సోమనాథుని సన్నిధిలో ప్రధాని మోదీ పూజలు | Prime Minister Narendra Modi Offered Prayers at Somnath Temple | Sakshi
Sakshi News home page

సోమనాథుని సన్నిధిలో ప్రధాని మోదీ పూజలు

Published Mon, Mar 3 2025 6:56 AM | Last Updated on Mon, Mar 3 2025 6:56 AM

Prime Minister Narendra Modi Offered Prayers at Somnath Temple

గిర్‌ సోమనాథ్‌: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయంలో పూజలు చేశారు. సోమనాథ్‌ క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అంతకుముందు ప్రధాని మోదీ జామ్‌నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమైన ‘వంతారా’ను సందర్శించారు. సోమనాథ్‌ ఆలయాన్ని సందర్శించిన తర్వాత మోదీ సమీపంలోని జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయమైన సాసన్‌ చేరుకున్నారు.

ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Maha Kumbh Mela) ముగిసిన తర్వాత సోమనాథుణ్ణి పూజించాలనే తన సంకల్పంలో భాగంగా ఈ సందర్శన జరిగిందని  ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ పోస్టులో పేర్కొన్నారు. ‘కోట్లాది మంది దేశప్రజల కృషితో ప్రయాగ్‌రాజ్‌లో ‘ఐక్యతా మహాకుంభ్’ విజయవంతమయ్యింది. ఒక భక్తునిగా మహా కుంభమేళా  అనంతరం 12 జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగమైన శ్రీ సోమనాథుణ్ణి(The Jyotirlinga of Sri Somanath) పూజించాలని నా మనస్సులో నిశ్చయించుకున్నాను’ అని తెలిపారు. 

‘ఈ రోజు సోమనాథుని ఆశీస్సులతో నా సంకల్పం నెరవేరింది. దేశప్రజలందరి తరపున, నేను ఐక్యతా మహా కుంభ్ విజయాన్ని సోమనాథుని పాదాలకు అంకితం చేస్తున్నాను. అలాగే దేశప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం ససాన్‌లోని 'లయన్ సఫారీ'ని ప్రధానమంత్రి సందర్శించనున్నారు. అలాగే జాతీయ వన్యప్రాణి బోర్డు (ఎన్‌బీడబ్ల్యూఎల్‌) సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.


ఇది కూడా చదవండి: India Bhutan Train : త్వరలో భారత్‌-భూటాన్‌ రైలు.. స్టేషన్లు ఇవే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement