work life balance
-
ఓ వైపు పూజ.. మరోవైపు వర్క్: వీడియో వైరల్
చదువుకునే రోజుల్లో.. జాబ్ వస్తే ఏదైనా చేసేయొచ్చని చాలామంది ఆరాటపడుతుంటారు. కానీ ఉద్యోగం వచ్చిన తరువాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి దుర్గా పూజలో కూడా ల్యాప్‌టాప్, మొబైల్ రెండూ చేతపట్టుకుని క్లయింట్ మీటింగ్‌కు హాజరైనట్లు తెలుస్తోంది. ఈయన చుట్టూ ఏం జరుగుతోందో కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇది చూసిన చాలామంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ సంఘటన బెంగళూరులో జరిగినట్లు తెలుస్తోంది.ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. బెంగళూరులో ఇలాంటివి మామూలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి ఉద్యోగుల జీవితం కష్టంగా ఉంటుందని చెబుతున్నారు. ఇంకొందరు పని పూర్తయిన తరువాత పూజకు హాజరైతే బాగుంటుందని అంటున్నారు.ఇలాంటి సంఘటనలు బెంగళూరులో వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. స్కూటర్ మీద వెల్తూ మీటింగులకు హాజరైన సంఘటనలు, బైక్ నూక కూర్చుని వర్క్ చేసుకుంటున్న దృశ్యాలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి.A Peak Bengaluru moment unfolded when a man was caught attending a client meeting on both his laptop and phone while at a Navratri pandal in Bengaluru. The incident perfectly encapsulates the city's fast-paced work culture, where balancing professional commitments and personal… pic.twitter.com/fVIeGDN23d— Karnataka Portfolio (@karnatakaportf) October 13, 2024 -
'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి అమూల్యమైన సలహాలు.!
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు, మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో అజయ్ బంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఛాలెంజ్‌పై అమూల్యమైన సలహాలు సూచనలందించారు. నిజానికి వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ అనేది పూర్తిగా వ్యక్తిగతానికి సంబంధించిందని అన్నారు. ఎందుకంటే ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి గణనీయంగా మారుతుంది. కొంతమంది వ్యక్తులు ప్రతిరోజూ సుమారు 12 నుంచి 18 గంటలు సమతుల్యంగా పనిచేయగా, మరికొందరూ ఆరుగంటలకు పైగా కష్టపడతారు. కాబట్టి ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది పూర్తిగా వ్యక్తిగతం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ తమకు తాముగా నిర్వర్తించాల్సిన బాధ్యత అని నొక్కి చెప్పారు. అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించడం అనేది రెండు కీలక అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. అవేంటంటే....పనిని ప్రేమించడం, ప్రియమైన వారి కోసం సమయాన్ని కేటాయించడం. దీని అర్థం పనిని ఆస్వాదించినట్లయితే కష్టపడి పనిచేయడం అనేది సాధ్యమవుతుంది. లేదంటే అదోక జర్నీలా సాగుతుంది అంతే. లేదా ఆ పని నచ్చనట్లయితే మీకు నచ్చిన పనిని చేసేందుకు ప్రయత్నించండి అప్పుడూ పని-జీవితంపై బ్యాలెన్స్ సాధించగలుగుతారని చెబుతున్నారు బంగా. దీంతోపాటు కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో మీ వంతు పాత్ర పోషించేలా పాలుపంచుకోవడం, వాళ్లతో గడిపేలా కొంత సమయం కేటాయించడం వంటివి చేయడం కూడా అత్యంత ముఖ్యం. మనవాళ్లకు అవసరమైనప్పుడూ పక్కనే మనం లేనప్పుడూ ఏవిధంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించగలుగుతారు. అందరూ కూడా మొబైల్ పరికరాలకి ప్రాధాన్యత ఇవ్వకండి, దానితోనే అందరితోనూ టచ్‌లో ఉన్నామని అస్సులు భావించొద్దు". అని సూచిస్తున్నారు బంగా. వ్యక్తిగతంగా మీ వాళ్లతో స్పెండ్ చేయండి లేదా వ్యక్తిగత చర్యలకి ప్రాధాన్యత ఇవ్వండని చెబుతున్నారు. ఇక్కడ సాంకేతికత మనుషుల మధ్య ఉన్న కనెక్షన్లను దూరం చేస్తుందనేది గ్రహించండి. ఇది మీ వ్యక్తిగత జీవితంలోకి చొరబడకుండా జాగ్రత్త పడండి. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించాలంటే కొన్ని సరిహద్దుల అవసరాన్ని నొక్కి చెబుతూ.. హెచ్చరించారు బంగా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Former Mastercard CEO, Ajay Banga on work-life balance: pic.twitter.com/Hi3liSr5of— Business Nerd 🧠 (@BusinessNerd_) October 13, 2024 (చదవండి: 50 గంటల్లో 16 వేల కేలరీల ఫాస్ట్ ఫుడ్ ఛాలెంజ్..కట్‌చేస్తే..!) -
ఆఫీస్ వైఫ్, ఆఫీస్ హజ్బండ్
ఆఫీస్ వైఫ్, ఆఫీస్ హజ్బండ్.. ఈ శీర్షిక చూడగానే మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. కానీ ఇలాంటిదొకటి ఉందని నాకు 15 ఏళ్ల కిందటే తెలుసు. సమాజంలో వస్తున్న కొత్త ట్రెండ్ లను ఎప్పటికప్పడు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం సైకాలజిస్టుగా నాకు అవసరం. అలా దాని గురించి తెలుసుకున్నా. ఆ మధ్య కాలంలో అలాంటి కేస్ ఒకటి నా దగ్గరకు వచ్చింది. దాని గురించే ఈరోజు మీతో పంచుకుంటా.అసలేంటీ కాన్సెప్ట్? ఆఫీస్ వైఫ్/ఆఫీస్ హజ్బండ్ అనే పదాలు ఒకరి వర్క్ లైఫ్ లో ముఖ్యమైన సహాయక పాత్ర పోషించే కొలీగ్ గురించి చెప్పేవి. లైఫ్ పార్టనర్ కు సమానమైన ఎమోహనల్ సపోర్ట్, గైడెన్స్, కంపాయిన్షిప్ అందించే వ్యక్తిని ఆఫీస్ స్పౌజ్ అంటారు. వారిద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్, కొలాబరేషన్ ఉంటుంది. ఇతర కొలీగ్స్ తో పంచుకోని, పంచుకోలేని వృత్తిగత, వ్యక్తిగత విషయాలు వారితో పంచుకుంటారు. వారి బంధం అంతవరకే పరిమితం, ఎలాంటి లైంగిక సంబంధం ఉండదు.ఎమోషనల్ డిపెండెన్సీ...హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కార్పొరేషన్లో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ గా పని చేస్తున్న ప్రియా శర్మ తన సహోద్యోగి రాజీవ్ పటేల్ ఐదేళ్లుగా కలిసి పనిచేస్తున్నారు. చాలా ప్రాజెక్టులు పూర్తి చేయడంలో రాజీవ్ ఆమెకు తన సహకారం అందించాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇరువురి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు, బాధ్యతలు, బాధలు పంచుకునేవారు.ఒత్తిడి సమయాల్లో ప్రియకు రాజీవ్ ఎమోషనల్ సపోర్ట్ అందించగా, రాజీవ్ కు కష్ట సమయాల్లో ప్రియ భరోసాగా నిలిచింది. అలా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది వృత్తిపరమైన సరిహద్దు రేఖలను చెరిపేయడం ప్రారంభించింది. తరచుగా తమ వ్యక్తిగత వివరాలను పంచుకునేవారు. ఆఫీస్ తో పాటు బయట కూడా తరచూ కలుసుకునేవారు.రాజీవ్ పై ఆమె ఎమోషనల్ గా బాగా ఆధారపడింది. ఎప్పుడు ఒత్తిడి, ఆందోళన అనిపించినా అతనితో మాట్లాడి రిలాక్స్ అయ్యేది. అతను అందుబాటులో లేనప్పుడు అభద్రతకు, ఆందోళనకు లోనయ్యేది. అతను లేకుంటే సరిగా పనిచేయలేకపోయేది.పుకార్లు షికారు... ఇవన్నీ కలిసి ఆఫీసులో వారిద్దరి రిలేషన్ షిప్ పై అనుమానాలకు కారణమయ్యాయి. టీమ్ లో కూడా సమస్యలు మొదలయ్యాయి. తామెంత పనిచేసినా రాజీవ్ ప్రియనే సపోర్ట్ చేస్తాడని, తమకు అన్యాయం చేస్తాడని మిగతావాళ్లు భావిస్తున్నారు. వారిని ‘ఆఫీస్ వైఫ్, ఆఫీస్ హజ్బండ్’ అని అనుకోవడం మొదలుపెట్టారు.ఈ మాటలు ప్రియ వరకు వచ్చేసరికి తల్లడిల్లిపోయింది. ఫ్రెండ్లీగా ఉన్నంతమాత్రాన ఇలా మాట్లాడతారా.. అని బాధపడుతోంది. ఇదంతా ఆమె కుటుంబ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కౌన్సెలింగ్ కోసం వచ్చింది.ఇలాంటి సమస్య మీకూ ఎదురై ఉండవచ్చు. మీరు క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్ తో సంబంధం అంటగట్టేవాళ్లు మీ పక్కనే ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో వచ్చే ఎమోషనల్ తుఫాన్ ను కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. అలాంటి సందర్భాల్లో ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అవసరం. అలానే ప్రియ కౌన్సెలింగ్ కోసం వచ్చింది.మూడు నెలల థెరపీ...ప్రియాశర్మ తన సమస్య గురించి వివరించాక సైకోడయాగ్నస్టిక్స్ ద్వారా ఆమె తీవ్రమైన డిప్రెషన్, యాంగ్జయిటీకి లోనవుతున్నట్లు నిర్ధారణైంది. దీంతో ఆమెకు సైకోథెరపీ ప్రారంభించాను. ఈ థెరపీ లక్ష్యం ప్రియ, రాజీవ్ మద్య ప్రొఫెషనల్ బౌండరీస్ ను తిరిగి ఏర్పాటు చేయడం, అతనిపై ఎమోషనల్ డిపెండెన్సీని తగ్గించి, స్వంత కోపింగ్ మెకానిజమ్ లను మెరుగుపరచడం, వర్క్ ప్లేస్ డైనమిక్స్ ను మెరుగుపరచడం. వారానికో సెషన్ చొప్పున మూడు నెలలపాటు రోల్-ప్లేయింగ్ బౌండరీస్, కాగ్నిటివ్ బిహేవియరల్ టెక్నిక్స్, ఎమోషనల్ రెగ్యులేషన్, వర్క్ ప్లేస్ డైనమిక్స్ ను మెరుగుపరిచేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ తదితర టెక్నిక్స్ ద్వారా ఆమె మామూలు మనిషి కాగలిగింది. రాజీవ్ తో ఫ్రెండ్లీగా ఉంటూనే తన సైకలాజికల్ వెల్ బీయింగ్ ను కాపాడుకోగలిగింది.ముందిలా చేయండి.. అంటే ఏంటి సర్, ఇప్పుడే సమస్య వచ్చినా మీ దగ్గరకు రావాలంటారా? అని మీరు అనుకోవచ్చు. అలా నేనెప్పుడూ చెప్పను. ఎవరైనా సరే మొదట తన సమస్యను తానే పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు, చేయాలి కూడా. అలా చేసినా ఫలితం లేనప్పుడే ప్రొఫెషనల్ సహాయం తీసుకోవాలి. మీకోసం కొన్ని సెల్ఫ్ హెల్ప్ టిప్స్...1.సహోద్యోగులతో మీ సరిహద్దులను స్పష్టంగా నిర్దేశించుకోండి. ఆఫీస్ టైంలో పర్సనల్ ఇష్యూస్ చర్చించవద్దు. ఆ తర్వాత కమ్యూనికేషన్ ను పరిమితం చేయండి. 2. రోజూ డైరీ రాయడం మీ ఆలోచనలను, చర్యలను గమనించడానికి, అవి మీ ప్రొఫెషనల్ బౌండరీస్ కు అనుగుణంగా ఉన్నాయో లేవో అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. 3. మీ కొలీగ్ పై ఆధారపడేలా చేసే ట్రిగ్గర్ లను గుర్తించి, వాటిని మేనేజ్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. 4.మిమ్మల్ని మానసికంగా సంతృప్తి పరిచే హాబీల్లో కొంత సమయం గడపండి. ఇది ఇతరులపై ఎమోషనల్ గా ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. 5. ఏ ఒక్కరికో పరిమితం కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులు లతో సపోర్ట్ నెట్‌వర్క్‌ను రూపొందించండి, 6. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోండి.7. ఒత్తిడిని మేనేజ్ చేసేందుకు మైండ్ ఫుల్ బ్రీతింగ్, మైండ్ ఫుల్ నెస్, మెడిటేషన్ లను రోజూ ప్రాక్టీస్ చేయండి.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.comConnections corner -
వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌లో పారిస్ నగరం బెస్ట్
పారిస్: కష్టపడి పనిచేసే గంటలు, తీసుకునే విశ్రాంతికి మధ్య సమతౌల్యత సరిగ్గా పాటించినప్పుడే ఓ ఉద్యోగి తన జీవితాన్ని ఉల్లాసంగా, ఆహ్లాదకరంగా గడపగలరు అనేది ఓ అవగాహన. ఈ అవగాహన యూరప్‌లోని ఏ దేశ ఉద్యోగుల్లో ఎక్కువగా ఉంది? ఏ దేశ ఉద్యోగుల్లో తక్కువగా ఉంది? అంటే, ‘వర్క్-లెఫ్ బ్యాలెన్స్’ ఎలా ఉందనే అంశంపై ‘ఆన్లైన్ బిజినెస్ టు బిజినెస్ మార్కెట్ ప్లేస్’లో అనభవం కలిగిన ఎక్స్పర్ట్ మార్కెట్ సంస్థ వివిధ దేశాల డేటాను విశ్లేషించి 13 నగరాలకు ర్యాంకింగ్‌లు కేటాయించింది. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంటే పనిచేసే గంటలకు, విశ్రాంతి తీసుకునే గంటలకు మధ్య బ్యాలెన్స్ ఎలా పాటిస్తున్నారన్నదే ప్రధాన అంశం. ఈ అంశంలో తక్కువ గంటలు పనిచేస్తూ ఎక్కువ గంటలు విశ్రాంతి తీసుకుంటున్న నగారాలను ఉత్తమ బ్యాలెన్సింగ్ కింద పరిగణించి ర్యాంకింగ్‌లను కేటాయించారు. యూరప్‌లో ఎంపిక చేసిన 13 నగరాల్లో రెండు ఉత్తమ వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ నగరాలు ఫ్రాన్స్ దేశానికి చెందినవే కావడం విశేషం. 1. ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో ఓ ఉద్యోగి వారానికి 30.84 గంటలు, ఏడాదికి 1603.8 గంటలు పనిచేస్తారు. ఏడాదికి 28 రోజులు సెలవు తీసుకుంటారు. ఇది ప్రపంచంలో ఓ ఉద్యోగి పనిచేసే సరాసరి సగటు కాలానికి 18 శాతం తక్కువ. 2. ద్వితీయ స్థానానికి ఎంపికైన నగరం ఫ్రాన్స్‌లో లియాన్. ఈ నగరంలో వారానికి 31.36 గంటలు, ఏడాదికి 1630 గంటలు పనిచేస్తారు. ఏడాదికి 28.5 సెలవులు తీసుకుంటారు. 3. రష్యాలోని మాస్కో నగరంలో వారానికి 31.66 గంటలు, ఏడాదికి 1648 గంటలు పనిచేస్తారు. ఏడాదికి 31 రోజులు సెలవు తీసుకుంటారు. 4. ఫిన్లాండ్లోని హెల్సింకిలో వారానికి 31.91 గంటలు పనిచేస్తారు. ప్రపంచ సరాససరి సగటు పని గంటలకన్నా 14 శాతం తక్కువ. 5. ఆస్ట్రియాలోని వియన్నాలో వారానికి 32.27 గంటలు, ఏడాదికి 1678 గంటలు పనిచేస్తారు. ఏడాదికి 27 రోజులు సెలవు తీసుకుంటారు. 6. ఇటలీలోని మిలన్ నగరంలో 32.52 గంటలు పనిచేస్తారు. ప్రపంచ సరాసరి సగటు పని గంటలకన్నా 12 శాతం తక్కువ పనిచేస్తారు. 7. డెన్మార్క్‌లోని కోపెన్‌హగన్ నగరంలో వారానికి 32.54 గంటలు పనిచేస్తారు. ప్రపంచ సరాససరి సగటు గంటల్లో 11. 4 శాతం తక్కువ పనిచేస్తారు. 8. లగ్జంబర్గ్లోని లగ్జంబర్గ్ నగరంలో వారానికి 32.75, ఏడాదికి 1703 గంటలు పనిచేస్తారు. ఏడాదికి 31 రోజులు సెలవు తీసుకుంటారు. 9. లుథానియా రాజధాని విల్నియస్‌లో వారానికి 33 గంటలు పనిచేస్తారు. 10. బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో వారానికి 33.02 గంటలు, ఏడాదికి 1717 గంటలు పనిచేస్తారు. ఏడాదికి కేవలం 18 రోజులు సెలవు తీసుకుంటారు. 11. జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో వారానికి 33.1 గంటలు పనిచేస్తారు. 29 రోజులు సెలవు తీసుకుంటారు. 12. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో వారానికి 33.20 గంటలు, ఏడాదికి 1726 గంటలు పనిచేస్తారు. 13. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో వారానికి 33.28 గంటలు పనిచేస్తారు. ఎక్కువ ఉష్ణోగ్రత కారణంగా వారు మధ్యాహ్నం ఓ కునుకు తీస్తారు. అందుకని వారి పనిగంటల్లో భారీ కోత పడింది.