
భారతీయ కుబేరుడు 'ముకేశ్ అంబానీ' గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలను.. ఆకాష్ అంబానీ పేర్కొన్నారు. నాన్న పనితీరు నాకు ఆదర్శమని 'ముంబై టెక్ వీక్' కార్యక్రమంలో వెల్లడించారు.
ఇప్పటికి కూడా నాన్న (ముకేశ్ అంబానీ) తనకొచ్చిన అన్ని ఈమెయిల్‌కు రిప్లై ఇస్తూ.. తెల్లవారుజామున 2 గంటల వరకు మేల్కొని ఉంటారని ఆకాష్ అంబానీ చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా.. కంపెనీ వృద్ధి కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఇది 45వ ఏడాది. ఆయన పనతీరు నాకు ఆదర్శమని.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు.
అమ్మకు, నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఇద్దరూ టీవిలో క్రికెట్ కూస్తూ ఉంటాము. అప్పుడు అమ్మ చిన్నచిన్న విషయాలను కూడా గమనిస్తూ ఉంటారు. అవన్నీ నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అమ్మ, నాన్నకు అంకితభావం ఎక్కువ. అవి మాకందరికీ స్ఫూర్తి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా కుటుంబాన్ని చూసే నేర్చుకున్నానని చెప్పారు.
జీవితంలో పని మాత్రమే కాదు, కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. గత 10 సంవత్సరాలుగా రిలయన్స్‌లో పనిచేస్తూనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నాను. ఇషా, నేను కవల పిల్లలం. మేము ఇద్దరూ కూడా కుటుంబ విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. నా పిల్లలతో గడపడం నాకు చాలా ఇష్టం. శ్లోకా భార్యగా రావడం నా అదృష్టం. తను నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటుంది.
పనిగంటలు
ముంబై టెక్ వీక్ కార్యక్రమంలో 'ఆకాష్ అంబానీ' పనిగంటలపై కూడా మాట్లాడారు. ఆఫీసులో ఎంతసేపు (ఎన్ని గంటలు) ఉంటారనేది ముఖ్యం కాదు, చేస్తున్న పనిలో నాణ్యత ఉండాలి, దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను అని అన్నారు. వృద్ధి అంటే జీవితం అనేది రిలయన్స్ నినాదం, అది వ్యక్తిగత జీవితానికి కూడా వరిస్తుందని అన్నారు. కాబట్టి మీరు ప్రతి రోజు ఎదగడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆర్‌బీఐని సంప్రదించండి.. అనిల్ అంబానీకి కోర్టు ఆదేశం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మార్గనిర్దేశం చేయడానికి తమ కంపెనీ 1,000 మందికి పైగా డేటా సైంటిస్టులు, పరిశోధకులు, ఇంజనీర్లతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది ఆకాష్ అంబానీ అన్నారు. అంతే కాకుండా ఏఐలో దేశం ముందుకు సాగటానికి సహాయపడటానికి రిలయన్స్.. జామ్‌నగర్‌లో 1GW సామర్థ్యం గల డేటా సెంటర్‌ను కూడా కంపెనీ ఏర్పాటు చేస్తోందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment