somanath
-
ఇస్రో తదుపరి చైర్మన్‌గా నారాయణన్
ఢిల్లీ: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తదుపరి ఛైర్మన్‌గా వి.నారాయణన్ (Narayanan) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.ఇస్రో తదుపరి చైర్మన్‌గా వి.నారాయణన్‌ను కేంద్రం నియమించింది. ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ పదవీకాలం ముగుస్తుండటంతో ఈ నెల 14న నారాయణన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, నారాయణన్ రెండేళ్ల పాటు ఇస్రో చైర్మన్‌గా బాధ్యతల్లో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన వలియమలాలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. రాకెట్ వ్యవస్థ, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్‌కు సంబంధించి నాలుగు దశాబ్దాలుగా పలు హోదాల్లో ఆయన పనిచేస్తున్నారు.నారాయణన్ ఖరగ్‌పూర్ ఐఐటీలో క్రయోజనిక్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌తో పాటు ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేశారు. ఎంటెక్‌లో మొదటి ర్యాంక్ సాధించినందుకు అతనికి సిల్వర్ మెడల్ లభించింది. ఇక, 1984లో ఆయన ఇస్రోలో చేరారు. 2018లో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నారాయణన్ సేవలను గుర్తిస్తూ ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చాయి.🚨 V. Narayanan has been appointed as the New Chairman of ISRO and Secretary, Department of Space for a period of two years with effect from February 14, 2025.Currently leading ISRO's Liquid Propulsion Systems Centre(LPSC),#ISRO #Space #VNarayanan #SSomanath #ISROChairman pic.twitter.com/IkiaHzXVv7— Aman Kumar 🇮🇳 (@amankmr02) January 7, 2025ఇస్రో చైర్మన్‌గా బాధత్యలు చేపట్టనున్న నేపథ్యంలో నారాయణన్ స్పందించారు. ఈ సందర్బంగా కేరళలోని తిరువనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్ కోసం మాకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది. మా వద్ద ప్రభావంతులైన శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రయోగాల్లో ఇస్రోను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఎల్పీఎస్సీ డైరెక్టర్‌గా నారాయణన్ జీఎస్ఎల్వీ ఎంకే 3కి సంబంధించి సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. నారాయణన్ సారథ్యంలోనే పలు ఇస్రో మిషన్ల కోసం ఎల్పీఎస్సీ ఇప్పటివరకు 183 లిక్విడ్ ప్రొపల్షన్ వ్యవస్థలను, కంట్రోల్ పవర్ ప్లాంట్లను అందించింది. పలు ఇస్రో ప్రాజెక్టులో ఆయన కీలక పాత్ర పోషించారు. వాటిల్లో ఆదిత్య స్పేస్‌క్రాప్ట్ రూపకల్పన, జీఎస్ఎల్వీ ఎంకే 3 మిషన్ వంటి కీలకమైనవి. కాగా, ప్రస్తుత చైర్మన్ సోమనాథ్ 2022 జనవరిలో ఇస్రో చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. -
శ్రీహరికోట : ఇస్రో మరో ఘనత.. నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ-డీ3 (ఫొటోలు)
-
కేంద్ర కేబినెట్ కొత్త కార్యదర్శిగా టీవీ సోమనాథన్
కేంద్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్‌ను కేబినెట్ కొత్త సెక్రటరీగా శనివారం నియమించింది. ఆగష్టు 30 నుంచి రెండేళ్లపాటు కేబినెట్ సెక్రటరీ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.కాగా సోమనాథన్ 1987 బ్యాచ్‌కు చెందిన తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం సోమనాథన్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంతక ముందు ప్రధాన మంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శి, జాయింట్ సెక్రటరీగా పనిచేశాడు. అంతేగాక వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ గ్రూపులో డైరెక్టర్‌గా పనిచేశాడు. కాగా ప్రస్తుతం జార్ఖండ్ కేడర్‌కు చెందిన 198 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ గౌబా 2019 నుంచి భారత కేబినెట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అతని పదవీకాలాన్ని సంవత్సర కాలం వ్యవధితో ఇప్పటి వరకు 4 సార్లు పొడిగించారు.కేబినెట్ సెక్రటరీ.. అనేది అత్యున్నత స్థాయి కార్యనిర్వాహక అధికారి. సివిల్ సర్వీసెస్‌లో సీనియర్ మోస్ట్ పదవి. వీరు నేరుగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తారు. వివిధ మంత్రిత్వ శాఖలలో వ్యాపార లావాదేవీలను సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వ పరిపాలనకు బాధ్యత వహిస్తారు. -
ఇస్రో చైర్మన్ కల నెరవేరిన వేళ.. ఇకపై డాక్టర్ సోమనాథ్
గతేడాది ఆగస్టు 23న చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపిన సమయంలోనూ ఆయన అంత సంతోష పడలేదేమో, చంద్రయాన్-3 సక్సెస్‌తో దేశ విదేశాల నుంచి పొగడ్తలు అందుకున్నప్పుడు కూడా ఆయన ఇంత ఆనందంగా లేరేమో.. ఆయన ఎవరో కాదు.. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్.. ఇప్పుడు ఆయన గురించి ఎందుకంటే.. ఇన్నెళ్లకు సోమనాథ్ తన కల నెరవేర్చుకున్నారట.ఐఐటీ మద్రాస్ 61వ కన్వోకేషన్ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ అక్కడ మెరిశారు. అతిథిగా అనుకునేరు.. కానే కాదు..61 ఏళ్ల వయసులో ఆయన తన పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన చంద్రుడిపై కాలు మోపినం సంతోషంలో ఉన్నారు. యూనివర్సిటీ అధికారుల నుంచి డాక్టరేట్ పొందుతున్న సమయంలో ఆయన ముఖంలో మెరిసిన ప్రకాశవంతమైన చిరునవ్వు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. డాక్టరేట్ అందుకున్న తర్వాత సోమనాథ్ మాట్లాడుతూ.. ‘‘నాది గ్రామీణ నేపథ్యం. క్లాస్‌లో టాపర్‌ని. అయినా కూడా ఐఐటీ ఎంట్రన్స్ రాయాలనే ధైర్యం ఏనాడూ చేయలేకపోయా. కానీ, ఏదో ఒకనాడు ఇక్కడి నుంచి పట్టా పొందాలని మాత్రం కల గన్నా. నా మాస్టర్ డిగ్రీ బెంగళూరు ఐఐఎస్ నుంచి తీసుకున్నా. ఇప్పుడు పీహెచ్డీ ఐఐటీ మద్రాస్ నుంచి తీసుకోవడం గౌరవంగా ఉంది.పీహెచ్డీ అనేది కష్టమైంది. అదీ మద్రాస్ ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నుంచి డిగ్రీ పొందడం ఇంకా కష్టం. నాది సుదీర్ఘమైన ప్రయాణం. ఎన్నో ఏళ్ల కింద రిజిస్టర్ చేయించుకున్నా. వైబ్రేషన్ ఐసోలేటర్స్.. నా మనసుకి దగ్గరైన టాపిక్. 35 ఏళ్ల నా కష్టానికి దక్కిన ఫలితం ఇది. ఇన్నేళ్ల నా శ్రమను పీహెచ్డీ కిందకు మార్చుకున్నా.’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఇప్పటి నుంచి డాక్టర్ సోమనాథ్ అన్నమాట. -
Next Generation Launch Vehicle: ఇస్రో అమ్ములపొదిలో ఎన్జీఎల్వీ!
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సమీప భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు తెర తీస్తున్న ఇస్రో, అందుకు తగ్గట్టుగా అత్యాధునిక రాకెట్ తయారీ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ రాకెట్‌కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ (ఎన్జీఎల్వీ)గా నామకరణం చేశారు. తొలి నాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తరువాత 40 కిలోల నుంచి 5,000 కిలోల ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్ఎల్వీ, ఏఏస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎల్వీఎం03, ఎస్ఎస్ఎల్వీ... ఇలా ఆరు రకాల రాకెట్లను ఇప్పటిదాకా ఇస్రో అభివృద్ది చేసింది. గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా త్వరలో మానవసహిత అంతరిక్ష ప్రయోగంతో పాటు చంద్రుడిపై వ్యోమగాములను తీసుకెళ్లి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్నీ చేపట్టాలని భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువుండే సమాచార ఉపగ్రహాలను జీటీఓ కక్ష్యలోకి పంపే సాంకేతిక పరిజ్ఞానాన్నీ సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా 20 వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో అర్బిట్‌లోకి, 10 వేల కిలోల ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఎన్జీఎల్వీ తయారీకి ఇస్రో తెర తీసింది. రూ.1,798 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును 2008లోనే కేంద్రం ఆమోదించింది. సెమీ క్రయోజనిక్ దశను అభివృద్దితో పాటు రాకెట్ విడి భాగాలను దేశీయంగానే రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. 6న ‘ఎల్పీ1’ వద్దకు ఆదిత్య ఎల్1: సౌర ప్రయోగాల నిమిత్తం గత సెపె్టంబర్ 2న ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం జనవరి 6 సాయంత్రం సూర్యుడికి సమీపంలోని లాంగ్రేజియన్ పాయింట్ 1ను చేరనుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ పాయింట్‌ను చేరాక సూర్యుని రహస్యాలను అధ్యయనం చేయనుంది. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటితో పాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యు డి వెలుపలి వలయమైన కరోనాపై అధ్యయనాలు చేయనున్నారు. ఎన్జీఎల్వీ విశేషాలు... ► ఎన్జీఎల్వీ రాకెట్ ఎత్తు 75 మీటర్లు ► వెడల్పు 5 మీటర్లు. ► పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ తరహాలోనే దీనికీ ఆరు స్ట్రాపాన్ బూస్టర్లుంటాయి. ► ప్రయోగ సమయంలో 600 టన్నుల నుంచి 770 టన్నులు ► రాకెట్‌ను మూడు దశల్లో ప్రయోగిస్తారు. ► ఇది ఫాల్కన్, అట్లాస్–వీ, ప్రొటాన్–ఎం, లాంగ్ మార్చ్–58 రాకెట్లకు దీటుగా ఉంటుంది. ► ఇస్రో ౖచైర్మన్ సోమ నాథ్ ఇటీవలే ఎన్జీఎల్వీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ► 2030–35 నాటికి మానవ అంతరిక్ష యానం, అత్యంత బరువైన ఉపగ్రహ ప్రయోగాలకు ఇది వీలుగా ఉంటుందని వివరించారు. -
గగన్ యాన్ టెస్ట్ లాంచ్ విజయవంతం
-
డాక్టర్ అవ్వాలనుకున్న ఇస్రో ఛైర్మన్..!
సంక్లిష్టమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని సుసాధ్యం చేసిన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు సారథ్యం వహిస్తున్న సంస్థ ఛైర్మన్ సోమనాథ్ తాను చిన్నతనంలో డాక్టర్ కావాలనుకున్నానని చెప్పారు. ఇటీవల చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ యూనివర్శిటీలో జరిగిన వైద్యుల సదస్సులో ఆయన్ ప్రసంగించారు. ఆయనకు బయాలజీ అంటే ఇష్టమనీ, తాను చిన్ననాటి నుంచి జీవశాస్త్రంలో టాపర్‌గా ఉండేవాడినని గుర్తుచేసుకున్నారు. డాక్టర్ కావాలనే ఆకాంక్ష బలంగా ఉండేదన్నారు. అయితే వైద్య వృత్తి చాలా కఠినమైందని, ఇంజినీరింగ్ లేదా గణితాన్ని ఎంచుకోవాలని ఆయన తండ్రి చెప్పినట్లు తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక ఎలాంటి స్పెషలైజేషన్ చేయలేదని సోమనాథ్ వెల్లడించారు. తాను మెకానికల్ ఇంజినీర్ కోర్సు చేస్తున్నపుడు ప్రొపల్షన్‌పై ఆసక్తి కలిగిందన్నారు. వైద్య నిపుణులు సాఫ్ట్వేర్, ఏఐ టూల్స్ గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. టెక్నాలజీ వినియోగం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. -
దానివల్లే ఇస్రో ఉద్యోగాలను వద్దనుకుంటున్నారు.. చైర్మన్ కామెంట్స్ వైరల్
భారతదేశ ఖ్యాతి ప్రపంచానికి చాటి చెబుతున్న 'ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్' (ISRO)లో పనిచేయాలని చాలామంది కలలు కంటారు. కానీ ఆధునిక కాలంలో అలాంటి వారి సంఖ్య బాగా తగ్గిందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ 'ఎస్ సోమనాథ్' (S Somanath) తాజాగా వెల్లడించారు. ఇంతకీ ఈయన అలా ఎందుకన్నారు? కారణం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల నుంచి బయటకు వస్తున్న ఎంతోమంది ప్రతిభావంతులు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరటానికి సుముఖత చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం జీతభత్యాలే అంటూ సోమనాథ్ తెలిపారు. దేశంలోని అత్యుత్తమ ప్రతిభావంతులు ఇంజినీర్లుగా, ఐఐటీయన్లుగా ఉండాలి. వారు తప్పకుండా దేశ ప్రతిష్టను పెంచే ఇస్రోలో చేరాలి. కానీ నేడు అలా జరగడం లేదు. రిక్రూట్మెంట్స్ ప్రకటించినప్పటికీ ఎక్కువ మంది దీని కోసం ప్రయత్నించడం లేదు. కొందరు పనిచేసే స్థలం ముఖ్యమని భావించి చేరుతున్నారు, అలాంటి వారు చాలా తక్కువ ఉన్నారని వెల్లడించారు. 60 శాతం మంది ఇస్రో చీఫ్ ఇంజనీర్లను రిక్రూట్ చేయడానికి ఇటీవల టీమ్ బయలుదేరింది. అయితే చాలామంది ఉద్యోగం కోసం వచ్చిన వారు శాలరీ స్ట్రక్చర్ చూసి ప్రెజెంటేషన్ నుంచి 60 శాతం మంది బయటకు వెళ్లిపోయారని సోమనాథ్ తెలిపారు. గతంలో కొందరు ఇస్రోలో జీతాలు భారీగా ఉంటాయని భావించే వారు, కానీ గత నెలలో హర్ష్ గోయెంకా ఒక ట్వీట్లో సోమనాథ్ జీతం రూ. 2.5 లక్షలని, వేర్వేరు పోస్టులకు వేరువేరు వేతనం ఉంటుందని, అయితే ఇక్కడ ఇంజనీర్ల ప్రారంభ వేతనం దాదాపు రూ. 56,100 మాత్రమే అని తెలిపాడు. ఇదీ చదవండి: నేపాల్‌లో ఇతడే రిచ్.. సంపద తెలిస్తే అవాక్కవుతారు! ప్రస్తుతం ఐఐటీ చేసిన చాలామంది ఎక్కువ ప్యాకేజి కోసం చూస్తున్నారు, ఈ కారణంగా ఇస్రోలో చేరటానికి ఎవరూ ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. అయితే దేశంపై ఉన్న ప్రేమతో ఇక్కడ చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి 'సమృద్ జోషి' వెల్లడించాడు. కానీ టెక్నాలజీలో దూసుకెళుతున్న భారతదేశం ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉత్తమ ప్రతిభ ఉన్నవారు ముందుకు రావాలి. అందరూ శాలరీ గురించి మాత్రమే ఆలోచిస్తే రానున్న రోజులు ప్రశార్థకంగా మారుతాయి. -
చంద్రయాన్-3.. ఏం పర్వాలేదు
అహ్మదాబాద్: చంద్రయాన్-3 ప్రాజెక్టుపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రుడిపై అడుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్ తనకు అప్పగించిన పనిని ఇప్పటికే పూర్తి చేసేసిందని, స్లీప్ మోడ్ నుంచి బయటకు రాకపోయినా ఇబ్బందేం లేదని వెల్లడించారాయన. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజ్ఞాన్ రోవర్ ఇంకా స్లీప్ మోడ్‌లోనే ఉండడం గురించి మీడియా ఆయన్ని ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. స్లీప్ మోడ్‌లోనే ఉన్నా పర్వాలేదని సమాధానం ఇచ్చారు. ‘‘చంద్రుడిపై రాత్రి పూట (భూమిపై 15 రోజులకు సమానం) పగలు కంటే దాదాపు 200 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోతాయని, ఒకవేళ ప్రజ్ఞాన్ రోవర్‌లోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు ఈ ఉష్ణోగ్రత మార్పును తట్టుకొని నిలబడగలిగితే.. రోవర్ కచ్చితంగా మేల్కొంటుంద’’ని చెప్పారు. అయితే.. ప్రజ్ఞాన్ తిరిగి యాక్టివ్ కాకపోయినా పర్వాలేదని, ఇప్పటికే దాని పని అది పూర్తి చేసిందని అన్నారు. చంద్రుడిపై రాత్రి సమయం పూర్తయిన తర్వాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను మేల్కొలిపేందుకు ప్రయత్నించినట్లు ఇటీవల ఇస్రో వెల్లడించిన సంగతి తెలిసిందే. చంద్రుడిపై వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 2న రోవర్, 4న ల్యాండర్‌ను ఇస్రో స్లీప్ మోడ్‌లోకి పంపింది. Chandrayaan-3 Mission: Efforts have been made to establish communication with the Vikram lander and Pragyan rover to ascertain their wake-up condition. As of now, no signals have been received from them. Efforts to establish contact will continue. — ISRO (@isro) September 22, 2023 మరోవైపు.. ఖగోళాన్ని మరింతలోతుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఎక్స్‌రే పోలారిమీటర్ శాటిలైట్ (ఎక్స్‌పోశాట్)పై ప్రస్తుతం దృష్టి సారించినట్లు చెప్పారు. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులపై అధ్యయనానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందన్నారు. అలాగే.. రాబోయే రోజుల్లో శుక్ర గ్రహ పరిశోధనలకు ఇస్రో సంసిద్ధమవుతోందని తెలిపారాయన. -
హర్ష గొయెంకా ట్వీట్.. హాట్ టాపిక్‌గా ఇస్రో చైర్మన్ జీతం..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్పోగుతుంది. ఇందుకు కారణం ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్ష గోయెంకా. అవును సోమనాథ్ జీతం విషయాన్ని ట్విటర్ వేదికగా హర్ష గోయెంకా ప్రస్తావించడంతో ఇస్రో చైర్మన్ పేరు తీవ్ర చర్చకు దారితీసింది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ నెల జీతంగా రెండున్నర లక్షలు సంపాదిస్తున్నారని తెలిపిన గోయింకా.. ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించారు. శాస్త్రీయ విజ్ఞానం, పరిశోధనలపై సోమనాథ్‌కు ఉన్న ఆసక్తి, నిబద్ధతను వివరిస్తూ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు. Chairman of ISRO, Somanath’s salary is Rs 2.5 lakhs month. Is it right and fair? Let’s understand people like him are motivated by factors beyond money. They do what they do for their passion and dedication to science and research, for national pride to contribute to their… — Harsh Goenka (@hvgoenka) September 11, 2023 ఆయన తన ట్వీట్లో ‘ఇస్రో చైర్మన్ సోమనాథ్ నెల జీతం రూ. 2.50 లక్షలు. ఈ జీతం ఆయనకు సరైనదేనా? న్యాయమేనా? సోమనాథ్ లాంటి వాళ్లు డబ్బుల కోసం కాదు.. అంతకు మించిన మంచి, దేశ ప్రగతి కోసం పనిచేస్తారని అర్థం చేసుకోవచ్చు. వారు సైన్స్, పరిశోధనల పట్ల అభిరుచి, నిబద్ధతతో జాతిని గర్వింపజేసేలా.. దేశ అభివృద్ధికి తోడ్పడతారు. వారి లక్ష్యాన్ని సాధించడంలో వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేస్తారు. ఆయనలాంటి అంకితభావం గల వ్యక్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను!’ అని పేర్కొన్నారు. హర్ష గోయెంకా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనేకమంది నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు. సోమనాథ్‌కు ఎక్కువ సాలరీ ఇవ్వాలని.. ఆయనలాంటి వాళ్ల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని పేర్కొంటున్నారు. మరికొంతమంది.రెండున్నర లక్షలు అనేది ప్రాథమిక వేతనం అయి ఉండవచ్చని, ఇతర అలవెన్సన్లు కూడా కలపాలని కామెంట్ చేస్తున్నారు. చదవండి: ఎట్టకేలకు భారత్ వీడిన కెనడా ప్రధాని.. రెండు రోజులు ఆలస్యంగా ‘ఇస్రోకు సోమనాథ్ లాంటి వ్యక్తుల నిబద్ధత, ఎనలేనిది. డబ్బులతో పోల్చలేనిది. సైన్స్, రీసెర్చ్ పట్ల ఆయనకున్న అంకితభావం దేశాన్ని మరింత ముందుకు నడపుతోంది. ఆయనలాంటి వారు ఎంతో మందికి ఆదర్శం. సమాజానికి ఆయన చేస్తున్న సేవలు అమూల్యమైనది’ అని ఓ యూజర్ పేర్కొనగా.. ‘ ఇస్రో చ్మైర్మన్కు నెలకు 25 లక్షలు ఇవ్వాలి. తన ప్రతిభను గుర్తించి రివార్డ్ ఇవ్వాలని మరొకరు చెప్పారు. కాగా ఇటీవల రెండు గొప్ప ప్రయోగాలను ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే. చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్-3 పేరుతో ఉపగ్రహాన్ని ప్రవేశించింది. ఇది జాబిల్లి ఉపరితలంపై మట్టి స్వభావం, వాతావరణం, ఖనిజాలు వంటి విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేసింది. అదే విధంగా సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు తొలిసారి ఆదిత్య ఎల్ల్1 పేరుతో అంతరిక్ష్యంలోకి మరో స్పేస్ క్రాఫ్ట్‌ను నింగిలోకి ప్రవేశపెట్టింది. 125 రోజులపాటు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది సోలార్ మిషన్అనంతరం భూమికి సూర్యుడికి మధ్యనున్న లాంగ్రేజ్ పాయింట్ 1 వద్దకు చేరుకొని సూర్యుడిపై ప్రయోగాలు చేయనుంది. -
ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు బుడ్డోడు సర్ప్రైజ్ గిఫ్ట్
ఢిల్లీ:చంద్రయాన్ 3 విజయంపై ఇస్రో చీఫ్ సోమనాథ్ పట్ల ప్రశంసల వెల్లువ కురుస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో సోమనాథ్‌కు ఓ చిన్నారి నుంచి అరుదైన బహుమతి అందింది. జాబిల్లిపై వాలిన విక్రమ్ ల్యాండర్ నమూనాను చేతితో తయారు చేసిన పిల్లాడు.. దానిని ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు బహుకరించాడు. ఈ విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్త పీవీ వెంకటకృష్ణన్ తన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. చంద్రయాన్ 3 విజయంతో దేశంలో వచ్చే తరాలకు ఎంతో ప్రోత్సాహం అందించారని సోమనాథ్‌ను కొనియాడారు. ఆ బాలున్ని ఆసక్తిని మెచ్చుకున్నారు. భవిష్యత్‌లో ఎందరో పిల్లలు శాస్త్రవేత్తగా ఎదగాలనుకుంటారు. బాలునికి శుభాకాంక్షలు అని తెలిపారు. ISRO Chief Sri Somanath today had a surprise visitor,A young neighbour boy has handed over own made Vikram Lander model to the ISRO chief on behalf of all the neighbours. pic.twitter.com/BcyHYO0pDW — Dr. P V Venkitakrishnan (@DrPVVenkitakri1) September 2, 2023 చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా ఆగష్టు 23న విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇస్రోకు ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఇస్రో చీఫ్ సోమనాథ్ విమానంలోకి ఎక్కగానే.. ఫ్లైట్‌లో ప్రయాణికులందరూ ఆయన్ని అభినందించిన విషయం తెలిసిందే. చంద్రయాన్ 3తో పాటు సెప్టెంబర్ 2న ఇస్రో ఆదిత్య ఎల్1ను కూడా ప్రయోగించింది. సూర్యూనిపై పరిశోధనలు జరపడానికి ఈ మిషన్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. 125 రోజుల పాటు ప్రయాణం చేసి సూర్యుని గుట్టు విప్పే పనిలో ఆదిత్య ఎల్ 1 నిమగ్నమవనుంది. ఇదీ చదవండి: Chandrayaan-3: స్లీప్ మోడ్‌లోకి ప్రజ్ఞాన్.. -
రేపే ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం.. ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
సాక్షి, తిరుపతి జిల్లా: ఆపరేషన్ ఆదిత్య-ఎల్ 1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పీఎస్ఎల్వీ- సి57 రాకెట్ నమూనాతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాకెట్ ప్రయోగానికి ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం సాంప్రదాయమన్నారు. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు. చంద్రయాన్-3కీ సంబంధించిన లాండర్ రోవర్లు చంద్రునిపై విజయవంతంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ మొదటి, రెండో వారంలో గగన్‌యాన్ రాకెట్ ప్రయోగం ఉంటుందని, జీఎస్ఎల్వీ- మార్క్-2 ద్వారా INSAT-3DS రాకెట్ ప్రయోగం చేస్తామన్నారు. తదుపరి మాసంలో ఎస్ఎస్ఎల్-వి రాకెట్ ప్రయోగం చేపడతామని ఇస్రో ఛైర్మన్ చెప్పారు. చదవండి: సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య–ఎల్1 -
ఇస్రో కీలక ప్రకటన.. చంద్రునిపై ఉష్ణోగ్రతల వివరాలు పంపిన విక్రమ్
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 ఉపగ్రహంలోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలం గురించి అధ్యయనం చేసి సమాచారాన్ని ఇస్రోకి చేరవేసింది. చంద్రుడి దక్షిణ ధృవం నేలకి సంబంధించి ఉష్ణోగ్రతలకు సంబంధించిన హెచ్చుతగ్గుల సమాచారం ప్రపంచానికి చేరడం ఇదే మొదటిసారి. చంద్రయాన్-3 విజయవంతంగా చందుడిపై అడుగుపెట్టడమే కాదు దాని కార్యాచరణను కూడా మొదలుపెట్టింది. శనివారం శివశక్తి పాయింట్ వద్దనున్న విక్రమ్ ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి ఉపరితలంపైకి జారుకుని అధ్యయనాలను కూడా ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై 10సెం.మీ. లోతు వరకు ఉపరితలాన్ని అధ్యయనం చేసిన ప్రజ్ఞాన్ రోవర్ తొట్టతొలిసారి చంద్రుడి దక్షిణ ధృవం వద్దనున్న నేలకి సంబంధించిన సమాచారాన్ని భూమికి చేరవేసింది. ChaSTE(చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్) పేలోడ్ చంద్రుడి ఉపరితలం యొక్క ఉష్ణోగ్రతలను అధ్యయనం చేసింది. ఇస్రో ఈ సమాచారాన్ని తన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసింది. ఇస్రో షేర్ చేసిన ఈ గ్రాఫ్‌లో చంద్రుడి ఉపరితలం ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెల్సియస్ నుండి 60 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్లు తెలుస్తోంది. 'ఈ గ్రాఫ్ చంద్రుని ఉపరితలంపై లోతు వ్యత్యాసాన్ని బట్టి ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గులను సూచిస్తోంది. చంద్రుని దక్షిణ ధృవానికి సంబంధించి ఇదే మొట్టమొదటి అధ్యయనం. ఇంకా లోతైన పరిశీలనలు జరుగుతున్నాయి' అని ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రయాన్-3లో మొతం ఏడు పేలోడ్లు ఉండగా అందులో విక్రమ్ ల్యాండర్ నాలుగు, ప్రజ్ఞాన్ రోవర్ రెండు నిర్వహించనుండగా ఒకటి మాత్రం ప్రపల్షన్ మాడ్యూల్ నిర్వహించనుంది. ఈఏడు పేలోడ్లు ఒక్కొక్కటీ కొన్ని శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తాయి. చంద్రుడి నేలపై అధ్యయనం చేస్తున్న ChaSTE కాకుండా విక్రమ్‌లోని RAMBHA (అయాన్లు మరియు ఎలక్ట్రాన్లను అధ్యయనం చేయడానికి), ILSA (భూకంపాన్ని అధ్యయనం చేయడానికి), LRA (చంద్రుని వ్యవస్థ యొక్క గతిశీలతను అర్థం చేసుకోవడానికి) నిర్దేశించబడ్డాయి. Chandrayaan-3 Mission: Here are the first observations from the ChaSTE payload onboard Vikram Lander. ChaSTE (Chandra's Surface Thermophysical Experiment) measures the temperature profile of the lunar topsoil around the pole, to understand the thermal behaviour of the moon's… pic.twitter.com/VZ1cjWHTnd — ISRO (@isro) August 27, 2023 ఇది కూడా చదవండి: ఢిల్లీలో హై అలర్ట్.. మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ నినాదాల కలకలం -
Chandrayaan-3: జాబిల్లిపై భారత్ నడక
బెంగళూరు/న్యూఢిల్లీ: చంద్రయాన్–3 మిషన్ విజయవంతం కావడం పట్ల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచి్చ, తన కార్యాచరణ ప్రారంభించింది. చందమామ ఉపరితలంపై పరిశోధనలు చేస్తూ భూమిపైకి విలువైన సమాచారాన్ని చేరవేస్తోంది. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై నిరి్వఘ్నంగా అడుగుపెట్టడాన్ని ప్రస్తావిస్తూ ‘చందమామపై భారత్ నడుస్తోంది’’ అని ఇస్రో పేర్కొంది. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేసింది. చంద్రుడి కోసం భారత్‌లో తయారు చేసిన ఈ రోవర్ ల్యాండర్ నుంచి బయటకు అడుగుపెట్టి, చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా నడక ప్రారంభించిందని వెల్లడించింది. ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణం పట్ల ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రుడి గురించి మన పరిజ్ఞానం మరింత పెరగడానికి ప్రజ్ఞాన్ దోహదపడుతుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ల్యాండర్, రోవర్ జీవిత కాలం పెరుగుతుందా? చంద్రయాన్–3 ప్రయోగంలో భాగంగా ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై అడుగుపెట్టింది. అందులో నుంచి రోవర్ బయటకు వచి్చంది. వాస్తవానికి రోవర్ జీవితకాలం ఒక లూనార్ డే. అంటే 14 రోజులు. 14 రోజులపాటు రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండింగ్ సైట్ నుంచి అటూఇటూ సంచరిస్తూ పరిశోధనలు చేయనుంది. అయితే, రోవర్ జీవితకాలం 14 రోజులు మాత్రమే కాదని, మరింత పెరిగే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. దక్షిణ ధ్రువంపై 14 రోజులు చీకటి, 14 రోజులు వెలుగు ఉంటుంది. సూర్యోదయం అయినప్పుడు సూర్యుడి నుంచి రోవర్ సౌరశక్తిని గ్రహించి, దాన్ని విద్యుత్‌గా మార్చుకొని పరిశోధనలు కొనసాగించేందుకు ఆస్కారం ఉందంటున్నారు. ల్యాండర్, రోవర్ల మొత్తం బరువు 1,752 కిలోలు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 14 రోజులపాటు పనిచేసేలా వీటిని రూపొందించారు. లూనార్ డే ముగిసిన తర్వాత కూడా వాటిలో జీవం నిండే అవకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు. సూర్యకాంతి ఉన్నంతవరకు ల్యాండర్, రోవర్ చక్కగా పనిచేస్తాయి. చీకటి పడగానే ఉష్ణోగ్రత మైనస్ 180 డిగ్రీలకు పడిపోతుంది. అవి పనిచేయడం ఆగిపోతుంది. గూగుల్ డూడుల్‌గా చంద్రయాన్–3 చంద్రయాన్–3 మిషన్ విజయం పట్ల సెర్చ్ ఇంజన్ గూగుల్ తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకుంది. గురువారం గూగుల్ డూడుల్‌గా చంద్రయాన్–3కు సంబంధించిన ప్రత్యేక యానిమేటెడ్ చిత్రం ప్రత్యక్షమయ్యింది. ఇందులో గూగుల్ అనే ఇంగ్లిష్ అక్షరాలు అంతరిక్షంలో నక్షత్రల్లాగా తేలుతూ కనిపించాయి. రెండో అక్షరం చంద్రుడిలా దర్శనమిచి్చంది. 26న ఇస్రో ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో సైంటిస్టులను స్వయంగా కలిసి అభినందించడానికి ప్రధాని మోదీ ఈ నెల 26న బెంగళూరుకు రానున్నారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో సైంటిస్టులతో సమావేశమవుతారు. మనిషి మనుగడకు అవకాశం శివాజీనగర: చంద్రుని దక్షిణ ధ్రువం భవిష్యత్‌లో మానవాళి మనుగడకు వీలుగా ఉంటుందని విశ్వసిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు. అందుకే చంద్రయాన్–3 ల్యాండర్ దిగటానికి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నామని తెలిపారు. ‘మనం దాదాపు 70 డిగ్రీల దక్షిణ ధ్రువానికి దగ్గరగా వెళ్లాం, అక్కడ సూర్యరశ్మి తక్కువగా ఉండటానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంది. రోవర్ ద్వారా ఆ ప్రాంతం గురించి శాస్త్రీయంగా మరింత సమాచారం లభించే అవకాశముంది. చంద్రునిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువంపై చాలా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే మానవులు వెళ్లి అక్కడ నివాసాలను సృష్టించి ఆపై దాటి ప్రయాణించాలని అనుకుంటున్నారు. కాబట్టి మనం వెతుకుతున్నది ఉత్తమమైన ప్రదేశం. దక్షిణ ధ్రువం అలా ఉండేందుకు అవకాశముంది’అని ఆయన చెప్పారు. గురువారం ఆయన బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఇస్రో శాస్త్రవేత్తల నాలుగేళ్ల శ్రమకు తగ్గ ఫలితం లభించిందని అన్నారు. చంద్రునిపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ సాఫీగా బయటకు వచి్చందని తెలిపారు. ‘నిర్దేశిత ప్రయోజనం కోసం దక్షిణ ధ్రువంపైన గుర్తించిన 4.5 కి.మీ. గీ 2.5 కి.మీ. ప్రాంతానికి సరిగ్గా 300 మీటర్ల దూరంలోపు దూరంలోనే ల్యాండర్ దిగింది. రోవర్‌లోని రెండు పరికరాలు, ల్యాండర్‌లోని మూడు పరికరాలు నిర్దేశించిన విధంగా పనిచేస్తున్నాయి’అని పేర్కొన్నారు. రోవర్ బయట తిరుగాడుతూ పరిశోధనల ప్రారంభించిందని చెప్పారు. రోవర్లో అమర్చిన రెండు పరికరాలు చంద్రుని మట్టిలో మూలకాలు, రసాయనాలను పరిశీలిస్తాయని చెప్పారు. రోబోటిక్ పాత్ ప్లానింగ్ కూడా చేయిస్తాయని తెలిపారు. -
శ్రీచంగాళమ్మ పరమేశ్వరిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్
సాక్షి, తిరుపతి: పీఎస్ఎల్వీ సీ–55 ప్రయోగం నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సూళూరుపేట శ్రీచంగాళమ్మ పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ప్రయోగానికి ముందు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. రాకెట్ నమూనాతో సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, శనివారం మధ్యాహ్నం 2.20 లకు పీఎస్ఎల్వీ సీ–55 నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 12.50 గంటలకి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. పూర్తి 25 గంటల 30 నిమిషాల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. పూర్తిగా విదేశీ పరిజ్ఞానం, సింగపూర్‌కి చెందిన వాణిజ్య ప్రయోగం ఇది. ఈ రాకెట్ ద్వారా 741 కిలో బరువు కలిగిన లియోన్-2 తో పాటు 16 కిలోల లూమ్ లైట్-4 శాటిలైట్లను రోదసిలోకి ఇస్రో పంపనుంది. ఈ ప్రయోగ నేపథ్యంలో తిరుపతిజిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి చేరుకున్నారు విదేశీ శాస్త్రవేత్తల బృందం. అక్కడ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భూ, ఉపరితలం, సముద్ర తీరంలోనూ సీఐఎస్ఎఫ్ బలగాల విస్తృత తనిఖీలు చేపట్టారు. షార్ పరిసర ప్రాంతాల్లో ఇతరులకు ప్రవేశాన్ని నిషేధించారు. చదవండి: చింతమనేని ప్రభాకర్ వింత ప్రవర్తన.. ఐసీయూలోకి తోపుడు బండ్లు.. -
సోమనాథ్ ఆలయానికి అంబానీ భారీ విరాళం
అహ్మదాబాద్: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మహాశివరాత్రి పర్వదినాన గుజరాత్‌లోని సోమనాథ్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించారు. శనివారం ఆలయంలో తనయుడు, రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్‌తో కలిసి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు 1.51 కోట్ల విరాళం ఇచ్చారాయన. ఇక ఆలయంలో ఈ తండ్రీకొడుకుల ప్రత్యేక పూజలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరేబియా సముద్ర తీరంలో కొలువైన సోమనాథ్ ఆలయానికి.. 12 జ్యోతిర్లింగాల్లో ఆది జ్యోతిర్లింగంగా పేరుంది. મુકેશ અંબાણીએ પુત્ર આકાશ અંબાણી સાથે આજે મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિરે મહાદેવને શિશ ઝૂકાવી દર્શન કર્યા હતા.#MukeshAmbani #Ambani #AkashAmbani #SomnathMandir #Somnath pic.twitter.com/oAAFmNUFYf — Gujarat Samachar (@gujratsamachar) February 18, 2023 ఇదిలా ఉంటే కిందటి ఏడాది సెప్టెంబర్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా ముకేశ్ అంబానీ.. కోటిన్నర రూపాయలు విరాళంగా ఇచ్చిన సంగతి విదితమే. -
అదానీ గ్రూప్ షేర్ల పతనం.. ఇదంతా జస్ట్ టీ కప్పులో తుఫాను..
న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక పరిస్థితుల కోణంలో చూస్తే అదానీ గ్రూప్ షేర్ల పతనంతో స్టాక్ మార్కెట్లో నెలకొన్న అల్లకల్లోలం అంతా ’టీ కప్పులో తుఫాను’లాంటిదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ వ్యాఖ్యానించారు. స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోను కావడం సర్వసాధారణమేనని, దీని గురించి ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగు చర్యలు తీసుకునేందుకు స్వతంత్ర నియంత్రణ సంస్థలు ఉన్నాయని ఆయన చెప్పారు. అలాగే గ్రూప్ కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకులు, బీమా సంస్థలపై ప్రభావాల గురించి స్పందిస్తూ .. దేశీ ఆర్థిక సంస్థలు పటిష్టంగానే ఉన్నాయని సోమనాథన్ స్పష్టం చేశారు. పెట్టుబడులకు తగిన పరిస్థితులు కల్పించడం, ఆర్థిక మార్కెట్ల నియంత్రణ పటిష్టంగా .. పారదర్శకంగా ఉండేలా చూడటం వంటి అంశాల గురించే ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగం పటిష్టం: ఆర్బీఐ అదానీ గ్రూప్‌నకు రుణాలిచ్చిన బ్యాంకుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ గ్రూప్ పేరును ప్రస్తావించకుండా .. దేశీ బ్యాంకింగ్ రంగం పటిష్టంగా, స్థిరంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఆర్థిక స్థిరత్వాన్ని పాటించే క్రమం ్డలో .. ఒక నియంత్రణ సంస్థగా బ్యాంకుల పరిస్థితిని ఆర్బీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. భారీ రుణాల విషయంలో బ్యాంకులు కూడా నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నాయని పేర్కొంది. డో జోన్స్ సూచీల నుంచి ఏఈఎల్ తొలగింపు.. అకౌంటింగ్ మోసాల ఆరోపణలతో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తమ సస్టెయినబిలిటీ సూచీల నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగించనున్నట్లు ఎస్అండ్పీ డోజోన్స్ తెలిపింది. ఫిబ్రవరి 7 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్టుతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుప్పకూలడం, రూ. 20,000 కోట్ల భారీ ఎఫ్‌పీవోను అదానీ ఎంటర్ప్రైజెస్ ఉపసంహరించడం తెలిసిందే. నిధుల సమీకరణ కష్టతరం.. గ్రూప్ కంపెనీల షేర్ల భారీ పతనం కారణంగా అదానీ గ్రూప్ తదుపరి నిధుల సమీకరణపై ప్రతికూల ప్రభావం పడొచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరించింది. ఇటీవలి పరిణామాలతో తాము రేటింగ్ ఇచ్చే గ్రూప్ సంస్థల ఆర్థిక పరిస్థితులను సమీక్షించినట్లు పేర్కొంది. దీర్ఘకాలిక కాంట్రాక్టులు, మార్కెట్లో ఆధిపత్యం తదితర అంశాలపరంగా అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్లకు తాము రేటింగ్ ఇచ్చినట్లు వివరించింది. మరోవైపు, అదానీ సంస్థల రుణ పరపతిపై తాజా అంశాల తక్షణ ప్రభావమేమీ ఉండబోదని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అటు, అదానీ పోర్ట్స్, అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థల రేటింగ్స్‌ను స్థిర స్థాయి నుంచి నెగటివ్ స్థాయికి ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ కుదించింది. రేటింగ్స్ ఇచ్చేటప్పుడు తాము పరిగణనలోకి తీసుకున్న రిస్కులపై ఇన్వెస్టర్లలో మరింత ఎక్కువ ఆందోళన ఉండవచ్చని లేదా ప్రతికూల సెంటిమెంటు కారణంగా గ్రూప్ నిధుల సమీకరణ వ్యయాలు మరింతగా పెరగవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. షేర్లపై రుణాలేమీ ఇవ్వలేదు: ఎస్బీఐ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లపై రుణాలేమీ ఇవ్వలేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేశ్ ఖరా తెలిపారు. రుణాలతో పాటు లెటర్స్ ఆఫ్ క్రెడిట్, పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల రూపంలో ఎస్బీఐ ఇచ్చినది సుమారు రూ. 27,000 కోట్ల ఉంటుందని, ఇది తమ మొత్తం పద్దుల్లో 0.88 శాతం మాత్రమేనని ఆయన చెప్పారు. రీపేమెంటులో అదానీ గ్రూప్‌నకు మంచి రికార్డే ఉందని, వడ్డీల చెల్లింపులో సమస్యలెదుర్కొనే పరిస్థితి ఉంటుందని భావించడం ఆయన చెప్పారు. అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాలను గత రెండేళ్లలో క్రమంగా తగ్గించుకున్నామని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఎండీ సంజీవ్ చడ్ఢా చెప్పారు. ప్రస్తుతమున్న వాటికి సంబంధించి కూడా అసెట్ క్వాలిటీపరంగా ఆందోళనేమీ లేదని వివరించారు. మరోవైపు, భారతీయ చట్టాలకు అనుగుణంగానే అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసినట్లు ఫ్రాన్స్‌కి చెందిన టోటల్ఎనర్జీస్ ఎస్ఈ తెలిపింది. ఇటీవలి పరిణామాల కారణంగా వీటినేమీ పునఃసమీక్షించలేదని పేర్కొంది. టోటల్ఎనర్జీస్కు అదానీ టోటల్ గ్యాస్‌లో 37.4 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 19.75 శాతం వాటాలు ఉన్నాయి. -
పీఎస్ఎల్వీ సీ54’కు కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ54 ఉపగ్రహ వాహక నౌకకు శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్‌డౌన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 25.30 గంటల కౌంట్‌డౌన్ కొనసాగాక శనివారం ఉదయం 11.56 గంటలకు పీఎస్ఎల్వీ సీ54 రాకెట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాల్లో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో మిషన్ రెడీనెస్ రివ్యూ(ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో తుది విడతగా రాకెట్‌కు తనిఖీలు నిర్వహించి లాంచ్ రిహార్సల్స్ చేపట్టారు. అనంతరం కౌంట్‌డౌన్ సమయాన్ని శుక్రవారం ఉదయం 10.26 గంటలకు, ప్రయోగ సమయాన్ని శనివారం ఉదయం 11.56 గంటలకని అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రయోగం ద్వారా తొమ్మిది ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. ఇందులో ఇస్రోకు చెందిన ఈఓఎస్–06 ఉపగ్రహంతో పాటు ఎనిమిది ఉప గ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగిస్తోంది. శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యాక రాకెట్ నాలుగో దశ, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. షార్ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో 56వ ప్రయోగం. పీఎస్ఎల్వీ ఎక్స్‌ల్ వెర్షన్లో 24వ ప్రయోగం కావడం విశేషం. షార్ కేంద్రానికి చేరుకోనున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ శుక్రవారం బెంగళూరు అంతరిక్ష కేంద్ర ప్రధాన కార్యాలయం నుంచి శ్రీహరికోటకు చేరుకోనున్నారు. పీఎస్ఎల్వీ సీ54 రాకెట్‌కు ఆయన మరోమారు తనిఖీలు నిర్వహించి కౌంట్‌డౌన్‌ను స్వయంగా పర్యవేక్షిస్తారు. -
ISRO: జూన్‌లో చంద్రయాన్ 3
న్యూఢిల్లీ: చందమామపై శోధనకు ఉద్దేశించిన చంద్రయాన్–3 ప్రయోగం వచ్చే ఏడాది జూన్‌లో ఉంటుందని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో సోమ్‌నాథ్ మాట్లాడారు. ‘ గగన్‌యాన్ ప్రాజెక్ట్ కోసం తొలి రోదసీనౌక పరీక్షను వచ్చే ఏడాది తొలినాళ్లలో చేపడతాం. లాంచ్ వెహికల్ మార్క్–3 ద్వారా చంద్రయాన్–3ను ప్రయోగిస్తాం. పలుమార్లు మానవరహిత వాహకనౌక పరీక్షల తర్వాత 2024 చివరికల్లా భారతీయ వ్యోమగాములు విజయవంతంగా కక్ష్యలో అడుగుపెట్టేలా చేస్తాం. 2019 సెప్టెంబర్‌లో విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడిపై దింపేందుకు చేసిన చంద్రయాన్–2 ప్రయోగం విఫలమైంది. ఈసారి అలా జరగబోదు. ఇది భిన్నమైన ఇంజనీరింగ్. ఉపరితలంపై ల్యాండర్ దిగేటపుడు పాడవకుండా ఉండేందుకు శక్తివంతమైన కాళ్లు సిద్ధంచేస్తున్నాం. ఈ ప్రక్రియలో ఏవైనా పొరపాట్లు జరిగితే, ప్రయోగం సజావుగా సాగేందుకు ‘మరో పరిష్కారం’ రంగంలోకి దిగుతుంది. ‘చంద్రుడిని చేరే క్రమంలో ఎంత ఎత్తులో ప్రయాణించాల్సి రావచ్చు? చంద్రుడి ఉపరితలంపై సమస్యలు లేని స్థలాల గుర్తింపు వంటి అంశాల్లో మరింత స్పష్టత సాధిస్తున్నాం’ అని అన్నారు. -
12 ఏళ్లలో 339 చోరీలు.. కూలీలే కానీ కాస్ట్లీ కార్లలో తిరుగుతూ..
కాస్త రద్దీగా బస్సు కనిపిస్తే చాలు.. ఆ రెండు కార్లకు సడన్ బ్రేకులు పడతాయి. అందులో ఉన్న వాళ్ల ముఖాలు వెలిగిపోతాయి. బస్సులో మహిళల వైపు రష్ కనిపిస్తే.. ఆ ఇద్దరు ఆడవాళ్లలో ఒకరు దిగి తమ చేతివాటం ప్రదర్శించుకొస్తారు. అదే పురుషుల వైపు రద్దీ ఉంటే.. ఆ ఇద్దరు మగవాళ్లలో ఒకరు దిగి తమ పని కానిచ్చేస్తారు. ఏ మాత్రం సందేహం రాకుండా బస్సు దిగిపోయి.. తమ తమ కార్లలో గాయబ్ అవుతారు. ఇలా 12 ఏళ్లుగా 339 చోరీలకు పాల్పడ్డ రెండు జంటలను.. గుజరాత్ సోమనాథ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితులు సంజయ్-గీత, నరేష్-రేఖలను కటకటాల వెనక్కి నెట్టారు. వాళ్ల నుంచి రెండు బ్రెజ్జా కార్లను, ఐఫోన్లను, లక్ష రూపాయల దాకా నగదు, నగలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కూలీలు ఇలా.. దాహోడ్ జిల్లాకు చెందిన ఈ రెండు జంటలు కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. అయితే.. తేలికగా డబ్బు సంపాదించడం కోసం చేతులు కలిపి ఇలా చోరీలకు దిగారు. ఆ చోరీల ద్వారా వచ్చిన డబ్బుతోనే ఆరేసి లక్షల రూపాయల విలువ చేసే ఈ రెండు కాస్ట్లీ కార్లను కొనుగోలు చేశారు కూడా. కార్లలోనే తిరుగుతూ పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా దర్జాగా దొంగతనాలకు పాల్పడుతూ వచ్చారు. కానీ, స్థానికులకు ఏమాత్రం అనుమానం రాకుండా అప్పుడప్పుడు కూలీ పనులకు వెళ్తూ వస్తున్నారు. అయితే.. ఎలా పట్టారంటే.. ఆగస్టు 21, 22 తేదీల్లో వెరవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీ కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు కేసుల్లోనూ సోమనాథ్ మాంగ్రోల్ బస్ స్టేషన్ వద ఇద్దరు బాధితులు బస్సుల్లోనే.. నగదును పొగొట్టుకున్నారు. దీంతో సీసీ టీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. అందులో బ్రెజ్జా కారులో వచ్చిన ఇద్దరు మహిళలు.. లగేజీ లేకుండా రద్దీ బస్సులు ఎక్కడం, కాసేపటికే ఆ బస్సు దిగి తిరిగి కారులో వెళ్లిపోవడం పోలీసులకు అనుమానంగా అనిపించింది. దీంతో.. కారు నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసి వెరవల్ దగ్గర వాళ్లను పట్టుకున్నారు. ఆపై భార్యలు ఇచ్చిన సమాచారంతో భర్తలనూ కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. గత 12 ఏళ్లుగా గుజరాత్లో వివిధ ప్రాంతాల్లో ఇలా రద్దీ బస్సుల్లో చోరీలకు పాల్పడినట్లు ఈ రెండు జంటలు ఒప్పుకున్నాయి. ఇదీ చదవండి: మిస్సింగ్ కాదు.. డబుల్ మర్డర్! -
‘ఆ శాటిలైట్‌ను పాకిస్తాన్ వద్దంది’
తిరుపతి: సార్క్ శాటిలైట్ పేరుతో ఇస్రో రోదసిలోకి పంపాలనుకున్న ఉపగ్రహాన్ని పాకిస్తాన్ అడ్డుకుందని ఇస్రో శాస్త్రవేత్త ఎస్.సోమనాథ్ తెలిపారు. సార్క్ ఫోరం ఆధ్వర్యంలోనే ఈ శాటిలైట్‌ను ప్రయోగించాలని పట్టుబట్టటంతో చివరికి ఈ ప్రాజెక్టు నుంచి పాకిస్తాన్‌ను పక్కనపెట్టినట్లు ఆయన వివరించారు. దీంతో సార్క్ కమ్యూనికేషన్ శాటిలైట్ సేవలను భారత్‌తోపాటు శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాలు ఉపయోగించుకోనున్నాయని వెల్లడించారు. అదేవిధంగా ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో రికార్డు స్థాయిలో 103 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో 100 ఉపగ్రహాలు అమెరికా, జర్మనీ తదితర దేశాలవేనని వివరించారు. వీటన్నిటినీ శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ-37 రాకెట్ ద్వారా ఒకేసారి పంపనున్నట్లు చెప్పారు. -
అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా
కుందుర్పి : కుందుర్పి–మాయదార్లపల్లి మార్గంలో ఓ ట్రాక్టర్ శనివారం అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో శెట్టూరు మండల అనుంపల్లికి చెందిన సోమనాథ్(32) మృతి చెందగా, అదే మండలం రంగయ్యపాళ్యం చెందిన లక్ష్మణమూర్తి, తిప్పేస్వామి తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సోమనాథ్ తన ఇంటి వద్ద పశువుల పాక కోసం అవసరమైన కట్టెల కోసం అనుంపల్లి, రంగయ్యపాళెం చెందిన ఆరుగురితో కలసి కర్ణాటకలోని మరదాసనపల్లెకు వెళ్లాడు. అక్కడ కట్టెలు కొనుగోలు చేసి స్వగ్రామానికి తీసుకువస్తుండగా మార్గమధ్యంలో కుందుర్పి సమీపంలోని కుంట వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడటంతో సోమనాథ్ అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఇంజిన్ కింద ఇరుక్కుపోయిన లక్ష్మణమూర్తిని చుట్టుపక్కల వారు గమనించి అతనితో పాటు తిప్పేస్వామిని రక్షించారు. మృతుడికి భార్య, ఒక కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రెండు కేజీల బంగారంతో వ్యాపారి అదృశ్యం
-
రెండు కేజీల బంగారంతో వ్యాపారి అదృశ్యం
తెనాలి: రెండు కిలోల బంగారంతో నగల తాకట్టు వ్యాపారి అదృశ్యమైన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది. తెనాలిలో సోమనాథ్ అనే వ్యాపారి గత పదిహేనేళ్లుగా ఉంటూ నగలు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇస్తున్నాడు. అందరితో నమ్మకంగా ఉంటూ నగలు తాకట్టు పెట్టుకుని అప్పులిచ్చేవాడు. రెండు రోజుల నుంచి సోమనాథ్ కనిపించకుండా పోయాడు. పెద్ద మొత్తంలో అతని వద్ద తాకట్టు బంగారు నగలు ఉన్నాయని తెలుస్తోంది. అతని బాధితులు బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుమారు రెండు కిలోల అభరణాలు అతడు తీసుకెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. సోమనాథ్పై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.