న్యూఢిల్లీ: 21వ ఆసియాన్-ఇండియా, 19వ తూర్పు ఆసియా సదస్సులలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం లావోస్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ లావోస్ పర్యటన ఆసియాన్ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ తన పర్యటన సందర్భంగా పేర్కొన్నారు.
పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ లావోస్‌తో భారతదేశానికి సన్నిహిత సాంస్కృతిక, నాగరికత సంబంధాలు ఉన్నాయని ప్రధాని అన్నారు. లావోస్ ప్రధాని సోనెక్సా సిఫనాడోన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం వియంటియాన్ చేరుకోనున్నారు. అక్కడ జరిగే 21వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 19వ తూర్పు ఆసియా సదస్సులలో ప్రధాని పాల్గొంటారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జైదీప్ మజుందార్ మాట్లాడుతూ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని హాజరుకావడం ఇది 10వ సారని తెలిపారు. ప్రధాని మోదీ, సిపాండన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం ఉంటుందని మజుందార్ తెలిపారు. సాంస్కృతిక ప్రదేశాల పునరుద్ధరణ, విద్యుత్ ప్రాజెక్టులు తదితర అనేక అంశాలపై చర్చజరగనున్నదని తెలిపారు. మయన్మార్‌లో కొనసాగుతున్న సంఘర్షణలపై ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ పర్యటలో చర్చించనున్నారని మజుందార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment