
అహ్మదాబాద్: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మహాశివరాత్రి పర్వదినాన గుజరాత్‌లోని సోమనాథ్ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించారు. శనివారం ఆలయంలో తనయుడు, రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్‌తో కలిసి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు 1.51 కోట్ల విరాళం ఇచ్చారాయన. ఇక ఆలయంలో ఈ తండ్రీకొడుకుల ప్రత్యేక పూజలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అరేబియా సముద్ర తీరంలో కొలువైన సోమనాథ్ ఆలయానికి.. 12 జ్యోతిర్లింగాల్లో ఆది జ్యోతిర్లింగంగా పేరుంది.
મુકેશ અંબાણીએ પુત્ર આકાશ અંબાણી સાથે આજે મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિરે મહાદેવને શિશ ઝૂકાવી દર્શન કર્યા હતા.#MukeshAmbani #Ambani #AkashAmbani #SomnathMandir #Somnath pic.twitter.com/oAAFmNUFYf
— Gujarat Samachar (@gujratsamachar) February 18, 2023
ఇదిలా ఉంటే కిందటి ఏడాది సెప్టెంబర్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా ముకేశ్ అంబానీ.. కోటిన్నర రూపాయలు విరాళంగా ఇచ్చిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment