durga puja
-
ఓ వైపు పూజ.. మరోవైపు వర్క్: వీడియో వైరల్
చదువుకునే రోజుల్లో.. జాబ్ వస్తే ఏదైనా చేసేయొచ్చని చాలామంది ఆరాటపడుతుంటారు. కానీ ఉద్యోగం వచ్చిన తరువాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి దుర్గా పూజలో కూడా ల్యాప్‌టాప్, మొబైల్ రెండూ చేతపట్టుకుని క్లయింట్ మీటింగ్‌కు హాజరైనట్లు తెలుస్తోంది. ఈయన చుట్టూ ఏం జరుగుతోందో కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇది చూసిన చాలామంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చించుకుంటున్నారు. ఈ సంఘటన బెంగళూరులో జరిగినట్లు తెలుస్తోంది.ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. బెంగళూరులో ఇలాంటివి మామూలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి ఉద్యోగుల జీవితం కష్టంగా ఉంటుందని చెబుతున్నారు. ఇంకొందరు పని పూర్తయిన తరువాత పూజకు హాజరైతే బాగుంటుందని అంటున్నారు.ఇలాంటి సంఘటనలు బెంగళూరులో వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. స్కూటర్ మీద వెల్తూ మీటింగులకు హాజరైన సంఘటనలు, బైక్ నూక కూర్చుని వర్క్ చేసుకుంటున్న దృశ్యాలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి.A Peak Bengaluru moment unfolded when a man was caught attending a client meeting on both his laptop and phone while at a Navratri pandal in Bengaluru. The incident perfectly encapsulates the city's fast-paced work culture, where balancing professional commitments and personal… pic.twitter.com/fVIeGDN23d— Karnataka Portfolio (@karnatakaportf) October 13, 2024 -
కళ, సంస్కృతి, కవిత్వాన్ని ప్రేరేపించే చేప కథ
అనేక బెంగాలీ కుటుంబాలకు వారి ప్రియమైన ఇలిష్ (హిల్సా) లేకుండా దుర్గా పూజ అసంపూర్ణంగా ఉంటుంది. అది లేనిదే పూజ అసంపూర్తిగా ఉంటుందని భావించి కొందరు అమ్మవారికి ఈ చేప వంటకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. హిల్సా వంటకం కేవలం పాక ఆనందాన్ని మాత్రమే కాకుండా వారి సంస్కృతిపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ ’జీవనాళం’ గుండా ఈదుతూ, పండుగలు, వేడుకలలో కనిపిస్తుంది.హిల్సా వెండి మెరుపు, అద్భుతమైన రుచి రారమ్మని ఆహ్వానిస్తాయి. బెంగాలీ–అమెరికన్ ఆహార చరిత్రకారుడు చిత్రిత బెనర్జీ ఈ చేప సాంస్కృతికతను సంపూర్ణంగా అక్షరీకరించారు. దీనిని ‘జలాల ప్రియత‘, ‘చేపలలో రాకుమారుడు‘గా అభివర్ణించారు.హిల్సా కథ పండుగలు, డైనింగ్ టేబుల్‌కు మించి విస్తరించి ఉంది. శతాబ్దాలుగా, ఇది సాంప్రదాయ కాళీఘాట్ పెయింటింగ్స్‌లో లేదా సమకాలీన వర్ణనలలో గంభీరమైన, మత్స్యకన్య లాంటి దేవతగా – కవులు, రచయితలు, కళాకారుల కల్పనలను ఆకర్షించింది.ఒక సాహిత్య వ్యవహారంహిల్సాతో బెంగాలీ ప్రేమ, దాని సాహిత్య సంప్రదాయంలో క్లిష్టంగా అల్లింది. 18 ఉపపురాణాలలో ఒకటైన బృహద్ధర్మ పురాణంలో సనాతనవాదులు దాని వినియోగాన్ని చర్చించినప్పటికీ, చేపలు బ్రాహ్మణులకు రుచికరమైనది అని ప్రశంసించారు. ‘బ్రాహ్మణులు రోహు (బెంగాలీలో రుయి), చిత్తడి ముద్ద (పుంటి), స్నేక్‌హెడ్ ముర్రెల్ (షూల్), ఇతర తెల్లటి, పొలుసుల చేపలను తినవచ్చని ఈ పాఠం చెబుతోంది‘ అని గులాం ముర్షీద్ తన పుస్తకం, బెంగాలీ కల్చర్ ఓవర్ ఎ థౌజండ్‌లో రాశారు. -
దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపులో హింస చెలరేగింది. ఒక వర్గానికి చెందినవారు రాళ్లు రువ్వడంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం జిల్లాలోని పలు చోట్ల హిందూ సంస్థలు నిరసనలు చేపట్టాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు ఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.యూపీలోని బహ్రాయిచ్‌లో జరిగిన హింసాకాండపై జిల్లా ఎస్పీ వృందా శుక్లా మీడియాకు పలు వివరాలను అందించారు. ఈ ఉదంతంతో ప్రమేయమున్న 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, సల్మాన్ అనే నిందితుడి ఇంటి దగ్గర కాల్పులు జరిగాయని తెలిపారు. 22 ఏళ్ల యువకుడు రామ్ గోపాల్ మిశ్రా కాల్పుల్లో మృతిచెందాడన్నారు.బహ్రాయిచర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీసు స్టేషన్ ఇన్‌ఛార్జి హార్ది, మహసీ పోలీస్ పోస్ట్ ఇన్చార్జితో సహా ఆరుగురు పోలీసుల నిర్లక్ష్యాన్ని గుర్తిస్తూ ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ బహ్రాయిచ్‌లో చోటుచేసుకున్న ఘటనకు కారకులైనవారిని విడిచిపెట్టబోమని అన్నారు. నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇది కూడా చదవండి: రక్తమోడిన దేవరగట్టు -
బంగ్లాదేశ్: దుర్గాపూజలో చెలరేగిన హింస
ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందువులు దుర్గాపూజలను ఘనంగా చేసుకుంటున్నారు. అయితే ఢాకాలోని ఒక ప్రాంతంలో జరుగుతున్న దుర్గాపూజలో హింస చెలరేగింది. దుర్గాపూజ మండపంపైకి కొంతమంది దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. దీంతో భారీగా తొక్కిసలాట జరిగింది.ఢాకాలోని తాటి బజార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బాంబులు విసిరిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘వాయిస్ ఆఫ్ బంగ్లాదేశ్ హిందూ’ పేరుతో సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో గాయపడిన ఒక వ్యక్తిని ఆస్పత్రికి తరలించడాన్ని చూడవచ్చు.బంగ్లాదేశ్‌లోని హిందువులను అవమానించే ఘటనలు జరుగుతున్నాయి. చిట్టగాంగ్‌లోని దుర్గా పూజ మండపంలోకి ప్రవేశించిన కొందరు మరో మతానికి చెందిన పాటలు పాడారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం చిట్టగాంగ్‌లోని జేఎం సేన్ హాల్లో ఒక బృందం దుర్గాపాటలను పాడేందుకు పూజా కమిటీ సభ్యులు అనుమతి ఇచ్చారు. అయితే అవి వేరే వర్గానికి చెందిన పాటలని, స్థానిక హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. Bomb Blast in Tatibazara Puja Mandap, Dhaka.#DurgaPujaAttack2024 pic.twitter.com/BQqHj5SURo— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) October 11, 2024ఇది కూడా చదవండి: దుర్గాపూజ మండపంలో కలకలం -
దుర్గాపూజ మండపంలో కలకలం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మెటియాబ్రూజ్ ప్రాంతంలో దుర్గాపూజ సందర్భంగా కలకలం చెలరేగింది. పశ్చిమ బెంగాల్ బీజేపీ సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’లో ఈ ఉదంతానికి సంబంధించిన పోస్ట్‌ను షేర్ చేసింది.ఆ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని మెటియాబ్రూజ్‌లోని బెంగాలీ హిందువులు దుర్గాపూజ చేస్తున్నారు. ఇంతలో కలకలం నెలకొంది. పూజలో భాగంగా శంఖం ఊదుతుండగా, సీఎం మమతా బెనర్జీ మద్దతుదారులు మండపంలోకి ప్రవేశించి, వేడుకలను వెంటనే ఆపకపోతే, అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని బెదిరించారని బీజేపీ ఆరోపించింది. వెంటనే బీజేపీ నేతలు తాము నమాజ్ జరుగుతున్నప్పుడు స్పీకర్ ఆపివేస్తామని తెలిపారు. కాగా ఈ ఘటనపై ‘న్యూ బెంగాల్ స్పోర్టింగ్ క్లబ్’ పోలీసులకు ఫిర్యాదు చేసింది.బెంగాల్ బీజేపీ ఈ ఫిర్యాదు లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దుర్గామండపంలోకి 50 మంది బలవంతంగా ప్రవేశించారని, వారు మహిళలను కూడా దూషించారని బీజేపీ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా బీజేపీ షేర్ చేసింది. నిందితులపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. Disturbing scenes have emerged from West Bengal, in KMC Ward 133, Metiaburuz, where Bengali Hindus were celebrating Durga Puja. This year, many of the Tithis occurred in the morning, which led to the sound of Dhaks and conch shells being heard earlier in the day.This angered a… pic.twitter.com/h8JYHCBYX8— BJP West Bengal (@BJP4Bengal) October 11, 2024ఇది కూడా చదవండి: అంబరాన్నంటుతున్న దసరా సంబరాలు -
ఇది మెట్రోనా లేక నవరాత్రుల మండపమా?
కోల్‌కతా: ప్రతీయేటా నవరాత్రులలో కోల్‌కతాలో దుర్గాపూజా మండపాలను అద్బుతంగా తీర్చిదిద్దుతుంటారు. భక్తులు వీటిని చూసి మైమరచిపోతుంటారు. ఇటువంటి మండపాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. అయితే వీటికి భిన్నమైన ఒక మండపం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో తొలుత అండర్ వాటర్ మెట్రో లోపల ఓ వ్యక్తి వీడియో తీస్తున్నట్లు కనిపిస్తుంది. తరువాత అద్భుత దృశ్యం కనిపిస్తుంది. నిజానికి ఇది మెట్రో కాదు. నీటి అడుగున మెట్రో థీమ్‌తో రూపొందించిన దుర్గాపూజా మండపం. వీడియో చివరిలో దుర్గమ్మవారి విగ్రహం కనిపిస్తుంది . పలువురు భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడాన్ని కూడా వీడియోలో చూడవచ్చు.ఈ వీడియోను చూసినవారంతా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దీనిని షేర్ చేస్తున్నారు. ఈ వీడియో @ChapraZila అనే పేజీ నుండి పోస్ట్ అయ్యింది. దాని క్యాప్షన్‌గా 'కోల్‌కతాలోని మెట్రో మార్గంలో నిర్మించిన దుర్గామాత మండపం’ అని రాసివుంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 36 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. कोलकाता में मेट्रो की तर्ज पर बना मां दुर्गा का पंडाल 👏❤️ pic.twitter.com/YFYb3D2xAF— छपरा जिला 🇮🇳 (@ChapraZila) October 8, 2024ఇది కూడా చదవండి: బూటకపు ఎన్కౌంటర్.. డీఎస్పీకి జీవితఖైదు -
అమ్మవారికి కష్టాలు చెప్పుకుంటూ.. ట్రాన్స్జండర్ల పూజలు
జంషెడ్పూర్: దేశంలోని పలు ప్రాంతాల్లో దుర్గామాత పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇదే నేపధ్యంలో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ట్రాన్స్‌జంటర్లు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా వీరు నవరాత్రులలో దుర్గామాతను ఘనంగా పూజిస్తున్నారు.ఈ ట్రాన్స్‌జండర్లు దుర్గామాత విగ్రహం తయారీకి పశ్చిమ బెంగాల్ నుండి గంగానది మట్టిని తీసుకువచ్చి తమ చేతులతో విగ్రహాన్ని తయారు చేస్తారు. తాము చేసే ఆరాధన మిగిలినవారి ఆరాధనకు భిన్నంగా ఉంటుందని ఈ కమ్యూనిటీకి చెందిన అమర్జీత్ సింగ్ గిల్ తెలిపారు. తమ కమ్యూనిటీకి చెందినవారు ఈ తొమ్మిది రోజులు దుర్గా అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని, తాము తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టనష్టాలను చెప్పుకుంటారు. అలాగే ప్రపంచశాంతి కోసం ప్రార్థిస్తారు.ప్రతి సంవత్సరం దేశంలోని పలు ప్రాంతాల నుంచి ట్రాన్స్‌జండర్లు ఇక్కడికి తరలివచ్చి, దుర్గమ్మవారి పూజల్లో పాల్గొంటారు. ఇక్కడ జరిగే పూజల్లో మతపరమైన నియమాలను అనుసరించడంతో పాటు ట్రాన్స్‌జండర్లు తమ భావోద్వేగాలను అమ్మవారితో పంచుకుంటారు. ఇది కూడా చదవండి: అమెరికా వర్జీనియా నగరంలో వైభవంగా దసరా, బతుకమ్మ వేడుకలు! -
Bangladesh: దుర్గాపూజలకు మరింత బందోబస్తు
ఢాకా: భారత్‌లోని పశ్చిమ బెంగాల్లో దసరా సందర్భంగా జరిగే దుర్గా పూజలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. అయితే ఈ రాష్ట్రానికి ఆనుకున్న ఉన్న బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న దరిమిలా, అక్కడ దుర్గాపూజలు ఎలా జరగనున్నాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత, కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం దుర్గా పూజల నిర్వహణకు పలు నియమనిబంధనలను రూపొందించింది. బంగ్లాదేశ్‌లో దుర్గాపూజల కోసం 32,666 వేదికలను ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహ్మద్ మొయినుల్ ఇస్లాం మాట్లాడుతూ గత కొంతకాలంగా జరుగుతున్న మత అల్లర్ల దృష్ట్యా, దేశంలో మరింత కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దుర్గాపూజలు మొదలుకొని, విగ్రహ నిమజ్జనం వరకు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సైబర్ నిఘా ఏర్పాటు చేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా నేషనల్ ఎమర్జెన్సీ సర్వీస్ 999కి డయల్ చేసి సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు.బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ సలహాదారు మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి మాట్లాడుతూ దుర్గాపూజ వేదికల కారణంగా ముస్లిం అనుచరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. వారి నమాజ్ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందు లౌడ్స్పీకర్లు నిలిపివేయాలని కోరారు. బంగ్లాదేశ్ మత వ్యవహారాల సలహాదారు అబుల్ ఫైజ్ ముహమ్మద్ ఖలీద్ హుస్సేన్ మాట్లాడుతూ హిందువుల భద్రతకు తాము హామీనిస్తున్నామని అన్నారు. అక్టోబరు 3 నుంచి దుర్గాపూజలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12న ముగియనున్నాయి. అక్టోబర్ 8, 9 తేదీలలో పెద్ద సంఖ్యలో భక్తులు దుర్గాపూజలకు హాజరవుతారు.ఇది కూడా చదవండి: మహాకాళేశ్వరం గోడ కూలి ఇద్దరు మృతి -
నమాజ్ వేళ దుర్గా పూజ మైకులు ఆపండి
ఢాకా: షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయాక మైనారిటీ హిందువులపై దాడులు, ఆంక్షలు పెరిగాయన్న వార్తల నడుమ దుర్గాపూజకూ అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అవరోధాలు సృష్టిస్తోంది. ముస్లింలు నమాజ్, అజాన్ వేళల్లో దుర్గామాత మండపాల వద్ద పూజా కార్యక్రమాలు నిశ్శబ్దంగా జరగాలని, ఎలాంటి సంగీత వాయిదాల శబ్దాలు వినిపించడానికి వీల్లేదని తాత్కాలిక సర్కార్ గురువారం హుకుం జారీచేసింది. దేశంలో శాంతిభద్రతలకు సంబంధించిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. నమాజ్, అజాన్ సమయాల్లో దుర్గాపూజ మండపాల వద్ద ఎలాంటి సౌండ్ సిస్టమ్‌లను వాడకూడదని, సంగీత పరికరాలను వాయించకూడదని బంగ్లాదేశ్ హోం శాఖ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) మొహమ్మద్ జహంగీర్ ఆలం చౌదరి చెప్పారు. -
దీదీ వ్యాఖ్యలు సరికాదు: జూ.డా. తల్లి ఆవేదన
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై బెంగాల్‌వ్యాప్తంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు.. డాక్లర్లు, వైద్య సిబ్బంది ఇవాళ సాయంత్రం వరకు డ్యూటీలో చేరాలని సోమవారం ఆదేశించింది. మరోవైపు.. డాక్టర్ ఘటనపై ప్రజలు నిరసనలు మానేసి రాబోయే దుర్గా పూజ మీద దృష్టి సారించాలని సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో సీఎం మమత చేసి వ్యాఖ్యాలను బాధితురాలి తల్లి తప్పుపట్టారు. ఘటన ఆమె చేసి వ్యాఖ్యలు సరైనవి కాదని.. ఈ దారుణ ఘటనపై సున్నితత్వం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మేము ఎప్పుడూ మా కూతురుతో దుర్గా పూజ జరుపుకునేవాళ్లం. రాబోయే రోజుల్లో మేము దుర్గా పూజనే కాదు మరే ఇతర పండలు జరుపుకోలేము. సున్నితమైన అంశంపై ఆమె(మమతను ఉద్దేశించి) అలా ఎలా మాట్లాడతారు?. మా కూతురిని తిరిగి తీసుకురాగలరా. సీఎం మమత కుటుంబంలో ఇలాంటి దారుణ ఘటన ఆమె ఇలాగే మాట్లాడేవారా? నా బిడ్డకు న్యాయం జరగాలని నిరసన తెలుపుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని సీఎం మమత అడ్డుకోవాలని చూస్తున్నారు. మా కూతురి మరణంతో మా ఇంట్లో దీపం వెళ్లిపోయింది. మా కూతురిని దారుణంగా చంపేశారు. ఇప్పుడు న్యాయం కోసం డిమాండ్‌ను చేస్తున్నవారిని కూడా అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు.సోమవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం మమత మాట్లాడుతూ.. ‘‘ నిరసన చేస్తున్న ప్రజలు, డాక్టర్లు, వైద్య సిబ్బంది దుర్గా ఉత్సవాలపై దృష్టి సారించండి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలని అభ్యర్థిస్తున్నా’ అని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్లో దుమారం రేపుతున్నాయి.చదవండి: Supreme Court of India: జనం ఏమైపోయినా పట్టించుకోరా? -
దుర్గాపూజ లిస్ట్.. చిన్న కత్తి పెప్పర్ స్ప్రే!
కోల్‌కత్తాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన ‘మహిళల భద్రత’ అంశాన్ని మరోసారి చర్చల్లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో శ్రేయసి బిస్వాస్ అనే ఇన్ఫ్లూయెన్సర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘రాబోయే దుర్గా పూజ కోసం మీ షాపింగ్ లిస్ట్‌లో ఉండాల్సిన ఐటమ్స్’ అనేది వీడియో సారాంశం. ఇన్ఫ్లూయెన్సర్స్ శ్రేయసి ‘దుర్గా పూజా జాబితా’లో పండగకు అవసరమైన వస్తువులతో పాటు చిన్న కత్తి, పెప్పర్ స్ప్రే, అలారమ్ కీచైన్... లాంటివి జత చేసింది. ‘పెప్పర్‌స్ప్రే, అలారమ్ కీచైన్ల మీద వీడియో చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ కోల్‌కతా దుర్ఘటన నేపథ్యంలో తప్పకుండా చేయాలనిపించింది. మహిళల భద్రత ప్రమాదంలో పడింది. ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు. ఈ నేపథ్యంలో మహిళలు తమ భద్రత గురించి తామే జాగ్రత్త పడాలి. బ్యాగులో సెల్ప్–డిఫెన్స్ టూల్స్ తప్పనిసరిగా ఉండాలి’ అంటుంది శ్రేయసి బిస్వాస్. సెల్ఫ్–డిఫెన్స్ టూల్స్‌ను ప్రేక్షకులకు చూపుతూ వాటి వల్ల ఉపయోగం ఏమిటో చెప్పింది శ్రేయసి. ‘ఈ సెల్ఫ్–డిఫెన్స్ ్రపాడక్ట్స్ అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. జస్ట్ సెర్చ్ చేయండి చాలు’ అని సలహా కూడా ఇచ్చింది. ఈ వీడియో 7.6 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.‘కోల్‌కతా దుర్ఘటన తరువాత కొత్త వాళ్లు ఎవరైనా మిల్లీ సెకన్ నా వైపు చూసినా చాలా భయంగా ఉంది’ అని ఒక యూజర్ రాసింది. ‘మా పరిస్థితి కూడా అదే’ అన్నారు చాలామంది. ‘భయపడితే ఎలా! మహిళలలో దుర్గాదేవి అంశ ఉంది. దుర్మార్గుల అంతు చూసే అపార శక్తి ఉంది’ అని ఒక యూజర్ రాశారు. -
Lok Sabha Election 2024: డ్రమ్స్.. ధూం ధాం
సంప్రదాయ చీరలు. భుజానికి డోలు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కంటే ముందే దర్శనమిస్తారు. అభ్యరి్థది ఏ పార్టీ అయినా సరే, వీరు మాత్రం ఉండాల్సిందే. వారే మహిళా ఢాకీలు. ఈసారి పశి్చమబెంగాల్లో ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్న కళాకారులు వీళ్లు. ఢాకీ చప్పుడు దుర్గ పూజ సమయంలో ప్రజలను మేల్కొలిపే సంబరం. ‘ధునుచి నాచ్’లాగే డ్రమ్స్ వాయించడం దుర్గ పూజలో ముఖ్యమైన అంశం. సాధారణంగా దుర్గ పూజ సమయంలో స్త్రీలు నృత్యకారిణులుగా, పురుషులు ఢాకీలుగా ఉంటారు. కొంతకాలం కింద మహిళలు ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. దుర్గ పూజల్లో డ్రమ్స్ వాయిస్తూ ఢాకీలుగా ఉపాధి పొందుతున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రచారంలో కీలకంగా మారారు. దాదాపుగా అన్ని పారీ్టలూ వీరిని పిలుస్తున్నాయి. వీళ్లు ముఖ్యంగా రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. అయితే అదంత సులువైన వ్యవహారం కాదు. రోజంతా డ్రమ్ భుజానికి తగిలించుకునే ఉండాలి. మరోవైపు తీవ్రమైన వేడి. అయినా ఉపాధి దొరుకుతుండటంతో మహిళలు ఢాకీ ధరించి ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఢాకీ వాయిస్తూ రోజుకు రూ.700 నుంచి రూ.800 దాకా సంపాదిస్తున్నారు. దుర్గాపూజ వేళ వీరికి 5 రోజులకు రూ.8 వేల నుంచి రూ.10 వేల దాకా వస్తాయి. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో అయితే ఆదాయం ఇంకాస్త ఎక్కువ వస్తుంది. గతేడాది హైదరాబాద్‌లోనూ దసరా ఉత్సవాల్లో మహిళా ఢాకీలు సందడి చేశారు! డిమాండ్ పిరిగింది... ఎన్నికల ప్రచారంలో గతంలో మహిళా ఢాకీలకు ఇంత డిమాండ్ ఉండేది కాదంటున్నారు శివ్‌పాద్ దాస్. ఆయన మాచ్లాండ్పూర్లో ఢాకీ శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. ‘‘ఈసారి మహిళా ఢాకీలకు పారీ్టల నుంచి బాగా డిమాండ్ ఉంది. సామాన్యులు కూడా మహిళా ఢాకీలనే ఇష్టపడుతున్నారు. పురుషుల సంగీత వాయిద్యాలను మహిళలు తమ భుజాలపై వేసుకుని వాయిస్తుండటంతో చూసేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు’’ అని శివ్‌పాద్ చెప్పారు. ‘‘భర్తతో పాటు కుటుంబాన్ని ఆదుకోవడానికి ఢాకీలుగా పని చేస్తున్నాం. పిల్లల చదువుల ఖర్చుతో కుటుంబ అవసరాలను తీర్చగలుగుతున్నాం. ఒకేసారి వేల రూపాయలు సంపాదించగలగడం ఆనందాన్నిస్తోంది. ఇప్పుడు ఎన్నికల సీజన్ గనుక తినడానికి, తాగడానికి కూడా సమయం ఉండటం లేదు. రోజూ ఏదో ఒక పార్టీ ప్రచార కార్యక్రమానికి డ్రమ్ భుజాన వేసుకుని వెళ్తూనే ఉన్నాం’’ అని ఆనందంగా చెబుతున్నారు మహిళా ఢాకీలు. 14 ఏళ్ల కిందట మొదలై... ప్రముఖ ఢాకీలలో ఒకరైన గోకుల్ చంద్ర దాస్ పద్నాలుగేళ్ల కిందట తన కుటుంబంలోని మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. కోడలు ఉమా దాస్, కుమార్తె టుకుతో కలిసి మహిళా ఢాకీల బృందాన్ని ప్రారంభించారు. 2011లో దుర్గా పూజ పండల్లో తొలిసారి ప్రదర్శన ఇచ్చినప్పుడు అంతా ఆశ్చర్యపోయి చూశారు. అయితే బెంగాలీ టాలెంట్–హంట్ షోలో మహిళా ఢాకీలు కనిపించిన తరువాత పరిస్థితి మారింది. వారిని దుర్గా పూజలకు పిలవడం మొదలైంది. ఇప్పుడు బెంగాల్లో అనేక మహిళా ఢాకీ శిక్షణా కేంద్రాలున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దుర్గాపూజ బిజినెస్.. అక్కడ రూ.1,100 కోట్లు!
ఇటీవల ముగిసిన దుర్గా పూజ ఉత్సవం అక్కడి రెస్టారెంట్లకు కాసులు కురిపించింది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెంగాల్లో ముఖ్యంగా కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇళ్లలో సంప్రదాయ పిండివంటలతో పాటు పిల్లాపాపలతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి ప్రత్యేకమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఆరు రోజుల్లో రూ. 1,100 కోట్లు కోల్‌కతా నగరంలోని ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు దసరా ఉత్సవాల సందర్భంగా ఆరు రోజుల్లో రూ. 1,100 కోట్లను ఆర్జించాయి. గత సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన ఆదాయం కంటే ఈ సారి 20 శాతం అధికంగా వచ్చిందని ఈస్ట్రన్ ఇండియా హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ తెలిపింది. కోవిడ్ సంక్షోభం అనంతరం అన్ని అడ్డంకులు తొలగిపోయిన తర్వాత ఇది రెండవ దుర్గా పూజ. దశమి వరకు ఆరు రోజుల పాటు తెల్లవారుజామున 3 గంటల వరకు హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లు ఆహారం ఆస్వాదిస్తూ కనిపించారని ఈస్ట్రన్ ఇండియా హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుదేష్ పొద్దార్ తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ ఆరు రోజుల్లో నగరంలోని రెస్టారెంట్లు రూ. 1,100 కోట్ల వ్యాపారం చేశాయని ఆయన పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 20-25 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. -
తుమ్మెదల సైన్యంతో రాక్షసుడుని అంతమొందించింది కాబట్టే..
పూర్వం అరుణుడు అనే అసురుడు ఉండేవాడు. అతడు పాతాళవాసి, మహా క్రూరుడు. దేవతలంటే అతడికి బద్ధవిరోధం. దేవతలను జయించాలనే సంకల్పంతో బ్రహ్మ కోసం తపస్సు చేయాలనుకున్నాడు. హిమాలయాల దిగువన గంగాతీరంలోని ఏకాంత ప్రదేశంలో ఘోర తపస్సు ప్రారంభించాడు. గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీరు మాత్రమే తాగుతూ పదివేల ఏళ్లు తపస్సు సాగించాడు. కేవలం గాలి మాత్రమే పీల్చుతూ మరో పదివేల ఏళ్లు తపస్సు సాగించాడు. అతడి తపోగ్రత అంతకంతకు పెరిగి అతడి శరీరం నుంచి మంటలు వెలువడి, లోకాలను దహించడం ప్రారంభించాయి. అరుణుడి తపోగ్రత నుంచి వెలువడిన మంటలు లోకాలను దహిస్తూ ఉండటంతో దేవతలు భీతావహులై, పరుగు పరుగున బ్రహ్మదేవుడి వద్దకు చేరుకున్నారు. దేవతల మొరను ఆలకించిన బ్రహ్మదేవుడు గాయత్రీ సమేతంగా హంసవాహనాన్ని అధిరోహించి అరుణుడి వద్దకు బయలుదేరాడు. అరుణుడి ముందు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన సమయానికి అతడు బొందిలో ప్రాణం మాత్రమే మిగిలి, ఎముకల పోగులా మిగిలి ఉన్నాడు. బ్రహ్మదేవుడు అతడిని చూసి, ‘వత్సా! ఏమి నీ కోరిక’ అన్నాడు. బ్రహ్మదేవుడి నోట ఆ మాట వినగానే అరుణుడు ఆనందపరవశుడయ్యాడు. బ్రహ్మదేవుడి ముందు మోకరిల్లి, నానా విధాలుగా స్తుతించాడు. ‘దేవా! నాకు మరణం లేకుండా వరమివ్వు’ అని అడిగాడు. ‘నాయనా! జీవులకు కాలధర్మం తప్పదు. అది తప్ప ఇంకేదైనా వరమడుగు, తీరుస్తాను’ అన్నాడు బ్రహ్మదేవుడు. ‘అయితే, యుద్ధంలో నాకు శస్త్రాస్త్రాల వల్ల గాని, స్త్రీ పురుషుల వల్ల గాని, రెండుకాళ్ల, నాలుగుకాళ్ల జంతువులతో గాని, రెండు ఆకారాల ప్రాణులతో గాని చావు కలగకుండా వరమివ్వు’ అన్నాడు. ఇదివరకటి రాక్షసులు హతమారిన సందర్భాలను గుర్తుచేసుకుని, అరుణుడు ఎంతో తెలివితో అడిగిన ఈ వరానికి బ్రహ్మదేవుడు ‘తథాస్తు’ అంటూ సమ్మతించాడు. బ్రహ్మదేవుడి నుంచి వరం పొందిన తర్వాత అరుణుడు తిరిగి పాతాళానికి వెళ్లాడు. అక్కడ అసురులందరినీ సమావేశపరచి, బ్రహ్మదేవుడి ద్వారా తాను సాధించిన వరాన్ని గురించి చెప్పాడు. ఆనందభరితులైన అసురులు అరుణుడిని తమ పాలకుడిగా ఎన్నుకున్నారు. వెంటనే అరుణుడు స్వర్గానికి తన దూతను పంపాడు. ‘స్వర్గాన్ని తక్షణమే విడిచిపెట్టి వెళ్లిపోవాలి. లేదా అరుణుడితో యుద్ధానికి సిద్ధపడాలి’ అని ఆ దూత తెచ్చిన సందేశానికి ఇంద్రుడు భయకంపితుడయ్యాడు. ఇంద్రుడు దేవతలతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్లాడు. వారు విష్ణువు వద్దకు వెళ్లారు. తర్వాత అందరూ కలసి కైలాసానికి వెళ్లి, పరమేశ్వరుడికి పరిస్థితిని వివరించి, ఆపద నుంచి గట్టెక్కించమని కోరారు. ‘బ్రహ్మదేవుడు అతడికి ఇచ్చిన వరం వల్ల మనమెవ్వరమూ అతణ్ణి ఏమీ చేయలేము. అందువల్ల త్రిభువనేశ్వరి అయిన జగజ్జననిని శరణు కోరుదాం. ఆమె మాత్రమే రక్షించగలదు’ అన్నాడు శివుడు. దేవతలందరూ జగజ్జనని అయిన ఆదిశక్తిని ప్రార్థించారు. వారి మొరను ఆలకించిన ఆమె, ‘అరుణుడు నిత్యం గాయత్రీ మంత్రాన్ని జపిస్తుంటాడు. ఆ జపాన్ని విరమింపజేసినట్లయితే వాడికి చావు మూడుతుంది’ అని పలికింది. జగజ్జనని చెప్పిన తరుణోపాయాన్ని నెరవేర్చడానికి దేవేంద్రుడు దేవతల తరఫున బృహస్పతిని అరుణుడి వద్దకు పంపాడు. బృహస్పతి అరుణుడి వద్దకు వెళ్లాడు. అరుణుడు అతడికి స్వాగతం పలికాడు. ‘మునివరా! ఎక్కడి నుంచి రాక. అయినా నేను మీ పక్షపాతిని కాదు, నీవు మా పక్షపాతివి కాదు. నేను దేవేంద్రుడికి, దేవతలకు శత్రువునని నీవెరుగుదువు కదా’ అన్నాడు. ‘అదంతా సరే, నువ్వూ గాయత్రీ మంత్రజపం చేసేవాడివే, నేనూ గాయత్రీ మంత్రజపం చేసేవాడినే! కాబట్టి నువ్వు మా పక్షపాతివి ఎందుకు కావు?’ అన్నాడు బృహస్పతి. అహం దెబ్బతిన్న అరుణుడు ‘నా శత్రువైన నీవు జపించే మంత్రం నాకెందుకు’ అంటూ గాయత్రీజపాన్ని వదిలేశాడు. వచ్చిన పని నెరవేరడంతో బృహస్పతి అక్కడి నుంచి వెనుదిరిగాడు. వరకారణమైన గాయత్రీమంత్రాన్ని వదిలేసిన తర్వాత అరుణుడు తేజోహీనుడయ్యాడు. దేవతలందరూ తిరిగి జగజ్జననిని ప్రార్థించారు. జగజ్జనని తమ్మెదలు మూగిన పూలమాలలతో ప్రత్యక్షమైంది. తుమ్మెదల సైన్యాన్ని అరుణుడి మీదకు పంపింది. కోటాను కోట్ల తుమ్మెదలు భీషణ ఝుంకార ధ్వనులు చేస్తూ అరుణుడి మీద దాడి చేశాయి. అరుణుడి అసుర సేనలను కుట్టి కుట్టి హతమార్చాయి. తుమ్మెదల దండయాత్రలో అరుణుడు అంతమొందాడు. భ్రమరాలతో రాక్షస సంహారం చేసిన జగజ్జనని భ్రామరీదేవిగా పూజలందుకుంది. -
ఆ అమ్మను ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా!
ఆశ్వీయుజమాసం శరదృతువులో వస్తుంది. ఈ కాలంలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి ప్రకృతి కొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ మాసంలో వెన్నెల అత్యధికంగా కాస్తుంది. శరత్కాలంలోని తొలి తొమ్మిదిరాత్రులు జరుపుకొనే దేవీనవరాత్రులు అనేక రుగ్మతలను నివారించడంతోపాటు తలపెట్టిన పనులలో విజయాన్ని చేకూరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. సృష్టి, స్థితి, లయకారిణి అమ్మే! త్రిమూర్తులకు, దశావతారాలకు అన్నింటికీ మూలం అమ్మే! ఆ పరాశక్తిని ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా ఉత్సవాలనీ, దేవీ శరన్నవరాత్రోత్సవాలనీ ప్రసిద్ధి చెందాయి. శరన్నవరాత్రుల విశేషాలు హస్తా నక్షత్రంతో కూడిన ఆశ్వీయుజ దశమికి ‘దశహరా’ అనే పేరు ఉంది. పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా ఉంది. రాత్రి అంటే తిథి అనే అర్థం కూడా. దీనిప్రకారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలు. తొమ్మిది రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారు చివరి మూడు రోజులు అంటే అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దుర్గాదేవిని అర్చిస్తే, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈవేళ పుస్తకదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దుర్గాష్టమి దుర్గాదేవి ‘లోహుడు’ అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలను పూజించే ఆనవాయితీ వచ్చిందని చెబుతారు. ఇక దుర్గ అంటే దుర్గమమైనది, దుర్గతులను తొలగించేది అని అర్థం. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. ‘దుర్గలోని ‘దుర్’ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్య్రం మొదలైనవి. ‘గ’ అంటే నశింపచేసేది‘, అని దైవజ్ఞులు వివరిస్తారు. ఈమె ఆరాధన వల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు. అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గా రూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలపై అదుపును, తదుపరి మూడురోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడురోజులు సరస్వతీదేవి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, ఆ క్రమంలో ఈ నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించి ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు. ఈరోజు దుర్గసహస్రనామ పారాయణం,‘దుం’ అనే బీజాక్షరంతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. మహర్నవమి మానవ కోటిని పునీతులను చేయడం కోసం భగీరథుడు ఎంతో తపస్సు చేసి మరెన్నో ప్రయాసలకోర్చి గంగను దివి నుంచి భువికి తెచ్చినది ఈరోజే! ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిథిని గూర్చి చెప్పడంలోని ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్రసిద్ధి కలుగుతుంది. కాబట్టి ‘సిద్ధిదా’ అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలు చేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుందని ప్రతీతి. సామూహిక లలితా సహస్ర నామార్చనలు, కుంకుమ పూజలు ఈ పండుగ ఆచారాలలో ఇంకొన్ని. దసరా పండుగకు ఒకరోజు ముందు ఆయుధ పూజ. దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఆచారాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఈ పర్వదినాన రైతులు కొడవలి, నాగలి, వాహనం ఉన్న వారు తమ వాహనాలకు, కుట్టుపని వారు తమ కుట్టు యంత్రాలకు, చేనేత కార్మికులు తమ మగ్గాలకు, కర్మాగారాలలో పని చేసే కార్మికులు తమ యంత్ర పరికరాలకు, ఇతర పనిముట్లకు పసుపు, కుంకుమతో పూజలు చేస్తారు. వాటిని అమ్మవారి ప్రతిరూపాలుగా ఆరాధిస్తారు. అయితే ఈ ఆయుధ పూజను ఎందుకు జరుపుకుంటారు.. ఎందుకని దీనికంత ప్రాముఖ్యత ఇస్తారనే విషయాలపై కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం... పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లడానికి ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచారు. అందువల్ల ఆయుధాలు తుప్పు పట్టకుండా చెడకుండా సురక్షితంగా ఉన్నాయి. యుద్ధానికి వెళ్లడానికి ముందు అర్జునుడు తన గాండీవానికి, భీమసేనుడు తన గదాయుధానికి ప్రత్యేకంగా పూజలు జరిపించారని ప్రతీతి. శక్తి స్వరూపిణిని.. అలా పాండవులు శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకుని, యుద్ధానికి సన్నద్ధం అయ్యారని చెబుతుంటారు. మరోవైపు దుర్గతులను నివారించే మహా స్వరూపిణి అమ్మవారైన దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు అని చెబుతారు. ఆయుధ పూజ రోజున ‘ఓం దుం దుర్గాయైనమః’ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలొస్తాయి. అలాగే లలితా అష్టోత్తరాలు పఠించాలి. ఆ తర్వాత ఆయుధ పూజ లేదా అస్త్రపూజలు చేయాలి. బొమ్మల కొలువు.. ఆయుధ పూజనే కొన్ని ప్రాంతాల్లో అస్త్ర పూజ అంటారు. కేరళ వంటి ప్రాంతాలలో ఆయుధ పూజ సందర్భంగా ప్రత్యేకంగా కొన్ని పోటీలను నిర్వహిస్తుంటారు. తమిళనాడులో ఆయుధ పూజ సందర్భంగా సరస్వతీ పూజను చేస్తారు. తమిళ సంప్రదాయంలో ఇదే పూజను ‘గోలు’ అంటారు. ఈరోజున ఆ ప్రాంతంలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు. ఆంధ్ర ప్రాంతంలో కూడా బొమ్మల కొలువును నిర్వహించడం పరిపాటి. విజయదశమి దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని పురాణాలు చెబుతున్నాయి.‘శ్రవణా’ నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి ‘విజయా’ అనే సంకేతమున్నది. అందుకనే దీనికి ‘విజయదశమి’ అను పేరు వచ్చింది. ఏ పనైనా తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం లాంటివి చూడకుండా విజయదశమి నాడు చేపడితే ఆ కార్యంలో విజయం తథ్యం అని పెద్దలు చెబుతారు. ‘శమీపూజ’ చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే ’జమ్మిచెట్టు’. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారివారి ఆయుధాలను, వస్త్రాలను శమీవృక్షంపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసం పూర్తి అవగానే ఆ వృక్ష రూపాన్ని పూజించి ప్రార్థించి, తిరిగి ఆయుధాలను, వస్త్రాలను పొంది, శమీవృక్ష రూపాన ఉన్న‘అపరాజితా’ దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయం సాధించారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ ‘అపరాజితాదేవి’ని పూజించి, రావణుని సంహరించడం ద్వారా యుద్ధంలో విజయం సాధించాడు. తెలంగాణ ప్రాంతంలో శమీపూజ తర్వాత శుభానికి సూచిక అయిన‘పాలపిట్ట’ను చూసే ఆచారం ఉంది. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ దిగువ ఇచ్చిన శ్లోకాన్ని పఠిస్తూ చెట్టుకు ప్రదక్షణలు చేస్తారు. ‘శమీ శమయతే పాపం శమీశత్రు వినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ! అనే శ్లోకం రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అమ్మవారి అలంకారాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. శ్రీశైల భ్రమరాంబికకు ఒకవిధంగా అలంకారం చేస్తే, విజయవాడ కనకదుర్గమ్మకు మరోవిధంగా అలంకారాలు చేస్తారు. అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! అందరికీ అమ్మ కరుణాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఈ విజయ దశమి అందరికీ సకల శుభాలూ, తలపెట్టిన కార్యక్రమాలన్నింటిలోనూ జయాలను చేకూర్చాలని ఆకాంక్షిద్దాం. కనక దుర్గాదేవి (పాడ్యమి) శ్రీ బాలాత్రిపురసుందరి ( విదియ ) శ్రీ అన్నపూర్ణాదేవి (తదియ ) శ్రీ గాయత్రీదేవి ( చవితి ) శ్రీ లలితాత్రిపుర సుందరి ( పంచమి ) శ్రీ మహాలక్ష్మీదేవి ( షష్ఠి) శ్రీ సరస్వతీదేవి (సప్తమి ) శ్రీ దుర్గాదేవి (అష్టమి) శ్రీ మహిషాసురమర్దిని దేవి (నవమి ) శ్రీ రాజరాజేశ్వరీ దేవి (దశమి) దేవీ అలంకారాలు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. నవరాత్రులంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండగ చేసుకుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది. భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని. శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో, వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి. దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి, మహా పవిత్రమైనవి. ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో రూపంలో అగుపించే అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు, సంతాన సౌభాగ్యాలు, సుఖశాంతులు చేకూరుతాయని, శత్రుజయం కలుగుతుందనీ భక్తుల విశ్వాసం. చల్లని చూపు ఆ అమ్మ కంటిలో నవరసాలను శంకరాచార్యులు వర్ణిస్తారు. చేప స్తన్యం ఇచ్చి తన పిల్లలను పోషించదు. చేప తన పిల్లను పోషించినప్పుడు కేవలం అలా కన్నులతో తల్లిచేప చూసేసరికి పిల్ల చేపకు ఆకలి తీరిపోతుంది. మీన నేత్రాలతో ఉంటుందని అమ్మవారికి మీనాక్షి అనిపేరు. అమ్మ కళ్ళ వైభవాన్ని అనుభవించి, అమ్మకంటి వంక ఒకసారి చూసినట్లయితే మనలో ఇప్పటివరకు ఉన్న ఆందోళనలు ఉపశమించి శాంతి, సంతోషం కలుగుతాయి. ∙డి.వి.ఆర్. భాస్కర్ (చదవండి: అమ్మవారి నామాలే ఆ మహా నగరాలు! వాటి ప్రాశస్యం ఏంటంటే..) -
గుజరాత్ నవరాత్రుల ప్రత్యేకత ఏమిటి? వైష్ణోదేవి దర్శనానికి ఎంతసేపు వేచివుండాలి?
శరన్నవరాత్రులు దేశంలోని తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు అన్నిచోట్లా వైభవంగా నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో దుర్గా మండపాలను అందంగా అలంకరిస్తారు. మరికొన్ని చోట్ల దాండియా నైట్ నిర్వహిస్తారు. దేశంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరిగే ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాతా వైష్ణో దేవి(జమ్ము) మాతా వైష్ణో దేవి ఆస్థానంలో ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. అయితే నవరాత్రుల ప్రత్యేక సందర్భంలో ఆలయ బోర్డు ప్రత్యేక అలంకరణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. భక్తుల రద్దీ కారణంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు రెండుమూడు రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అమ్మవారిని దర్శించుకుని, వేడుకుంటే మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. అహ్మదాబాద్‌లో.. గుజరాత్ ప్రభుత్వానికి నవరాత్రి పండుగ నిర్వహణ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. నవరాత్రులకు రాష్ట్రానికి పర్యాటకులు కూడా తరలివస్తుంటారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నవరాత్రుల సందర్భంగా అనేక వేదికలు ఏర్పాటవుతాయి. ప్రముఖ గాయకులతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. సామూహికంగా గర్బా నృత్యం చేస్తారు. దాండియా నైట్ నిర్వహిస్తారు. గుజరాత్‌ను సందర్శించాలనుకునేవారు శారదా నవరాత్రులలో వెళితే మరింత ఎంజాయ్ చేయవచ్చని టూర్ నిపుణులు చెబుతుంటారు. గుజరాత్‌లోని పలు ప్రదేశాలు శారదా నవరాత్రులలో అమ్మవారి కీర్తనలతో మారుమోగుతుంటాయి. వారణాసిలో.. వారణాసిని శివుడు కొలువైన నగరం అని అంటారు. నవరాత్రి, దీపావళి తదితర పండుగల సందర్భంగా ఘాట్లపై దీపాలు వెలిగిస్తారు. పురాణాలలోని వివరాల ప్రకారం మాతా సతీదేవి మణికర్ణిక(చెవిపోగు) వారణాసిలో పడిపోయిందని చెబుతారు. దీంతో ఇది కూడా శక్తిపీఠంగా వెలుగొందుతోంది. ఇక్కడ అమ్మవారికి విశాలాక్షి, మణికర్ణి రూపాలలో పూజిస్తారు. పార్వతీ దేవి చెవి పోగు ఇక్కడి కొలనులో పడిపోయిందని, దానిని శంకరుడు కనుగొన్నాడని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి మణికర్ణిక అనే పేరు వచ్చిందని చెబుతారు. కేరళలో.. కేరళలో అమ్మవారు కొలువైన దేవాలయాలు అనేకం ఉన్నాయి. అమ్మవారి పూజా సమయంలో ఏనుగులను కూడా పూజిస్తారు. నవరాత్రి సందర్భంగా కేరళలోని కొన్ని దేవాలయాలలో జాతర నిర్వహిస్తారు. విజయదశమి రోజున కేరళీయులు తమ ఆచారాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. బంగారు ఉంగరం సహాయంతో పిల్లల నాలుకపై బీజాక్షరాలు రాస్తారు. ఆ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. కొట్టాయంలోని పనచ్చిక్కడ్ సరస్వతి ఆలయం, మలప్పురంలోని తుంచన్ పరంబ్, తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి ఆలయం, త్రిసూర్‌లోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం, ఎర్నాకులంలోని చోటానిక్కర దేవి ఆలయాలలో నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఛత్తీస్‌గఢ్‌లో.. నవరాత్రుల సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో రథయాత్ర జరుగుతుంది. అమ్మవారికి మహువా లడ్డూలను సమర్పిస్తారు. 52 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో ఉంది. ఈ శక్తిపీఠాన్ని దంతేశ్వరి ఆలయం అని అంటారు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. నవరాత్రి రోజుల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇది కూడా చదవండి: ప్రధాని, రాష్ట్రపతి పదవులు వద్దన్న నేత ఎవరు? -
అమ్మవారికి నిమ్మకాయ దండలెందుకు వేస్తారు?
అమ్మవారికి నిమ్మకాయల దండలెందుకు వేస్తారు? గుమ్మడి కాయను ఎందుకు బలి ఇస్తారు?..నిజానికి మాములు రోజుల్లోనే కాదు బోనాలప్పుడూ, కొన్ని ప్రత్యేక పండుగల్లో అమ్మవారికి బలిగా గుమ్మడికాయని సమర్పించడం, నిమ్మకాయల దండలు వేసి అర్చించడం వంటివి చేస్తాం . ఇలా నిమ్మకాయల దండలు అమ్మవారికి ఎందుకు వేస్తారు ? అసలు ఈ ఆచారం ఎందుకు ప్రారంభం అయ్యింది. మనమొకసారి పరిశీలిస్తే, లక్ష్మీ దేవికి , సరస్వతీ దేవికి ఇలాంటి నిమ్మకాయ దండాలు వేసే ఆచారం కనిపించదు . కానీ శక్తి ఆలయాల్లో, గ్రామదేవతల ఆలయాల్లో ఈ ఆచారం కనిపిస్తుంది. శక్తి స్వరూపిణి అయినా అమ్మవారు రక్షణ బాధ్యత కలిగినది . నిత్యం శత్రుసంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తుంటుంది. లయకారుని శక్తి కదా అమ్మవారు. కాలస్వరూపమై, దుష్టశక్తుల పాలిటి సింహస్వప్నం అయిన దేవికి తామస గుణం ఉంటుంది. దేవి సత్వ స్వరూపమే అయినా సంహార క్రియ నిర్వహించేప్పుడు తామస ప్రవృత్తిని అమ్మ ప్రదర్శిస్తుంది. ఆ దేవీ స్వరూపాలై గ్రామాలకి రక్షణగా కాపలా కాసే గ్రామ దేవతలు కూడా, రాత్రిపూట నగర సంచారం / గ్రామ సంచారం చేస్తూ, దుష్ట శిక్షణ చేస్తారు . అటువంటి వీరత్వాన్ని ప్రతిబింబించేవే ఈ నిమ్మకాయల దండలు. శిరస్సుకి ప్రతిగానే ఈ కూష్మాండం.. "కూష్మాండో బలిరూపేణ మమ భాగ్యాదవస్థితాః ప్రణమామి తతస్సర్వ రూపిణం బలి రూపిణం". వీరత్వాన్ని ప్రదర్శించాల్సిన దేవికి మాంసాహారం నిషిద్ధం కాదుగా ! రాజులు మాంసాహారాన్ని, బ్రాహ్మణులు సాత్విక ప్రవర్తనతో మెలిగేందుకు శాఖాహారాన్ని తీసుకుంటారు . మరి అమ్మ స్వయంగా శక్తి కాబట్టి ఆమె ‘బలిప్రియ’. ఆ బలిగా మనం శిరస్సుని సమర్పించాలి. శిరస్సుకి ప్రతీక కూష్మాండం (గుమ్మడికాయ ). అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ ‘ఓ బలిదానమా ! నా భాగ్యమువలన కూష్మాండ రూపంలో ఉన్నావు (గుమ్మిడికాయ రూపంలో ). అమ్మవారికి సంతోషాన్ని కలుగజేసి, నా ఆపదలను నశింపజేయి’. అని ప్రార్థిస్తూ గుమ్మడికాయని అమ్మవారికి బలిగా సమర్పించాలని శాస్త్రం సూచిస్తూ ఉంది. అదేవిధంగా నిమ్మకాయ దండలని సమర్పించడము కూడా ! రౌద్ర , తామస స్వరూపిణి అయిన దేవి, ఆమెకి ఇష్టమైన నిమ్మకాయల దండనీ, పులుపుగా ఉండే పులిహోర వంటి నైవేద్యాన్ని స్వీకరించి, శాంతిస్తారని చెబుతారు. అందువలనే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తారు. కానీ ఈ సంప్రదాయాన్ని ఇళ్ళల్లో చేసుకొనే పూజల్లో వినియోగించకూడదని గుర్తుంచుకోవాలి . ఇందులో తాంత్రికపరమైన అర్థాలు కూడా ఉన్నందున ఇలాంటి ఆచారాన్ని ఇంట్లో చేసుకొనే పూజల్లో వాడకపోవడం మంచిది. ఇలా నిమ్మకాయల దండని కావాలనుకుంటే, మీరు తయారు చేసి, గుడిలో ఉన్న దేవతకి సమర్పించి, మీ పేరిట అర్చన చేయించుకొని, అక్కడ చేసిన అర్చనలో నుంచి నిమ్మకాయలు తెచ్చుకొని మీ ద్వారబంధానికి, వాహనానికి కట్టుకోండి. దానివలన దృష్టి దోషాలు తగలకుండా ఉంటాయి. శత్రుపీడలు నివారించబడతాయి. అమ్మ రక్షణలో ఉన్నందువల్ల, దుష్ట శక్తులు దరి చేరకుండా ఉంటాయి . దుష్టశక్తుల పీడని నివారించడానికి వినియోగించే ఈ నిమ్మకాయల దండని కేవలం పరాశక్తికి మాత్రమే వినియోగించాలి. అంతేగానీ లక్ష్మీ దేవికి, సరస్వతి దేవికి ఈ ఆచారం వర్తించదు.!! (చదవండి: జంట అరటిపండ్లు తినకూడదా?.. దేవుడికి కూడా సమర్పించకూడదా?) -
అమ్మవారి విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి.. 8 మంది మృతి, షాకింగ్ వీడియో
కోల్‌కత: విజయదశమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 8 మంది మృతి చెందారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మాల్ నదిలోకి దిగారు. అయితే, ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో పలువురు కొట్టుకుపోయారు. వారిలో 8 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి 8.30 ప్రాంతంలో జరిగిందని జల్పైగురి జిల్లా కలెక్టర్ మౌమితా గోదర తెలిపారు. వందలాది మంది విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు మాల్ నది ఒడ్డున పోగయ్యారని, అంతలోనే భారీ ఎత్తున వరద ప్రవాహం పెరగడంతో కొందరు కొట్టుకుపోయారని వెల్లడించారు. 50 మంది స్థానికుల సాయంతో బయటపడ్డారని, కొందరు గల్లంతయ్యారని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడ్డ 13 మందిని ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానిక యంతాంగంతో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగున్నాయని అన్నారు. మాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి బులు చిక్ బరైక్ మాట్లాడుతూ.. మృతుల సంఖ్య పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నట్టు తెలిపారు. బలమైన వరద కారణంగా కళ్లముందే చాలామంది నదిలో కొట్టుకుపోయారని అన్నారు. కాగా, మంత్రి బులు, మరికొంతమంది తృణమూల్ నేతలు సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. సహాయకచర్యలను ముమ్మరం చేయాలని ప్రతిపక్షనేత సువేంధు అధికారి పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. జల్పైగురి దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. Saddening news coming from Jalpaiguri as flash flood in Mal river during Durga Puja immersion swept away many people. Few deaths have been reported till now. I request the DM of Jalpaiguri & @chief_west to urgently step up rescue efforts & provide assistance to those in distress. pic.twitter.com/4dZdm2WlLO — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) October 5, 2022 8 Dead, Several Missing During Idol Immersion In West Bengal. #JalpaiguriAccident #Jalpaiguri pic.twitter.com/hTgAAJvYmq — Jagadanand Pradhan (@JPradhan_) October 6, 2022 Anguished by the mishap during Durga Puja festivities in Jalpaiguri, West Bengal. Condolences to those who lost their loved ones: PM @narendramodi — PMO India (@PMOIndia) October 5, 2022 -
అద్భుత సృష్టి.. ప్లాస్టిక్ స్పూన్లతో దుర్గామాత విగ్రహం
డిస్పూర్: ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు అస్సాంలోని దుబ్రీ జిల్లాకు చెందిన సంజీవ్ బాసక్ అనే వ్యక్తి దుర్గా నవరాత్రులను వేదికగా చేసుకున్నాడు. పరిశ్రమలు, మెడికల్ వ్యర్థాలను ఉపయోగించి వివిధ కళాకృతులతో అవగాహన కల్పిస్తున్నాడు. వ్యర్థాలను తగ్గించాలని చెప్పేందుకు వివిధ ఆకృతులతో దుర్గా మాత విగ్రహాలను తయారు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు బాసక్. 2015 తొలుత థర్మకోల్‌తో 14 అడుగుల దుర్గమాత విగ్రహాన్ని రూపొందించారు బాసక్. అప్పటి నుంచి ప్రతిఏటా ఇలా వివిధ వ్యర్థ పదార్థాలతో విగ్రహాలు రూపొందిస్తూ అవగాహన కల్పిస్తున్నాడు. అందులో భాగంగానే ఈఏడాది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్పూన్లతో దుర్గమాత విగ్రహాన్ని తయారు చేశాడు బాసక్. ప్రస్తుతం ఈ దుర్గామాత విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్పూన్లతో అస్సాంలో రూపొందించిన దుర్గామాత విగ్రహం ఇదీ చదవండి: టైమ్ బ్యాడ్ అంటే ఇదేనేమో.. సీఎం గెహ్లాట్‌కు ఊహించని షాక్! -
బంగ్లాదేశ్‌లో మత కలహాలు
ఢాకా/కోల్‌కతా: దుర్గాపూజల సందర్భంగా దైవదూషణకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగ్లాదేశ్‌లో మొదలైన మత కలహాలు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి ఫెని పట్టణంలో హిందువులకు చెందిన ప్రార్థనా మందిరాలు, దుకాణాలపై దాడులు జరిగాయి. విగ్రహాల ధ్వంసం, దుకాణాల లూటీ వేకువజామున 4.30 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో కనీసం 40 మంది గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం పారామిలటరీ బలగాలను రంగంలోకి దించింది. శనివారం దుండగులు మున్షిగంజ్‌లోని కాళీ మందిరంలోని ఆరు విగ్రహాలను ధ్వంసం చేశారని వార్తా సంస్థలు తెలిపాయి. దుర్గా మందిరాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చిట్టగాంగ్‌లోని బంగ్లాదేశ్ హిందు బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనియన్ ఈ నెల 23వ తేదీ నుంచి నిరశన దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. దాడులను నిరసిస్తూ ఢాకాలోని షాబాగ్, చిట్టగాంగ్‌లోని అందర్‌కిల్లాలో ప్రదర్శనలు జరిగాయి. హింసాత్మక ఘటనలకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్ అధ్యక్షుడు మిలన్‌దత్తా డిమాండ్ చేశారు. ఇలా ఉండగా, బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వాన్నిఅస్థిరపరిచే కుట్రలో భాగంగానే దుర్గాపూజ ఉత్సవాల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. బంగ్లా ఘటనలపై విదేశాంగ శాఖ స్పందించింది. పరిస్థితులు చేజారకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో బంగ్లా అధికార యంత్రాంగంతో అక్కడి భారత దౌత్య కార్యాలయం టచ్‌లో ఉందని పేర్కొంది. కోల్‌కతాలో ఇస్కాన్ నిరసన బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులను నిరసిస్తూ ఆదివారం కోల్‌కతాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఎదుట రెండు గంటలపాటు ఆందోళన నిర్వహించారు. -
West bengal: ‘దుర్గాపూజ చేసుకునే హక్కు మాకుంది’
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో విజయదశమిని పురస్కరించుకొని శుక్రవారం సోనాగచిలోని సెక్స్ వర్కర్లు దుర్గాదేవికి పూజలు నిర్వహించారు. దుర్గాదేవి పూజ అనంతరం డెబీ బోరాన్, సిందూర్ ఖేలా, ధునుచి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా సెక్స్ వర్కర్ల దర్బార్ మహిళా సమితి సభ్యురాలు విశాఖ లష్కర్ మాట్లాడుతూ.. ఈ సమాజంలో తమకు సమాన హక్కులు లేవని, అందుకే తమ పిల్లలు ఈ సమాజాన్ని ఆమోదించడంలేదని అన్నారు. దీంతో తాము మరో ప్రపంచం నుంచి వచ్చామనే భావన కలుగుతోందని తెలిపారు. దానికి గల కారణం తాము సెక్స్ వర్కర్లము కావడమే అనిపిస్తోందని అన్నారు. కుటుంబాలను పోషించుకోవటం కోసమే తాము ఈ వృత్తిలో ఉన్నమని తెలిపారు. అయితే దుర్గా పూజ వేడకలు జరుపుకోవడాని తమకు కూడా హక్కు ఉందని పేర్కొన్నారు. తాము ఈ సమాజమానికి చెందినవారిమనే సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నామని తెలిపారు. ప్రతి సెక్స్ వర్కర్‌కు దుర్గాదేవి పూజ చేసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. అయితే దుర్గాదేవి పూజలు నిర్వహించేందుకు గతంలో వీరికి అనుమతి ఉండేది కాదు. దాని కోసం వీరు పోరాటం చేశారు. సెక్స్ వర్కర్లు దుర్గాపూజ చేసేందుకు అనుమతి కోసం దర్బార్ మహిళా సమితి కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో వారికి దుర్గాపూజ చేసుకోవచ్చని 2013లో కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. -
బంగ్లాదేశ్‌లో దుర్గాదేవి మండపాలు ధ్వంసం
ఢాకా: దసరా వేడుకల వేళ బంగ్లాదేశ్‌లో దుర్గామాతకి తీవ్ర అపచారం జరిగింది. క్యుమిలియా జిల్లాలో దుర్గా దేవి మండపాలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పలు జిల్లాల్లో హిందూ దేవాలయాలపై దాడులకు దిగారు. దుర్గ దేవి కొలువుదీరిన మండపాల వద్ద ఖురాన్‌ను అపవిత్రం చేశారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో దుండగులు మండపాలపై దాడికి దిగి ధ్వంసం చేశారు. దీంతో ప్రభుత్వం పోలీసుల్ని రంగంలోకి దింపింది. అదనపు భద్రతా బలగాలను మోహరించింది. 22 జిల్లాల్లో హై అలెర్ట్ ప్రకటించింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకి మధ్య చెలరేగిన ఘర్షణల్లో నలుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. చాందీపూర్ హజీగంజ్, బన్షఖాలి, షిబ్‌గంజ్, కాక్స్ బజార్ తదితర ప్రాంతాల్లో దుర్గాదేవి విగ్రహాలను ధ్వంసం చేసినట్టుగా బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనలపై బంగ్లా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. కాగా ఈ దాడుల వెనుక జమాత్–ఇ–ఇస్లామీ హస్తం ఉందని బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. షేక్ హసీనా ప్రభుత్వానికి అంతర్జాతీయంగా మచ్చ తీసుకురావడానికి, మత ఘర్షణలు రాజేయడానికే వారు ఈ పని చేశారని చెప్పారు. కొన్ని మండపాల్లో దుర్గమ్మ పాదాల చెంత పవిత్ర ఖురాన్‌ను ఉంచారు. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఘర్షణలు చెలరేగాయి. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం దుర్గాదేవి మండపాలు మూడు వేలు ఉన్నాయి. -
దసరా ఉత్సవాల్లో బాలీవుడ్ ప్రముఖుల సందడి
సాక్షి, ముంబై: పవిత్ర దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో బాలీవుడ్ హీరోయిన్లు సందడి చేశారు. రానున్న విజయదశమి లేదా దసరా వేడుకల్లో భాగంగా మహర్నవమి రోజు బాలీవుడ్ స్టార్లు ప్రసిద్ధ ఉత్తర బొంబాయి సర్బోజనిన్ ఆలయానికి తరలి వచ్చారు. ప్రత్యేక పూజలు చేసి దేవి ఆశీర్వాదాలు పొందారు. ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్, అజయ్ దేవగణ్ భార్య కాజోల్, హీరోయిన్ రాణి ముఖర్జీ, అమిత్ కుమార్, సినీ గాయకుడు షాన్ అతని తల్లి, టీవీ నటి, కపిల్ శర్మ ఫో ఫేం సుమోన చక్రవర్తి, జాన్ కుమార్ సాను, డెబినా బోన్నర్జీ, గుర్మీత్ చౌదరి, బప్పా బి లాహిరి, తనీషా లాహిరి, దేబు ముఖర్జీ , శర్బానీ ముఖర్జీ తదితర స్టార్లు ఉత్తర బొంబాయి సర్బోజనిన్ దుర్గను సందర్శించుకున్నారు. ముంబైలోని పురాతన , అతిపెద్ద దుర్గా పూజా మండపాల్లో ఇది కూడా ఒకటి. కాగా కరోనా మహమ్మారి, కఠిన ఆంక్షల మధ్య ఇది వరుసగా రెండో ఏడాది కూడా వర్చువల్‌గా సాగుతోంది. రెండు డోసుల టీకాలు తీసుకున్నవారికి మాత్రమే అనుమతి నిస్తుండటం విశేషం. చదవండి : Durga Puja : బాలీవుడ్ హీరోయిన్ సందడి View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap) -
రెండు తలలు, మూడు కళ్లతో లేగదూడ.. పూజించేందుకు జనం బారులు
భువనేశ్వర్: సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగిన తర్వాత చిత్ర విచిత్ర ఘటనలు వైరల్‌గా మారిన వైనం చూస్తున్నాం. తాజాగా ఒడిశాలోని నబ్రంగ్పూర్ జిల్లా బిజాపుర గ్రామంలో వెలుగు చూసిన ఓ విశేషం స్థానికులనేగాక నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రెండు తలలు, మూడు కళ్లతో ఓ ఆవు లేగదూడకు జన్మనిచ్చింది. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఘటన జరగడంతో స్థానికులు ఆ బుల్లి దూడను దుర్గామాత అవతారంగా కొలుస్తున్నారు. ఈ విషయం తెలిసిన సమీప గ్రామాలవారు తండోపతండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. (చదవండి: బెంగళూరులో 7గురు విద్యార్థులు అదృశ్యం..) మరోవైపు రెండు తలలు కలిగి ఉండటంతో తల్లి ఆవు నుంచి లేగదూడ పాలు తాగలేకపోతోందని వాటి యజమాని చెప్పారు. డబ్బాతో దానికి పాలు పడుతున్నామని తెలిపారు. People in the locality of Bijapara village have begun worshipping a two headed calf as #Durga Avatar After it was born with two heads and three eyes on the occasion of #Navratri to a farmer in Odisha's Nabrangpur District. #DurgaPuja @aajtak @IndiaToday pic.twitter.com/tz9i9mpJ0O — Suffian सूफ़ियान سفیان (@iamsuffian) October 12, 2021 (చదవండి: Viral Video: డ్యాన్స్ ఇరగదీసిన వధువు.. అంతా ఫిదా, అయితే వరుడు మాత్రం..!) -
అమ్మవారికి ప్రత్యేక పూజలు: బాలీవుడ్ హీరోయిన్ సందడి
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి కాజోల్ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సందడి చేశారు. దుర్గా పూజ మండపంలో తన బంధువులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సాంప్రదాయ ఆభరణాలు, పింక్ కలర్ చీరలో కాజోల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. (Sunny Leone: పీస్ ఆఫ్ హెవెన్, స్టన్నింగ్ ఫోటో) దసరా వచ్చిందంటే ప్రతీ ఏడాది ప్రత్యేక పూజలతో కాజోల్ వేడుక చేస్తారు. మహా సప్తమిని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా కాజోల్ ముంబైలో దుర్గా పూజ మండపంలో మంగళవారం అమ్మకారికి పూజలు చేశారు. కాజోల్‌తోపాటు ఆమె కజిన్, నటి శర్బానీ ముఖర్జీ కూడా ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
కొత్త చీరలు కొని డొనేట్ చేస్తున్నారు.. ఎందుకంటే..
రాబోయే రోజులు పండగ కళతో ప్రభవించే రోజులు. దుర్గపూజను దృష్టిలో పెట్టుకొని కోల్‌కతాలోని ‘హ్యూమన్స్ ఆఫ్ పాటులి’ (హెచ్‌వోపీ) అనే స్వచ్ఛంద సంస్థ నిరుపేద మహిళలకు కొత్త చీరలను అందజేయడానికి ‘ఒక కొత్త కాటన్‌చీర’ పేరుతో ఫేస్బుక్ వేదికగా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రెండు మూడురోజుల్లోనే దీనికి మంచి స్పందన వచ్చింది. దాతల నుంచి వచ్చిన కొత్తచీరలను ఎప్పటికప్పుడు పేదమహిళలకు అందిస్తున్నారు. ‘పేదలకు మనకు తోచిన రీతిలో సహాయం చేయడం మన కనీసధర్మం’ అంటుంది స్వప్న అనే గృహిణి. స్వప్న కూతురు కూడా తల్లి బాటలోనే నడిచి తన పొదుపు మొత్తంలో కొంత కొత్తచీరల కోసం ఇచ్చింది. సౌత్ కోల్‌కతాలోని ఒక కాలేజీలో హిస్టరీ లెక్చరర్ అయిన శ్రేయషి దానధర్మాల గురించి వినడం తప్ప వాటి గురించి పెద్దగా ఆలోచించింది లేదు. ఫేస్బుక్లో ‘ఒక కొత్త కాటన్ చీర’ ప్రచారానికి ఆకర్షితురాలైన శ్రేయషి తన వంతుగా కొన్ని కొత్తచీరలను కొని డొనేట్ చేసింది. అక్కడితో ఆగిపోలేదు. తన మిత్రులు, బంధువుల ద్వారా ఇంకొన్ని కొత్త చీరలు డొనేట్ చేయించింది. ‘కరోనా దెబ్బతో చాలా రోజులు పనులు లేవు. అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే పనులు దొరుకుతున్నాయిగానీ చాలా భాగం అప్పులు కట్టడానికే సరిపోతుంది. ఈ సమయంలో పండగపూట ఒక కొత్త చీర కొనుక్కోవాలి అనే ఆలోచన చేయలేం. చేసినా కొనే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో ఉచితంగా కొత్త చీరలు ఇస్తున్నారని తెలిసి తీసుకున్నాను. సంతోషంగా ఉంది’ అంటుంది పాటులి మురికివాడలో నివసించే రాజశ్రీ. మతసామరస్యంపై రకరకాల కార్యక్రమాలు చేపట్టే ‘హెచ్‌వోపీ’ గత సంవత్సరమే ‘ఒక కొత్త కాటన్ చీర’ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే గతంతో పోలిస్తే... ఇప్పుడు స్పందన గొప్పగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. గత సంవత్సరం పిల్లలకు కొత్తదుస్తులు ఇప్పించడం వరకు మాత్రమే మొదట పరిమితమయ్యారు. ఆ తరువాత మహిళలను చేర్చారు. ఈసారి చెప్పుకోవాల్సిన రెండు ముఖ్య విషయాలు... 1. రిపీట్‌గా డొనేట్ చేసేవారు పెరగడం 2. తమ ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా, కొత్త చీరలు దానం చేసేవారి సంఖ్య పెరగడం. వెతుక్కుంటూ సంస్థ కార్యాలయానికి వచ్చి మరీ స్వయంగా కొత్త చీరలు అందించేవారు కొందరైతే, కొరియర్ ద్వారా పంపించేవారు కొందరు. ‘హెచ్‌వోపీ’ నినాదం...ఫెస్టివ్ జాయ్ ఫర్ ఆల్! మంచి మనసులు ఉన్న మనుషులు ఉన్నచోట అదేమంత కష్టమైన పని కాదని మరోసారి నిరూపణ అయింది. చదవండి: Sumukhi Suresh: 30 వేల జీతం.. జీవితం బాగానే సాగేది.. కానీ నవ్వించడంలో.. -
ఎంపీ నుస్రత్‌పై కోర్టు ధిక్కార ఆరోపణలు
కోల్‌కతా : కరోనా కారణంగా విధించిన ఆంక్షలను ఉల్లంఘించినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రతి ఏటా దసరా ఉత్సవాల సందర్భంగా బెంగాల్లో పెద్ద ఎత్తున దేదీప్యమానమైన అలంకరణలతో పాండల్స్ (దేవీ మండపాలు) దర్శనమిస్తాయి. అయితే కోవిడ్ కారణంగా ఈ ఏడాది పాండల్స్ ఏర్పాటుచేయడంపై కలకత్తా హైకోర్టు ఆంక్షలు విధించింది. అయినప్పటికీ ఎంపీ నుస్రత్ జహాన్ పాండల్స్‌లో దుర్గామాత పూజా కార్యక్రమాలకు హజరయ్యారని పిటిషనర్ కోర్టుకు వివరించారు. పాండల్స్‌ను నో ఎంట్రీ జోన్లుగా ప్రకటించినప్పటికీ ప్రజా ప్రతినిధులు నుస్రత్ జహాన్, దేవీ మండపాలను దర్శించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా కోర్టు ఆంక్షలను బేఖాతరు చేయడం కోర్టు దిక్కారానికి పాల్పడినట్లే అని పేర్కొన్నారు. కాగా దసరా సందర్భంగా ఈనెల 24న ఎంపీ నుస్రత్ జహాన్ ఆమె భర్తతో కలిసి కోల్‌కతాలోని ప్రముఖ పాండల్‌ని సందర్శించారు. (నవంబర్ 30 వరకూ లాక్డౌన్ పొడిగింపు ) #Exclusive: Contempt of Court charge leveled against actor #NusratJahan over her visit to a #DurgaPuja pandal despite the High Court ban. Watch this #ReporterDiary by Indrajit Kundu for more. @iindrojit More videos https://t.co/FAHzdk9TO8 pic.twitter.com/wMXnDAjGaB — IndiaToday (@IndiaToday) October 29, 2020 -
బీహార్ : పోలీసులపై కాల్పుల కలకలం
పట్నా : దుర్గాదేవి నిమజ్జనం సమయంలో జరిగిన ఘర్షణల కారణంగా ఓ వ్యక్తి మరణించారు. ఈ ఘటన బీహార్‌లోని మంగేరిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపులో పోలీసులకు, కొంతమంది ప్రజలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సమూహంలోని కొంతమంది దుండగులు కాల్పులు జరపగా 18 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. తర్వాత పోలీసులపై కొంతమంది రాళ్లురువ్వగా, పోలీసులు సైతం గాల్లో కాల్పులు జరిపినట్లు సమాచారం. (‘పది లక్షల ఉద్యోగాల కల్పనపైనే తొలి సంతకం’ ) ఈ ఘటనలో దాదాపు 20 మంది పోలీసులు గాయపడ్డారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఎస్పీ లిపి సింగ్ అన్నారు. సంఘటనా ప్రాంతం నుంచి మూడు పిస్టల్స్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలకు దిగాయి. వెంటనే ఎస్పీ సింగ్‌ను సస్పెండ్ చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మృతుడి కుటుంబానికి 50 లక్షల నష్ట పరిహారంతో పాటు వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. (బిహార్ ఎన్నికలపై ‘మద్యం’ ప్రభావం! ) -
అమ్మవారి రూపాన్ని ధైర్యంగా చూడగలరా?!
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే పండుగ విజయదశమి. యావద్భారతం ఏటా ఎంతో వైభవంగా జరుపుకొనే ఉత్సవం. అయితే ఈసారి కరోనా కారణంగా పరిస్థితులు మారిపోయాయి. మునుపటి స్థాయిలో కాకపోయినా, కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూనే ప్రజలు పండుగ సంబరాల్లో పాల్గొంటున్నారు. కాగా, తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులు నిర్వహించి, పదో రోజును విజయదశమి లేదా దసరాగా జరుపుకొంటారన్న విషయం తెలిసిందే. అయితే అన్నిచోట్లా ఈ ఉత్సవాలు ఒకేరకంగా నిర్వహించరు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్‌లోని ప్రాంతీయ, సాంస్కృతిక వైవిధ్యమంతా ఈ పండుగ ఉత్సవాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎక్కడైనా దసరా అంటే శక్తి ఆరాధనే. శక్తి స్వరూపిణిని అయిన అమ్మవారిని కొలిచే సందర్భమే. మహిషాసురుడిని వధించిన ఆ దుష్టసంహారిణికి జేజేలు పలుకుతూ, మమ్మల్ని కాపాడు తల్లీ అంటూ వేడే వేడుక. (చదవండి: శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు) మరి ఆ అమ్మవారికి ప్రతిరూపమైన మహిళలకు ఈదేశంలో ఏపాటి గౌరవం దక్కుతోంది? దుర్గామాత విశ్వరూపం గురించి తెలిసిన మనం, ప్రతి ఆడబిడ్డలోనూ అంతర్లీనంగా దాగి ఉండే ఆ ఆదిశక్తికి ఎంత విలువ ఇస్తున్నాం? ‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా’అంటూ స్త్రీలకు అత్యున్నత స్థానాన్ని కల్పించిన కర్మభూమి మా జన్మస్థానం అని గర్వంగా చెప్పుకొనే వాళ్లలో లింగభేదాలకు అతీతంగా, ఎంతమంది మహిళను పురుషులతో సమాననంగా, ముఖ్యంగా సాటి మనిషిగా చూడగలుగుతున్నారు? ఆ దేవి అనుగ్రహం పొందేందుకు హారతులు పట్టి, పెద్ద ఎత్తున పండుగ చేస్తున్న వారిలో, కడుపులో ఉన్నది ఆడశిశువు అని తెలియగానే గర్భంలోనే అంతం చేస్తున్న వాళ్లు ఎందరు? అన్ని అవాంతరాలు దాటుకుని ఎలాగోలా భూమి మీద పడి, ఎన్నెన్నో సవాళ్లు ఎదుర్కొని విద్యాసంస్థల్లో అడుగుపెడితే ప్రేమ పేరిట వేధించే పోకిరీలు, వాటిని అధిగమించి కార్యక్షేత్రంలోకి దిగితే అడుగడుగునా వివక్ష, ఇక గృహిణిగా అంతాతానై కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్న ఇల్లాలికి కనీస గౌరవం ఇవ్వకుండా చిన్నచూపు చూసేవిధంగా వ్యవహరించే తంతు ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమేనని కొట్టిపారేసే మహానుభావులు ఎందరు? ఇక నెలల పసికందు నుంచి పండు ముసలిదాకా మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మృగాళ్ల పశువాంఛకు బలైపోతున్న ఆడవాళ్ల సంఖ్యకు లెక్కేలేదు. నేర గణాంక సంస్థల లెక్కల పరిగణనలోకి రాని అవ్యవస్థీకృత నేరాలు కోకొల్లలు. అనాదికాలం నుంచి నేటి ఆధునిక స్మార్ట్ యుగం దాకా.. హథ్రాస్ ఉదంతం వంటి ఎన్నెన్నో దారుణాలకు సాక్షీభూతంగా నిలిచిన సమాజం, ఏ న్యాయస్థానం ముందు దోషిగా నిలబడకపోవచ్చు. కానీ ఆ దుర్గాదేవి విజయాన్ని ఉత్సవంగా జరుపుకొనే ఈ పర్వదినంనాడు, ఆ అమ్మవారి ముందు ధైర్యంగా నిలబడి, ఆ తల్లి రూపాన్ని చూస్తూ మనస్ఫూర్తిగా ఆమె అనుగ్రహం కోరే ధైర్యం ఎంతమందికి ఉంటుంది! దసరా పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న నిజమైన స్ఫూర్తిని గ్రహించగలిగితే, ఇతరులకు చెడు చేయకుండా ఉండటం సహా బాధితుల పక్షాన పోరాడే గుణాన్ని ప్రతి ఒక్కరు పెంపొందించుకోవచ్చు. గతంలో ఎలా ఉన్నా సరే నేటి నుంచైనా పద్ధతి మార్చుకుని, మనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవీయత, అహంకారం వంటి దుర్గుణాలను అంతం చేయమంటూ ‘ఆయుధ పూజ’కు సంసిద్ధులమవుదాం!! -
వైరల్: జిన్‌పింగ్ తల దుర్గమ్మ కాళ్ల దగ్గర!
కోల్‌కతా: గత కొంత కాలంగా భారత్‌కు, చైనాకు అస్సలు పడటం లేదు. ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేసి వదిలారని పలు దేశాలు డ్రాగన్ దేశంపై ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. కొందరు శాస్త్రవేత్తలు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. దీంతో భారతీయులు కూడా చైనాను దోషిగా వేలెత్తి చూపారు. ఇక్కడితో చాలదన్నట్టు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది చైనా. దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మన భారత సైనికులను పొట్టన పెట్టుకుని యుద్ధానికి కాలు దువ్వుతోంది. ఇక అప్పటి నుంచి ఇండియాలో చైనాపై వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరింది. ఆ దేశ వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపించింది. (చదవండి: యూట్యూబ్‌లో దూసుకుపోతున్న కలెక్టర్ భక్తి పాట) అయితే చైనాపై ఉన్న వ్యతిరేకతను దసరా శరన్నవరాత్రుల్లో వైవిధ్యంగా చూపించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ విగ్రహం తల నరికి వేసి దుర్గామాత కాళ్ల దగ్గర పడేశారు. అదెలాగంటే.. పశ్చిమ బెంగాల్లో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ క్రమంలో అక్కడి బెర్హంపూర్‌లో ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా దుర్గాదేవిని ప్రతిష్టించారు. అమ్మవారి చేతిలో హతమైన రాక్షసుడి స్థానంలో రక్తం కక్కుతున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బొమ్మను ఉంచారు. ఇది దుర్గా దేవి పాదాల కింద ఉంచారు. అమ్మవారి వాహనమైన సింహం దాని మొండాన్ని తినేస్టున్నట్లుగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ విగ్రహం క్రెడిట్ అంతా ఆర్టిస్ట్ అషిమ్ పాల్కే చెందుకుతుంది. (చదవండి: బుద్ధం శరణం గచ్ఛామి!) -
మహిళా సాధికారతే ముఖ్యం
కోల్‌కతా: మహిళల భద్రత, సాధికారతకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ నిర్వహించిన నవరాత్రి ఉత్సవాల్లో వర్చువల్ విధానంలో గురువారం ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘మహాషష్టి రోజు దుర్గామాత పూజలో పాల్గొనే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. దుర్గామాత భక్తులు, మండపాల నిర్వాహకులు, ప్రజలు గొప్ప సంయమనం పాటిస్తున్నారు. కరోనా కారణంగా స్వల్పస్థాయిలోనే అయినా, స్ఫూర్తిదాయకంగా, భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు సూచించారు. ‘దుర్గామాత పూజలో గొప్ప శక్తి ఉంటుంది. ఇంత దూరంలో ఢిల్లీలో ఉన్నప్పటికీ.. నాకు అక్కడ కోల్‌కతాలో మీతో ఉన్నట్లే ఉంది’ అని వ్యాఖ్యానించారు. ప్రసంగాన్ని బెంగాలీలో ప్రారంభించిన ప్రధాని మోదీ.. ముగించే సమయంలోనూ బెంగాలీలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ప్రసంగానికి పశ్చిమబెంగాల్ బీజేపీ శాఖ భారీ ప్రచారం కల్పించింది. సాల్ట్‌లేక్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 10 మండపాల్లో ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. 78 వేల పోలింగ్ బూత్‌ల్లోనూ మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఏప్రిల్– మే నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకు గానూ 18 సీట్లను బీజేపీ గెలుచుకుంది. దుర్గామాత ఉత్సవాల్లో ప్రధాని పాల్గొనడంపై అధికార టీఎంసీ స్పందించింది. దుర్గామాత పూజను కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించింది. ‘బెంగాలీలో మాట్లాడి బెంగాల్ ప్రజలతో కనెక్ట్ కావాలని ప్రధాని విఫలయత్నం చేశారు’ అని టీఎంసీ నేత, ఎంపీ సౌగత రాయ్ వ్యాఖ్యానించారు. -
సోనూ సూద్‌కు అరుదైన గౌరవం
కోల్‌కతా: నటుడు సోనూ సూద్‌కు అరుదైన గౌరవం దక్కింది. లాక్డౌన్లో వలస కార్మికుల కోసం ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు చేర్చిన విషయం తెలసిందే. దీంతో ఆయన రియల్ హీరో అయ్యారు. కరోనా కాలంలో ఇబ్బందుల్లో ఉన్న ఎంతోమందికి చేయూతనిచ్చిన ఆయనను కోల్‌కతాలోని కేష్టోపూర్ ప్రఫుల్ల కననదుర్గా పూజ కమిటీ వారు ప్రత్యేకంగా సత్కరించారు. ప్రస్తుతం కోల్‌కతాలో జరుగుతున్న దుర్గపూజ పండల్లో సోనూ సూద్ విగ్రహాన్ని ప్రదర్శించి ఇలా ఆయనపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అది చూసిన సోనూ సూద్ స్పందిస్తూ... ఇది తనకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం అంటూ అనందం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం ట్వీట్ చేస్తూ.. ‘ఎప్పటికైన ఇదే నాకు అతిపెద్ద ఆవార్డు’ అంటూ ట్వీట్ చేశారు. అదే విధంగా కెష్టోపర్ ప్రఫుల్ల దుర్గా కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: వలస దుర్గమ్మ..) అయితే ఈ పండల్లో లాక్డౌన్లో వలస కార్మికులను బస్సులో తరలిస్తున్నప్పటి సోనూసూద్ విగ్రహాంతో పాటు ఎదురుగా వలస కార్మికులు చేతులు జోడిస్తున్న విగ్రహాలను ఉంచారు. అదే విధంగా సంక్షోభ కాలంలో వలసదారులకు సంబంధించిన హృదయ విదాకర దృశ్యాలను కూడా పండల్లో ప్రదర్శించారు. హర్యానాలోని గురుగ్రామ్ నుంచి బీహార్ వరకు 1200 వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ తన కూమరుడిని సూట్‌కేసుపై లాక్కెళుతున్న మహిళా, బాబును ఓడిలో పెట్టుకుని గాయపడిన తన తండ్రిని దొపుడు బండిపై కుర్చోపెట్టి లాక్కెడం, సైకిల్ తోక్కుతున్న మహిళ విగ్రహాలను కూడా ప్రదర్శించారు. అయితే లాక్డౌన్లో సోనూ సూద్ వలస కార్మికులను సొంత ఖర్చులతో వారి గ్రామాలకు చేర్చడంతో పాటు విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సైతం స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. (చదవండి: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్) My biggest award ever 🙏 https://t.co/4hOUeVh2wN — sonu sood (@SonuSood) October 21, 2020 -
సొంత ఊరిపై మమకారం
కోల్‌కతా: ఢిల్లీలో చక్రం తిప్పిన ప్రణబ్ ముఖర్జీ సొంతూరితో ఉన్న అనుబంధాన్ని మాత్రం ఎన్నడూ మరువలేదు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్బూమ్ జిల్లాలోని మిరాటి గ్రామంలో ప్రణబ్ పుట్టారు. మిరాటిలోని మట్టిరోడ్ల నుంచి రాజకీయ పండితుడి దాకా...అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ దాకా ఆయన ప్రస్థానం కొనసాగినా సొంతూరితో ఉన్న అనుబంధం మరింత బలపడిందే తప్ప తరిగిపోలేదు. ఆయన ఎక్కడ ఉన్నా ఏటా దుర్గాపూజ సమయంలో మాత్రం సొంతూళ్లోనే ఉంటారు. ధోతి, కండువాతో సంప్రదాయ వస్త్రధారణలో ఆయన దుర్గాదేవికి హారతి ఇస్తారు. గత ఏడాది కూడా ప్రణబ్ దసరా సమయంలో అక్కడే గడిపారు. అయితే, చాలా ఏళ్ల తర్వాత ఈసారి ఆ గ్రామం ఆయన లేకుండానే దుర్గా పూజను జరుపుకోనుంది. ఆయన మరణంతో ఈ గ్రామం మూగబోయింది. ఆయన సీనియర్ మంత్రి అయినా లేక రాష్ట్రపతి అయినా ఈ గ్రామ ప్రజలకు మాత్రం ప్రణబ్ దానే. ఢిల్లీ నుంచి ఫోన్ చేసేవారు... ఆయన ఇంట్లో జరిగే దుర్గాపూజ మా గ్రామంలో జరిగే అతిపెద్ద పండుగ. ఈ పర్వదినాల్లో ఐదురోజుల పాటు ఆయన ఇంట్లోనే అందరూ భోజనాలు చేస్తారు. ఇకపై మిరాటిలో జరిగే దుర్గాపూజ మాత్రం మునుపటిలా ఉండదు అని ప్రణబ్ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన చటోరాజ్ చెప్పారు. ఆయన ఢిల్లీ నుంచి ఫోన్ చేసి అన్ని సవ్యంగా జరుగుతున్నాయా లేదా అని అడిగేవారు. ప్రణబ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి గ్రామస్తులంతా ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. ప్రణబ్ వెంటిలేటర్‌పై చికిత్స తీసుకునేముందు తన గ్రామం నుంచి పనసపండు తీసుకురమ్మని చెప్పారని ఆయన కొడుకు అభిజిత్ ముఖర్జీ ఇటీవల చెప్పారు. తాను ఆగస్టు 3న కోల్‌కతా నుంచి మిరాటికి వెళ్లి 25 కిలోల పనసపండును రైల్లో ఢిల్లీకి తీసుకెళ్లానన్నారు. ప్రణబ్ ఎంతో ఇష్టంగా ఆ పండును తిన్నారని పేర్కొన్నారు. -
సీఎం నన్ను అవమానించారు : గవర్నర్
కోల్‌కతా : దుర్గా పూజ వేడుకల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనను ఘోరంగా అవమానించారని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీఫ్ ధంఖర్ ఆరోపించారు. వేదికపై తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని మనస్తాపం చెందారు. ఇటీవల ప్రభుత్వ ఆధ్వర్యంలో దుర్గాపూజా వేడుకల్లో సీఎం మమతాతో పాటు గవర్నర్ ధంఖర్‌కూడా హాజరయ్యారు. వేదిక కార్నర్లో అతనికి సీటు కేటాయించారు. నాలుగు గంటల పాటు సాగిన ఈ వేడుకల్లో గవర్నర్ తనకు కేటాయించిన సీటులోనే కూర్చొని ఉన్నారు. ఈ విషయాన్ని మీడియా కూడా బయటపెట్టలేదు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై ఒక్కసారి కూడా గవర్నర్ ముఖాన్ని చూపించలేదు. ఈ ఘటనపై గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ దుర్గాపూజ వేడుకల్లో అవమానానికి గురయ్యాను. చాలా మనస్తాపం చెందాను. ఓ గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవాన్ని ముఖ్యమంత్రి నాకు ఇవ్వలేదు. వేదిక చివర్లో నాకు సీటు కేటాయించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్లలో నేను ఒక్కసారి కూడా కనిపించలేదు. అవమానం జరిగింది నాకు ఒక్కడికే కాదు. బెంగాల్ ప్రజలందరిని మమతా అవమానించారు. నేను ప్రజల సేవకుడిని.. రాజ్యాంగబద్దంగా నాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. వేడుకలను ఘనంగా నిర్వహించినందుకు ప్రభుత్వాన్ని అభినందిన్నాను. నాకు జరిగిన అవమానాన్ని ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకుంటుందని ఆశిస్తున్నా’ అని గవర్నర్ జగదీప్ ధంఖర్ పేర్కొన్నారు. -
‘దేవుని ప్రత్యేక బిడ్డను.. అలాంటివి పట్టించుకోను’
కోల్‌కతా : తాను దేవుని ప్రత్యేక బిడ్డనని, అన్ని మతాల పండగలను జరుపుకొంటానని పశ్చిమ బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తెలిపారు. శుక్రవారం తన భర్త నిఖిల్ జైన్‌తో కలిసి నుస్రత్ చల్తాబాగన్లో బెంగాలీ హిందు సంప్రదాయమైన దుర్గా పూజలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సింధూర్ ఖేలా వేడుకలో సింధూరం ధరించారు. బెంగాల్లో నవరాత్రుల అనంతరం అక్కడి మహిళలు ఈ దుర్గా పూజలో పాల్గొంటారు. అందరికి మంచి జరగాలని దుర్గాదేవి కాలికి ఉన్న కుంకుమను నుదట ధరిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా నుస్రత్ కూడా నుదుటన కుంకుమ ధరించి పూర్తి హిందూ సంప్రదాయంలో కనిపించారు. అయితే ముస్లిం మహిళ ఇలా చేయడమేంటంటూ ఇప్పటికే అనేకమార్లు నుస్రత్ చర్యలను సంప్రదాయవాదుల తప్పుబట్టిన విషయం తెలిసిందే. మత సంప్రదాయాలకు విరుద్ధంగా నుస్రత్ ప్రవర్తిస్తుందని ఇస్లాంను కించపరచడానికే ఇలా చేస్తుందంటూ ఓ మతాధికారి విమర్శించారు. అంతేగాకుండా ఇకపై ముస్లిం పేరును కొనసాగించవద్దని, వెంటనే తన పేరును మార్చుకోవాలని సూచించారు. కాగా పూజా కార్యక్రమం అనంతరం నుస్రత్ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రేమ, మానవత్వానికే అన్నింటికంటే ఎక్కువ గౌరవం ఇస్తానని ఇప్పటికే ఈ విషయాన్ని ప్రజలకు చెప్పానని స్పష్టం చేశారు. తను దేవుని బిడ్డనని, తనపై వచ్చిన విమర్శల గురించి ఎప్పటికీ పట్టించుకోనని కొట్టిపారేశారు. ముస్లిం మహిళ అయినప్పటికీ.. హిందూ మతానికి చెందని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల అన్ని మతాలను, వారి సంప్రదాయాలను గౌరవిస్తానని ఎంపీ తెలిపారు. అదే విధంగా దుర్గ పూజలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. బెంగాల్లో పుట్టి పెరిగిన తను సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిస్తానని, అన్ని మతాల ఉత్సవాలను జరుపుకొంటానని అన్నారు. కాగా నటిగా కెరీర్ ప్రారంభించిన నుస్రత్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో అధికార టీఎంసీ తరఫున గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. -
దసరా వేడుకల్లో బాలీవుడ్ తారలు
-
మరోసారి వార్తల్లో నూస్రత్..ధాక్‌తో సందడి
ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ ఎంపీ నూస్రత్ జహన్ మరో సారి వార్తల్లో నిలిచారు. కోల్‌కతాకు చెందిన పారిశ్రామిక వేత్త, భర్త నిఖిల్ జైన్‌తో కలిసి దుర్గా పూజలో సందడి చేశారు. ఎంపీ అయిన తరువాత తొలిసారి బెంగాల్లో జరుగుతున్న దసరా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాంప్రదాయ దుస్తుల్లో ఈ జంట దుర్గాదేవికి సోమవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతేకాదు దుర్గాష్టమి వేడుకల్లో సంగీత వాయిద్యమైన ధాక్ కూడా వాయించి అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను నిఖిల్ జైన్‌లో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి ప్రజలు సుఖసంతోషాలతో ప్రశాంతంగా జీవించాలని తాను అమ్మవారిని ప్రార్థించారని నూస్రత్ తెలిపారు. మనమంతా బెంగాల్ కుటుంబంలో భాగమని ఆమె వ్యాఖ్యానించారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందిన వెంటనే కోల్‌కతాకు చెందిన పారిశ్రామిక వేత్త నిఖిల్ జైన్‌ను పెళ్లాడి, కొత్త పెళ్లి కూతురుగా లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేసి వార్తల్లోనిలిచిన సంగతి తెలిసిందే. ఎంపీ నూస్రత్ జహన్, నిఖిల్ జైన్ దంపతులు View this post on Instagram Playing dhaak for the first time with my wonderful wifastic @nusratchirps @suruchisangha #aroopbiswas A post shared by Nikhil Jain (@nikhiljain09) on Oct 6, 2019 at 1:21am PDT -
బాలాకోట్ దాడులను కళ్లకు కట్టేలా దుర్గా మండపం
కోల్‌కతా : దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే మంటపాలను వైవిథ్యభరితంగా తీర్చిదిద్దే భక్తులు ఈసారి బాలాకోట్ వైమానిక దాడులను థీమ్‌గా ఎంచుకుని మండపం ఏర్పాటు చేసేందుకు సంసిద్ధమయ్యారు. కోల్‌కతాలోని ఓ దుర్గాపూజా కమిటీ భారత వైమానిక దళం బాలాకోట్‌లో ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించి ఉగ్రశిబిరాలను నేలమట్టం చేసిన ఘటనను థీమ్‌గా ఎంచుకుంది. 50 ఏళ్లుగా దుర్గా మండపాలను ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ కోల్‌కతాలోని యంగ్ బాయ్స్ క్లబ్ సర్బోజనిన్ దుర్గా పూజ కమిటీ క్లే మోడల్స్, డిజిటల్ ప్రొజెక్షన్ ద్వారా వైమానిక దాడులను ప్రజల కళ్లకు కట్టేలా ఈ మండపాన్ని ఏర్పాటు చేస్తోంది. మండపం ఎంట్రన్స్‌లో వైమానిక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకోవడం, ఉగ్రవాదులు మరణించిన, పారిపోతున్న దృశ్యాలు, వాటిపై ఐఏఎఫ్ ఎయిర్‌క్రాఫ్ట్ తిరుగుతుంటేలా 65 మోడల్స్‌తో డిస్ప్లే ఏర్పాటు చేశామని కమిటీ ప్రతినిధి విక్రాంత్సింగ్ వెల్లడించారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ లైఫ్‌సైజ్ మోడల్ సందర్శకులను పలుకరించలేలా అమర్చుతున్నామని చెప్పుకొచ్చారు. -
అందరు చూస్తుండగానే.. రౌడీ షీటర్ హత్య
అలహాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఓ రౌడీషీటర్‌ను సినీ ఫక్కీలో దారుణంగా హత్య చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అలహాబాద్‌లోని రాజాపూర్ కాలనీలో దుర్గామాత పూజ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో అందరు చుస్తుండగానే కొందరు దుండగులు ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం బాంబు వేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధంచి దృశ్యాలు సీసీ కెమెరాలో రాకార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తిని నీరజ్ బాల్మీకిగా గుర్తించారు. అతనిపై రౌడీషీటుందని, పాత కక్షలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. -
దసరా వేడుకలపై ఉగ్ర పంజా..?
కోల్‌కతా : దసరా వేడుకల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని దుర్గా మంటపాలపై ఉగ్రమూకలు దాడులతో విరుచుకుపడవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఉత్తర బెంగాల్‌లోని జల్పాయిగురి, కూచ్‌బెహర్, అలీపుర్దూర్, సిలిగురి ప్రాంతాల్లో దాడులకు బంగ్లాదేశ్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జమాతుల్ ముజహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) దాడులకు పాల్పడవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. నలుగురు జేఎంబీ ఉగ్రవాదులు దుర్గా పూజ సందర్భంగా అలజడి సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించారని, అలీపుర్దూర్, జల్పాయిగురి, సిలిగురిల్లో భీకర దాడులను చేపట్టాలన్నది వీరి లక్ష్యమని ఇంటెలిజెన్స్ నివేదిక హెచ్చరించింది. ఇద్దరు జేఎంబీ ఉగ్రవాదులు ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్ జిల్లా దిన్హత ప్రాంతంలో ఉన్నారని, రెండ్రోజుల్లో మరో ఇద్దరు భారత భూభాగంలోకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని నిఘా వర్గాల నివేదిక స్పష్టం చేసింది. నేపాల్ నుంచి జేఎంబీ ఉగ్రవాదులు పేలుడు పదార్ధాలను సేకరించారని నివేదిక అంచనా వేసింది. గతంలో 2014లో బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో దుర్గా పూజ వేడుకల్లో జరిగిన పేలుడుతో రాష్ట్రంలో జేఎంబీ స్లీపర్ సెల్స్ చురుకుగా పనిచేస్తున్నట్టు వెల్లడైంది. -
దుర్గా నవరాత్రోత్సవాలు..
-
స్త్రీలోక సంచారం
♦ లెగ్గింగ్స్, యోగా ప్యాంట్ ధరించి పాఠశాలకు హాజరవుతున్న విద్యార్థినులను యు.ఎస్. విస్కాన్సిన్ రాష్ట్రంలోని కెనోషాలో అనేక పాఠశాలల యాజమాన్యాలు కటువుగా శిక్షించడంపై అమెరికాలోని పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిమ్‌కు, వర్కవుట్లకు అనువుగా ఉండే ‘అథ్లెష్యూర్’ ఫ్యాషన్ ట్రెండ్ దుస్తులను ధరించి పాఠశాలకు రాకూడదని గత మార్చిలోనే ఆంక్షలు విధించినప్పటికీ, కొంతమంది విద్యార్థినులు వాటిని లక్ష్యపెట్టకుండా అవే దుస్తులను ధరించి పాఠశాలకు వస్తున్నందున వారిపై చర్య తీసుకోవడం తప్పడం లేదని పాఠశాలలు చెబుతుండగా.. కొందరి విషయంలో మాత్రమే స్కూళ్లు ఈ విధమైన వివక్షను పాటిస్తున్నాయని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ♦ 98 ఏళ్ల ‘మిస్ అమెరికా’ అందాల పోటీల చరిత్రలోనే తొలిసారిగా ఈ ఏడాది స్విమ్ సూట్ రౌండ్ లేకుండానే పోటీలను నడిపించిన ఘనత నిర్వాహకులకు దక్కినప్పటికీ.. ఆ పోటీలను టీవీలో చూసే వీక్షకుల సంఖ్య గత ఏడాదితో పోల్చి చూస్తే 19 శాతం తగ్గినట్లు ప్రముఖ సర్వే కంపెనీ ‘నీల్సన్’ వెల్లడించడంతో వచ్చే ఏడాది మళ్లీ స్విమ్ సూట్ రౌండ్ పునరుద్ధరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి! సాధారణ పరిస్థితుల్లోనే టీవీలో అందాల పోటీలను చేసేవారి సంఖ్య గత కొన్నేళ్లుగా తగ్గుముఖం పడుతుండగా.. ఈసారి స్విమ్ సూట్ రౌడ్‌ను తొలగించడంతో.. గత ఏడాది 50 లక్షల 35 వేలుగా ఉన్న టీవీ వీక్షకులు ఈ ఏడాది 40 లక్షల 34 వేలకు పడిపోయారని నీల్సన్ తన సర్వే ఫలితాల్లో తెలిపింది. ♦ లెబనాన్ (పశ్చిమాసియా) రాజధాని బీరుట్కు రోడ్డు మార్గంలో 20 నిముషాల ప్రయాణ దూరంలో ఉన్న జియాలోని ఓన్లీ ఉమెన్ ‘బెలెవ్యూ బీచ్ క్లబ్’లో ఏ ఆంక్షలూ లేకుండా మహిళలకు ఇప్పటి వరకు కల్పిస్తున్న ప్రవేశానికి ఇప్పుడు మరిన్ని సడలింపులు ఇచ్చారు. అసలు మగ దృష్టే పడని, స్త్రీలకు మాత్రమే అయిన, అది కూడా లెబనాన్ దేశ మహిళలకు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ క్లబ్బులోకి మహిళలు బికినీ సహా, ఏ విధమైన వస్త్రధారణతోనైనా వచ్చి, ఆహ్లాదంగా విహరించే అవకాశం ఉండగా ఇప్పుడు మరింత స్వేచ్ఛగా ఎండపూట ఇసుకలో బేర్ బ్యాక్స్‌తో, బేర్ ఫ్రంట్స్తో సూర్యస్నానాలు చేసే వీలు కల్పించారు. ♦ వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు వాటికన్ సిటీలో జాతీయ క్యాథలిక్ బిషప్‌ల సదస్సును నిర్వహిస్తున్నట్లు వాటికన్ మహిళా ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. యు.ఎస్., చిలి, ఆస్ట్రేలియా, జర్మనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని క్యాథిలిక్ చర్చి బిషప్‌లు.. పిల్లలపై, నన్లపై అత్యాచారం జరుపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటికన్ ప్రతిష్టను తిరిగి నిలుపుకోవడం కోసం పోప్ ఫ్రాన్సిస్ స్వయంగా పూనుకుని ఈ సదస్సును తలపెట్టారు. ♦ గత ఏడాది మొహర్రం రోజు దుర్గాపూజ విగ్రహాల నిమజ్జనం జరగకుండా ఆదేశాలు జారీ చేసి, ముస్లింల మెప్పు కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ ఏడాది కోల్‌కతాలోని 3,000 దుర్గాపూజ కమిటీలతో సహా, రాష్ట్రంలోని 28,000 కమిటీలకు.. ఒక్కో కమిటీకి 10,000 రూపాయలు చొప్పున నిధులను మంజూరు చేసింది. అయితే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై పైచేయి సాధించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విధమైన హిందూ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు తప్ప, వారిపై ఆమె ప్రత్యేకమైన ప్రేమ ఏమీ లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. -
భక్తులకు మెరుగైన సేవలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమం) : దుర్గమ్మ దర్శనంలో భక్తులకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనతో చెప్పవచ్చని ఈవో వి.కోటేశ్వరమ్మ చెప్పారు. మహా మండపం సమీపంలోని చాంబర్లో శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. తొలుత అర్జున వీధి మీదుగా మహా మండపానికి చేరుకున్న ఆమెకు ఏఈవో అచ్యుతరామయ్య, పలువురు పాలక మండలి సభ్యులు స్వాగతం పలికారు. మెట్ల మార్గం ద్వారా నేరుగా మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం దుర్గమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోగా, ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. పాలక మండలి సభ్యులు ఈవో కోటేశ్వరమ్మకు పుష్పగుచ్ఛాలు అందచేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో విలేకర్లతో మాట్లాడుతూ భక్తులకు మంచి దర్శనం, మెరుగైన సేవలే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి పెద్ద పీట వేస్తానని తెలిపారు. అమ్మ దర్శనానికి వచ్చిన భక్తులందరూ దుర్గమ్మ బిడ్డలేనని పేర్కొన్నారు. భక్తులకు అమ్మవారి చక్కటి దర్శనంతో పాటు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అర్చకులు , ఆలయ సిబ్బంది సమన్వయంతో పని చేస్తానని వెల్లడించారు. ఎటువంటి విభేదాలకు తావు ఇవ్వకుండా పని చేయడమే ప్రధాన కర్తవ్యమన్నారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ , వారి ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తానని వివరించారు. ఇక దాతల సౌకర్యార్ధం టీటీడీ తరహాలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల మనోబావాలు దెబ్బతిసేలా కొంత మంది ఆలయ సిబ్బంది వ్యవహరిస్తున్నారని, దీని వల్ల తరుచూ అనేక గొడవలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. త్వరలోనే ఆలయ సిబ్బంది అందరితో ఓ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల పట్ల గౌరవంగా మెలగాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు. ఇక దేవస్థానంలో జరుగుతున్న వివాదాలను ఇకపై జరగకుండా ప్రతి చోటా చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ విభాగాల అధికారులు కోటేశ్వరమ్మను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, పాలక మండలి సభ్యులు పెంచలయ్య, శంకరబాబు, పద్మశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గగుడి ప్రతిష్ట పెంచడమే లక్ష్యం
దుర్గగుడి ప్రతిష్టను పెంచడమే లక్ష్యమని ఐఆర్ఎస్ అధికారి వీ కోటేశ్వరమ్మ అన్నారు. ఆలయ ఈఓగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్న ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. అవినీతిని అరికట్టేందుకు దృష్టి సారిస్తానన్నారు. తన పాలన పారదర్శకంగా ఉంటుందన్నారు. అన్ని విభాగాల సమాచారం వెబ్సైట్లో భక్తులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సాక్షి,విజయవాడ: రాష్ట్రంలోని రెండవ అతి పెద్ద దేవాలయం దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా వరుసగా మూడోసారి మహిళా అధికారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల కొందరి చేష్టలు ఆలయ ప్రతిష్టను, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తొలి మహిళా అధికారి సూర్యకుమారి తాత్రింక పూజలపై విమర్శలు రావడంతో బదిలీ కాగా, పాలకమండలి సభ్యురాలు చీర మాయం చేసిన ఘటనలో సంబంధం లేకపోయినా రెండో మహిళా అధికారి ఎం.పద్మపై బదిలీ వేటు పడింది. ఈ నేపథ్యంలో మరో మహిళా అధికారి వి.కోటేశరమ్మ ఈఓగా బాధ్యతలు చేపడుతున్నారు. దుర్గగుడి ప్రతిష్టను కాపాడేందుకు, భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఆమె తీసుకునే చర్యలను ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి: దుర్గగుడిలో అవినీతి వ్యవíస్థీ్థకృతమైపోయింది. దీన్ని ఏ విధంగా అరికడతారు? కోటేశ్వరమ్మ: కింది స్థాయి ఉద్యోగిపైనా నేను ప్రత్యేకంగా దృష్టి పెడతాను. అవినీతి జరిగేందుకు అవకాశాలు ఉన్న విభాగాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటాను. పాలన పూర్తి పారదర్శకంగా ఉంటుంది. అన్ని విభాగాల సమాచారం వెబ్సైట్లో భక్తులకు అందుబాటులో ఉంచుతాం. సాక్షి:దుర్గగుడిలో కొంతమంది ఉద్యోగస్తులు దీర్ఘకాలంగా పాతుకుపోయారు. వారి వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? కోటేశ్వరమ్మ: పాలనా విధానంలో అందరిని కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తా. దేవాలయం ప్రతిష్ట పెంచడమే నా ప్రధాన ధ్యేయం. భక్తులకు మెరుగైన సేవలు అందించే విషయంలో రాజీ పడను. దీనికి అందరూ సహకరిస్తారని అనుకుంటున్నా. ఇబ్బంది కలిగించే వారిపై కఠినంగా ఉండటానికి వెనుకాడను. సాక్షి:దేవస్థానంలో జరిగే పొరపాట్లకు ఈఓనే బాధ్యత వహించాల్సి వస్తోంది. మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు? కోటేశ్వరమ్మ: ఎక్కడ పొరపాట్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాను. భక్తులకు మెరుగైన పాలన అందించేందుకు ప్రయత్నిస్తాను. సాక్షి: ఒకవైపు అభివృద్ధిపనులు జరుగుతున్నాయి. మరోకవైపు నిధులు కొరత వెంటాడుతోంది? ఎలా అధిగమిస్తారు? కోటేశ్వరమ్మ: దేవస్థానం అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం తప్పకుండా తీసుకుంటాను. అలాగే దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేందుకు ప్రయత్నిస్తాను. సాక్షి: భక్తుల కష్టాలు ఏ విధంగా తెలుసుకుంటారు? కోటేశ్వరమ్మ: గతంలో నవరాత్రులలో దుర్గగుడికి వచ్చాను. అప్పుడు భక్తులు పడే కష్టాలను ప్రత్యక్షంగా చూశా. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా చూస్తా. సాక్షి: త్వరలో జరగబోయే దసరా ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలని అనుకుంటున్నారు? కోటేశ్వరమ్మ: దసరా ఉత్సవాల నిర్వహణకు అందరి సహకారం అవసరం. గతంలో దేవాదాయశాఖలో పని చేసినందున ఆ అనుభవం కూడా ఉపయోగపడుతుందని భవిస్తున్నా. దసరా ఉత్సవాల్లో భక్తుల అవసరాలకే ప్రధాన ప్రాధాన్యం. సాక్షి:పరిపాలనా వ్యవహారాల్లో పాలకమండలి జోక్యం ఎక్కువగా వుంటోందని తెలుస్తోంది. కోటేశ్వరమ్మ: వారి గురించి ప్రభుత్వం చూసుకుంటుంది. ఇటీవలే పరిపాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పాలకమండలికి చెప్పినట్లు పత్రికల్లోనే చూశాను. సాక్షి: పాలకమండలి సభ్యుల వల్ల దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటోంది? దీన్ని ఏ విధంగా అడ్డుకుంటారు? కోటేశ్వరమ్మ: ప్రతిఒక్కరూ దేవస్థానం ప్రతిష్ట పెంచేందుకే కృషి చేయాలి. పాలకమండలి ఏ విధంగా ఉండాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. -
ఈ పాఠం మన పిల్లలూ చదవాలి
కష్టాలను గానుగలో వేసి పిండిన సంధ్య, దుర్గాభవానీల చాప్టర్ ఇది. పుస్తకం చదివేది జ్ఞానమూ, విజ్ఞానమూ, సంస్కారం కోసమే కదా! అయితే వీళ్ల చాప్టర్ స్ఫూర్తికోసం చదవాలి. మనందరం పాఠాలు నేర్చుకున్న వాళ్లమే. మన పిల్లలు కూడా. కానీ ఈ బంగారాలు జీవితానికే ఓ పాఠం నేర్పించారు. ‘ఆకాశంలో మెరుపు మెరిసినా, హరివిల్లు విరిసినా తమ కోసమేనని మురిసిపోయే బాల్యంలో ఈ చిన్నారులు ఇంటి బాధ్యతల్ని మోస్తూనే. చదువుల్లో మెరుపులయ్యారు. సర్కారీ బడిలో హరివిల్లులై విరబూశారు. వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఈ ఏడాది టెన్త్‌లో 9.7 జీపీఏ సాధించి సంధ్య, 9.5 జీపీఏతో మొదటి, రెండు స్థానాల్లో నిలిచారు. ఊహ తెలిసేనాటికి సంధ్యకు నాన్న లేడు. కానీ నాన్న నడిపిన పానీపూరీ బండి ఉంది. బండెడు భారాన్ని మీదేసుకున్న అమ్మ తోడుగా ఉంది. బండి నడిస్తేనే బడి. బండి నడిపితేనే బతుకు. అలా అక్షరాలు దిద్దే చేతులతోనే సంధ్య పానీపూరీ తయారు చేసింది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు గప్చుప్పులు విక్రయించింది. అమ్మకు చేదోడుగా నిలిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బడి, సాయంత్రం ఐదింటి నుంచి రాత్రి పదింటి వరకు బండి. ఆ తర్వాత ఏ తెల్లవారు జామునో నిద్ర లేచి పుస్తకాలతో పోటీ పడిన చిన్నారి సంధ్య పదో తరగతిలో స్కూల్ టాపర్‌గా నిలిచింది. వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలకే వన్నె తెచ్చింది. అదే స్కూల్ నుంచి సెకెండ్ టాపర్‌గా నిలిచిన దుర్గాభవానీ కూడా తల్లిదండ్రులతో పాటు తనూ ‘బతుకు బండి’ని లాగుతూనే ఉంది. అమ్మతో పాటు చెరుకుబండిని నడుపుతూ ఉంది. వీరిద్దరి ప్రతిభపై సాక్షి ఫ్యామిలీ స్పెషల్ రిపోర్ట్. సంధ్య సికింద్రాబాద్‌లోని సంగీత్ చౌరస్తా నుంచి క్లాక్‌టవర్ వైపు వెళ్తుంటే ఎడమ వైపు ఓరియంటల్ బ్యాంకు మూలన ఉంటుంది ఆ పానీపూరీ బండి. భర్త దత్తూరాం ఉన్నప్పటి నుంచి అతనితో పాటే పానీపూరీ బండి నడిపింది రాధ. బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం నారాయణ్‌ఖేడ్ నుంచి వీరి కుటుంబం నగరానికి వలస వచ్చింది. పెళ్లయిన ఆరేళ్లకే దత్తూరాం గుండెపోటుతో చనిపోయాడు. ఛాట్బండి, రెండు మూడేళ్ల వయస్సు తేడాతో ఉన్న ముగ్గురు కూతుళ్లు, ఆర్నెల్ల వయస్సున్న కొడుకు, ఒక అద్దె గది మిగిలాయి. దుఃఖాన్ని దిగమింగి, పిల్లల్ని భుజానేసుకొని బండిని ముందుకు కదిలించింది రాధ. ఆమెతో పాటు సంధ్య చిట్టి చేతులు కూడా బండిని ముందుకు తోశాయి. అలా ఆ బండి ఆకలికి అన్నం పెట్టింది. చదువు చెప్పించింది. పదోతరగతి కూడా పూర్తి చేయకుండానే పెద్దమ్మాయి అంబికకు పెళ్లి చేశారు కానీ, రెండో అమ్మాయి మనీష, మూడో అమ్మాయి సంధ్య మాత్రం ఇద్దరు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించారు. మనీష ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. సంధ్య ఈ ఏడాదే పదోతరగతి పూర్తి చేసింది. అబ్బాయి మహేశ్ సర్కారీ బడిలోనే ఏడో తరగతి చదువుతున్నాడు. ‘‘పిల్లలే నా కలల పంట, పెళ్లయిన ఆరేళ్లకే ఆయన పోయినప్పుడు ఇక బతికేదెట్లా అని భయపడ్డాను.అప్పటికి నా కొడుకు 20 రోజుల పసికందు. ఆదుకొనే వాళ్లు కనుచూపు మేరలో లేరు. ఉన్నదల్లా బండి ఒక్కటే. మరోదారి కనిపించలేదు. ఆ బండిని నమ్ముకొనే ఇంతవరకు లాక్కొచ్చాను. పెద్దమ్మాయిని చదివించలేకపోయాననే బాధ ఉంది. కానీ మిగతా ఇద్దరమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. మనీషను ఇంజనీరింగ్ చదివించాలనుంది. సంధ్య సీఏ చేస్తానంటుంది. ఇంకెన్ని కష్టాలు, బాధలు వచ్చినా సరే వాళ్లను బాగా చదివిస్తాను’’ అంటున్నారు రాధ. దుర్గాభవానీ సికింద్రాబాద్‌లోనే రసూల్‌పురా పేదల బస్తీ. ఆ బస్తీలో వికసించిన విజ్ఞాన జ్యోతి దుర్గాభవానీ. వెస్ట్‌మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాలలోనే ఈ ఏడాది సంధ్యతో పాటు కలిసి చదువుకొని 9.5 జీపీఏతో సెకండ్ టాపర్‌గా నిలిచింది. ఐపీఎస్ ఆమె కల. కల మాత్రమే కాదు ఆశయం కూడా. గత 30 ఏళ్లుగా ప్యారడైజ్ సమీపంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ బస్టాపు వద్ద పాన్ డబ్బా నడుపుకొంటున్న దుర్గ తండ్రి బాబూరావు, అక్కడే చెరుకు బండి ఏర్పాటు చేసుకున్న తల్లి రాణీల కల కూడా అదే. అక్షరం అంటే ఏంటో తెలియని తమ జీవితాల్లో అక్షర జ్యోతై వెలుగుతున్న దుర్గా భవానీ కోసం కొవ్వొత్తుల్లా కరిగిపోయి అయినా సరే ఆమెను ఐపీఎస్‌ను చేయాలని ఆకాంక్షిస్తున్నారా తల్లిదండ్రులు. ‘‘ఈ సిటీలో పుట్టి పెరిగినం. కానీ ఇప్పటికీ మాకు సొంత ఇల్లు లేదు. రెక్కల కష్టాన్నే నమ్ముకొని బతుకుతున్నవాళ్లం. ఎండాకాలం చెరుకుబండి. వానాకాలం ఛాట్ బండి. అదే మా ఉపాధి. మాతో పాటే పిల్లలు పని చేస్తారు ఇంటిల్లిపాది కష్టపడితేనే బతుకు బండి నడిచేది’’ అన్నారు దుర్గాభవాని తల్లి రాణి. కూతురు దుర్గతో పాటు, కొడుకు శివను కూడా కష్టపడి చదివిస్తున్నారు. ‘‘పదో తరగతిలో అమ్మాయి సాధించిన ఫలితాన్ని చూస్తే జీవితంలో నేనే గెలిచినంత సంతోషం కలిగింది. ఇంకెన్ని కష్టాలొచ్చినా సరే ఆమె కోరుకున్న చదువు చదివిస్తాను’’ అని చెప్పారు బాబూరావు. కష్టంతోనే జీవితం ‘‘చిన్నప్పటి నుంచి అమ్మ పడిన కష్టాలు తెలుసు. ఆమె బాధలు చూస్తూనే ఉన్నాం. ఆ కష్టాల్లో, బాధల్లోనే పుట్టి పెరిగిన వాళ్లం. కష్టపడి వచ్చిన ఫలితంలో ఉండే తృప్తి మరెందులోనూ ఉండదనిపిస్తుంది. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలన్నది నా లక్ష్యం.’’ ఇంటర్లో చేరిన తరువాత ఆ లక్ష్యం దిశగా పట్టుదలతో చదువుతాను’’. – సంధ్య తప్పకుండా ఐపీఎస్ అవుతా ‘‘ఉదయం బడికి పోయి, సాయంత్రం ఇంటికి వచ్చి.. ఏ పనీ చేయకుండా ఉంటే ఇల్లెట్లా గడుస్తది. అమ్మతో పాటు ఇంటి పని చేస్తాను. సాయంత్రం బండి మీదకి వచ్చి చెరుకు రసం తీస్తాను. అప్పుడప్పుడు నాన్న బయటికెళితే పాన్ డబ్బాలో ఉంటాను. ఎందుకంటే ఇదే మా జీవితం కదా. నేను తప్పకుండా ఐపీఎస్‌ను అయితీరుతాను. – దుర్గాభవానీ చదువుల గుడి మారేడుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాల అమ్మాయిల చదువులకు కల్పవల్లిగా ఉంది. అత్యుత్తమ బోధనతో పాటు పిల్లలకు చక్కటి క్రమశిక్షణను అలవరుస్తున్నారు. ఈ ఏడాది సంధ్య, దుర్గాభవానీలతో పాటు, శ్రీదేవి (9.2), జ్యోతి (9.2), రమ్య (9.0)లు కూడా మంచి ఫలితాలను సాధించారు. ‘‘ప్రతి ముగ్గురు పిల్లలకు ఒక టీచర్ బాధ్యత తీసుకుంటారు. ఉదయాన్నే ఇంటికి ఫోన్ చేసి చదువుకోవాలని చెబుతారు. మా టీచర్లు మమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు. ఎక్కడా ఒత్తిడనిపించదు. చాలా సంతోషంగా, ఆడుతూ, పాడుతూ చదువుకున్నాం. మంచి ఫలితాలను తెచ్చుకున్నాం’’ అని చెప్పారు సంధ్య, దుర్గాభవానీలు. – పడిగిపాల ఆంజనేయులు, సాక్షి, హైదరాబాద్ సాక్షిలో సంధ్య, దుర్గా భవాని వార్త (ఈ పాఠం మన పిల్లలూ చదవాలి) చదివిన పలువురు దాతలు తాము సాయమందిస్తామంటూ ముందుకు వస్తున్నారు. వారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు కింద అందచేస్తున్నాం. సంధ్య ఫోన్ నెంబరు: 9959132466 దుర్గా భవానీ సెల్ నెంబర్: 9866160698 -
నైవేద్యంగా నాలుక అర్పించింది...
భోపాల్ : ఆధునిక కాలంలో కూడా మూఢనమ్మకాలతో ప్రజలు తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న సంఘటనలు కోకొల్లలు. దేవతపై నమ్మకంతో భక్తి పేరిట ఓ మహిళ తన నాలుకను కోసి నైవేద్యంగా సమర్పించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని తార్సామా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుడ్డీ తోమర్ అనే 45 ఏళ్ల వివాహిత దుర్గా మాతకు పరమ భక్తురాలు. తార్సామా గ్రామంలో ఉన్న బిజసేన్ మాత ఆలయాన్ని ప్రతి రోజూ సందర్శించడం ఆమెకు అలవాటు. ఈ క్రమంలోనే బుధవారం ఆలయానికి వెళ్లిన తోమర్ తన నాలుకను కోసి అమ్మవారికి నైవేద్యంగా అర్పించింది. ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోవడంతో పక్కనే ఉన్న ఇతర భక్తులు ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. దేవుడిపై విశ్వాసాన్ని నిరూపించుకోవడానికే ఆమె ఇలా ప్రవర్తించిందని.. ప్రస్తుతం చికిత్స పొందుతోందని పేర్కొన్నారు. పెళ్లైన నాటి నుంచి అంతే.. ఈ ఘటనపై తోమర్ భర్త రవి తోమర్ మాట్లాడుతూ.. తన భార్య దుర్గాదేవి భక్తురాలని చెప్పారు. పెళ్లైననాటి నుంచి ఆమె ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం బిజసేన్ ఆలయానికి వెళ్తుందని తెలిపారు. అయితే బుధవారం కూడా ఆలయానికి వెళ్లిందని.. ప్రార్థనా సమయంలో అకస్మాత్తుగా ఇలా ఎందుకు చేసిందో తెలియడం లేదని వాపోయాడు. -
వివాదాస్పద చిత్రం.. విడుదలవుతోంది
సాక్షి, తిరువనంతపురం : టైటిల్‌తో వివాదంలో నిలిచిన చిత్రం ‘ఎస్ దుర్గ’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైపోయింది. మార్చి 23న చిత్రం కేరళలో విడుదల కానుంది. సెక్సీ దుర్గ, న్యూడ్.. కధేంటి? సోమవారం సాయంత్రం ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. సీనియర్ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్ చేతుల మీదుగా క్యాంపెయిన్‌ను చిత్ర దర్శకుడు సనాల్ కుమార్ శశిధరన్ మొదలుపెట్టాడు. చిత్రంలోని చిన్న చిన్న వీడియో బైట్లతో ఆయా వాహనాలు సినిమా గురించి రాష్ట్రం మొత్తం ప్రమోషన్ చేస్తాయి. ఇక సెక్సీ దుర్గ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డుల వేడుకల్లో(లండన్, హాంకాంగ్ తదితర) ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. అయితే టైటిల్ కాస్త అభ్యంతరకరంగా ఉందంటూ ఇఫ్ఫీ వేడుకల జాబితా నుంచి ఆ చిత్రాన్ని తొలగించారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపింది. బోర్డు వ్యవహారాన్ని తప్పుబడుతూ పలు భాషల నటీనటులు చిత్ర మేకర్లకు అండగా నిలిచారు. ఆపై సినిమా పేరును ఎస్ దుర్గగా మారుస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయినప్పటికీ సెన్సార్ బోర్డు కూడా చిత్ర విడుదలకు అభ్యంతరం తెలిపింది. చివరకు ఆందోళనల నేపథ్యంలో తగ్గిన బోర్డు సినిమాకు U/A సర్టిఫికెట్ ఇస్తూ రీలీజ్‌కు అనుమతించింది. అర్ధరాత్రి ఓ యువతి ఎదుర్కున్న పరిస్థితుల నేపథ్యంలో ఎస్ దుర్గ చిత్రం తెరకెక్కింది. -
దుర్గమ్మ చెంతకు ఆర్జిత సేవలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమం): దుర్గగుడి ఈవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి మొవ్వ పద్మ తనదైన శైలిలో మార్పులకు శ్రీకారం చుట్టారు. మహా మండపంలో జరుగుతున్న పలు ఆర్జిత సేవలను ఆలయ ప్రాంగణంలో నిర్వహించేందుకు పాలకమండలి సభ్యుల ఆమోదాన్ని పొందారు. బుధవారం మాడపాటి సత్రంలో పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. దుర్గగుడిపై త్వరలోనే కీలక మార్పులు చేసేందుకు రంగం సిద్ధమైంది. మహా మండపంలోని, 3, 4 అంతస్తులోకి దేవస్థాన పరిపాలనా విభాగాన్ని తీసుకువచ్చేందుకు ఈవో పద్మ తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు శివరాత్రికి మల్లేశ్వరాలయ పనులు పూర్తికానందున ప్రత్యేక పూజలు, కల్యాణాన్ని నిలిపివేయాలని వైదిక కమిటీ నిర్ణయించింది. దీనిపై పాలకమండలి కూడా ఆమోదం తెలిపింది. కెనాల్‌రోడ్డులో జరిగే రథోత్సవంలో గంగా పార్వతి సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులు యధావిథిగా పాల్గొంటాయని పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి 26వ తేదీ మల్లేశ్వరస్వామి ఆలయ కళాన్యాస కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించేందుకు కమిటీ ఆమోదముద్ర తెలిపింది. ఆలయ పరిసరాలలోనే ఆర్జిత సేవలు శాంతి కల్యాణాన్ని రాజగోపు రం ఎదురుగా ఉన్న ఆశీర్వచన మండపంలోని, ఆశీర్వచన మం డపాన్ని ఆలయ ప్రాంగణంలోని కొబ్బరికాయలు కొట్టే ప్రదేశంలోకి, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాన్ని జై గంట వద్దకు, అష్టోత్తర, సహస్రనామార్చన పూజ లను అన్నదానం క్యూకాంప్లెక్స్లోకి, నటరాజ స్వా మి ఆలయ సమీ పంలోని యాగశాలలో రుద్రహోమం నిర్వహించాలని నిర్ణయించారు. అన్న ప్రా సనలు, అక్షరాభ్యాసాలు, నామకరణాలను ఇకపై నటరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న మండపంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. మల్లికార్జున మహామండపం తూర్పు భాగా న షెడ్డు నిర్మాణం చేయాలని దేవస్థానం నిర్ణయించింది. పాలకమండలి సభ్యులు ఆమోదం తెలపడంతో ప్రతిపాదనలను దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపనున్నారు. అంతరాలయ టికెట్ ధర తగ్గింపునకు ప్రతిపాదన అంతరాలయ టికెటు ధరను రూ.300 నుంచి రూ.250కి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పాలకమండలి మరో మారు ప్రభుత్వాన్ని కోరింది. అంతరాలయంలో జరిగే త్రికాల అర్చనలో మూడు షిప్టులలో రెండు షిప్టులను మాత్రమే అంతరాలయంలో నిర్వహిం చాలని, ఉదయం 11 గంటలకు జరిగే త్రికాల అర్చనను ఆల య ప్రాంగణంలో నిర్వహిస్తే భక్తుల దర్శనానికి ఇబ్బందులు ఉండబోవని పాలక మండలి భావిస్తుంది. దాతలకు మరిన్ని సదుపాయాలు ఆలయ అభివృద్ధితోపాటు అన్నదానానికి విరాళాలు ఇచ్చే దాతలకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని పాలక మండలి నిర్ణయించింది. రూ.లక్ష పైబడి రూ. 2లక్షలలోపు విరాళం ఇచ్చిన దాతలకు ఏడాదిలో రెండు పర్యాయాలు అమ్మవారి దర్శనం చేసుకునేఅవకాశం కల్పిస్తున్నామన్నారు. కుటుంబంలో ఆరుగురు సభ్యులకు మాత్రమే ఈ అవకాశాన్ని 10 ఏళ్లపాటు కల్పిస్తామన్నారు. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు విరాళం ఇచ్చిన దాతలకు ప్రతినెలా ఒకసారి అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా అనుమతిస్తామ న్నారు. రూ. 5 లక్షలు పైబడి విరాళం ఇచ్చిన దాతలకు ప్రత్యేక పాస్‌ను మంజూరు చేసి ఎప్పుడైనా అమ్మవారి దర్శనం చేసుకునే వీలు కల్పిస్తామన్నారు. టెండర్ నిబంధనలకు సవరణ ప్రస్తుతం దేవస్థానానికి సరుకులు పంపిణీ చేసేందుకు నిర్వహించే టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు ఆయా సంస్థలకు రూ.10 కోట్లు టర్నోవర్ ఉండాలనే నిబంధనలను పాలకమండలి సవరించింది. ఏడాదికి టర్నోవర్‌ను రూ.10 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గించడం వల్ల మరింత మంది వ్యాపారులు టెండర్ల పక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుందని పాలకమండలి సభ్యులు భావిస్తున్నారు. ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కమిషనర్‌కు పంపడం జరిగింది. -
‘నాడు కిరీటం చోరీ.. నేడు క్షుద్రపూజలు..’
సాక్షి, విజయవాడ : కనకదుర్గమ్మ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరు దారుణంగా ఉందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. గతంలో బాబు సీఎంగా ఉన్నప్పుడే అమ్మవారి కిరీటం చోరీకి గురైందని, ఇప్పుడు ఏకంగా గర్భగుడిలో క్షుద్రపూజలు చేయిస్తున్నారని, దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణంలోనూ ఎక్కడలేని జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. మార్చిలోగా ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తిచేయకుంటే ఆందోళన చేపడతామని రఘువీరా హెచ్చరించారు. శనివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘గతంలో కిరీటం చోరీ, ఇప్పుడు క్షుద్రపూజలు.. చంద్రబాబు హయాంలోనే జరిగాయి. పొద్దున లేస్తే దుర్గగుడి ఫ్లైఓవర్ నా కల అని చెప్పుకుంటారాయన. మరి పనులు చూస్తే ఎక్కడిక్కడే నిలిచాయి. నాడు హైదరాబాద్‌లో తెలుగుతల్లి ఫ్లైఓవర్ విషయంలోనూ ఎనిమిదేళ్లు కాలయాపన చేశారు. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పూర్తిచేసింది. ప్రస్తుతం టీడీపీ దృష్టంతా దోపిడీపైనే ఉందితప్ప అభివృద్ధిపై కాదు. రాజధానిలో ఎక్కడిక్కడ కబ్జాలు, దందాలు.. ఇవే సీఎం, ఆయన కుమారుడు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేస్తోన్నపనులు! మార్చిలోపు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తికాకుంటే ఏప్రిల్‌లో కాంగ్రెస్ శ్రేణులు నిరవధిక దీక్షలకు దిగుతాం’’ అని రఘువీరా రెడ్డి అన్నారు. -
మళ్లీ ఐఏఎస్ అధికారి
సాక్షి, విజయవాడ: జిల్లాలోని మొవ్వ మండలానికి చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ మొవ్వ పద్మ దుర్గగుడి కార్యనిర్వహణాధికారి(ఈఓ) గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పద్మ ప్రస్తుతం ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లదేవస్థానం (దుర్గగుడి) ఈఓ బాధ్యతలతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. దుర్గగుడిలో జరిగిన తాంత్రిక పూజలకు బాధ్యురాలిని చేస్తూ తొలి మహిళా ఐఏఎస్ అధికారి ఎ.సూర్యకుమారిని ఈఓ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. మళ్లీ ఈఓగా మహిళా ఐఏఎస్ అధికారినే నియమించింది. ఆధార్ అనుసంధానంలో.... పద్మ కృష్ణాజిల్లాలో జన్మించినా విద్యాభాసం తిరుపతిలోనే జరిగింది. ఎస్వీ యూనివర్పీటీలోనే పీజీ, పీహెచ్డీ చేశారు. 1993లో గ్రూపు–1 అధికారిగా ఉద్యోగంలో చేరారు. 2004 బ్యాచ్‌లో ఐఏఎస్ అధికారిగా మారారు. దశాబ్ద కాలంగా ల్యాండ్ రికార్డ్స్, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమశాఖ, పౌరసరఫరాలశాఖలో వివిధ హోదాల్లో పద్మ బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగ విద్యార్థులకు ఉపకారవేతనాలు సక్రమంగా అందేందుకు వీలుగా సెంట్రర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కింద ప్రత్యేక ఆన్లైన్ అప్లికేషన్ తయారీలో ఆమె కీలక పాత్ర పోషించారు. వివిధ పథకాలను ఆధార్‌తో అనుసంధానం చేయడంలో కృషి చేశారు. గిరిజన సంక్షేమ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఆమె భర్త వి.వి.ఆర్.ప్రసాద్ ఈసీఐఎల్‌లో డీజీఎం గాపని చేసి ఉద్యోగవిరమణ పొందారు. అమ్మవారి దయతో అన్నీ చక్కదిద్దుతా ఈఓగా నియమితులైన పద్మ ‘సాక్షి’తో మాట్లాడారు. అమ్మవారి దయతో దుర్గగుడిలోని అన్ని సమస్యలను చక్కదిద్దుతానన్నారు. వచ్చేవారం ఈఓగా బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు. కనకదుర్గమ్మకు సేవ చేసే అవకాశం రావడంతో సంతోషంగా ఉందన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధే తనకు ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. -
చంద్రబాబు సర్కార్ తీరుపై ఐవైఆర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఖరిపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరోసారి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్లకు ఉన్నతాధికారుల నియామకంపై ఆయన సునిశిత విమర్శ చేశారు. గతంలో ఆరునెలల పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టరే (ఎండీ) లేని పరిస్థితిలో పని చేసిందని.. తర్వాత ఆ పదవిలో నియమించిన ఐఏఎస్ అధికారి పద్మను కూడా ఆరు నెలలు పూర్తి కాకముందే అక్కడ నుంచి బదిలీ చేసి, ఆమెకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడాన్ని ఐవైఆర్ ట్విటర్ ద్వారా తప్పుపట్టారు. దాదాపు రూ.1,000 కోట్ల లావాదేవీలు జరిగే కాపు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కనీసం ఐఏఎస్ అధికారిని కూడా నియమించకుండా జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని ఆ బాధ్యతల్లో నియమించారని దుయ్యబట్టారు. గత సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఓట్లు వేసి గెలిపించిన రెండు కులాలపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. Brahmin Corp without MD for six months then padma was posted . With in six month transferred and kept additional charge.kapu Corp 1000 cr budget managed by j d level officer . So much for the commitment of govt to these two communities who whole heatedly voted them to power. — IYR KrishnaRao Former CS GoAP (@IYRKRao) 23 January 2018 -
దుర్గగుడి నూతన ఈవోగా పద్మ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. విజయవాడ దుర్గ గుడి ఆలయ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారిణి డాక్టర్ ఎం.పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పద్మ ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2004 బ్యాచ్‌కు చెందిన ఆమె మరో రెండు రోజుల్లో ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే రోడ్డు భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రశాద్, పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది, (జీఏడీ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు), ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్‌ను ప్రభుత్వం రిజర్వ్‌లో ఉంచింది. ఆయనను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. -
దుర్గగుడి ఈవోగా వైవీ అనూరాధ
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గగుడి ఈవోగా దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ ఆదివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి చేరుకున్న వైవీ అనూరాధకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం ఆమె రాజగోపురం ఎదురుగా ఉన్న వీఐపీ లాంజ్‌లో ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తూ ఫైల్‌పై సంతకాలు చేశారు. బ్రాహ్మణవీధిలోని ఇంద్రకీలాద్రి పరిపాలనా భవనానికి చేరుకున్నారు. -
అర్ధరాత్రి పూజలు
-
దుర్గమ్మ గుడిలో జరిగింది ఏంటి!
-
‘దుర్గగుడిలో అర్థరాత్రి పూజలు వాస్తవమే’
సాక్షి, విజయవాడ : విజయవాడ దుర్గగుడిలో అర్థరాత్రి తాంత్రిక పూజలపై పాలకమండలి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆలయంలో అర్థరాత్రి పూజలు జరిగిన విషయం వాస్తవమేనని పాలకమండలి పేర్కొంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశామని తెలిపింది. ఇటువంటి ఘటనల వల్ల భక్తుల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయని, ఆలయ ఈవో సూర్యకుమారి తనపై వస్తున్న ఆరోపణలను రూపుమాపుకునేందుకే ఇటువంటి పూజలు నిర్వహించారని పాలకమండలి ఆరోపించింది. ఈవో సూర్యకుమారికి తెలిసే ఇదంతా జరిగిందని, ఆమె చెప్పడం వల్లే పూజలు, అలంకారం చేశామని బయట వ్యక్తులు చెబుతున్నారని వ్యాఖ్యానించింది. గతంలో ఈవో ఘాట్‌రోడ్‌లోని పర్ణశాలలో హోమగుండాలు ఏర్పాటు చేసి క్షుద్రపూజలు చేశారని, ఆమె వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదంగా ఉందని పాలకమండలి ఆరోపణలు చేసింది. ఆలయ ప్రతిష్టను ఈవో సూర్యకుమారి దిగజార్చారని, ఆలయంలో అర్థరాత్రి పూజలపై గత నెల 30న జరిగిన సమావేశంలో ప్రశ్నిస్తే ఆమె అన్నీ అబద్ధాలు చెప్పారని, అలాగే టెండర్ల విషయంలోనూ ఈవో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారని పాలకమండలి చెప్పుకొచ్చింది. ఈవోపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసింది. బయటి వ్యక్తులు అంతరాలయంలోకి వెళ్లడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని ఆలయ పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు, పాలకమండలి సభ్యులు పేర్కొన్నారు. మరోవైపు తాంత్రిక పూజల వ్యవహారంపై ఈవో సూర్యకుమారి ప్రెస్మీట్లో వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఆ..ఆలయంపై ఉగ్రవాదులు దాడి!?
సాక్షి, పట్నా : ఉగ్రవాదులు మరోసారి దేశం మీద దాడికి తెగబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ప్రకటించాయి. ఈ దఫా దేశంలోని పురాతన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడే సూచనలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రకటించాయి. ఈ దఫా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్రదాడికి తెగబడొచ్చని నిఘా వర్గాలు తెలిపాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదులు బీహార్‌లోని అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక ఆలయం అయిన మాతా తవవాలి ఆలయం మీద దాడి చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నట్లు తెలిసింది. గోపాల్‌గంజ్ జిల్లాలోని ఈ ఆలయంలో దుర్గా మాత కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని క్రీ.శ, 14వ శతాబ్దంలో చేర రాజులు నిర్మించారు. లష్కరే తోయిబాకు చెందిన స్లీపర్ సెల్ ఉగ్రవాది.. షేక్ అబ్దుల్ నయీమ్ కొంత కాలంగా ఈ ప్రాంతంలో తచ్చాడుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. గోపాల్‌గంజ్ జల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పలు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు.. పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది. ఇప్పటికే దుర్గామాత ఆలయానికి ప్రభుత్వం అదనపు భద్రతను కల్పించింది. ఈ ఆలయంలోని దుర్గామాతను దర్శించేందుకు బీహార్, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నేపాల్, పశ్చిమ బెంగాల్ నుంచి భారీగా భక్తులు వస్తుంటారు. -
భవానీలతో ఇంద్రకీలాద్రి కిటకిట
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీలతో కిటకిటలాడుతోంది. దీక్ష విరమణ చేయటానికి భారీ సంఖ్యలో భవానీలు దుర్గమ్మ సన్నిధికి తరలివస్తున్నారు. ఆదివారం 68వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రెండో రోజైన సోమవారం తెల్లవారుజాము నుంచే భవానీల తాకిడి మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భవానీలతో కృష్ణాతీరం ఎరుపెక్కింది. ఘాట్లలో పుణ్యస్నానాల అనంతరం భవానీలు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. అనంతరం దీక్ష విరమణ చేసి హోమగుండాల వద్ద మొక్కులు తీర్చుకుంటున్నారు. గురుభవానీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. దీక్ష విరమణ చేసే మహామండపంలో ఎక్కువ మంది సిబ్బంది లేకపోవటంతో ఇబ్బందిగా మారిందని భవానీలు వాపోతున్నారు. -
పవిత్ర సంగమం వద్ద మరోసారి నిర్లక్ష్యం
-
బాహుబలి మాహిష్మతి రాజ్యంలో దుర్గాదేవి
-
నిబ్బరంగా సాగుదాం!
యావద్భారతం దసరా సంబరాల్లో తేలియాడుతోంది. దుష్టసంహారిణి దుర్గ తొమ్మిది రోజుల భీకర సంగ్రామం తర్వాత లోక కంటకుడైన మహిషాçసురుని కడతేర్చి నేల నాలుగు చెరగులా శాంతి సౌఖ్యాలను వెలయించిన రోజు విజయ దశమి. హిందువుల పండుగే అయినా దసరా వేడుకల అంతస్సారం, అంతర్నిహిత సందేశం మతాలకతీతం, లౌకికం, సార్వత్రికం. చెడుపై మంచి విజయం అనివార్య మనే సార్వత్రిక సత్యం ఎవరిలో మాత్రం ఆత్మవిశ్వాసాన్ని నింపదు, ఎంతటి నైరాశ్యపు ఎడారి బతుకుల్లో ఆశల పూలను పూయించదు? భిన్నత్వంలో ఏకత్వానికి మారు పేరైన భారతంలోని అత్యధిక సంఖ్యాకుల హిందూ మతంలోనే ఉన్న ప్రాంతీయ, సాంస్కృతిక వైవిధ్యమంతా దసరా ఉత్సవాల్లో ప్రస్ఫుటంగా కనిపి స్తుంది. అయితే ఎక్కడైనా దసరా అంటే శక్తి పూజే. శక్తి స్వరూపిణిగా మహిళ విశ్వ రూపాన్ని ఆవిష్కరించే సమయమే. ఎంతటి వారైనా ఆమె ముందు మోకరిల్లే సందర్భమే. అందుకే ఇది ‘ఆమె’కు మనం చూపుతున్న స్థానం ఏది? అని ప్రశ్నించు కోవాల్సిన సందర్భం అయింది. చెడుపై మంచి విజయం అనివార్యమేనా? అసలు సాధ్యమేనా? అని అడుగడుగునా రేగే సందేహాలకు సమాధానాలను వెతకాల్సిన సమయమూ అయింది. దేశ జనాభాలోని మహిళల సంఖ్య క్రమంగా క్షీణిస్తోందని తెలిసిందే. 1971లో 15–34 ఏళ్ల వయస్కులైన వెయ్యి మంది యువకులకు 961 మంది యువతులుగా ఉన్న నిష్పత్తి, 2011 నాటికి 939కి పడిపోయిందనీ, అది 2021 నాటికి 904కు, 2031 నాటికి 898కి పడిపోతుందని ప్రపంచ బ్యాంకు తాజా అంచనా. ఇప్పుడు హారతులెత్తుతున్న ఆ అమ్మలగన్న అమ్మకు ప్రతిరూపమైన ఎందరు అమ్మల కడు పున ఊపిరి పోసుకుంటున్న శక్తులను చిదిమేసి, కళ్లయినా తెరవని పసి శక్తుల గొంతులు పిసికేసి ఇంతటి ఘనతను మూటగట్టుకుంటున్నాం? చెడును పరిమార్చే ఆ అమ్మ ఈ దురాగతాన్ని సహిస్తుందా? మొక్కులు చెల్లించామని మన్నిస్తుందా? విద్య, ఉద్యోగావకాశాల్లో ఆడపిల్లల పట్ల చూపుతున్న వివక్షను అధిగమించి మరీ ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు 2014–15 మధ్య 51 శాతం పెరిగాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఉద్యోగులుగా ఎంతటి ప్రతిభను, సమర్థతను కనబరుస్తున్నవారైనా 74 శాతం ఇలాంటి వేధింపులపై అసలు ఫిర్యాదే చేయరంటే పర్యవసానాల భయం ఎలాం టిదో ఊహించుకోవచ్చు. విద్యావంతులైన, ఉద్యోగాలు చేస్తున్న మహిళల పరిస్థితే ఇలా ఉంటే ఇళ్లలో, వీధుల్లో, విద్యాలయాల్లో మహిళలపై సాగే వేధింపులు, హింస, అత్యాచారాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో చెప్పనవసరం లేదు, గణాంకాలు ఏకరు వు పెట్టాల్సిన అవసరమూ లేదు. శక్తి స్వరూపిణిగా మహిళను ఆరాధించే మనం మన సొంత కూతుళ్లు, అక్కచెల్లెళ్లు, కన్న తల్లి, కట్టుకున్న ఆలి, సహాధ్యాయిని, తోటి ఉద్యోగిని, శ్రామికురాలు, ఎవరైతేనేం మహిళను పురుషునితో సర్వ సమానమైన మనిషిగా చూడగలుగుతున్నామా? గౌరవించగలుగుతున్నామా? నునులేత మొహా లపై యాసిడ్ సీసాలు విసిరి, అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడి, ఆత్మ హత్యలకు పురిగొల్పి ఏ మొహం పెట్టుకుని అమ్మవారి దర్శనం కోసం వెళు తున్నాం? ఆ మహిషాసురమర్దని పట్ల చూపే భక్తిప్రపత్తులపై ఈ రాక్షసత్వం ఆనవాళ్లు కనిపించకుండా ఉంటాయా? ఈ పరిస్థితిని భరిస్తున్న సమాజంగా మనం ఆ శక్తి స్వరూపిణి ముందే కాదు, భారత స్త్రీ శక్తి ముందు కూడా దోషులం కాకుండా పోతామా? దేవీ నవరాత్రి ఉత్సవాల నిజ స్ఫూర్తిని గ్రహించగలిగితే, చెడుపై పోరాటం చేయడానికి వెనుకాడటం, చెడు చేయడంతో సమానమేనని గ్రహించే వాళ్లం కాదా? ‘ఈ ప్రపంచం ప్రమాదకరంగా తయారైంది దుష్టులవల్ల కాదు, వారి దుష్కృత్యాలను చూస్తూ ఏమీ చేయని వారి వల్ల (ఐన్‌స్టీన్).’ నేడైనా ఆ పోరుకు దిగి, విజయాన్ని కోరి ‘ఆయుధ పూజ’ చేద్దాం. శమీ వృక్షాన్ని పూజించడమైనా, రావణ దహనమైనా చెడును నిర్జించడానికి ప్రతిన బూనడానికి సంకేతాలే తప్ప అర్థ రహితమైన ఆరాధనా కాదు, వినోదం అంతకన్నా కాదు. విజయదశమితో ఆ దుర్గమ్మ తల్లి మíß షాసుర సంహారం ముగుస్తుంది. నేడు చేసే ఆయుధ పూజ విజయాన్ని సాధించగలమనే ఆత్మవిశ్వాసం నింపి, ఇనుమడిం చిన శక్తితో మనల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేస్తుంది. కానీ రేపటి నుంచి అడుగడుగునా చెడు ఎదురవుతూనే ఉంటుంది. మహిషారులు ప్రత్యక్షమౌతూనే ఉంటారు. అన్యా యం, అసమానత, అవినీతి, అజ్ఞానం, అసహనం అసమర్థత, అక్రమం, అధికార దుర్వినియోగం, దురాక్రమణ, దురాగతం, దురాచారం, మూఢనమ్మకం, వివక్ష, నిరక్షరాస్యత ఇలా ఎన్ని రూపాలలో చెడు విచ్చలవిడిగా చెలరేగి పోవడం లేదు? పేదరికాన్ని మించిన సామాజిక హింస మరేదీ లేదు. ఆ చిత్రహింసల కొలిమిలో, రోగాల పుట్టల్లో కునారిల్లుతున్న 30 కోట్ల అభాగ్యుల మాటేమిటి? నిరుద్యోగులు కావడం అంటే ఆచరణలో జీవించే హక్కును కోల్పోవడమే. కొత్త ఉద్యోగాలు వేలల్లో ఉంటే కొత్త నిరుద్యోగులు లక్షల్లో పెరుగుతున్నారు. ఈ భూతాలను ఎవరు పరిమార్చాలి? అవి ప్రభుత్వాలు చేయాల్సిన పనులే, 70 ఏళ్లుగా అరకొరగా చేసీ చేయకుండా వదిలేసిన బాధ్యతలే. అట్టహాసంగా దసరా ఉత్సవాలు జరుపుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపే ప్రభుత్వాలు... దాచిన ఎన్నికల ప్రణాళికలు, చేసిన వాగ్దానాల దుమ్ముదులిపి ఈ విజయదశమినాడైనా అమలు చేయడానికి పూనుకుంటాయని, ఆ కృషిలో విజయం కోసం ప్రార్థిస్తాయని ఆశిద్దాం. అయితే ఆ పాల కులను ఎన్నుకునేది మనమే. కాబట్టి ప్రభుత్వాలు నిజంగానే ప్రజల అధికారానికి ప్రాతినిధ్య సంస్థలుగా పనిచేసేలా చేయడమూ మన బాధ్యతే. ఈ పండుగ రోజున ఇన్ని చేదు వాస్తవాలను గుర్తుకు తెచ్చుకోవడం వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని సమ కూర్చుకోవడానికే. జీవితం, సమాజం సమస్యల సుడిగుండమైనప్పుడు కావా ల్సింది గుండె దిటవు. విజయదశమి రోజున ఆ ఆదిశక్తిని కోరాల్సింది అదే. విశ్వ కవీంద్రుడు అన్నట్టు ‘ఆపదల నుంచి కాపాడమని కాదు, ఆపదలను ఎదుర్కో వాల్సి వచ్చినప్పుడు నిర్భయంగా ఎదుర్కొనేలా చేయమని ప్రార్థిద్దాం’. -
సయ్యద్ జిలానీ @ భవానీ
ఒంగోలు , కందుకూరు : అతను ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పేరు సయ్యద్ జిలానీ. దుర్గామాతకు వీరభక్తుడైన ఇతను మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాడు. 24 ఏళ్లుగా అమ్మవారి సేవలో తరిస్తూ ఏకంగా దుర్గామాత ఆలయాన్ని నిర్మించి ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్నాడు. ఆలయంలో దూపదీప నైవేద్యాలకు, అమ్మవారి ఉత్సవాలకు లోటులేకుండా అన్నీ తానై నిర్వహిస్తున్న సయ్యద్ జిలానీ భవానీ స్వామిగా పేరుపొందాడు. గుంటూరుకు చెందిన సయ్యద్ బడేషా, హుస్సేన్‌బీ దంపతులకు ఆరుగురు సంతానం. చివరివాడైన సయ్యద్ జిలానీ తండ్రితో విభేదాలు తలెత్తడంతో ఇల్లు వదిలి బయటకు వచ్చాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ భార్యతో కలిసి కందుకూరు చేరుకున్నాడు. అంకమ్మ దేవాలయంలో ఓ చిన్న గదిలో ఉంటూ.. ఆరు నెలలపాటు భవానీ దీక్ష తీసుకున్నాడు. దుర్గమ్మ ఆలయం నిర్మించాలని నిర్ణయించుకుని, జనార్దన కాలనీకి చేరుకుని కోవూరు రోడ్డు పక్కనే 4 సెంట్ల స్థలాన్ని రూ.10 వేలకు కొనుగోలు చేశాడు. కాలనీ పెద్దలతోపాటు దాతల సాయంతో రూ.20 లక్షలు వెచ్చించి ఆలయాన్ని నిర్మించాడు. ఇటీవలే మరో రూ.14 లక్షలతో భారీ శివలింగంతోపాటు, నవగ్రహాలు, నాగబంధం విగ్రహాలను ప్రతిష్టించాడు. ఏటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతోపాటు పండుల సమయాల్లో వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. జిలానీ భార్య బేగంతోపాటు ముగ్గురు కుమార్తెలు దుర్గమ్మ సేవకు అంకితమయ్యారు. కుమార్తెలకు అంకమ్మ, శివనాగమ్మ, రేణుకాదుర్గ అని పేర్లు పెట్టాడు. పెద్ద కుమార్తె అంకమ్మకు మసీదులో పేష్ ఇమామ్‌గా పనిచేసే యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు. -
దానవత్వంపై దైవత్వం విజయం
పండగ దుష్ట రాక్షసులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు జరుపుకునే పండుగే విజయదశమి. ఒక్కరూ విడిగా చేయలేని పనిని ఐకమత్యంగా, అందరి శక్తినీ ఒక్కచోట చేర్చితే ఎంతటి క్లిష్టమైన పనినైనా సాధించవచ్చని చెప్పే పండుగ ఇది. నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి, ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే. ఒక్కరోజు పూజతో సంవత్సర ఫలం దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు ఐదు రోజులు, అదీ వీలుకాని వారు మూడు రోజులు, అదీ కుదరని వారు కనీసం ఒక్కరోజయినా సరే ఆ దివ్యమంగళస్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఇక విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. జమ్మిని పెద్దలకు ఇచ్చి ఆశీస్సులందుకోవాలి. చెడుపై మంచి సాధించిన విజయం దానవత్వంపై దైవత్వం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాటం చేయడానికి దానవులు లేరు. కానీ మనం పోరాడి తీరవలసిన శత్రువులు మనలోనే ఉన్నారు. మనలోని దుర్గుణాతో పోరాడి విజయం సాధిద్దాం. జమ్మిని ఎందుకు పూజిస్తారు? శమీవృక్షానికీ, విజయ దశమికీ అవినాభావ సంబంధం ఉంది. శమీవృక్ష నీడ, శమీవృక్షపు గాలులు విజయ సోపానాలని నమ్మకం. శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు శమీవృక్షం కలపతోనే కుటీరం నిర్మించుకున్నాడని చెబుతారు. శమీవృక్షం విశిష్ఠతను పాండవులకు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పి, వారి ఆయుధాలను ఆ వృక్షం మీద దాయడం వల్ల కలిగే శుభఫలితాలను వివరించడం వల్ల పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ దివ్యాస్త్రాలను జమ్మిచెట్టుపైనే దాచారు. అందుకే శమీపూజ చేయడం, రైతులు, వివిధ వృత్తులవారు, కళాకారులు వారి వారి పనిముట్లను పూజించడం ఆచారం. తెలంగాణలో జమ్మిని బంగారం అంటారు. జమ్మి బంగారాన్ని అందరికీ పంచి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అలాగే... అమ్మవారి విజయవార్తను దేవతలు కొందరు పాలపిట్ట రూపంలో భూలోకానికి వచ్చి చాటిచెప్పారట. అందుకే ఆ రోజు పాలపిట్ట దర్శనం శుభప్రదం. రావణ దహనం ఎందుకు చేస్తారు? మహర్నవమినాడు శ్రీరామచంద్రుడు దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాముడు రావణుని మీదకు దండు వెడలి, విజయం సాధించిన దినం విజయ దశమే. రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుగా కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను టపాసులతో పేల్చేడం లేదా దహనం చేయడాన్ని ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు. -
కనకదుర్గాదేవి
లోకభయంకరుడైన రురువు కుమారుడు దుర్గముణ్ణి సంహరించిన తరువాత పరాశక్తి ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిందని పురాణ గాథ. ఎందరో రాక్షసులను సంహరించిన దుర్గాదేవిని దర్శించుకుంటే దుర్గతులనుండి తప్పించుకోగలుగుతారనేది భక్తుల విశ్వాసం. శ్లోకం: సర్వ స్వరూప సర్వేశీ సర్వశక్తి సమన్వితే! భయేభ్యః ప్రాహివో దేవి దుర్గేదేవి నమోస్తుతే!! భావం: దుష్టశిక్షణ చేయడానికి అవతరించి సర్వభయాలనూ పారద్రోలు దుర్గాస్వరూపమైన అమ్మా! నీకు నమస్సులు. ఫలమ్: శత్రుబాధలు తొలగిపోయి సకల కార్యములయందు విజయం పొందుతారు. నివేదన: పేలాలు, వడపప్పు, పాయసం మహిషాసురమర్దిని బ్రహ్మ వరప్రసాదం చేత అరివీర భయంకరుడై ముల్లోకాలనూ గడగడలాడిస్తున్న మహిషాసురుణ్ణి సంహరించడానికి ముక్కోటి దేవతలనూ, మూడులోకాలనూ కాపాడేందుకు ముక్కోటి దేవతల ఆయుధ తేజస్సును గ్రహించి మహాశక్తి స్వరూపిణిగా అవతరించి మహిషాసురుణ్ణి సంహరించినట్టుగా పురాణాలు తెలుపుతున్నాయి. లోకకంటకులైన ఎందరో రాక్షసులను సంహరించిన మహిషాసురమర్దిని అలంకరణలో దుర్గాదేవిని దర్శిస్తే అమ్మ అనుగ్రహంతో గ్రహబాధలు తొలగుతాయని ప్రతీతి. శ్లోకం దుర్గేస్మృతా హరసిభీతిమశేష జంతో స్వస్థైః స్మతామతి మతీం శుభాం దదాసి దారిద్య్ర దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా భావం: అమ్మా! నీ స్మరణ మాత్రం చేత మా భీతిని, భయాలను తొలగించి శుభాలను కలిగించి దారిద్య్రాన్ని, దుఃఖాలను కరుణతో తొలగిస్తూ తల్లిగా లాలించి పాలించే ఓ కరుణామయీ నిన్ను ఆర్ద్రతతో వేడుకుంటున్నాను. నివేదన: నువ్వులు, బెల్లమన్నం ఫలమ్: దీర్ఘరోగాలనుండి విముక్తులవుతారు. వ్యాపార లావాదేవీలయందు చిక్కులు తొలగిపోతాయి. -
దుర్గమ్మకు ప్రేమతో దీదీ
సాక్షి, కోల్‌కతా : దుర్గా నిమజ్జనంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం వివాదం కావటం తెలిసిందే. మొహర్రం ఊరేగింపు, నిమజ్జనం ఒకే రోజున చేపడితే మత కలహాలు చెలరేగుతాయంటూ నిమజ్జనంపై గతంలో మమత కొన్ని ఆంక్షలు విధించారు. అయితే హైకోర్టు జోక్యంతో చివరకు ఆ ఆదేశాలు పక్కన పెట్టేశారనుకోండి. ఇదిలా ఉంటే మమతా బెనర్జీ ఇప్పుడు మరో అవతారం ఎత్తారు. రచయితగా మారి ఓ పాట రాసేశారు. కోల్‌కతాలో దుర్గా మాతకు కమ్యూనిటీ పూజలు సాధారణంగా జరిగేవే. ఈ క్రమంలో సురుచి సంఘ పూజ కోసం మమతా పాట రాశారు. భిన్న మతాల ముత్యాలతో దేశ ఐకమత్యం.. అంటూ అద్భుతమైన సాహిత్యంతో రాయగా.. సింగర్ శ్రేయా ఘోషల్ స్వరాన్నిఅందించారు. ఇక ప్రముఖ బెంగాలీ సింగర్ జీత్ గంగూలీ సంగీతాన్ని అందించటం విశేషం. పూర్తి పాటను తన ఫేస్ బుక్, ట్విట్టర్ పేజీల్లో మమత పోస్ట్ చేశారు. సురుచి సంఘ కోసం గతంలో కూడా దీదీ ఓసారి పాట రాయటం విశేషం. వివిధ కులాల వారు నిర్వహించే పూజల్లో ఉత్తమ పాటను ఎంపిక చేసిన వారికి అవార్డు అందించటం ఆనవాయితీగా వస్తోంది. కోల్‌కతా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించే కార్యక్రమాల్లో సురుచి సంఘ్‌తోపాటు త్రిధార సమ్మిళని, కుమార్టూలి సర్బోజోనిన్ సంఘాలు ఆ పోటీల్లో ప్రధానంగా నిలుస్తుంటాయి. -
సిరుల తల్లి... కల్పవల్లి!
-
ఏడవ రోజు శ్రీ మహాసరస్వతీ దేవి
ఈరోజు దుర్గమ్మ ధవళవస్త్రధారిణిౖయె సంగీత రస స్వరూపమైన మరాళ వాహనంపై తారాహారాలు కంఠాభరణాలుగా ధరించి జ్ఞానాధిష్ఠాన దేవత, వాగ్దేవిౖయెన శ్రీ మహాసరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తుంది. దుర్గాదేవి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుదీరిన దుర్గాదేవిని చదువులతల్లి అయిన సరస్వతీదేవి రూపంలో అలంకరించటం విశేషం. శ్రీ సరస్వతీదేవి రూపంలో దుర్గమ్మను దర్శించుకుంటే విశేష జ్ఞాన సంపద కలుగుతుందని ప్రతీతి. శ్లోకం : యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్మై నమస్తస్మై నమస్త్మై నమో నమః భావం : సృష్టిలోని సమస్త జీవులయందు బుద్ధి రూపంలో ప్రకాశిస్తున్న ఓ జగన్మాతా నీకు మొక్కెదన్. నివేదన : జీడిపప్పు, కొబ్బరి పులిహోర ఫలమ్: బుద్ధి కుశలత, జ్ఞానసంపద, విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. -
సిరుల తల్లి... కల్పవల్లి!
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, కొలిచిన భక్తుల కొంగు బంగారమై విజయనగర వాసులను చల్లగా కాపాడుతోంది పైడితల్లి అమ్మవారు. విజయనగరంలో వెలిసిన ఆ తల్లి ఖ్యాతి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా వ్యాపించింది. ఏటా నెలరోజుల పాటు నిర్వహించే పండగే ఓ ప్రత్యేకతైతే ఆ పండుగలో సిరిమానోత్సవం నభూతో నభవిష్యత్ అనిపించేలా జరుగుతుంది. ఈ ఏడాది అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు ఈ నెల 19 నుంచి మొదలయ్యాయి. వచ్చే నెల 3వ తేదీన సిరిమానోత్సవం జరుగుతుంది. 18వ తేదీతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ నెల రోజులూ అమ్మవారికి నిత్య ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విజయనగరంలో అమ్మవారు వెలిసిన నాటి నుంచి ఏ ఊరిని తుఫాను ముంచెత్తినా, ఏ ఊళ్లో కల్లోలాలు జరిగినా విజయనగరం మాత్రం ప్రశాంతంగా ఉండటాన్ని అమ్మవారి అనుగ్రహానికి నిదర్శనంగా నమ్ముతుంటారు. విజయనగర సంస్థానాధీశుల ఆడపడచు పైడిమాంబ బాల్యం నుంచి దుర్గాదేవి భక్తురాలు. కొన్ని కారణాంతరాల వల్ల ఆత్మార్పణ చేసుకుంది. ఆ తర్వాత తన అన్న విజయరామరాజుకు అత్యంత సన్నిహితుడైన పతివాడ అప్పలనాయుడు కలలో సాక్షాత్కరించి, పెద్దచెరువులో పశ్చిమదిక్కున నా విగ్రహం ఉంది. దాన్ని బయటకు తీసి, ప్రతిష్ఠించి పూజలు చేయాలని చెప్పి అదృశ్యమైంది. వెంటనే పతివాడ అప్పలనాయుడు ఊరి ప్రజలకు ఈ విషయాన్ని వివరించి పెద్దచెరువులో వెతకగా జాలరి వలలో విగ్రహం బయటపడింది. దానిని బయటకు తీసి ఆ పెద్దచెరువు వద్దనే (ప్రస్తుతం రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడి)లో ప్రతిష్టించారు. తర్వాతకాలంలో భక్తుల సౌకర్యార్ధం మూడులాంతర్లు వద్ద చదురుగుడిని నిర్మించి పైడిమాంబను ప్రతిష్ట చేశారు. అప్పటినుంచి అప్పలనాయుడు వంశీకులే ఏటా సిరిమానును అధిష్టించి అమ్మ అంశగా పూజలందుకుంటున్నారు. స్థ్ధానిక రైల్వేస్టేషన్‌కి సమీపంలో పైడిమాంబ అమ్మవారి ఆలయం వనంగుడి ఉంది. చదురుగుడిలో అమ్మవారికి ఇరువైపులా ఘటాలుంటాయి. వీటిలో నీటిని అమ్మవారి తీర్థంగా భక్తులు పుచ్చుకుంటారు. ఈ గుడిలోనే రావి, వేపల సంగమ వృక్షం ఉంది. దానికిందనే అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు పూజలందుకుంటున్నాడు. దారి చూపించే దేవత సిరిమానుకు కావాల్సిన చెట్టును పూజారికి పైడిమాంబ కలలో కనిపించి చూపిస్తుందని నమ్మకం. అమ్మ చూపిన దిక్కుగా వెతుక్కుంటూ వెళ్లిన పూజారి చెట్టును గుర్తించి భక్తులు, అధికారుల సమక్షంలో సేకరిస్తారు. ఈ ఏడాది సిరిమాను డెంకాడ మండలం ముంగినాపల్లి రోడ్డులో ఉన్న రెడ్డికవాని పేట గ్రామంలో వెలిసింది. సిరిమాను, ఇరుసుమాను ఒకేచోట కనిపించాయి. ఇలా జరగడం ఇదే ప్రథమం. సిరిమానుకు పూజలు నిర్వహించిన అనంతరం పట్టణంలోని హుకుంపేటకు తరలించి, అక్కడ చెక్కి, నునుపైన మానుగా తీర్చిదిద్ది ఉత్సవానికి సిద్ధం చేస్తారు. ఆలయం నుంచి కోట వరకూ సిరిమాను మూడుసార్లు తిరుగుతుంది. తొలేళ్ల సంబరాలు సిరిమానోత్సవం ముందురోజు రాత్రి చదురుగుడి వద్ద నుంచి అమ్మవారి ఘటాలను మేళతాళాలతో కోటలోనికి తీసుకువెళతారు. కోటలో ఉన్న రౌండ్ మహల్ వద్దకు వెళ్లిన తర్వాత అమ్మవారి చరిత్రను స్తుతిస్తూ రాగయుక్తంగా గానం చేస్తారు. అక్కడ పూజల అనంతరం ఘటాలను చదురుగుడి వద్దకు తరలిస్తారు. ఆ గుడి ఎదురుగా ఒక బడ్డీని ఏర్పాటుచేసి అక్కడ ఘటాలను ఉంచుతారు. అప్పటికే పూజారిపై ఆవహించిన పైడిమాంబ తన మాటగా భక్తులకు భవిష్యవాణి వివరిస్తుంది. రాబోయే ఏడాది కాలంలో జరిగే మంచి, చెడులను పలుకుతుంది. ఉపద్రవాలు వచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తుంది. అమ్మవాణిని వినేందుకు రైతులు అక్కడకుచేరుకుంటారు. ఆ తర్వాత పూజారి ధాన్యపు గింజలను రైతులకు అందజేస్తారు. వాటిని తమ పొలాల్లో తొలివేరుగా విత్తుకుంటే పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్మకం. విజయదశమి తర్వాతనే ఉత్సవం ఏటా విజయదశమి వెళ్లిన తర్వాత వచ్చే తొలి మంగళవారం అమ్మవారికి సిరిమానోత్సవం నిర్వహిస్తారు. దాదాపు 50 నుంచి 60 అడుగుల పొడవుండే సిరిమాను (చింతమాను)కు ఆసనం అమర్చి ఆ ఆసనంలో పూజారిని అమ్మవారి ప్రతిరూపంగా కూర్చోబెట్టి చదురుగుడి వద్ద ఉన్న ఆలయం నుంచి కోట వరకూ మూడుసార్లు ఊరేగిస్తారు. సిరిమాను ఊరేగింపు సాగినంత మేర భక్తులు పారవశ్యంతో అరటిపండ్లు, పూలు, ఇతర ప్రసాదాలను సిరిమాను మీదకు విసురుతూ అమ్మ దీవెనలు అందుకుంటారు. ఈ ఉత్సవానికి పూసపాటి వంశస్తులు తరలివచ్చి తమ ఇంటి ఆడపడుచుకు లాంఛనాలు సమర్పించుకుంటారు. సిరిమాను బయలుదేరుతుందనగా సిరిమానుకు ముందు అమ్మ విగ్రహాన్ని వెలికి తీసినందుకు గుర్తుగా బెస్తవారి వలను నడిపిస్తారు. సంబరం ప్రారంభానికి ముందు పలువురు ఈటెలను ధరించి పాలధారగా ఆలయానికి చేరుకుంటారు. అక్కడనుంచి డప్పు వాయిద్యాలతో మహారాజకోట పశ్చిమభాగంవైపు వెళ్లి, కోటశక్తికి నమస్కరిస్తారు. విలక్షణమైన రథోత్సవం సిరిమాను జాతరలో అంజలి రథానిది ఓ విలక్షణమైన స్ధానం. సిరిమానుకు అంజలి ఘటిస్తూ ముందుకు సాగే రథంపై ఐదుగురు పురుషులు స్త్రీల వేషాలను వేసుకుని కూర్చొంటారు. వీరంతా ఆరుమూరల నారచీరను, చేతికి వెండి ఆభరణాలను ధరించి సంబరంలో పాల్గొంటారు. స్త్రీ వేషధారణలో ఉన్న వీరంతా అమ్మవారి పరిచారకులుగా వ్యవహరిస్తూ, అక్షింతలు పట్టుకుని సంబరం జరుగుతున్నంతసేపూ భక్తులపై చల్లుతూ ఉంటారు. భక్తులు వారిపై పళ్లూ పూలూ విసురుతారు. ఇలా చేరుకోవాలి... హైదరాబాద్ నుంచి విజయనగరానికి నేరుగా రైలు ద్వారా చేరుకోవచ్చు. విమానంలో రావాలనుకున్న వారు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి గంటన్నర వ్యవధిలోనే విజయనగరం చేరుకోవచ్చు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులున్నాయి. ప్రైవేటు ట్రావెల్ బస్సులు అందుబాటులో ఉంటాయి. విజయనగరం రైల్వేస్టేషన్లో అడుగు పెట్టగానే ఎదురుగా పైడితల్లి అమ్మవారు వెలిసిన వనంగుడి భక్తులకు కనబడుతుంది. అమ్మవారిని దర్శించిన భక్తులు అక్కడ నుంచి ఇతర వాహనాల ద్వారా కేవలం 10 నిమషాల వ్యవధిలోనే కిలోమీటరున్నర దూరంలో ఉన్న కోట ప్రాంతానికి చేరుకోవచ్చు. కోట సమీపంలోని మూడు లాంతర్లు వద్ద చదురుగుడిలో అమ్మవారిని సందర్శించవచ్చు. – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం -
అమ్మవు నీవె... అఖిల జగాలకు
ఈ అమ్మ కడుపులో మా అమ్మ పుట్టింది అవ్వ, జేజమ్మ – వాళ్ల అమ్మ – అలా... అందరు అమ్మలకూ అమ్మ ఆదిపరాశక్తి – కనకదుర్గమ్మ... దుర్గమ్మ – దుర్గాప్రసాద్ అమ్మ! దుర్గగుడి ప్రధాన అర్చక పదవి రావడం అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి కదా..! శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే... (అంటూ అమ్మవారి ప్రార్థన తో ప్రారంభించారు). విజయవాడలో ఇంద్రకీలాద్రిపై అమ్మ స్వయంభువుగా వెలిసింది. స్వయంభూ దేవాలయాలకు పంచప్రాణాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇందులో మొదటి ప్రాణం అర్చకుడిది. అంతటి ఉన్నత స్థానం పొందిన అర్చకుడిగా ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. వంశపారంపర్యంగా వచ్చినట్లున్నారు? అవునండీ. నాన్నగారు లింగాభొట్ల వెంకటేశ్వర్లు ఆలయ ప్రధాన అర్చకులుగా ఉండేవారు. వంశపారంపర్యంగా నాన్నగారి తరవాత నేను ప్రధాన అర్చకుడినయ్యాను. ప్రస్తుతం ఈ చట్టాన్ని పునరుద్ధరించారు. అందువల్ల మా వంశంలో మా తరవాతి తరానికి ఈ అవకాశం లేదు. ఈ అవకాశం తీసేయడంతో పదవీవిరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచారు. ఈ పరంపరలో నేనే చివరివాడిని కావడం కూడా అమ్మ సంకల్పంగానే భావిస్తాను. చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యతను స్వీకరిస్తున్న సమయంలో మీ అనుభూతి ఏమిటి? నా 12వ ఏట నుంచే నాన్నగారి వెంట దేవాలయానికి వెళ్లేవాడిని. నా 18వ ఏట అర్చకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. మొదట భయం వేసింది. మా మీద ఆధారపడిన పాతిక కుటుంబాలను సంరక్షించే బాధ్యత ఆ తల్లి నాకు అప్పచెప్పిందని గుర్తుకు వచ్చి, ఎంతో జాగ్రత్తతో నా కర్తవ్య నిర్వహణకు పూనుకున్నాను. ఆ తల్లి దయ వల్లే నాకు చదువుకునే అవకాశం కూడా కలిగింది. దేవాలయానికి వస్తూనే డిగ్రీ పూర్తి చేశాను. మీరు అర్చకత్వం స్వీకరించే నాటికి మీ తండ్రి మీతోనే ఉన్నారా? ఈ పదవికి మీ వంశంలోని మిగతా వారితో పోటీ పడవలసి వచ్చిందా? పూర్తి బాధ్యతలు తీసుకునే సమయానికి నాన్నగారు గతించారు. మా వంశంలో మొత్తం ఆరుగురం ఉన్నాం. నాన్నగారికి మేం ఇద్దరం సంతానం. మొత్తం ఆరుగురికీ వరుసగా నాలుగు రోజులకు ఒకరు చొప్పున అర్చనలు ఉండేవి. మావి రెండు వాటాలు ఉండటంతో మాకు ప్రధాన అర్చకత్వ బాధ్యతలు వచ్చాయి. మా అన్నగారికి ఆరోగ్యం సరిగా లే కపోవడంతో, నేనే పూర్తి బాధ్యతలు స్వీకరించవలసి వచ్చింది. మొదటి రోజు అర్చకునిగా ఎలాంటి భావాలకు లోనయ్యారు? చిన్నతనమంతా నాన్నగారి నీడలోనే అమ్మవారిని దర్శించుకున్నాను. ‘ఈ రోజు నుంచి బరువుబాధ్యతలు నావే’ అనే విషయం గుర్తుకురాగానే ఒకలాంటి ఉద్వేగం కమ్ముకుంది. అమ్మవారి సేవ మాత్రమే కాదు, మా దగ్గర పనిచేసేవారి బాగోగులు కూడా నాన్నగారిలాగే బాధ్యతగా చూడాలి. ఈ భయంతో ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపాను. ఆ తల్లిని నిత్యం నేనే అలంకరించి, స్వయంగా పూజించాలి అనే భావన మదిలో మెదలగానే ఏదో తెలియని దివ్యానుభూతి కలిగింది. నాటి నుంచి నేటి వరకు ఆ తల్లే నన్ను వెన్ను తట్టి నడిపిస్తోంది. మీ జీవితంలో వ్యక్తిగతంగా అమ్మవారి మహిమలు ఏవైనా సంభవించాయా? ఎన్నో మహిమలు చూశాను. ఇటీవల సంభవించిన మహిమను నేను ఎన్నటికీ మరచిపోలేను. అది నాకు పునర్జన్మ. ఆ రోజున ఆ తల్లి దయ లేకపోతే ఈ రోజు మీతో మాట్లాడగలిగేవాడిని కానేమో. ఒకరోజు సాయంత్రం పని మీద వెళ్లి ఇంటికి నా కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను. సరిగ్గా పుష్పహోటల్ సెంటర్‌కి వచ్చేసరికి నాకు ఏమైందో తెలీదు కాని, రోడ్డుకి పక్కగా కారు పార్క్ చేశాను. ఆ తరవాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్లు తెరిచి చూస్తే ఆసుపత్రిలో ఉన్నాను. డాక్టర్ నాతో, ‘అసలు ఏం జరిగిందో గుర్తు ఉందా, కారు ఎందుకు, అలా పార్క్ చేశారో చెప్పగలరా?’ అని అడిగారు. నాకేమీ గుర్తు రాలేదు. ఆ మాటే చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయారు. ‘మీ గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఒకేసారి అదుపు తప్పాయి. ఆ క్షణంలో మీరు కారు డ్రైవ్ చేసి ఉంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, మీకు ఏం జరిగేదో చెప్పలేను’ అన్నారు. ఒక్కసారిగా ఆ జగజ్జనని, అమ్మలగన్న అమ్మని మనసులో స్మరించుకున్నాను. ఆ తల్లి నాయందు లేకపోతే ఆ రోజు ఏం జరిగి ఉండేదో... ఈ అనుభవం నా జీవితంలో మరచిపోలేనిది. అమ్మవారి మహిమ వల్లే మీరు బయటపడ్డారనే విషయాన్ని తరచు చెబుతుంటారా? అంటే.. దైవాన్ని నమ్మని వారిని నమ్మించే ప్రయత్నం ఏమైనా చేస్తుంటారా? అలాంటి ప్రయత్నాలేవీ చేయలేదు. మనలను నడిపే శక్తి ఉందని మాత్రమే చెబుతాను. నమ్మనివారు దైవాన్ని దూషించినా, క్రియల ద్వారా వారి వ్యతిరేకత చూపినా... పట్టించుకోను. అయితే వారి మనసులో మార్పు తీసుకురావడానికి మాత్రం నాకు చేతనైనంతగా ప్రయత్నిస్తాను. నిరంతరం భక్తుల మధ్య ఉంటారు. ఎప్పుడైనా భక్తులు తమ బాధలు చెప్పి, పరిష్కారం కోరితే ఏ విధంగా సలహాలు, సూచనలు ఇస్తారు? అర్చకుడిని భక్తులంతా భగవంతునికి తమ కోర్కెలను నివేదించేవానిగా భావిస్తారు. అందువల్లే వారి కష్టాలు మాకు చెప్పుకుంటారు. సంతానం లేదని, ఉద్యోగం రాలేదని, అమ్మాయి వివాహం జరగలేదని మొరపెట్టుకుంటారు. భక్తులు వారి బాధ చెప్పుకున్నప్పుడు, వారికి కొంత ఉపశమనం కలిగే పరిష్కారాలు చెబుతుంటాను. మీరు ఇబ్బందులకు గురైనప్పుడు, సమస్యల నుంచి బయట పడేయమని అమ్మవారిని కోరుకుంటారా? నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏనాడూ అమ్మవారిని నా బాధ తీర్చమని అడగలేదు. అడగను కూడా! ఆ తల్లిని నమ్ముకున్నాను. నిత్యం అర్చన చేస్తాను. కళ్లు మూసుకుని ధ్యానించుకుంటాను. ఆ తల్లిని నమ్ముకున్న వారి బాగోగులు ఆ తల్లే చూసుకుంటుందని విశ్వసిస్తాను. అమ్మవారి ముక్కుపుడక పోయినప్పుడు అర్చకులను నిందించారు. మేం సరిగ్గా పూజలు చేయకపోవడం వల్లే ఈ విధంగా జరిగింది అన్నారు. అన్నిటికీ అందరం ఓర్చుకున్నాం. ఒకసారి హైదరాబాద్ నుంచి ఒక దంపతులు మా దగ్గరకు వచ్చారు. వారికి ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి బీటెక్ చదువుతుండగా అకస్మాత్తుగా చనిపోయిందట. చిన్నమ్మాయి మానసికంగా కుంగిపోయిందట. వారు అమ్మవారిని దర్శించుకుని, సరాసరి మా ఇంటికి వచ్చారు. వారికి అమ్మవారి ఫొటో ఇచ్చి, నిత్యం పూజలు చేసుకోమని, సర్వశుభాలు కలుగుతాయని చెప్పాను. నె రోజుల తరవాత మళ్లీ వచ్చి, ‘అయ్యా! మీరు ఇచ్చిన ఫొటోకు నిత్యం పూజలు చేశాం. మీ దయ వల్ల మా కుటుంబం అంతా ఆనందంగా ఉన్నాం. మా చిన్నమ్మాయి ఆరోగ్యం బాగయ్యింద’ని చెప్పారు. ఆ ఆనందాన్ని మరచిపోలేను. సకాలంలో మొక్కులు చెల్లించుకోలేదని ఎవరైనా మీ వద్దకు వస్తే వారికి ఎటువంటి పరిష్కార మార్గం చూపుతారు? ‘ఫలానా పని పూర్తయితే దేవాలయానికి వస్తాం’ అనో, ‘ఫలానా పూజ చేయిస్తాం’ అనో భక్తులు మొక్కుకోవడం తెలిసిందే. కొందరు అనుకున్న సమయానికి మొక్కులు చెల్లించుకోలేకపోతారు. అటువంటప్పుడు అపరాధం జరుగుతుందని వారు భయపడతారు. మా దగ్గరకు వచ్చి పాపపరిహారం చెప్పమంటారు. అటువంటి సమయాలలో, ‘మీరు సకాలంలో మొక్కు చెల్లించుకోకపోవడం వల్ల మీకు ఏ అరిష్టమూ అంటదు. ఇప్పుడు మీరనుకున్న దానికి రెట్టింపు చెల్లించుకోండి’ అని చెబుతాను. మొక్కు తీర్చుకోలేదు కనుక, అమ్మవారు శిక్షిస్తుందని చెప్పడం సరైనది కాదు నా దృష్టిలో. ఈ వృత్తిలో ప్రవేశించినందుకు ఏనాడైనా బాధ పడిన సంఘటనలు ఎదురయ్యాయా? ఎన్నడూ అలా జరగలేదు. ఎవ్వరికైనా కొన్ని అనుకోని సంఘటనలు తప్పవు. వాటిని సైతం అమ్మవారి దయగానే భావిస్తాను. మీ చేతి మీదుగా అమ్మవారి దేవాలయంలో చేసిన మంచి మార్పులు? ఆలయంలో మా వంశీకులు ఆరుగురం పనిచేస్తున్నాం. ఆ తల్లి దయ వల్ల మహామండప శంకుస్థాపన దగ్గర నుంచి జయేంద్రసరస్వతి స్వామివారితో కలశాలకు మహాకుంభాభిషేకం చేసేవరకు పూర్తిగా అన్నీ నా చేతుల మీదుగానే జరిగాయి. తెప్పోత్సవ ప్రారంభ రచన, అమ్మవారి స్వర్ణతాపడం ఆ అమ్మవారు నా చే తే ప్రారంభింపచేశారు. అది నా అదృష్టంగా భావిస్తాను. అదేవిధంగా ప్రాతఃకాల అర్చన అనంతరం ఖడ్గమాల పూజకు ఆలోచన చేశాను. విజయవంతంగా నడుస్తోంది. అమ్మవారికి ఇస్తున్న విశ్రాంతి చాలనుకుంటున్నారా, మరింత విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నారా? మామూలు రోజుల్లో అయితే ఆ తల్లికి విశ్రాంతి సరిపోతుంది. కాని పండుగలు, నవరాత్రుల సమయంలో మాత్రం చాలదు. ఒకేరోజున రెండు అవతారాలు ఉన్నరోజున మాత్రం ఒకవైపు పూజలు చేస్తూనే, మరో వైపు దర్శనానికి వదులుతాం. లేదంటే దర్శనం పూర్తికాదు. ముఖ్యంగా మూల నక్షత్రం రోజున అస్సలు కుదరదు. ఎంతో దూరాల నుంచి ఆ తల్లిని చూడటానికి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తారు. భక్తుల కోసం ఆ తల్లి అవిశ్రాంతంగా దర్శనం ఇస్తూనే ఉంటుంది. అమ్మపూజకు ఎప్పుడైనా దూరమైన సందర్భాలున్నాయా? ధర్మప్రచారం కోసం ప్రభుత్వం తరఫున కిందటి సంవత్సరం అమెరికా వెళ్లాను. అమ్మవారి విగ్రహం తీసుకువెళ్లి అక్కడ అలంకరించి, పూజలు చేశాం. మొత్తం 12 రాష్ట్రాలలో 50 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాం. అన్నిరోజుల పాటు అమ్మవారికి దూరంగా ఉండటం వల్ల కొద్దిగా మనసు కలత చెందింది. కాని ఇక్కడ చేస్తున్నది కూడా అమ్మవారి సేవే కదా అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. ఎంత సర్దిచెప్పుకున్నా, అమ్మవారికి దూరమయ్యాననే భావన పూర్తిగా తొలగిపోలేదు. ఇంట్లో ఉన్న సమయంలో మీ కుటుంబ సభ్యుల మధ్య అమ్మవారి ప్రస్తావన వస్తే ఆ తల్లిని ఏమని సంబోధిస్తారు? ఇంట్లోనూ ‘అమ్మ’ అనే సంబోధిస్తాను. మా ఇంట్లో ‘అమ్మ’ ఉందన్న అనుభూతిలోనే ఉంటాను. అమ్మవారికి అన్నీ తెలుసు. ఉద్యోగంలా కాకుండా, ఆ తల్లితో అనుబంధం ఉన్నట్లుగా ఉండాలి అర్చకత్వం అంటే. తన సేవలు చేయడానికి నాకు ఇంకా 12 ఏళ్లు అవకాశం ఇచ్చింది ఆ తల్లి. ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నాను. అమ్మవారి దర్శనం జరుగుతున్నంతసేపు ప్రసాద వితరణ జరగాలనేది నా కోరిక. ఇందుకోసం నేను కృషి చేస్తున్నాను. కార్యసాఫల్యత జరిగేవరకు చేస్తూనే ఉంటాను. ► అమ్మవారు సర్వశక్తులనూ సంపాదించి, మహిషుడిని సంహరించి, అదే ఉగ్రరూపంలో ఇంద్రకీలాద్రి మీద వెలిసింది. ఆ రూపాన్ని చూడటానికి అంతా భయపడ్డారని, కొందరు ప్రాణాలు విడిచారనీ కథనాల ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు బీజాక్షరాలతో శ్రీచక్రయంత్ర ప్రతిష్ఠ చేసి, అమ్మవారి శక్తిని శ్రీచక్రంలో ప్రవేశపెట్టి, ఉగ్రరూపం కనపడకుండా, అమ్మను సౌమ్యంగా ఉండేలా అలంకరించారట. ►ఒకసారి ఒక భక్తుడు ఆలయంలో మర ణించడంతో, అమ్మవారికి స్నపనం చేయించాలా వద్దా అని తర్జనభర్జన పడుతున్నారట. ఎక్కువమంది వద్దనే నిశ్చయానికి వచ్చారట. ఆ సమయంలో ఎర్రటి చీర కట్టుకుని, ఒంటì నిండా బంగారు నగలు, నడుముకు వడ్డాణంతో ఒక స్త్రీమూర్తి వచ్చి, ‘మీరు చేయకపోతే అవదా ఏంటిరా’ అంటూ ఏకవచనంలో సంబోధించిందట. ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయారట. మరునాటి ఉదయం గర్భాలయంలో అమ్మవారి పైన ఉండే గోపురం మీద మాత్రమే వర్షం కురిసిందట. అలా ఆవిడ సంప్రోక్షణ అయిందని నాన్నగారు చెప్పేవారు. ► నవరాత్రులు తొమ్మిది రోజులూ ఉదయం నుంచి ఉపవాసం ఉండి, రాత్రి అమ్మవారికి నివేదన చేశాక, ఇంటికి వచ్చి భోజనం చేస్తాను. అమ్మవారే ఏమీ తినకుండా ఉంటే, నేను తినడం ఏమిటి అనుకుంటాను. ► మహిషాసుర మర్దని అలంకారం రోజున ఏదో ఒక చిన్న దెబ్బ తగిలి, రక్తం చిందుతుంది. ► పుట్టినరోజు సందర్భంగా అందరూ దేవాలయానికి వచ్చి అమ్మను దర్శించుకుంటారు. నేను దుర్గమ్మ ప్రసాదం కావడంతో దుర్గాష్టమి రోజంతా ఆవిడ సన్నిధిలోనే ఉండే భాగ్యం నాకు కలిగింది. ► ఏటా నవరాత్రులలో అన్నపూర్ణ అవతారం రోజున కనీసం పదిమందైనా మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తారు. నలభై ఏళ్లుగా ఇలా జరుగుతూనే ఉంది. అమ్మవారి దయ. ► అమ్మవారి నగలు పోయిన రోజు.. తెల్లవారు జామునే గుడి తలుపులు తెరిచే బాధ్యత నాది. ఆ రోజు కూడా ప్రాతః కాలానే నిద్ర లేచి స్నానం చేస్తుండగా, నగలు పోయాయని ఫోన్ వచ్చింది. నోట మాట రాలేదు. ‘తాళాలు నా దగ్గరే ఉన్నాయి. ఈ చోరీ ఎలా జరిగిందా’ అని మధన పడ్డాను. వెళ్లి చూస్తే.. అమ్మవారి ముక్కుపుడక, బులాకీ, సూత్రాలు, నైజాం నవాబులు ఇచ్చిన బంగారు నాణెం అన్నీ పోయాయి. నిత్యం అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారు, ఆ రోజు నిరాలంకారంగా దర్శనమిచ్చేసరికి నాలో ఏదో తెలియని ఆవేదన కలిగింది. ఇంటికి వచ్చి చిన్నపిల్లవాడిలా ఏడ్చేశాను. వారం రోజుల దాకా సాధారణస్థితికి రాలేకపోయాను. మా మీద నింద రాకుండా ఆ తల్లి కాపాడిందని ఇప్పటికీ అనుకుంటాను. - డా. పురాణపండ వైజయంతి -
దుర్గా మాతపై దారుణమైన కామెంట్
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల ఆరాధ్య దైవం పై దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేసి ఓ ప్రొఫెసర్ చిక్కుల్లో పడ్డారు. దుర్గాదేవిని వేశ్యతో పోలుస్తూ కామెంట్ చేయటంతో పలువురు మండిపడ్డారు. ఈ మేరకు ఆయనపై పోలీస్ కేసు కూడా నమోదు అయ్యింది. ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ) పరిధిలోని దయాల్ సింగ్ కాలేజీలో కేదార్ కుమార్ మండల్ అసిస్టెంట్ ప్రోఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నాతో. ఈ నెల 22వ తేదీన తన ట్విట్టర్ పేజీలో ‘పురాణాల ప్రకారం దుర్గాదేవి ఓ వేశ్య’ అంటూ ఓ వ్యాఖ్యను పోస్ట్ చేశారు. అది చూసిన వారంతా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమ మనోభావాలను కేదార్ దెబ్బతీశాడంట ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ విద్యాసంస్థలు ఆయనపై లోధీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. తక్షణమే ఆయన్ను విధుల్లోంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నవరాత్రుల సమయంలోనే కేదార్ మండల్ ఇలాంటి కామెంట్లు చేయటంతో ఆ ప్రాంతంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. -
దుర్గాదేవి ఉత్సవాలు ప్రారంభం
పర్లాకిమిడి: స్థానిక శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలో దుర్గానవరాత్రి ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రత్యేక మండపంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ప్రముఖ పండితులు వనమాలి మణిశర్మ ఆధ్వర్యంలో మహిళలు కుంకుమ పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి దుర్గానవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. తొలిరోజు శ్రీబాల త్రిపురాసుందరిదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పర్లాకిమిడి వస్త్రవ్యాపారులు బరాటం నాగేశ్వరరావును కె.నారా యణరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేడీ యూత్ ప్రెసిడెంటు పిన్నింటి కృష్ణ తదితరులు విచ్చేశారు. -
దుర్గా నిమజ్జనంపై ఆంక్షలొద్దు
-
దుర్గా నిమజ్జనంపై ఆంక్షలొద్దు
► మొహర్రం రోజునా నిమజ్జనానికి హైకోర్టు అనుమతి ► ఆంక్షలు విధించడం పట్ల మమతా బెనర్జీపై కోర్టు మండిపాటు ► గొంతు కోసినా కుట్రకు బలికానన్న మమత కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని మొహర్రం పండుగనాడు సహా అన్ని రోజుల్లోనూ అర్ధరాత్రి 12 వరకు నిర్వహించేందుకు కలకత్తా హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. నిమజ్జనంపై ఆంక్షలు విధించినందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసింది. పౌరులు తమ మతాచారాలను పాటించకుండా అడ్డుకునే హక్కు ప్రభు త్వానికి లేదని తేల్చిచెప్పింది. మతి లేకుండా హక్కులను హరించకూడదని ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. మొహర్రం ఉరేగింపు, దుర్గా విగ్రహాల నిమజ్జనం ఒకేరోజున జరుగుతాయనీ, అందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించింది. మీకు కల వస్తే ఆంక్షలు విధించలేరు మొహర్రం ఊరేగింపు, నిమజ్జనం ఒకే రోజున చేపడితే మత కలహాలు చెలరేగుతాయంటూ నిమజ్జనంపై గతంలో మమత కొన్ని ఆంక్షలు విధించారు. విజయదశమి రోజున రాత్రి 10 గంటల వరకే నిమజ్జనానికి అనుమతించడంతోపాటు, మొహర్రం రోజైన అక్టోబరు 1న నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా, ఆ వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ తివారీ, జస్టిస్ హరీశ్ టాండన్‌ల ధర్మాసనం విచారించింది. ‘అధికారం ఉంది కదా అని మీరు (మమత) సరైన కారణాలు లేకుండానే ఇష్టం వచ్చినట్లు ఆంక్షలు విధిస్తున్నారు. శాంతి భద్రతలు క్షీణిస్తాయన్న ఊహలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించకూడదు. ఏదో అనర్థం జరగబోతోందని మీరు కలగన్నంత మాత్రాన ఆంక్షలు విధించలేరు’ అంటూ ధర్మాసనం మమతకు మొట్టికాయలు వేసింది. దుర్గామాత విగ్రహాలు, మొహర్రం ఊరేగింపునకు వేర్వేరు మార్గాలను నిర్దేశించాలనీ, ఊరేగింపు వెళ్లే దారుల గురించి ప్రజలకు తెలియజెప్పాలని కోర్టు ఆదేశించింది. కుట్రదారులదే బాధ్యత: మమత తీర్పు అనంతరం మమత బీజేపీని పరోక్షంగా ఉద్దేశించి మాట్లాడుతూ అక్టోబరు 1న హింస చెలరేగితే కుట్రదారులదే బాధ్యత అని అన్నారు. ‘నా గొంతు కోసినా సరే. కుట్ర కు నేను బలికాను. ఏం చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు’ అని ఆమె అన్నారు. -
అమ్మకు ఆగ్రహం తెప్పించరాదు
ఆత్మీయం మహిషాసుర సంహారం వల్ల శరన్నవరాత్రుల పూజలు ఆరంభమయ్యాయని భావిస్తారందరూ. కాని, వీటికి మూలకారకుడు కృతయుగంలోని దుర్గముడు. హిరణ్యాక్షుని మనుమడుదుర్గముడు. వాడు బ్రహ్మను గురించి తపస్సు చేసి, విప్రులు వేదాలు మరచిపోవాలనీ, అవి తనకే చెందాలనీ వరం కోరాడు. ఆ వరంతో వి్రçపులు వేదాలు మరచిపోయారు, యజ్ఞాలు ఆగిపోయాయి. వర్షాలు కురవక భూలోకవాసులు తల్లడిల్లిపోయారు. వారంతా అమ్మను ప్రార్థించగా, ఆమె వారికి ముందుగా ఆహారాన్ని పెట్టింది. అప్పటినుంచి అమ్మవారిని శాకంభరి అన్నారు. ఆపై దుర్గముడిని చంపివేసింది. వాడి చావుతో బ్రహ్మ ఇచ్చిన వరం తొలగిపోయి యథాస్థితి ఏర్పడింది. లోకం సుభిక్షమైంది. దుర్గముడిని చంపడం వల్ల అమ్మవారికి దుర్గ అని పేరు వచ్చిందని శ్రీమద్దేవీ భాగవతం చెప్తోంది. తల్లి, తన బిడ్డలు ఆకలితో ఉండటాన్ని చూడలేదు. అదేవిధంగా ఒకరి చెడు ప్రవర్తన మూలంగా మిగిలిన వారు బాధపడటాన్ని కూడా అమ్మ సహించలేదు. తప్పు చేసిన వారికి ఎంతటి శిక్ష అయినా విధిస్తుంది. మిగిలిన అందరికీ సుఖాన్ని, శుభాన్ని ప్రసాదిస్తుంది. అమ్మకు ఆగ్రహం తెప్పించకూడదు. ఆడవారికి కన్నీరు రానివ్వకూడదు. అది అర్ధాంగి అయినా, ఆడబిడ్డ అయినా... -
దుర్గా పూజలో చెఫ్‌లుగా సెక్స్ వర్కర్లు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో దుర్గా నవరాత్రుల సందర్భంగా సెక్స్ వర్కర్లు చెఫ్‌ల టోపీలు ధరించనున్నారు. ఆసియాలోనే అతి పెద్ద రెడ్‌లైట్ ఏరియా అయిన సోనాగచ్చి నగరంలోని సెక్స్ వర్కర్లు దుర్గా పూజ సందర్భంగా మత్స్యశాఖ ఏర్పాటు చేయనున్న ఫుడ్ కోర్టుల్లో చెఫ్‌గా పనిచేయనున్నారు. సెక్స్‌వర్కర్లకు ఆ వృత్తి నుంచి విముక్తి కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడుతున్న దర్బార్ మహిళా సమన్వయ కమిటీ(డీఎంఎస్సీ), ఎన్జీవో సంస్థలు ఈ ప్రాజెక్టుపై షెఫ్‌లుగా శిక్షణ ఇచ్చేందుకు ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఒక అవగాహనకు వచ్చాయి. డీఎంఎస్సీ కింద రిజిస్టర్ అయిన వారిలో 1.30 లక్షల మంది సెక్స్‌వర్కర్లు ఉన్నారు. దుర్గా పూజా సమయంలో కోల్‌కతాలోని వివిధ ప్రదేశాల్లో ఎనిమిది, బెంగళూరులో రెండు ఫుడ్ పెవిలియన్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అధిక శాతం మందిని బెంగళూరు పంపనున్నట్లు తెలిపారు. తమకు వంటవారు(కుక్)లు అవసరం ఉందని, డీఎంఎస్సీని సంప్రదించగా వారు అంగీకరించారని ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలిపింది. సజీవంగా ఉన్న చేపల ప్యాకేజీ, వాటి వంటకాల్లో ఈ సెక్స్‌వర్కర్లకు శిక్షణ ఇస్తామని కార్పొరేషన్ ఎండీ సౌమ్యజిత్ తెలిపారు. సోమవారం నుంచి ఈ శిక్షణ ఇవ్వనున్నారు. -
మొహర్రం నాడు నిమజ్జనానికి నో!
ఒకేరోజున దుర్గామాత నిమజ్జనం, మొహర్రం రావడంతో.. మమత సర్కారు నిర్ణయం.. మండిపడుతున్న బీజేపీ కోల్‌కతా: హిందువులు ఘనంగా నిర్వహించే దుర్గామాత విగ్రహాల నిమజ్జనం, ముస్లింలు భక్తిపూర్వకంగా సంతాపం పాటించే మొహర్రం ఒకేరోజున రావడం పశ్చిమ బెంగాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ రెండు కార్యక్రమాలు ఒకేరోజున రావడంతో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ బుధవారం దుర్గాపూజ నిర్వాహకులు, ముస్లిం మతపెద్దలు, ఇతర మతాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ రెండు వేడుకలు ఒకేరోజున ఉన్న నేపథ్యంలో మతసామరస్యాన్ని పాటించే దిశగా వ్యవహరించాలని ఆమె కోరారు. దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సెప్టెంబర్ 30వ తేదీన ప్రారంభం అవుతుందని, అయితే, అక్టోబర్ 1న మొహర్రం దృష్ట్యా ఆ రోజు విగ్రహాల నిమజ్జనానికి అనుమతించబోమని, అక్టోబర్ 2వ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు యథాతథంగా నిమజ్జనం సాగుతుందని ఆమె ఈ సమావేశంలో స్పష్టం చేశారు. మత ఉద్రిక్తతలు, ఘర్షణలు తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే అక్టోబర్ 1న దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి అనుమతించడం లేదని పేర్కొన్నారు. విగ్రహాల నిమజ్జనం, మొహర్రం ఊరేగింపులు ఎదురుపడితే.. అవాంఛనీయ ఘటనలు జరుగుతాయనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే, మమత నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ద్వారా హిందు, ముస్లింలను విడగొట్టడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి మమత సర్కారు ప్రయత్నిస్తున్నదని మండిపడింది. ముస్లింలను సంతృప్తి పరిచేందుకే మమత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించింది. -
వైభవంగా శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం
-విజయదుర్గా పీఠం 45వ వార్షికోత్సవాలు ప్రారంభం గురుహోరలో రాజమహేంద్రవరం విజయదుర్గా జూనియర్ కళాశాల కరస్పాండెంట్ పెదపాటి సత్యకనకదుర్గ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. పీఠంలో కొలువైన విజయదుర్గా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భద్రాచలం నుంచి వచ్చిన వేదపండితుడు సీతారామాంజనేయుల ఆధ్వర్యంలో అక్కడి ఆలయంలో మాదిరిగా శ్రీరామ సామ్రాజ్య పాదుకా పట్టాభిషేకాన్ని అర్చకులు వంశీకృష్ణ, సుదర్శనాచార్యులు, సి.మాధవాచార్యులు నిర్వహించారు. పాదుకా సమర్పణ, రాజముద్రిక, రాజదండకం, నందక, ఛత్రచామర, ఆభరణాల సమర్పణ, నదీజలాలు, తీర్థాలు, చతుర సముద్రాధి జలాలతో అభిషేకం, మంగళశాసనం తదితర పూజలను నిర్వహించారు. ఆలయ పురోహితులు శ్రీరామచంద్రుల వారు నాడు ధర్మబద్ధంగా అందించిన పాలనను, సామ్రాజ్య పాదుకా పట్టాభిషేక ఘట్టాలను వివరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. తొలుత స్వామి వారికి కళ్యాణం, అర్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు పీఠంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. స్టేట్ ఇనిస్టిట్యూట్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరు చిలకపాటి రాఘవాచార్యులు, విశాఖకు చెందిన వ్యాపారవేత్త ద్రోణంరాజు లక్ష్మీనారాయణ, నెల్లూరుకు చెందిన కోట అసోసియేట్స్ అధినేత కోట సునీల్‌కుమార్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి రీజనల్ కో ఆర్డినేటర్ కందర్ప హనుమాన్, వివిధ ప్రాంతాల ప్రముఖులు పూజల్లో పాల్గొన్నారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి.బాపిరాజు, పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన జరిగింది. -
సరస్వతీనమస్తుభ్యం..
శ్రీసరస్వతీ అమ్మవారిగా పూజలందుకున్న శ్రీవనదుర్గ మూడో రోజు ఘనంగా శ్రావణమాస జాతర మహోత్సవాలు అన్నవరం : రత్నగిరిపై జరుగుతున్న శ్రీవనదుర్గ అమ్మవారి శ్రావణమాస జాతర మహోత్సవాల మూడో రోజు శ్రావణశుద్ధ ద్వాదశి శుక్రవారం శ్రీవనదుర్గ అమ్మవారు శ్రీసరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి పూజలందుకున్నారు. ఉదయం 9.30 గంటలకు శ్రీవనదుర్గ అమ్మవారి ఆలయంలో రుత్వీకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవగ్రహ జపాలు, లింగార్చన, శ్రీచక్రార్చన, శ్రీ పురుష సూక్త పారాయణలు, మూలమంత్ర జపాలు, సూర్యనమస్కారాలు, సప్తశతీ పారాయణలు, మూలమంత్ర జపాలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. మూడోరోజు కూడా రుత్వీకులు చండీహోమం కొనసాగించారు. అనంతరం అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ప్రసాదాల నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు. వేదపండితులు, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు, స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, ప్రసాద్, మూర్తి, శ్రీవనదుర్గ అర్చకులు గాడేపల్లి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కిటకిటలాడిన దుర్గాలయాలు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ పూజ పర్వదినం సందర్భంగా రత్నగిరి దుర్గామాతలు శ్రీవనదుర్గ, శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయాలను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించి పూజలు చేశారు. దుర్గాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. -
మరో మెగా హీరోతో వినాయక్ 'దుర్గ'..?
ఖైదీ నంబర్ 150 సినిమాతో వంద కోట్ల వసూళ్లు సాధించిన స్టార్ డైరెక్టర్ వివి వినాయక్, ఇంత వరకు తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేయలేదు. అయితే చాలా రోజులుగా మెగా హీరోతోనే వినాయక్ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇదే విషయానికి సంబంధించిన మరో అప్ డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మెగా హీరోగా సాయిధరమ్ తేజ్‌తో వినాయక్ సినిమా చేయనున్నాడన్న వార్త చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా కోసం దుర్గ (వర్కింగ్ టైటిల్) అనే పవర్ ఫుల్ మాస్ కథను వినాయక్ సిద్ధం చేశాడట. కథ, మాటల రచయిత ఆకుల శివతో కలిసి వినాయక్, ఈ కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్న సాయిధరమ్ తేజ్ తదుపరి ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేయలేదు. -
అన్నదాతల ఆక్రందన
దుర్గ్: ఎంతో కష్టపడి పండిన పంటకు కనీస ధర దక్కకపోవడంతో అన్నదాత కడుపు మండింది. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కకపోవడంతో కర్షకులు కన్నెర్ర చేశారు. పెట్టుబడి సంగతి అలా ఉంచితే కనీస ధర కూడా రాకపోవడంతో ఛత్తీస్ గడ్ లోని టమాట పడించిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలో టమాట ధర రూపాయికి పడిపోవడంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏడు లారీల టమాటాలను రోడ్డుపై పడేసి తమ ఆవేదన తెలిపారు. ధంధా ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. అన్నదాతల ఆవేదనను ఎవరూ పట్టించుకోకపోవడం శోచనీయం. ఇటీవల కాలంలో టమాట ధరలు గణనీయంగా పడిపోయాయి. నిల్వచేసుకునే సౌకర్యం లేక అయినకాడికి అమ్ముకుందామని ఆశగా మార్కెట్లకు వచ్చిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో అన్నదాతలు చితికిపోతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన పాలకులు, అధికార యంత్రాంగం చేతులు కట్టుకుని చూస్తుండడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.