చదువుకునే రోజుల్లో.. జాబ్ వస్తే ఏదైనా చేసేయొచ్చని చాలామంది ఆరాటపడుతుంటారు. కానీ ఉద్యోగం వచ్చిన తరువాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి దుర్గా పూజలో కూడా ల్యాప్‌టాప్, మొబైల్ రెండూ చేతపట్టుకుని క్లయింట్ మీటింగ్‌కు హాజరైనట్లు తెలుస్తోంది. ఈయన చుట్టూ ఏం జరుగుతోందో కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇది చూసిన చాలామంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ సంఘటన బెంగళూరులో జరిగినట్లు తెలుస్తోంది.
ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. బెంగళూరులో ఇలాంటివి మామూలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి ఉద్యోగుల జీవితం కష్టంగా ఉంటుందని చెబుతున్నారు. ఇంకొందరు పని పూర్తయిన తరువాత పూజకు హాజరైతే బాగుంటుందని అంటున్నారు.
ఇలాంటి సంఘటనలు బెంగళూరులో వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. స్కూటర్ మీద వెల్తూ మీటింగులకు హాజరైన సంఘటనలు, బైక్ నూక కూర్చుని వర్క్ చేసుకుంటున్న దృశ్యాలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి.
A Peak Bengaluru moment unfolded when a man was caught attending a client meeting on both his laptop and phone while at a Navratri pandal in Bengaluru. The incident perfectly encapsulates the city's fast-paced work culture, where balancing professional commitments and personal… pic.twitter.com/fVIeGDN23d
— Karnataka Portfolio (@karnatakaportf) October 13, 2024
Comments
Please login to add a commentAdd a comment