణనీయ ప్రగతి: పోలవరం ప్రాజెక్టులో కీలక పనుల్లో ప్రగతిని అధికారులు సీఎంజగన్‌కు వివరించారు. ► స్పిల్‌వే కాంక్రీట్ పూర్తయ్యింది. ►48 రేడియల్ గేట్లు పూర్తిస్థాయిలో పెట్టారు. ► రివర్ స్లూయిస్ గేట్లు పూర్తయ్యాయి. ► ఎగువ కాఫర్ డ్యాంకూడా పూర్తయ్యింది. ► దిగువ కాఫర్ డ్యాం పూర్తయ్యింది. ► గ్యాప్ -3 వద్ కాంక్రీట్ డ్యాం పూర్తయ్యింది. ► పవర్‌హౌస్‌లో సొరంగాల తవ్వకం పూర్తయ్యింది. ► అప్రోచ్ ఛానల్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. ►ఈసీఆర్ఎఫ్ డ్యాంలో దెబ్బతిన్న గ్యాప్-1 ప్రాంతంలో ఇసుక నింపే కార్యక్రమం పూర్తయ్యింది. ఆప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్‌కూడా పూర్తయ్యింది. ►ఈసీఆర్‌ఫ్ గ్యాప్-2 ప్రాంతంలో నింపడానికి అవసరమైన 100శాతం ఇసుక రవాణా పూర్తయ్యింది. ►ఇక వాటిని నింపే పనులు చురుగ్గా ముందుకు సాగుతున్నాయి. ► నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని అధికారులు తెలిపారు. డయాఫ్రం వాల్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి: సీఎం ► దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ► ఇది పూర్తైతే మెయిన్ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్నారు. ► డిసెంబర్ కల్లా పనులు పూర్తిచేయడానికి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని అధికారులు తెలిపారు. నిర్వాసిత కుటుంబాలకు పునరాసంపైనా సీఎం సమీక్ష ►పునరావాసం కాలనీల్లో అన్ని సామాజిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ►కాలనీలు ఓవైపు పూర్తవుతున్న కొద్దీ, సమాంతరంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలి. ► నిర్వాసిత కుటుంబాల్లో 12658 కుటుంబాలను ఇప్పటికే తరలించామని అధికారులు చెప్పారు. ► షెడ్యూలు ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించేలా చూడాలని సీఎం ఆదేశించారు. పోలవరాన్ని మంచి టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దాలి ► పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని అద్భుతమైన టూరిజ్టు ప్రాంతంగా తీర్చిదిద్దాలి. ►పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలి. ► పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్ ఏర్పాటుకూడా చర్యలు తీసుకోవాలి. ►మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. -
CM Jagan Vizag Tour : విశాఖలో సీఎం వైఎస్ జగన్ (ఫొటోలు)
-
రాహుల్‌కి ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు: ఇది మీ హోదాకి తగ్గ పని కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీలో ఆకస్మికంగా పర్యటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఢిల్లీ యూనివర్సిటీ కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఇలా సడెన్‌గా యూనివర్సిటీలో పర్యటించడం కరెక్ట్ కాదని నోటీసులు పంపుతామని హెచ్చరింది. అన్నట్లుగానే ఢిల్లీ యూనివర్సిటీ రాహుల్ గాంధీకి బుధవారం నోటీసులు పంపించింది. జెడ్‌ప్లస్ భద్రతతో ఓ జాతీయ పార్టీ నాయకుడి హోదాలో ఉన్న రాహుల్‌కి ఇది తన స్థాయికి తగ్గ పని కాదని చురకలంటిస్తూ..రెండు పేజీల నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనను అతిక్రమణ, బాధ్యతరాహిత్యమైన ప్రవర్తనగా పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించింది. ఆ నోటీసులో హాస్టల్ ప్రవేశ నిర్దేశిత నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది. ఏ నాయకుడు యూనివర్సిటీలో మూడు వాహానాలతో యూనివర్సిటీలోకి ప్రవేశించేటప్పుడు ఆ నిబంధనలను అనుసరించాలని తెలిపింది. అలాగే హాస్టల్ ప్రాంగణంలో అకడమిక్ అండ్ రెసిడెంట్స్ కౌన్సిల్ కార్యకలాపాల్లో తప్ప మరే ఏ ఇతర కార్యకలాపాల్లో పాల్లొనకూడదని పేర్కొంది. హాస్టల్ యూనివర్సిట్ ఆఫ్ ఢిల్లీ చట్టం ప్రకారం కొన్ని కార్యకలాపాల్లో పాల్గొనేందుకు దానికంటూ కొన్ని నియమ, నిబంధనలు ఉంటాయని తెలిపింది. నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఏ కార్యక్రమాన్నైనా ఆపే హక్కు మాకు ఉందన్నారు. ఇది హాస్టల్ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రూల్కి సంబంధించిన క్రమశిక్షణలో భాగమని తెలిపారు. హాస్టల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, ఇతర సభ్యులు దీన్ని బాధ్యతరాహిత్యమైన చర్యగా పేర్కొంటూ తీవ్రంగా ఖండిస్తున్నామని నోటీసులో పేర్కొంది. అలాగే ఇలాంటి చర్య హాస్టలోని విద్యార్థుల భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని, అందువల్ల ఇలాంటి ఆకస్మిక చర్యలను మానుకోవాలని రాహుల్‌కి సూచిస్తూ యూనివర్సిటీ నోటీసులో పేర్కొంది. ఇదిలా ఉండగా గత శుక్రవారం రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీలో మెన్స్ పురుషుల హాస్టల్‌ని సందర్శించి..అక్కడ వారితో సంభాషించడమే గాక కలిసి భోజనం చేశారు. ఇదికాస్త సీరియస్ అంశంగా మారీ డీల్లీ యూనివర్సిటీ అధికారులు ఫైర్ అవ్వుతూ నోటీసులు పంపేందుకు దారితీసింది. (చదవండి: ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ ఆకస్మిక పర్యటన! నోటీసులు పంపుతామని వార్నింగ్) -
CM Jagan: విశాఖలో ముగిసిన సీఎం జగన్ పర్యటన
CM YS Jagan Vizag Tour Live Updates ► సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన ముగిసింది. ► ఏయూ కన్వెన్షన్ హాల్లో.. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులు సాహితి, సాయి కార్తికేయలను ఆశీర్వదించారు సీఎం వైఎస్ జగన్. ► బీచ్ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసింది ఈ మ్యూజియంను. మ్యూజియంను ప్రారంభించిన అనంతరం లోపల అధికారులతో కలియతిరిగి తిలకించారు సీఎం జగన్. ► సీ హ్యారియర్ మ్యూజియం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ ► మరికాసేపట్లో.. ఆర్కే బీచ్ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హ్యారియర్ యుద్ధ విమాన మ్యూజియం ప్రారంభించనున్న సీఎం జగన్. ► ఆరిలోవలోని అపోలో ఆస్పత్రిలో క్యాన్సర్ సెంటర్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం అక్కడి సిబ్బందితో ఆయన కాసేపు మాట్లాడి.. వాళ్ల విజ్ఞప్తి మేరకు గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం క్యాన్సర్ యూనిట్‌లోని రేడియేషన్ ఎక్విప్మెంట్ను పరిశీలించారు సీఎం జగన్. ► పీఎం పాలెం నుంచి అపోలో హాస్పటల్ కు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్. మరికాసేపట్లో ఆరిలోవలోని అపోలో క్యాన్సర్ సెంటర్ ప్రారంభం. ► వైఎస్సార్ క్రికెట్‌స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రంజీ ప్లేయర్స్‌తో ముచ్చటించారాయన. క్రీడల్లో మరింత రాణించాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ► విశాఖ పర్యటనలో.. పీఎం పాలెంలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో క్రీడాకారులను సీఎం జగన్ కలిశారు. మహిళా క్రికెటర్లు సబనామ్, అంజలిని ప్రత్యేకంగా అభినందించారాయన. కాసేపట్లో ఏపీఎల్ సీజన్-2 ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ► వైఎస్సార్ స్టేడియంలో ఫొటో ఎగ్జిబిషన్‌న్ సందర్శించిన సీఎం జగన్.. ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ సభ్యులతో గ్రూప్ ఫొటో దిగారు. ► క్రికెట్ స్టేడియంలో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్. ► పీఎం పాలెం చేరుకున్న సీఎం వైఎస్ జగన్. ► కాసేపట్లో పీఎం పాలెం(పోతులమల్లయ్య పాలెం)లోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియానికి సీఎం జగన్.. దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ. ► విశాఖ చేరుకున్న సీఎం వైఎస్ జగన్. ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం. నగర మేయర్ హరివెంకటకుమారితో పాటు మంత్రి అమర్నాథ్, విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు.. సీఎం జగన్‌కు ఆత్మీయ ఆహ్వానం పలికిన వాళ్లలో ఉన్నారు. ► పాలనా రాజధానిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు శంకుస్థాపనల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖకు బయల్దేరారు. ► విశాఖ పర్యటనలో భాగంగా.. తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి విశాఖకు విమానంలో బయల్దేరారు. నగరంలో వరుసగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారాయన. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: వైఎస్సార్సీపీలోకి తనయుడితో మాజీ ఎమ్మెల్యే -
తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి (ఫొటోలు)
-
'దీన్ని అలా చూడకూడదు..': భారత్ పర్యటనపై పాక్ మంత్రి వ్యాఖ్యలు
భారత్‌లోని గోవాలో వచ్చే నెల మే 4 నుంచి 5 వరకు షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్(ఎస్సీఓ) సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఆ సమావేశానికి బిలావల్ భుట్టో జర్దారీ పాక్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. ఈ మేరకు జర్దారీ పాక్ స్థానిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వచ్చే నెలలో గోవాలో జరిగే విదేశాంగ మంత్రుల సమావేశంలో తాను పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. తాము ఎస్సీఓ చార్టర్‌కు కట్టుబడి ఉన్నాం అని చెప్పారు. తాను ఈ సమావేశంలో పాలుపంచుకోవడం అనేది SCO చార్టర్ పట్ల పాక్‌కు ఉన్న నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తోందన్నారు. ఈ పర్యటనను ద్వైపాక్షిక సంబంధాల కోణంలో చూడకూడదని జర్దారీ అన్నారు. కాగా, దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత భారత్‌లో పర్యటించనున్న తొలి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో. చివరిసారిగా 2011లో అప్పటి పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ భారత్‌లో పర్యటించారు. భారత్‌లో జరగనున్న విదేశాంగ మత్రుల సమావేశానికి పాక్, చైనాతో సహా షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సభ్యులందరికీ భారత్ అధికారికంగా ఆహ్వానాలు పంపింది. ఈ సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. గతేడాది సెప్టంబర్లో తొమ్మిది మంది సభ్యులతో కూడిన మెగా గ్రూపింగ్‌కు భారతదేశం ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించగా, ఈ ఏడాది కీలక మంత్రి వర్గ సమావేశాలు, శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించనుంది. ఈ 20 ఏళ్ల షాంఘై సహకార సంస్థలో రష్యా, ఇండియా, చైనా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇందులో ఇరాన్ ఇటీవలే తాజగా సభ్యత్వం పొందిన దేశం. పైగా తొలిసారిగా ఇరాన్ బారత్ సారథ్యంలో పూర్తిస్థాయి సభ్యునిగా గ్రూపింగ్ సమావేశానికి హాజరవుతోంది. ఇక షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 2022లో ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్లో జరిగింది. దీనికి నరేంద్ర మోదీ హజరయ్యారు. అంతేగాదు జూన్ 2019 కిర్గిజిస్థాన్‌లో షాంఘై సదస్సు తదనంతరం జరిగి తొలి వ్యక్తిగత శిఖరాగ్ర సదస్సు కూడా ఇదే. (చదవండి: ఇద్దరి అధికారహం, అంతర్యుద్ధం.. సామాన్యుల ఆకలి కేకలు) -
సీఎం జగన్ ను చూసేందుకు జనం ఉరుకులు పరుగులు
-
కిమ్స్ ఆసుపత్రి లో చీమలపాడు క్షతగాత్రులు
-
యుద్ధం తర్వాత ఇదే తొలిసారి.. భారత్‌లో పర్యటించనున్న ఉక్రెయిన్ మంత్రి!
ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా భారత్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితులు, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ సమస్యలపై చర్చించనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఆమెకిదే మొదటి అధికారిక పర్యటన కావడం గమనార్హం. సోమవారం( ఏప్రిల్ 10) భారత్‌లో అడుగుపెట్టనున్న జపరోవా... నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఝపరోవా ఈ పర్యటనలో విదేశాంగ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో పాటు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్రీని కూడా కలవనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్ భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలు, బహుముఖ సహకారాన్ని పంచుకుంటోంది. దౌత్య సంబంధాలను నెలకొల్పిన గత 30 సంవత్సరాలలో, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం వాణిజ్యం, విద్య, సంస్కృతి, రక్షణ రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించింది. పరస్పర అవగాహన, ఆసక్తులను మరింత పెంచుకునేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని‘ తెలిపింది. ఈ పర్యటనలో ఆమె ప్రధాని నరేంద్ర మోదీని కైవ్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించే అవకాశం ఉన్నట్ల ఓ వార్తాపత్రిక పేర్కొంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు ఉక్రెయిన్ నాయకుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో అనేక సార్లు మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య సమస్యని శాంతియుతంగా పరిష్కరించాలని సూచిస్తూ వచ్చారు. -
PM Modi: హైదరాబాద్ టూర్ ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, యాదాద్రి: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 8న రాష్ట్రంలో ప్రధాని పాల్గొనే కార్యక్రమాల వివరాలను పీఎంవో బుధవారం వెల్లడించింది. శుక్రవారం ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోనున్న మోదీ.. సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. బీబీ నగర్ ఎయిమ్స్‌లో పలు అభివృద్ధి పనులను ఇక్కడి నుంచే వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఐదు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు రైల్వేకు సంబంధించిన ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నట్లు పీఎంవో పేర్కొంది. మొత్తం రూ.11,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు వివరించింది. ఐటీ సిటీ టూ టెంపుల్ సిటీ సికింద్రాబాద్–తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఐటి సిటీ హైదరాబాద్‌ను, శ్రీ వేంకటేశ్వర స్వామి నివాసమైన తిరుపతిని కలుపుతుందని పీఎంవో తెలిపింది. ఇది మూడు నెలల స్వల్ప వ్యవధిలో తెలంగాణ నుంచి ప్రారంభం అవుతున్న రెండో వందే భారత్ రైలు అని తెలిపింది. ఇలావుండగా రూ.720 కోట్లతో ప్రపంచ స్థాయి సౌకర్యాలు, సుందరీకరణతో రూపొందించనున్న సికింద్రాబాద్ ఐకానిక్ రైల్వేస్టేషన్ భవనానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. కొత్తగా 13 ఎంఎంటీఎస్ సేవలు! హైదరాబాద్ – సికింద్రాబాద్ సబర్బన్ విభాగంలో 13 కొత్త మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సరీ్వస్ సేవలకు ప్రధానమంత్రి ఫ్లాగ్–ఆఫ్ చేస్తారు. సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుదీకరణ పనులను కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. బీబీనగర్ ఎయిమ్స్ దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి దృష్టికి నిదర్శనమని పీఎంఓ తెలిపింది. రూ.1,365.95 కోట్ల వ్యయంతో పనులు బీబీనగర్ ఎయిమ్స్‌కు ఉన్న 201.65 ఎకరాల స్థలంలో రూ.1,365.95 కోట్ల వ్యయంతో 750 పడకల ఆస్పత్రి, 20 భవన సముదాయాలు నిర్మించడంతో పాటు ఇతర వసతులు కల్పించనున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా విలేకరులకు తెలిపారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలతో పాటు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రజలకు సైతం వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఎయిమ్స్‌లో 15 రకాల వ్యాధులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందజేస్తామన్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ వెయ్యి మంది వరకు ఓపీడీ సేవలు అందజేస్తున్నామని, 13 సాధారణ బెడ్లు, 20 ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 1,200 శస్త్రచికిత్సలు చేశామని వెల్లడించారు. అత్యాధునిక వైద్యంతో పాటు డయాలసిస్, రేడియోథెరపీ సేవలు అందిస్తామన్నారు. -
సీఎం జగన్ పశ్చిమగోదావరి పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(ఆదివారం) పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడిలో పర్యటించనున్నారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరుకానున్నారు. సాయంత్రం 3.50 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 4.20 గంటలకు కలగంపూడి చేరుకుంటారు. 4.30 గంటలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. అనంతరం 5.15 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 5.55 తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు. చదవండి: GIS: విశాఖ జీఐఎస్ సూపర్ సక్సెస్ -
Gopichand Latest Photos: అసిస్టెంట్ గృహా ప్రవేశానికి హాజరైన గోపీచంద్.. ఫోటోలు వైరల్
-
తిరుమల శ్రీవారి సేవలో క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్
-
కొంప ముంచిన ‘చంద్రబాబు’ టూర్.. ‘సీట్లు’ సితారయ్యేలా సిగపట్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పార్టీని బలోపేతం చేస్తామంటూ వచ్చిన చంద్రబాబు తమను గోదాట్లో ముంచి పోతున్నట్టుగా ఉందని తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ సీట్లకు సెగ పెట్టేందుకే ఆయన వచ్చినట్టుగా ఉందని నియోజకవర్గ ఇన్చార్జిలు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు మూడు రోజుల పర్యటన వల్ల ప్రయోజనం మాట దేవుడెరుగు.. కొత్త సమస్యలతో తల బొప్పి కట్టిందంటున్నారు. చంద్రబాబు పర్యటనలో టీడీపీ విభేదాలు రచ్చకెక్కి సిట్టింగ్‌ల సీట్లకు సెగ తగిలింది. తొలి రోజు బుధవారం రాజానగరంలో మొదలైన విభేదాలు చివరి రోజైన శుక్రవారం పెద్దాపురంలో కూడా కొనసాగాయి. అధినేత పర్యటనతో సీన్ రివర్స్ అయ్యిందని ఇన్చార్జిలు తల పట్టుకుంటున్నారు. వర్గ విభేదాలపై నియోజకవర్గ కార్యకర్తల సమీక్షల్లో చంద్రబాబు దాటవేశారని క్యాడర్ పెదవి విరుస్తున్నారు. రాజానగరంలో కేరాఫ్ లేదు చంద్రబాబు తీరుతో నొచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ టీడీపీ రాజానగరం ఇన్చార్జి పదవికి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన తప్పుకున్న తరువాత ఆ పార్టీకి అక్కడ దిక్కు లేకుండా పోయింది. మరొకరిని ప్రకటిస్తారని ఎదురు చూశారు. పుట్టి మునిగిపోతున్న పార్టీ బరువు మోయడానికి నాయకులెవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ తరుణంలో తమ సామాజికవర్గానికే సీటు ఇవ్వాలంటూ బీసీకి చెందిన బార్ల బాబూరావు అసమ్మతి గళం వినిపించారు. పెందుర్తి అనుయాయుడు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు తనకాల నాగేశ్వరరావు, వ్యతిరేక వర్గం నుంచి బర్ల బాబూరావు మధ్య ఆధిపత్య పోరు రోడ్డున పడింది. ఎవరూ దిక్కులేక ఇన్చార్జిగా తమ నేతనే కొనసాగిస్తున్నారని పెందుర్తి వర్గం బాహాటంగా చెప్పడమే వివాదానికి కారణమైంది. అందుకే కోరుకొండలో చైతన్య రథం పైకి చంద్రబాబు పిలిచినా పెందుర్తి వెళ్లలేదని తెలిసింది. వర్మా.. ఇదేం ఖర్మ! పిఠాపురం టీడీపీలో తిరుగులేని నాయకుడిగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే, ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మకు తొలిసారి పెద్ద షాక్ తగిలింది. ఆయన వ్యవహార శైలితో విసుగెత్తిపోయిన వారందరూ ఒక్కటై జగ్గంపేటలో చంద్రబాబును కలిసి అసంతృప్తి గళం వినిపించారు. ఇక్కడ పార్టీ రెండుగా చీలిపోయింది. జ్యోతుల సతీష్, మాదేపల్లి శ్రీను, దుడ్డు నాగు, కుంపట్ల సత్యనారాయణ తదితరులు వర్మతో విభేదిస్తున్నారు. ఈ వర్గానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు నవీన్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. వర్మ అసంతృప్తి వాదులు బాబును కలవడానికి నవీన్ ఆశీస్సులు లేకపోలేదని అంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరొచ్చినా నవీన్ కలుపుతారని ఆ వర్గం సమర్థించుకుంటోంది. కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న పిఠాపురం నుంచి ఆ సామాజికవర్గ నేతలు నవీన్‌ను ప్రతిపాదిస్తున్నారు. అందుకే 40 కార్లలో వెళ్లి, వర్మకు సీటిస్తే పని చేసేది లేదని ఆయన వ్యతిరేకులు తమ అధినేతకు తెగేసి చెప్పారు. వర్మ సీటుకు ఎసరు పెట్టేందుకు చర్యలు మొదలయ్యాయని వినికిడి. మాజీ ఎమ్మెల్యే వర్మకు వ్యతిరేకంగా గళం విప్పిన తమ్ముళ్లు ప్రత్తిపాడులో రోడ్డెక్కిన నిరసన టీడీపీ ప్రత్తిపాడు ఇన్చార్జి వరుపుల రాజాకూ నిరసన సెగ తాకింది. రాజాను తప్పించాలంటూ ఆ పార్టీ నేతలు ఏలేశ్వరం మెయిన్ రోడ్డులో ఎనీ్టఆర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించే వరకూ వెళ్లారు. బీసీ నేత పైల సుభాష్ చంద్రబోస్‌కు టిక్కెట్టు ఇవ్వాలంటూ ఏపూరి శ్రీను, రొంగల సూర్యారావు తదితరులు రచ్చ చేశారు. దీని వెనుక కర్త, కర్మ, క్రియ అంతా సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూయేనని రాజా వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతుల మద్దతు లేకుండా బోస్ అంతటి సాహసం చేయలేరని అంటున్నారు. గత ఎన్నికల్లో నెహ్రూ తనయుడు, పార్టీ ప్రస్తుత కాకినాడ జిల్లా అధ్యక్షుడు నవీన్‌కు ఎంపీ సీటు రాకుండా రాజా అడ్డు పడ్డారనే చర్చ పార్టీలో ఉంది. పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ద్వారా మంత్రాంగం నడిపినందువల్లనే ఇప్పుడు బోస్ ద్వారా రాజాపై తాజాగా ప్రతీకారం తీర్చుకున్నారని తెలుస్తోంది. బోస్‌కు ప్రమాదం జరిగితే జ్యోతుల పరామర్శకు రావడం, జగ్గంపేటలో నవీన్ పాదయాత్రకు బోస్ తరచూ వెళ్లి మద్దతు తెలపడం వీరి అవగాహనను చాటుతున్నాయి. రాజప్పా.. మాకొద్దప్పా.. కాకినాడ జిల్లాలో ఏకైక టీడీపీ ఎమ్మె ల్యే నిమ్మకాయల చినరాజప్ప. చంద్రబాబు పక్కన ఉండగానే ఈయనకు పార్టీ శ్రేణుల నుంచి నిరసన సెగ తాకింది. రోడ్‌షో వేట్లపాలెం వెళ్లేసరికి మాజీ ఎమ్మె ల్యే దివంగత బొడ్డు భాస్కరరామారావు వర్గీయులు ‘టీడీపీ ముద్దు – చినరాజప్ప వద్దు’ అంటూ నిరసనకు దిగారు. ఒకప్పుడు ఈ నియోజకవర్గానికి తిరుగులేని నాయకుడిగా ఒక వెలుగు వెలిగిన భాస్కర రామారావు స్థానే చినరాజప్ప రెండు పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యారు. మూడోసారి చినరాజప్పను ఎమ్మెల్యేను చేయాలని గురువారం రాత్రి పెద్దాపురంలో బాబు ప్రకటించారు. చదవండి: టీడీపీకి బీసీలు బైబై..! కారణం ఇదే.. దీంతో ఆశవహుల్లో అసంతృప్తి రాజుకుంది. పెద్దాపురం టిక్కెట్టు రేసులో చినరాజప్ప కాకుండా బొడ్డు సామాజికవర్గం నుంచి వెంకట రమణ, గుణ్ణం చంద్రమౌళి ఉన్నారు.æ చంద్రబాబు ప్రకటన ఆ వర్గీయుల్లో అసంతృప్తి రాజేసింది. వేట్లపాలెంలో తన కళ్లెదుటే చోటు చేసుకున్న ఈ పరిణామంతో అవాక్కైన చంద్రబాబు.. ఇది పద్ధతి కాదు అంటూనే దివంగత భాస్కర రామారావు సేవలను కొనియాడుతూ శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినా ‘రాజప్పా గోబ్యాక్’ అంటూ వ్యతిరేకులు నినాదాలు చేశారు. మొత్తంమీద చంద్రబాబు మూడు రోజుల పర్యటనతో నియోజకవర్గ ఇన్చార్జిలు కక్కలేక మింగలేక అన్నట్టుగా తయారయ్యారు. -
డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహ పనులను పరిశీలించిన ఏపీ మంత్రులు
-
వైఎస్సార్ జిల్లాలో రేపు సీఎం జగన్ పర్యటన
సాక్షి, వైఎస్సార్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం జమ్ములమడుగు, పులివెందులలో కార్యక్రమాల కోసం ఆయన వెళ్లనున్నారు. సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్యు స్టీల్‌ప్లాంటుకు భూమిపూజ, ఆపై పులివెందులలో ఓ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరు అవుతారు. సీఎం పర్యటన షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 9 గంటల ప్రాంతంలో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పదకొండు గంటల ప్రాంతంలో జమ్ములమడుగు మండలం సున్నపురాళ్ళపల్లె చేరుకుంటారు. ఆపై జేఎస్‌డబ్యు స్టీల్‌ప్లాంటుకు సంబంధించి భూమిపూజ, శిలాఫలకాలు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే స్టీల్ ప్లాంటు మౌలిక సదుపాయాలపై సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నాం ఒంటిగంట ప్రాంతంలో పులివెందుల చేరుకుంటారు. అక్కడి ఎస్సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మూలి బలరామిరెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
కందుకూరులో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన కొమ్మినేని
-
భద్రాద్రిలో రాష్ట్రపతి పర్యటన.. 144 సెక్షన్ విధింపు
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి జిల్లాలో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్‌కు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు(బుధవారం) ఆమె భద్రాచలం ఆలయానికి రానున్నారు. బుధవారం భద్రాచలం శ్రీసీతారాముడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా.. భద్రాచలంలో 144 సెక్షన్ విధించారు. ఉదయం ఏడు గంటల నుంచి 144 సెక్షన్ అమలులోకి రానుంది. రాకపోకల నిలిపివేత ఉంటుంది. సుమారు 2 వేల మంది పోలీసులతో, 350 అధికారులు రాష్ట్రపతి భద్రతను పర్యవేక్షించనున్నారు. అలాగే.. రాష్ట్రపతి రాక నేపథ్యంలో సారపాక బీపీఎల్ స్కూల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు అధికారులు. హెలిప్యాడ్ నుంచి ఆలయం చుట్టూ ప్రోటోకాల్ కాన్వాయ్ ట్రయల్ నిర్వహించారు. ఉదయం పది గంటల ప్రాంతంలో సీతారాములను దర్శించుకుంటారు. దేశ ప్రథమ పౌరురాలి రాక సందర్భంగా.. ఉదయం 8 గంటల నుంచి 11.30గం. దాకా అన్ని దర్శనాలు బంద్ కానున్నాయి. ఇక తెలంగాణలో మూడు రోజులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తారు. ఈ నెల 28న అంటే బుధవారం భద్రాచలం సీతారాములను దర్శించుకుంటారు. ఈ నెల 29న ముచ్చింతల్ సమతా స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ నెల 30న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. -
గురుద్వారాని సందర్శించి..పూజలు చేసిన కింగ్ చార్లెస్: వీడియో వైరల్
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ లండన్‌కి 30 కి.మీ దూరంలో లూటన్ అనే పట్టణంలో కొత్తగా నిర్మించిన గురుద్వారాను సందర్శించారు. అక్కడ పూజలు చేసి భక్తులతో మమేకమయ్యారు. ఈ మేరకు గురద్వారాకు విచ్చేసిన ప్రిన్స్ చార్లెస్‌కు వివిధ మతాలకు చెందిన పిల్లలు సిక్కు జెండాలతో స్వాగతం పలికారు. అక్కడ పిండివంటలు తయారు చేసే పాకశాలను, అక్కడ పనిచేసే వాలంటీర్లను కలిశారు. వారానికి ఏడు రోజులు, ఏడాదిలో 365 రోజులు గురుద్వారా శాఖాహారంతో కూడిని వేడి వేడి భోజనాన్ని అందిస్తుంది. కోవిడ్ మహమ్మారీ సమయంలో వారు చేసిన సేవలను కూడా ఎంతగానే కొనియాడారు. ఈ గురద్వార్లో కోవిడ్ వ్యాక్సిన్ క్లినిక్‌ని నడుపుతోంది. అలాగే వ్యాక్సిన్‌కి సంబంధించి అపోహలను పోగొట్టేలా గురుద్వార్ ఇతర ప్రార్థన స్థలాలకు సహాయ సహకారాలను అందించి ప్రోత్సహించింది. At the newly built Guru Nanak Gurdwara, His Majesty met volunteers who run the Luton Sikh Soup Kitchen Stand. The kitchen provides vegetarian hot meals 7 days a week, 365 days a year at the Gurdwara. pic.twitter.com/G6DaMkfkeW — The Royal Family (@RoyalFamily) December 6, 2022 (చదవండి: జిన్‌పింగ్ మూడు రోజుల సౌదీ పర్యటన...టెన్షన్లో అమెరికా) -
జిన్‌పింగ్ సౌదీ పర్యటనతో..టెన్షన్లో పడిన అమెరికా
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బుధవారం నుంచి సౌదీ అరేబియాలో మూడు రోజుల అధికారిక పర్యటన చేయనున్నారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ సౌదీలోని చైనా గల్ఫ్ సహకార మండలి(జీసీసీ) సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు జిన్‌పింగ్ తన మూడు రోజుల అధికారిక పర్యటన కోసం అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు గల్ఫ్ కింగ్డమ్కి చేరుకుంటారని సౌదీ మీడియా పేర్కొంది. ఈ పర్యటనలో సౌదీ రాజు సల్మాన్ అధ్యక్షతన ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఉంటుంది. దీనికి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్‌సల్మాన్ హాజరవుతారని సౌదీ ప్రభుత్వ మీడియా నివేదికలో పేర్కొంది. అలాగే ఆరుగురు సభ్యులతో కూడిన జీసీసీకి చెందిన పాలకుల శిఖరాగ్ర సమావేశానికి జిన్ పింగ్ హాజరవుతారని, పైగా మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాల నాయకులతో కూడా సమావేశమై చర్చలు జరుపుతారని నివేదికలో వెల్లడించింది. జీసీసీ అనేది బహ్రెయిన్ , కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్లతో కూడిన ప్రాంతీయ అంతర్ ప్రభుత్వ రాజకీయ ఆర్థిక సంఘం. ఐతే ప్రస్తుతం జిన్‌పింగ్ సౌదీ రాక అమెరికాను కాస్త కలవరపాటుకు గురిచేస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చమురు అభ్యర్థనను తిరస్కరించిన నేపథ్యంలో సౌదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి రెడ్‌కార్పెట్ పరిచి ఆహ్వానించటం అనేది యూఎస్‌ని టెన్షన్‌కి గురి చేసే అంశమే. అదీగాక అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్ మధ్య ప్రాచ్యాన్ని బీజింగ్‌కి అప్పగించదు అని తేల్చిన నేపథ్యంలో జరుగుతున్న జిన్‌పింగ్ పర్యటనే కావడం. అంతేగాక వాషంగ్టన్ని ప్రభావితం చేసే దేశాలతో లింక్ అప్ పెంచుకోవాలనే చైనా కోరికను తేటతెల్లం చేస్తోంది ఈ పర్యటన. మరోవైపు సౌదీ ముడి చమురుకి సంబంధించి చైనా ఏ అతిపెద్ద కస్టమర్ కూడా. ఐతే ఈ పర్యటనలో సౌదీ ఆర్థిక వ్యవస్థను చమురు నుంచి వైవిధ్యపరచాలనే ప్రిన్స్ మహ్మద్ ఆలోచనకు అనుగుణంగా మెగాప్రాజెక్టులలో చైనా సంస్థలు మరింతగా భాగస్వామ్యమయ్యేలా ఒప్పందాలపై ఇరు దేశాల నాయకులు చర్చిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. జిన్‌పింగ్ చివరిసారిగా 2016లో సౌదీ అరేబియాను సందర్శించారు. (చదవండి: సినీఫక్కీలో దోపిడీ: జస్ట్ 60 సెకన్లలో 7 కోట్ల విలువైన కార్లను కొట్టేశారు: వీడియో వైరల్) -
మహబూబ్ నగర్ లో సీఎం కేసీఆర్ పర్యటన
-
విశాఖలో నేవీ డే వేడుకలు: ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము
Time: 5:21PM విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీడే వేడుకలు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేవీడే వేడుకలను తిలకిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము Time: 03:53PM ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము Time 02:53PM రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ పర్యటన ముగించుకుని విశాఖకు బయల్దేరారు. Time 12:49 PM అధికారిక విందులో పాల్గొన్న రాష్ట్రపతి విజయవాడ రాజ్‌భవన్‌కు ద్రౌపది ముర్ము చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ స్వాగతం పలికారు. రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఏర్పాటు చేసిన అధికారిక విందులో ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. Time 12:15 PM మీ సాదర స్వాగతానికి కృతజ్ఞతలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రేమకు భాష అడ్డంకి కాకూడదని.. అందుకే తాను హిందీలో మాట్లాడుతున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ ముర్ము తెలుగులో మాట్లాడారు. మీ సాదర స్వాగతానికి కృతజ్ఞతలు. వేంకటేశ్వరస్వామి కొలువైన ఈ పవిత్ర భూమికి రావడం సంతోషంగా ఉంది. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. కూచిపూడి పేరుతో ప్రారంభమైన నాట్యకళ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని రాష్ట్రపతి అన్నారు. Time 12:06 PM ఏపీ ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన రాష్ట్రం: గవర్నర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ తరఫున స్వాగతం పలుకుతున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. ఏపీ ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన రాష్ట్రం. తెలుగు భాషకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. ప్రపంచంలోనే తెలుగు అత్యంత మధురమైన భాషగా రవీంద్రనాథ్ ఠాగూర్ కీర్తించారు. కృష్ణా, గోదావరి లాంటి ఎన్నో జీవ నదులు ఉన్న రాష్ట్రం ఏపీ అని గవర్నర్ అన్నారు. Time 11:55 AM ముర్ము జీవితం అందరికీ ఆదర్శం: సీఎం జగన్ గిరిజన మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టడం గొప్ప విషయం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పౌర సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక వేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, గొప్ప మహిళగా ద్రౌపది ముర్ము అందరికీ ఆదర్శమన్నారు. దేశ చరిత్రలో ముర్ము ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదుర్కొన్న ముర్ము జీవితం అందరికీ ఆదర్శమని సీఎం అన్నారు. Time 11:47 AM రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పౌరసన్మానం పోరంకిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పౌర సన్మానం చేశారు. సన్మాన కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్రపతికి సీఎస్ జవహర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. Time 10:54 AM రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ ►రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ద్రౌపది ముర్ము తొలిసారిగా ఏపీలో పర్యటిస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి.. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. పోరంకి మురళి రిసార్ట్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పౌర సన్మాన కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరవుతారు. అనంతరం.. రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఏర్పాటు చేసిన అధికారిక విందులో పాల్గొంటారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం, సోమవారం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. సాక్షి, అమరావతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ఆమె రాష్ట్ర పర్యటనకు రానుండటం ఇదే తొలిసారి. గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలకనున్నారు. అలాగే రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అధికారిక విందు ఏర్పాటు చేశారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం, సోమవారం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన ఇలా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి పోరంకి మురళి రిసార్ట్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పౌర సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతిని ఘనంగా సన్మానిస్తారు. అనంతరం అక్కడి నుంచి ద్రౌపది ముర్ము రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ ఇచ్చే అధికారిక విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నంలోని నావల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడ జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో నూతన రహదారులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఆదివారం రాత్రి విశాఖపట్నం నుంచి నేరుగా తిరుపతి చేరుకుంటారు. సోమవారం ఉదయం తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకుని గోశాలను సందర్శిస్తారు. తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థినులతో ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా భేటీ అవుతారు. సోమవారం మధ్యాహ్నం తిరుపతి నుంచి నేరుగా ఢిల్లీకి పయనమవుతారు. -
రేపు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన
-
మదనపల్లెకు సీఎం వైఎస్ జగన్
-
నరసాపురంలో నవశకం..
-
కర్నూలు పర్యటనలో చంద్రబాబుకు చేదు అనుభవం
-
మోదీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..!
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఈ నెల 12వ తేదీన నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బేగంపేట ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు. పంజాగుట్ట–గ్రీన్ ల్యాండ్స్–ప్రకాశ్ నగర్ టీ జంక్షన్, రసూల్‌పురా టీ జంక్షన్, సీటీవో మార్గాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. అలాగే సోమాజిగూడ, మోనప్ప ఐలాండ్, రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ జంక్షన్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. కావున ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. చదవండి: హైదరాబాద్ ఐఎస్బీలో విద్యార్థిపై దాడి #TrafficAdvisory - In view of the visit of Hon’ble Prime Minister of India to Hyderabad on 12th November 2022 moderate traffic congestion is expected on the roads leading to and surroundings of Begumpet Airport, Hyderabad. Citizens/commuters are...https://t.co/11VXja6qtp pic.twitter.com/rWACYiE8Yr — Hyderabad City Police (@hydcitypolice) November 11, 2022 -
ఏపీ మంత్రి అంబటి రాంబాబు పోలవరం పర్యటన
-
ఉత్తరాఖండ్ లో ప్రధాని మోదీ పర్యటన
-
22న సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటన
కుప్పం(చిత్తూరు జిల్లా): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 22న కుప్పం రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్ ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ స్థలాలను గురువారం పరిశీలించారు. కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నట్లు నేతలు తెలిపారు. చదవండి: చంద్రబాబు 420.. లోకేశ్ 210