మాట్లాడుతున్న ఈవో ఎం.పద్మ, చైర్మన్ గౌరంగబాబు, పాలక మండలి సభ్యులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమం): దుర్గగుడి ఈవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి మొవ్వ పద్మ తనదైన శైలిలో మార్పులకు శ్రీకారం చుట్టారు. మహా మండపంలో జరుగుతున్న పలు ఆర్జిత సేవలను ఆలయ ప్రాంగణంలో నిర్వహించేందుకు పాలకమండలి సభ్యుల ఆమోదాన్ని పొందారు. బుధవారం మాడపాటి సత్రంలో పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. దుర్గగుడిపై త్వరలోనే కీలక మార్పులు చేసేందుకు రంగం సిద్ధమైంది. మహా మండపంలోని, 3, 4 అంతస్తులోకి దేవస్థాన పరిపాలనా విభాగాన్ని తీసుకువచ్చేందుకు ఈవో పద్మ తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు.
పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
శివరాత్రికి మల్లేశ్వరాలయ పనులు పూర్తికానందున ప్రత్యేక పూజలు, కల్యాణాన్ని నిలిపివేయాలని వైదిక కమిటీ నిర్ణయించింది. దీనిపై పాలకమండలి కూడా ఆమోదం తెలిపింది. కెనాల్‌రోడ్డులో జరిగే రథోత్సవంలో గంగా పార్వతి సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులు యధావిథిగా పాల్గొంటాయని పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి 26వ తేదీ మల్లేశ్వరస్వామి ఆలయ కళాన్యాస కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించేందుకు కమిటీ ఆమోదముద్ర తెలిపింది.
ఆలయ పరిసరాలలోనే ఆర్జిత సేవలు
శాంతి కల్యాణాన్ని రాజగోపు రం ఎదురుగా ఉన్న ఆశీర్వచన మండపంలోని, ఆశీర్వచన మం డపాన్ని ఆలయ ప్రాంగణంలోని కొబ్బరికాయలు కొట్టే ప్రదేశంలోకి, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాన్ని జై గంట వద్దకు, అష్టోత్తర, సహస్రనామార్చన పూజ లను అన్నదానం క్యూకాంప్లెక్స్‌లోకి, నటరాజ స్వా మి ఆలయ సమీ పంలోని యాగశాలలో రుద్రహోమం నిర్వహించాలని నిర్ణయించారు. అన్న ప్రా సనలు, అక్షరాభ్యాసాలు, నామకరణాలను ఇకపై నటరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న మండపంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. మల్లికార్జున మహామండపం తూర్పు భాగా న షెడ్డు నిర్మాణం చేయాలని దేవస్థానం నిర్ణయించింది. పాలకమండలి సభ్యులు ఆమోదం తెలపడంతో ప్రతిపాదనలను దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపనున్నారు.
అంతరాలయ టికెట్ ధర తగ్గింపునకు ప్రతిపాదన
అంతరాలయ టికెటు ధరను రూ.300 నుంచి రూ.250కి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పాలకమండలి మరో మారు ప్రభుత్వాన్ని కోరింది. అంతరాలయంలో జరిగే త్రికాల అర్చనలో మూడు షిప్టులలో రెండు షిప్టులను మాత్రమే అంతరాలయంలో నిర్వహిం చాలని, ఉదయం 11 గంటలకు జరిగే త్రికాల అర్చనను ఆల య ప్రాంగణంలో నిర్వహిస్తే భక్తుల దర్శనానికి ఇబ్బందులు ఉండబోవని పాలక మండలి భావిస్తుంది.
దాతలకు మరిన్ని సదుపాయాలు
ఆలయ అభివృద్ధితోపాటు అన్నదానానికి విరాళాలు ఇచ్చే దాతలకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని పాలక మండలి నిర్ణయించింది. రూ.లక్ష పైబడి రూ. 2లక్షలలోపు విరాళం ఇచ్చిన దాతలకు ఏడాదిలో రెండు పర్యాయాలు అమ్మవారి దర్శనం చేసుకునేఅవకాశం కల్పిస్తున్నామన్నారు. కుటుంబంలో ఆరుగురు సభ్యులకు మాత్రమే ఈ అవకాశాన్ని 10 ఏళ్లపాటు కల్పిస్తామన్నారు. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు విరాళం ఇచ్చిన దాతలకు ప్రతినెలా ఒకసారి అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా అనుమతిస్తామ న్నారు. రూ. 5 లక్షలు పైబడి విరాళం ఇచ్చిన దాతలకు ప్రత్యేక పాస్‌ను మంజూరు చేసి ఎప్పుడైనా అమ్మవారి దర్శనం చేసుకునే వీలు కల్పిస్తామన్నారు.
టెండర్ నిబంధనలకు సవరణ
ప్రస్తుతం దేవస్థానానికి సరుకులు పంపిణీ చేసేందుకు నిర్వహించే టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు ఆయా సంస్థలకు రూ.10 కోట్లు టర్నోవర్ ఉండాలనే నిబంధనలను పాలకమండలి సవరించింది. ఏడాదికి టర్నోవర్‌ను రూ.10 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గించడం వల్ల మరింత మంది వ్యాపారులు టెండర్ల పక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుందని పాలకమండలి సభ్యులు భావిస్తున్నారు. ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కమిషనర్‌కు పంపడం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment