padma
-
తల్లి, కుమారుడిని బలితీసుకున్న ఎర్త్ వైర్!
సామర్లకోట : విద్యుదాఘాతంలో 24 గంటల వ్యవధిలో తల్లీకుమారుడు మృతి చెందడంతో కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీర్రాఘవపురంలో విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీర్రాఘవపురానికి చెందిన చిట్టుమాని పద్మ(43) ఇంటికి సంబంధించి ఎర్త్ వైర్‌ను కొళాయి పక్కన గల చెట్టుకు చుట్టేశారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఇంటి ఎర్త్‌వైర్ తెగిపోవడంతో అలా చేయాల్సి వచ్చిoది. అయితే శనివారం పద్మ కొళాయి దగ్గర దుస్తులు ఉతికి గోడపై వాటిని ఆరబెడుతూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. అయితే బంధువులు, స్థానికులు గుండెపోటుతో మృతి చెందిందని భావించారు. కాగా, ఆదివారం ఉదయం మృతురాలి కుమారుడు చిట్టుమాని విశ్వేస్(23) టిఫిన్ చేశాక ఖాళీ ప్లేట్‌ను కొళాయి పక్కన పెట్టి చేతులు శుభ్రం చేసుకొంటున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. స్థానికులు అతనిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. విద్యుదాఘాతం కారణంగా తల్లీకొడుకులు మృతి చెందారని స్థానికులు నిర్ధారణకొచి్చ.. విషయాన్ని విద్యుత్ అధికారులకు తెలియజేశారు. వెంటనే ట్రాన్స్‌కో సిబ్బంది అక్కడకు చేరుకుని వైర్లను తొలగించారు. -
దళితులపై దాష్టీకం
ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నాయకుల దాషీ్టకాలు మరింత పెచ్చుమీరాయి. దళిత మహిళలను అకారణంగా చిత్రహింసలకు గురిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ధర్మవరం పట్టణంలోని లక్ష్మీనగర్ బండగుంత వద్ద దళిత మహిళలు పద్మ, కల్పన నివాసం ఉంటున్నారు. ఇంటికి ఎదురుగా ఉన్న కంపచెట్ల వల్ల ఇళ్లలోకి పాములు చేరుతున్నాయని, వాటిని తొలగించాలని మునిసిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో మునిసిపల్ సిబ్బంది సోమవారం కంపచెట్లు తొలగించేందుకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న 34వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ ముతుకూరు బీబీ.. ‘వాళ్లు వైఎస్సార్సీపీ వలంటీర్లుగా పనిచేశారు. వాళ్లు చెబితే కంపచెట్లు ఎలా తొలగిస్తార’ంటూ మునిసిపల్ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. దీంతో దళిత మహిళలకు, టీడీపీ వార్డు ఇన్చార్జ్ ముతుకూరు బీబీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీబీ దళిత మహిళలపై చేయిచేసుకుంది. దీంతో వారు కూడా ఆమెను ప్రతిఘటించారు. దీన్ని అవమానంగా భావించిన బీబీ తన సోదరుడైన నాగూర్ హుస్సేన్‌కు జరిగిన విషయం చెప్పింది. దీంతో అతను అనుచరగణంతో దళిత మహిళలను ఇష్టానుసారం చితకబాదారు. మహిళల ఛాతి, తలపై దాడి చేశారు. కొట్టొద్దంటూ కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదు. నాగూరు హుస్సేన్ గతంలో నేరచరితుడు కావడంతో మహిళల హాహాకారాలు విన్న స్థానికులు కనీసం విడిపించే ప్రయత్నం కూడా చేయలేదు. చివరకు బాధిత మహిళలు ఘటనా స్థలంలోనే అపస్మారక స్థితిలో పడిపోయారు. పట్టించుకోని పోలీసులు ఈ అమానుష దాడి సోమవారం జరిగింది. తీవ్రగాయాలతో ఉన్న బాధిత మహిళలు పద్మ, కల్పనను బంధువులు ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుల బంధువులు ధర్మవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వాస్పత్రిలో సైతం ఎంఎల్సీ (మెడికో లీగల్ కేస్) నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ అక్కడా పట్టించుకోలేదు.‘చంపేస్తారు.. కాపాడండి’ ‘సార్.. మేం దళిత మహిళలం. ఇంటిముందు కంపచెట్లు తొలగించమని మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినందుకు టీడీపీ నాయకులు చెప్పుకోలేని రీతిలో కులం పేరుతో తిడుతూ ఇష్టానుసారం చిత్రవథ చేసి కొట్టారు. పోలీసులకు చెబితే ఎవరూ పట్టించుకోలేదు. మేం సాధారణ మహిళలం. భవిష్యత్‌లో మమ్మల్ని బతకనిస్తారన్న నమ్మకం లేదు. కచి్చతంగా చంపేస్తారు. దయవుంచి కాపాడండి’ అంటూ ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్‌ను, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్‌ను సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులు ధర్మవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో నాగూర్‌హుస్సేన్, ముతుకూరు బీబీ, స్టాలిన్, జగ్గు, కుళ్లాయప్ప, జగదీ‹Ù, అల్లాబకాష్ తమపై దాడి చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వివరణ కోరేందుకు టూటౌన్ సీఐ అశోక్‌కుమార్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
కోడలి హత్య కేసులో అత్తకు రెండు జీవిత ఖైదులు
ఖలీల్‌వాడి: కట్నం కోసం కొడుకుతో కలిసి కుట్రపన్ని కోడలి కిరాతకంగా హతమార్చిన చేసిన కేసులో బానోత్ పద్మ అనే దోషికి రెండు జీవిత కారాగార శిక్షలు విధిస్తూ నిజామాబాద్ జిల్లా, సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. ప్రధాన ముద్దాయి బానోత్ రామ్‌సింగ్ కోర్టు వాయిదాకు గైర్హాజరవడంతో అతనిపై బెయిల్‌కు వీల్లేని అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ముద్దాయి కోర్టుకు హాజరయ్యాక శిక్ష ఖరారు చేయనున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని... నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం శివ తండాకు చెందిన బానోత్ రామ్‌సింగ్... ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన యెండల రాధ సికింద్రాబాద్‌లోని కళామందిర్ షోరూంలో కలిసి పనిచేసేవారు. దీంతో వారి మధ్య ప్రేమ చిగురించి 2020 జనవరి 30న నవీపేట్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. రాధ తల్లిదండ్రులు పేదలు కావడంతో పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇవ్వలేదు. అయితే పెళ్లియిన కొన్ని రోజులకే కట్నం కోసం రాధకు వేధింపులు మొదలయ్యాయి. రూ. లక్ష నగదుతోపాటు బంగారాన్ని తల్లిదండ్రుల నుంచి తేవాలని భర్త, అత్త పద్మ ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. అదే సమయంలో రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ విధించడంతో రామ్‌సింగ్ ఉద్యోగం కోల్పోయాడు. మరో పెళ్లి చేసుకుంటే ఆర్థికంగా కలిసొస్తుందని భావించాడు. ఇందుకు అడ్డంకిగా ఉన్న భార్యను చంపాలని తల్లితో కలిసి కుట్రపన్నాడు.బైక్‌పై తీసుకెళ్లి.. చుట్టాల ఇంటికి వెళ్లొద్దామని రాధను నమ్మించిన రామ్‌సింగ్, పద్మ ఆమెను బైక్‌పై తీసుకెళ్లారు. దగ్గర దారిలో వెళ్దామంటూ రాధను మాక్లూర్ మండలం రాంచంద్రాపల్లి అటవీ ప్రాంతంలోని బాసం లొద్ది గుట్టపైకి తీసుకెళ్లారు. ముందు నడుస్తున్న రాధపై వెంట తెచ్చుకున్న పెట్రోల్, కిరోసిన్‌ను అత్త పోసింది. వెంటనే రామ్‌సింగ్ అగ్గిపుల్ల గీసి నిప్పంటించడంతో మంటలకు తాళలేక రాధ విలవిల్లాడింది. అయినా ఆమె బ్రతికి ఉండటంతో బండ రాళ్లతో తలపై కొట్టి తీవ్రంగా గాయపర్చారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఒక గుంతలో పడేసి సజీవదహనం చేశారు. ఈ కేసును ఛేదించిన అప్పటి నిజామాబాద్ సౌత్ సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ కుమార్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన జడ్జి తాజాగా ముద్దాయి పద్మకు జైలుశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. వరకట్న వేధింపులు, హత్య చేసినందుకు ఒక జీవితఖైదు విధించడంతోపాటు కుట్ర కేసులో మరో జీవిత ఖైదు, సాక్ష్యాధారాలను మాయం చేసిన నేరానికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రధాన ముద్దాయిపైనా నేరారోపణలు రుజువు అయినట్లు నిర్ధారించారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్ వాదనలు వినిపించారు. -
జరిగిన మేలు చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా?: కత్తి పద్మ
సాక్షి, విశాఖపట్నం: కమ్యూనిస్టు నేతలుగా మేమంతా పోరాటం చేసేది పేదల మేలు కోసమేనని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు మేలు జరుగుతుందని కమ్యూనిస్ట్ నేత కత్తి పద్మ అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఇల్లు లేని వారికి సీఎం జగన్ ప్రభుత్వం ఇల్లు ఇస్తుందన్నారు. గీతాంజలి మృతిపై ఆమె స్పందిస్తూ.. ఇల్లు తీసుకున్న లబ్ధిదారుల్లో గీతాంజలి ఒకరని, ఆమెకు జరిగిన మేలు చెప్పినందుకు ఈ సోషల్ మీడియా మూకలు ఆమెపై మానసికంగా దాడి చేసి ఆమెను హత్య చేశాయన్నారు. గీతాంజలిని ట్రోల్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ట్రోల్ చేయాలంటూ కొన్ని పార్టీలు డబ్బులు ఇచ్చి వారిని ప్రేరేపిస్తున్నాయని, అందుకే ఇంతటి ఘోరం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గీతాంజలి కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించడం మంచి పరిణామం. ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదలకు మంచి జరుగుతుందని కత్తి పద్మ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: మీరో ‘గీతాంజలి’ కావద్దు -
సంతానం కోసం 18 ఏళ్ల నిరీక్షణ.. బిడ్డ పుట్టగానే తల్లీ..
కరీంనగర్: మాతృత్వం కోసం ఆ తల్లి కోటి కలలు కన్నది. దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం గర్భవతి కావడంతో మురిసిపోయింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆ మాతృమూర్తి కన్నబిడ్డను చూడకుండానే కన్నుమూసింది. ఈ సంఘటన వేములవాడలోని నాంపల్లి ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన చేకూట తిరుపతికి బావుసాయిపేటకు చెందిన పద్మ(35)కు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. చాలా ఏళ్ల తర్వాత గర్భం దాల్చడంతో వేములవాడ మున్సిపల్ పరిధి గల నాంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రతీ నెల వైద్యసేవలు పొందింది. ఇందులో భాగంగానే ప్రసూతి కోసం ఆదివారం ఆస్పత్రికి చేరుకుంది. సోమవారం ఉదయం ఆపరేషన్ చేయడంతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొంత సమయానికి ఆమె పరిస్థితి విషమిస్తుందని వైద్యులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. వెంటనే కుటుంబ సభ్యులు కరీంనగర్ తీసుకెళ్లగా.. అక్కడికి చేరుకోగానే ఆమె మృతిచెందింది. దీంతో ఆమె బంధువులు నాంపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి చేరుకుని నిరసన తెలిపారు. ఈ ఘటనపై వేములవాడ పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఇవి చదవండి: కంటైనర్ ఢీ.. యువ ఇంజనీర్ తీవ్ర విషాదం! -
పాత కక్షలతో మహిళను గొడ్డలితో దారుణంగా..
మహబూబాబాద్: పాత కక్షల నేపథ్యంలో ఓ మహిళపై గొడ్డలితో దాడికి పాల్పడగా ఆమె మృతి చెందింది. ఈ ఘటన మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పాత కక్షల నేపథ్యంలో అంబట్పల్లి అమరేశ్వర ఆలయంలో బుధవారం ఉదయం అయ్యప్ప మాలధారుడు పుట్ట నరసింహస్వామి.. మరో మాలధారుడు నల్ల అవినాశ్‌పై కత్తితో దాడికి పాల్పడగా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనను చూసిన సహా మాలధారులు ఇద్దరిని సముదాయించి ఇంటికి పంపించారు. అనంతరం నరసింహస్వామి గొడ్డలితో అవినాశ్ ఇంటికి చేరకున్నాడు. అక్కడ అతడు కనిపించకపోవడంతో ఆగ్రహం చెందిన నరసింహస్వామి.. అవినాశ్ తల్లి పద్మ (40)పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న పద్మను స్థానికులు మహదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో పద్మ మృతదేహానికి ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించి అంబట్పల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై మృతురాలి భర్త నల్ల భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కిరణ్‌కుమార్, ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు. ఇవి చదవండి: బర్త్‌డేకు ఇదే నా చిన్న గిఫ్ట్ అంటూ.. సెల్ఫీతో యువకుడి విషాదం! -
అనుమానాస్పద స్థితిలో భార్య మృతి! భర్తే ఇలా చేశాడని..
సాక్షి, మెదక్: అనుమానాస్పద స్థితిలో భార్య మృతి చెందగా భర్తే ఆమెను హత్య చేశాడని ఆరోపిస్తూ బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మిరుదొడ్డిలో శనివారం జరిగింది. మహిళ బంధువులు గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. మిరుదొడ్డికి చెందిన కమలాకర్‌తో వర్గల్ మండలం గుంటి పల్లి గ్రామానికి చెందిన పద్మ(22)కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నాళ్లకు వారి మధ్య కలహాలు నెలకొనడంతో రెండు, మూడు సార్లు పెద్దలు నచ్చజెప్పారు. ఇటీవల అదనపు కట్నం తీసుకురావాలని భార్య పద్మను కమలాకర్ వేదించడంతో రెండు రోజులుగా వారి మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున పద్మ ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందింది. దీంతో ఆమె భర్తతో పాటు అత్తమాములు ఇంటి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పద్మ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. కమలాకర్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న గజ్వేల్ ఏసీపీ ఎం.రమేశ్, సిద్దిపేట రూరల్ సీఐ చేరాల్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని క్లూస్ టీంతో పరిశీలించారు. ఆందోళనకు దిగిన పద్మ బంధువులకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. పద్మ తండ్రి దుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ ఏసీపీ ఎం. రమేశ్ తెలిపారు. ఇవి కూడా చదవండి: లిఫ్ట్ లేదన్నది గమనించకుండా అడుగుపెట్టడంతో.. తీవ్ర విషాదం! -
'అధ్యక్షా..!' అనేదెవరో?
సాక్షి, వరంగల్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఓ ప్రత్యేకత కలిగి ఉంది. ఇక్కడి నుంచి మూడు ప్రధాన పార్టీల అధ్యక్షులు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆయా పార్టీల ప్రెసిండెట్లు తలపడుతుండగా పోటీ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు గెలుపొంది అసెంబ్లీలో అధ్యక్షా.. అంటారో అనే విషయంలో ఆయా పార్టీల నేతలతోపాటు ఓటర్లలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ నాలుగు పర్యాయాలు వరంగల్ పశ్చిమ నుంచి విజయం సాధించి, ఐదో విజయం కోసం ధీమాగా ముందుకు సాగుతున్నారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తొలిసారి పార్టీ అభ్యర్థిత్వం దక్కించుకుని అసెంబ్లీలో అడుగిడడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అదే విధంగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి తొలిసారి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు విజయం కోసం ఎవరికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఐదో విజయం కోసం దాస్యం వినయ్ భాస్కర్.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ ఐదో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా ఉద్యమకారులకు అండగా నిలవడం, ఉద్యమకారుడిగా ప్రజల్లో గుర్తింపు ఉండడం, నిత్యం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల ముంగిటికి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వినయ్ భాస్కర్‌కు కలిసొచ్చే అంశాలు. ప్రధానంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బబ్దిదారులతో పాటు నియోజకర్గంలో వైద్య చికిత్స కోసం పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం అందించారు. కార్మికులకు సొంతగా ప్రీమియం చెల్లించి వారికి గుర్తింపు కార్డులు ఇప్పించి బీమా సౌకర్యం కల్పించారు. దీంతోపాటు ఈ నెల 28న నిర్వహించిన సభకు సీఎం కేసీఆర్ రావడంతో తాను గెలుస్తాననే ధీమాలో ఉన్నారు. మొదటిసారి శాసనసభకు నాయిని రాజేందర్ రెడ్డి పోటీ.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నాయిని రాజేందర్ రెడ్డి మొదటిసారి శాసన సభ ఎన్నికల బరిలో నిలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డోలాయమానంలో పడిన సమయంలో కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. ఉమ్మడి వరంగల్, జిల్లాల పునర్విభజన తర్వాత హనుమకొండ, వరంగల్ జిల్లాలో పార్టీని కాపాడి ఈసారి టికెట్ సాధించారు. 2014, 2018లో పార్టీ టికెట్ ఆశించారు. ఆ రెండు సార్లు రాకపోయినా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈసారి అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడంతో బరిలో దిగారు. నిత్యం ప్రజల మధ్య ఉండడంతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, నాలుగు పర్యాయాలుగా వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా ఉండి ఆయనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత నాయిని రాజేందర్ రెడ్డికి అనుకూలించే అంశాలు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, జార్ఖండ్ సీఎం బూపేష్ భఘేల్, సినీ నటి విజయ శాంతి చేసిన ప్రచారం తనకు విజయం చేకూరుస్తుందనే విశ్వాసంతో ఉన్నారు. 'పద్మ' విశసించేనా..!? వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన రావు పద్మ, పశ్చిమ నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. కాగా, రావు పద్మ 2014 ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నుంచి టికెట్ అశించి చివరకు వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పొందారు. వరంగల్ మహానగరంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ సిటీ, అమ్మత్, హృదయ్ పథకాల ద్వారా జరిగిన అభివృద్ది, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై ఉన్న అసంతృప్తి, కాజీపేటలో రైల్వే ఓవరాయిలింగ్ యూనిట్, వ్యాగన్ తయారీ పరిశ్రమ మంజూరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు అవకాశం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, ప్రధాని మోదీకి ప్రజాదరణ ఉండడం, డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి, మహిళల ఓట్లు వంటివి రావు పద్మకు కలిపోచ్చే అంశాలు. రాష్ట్రంలో జనసేనతో పొత్తు, పవన్ కళ్యాణ్ రాక, బీజేపీ నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి, మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి, ఇతర అగ్ర నాయకుల ప్రచారం చేయడం వల్ల రావు పద్మ తాను గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. ఇవి చదవండి: జంగ్ తెలంగాణ: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది! -
పవన్ కళ్యాణ్ బండారం బట్టబయలు చేసిన పసుపులేటి పద్మ
-
పట్టణాల్లో ట్రెండీగా మారుతున్న 'శాశ్వత వ్యవసాయం'
పర్యావరణ అత్యవసర పరిస్థితులు చుట్టుముడుతున్న నేపథ్యంలో కాంక్రీటు అరణ్యాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వృత్తి నిపుణులు మేలుకొంటున్నారు. తిరిగి ప్రకృతి వైపు తెలివిగా అడుగులు వేస్తున్నారు. నగరాలు, పట్టణాల పరిసర ప్రాంతాల్లో కొద్దో గొప్పో సొంత భూమి సమకూర్చుకొని తాము తినాలనుకునే పంటలను తామే పండించుకొనే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. తెలుగు నాట కోవిడ్‌కు ముందే ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పుడు మరింత పుంజుకుంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో పర్మాకల్చర్ను అనేక కుటుంబాలు అనుసరిస్తున్నాయి. దాన్నే జీవనశైలిగా మార్చుకుంటున్నాయి. ప్రముఖ పర్మాకల్చర్ నిపుణులు డా. నరసన్న, పద్మ శిక్షణ ఇస్తున్నారు. శాశ్వత ఆహార, ఆరోగ్య, పర్యావరణ సేవలందించే సమగ్ర స్వీయ సేంద్రియ సేద్య విజ్ఞానపు వెలుగుదారులు పరుస్తున్నారు. ‘పర్మాకల్చర్’ అంటే..? పర్మనెంట్ + అగ్రికల్చర్. శాశ్వత ప్రయోజనాలను అందించే ఓ నూతన వ్యవసాయ విధానం. ఇంకా విడమర్చి చెప్పుకోవాలంటే.. పర్మాకల్చర్ (శాశ్వత వ్యవసాయం) కేవలం సీజనల్ పంటలను సేంద్రియంగా పండించే పద్ధతి మాత్రమే కాదు. భారతీయులకు, ముఖ్యంగా తెలుగు నేలకు, పర్మాకల్చర్ భావనను పరిచయం చేసిన కీర్తి శేషులు డాక్టర్ వెంకట్ మాటల్లో చెప్పాలంటే.. ‘పర్మాకల్చర్ అన్నది ఒక ప్రత్యామ్నాయ జీవన విధానం. జీవావరణంలో ఒక భాగమై దోపిడీకి గురికానివ్వని సహకార సంబంధాలపై ఇది ఆధారపడి ఉంటుంది. భూమి, ప్రజల సంరక్షణకు అవసరమైన సుస్థిర, నైతిక, మనగల వ్యవస్థల రూపకల్పనకు ఇది పనిచేస్తుంది!’ ఆస్ట్రేలియాలో పుట్టి.. అంతటా విస్తరించి.. శాశ్వత వ్యవసాయ భావన దాదాపు ఏభయ్యేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో పురుడుపోసుకుంది. ఒకటి రెండు దేశాలు మినహా ప్రపంచం అంతటా విస్తరించింది. 1970వ దశకం మొదట్లో ఆస్ట్రేలియాలోని తాస్మానియాకి చెందిన డా. బిల్ మాలిసన్ పర్మాకల్చర్కు రూపుకల్పన చేశారు. ఈ కృషిలో డేవిడ్ హోమ్గ్రెన్ కూడా భాగస్వామి. జీవావరణ విధ్వంసానికి, వనరుల విధ్వంసానికి కారణభూతమవుతున్న ఏకపంటల (మోనోకల్చర్) పారిశ్రామిక వ్యవసాయ పద్ధతికి ప్రత్యామ్నాయంగా దీన్ని రూపొందించినందుకు 1981లో ఆయనకు రైట్ లైవ్లీహుడ్ అవార్డు (దీన్ని ప్రత్యామ్నాయ నోబుల్ బహుమతి అని అంటారు) లభించింది. బిల్ మాలిసన్ అనేకసార్లు మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పర్యటించి పర్మాకల్చర్ భావనను చిన్న, సన్నకారు రైతుల కమతాలకు అనుసంధానం చేయటంపై ఆచరణాత్మక ప్రయోగాలు చేశారు. పేదరిక నిర్మూలన, వర్షాధార సేద్యం, పశువులను వ్యవసాయంతో అనుసంధానం చేయటం, చిన్న కమతాలను స్వయంపోషకంగా రూపొందించడం, పండ్ల తోటల్లో అంతర పంటల సాగు వంటి అంశాలపై కృషి చేశారు. బిల్ భావాలతో ప్రభావితులైన అరోరా, డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో పర్మాకల్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. స్వయం సమృద్ధ జీవనం కేవలం వార్షిక పంటలు పండించటమే కాకుండా వ్యవసాయాన్ని శాశ్వత ప్రాతిపదికగా చేపట్టటానికి అవసరమైన చట్రంగా పర్మాకల్చర్ పద్ధతిని మొదట రూపొందించారు. బహువార్షిక చెట్లు, పొదలు, వార్షిక, ఆహార ధాన్యపు పంటలు, మూలికలు, కూరగాయలు, పుట్టగొడుగులు, దుంపలు వంటి పలు పంటలతో పాటు పశువుల పెంపకాన్ని ప్రయోజనకరంగా చేపట్టి.. కుటుంబ, గ్రామీణ స్థాయిలో ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి తొలుత ఈ విధానాన్ని రూపొందించారు. అయితే, కాలక్రమంలో పర్మాకల్చర్ ఆచరణలో పరిపుష్టమవుతూ మరింత విస్తృత అర్థాన్ని సంతరించుకుంది. ఇప్పుడు పర్మాకల్చర్ అంటే కుటుంబ స్థాయిలో ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించటం మాత్రమే కాదు. భూమి, సమాచారం, ఆర్థిక వనరులు, ప్రజలకు అందుబాటులో లేకపోతే ఆహారంలో స్వయం సమృద్ధి సాధ్యం కాదు. ఈ పుడమిలోని సహజ వనరులను అంతరింపచేయకుండా, కలుషితం చేయకుండా, నాశనం చేయకుండా ప్రజలు తమ భౌతిక, ఇతర అవసరాలను తీర్చుకునేలాగా స్వయం సమృద్ధ, స్వయం నిర్వహిత విధానాలను రూపొందించుకోవటానికి.. భూమితో సహా అన్ని వనరులను ప్రజలు సమకూర్చుకోవటానికి వివిధ ఎత్తుగడలతో కూడిన సమగ్ర జీవన విధానం అన్న విస్తృతార్థాన్ని పర్మాకల్చర్ సంతరించుకుంది. భవిష్యత్తు తరాలపై భారం పడకుండా.. కేవలం వ్యవసాయం, ఆహారం గురించి మాత్రమే కాకుండా ప్రకృతి వనరులతో మానవులకు ఉండవలసిన సంబంధాలు, ఆ వనరులను నైతికబద్ధంగా, విజ్ఞతతో, జాగ్రత్తగా వాడుతూ మన బాధ్యతారహితమైన చర్యల వల్ల భవిష్యత్తు తరాలపై భారం పడకుండా చూడటమే పర్మాకల్చర్‌లో కీలకం అంటారు డాక్టర్ వెంకట్. మనం ఎంతటి జ్ఞానం.. సాంకేతిక విజ్ఞానం కనబరిచినా, సృజనాత్మకతను ప్రదర్శించినా వృక్ష జగత్తులోని సహజ, జీవ–పోషక ప్రక్రియలకు ప్రత్యామ్నాయాలను కనుగొనలేం. పునరుద్ధరించిన వ్యవసాయ జీవావరణంలో ఈ ప్రక్రియలు బలపడేలా చెయ్యటమే పర్మాకల్చర్ లక్ష్యం. వ్యవసాయం మానవ చర్య. కాబట్టి మన వ్యవసాయం ప్రకృతికి సాధ్యమైనంత దగ్గరగా ఉండాలి. ప్రకృతి నియమాలను అతిక్రమించకుండా ఉండాలని పర్మాకల్చర్ దృక్పథం చెబుతుంది. 24 ఏళ్ల ‘అరణ్యం వ్యవసాయ కుటుంబాల్లో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించిన కొప్పుల నరసన్న, పునాటి పద్మ తొలి దశలో జహీరాబాద్‌లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో రిసోర్స్ పర్సన్లుగా ఉంటూ రైతులతో పదేళ్లకు పైగా పనిచేశారు. బిల్ మాలిసన్, డా. వెంకట్ సాంగత్యంలో శాశ్వత వ్యవసాయాన్ని ఔపోశన పట్టిన నరసన్న, పద్మ అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థను ఏర్పాటు చేసి స్థానిక రైతాంగంలో పర్మాకల్చర్ వ్యాప్తికి శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం సమీపంలోని బిడకదిన్నె గ్రామంలో 1999లో 11.5 ఎకరాలను కొనుగోలు చేసి ‘అరణ్య శాశ్వత వ్యవసాయ క్షేత్రా’న్ని నెలకొల్పారు. తొలి దశలో టేకు సహా అనేక స్థానిక అటవీ జాతుల చెట్లతో పాటు పండ్లు, కలప జాతుల చెట్లను పెంచుతూ వచ్చారు. ఈ క్షేత్రం దేశంలోనే పర్మాకల్చర్ డిజైన్ కోర్సు (పీడీసీ) శిక్షణకు కేంద్ర స్థానంగా మారింది. కొప్పుల నరసన్న, పద్మ, స్నేహ బృందం ప్రతి రెండు నెలలకోసారి 15 రోజుల రెసిడెన్షియల్ పీడీసీ నిర్వహిస్తున్నారు. పొలంలోనే ఉంటూ, కలసి పనిచేస్తూ శాశ్వత వ్యవసాయాన్ని నేర్చుకోదలచిన వారికి, ముఖ్యంగా అంతకుముందు వ్యవసాయం తెలియని వారికి ‘అరణ్య’ క్షేత్రం మంచి సాగు‘బడి’. పర్మాకల్చర్ డిజైన్ అంటే? ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవటంతోపాటు ప్రత్యేక డిజైన్ ప్రకారం పంటల జీవవైవిధ్యం ద్వారా ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించే దారులను పర్మాకల్చర్ చూపుతుంది. భూసారం పెంపుదల.. వాన నీటి సంరక్షణకు కాంటూరు కందకాలు తీయటం.. పెనుగాలులు/గాడ్పుల నుంచి పంటలను కాపాడుకోవడానికి 12 రకాల అటవీ జాతి చెట్లను పొలం దక్షిణ సరిహద్దులో 6 మీటర్ల వెడల్పున పెంచటం.. గడ్డీ గాదం, ఆకులు అలములతో కంపోస్టు చేయటం.. ఇవన్నీ నరసన్న,పద్మ నెలకొల్పిన అరణ్య పర్మాకల్చర్ క్షేత్రం డిజైన్‌లో ముఖ్యాంశాలు. భూమిని అనేక జోన్లుగా విభజించి.. ఏడాది పొడవునా సీజనల్ పండ్లు, కూరగాయలను డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. ఇతర జోన్లలో ఖరీఫ్, రబీ కాలాల్లో వర్షాధారంగా ధాన్యపు పంటలను పండిస్తున్నారు. జోన్ 1: ప్రధాన ద్వారం దగ్గర ఉండే జోన్ 1లో వంట గది, స్టోర్ రూమ్, వాలంటీర్ల గది, బావితో పాటు కొన్ని అటవీ జాతుల చెట్లు ఉంటాయి. అనేక రకాల పండ్ల మొక్కలను వృత్తాలు(సర్కిళ్లు)గా నాటి సాగు చేస్తున్నారు. వృత్తం చుట్టూతా మునగ, బొప్పాయి, అరటి, చెన్నంగి, చిలగడదుంప వంటి పంటలతో పాటు నిమ్మగడ్డి వంటి ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. జోన్ 2: నర్సరీ, కూరగాయల తోట ఉంటాయి. జోన్ 3: ధాన్యపు పంటల విభాగాలు 3, కూరగాయలు పండించే 3 విభాగాలు, వాన నీటి కుంట ఉంటాయి. జోన్ 4: పండ్ల చెట్లతో పాటు అటవీ జాతుల చెట్లు ఉంటాయి. బోదెలపై కూరగాయలు కూరగాయల విభాగంలో కాంటూరు ప్రకారం ఎస్ ఆకారంలో బోదెలు తోలి అనేక రకాల కూరగాయలు, పండ్ల మొక్కలు సాగు చేస్తున్నారు. కాంటూరు బోదెలను ఎస్ ఆకారంలో ఏర్పాటు చేయటం వల్ల ఎండ, గాలి, నీరు వంటి ప్రకృతి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవటానికి వీలవుతోంది. అరణ్య వ్యవసాయ క్షేత్రంలో కూరగాయలకు మాత్రమే డ్రిప్‌తో నీటిని అందిస్తున్నారు. జొన్న, శనగ, కంది తదితర పంటలను వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. పంట మోళ్లతో కంపోస్టు పొలం లోపలి వనరులను సమర్థవంతంగా పునర్వినియోగించుకోవాలని, బయటి నుంచి ఎటువంటి ఎరువూ తెచ్చి పంటలకు వేయకూడదన్నది పర్మాకల్చర్‌లో మరో ముఖ్యసూత్రమంటారు నరసన్న. పొలంలో పంటల నుంచి వచ్చిన మోళ్లు, రాలిన ఆకులు, కొమ్మలు, రెమ్మలను మూలన ఒక గుంత తవ్వి కంపోస్టు తయారు చేసి పంటలకు వేస్తున్నారు. పర్మాకల్చర్ సాంఘిక బాధ్యతతో స్థానిక పంటల జీవవైవిధ్యాన్ని పరిరరక్షించటం నేర్పిస్తుందని నరసన్న అంటారు. సొంత తిండి పంటల విత్తనాలను నిలబెట్టుకోవటమే రైతులకున్న తొలి కర్తవ్యంగా పర్మాకల్చర్ నొక్కిచెబుతుంది. సొంత విత్తనాన్ని కోల్పోయిన రైతు, జాతి ఆహార సార్వభౌమత్వాన్ని కోల్పోయినట్టేనని ఆయన అంటారు. అందుకే, అన్నదాతా సుఖీభవకన్నా ముందు విత్తు దాతా సుఖీభవ అంటారాయన! కుటుంబానికి ఎంత క్షేత్రం కావాలి? శాశ్వత వ్యవసాయ పద్ధతుల్లో ఒక పొలం పూర్తిస్థాయిలో ఫలితాలను అందించాలంటే సారం కోల్పోయిన భూమి పునరుజ్జీవం పొందాలి. అందుకు తగినంత సమయం పడుతుంది. డిజైన్ ప్రకారం వాన నీటి సంరక్షణ, వివిధ స్థానిక జాతలు మొక్కలు నాటడం, కంపోస్టు తయారీ, అన్ని పనులనూ వ్యక్తిగత శ్రద్ధతో రైతు కుటుంబం స్వయంగా చేసుకుంటూ వెళితే 3–4 ఏళ్ల సమయం పడుతుంది. అన్ని వనరులూ సమకూర్చుకొని ముందడుగు వేయాలి. ఒక అంచనా ప్రకారం.. నలుగురైదుగురి కుటుంబానికి ఏడాది పొడవునా పండ్లు, కూరగాయలు అందించడానికి 1–2 ఎకరాల పర్మాకల్చర్ ఫామ్ చాలు. వీటితో పాటు ధాన్యాలు కూడా సమకూర్చుకోవాలంటే ఆ కుటుంబం కనీసం 4–5 ఎకరాల్లో ఫామ్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆలోచించుకొని స్థిరంగా అడుగులు వేస్తున్న కుటుంబాలు శాశ్వత వ్యవసాయ సత్ఫలితాలను అందుకుంటున్నాయి. పరిసరాలకు మధ్య సుహృద్భావ సంబంధం.. ప్రకృతిలోని జీవావరణ వ్యవస్థలను పోలిన వైవిధ్యం, స్థిరత్వం, ఆటుపోట్లను తట్టుకునే గుణం కలిగిన వ్యవసాయ ఉత్పాదక జీవావరణ వ్యవస్థలుగా వ్యవసాయ క్షేత్రాలను రూపొందించి, నిర్వహించటమే పర్మాకల్చర్. అది ప్రజలకు, వారి పరిసరాలకు మధ్య ఒక సుహృద్భావ సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ప్రజల ఆహార, ఆవాస, ఇంధన, ఇతర భౌతికమైన, భౌతికేతర అవసరాలను సుస్థిర పద్ధతిలో తీరుస్తుంది. – బిల్ మాలిసన్, పర్మాకల్చర్ పితామహుడు (‘పర్మాకల్చర్.. ఎ డిజైనర్స్ మాన్యువల్’ నుంచి) ఇంటిల్లిపాదీ ప్రకృతితో మమేకమై.. అబిద్ అలి.. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. 2019లో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం నారెగూడెంలో 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సోదరుడు షబ్బర్, మరో నాలుగు కుటుంబాలతో కలసి జీవిస్తున్నారు. అనహద్ ఎకో కమ్యూనిటీ అని పేరుపెట్టారు. మట్టి ఇటుకలు, స్థానిక సామాగ్రితో పర్యావరణహితమైన ఇళ్లను నిర్మించుకొని పర్మాకల్చర్ పద్ధతుల్లో పంటలు పండించుకుంటూ జీవిస్తున్నారు. తమ పిల్లలకు తామే చదువు చెప్పుకుంటున్నారు. ఇంటి పక్కనే 3–4 ఎకరాల్లో పండ్ల చెట్లతో కూడిన అడవిని సాగు చేస్తున్నారు. ‘ఫుడ్ ఫారెస్ట్ కొద్ది సంవత్సరాల్లో పూర్తిస్థాయిలో పెరిగిన తర్వాత తరతరాలకు నిరంతరం పండ్లనిస్తుంది. మా ఆహారం మేము పండించుకుంటూ, ఆరోగ్యంగా, ఆనందంగా కలసిమెలసి ఇంటిల్లపాదీ ప్రకృతితో మమేకమై జీవించాలన్నదే ఆకాంక్ష’ అన్నారు అబిద్. పర్మాకల్చర్ జీవితాన్ని మార్చేసింది! విద్యారావు హైదరాబాద్‌కు చెందిన మాజీ నటి. వికారాబాద్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో చక్కని ఇల్లు నిర్మించుకొని పర్మాకల్చర్ పద్ధతిలో కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నారు. కోవిడ్ మహమ్మారికి ముందే పర్మాకల్చర్ నేర్చుకోవటం తమ కుటుంబానికి ఎంతో మేలు చేసిందన్నారు. వ్యవసాయం బొత్తిగా ఎరుగని తనకు పీడీసీ కోర్సు చాలా నేర్పిందన్నారు. ఆమె 16 దేశీ ఆవులను, నాటు కోళ్లను, తేనెటీగలను సైతం పెంచుతున్నారు. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి, జీవవైవిధ్యం సుసంపన్నతను తెలియజెప్పడానికి పర్మాకల్చర్ ఉపయోగకరమన్నారు. ప్రతి స్కూల్లోనూ పర్మాకల్చర్ ప్రాక్టికల్ పాఠాలు చెప్పాలన్నారు. విభిన్న వ్యక్తులను అర్థం చేసుకొని, సహనంతో, సామరస్యంగా జీవించడానికి పర్మాకల్చర్ అవసరమంటారు విద్యారావు. ఫారెస్ట్‌లో జరుగుతున్నదే.. అటవీ శాఖలో డీఎఫ్ఓగా పనిచేసి 2019లో రిటైరైన కోడూరి రవీందర్ కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం యల్లారం గ్రామంలో 11 ఎకరాల నల్లరేగడి భూమిలో పర్మాకల్చర్ వ్యవసాయం చేస్తున్నారు. ‘అడవిలో ప్రతి ఏటా విత్తనాలు రాలుతుంటాయి, వర్షం పడుతుంది, పశువులు, పక్షులు, కీటకాలు సహజంగానే సమతుల్యతతో జీవిస్తూ ఉంటాయి. ఫుడ్ ఫారెస్ట్‌ను కూడా ఇదే సూత్రాలతో నిర్మిస్తే సుస్థిరంగా ఫలితాలనిస్తుంది’ అంటారాయన. 3 ఏళ్లుగా ఏడెకరాల్లో పండ్ల చెట్లతో కూడిన 5 అంచెల్లో ఫుడ్ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. 4 ఎకరాల్లో కందులు తదితర పంటలు సాగు చేస్తున్నారు. ‘మరో ఐదేళ్లలో తన క్షేత్రం పూర్తిస్థాయి ఫలితాలనిస్తుంది. 11 ఎకరాల్లో ఏడాదికి రూ. 25 లక్షల ఆదాయం వస్తుంద’ని రవీందర్ ఆశిస్తున్నారు. పర్మాకల్చర్ టూల్స్ మనకున్న భూమిలో మన ఆహారాన్ని మనం పండించుకోవటం ముఖ్యం. ప్రకృతి వనరులకు నష్టం కలగకుండా పంటలు పండించుకునే నేచర్ టూల్స్‌ని పర్మాకల్చర్ మనకు ఇస్తుంది. 2014లో తొలి బ్యాచ్‌లోనే నరసన్న దగ్గర పర్మాకల్చర్ కోర్సు చేశా. మా 5 ఎకరాల్లో కూరగాయలు, పండ్లు పండిస్తున్నాను. 12 బర్రెలు, 50 నాటు కోళ్లు స్వేచ్ఛగా పెరుగుతున్నాయి. మొరం నేలకు తగినట్లుగా కొన్ని స్థానిక పండ్ల చెట్లు పెంచుతున్నాను. భూమి ఆరోగ్యం బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతున్నా. వ్యవసాయం ఒక తపస్సు! – మలిపెద్ది రమేశ్‌రెడ్డి, పర్మాకల్చరిస్టు, కాచవానిసింగారం, ఘట్కేసర్ మండలం, మేడ్చల్ జిల్లా కందకాలలో వట్టివేరు మొక్కలు.. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ పర్మాకల్చర్ డిజైన్ కోర్సు పూర్తి చేసి అనంతపురం జిల్లాలోని తమ బీడు భూమిలో ఫుడ్ ఫారెస్ట్ అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నారు. పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామంలోని తన తల్లి మాలతికి ఏడెకరాల భూమి ఉంది. తువ్వ నేల కావటంతో భూసారం తక్కువగా ఉంది. వాలుకు అడ్డంగా కందకాలు తవ్వి, ఆ కందకాలలో వట్టివేరు మొక్కల్ని నాటారు. అవి పెరిగిన తర్వాత కత్తిరించి పండ్ల మొక్కల మొదళ్లలో ఆచ్ఛాదన చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, పర్మాకల్చర్ పద్ధతులను మిళితం చేసి 2 ఎకరాల్లో 10 రకాల పండ్ల మొక్కలు నాటామని మాలతి తెలిపారు. --పంతంగి రాంబాబు (చదవండి: కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా? సైన్స్ ఏం చెబుతోంది..?) -
Chennamaneni Padma: ఆవులే ఆమె సర్వస్వం
‘‘ఆవు పైన ప్రేమ... లెక్చరర్ ఉద్యోగాన్ని వదులుకునేలా.. నగరం నుంచి పల్లెతల్లికి దగ్గరయ్యేలా కొండకోనల వెంట ప్రయాణించేలా వరదలను తట్టుకొని నిలబడేలా చేసింది’’ అని వివరిస్తుంది డాక్టర్ చెన్నమనేని పద్మ. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినా, వృత్తి ఉద్యోగాల్లో కొనసాగుతున్నా ఊరు ఆమెను ఆకట్టుకుంది. 200 ఆవులకు సంరక్షకురాలిగా మార్చింది. పదేళ్లుగా చేసిన ఈ ప్రయాణంలో నేర్చుకున్న విషయాలను, వరించిన జాతీయస్థాయి అవార్డులను వివరించారు పద్మ. ‘‘నా చిన్ననాటి రోజులకు ఇప్పటికీ ఆహారంలోనూ, వాతావరణంలోనూ చాలా తేడా కనిపించేది. తెలుగు లెక్చరర్‌గా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉన్న ఎయిడెడ్ గర్ల్స్ కాలేజీలో ఉద్యోగం చేసేదాన్ని. వ్యవసాయం, ఆహారం ప్రాముఖ్యతను నేను చదువు చెప్పే అమ్మాయిలకు ప్రత్యక్షంగా చూపాలనుకున్నాను. మా నాన్నగారి ఊరు జగిత్యాలకు ఎప్పుడో ఒకసారి వెళ్లేదాన్ని. ఊరి ప్రయాణం, అక్కడి వాతావరణం నాకు బాగా నచ్చేది. ఇదే విషయాన్ని మా క్లాస్ అమ్మాయిలకు చెప్పి, ఆసక్తి ఉన్నవాళ్లు పేర్లు ఇస్తే, తీసుకెళతాను అని చెప్పాను. ఒకేసారి యాభైమంది పేర్లు ఇచ్చారు. వారందరికీ బస్ ఏర్పాటు చేసి, తీసుకెళ్లాను. వ్యవసాయంలో ఏమేం పనులు ఉంటాయో అన్నీ పరిచయం చేశాను. అక్కడి గోశాలకు తీసుకెళితే పిల్లలంతా కలిసి, లక్ష గొబ్బెమ్మలు తయారు చేశారు. ఎరువుగా గొబ్బెమ్మలు కొన్నిరోజుల తర్వాత గోశాల వాళ్లు గొబ్బెమ్మలను తీసుకెళ్లమని చెప్పారు. అప్పటివరకు ఆలోచన చేయలేదు. కానీ, వాటిని హైదరాబాద్ తీసుకొచ్చి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏదైతే అది అయ్యిందని వ్యాన్‌లో లక్షగొబ్బెమ్మలను తీసుకొచ్చి, ఇంట్లో పెట్టించాను. ఎక్కడ చూసినా గొబ్బెమ్మలే. ఇంట్లోవాళ్లు ఏంటిదంతా అన్నారు. కొన్ని రోజులు వాటిని అలాగే చూస్తూ ఉన్నాను. గోమయాన్ని ఎరువుగా వాడితే పంట బాగా వస్తుంది. అయితే, నగరంలో ఇదెలా సాధ్యం అవుతుంది అనుకున్నాను. రూఫ్ గార్డెన్వాళ్లకు ఇస్తే అనే ఆలోచన వచ్చిన వెంటనే వాట్సప్ గ్రూపుల్లో గొబ్బెమ్మలు కావాల్సిన వాళ్లు తీసుకెళ్లచ్చు మొక్కలకు ఎరువుగా అని మెసేజ్ చేశాను. రెండు, మూడు రోజుల్లో మొత్తం గొబ్బెమ్మలు ఖాళీ అయ్యాయి. ఆవుల కొనుగోలు... ఊరు వెళ్లినప్పుడల్లా దారిలో గోవుల గుంపు ఉన్న చోట ఆగి, కాసేపు అక్కడ ఉండి వెళ్లడం ఒక అలవాటుగా ఉండేది. అలా ఒకసారి 80 ఏళ్ల వ్యక్తి నా అడ్రస్ కనుక్కొని వచ్చాడు. తన దగ్గర ఉన్న ఆవులను బతికించలేకపోతున్నానని, పిల్లలు వాటిని వదిలించుకోమని చెబుతున్నారని ఏడ్చాడు. నాకేం చేయాలో అర్ధం కాలేదు. అంత పెద్ద వ్యక్తి గోవుల గురించి బాధపడుతుంటే చూడలేకపోయాను. ఏదైతే అది అవుతుందని 55 గోవులను అతను చెప్పిన మొత్తానికి నా పొదుపు మొత్తాల నుంచి తీసి, కొనేశాను. అర్ధం చేసుకుంటూ... కొనడంలో ధైర్యం చేశాను కానీ, ఆ ఆవులను ఎలా సంరక్షించాలో అర్ధం కాలేదు. వర్కర్లను, వాటికి గ్రాసం ఏర్పాటు చేయడం తలకు మించి భారమైంది. వాటిని చూసుకోవడానికి ఉద్యోగం మానేశాను. అయినవాళ్లంతా తప్పు పట్టారు. ‘కాలేజీకి త్వరలో ప్రిన్సిపల్ కాబోతున్నావ్.. ఇలాంటి టైమ్‌లో ఉద్యోగం వదులుకొని ఇదేం పని’ అన్నారు. కానీ, ఆవు లేని వ్యవసాయం లేదు. ఆవు లేకుండా మనిషి జీవనం లేదనిపించేది నాకు. ఇంట్లోవాళ్లకు చెప్పి జగిత్యాలలోనే ఆవులతో ఉండిపోయాను. కానీ, ఊళ్లో అందరినుంచీ కంప్లైంట్లే! ఆవులు మా ఇళ్ల ముందుకు వస్తాయనీ, వాకిళ్లు పాడుచేస్తున్నాయని, పోలీసు కేసులు కూడా అయ్యాయి. ఆ ఊళ్లో పుట్టిపెరిగిన దాన్ని కాదు కాబట్టి, నాకెవరూ సపోర్ట్ చేసేవాళ్లు లేరు. దీంతో ఆవులను తీసుకొని గోదావరి నదీ తీరానికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పది రోజులు గడిచాయో లేదో విపరీతమైన వానలు, వరదలు. ఆ వరదలకు కొన్ని ఆవులు కొట్టుకుపోయాయి కూడా. నాకైతే బతుకుతానన్న ఆశ లేదు. ఎటు చూసినా బురద, పాములు.. కృష్ణుడిని వేడుకున్నాను. ‘ఈ ఆవులు నీవి, నీవే కాపాడుకో..’ అని వేడుకున్నాను. అక్కణ్ణుంచి బోర్నపల్లి అటవీ ప్రాంతంలో 15 రోజులు ఆవులతో గుట్టలపైనే ఉన్నాను. మూగజీవాల గురించి, ప్రకృతి గురించి నాకేమీ తెలియదు. ఏం జరిగినా వెనక్కి వెళ్లేది లేదు అనుకున్నాను. నా మొండితనం ప్రకృతిని అర్థం చేసుకునేలా చేసింది. ఎప్పుడో వీలున్నప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్లేదాన్ని. మా ఇద్దరు అబ్బాయిలు జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఇక నా జీవితం ఆవులతోనే అనుకున్నాను. కరోనా టైమ్‌లో మా కుటుంబం అంతా హైదరాబాద్‌లో ఉంది. నేను గోవులతో అడవుల్లో ఉన్నాను. ఓసారి కుటుంబం అంతా కూర్చుని ఆవులు కావాలా, మేం కావాలో తేల్చుకోమన్నారు. ఆవులే కావాలి అన్నాను. నాకు ఉన్న ఈ ఇష్టాన్ని గమనించిన మా వారు తను చేస్తున్న సెంట్రల్‌గవర్నమెంట్ జాబ్ నుంచి వీఆర్ఎస్ తీసుకొని వచ్చేశారు. తన పొదుపు మొత్తాలను కూడా ఆవుల సంక్షేమానికి వాడాం. మహిళలకు ఉపాధి... ప్రతి యేటా ఆవుల సంఖ్య పెరుగుతూ ఇప్పుడు 200 వరకు చేరింది. 50 ఆవులను గుట్టల ప్రాంతాల వారికి ఉచితంగా ఇచ్చేశాను. మిగతా వాటి గోమయంతో పళ్ల పొడి నుంచి వందరకాల ఉత్పత్తులను తయారు చేయిస్తున్నాను. ఇక్కడి గిరిజన ప్రాంత స్త్రీలు వీటి తయారీలో పాల్గొంటున్నారు. గోమయ ప్రమిదలు, పిడకలు, యజ్ఞసమిధలు.. ఇలా ఎన్నో వీటి నుంచి తయారు చేస్తున్నాం. చిన్నా పెద్ద టౌన్లలో గోమయం ఉత్పత్తుల తయారీలో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాం. ఈ ఉత్పత్తులతో ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి, నగర ప్రజలకు చేరువ చేస్తుంటాను. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గిరిజన మహిళలకు ఇస్తుంటాను. పట్టణాల్లో ఉన్నవాళ్లు ఎవరైనా వచ్చి ఆవులను చూసుకోవచ్చని ‘స్వధర్మ’ పేరుతో ఆన్లైన్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. వీడియోలు చూసి ముందు చాలా మంది ఉత్సాహం చూపారు. కానీ, చివరకు ముగ్గురు మాత్రమే వచ్చారు. వీడియోల్లో ఆవులను, ఇక్కడి వాతావరణం చూడటం వేరు. కానీ, నేరుగా ఈ పరిస్థితులను ఎదుర్కోవడం వేరు. ‘మేమూ వస్తాం, కానీ బెడ్రూమ్ ఉందా, అటాచ్డ్ బాత్రూమ్ ఉందా’ అని అడుగుతుంటారు. కానీ, మేమున్నచోట అలాంటి వసతులేవీ లేవు. దొరికినవి తింటూ, ఆవులతోనే జీవనం సాగిస్తూ ఉంటాం. ఆరు నెలలు గుట్ట ప్రాంతాల్లో, ఆరు నెలలు గోదావరి నదీ తీర ప్రాంతాల వెంబడి తిరుగుతుంటాను. ఈ జీవనంలో ఓ కొత్త వెలుగు, స్వచ్ఛత కనిపిస్తుంటుంది. నేర్చుకున్న వైద్యం.. మనుషుల మాదిరిగానే ఆవులు కూడా ఎంతో ప్రేమను చూపుతాయి. జబ్బు పడతాయి. వాటికి ఆరోగ్యం బాగోలేకపోతే ‘నన్ను చూడు’ అన్నట్టుగా దగ్గరగా వచ్చి నిలబడతాయి. కనిపించకపోతే బెంగ పెట్టుకుంటాయి. వాటికి జబ్బు చేస్తే సీనియర్ డాక్టర్స్‌ని పిలిíపించి చికిత్స చేయిస్తుంటాను. నేనే వాటి జబ్బుకు తగ్గ చిక్సిత చేయడం కూడా నేర్చుకున్నాను. ఆవులకు సంబంధించి మురళీధర గో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాను. దీని ద్వారా రేపటి తరం పిల్లలకు మూగజీవాల విలువ... ముఖ్యంగా ఆవు గొప్పతనాన్ని తెలియజేయాలనుకుంటున్నాను’’ అని వివరించారు పద్మ. వరించిన అవార్డులు పట్టణప్రాంతాల వారిని పల్లెకు తీసుకెళ్లి చేయిస్తున్న సేవకు 2012లో నేషనల్ సర్వీస్ స్కీమ్ అవార్డ్‌ను రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ చేతుల మీదగా అందుకున్నాను. 2013లో చైనాలో జరిగే యూత్ ఎక్సే ్చంజ్ ప్రొగ్రామ్‌కి ప్రభుత్వం టాప్ 100 మెంబర్స్‌ని పంపించారు. వారిలో నేనూ ఒకరిగా ఆ సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం మర్చిపోలేనిది. ఈ యేడాది ఇందిరాగాంధీ అవార్డు సెలక్షన్‌కి కమిటీ మెంబర్‌గా ఆహ్వానం అందుకున్నాను. నిస్వార్థంగా చేసే సేవ ఏ కొద్దిమందికైనా ఉపయోగపడినా చాలు. రైతులు ఎవరైనా ఆవు కావాలని వస్తే వారి వివరాలన్నీ తీసుకొని, ఉచితంగా అందజేస్తున్నాం. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
దుర్గమ్మపై ఆన.. లంచం తీసుకోలేదు
పాపన్నపేట (మెదక్): ఏడుపాయల వనదుర్గ ఆలయం గురువారం బీఆర్ఎస్ నాయకుల సవాళ్లు.. ప్రతి సవాళ్లు, ప్రమాణాలకు వేదికైంది. బీఆర్ ఎస్‌లోని రెండు వర్గాలు తడి బట్టలతో ఒకరు.. పసుపు బట్టలతో మరొకరు అమ్మవారి ఎదుట ప్రమాణాలు చేశారు. ‘నా రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదని వన దుర్గమ్మ మాత ఎదుట ప్రమాణం చేస్తున్నా. తప్పు చేసినట్లు నిరూపిస్తే మెదక్ రాందాస్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా’ అంటూ ఇఫ్కో డైరెక్టర్, మెదక్ ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్‌రెడ్డి ఏడు పాయల వనదుర్గ అమ్మవారి ఎదుట గురువారం ప్రమాణం చేశారు. తాను ప్రకటించినట్లుగా 150 మంది కార్యకర్తలతో ఆలయానికి చేరుకున్నారు. మంజీరా నదిలో స్నానం చేసి రాజగోపురంలోని దుర్గమ్మ ఉత్సవ విగ్రహం వద్ద పూజలు చేసి ప్రమా ణం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ కోనాపూర్ సొసైటీలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, భూకబ్జాలు, ఇసుక దందాలు, భూపంచాయితీలు, సెటిల్మెంట్లు చేయలేదన్నారు. సామాజికసేవ కోసం కాంట్రాక్టర్లు, అధికారుల సహాయం తీసుకున్నానే తప్ప ఎవరినీ బెదిరించలేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని చెప్పారు. వందల ఎకరాల భూములు కొన్నారు... దైవ సన్నిధిలో చేసిన అసత్య ప్రమాణాలతో దేవేందర్‌రెడ్డి పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ అసమ్మతి నేతలు అన్నారు. దేవేందర్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించిన అసమ్మతి నాయకులు మడూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, చిన్నశంకరంపేట మాజీ ఎంపీపీ అరుణ, సర్పంచ్ రాజారెడ్డి, అడ్వొ కేట్ జీవన్‌రావు తదితరులు 100 మందితో కలిసి గురువారం ఏడుపాయలకు చేరుకున్నారు. పసుపు బట్టలతో ఆలయంలోకి వచ్చి పూజలు చేసి అమ్మ వారి సన్నిధిలో ప్రమాణం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేవేందర్‌రెడ్డి తన భూదందాలు, ఇసుక మాఫియా, లంచాలు, కోనాపూర్ సొసైటీ వ్యవహారం, అక్రమ సంపాదనపై జవాబు చెప్పకుండా అమ్మవారి ఎదుట అసత్య ప్రమాణం చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన అఫిడవిట్‌తో తాము వచ్చామని పేర్కొన్నారు. రూ.కోట్ల అవినీతిపై కాకుండా కేవలం ఏడుపాయల విషయంపై స్పందించడాన్ని ప్రజలు గమనించాలన్నారు. శంకరంపేట, నర్సాపూర్, మెదక్‌తో పాటు కామారెడ్డి జిల్లాల్లో వందల ఎకరాల భూములు కొన్నారని ఆరోపించారు. ఏ హోదాలో కలెక్టర్ పక్కన కూర్చొని సమావేశాల్లో సమీక్షలు చేస్తున్నారని ప్రశ్నించారు. మెదక్ డెయిరీ పేరిట కార్యకర్తల నుంచి రూ. లక్ష చొప్పున వసూలు చేసిన రూ. కోటి సొమ్మును ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మెదక్ నుంచి పద్మాదేవేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని మార్చకపోతే రెబల్ అభ్యర్థిని పోటీకి దింపక తప్పదని హెచ్చరించారు. -
నాలుగోరోజు 333 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోసం గురువారం 333 దరఖాస్తులు అందినట్లు పార్టీవర్గాల సమాచారం. ఎన్నికల్లో పోటీకి ఉత్సాహపడుతున్నవారి నుంచి బుధవారం వరకు 666 దరఖాస్తులు అందగా, నాలుగోరోజు కూడా కలిపి మొత్తంగా 999 దరఖాస్తులు కమిటీకి చేరినట్టు అయింది. గురువారం పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించినవారిలో మాజీ ఎమ్మెల్యే ఒంటేరు జైపాల్, అధికార ప్రతినిధి జె.సంగప్ప, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, పాండు తదితరులు ఉన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా, వివిధ ప్రాంతాలు, నియోజకవర్గాలకు చెందిన నాయకులు దరఖాస్తులు సమర్పించి టికెట్ వస్తుందా లేదా అన్న దానిపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వీరిలో మెజారిటీ ‘నాన్ సీరియస్’అభ్యర్థులే ఉన్నారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని అనుకునే నేతలంతా వారి వారి సీనియారిటీ, స్థానికంగా బలం, పార్టీలో పేరు ప్రఖ్యాతులు, ప్రజల్లో పలుకుబడి వంటి వాటితో సంబంధం లేకుండా దరఖాస్తులు సమర్పించవచ్చని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్ తాజాగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే ముఖ్యనేతలంతా రాబోయే మూడురోజుల్లో మరీ ముఖ్యంగా, వచ్చే శని, ఆదివారాల్లో తాము పోటీచేసే స్థానాలకు దరఖాస్తులు అందజేయనున్నట్టు పార్టీవర్గాల సమాచారం. దీంతో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీచేస్తారనే దానిపైనా స్పష్టత వస్తుందని నాయకులు అంచనా వేస్తున్నారు. -
తల్లి పద్మ, చెల్లి అనూషను గెంటేసి.. తాళం వేసి..
మహబూబాబాద్: తండ్రి మృతి చెందిన అనంతరం ఓ ప్రబుద్ధుడు.. తల్లిని బెదిరించి ఆమె పేరుతో ఉన్న భూమి, ప్లాటు తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అనంతరం భార్యతో కలిసి ఇంటికి తాళం వేసుకుని తల్లిని బయటకు గెంటివేశాడు. దీంతో ఆ తల్లి దిక్కుతోచని స్థితిలో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినా ఆ తనయుడి తీరులో మార్పులేదు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నేలపోగులకు చెందిన కేమిడి పద్మ, అంజయ్య దంపతులకు కొడుకు నరేశ్, కూతురు అనూష ఉన్నారు. తండ్రి అంజయ్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అయినా కష్టాలు, బాధలు దిగమింగుతూ తల్లియే వీరిద్దరి వివాహం చేసింది. అంజయ్య మృతి చెందడంతో భూమి, ప్లాటు పద్మ పేరుతో ఉన్నాయి. కూతురు అనూషకు అప్పట్లో కట్నం ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వమంటే కుమారుడు నరేశ్ నిరాకరిస్తూ తల్లిని బెదిరించి ఆమె బంగారం బ్యాంక్‌లో కుదువ పెట్టుకుని, భూమి, ప్లాటు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుని బెదిరిస్తున్నాడు. కొద్ది రోజులుగా తల్లి, కూతురుకు ఆరోగ్యం బాగులేకపోవడంతో నేలపోగులలోనే ఉంటున్నారు. శనివారం రాత్రి నరేశ్ తన భార్య భవానితో కలిసి తల్లి పద్మ, చెల్లి అనూషను గెంటేసి తాళం వేసి అత్తగారింటికి వెళ్లిపోయాడు. దీంతో పద్మ.. ఎస్సై ప్రవీణ్‌ను ఆశ్రయించింది. ఎస్సై వెంటనే సిబ్బందిని పంపించి తాళం తీయించి ఇంట్లోకి పంపించారు. ఆదివారం ఉదయం మళ్లీ వచ్చిన నరేశ్ తన భార్యతో వచ్చి పోలీసులకు చెబుతారా అంటూ తల్లిని, చెల్లిని తిడుతూ చంపుతానని బెదిరించడంతో ఆదివారం కొడుకు, కోడలిపై పద్మ.. పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
కొత్త వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం
విజయనగరం ఫోర్ట్/కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/నంద్యాల టౌన్/కోనేరుసెంటర్/ఏలూరు టౌన్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు మెడికల్ కళాశాలల్లో శుక్రవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. విజయనగరం జిల్లాలోని గాజులరేగ వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులను ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల ప్రారంభించారు. అమె మాట్లాడుతూ..మొదటి ఏడాది విద్యార్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమెస్ట్రీ విభాగాలకు సంబంధించి పాఠ్యాంశాలను బోధించనున్నట్లు తెలిపారు. ఈ కళాశాలలో అందుబాటులో ఉన్న 150 సీట్లలో ఇప్పటివరకు 116 మంది విద్యార్థులు చేరారని, మరో 34 సీట్లు భర్తీ కావాల్సి ఉందని చెప్పారు. అలాగే, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నిర్మించిన వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులకు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మీ హాజరయ్యారు. మొత్తం 150 మంది విద్యార్థులకు ఫేజ్ 1,2 లలో 120 మందికి కౌన్సిలింగ్ పూర్తి చేసి ప్రవేశాలు కల్పించారు. తొలిరోజు తరగతులకు 70 మంది హాజరయ్యారు. నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాదరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలత, వైస్ ప్రిన్సిపాల్ ఆనంద కుమార్ల ఆధ్వర్యంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. 2023–24 మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులకు సంబంధించి అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ విభాగాల్లో 222 మంది భోదన, భోదనేతర సిబ్బందితో, 150 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోనూ శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 150 సీట్లకుగానూ ఇప్పటివరకూ 113 మంది విద్యార్థులు చేరారు. కళాశాలకు 11 మంది ప్రొఫెసర్లు, 10 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 31 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు 17 మంది సీనియర్ రెసిడెంట్లు, ఇతర సిబ్బందిని నియమించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి తెలిపారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు పొందిన 112 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఏపీ వైద్యవిద్య అదనపు డైరెక్టర్ డాక్టర్ కేవీవీ విజయ్‌కుమార్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
కొడుకే కాలయముడు
ఇల్లెందు రూరల్: స్థలం విషయమై జరిగిన ఘర్షణలో కన్నకొడుకే కాలయముడయ్యాడు. రోకలిబండతో మోది తల్లిని హత్య చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మొదుగులగూడెంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై సీఐ కరుణాకర్, స్థానికులు తెలిపిన వివరాలివి. మొదుగులగూడెంకు చెందిన మెరుగు పద్మ (60)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు వేణు ఆత్మహత్య చేసుకోగా.. పెద్ద కుమారుడు యాకయ్య ఎనిమిదేళ్ల క్రితం మహబూబాబాద్ జిల్లా విస్సంపల్లి వలస వెళ్లి ఉంటున్నాడు. తరచూ తల్లితో ఘర్షణ పడే యాకయ్య.. గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రెండు రోజుల క్రితం భార్యతో మొదుగులగూడెం వచ్చాడు. ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి జాగాలో గృహలక్ష్మి పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న పద్మ.. పక్కనే ఉన్న స్థలంలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవాలని యాకయ్యకు సూచించింది. కానీ గౌడ సంఘం తరపున బొజ్జాయిగూడెంలో మంజూరు చేసిన స్థలమే కావాలని యాకయ్య కోరాడు. ఆ స్థలం ఆడబిడ్డ ఉమారాణికి ఇస్తానని తల్లి చెప్పడంతో ఘర్షణకు దిగి వెళ్లిపోయాడు. మళ్లీ శుక్రవారం మధ్యాహ్నం కూడా భార్య కవితతో కలిసి మొదుగులగూడెం వచి్చన యాకయ్య తల్లితో ఘర్షణ పడ్డాడు. ఈక్రమంలోనే ఇంట్లోని రోకలిబండతో తలపై బలంగా మోదగా పద్మకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. -
రైతుల ఆత్మహత్యలపై స్పందన ఏదీ?
పంజగుట్ట: రాష్ట్రంలో సిరులు కురిపిస్తున్న సేద్యం అని బీఆర్ఎస్ ప్రభుత్వం డప్పులు కొట్టుకుంటోందని... అయితే రాష్ట్రం వచ్చిన 9 సంవత్సరాల్లో 7007 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదని పలువురు వక్తలు ఆరోపించారు. సోషల్ డెమొక్రటిక్ ఫోరమ్ (ఎస్డీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో “తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండాలి?’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ పద్మజాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్డీఎఫ్ కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నాగిరెడ్డి, కో కన్వినర్లు కన్నెగంటి రవి, పృధ్విరాజ్ యాదవ్, ప్రొఫెసర్ రమ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండాలి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అన్ని పార్టీల అధ్యక్షులకు ఇచ్చి వారి మేనిఫెస్టోలో పెట్టాలని సూచించనున్నట్లు వారు తెలిపారు. అనంతరం ఆకునూరి మురళి మాట్లాడుతూ... రాష్ట్రంలో 59 లక్షల రైతులు కోటి 45 లక్షల భూమిని సాగుచేస్తున్నారన్నారు. వారికి 3.2 టన్నుల విత్తనాలు అవసరమున్నదని రాష్ట్ర ప్రభుత్వం విత్తన అభివృద్ధి సంస్థ పాత్ర రోజురోజుకూ తగ్గించడంతో నకిలీ విత్తనాలు అమ్మే మోసగాళ్లు పెరిగి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలకు సంబంధించి సమగ్ర చట్టం విత్తన విధానం తీసుకురావాలని సూచించారు. రైతుల వ్యవహారాలకు సంబంధించి ఎప్పటికప్పుడూ నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో సహకరించేందుకు రాజ్యాంగ బద్ద సంస్థ ఒక వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని దానికి ప్రతి సంవత్సరం రూ. 100 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిషన్ అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించడం, విత్తనాలు సరఫరా, నాణ్యమైన విత్తనలు, జన్యుపరంగా మార్పు చేసి ఇవ్వాలన్నారు. క్రిమి సంహారక మందులు కూడా ఏ పంటకు ఏ మేర క్రిమిసంహారక మందులు వాడాలో సూచించాలన్నారు. రైతుబంధు పథకం చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీన్ని కొనసాగిస్తూనే పది ఎకరాలు పైబడి మాగాణి, వర్షాధార భూములు ఉన్న వారికి ఇవ్వరాదన్నారు. ఆదాయపు పన్ను కట్టే ఏ రైతుకుటుంబానికి, భూ యజమానులకు రైతుబందు ఇవ్వకూడదని, ఇతరదేశాల్లో స్థిరపడి ఉన్న భూ యజమానులకూ ఇవ్వరాదని సూచించారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎలాంటి పంటల బీమా లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ప్రతి సంవత్సరం కరువుతోనో, అధిక వర్షాలతోనో రైతులు నష్టపోతూనే ఉన్నారని ఏ ఒక్క రైతుకూడా నష్టపోకుండా పటిష్టమైన పంటల బీమా వర్తింపచేయాలన్నారు. రైతులు బాగుపడేందుకు ప్రభుత్వం రూ. 38500 కోట్లు అవసరం అవుతాయని ప్రతి సంవత్సరం అదనంగా రూ. 6400 కోట్లు కేటాయించాలని సూచించారు. సమావేశంలో రంజిత్ కుమార్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
బోధన్ ఎమ్మెల్యే vs మున్సిపల్ చైర్మన్ ఫ్లెక్సీ వార్
-
ఎక్కడికెళ్లినా.. భారత్ నాలో భాగమే : సుందర్ పిచాయ్
-
చాలా నొప్పిగా ఉంది పద్దూ.. ఉత్తేజ్ ఎమోషనల్ పోస్ట్
Actor Uttej Very Emotional Words About His Wife: ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ సతీమణి పద్మ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. క్యాన్సర్ సంబంధిత వ్యాధితో సెప్టెంబర్ 13న ఆమె మృతి చెందారు. ఆ సమయంలో ఉత్తేజ్ భార్యను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చాడు. ఉత్తేజ్‌ను చూసి మెగాస్టార్ చిరంజీవి సైతం కంటతడి పెట్టుకున్నారు. నేడు(నవంబర్ 24) పద్మ పుట్టిన రోజు. గతేడాది పుట్టిన రోజుకు పక్కనే ఉన్న భార్య.. ఇప్పుడు లేకపోవడంతో ఉత్తేజ్ మరోసారి భావోద్వేగానికి గురయ్యాడు. తన భార్యను తలచుకుంటూ.. సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు పద్దమ్మ… ఉన్నంత కాలం నాకు పరిష్కారమై.. ఇపుడు ప్రశ్న నిచ్చి వెళ్ళావు.. చాలా నొప్పి పద్దు… నా చివరిశ్వాస తోనే నువ్వు నాలోంచి వెళ్ళేది…. లవ్ యూ పద్దమ్మా. మయూఖ పిల్లలంతా నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు…’అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
కౌటాల (సిర్పూర్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం పిడుగుపాటుకు ముగ్గురు మృత్యువాతపడ్డారు. కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందిన రైతు బోర్కుట్ పున్నయ్య(52), తల్లీకూతుళ్లు డొంగ్రీ పద్మ(40), డొంగ్రీ శ్వేత(20) తమ తమ పత్తి చేన్లలో ఎరువులు వేయడానికి వెళ్లారు. పనులు ముగించుకుని ఇంటికి బయల్దేరారు. వర్షం వచ్చే అవకాశం ఉందని పద్మ భర్త హŸక్టు.. పద్మ, శ్వేతలను పున్నయ్య ఎడ్లబండిపై గ్రామానికి పంపాడు. పున్నయ్య, ఆయన భార్య రషిక, కుమారుడు బాలాజీ, పద్మ, శ్వేత ఎడ్లబండిపై బయల్దేరారు. అంతలోగానే ఒక్కసారిగా ఎడ్లబండిపై పిడుగుపడింది. దీంతో పున్నయ్య, పద్మ, శ్వేత అక్కడికక్కడే మృతిచెందారు. వీరితోపాటు ఎద్దు కూడా చనిపోయింది. రషిక, బాలాజీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. -
సంతానం కలగడం లేదని భార్యను..
కథలాపూర్(వేములవాడ): కట్టుకున్న భర్తే సంతానం కలగడం లేదన్న కారణంతో భార్యను కడతేర్చిన ఘటన కథలా పూర్ మండలంలోని తాండ్య్రాలలో చోటుచేసుకుంది. పో లీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని గంభీర్‌పూర్‌కు చెందిన పద్మ(36)కు తాండ్య్రాలకు చెందిన గంగుల మల్లయ్యతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. దంపతులిద్దరూ వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారు. కాగా ఇన్నేళ్లయినా సంతానం కలగడం లేదని మల్లయ్య తరచూ పద్మను వేధింపులకు గురిచేసేవాడు. (చుక్కేసి.. చిక్కేసి!) ఈ క్రమంలో సోమవారం రాత్రి గొడవ జరిగింది. ఆవేశంతో మల్లయ్య రోకలితో ఆమె తలపై కొట్టాడు. అనంతరం చీరతో ఉరేసి, పరారయ్యారు. పద్మ మృతి విషయం మంగళవారం ఉదయం వె లుగులోకి వచ్చింది. సంఘటన స్థలాన్ని కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు, కథలాపూర్ ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ పరిశీలించారు. గ్రామస్తులను, బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి సోదరుడు హన్మాండ్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
బొమ్మల టీచరమ్మ
గోడలపై పాఠ్యాంశాలను చిత్రిస్తూ పిల్లలకు చక్కగా అర్థమయ్యేలా సిలబస్‌ను బోధిస్తున్న తిరునగరి పద్మ.. పుస్తకాల్లోని విషయాలను నేరుగా చెప్పడం కంటే బొమ్మలు, గుర్తుల రూపంలో చూపిస్తే అవి ఎప్పటికీ పిల్లలకు గుర్తుంటాయని అంటున్నారు. బడి పరిసరాలను కూడా తన చిత్రాలతో అందంగా మార్చేస్తున్న ఈ ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయురాలు తెలంగాణలోని జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. పద్మ ఉపాధ్యాయురాలే అయినప్పటికీ.. పిల్లలకు బొమ్మల ద్వారా పాఠాలను అర్థం చేయించడంతో పాటు సమాజంలో వివక్షకు గురి అవుతున్న మహిళల సమస్యలపైన కూడా తన కుంచెను ఎక్కుపెట్టారు. ఈమె స్వస్థలం హన్మకొండ. 2008 డీఎస్సీలో తెలుగు పండిట్‌గా ఎంపికై, దేవరుప్పుల మండలం రామరాజుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలో పని చేశారు. తర్వాత సోలిపూర్ పాఠశాలకు వచ్చారు. రైలు బోగీగా తరగతి గది తనకూ టీచరే స్పూర్తి ములుగు జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో డ్రాయింగ్ టీచర్ గీసే చిత్రాలను పద్మను ఆకర్షించాయి. అప్పటి నుంచి పై చదువుల్లో నిమగ్నం అయినప్పటికీ తనకు ఇష్టమైన చిత్రకళను సాధన చేస్తూ వచ్చారు. తనే టీచర్ అయ్యాక.. పాఠాలకు బొమ్మల రూపం ఇచ్చి పిల్లలకు ఆసక్తి కలిగేలా విద్యాబోధన చేస్తున్నారు. అందుకోసం సొంత డబ్బులను పెట్టి రంగులు కొంటున్నారు. స్కూల్ టైమ్ పూర్తయ్యాక, ఆదివారాలు.. గోడలపై చిత్రాలు వేయడానికి తన సమయాన్ని కేటాయించుకున్నారు. పాఠశాల గదులు, ప్రహరీ గోడలపై పద్మ వేస్తున్న పెయింటింగ్స్ పిల్లల్లే కాదు, పెద్దల్నీ ఆకర్షిస్తున్నాయి. ఆలోచింపజేస్తున్నాయి. బోధించడానికి, పిల్లలు అర్ధం చేసుకోవడానికి కష్టంగా ఉండే అంశాలను చిత్రాల రూపంలో గీయడానికి ఆమె చాలానే కష్టపడతారు. తెలుగు వ్యాకరణం, ప్రపంచపటం, సూర్య కుటుంబం, రైలుబండి, హరితహారం, పల్లె అందాలు.. ప్రతి చిత్రం వెనుక పద్మ కష్టం, సృజనాత్మకత ఉంటాయి. మొత్తానికి ఈ చిత్రాలతో ఇప్పుడు ఆ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. సామాజిక స్పృహ మరోవైపు తన కలం ద్వారా సమాజంలోని రుగ్మతలపైన కూడా తన గళం వినిపిస్తున్నారు పద్మ. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షపై తరచు కవితలు రాస్తుంటారు. బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందిస్తారు. ప్రత్యక్షంగా సామాజిక సేవ కూడా చేస్తుంటారు. స్టీల్ పాత్రలను, పాత బట్టలను సేకరించి వాటిని పాఠశాలలోని నిరుపేద, అనాథ పిల్లలకు అందిస్తుంటారు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందిన పద్మ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు, సావిత్రి భాయి పూలే రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు.– ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామఫొటోలు: బైరి శ్రీకాంత్ -
మహిళా రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం
-
ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం చేశారు. మనస్తాపంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఈ ఘటనకు పాల్పడ్డారు. కాగా ఈఎస్ఐ కుంభకోణంలో పద్మను ఏసీబీ అధికారులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైల్లో పద్మ నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కాగా తెలంగాణలో సంచలనం రేపిన ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణం వ్యవహారంలో ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మా, వసంత, రాధిక, హర్షవర్ధన్‌తో పాటు మరో ఇద్దరిని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. -
పేద కుటుంబం.. పెద్ద కష్టం
టవర్‌సర్కిల్(కరీంనగర్): రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది.. ఏ పూటకు ఆ పూట గడవడమే కష్టమవుతున్న తరుణంలో ఆ ఇంటి ఇల్లాలిని క్యాన్సర్ వ్యాధి మంచానికే పరిమితం చేసింది. వైద్యం చేయించుకునే స్థోమత లేకపోవడంతో ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న కరీంనగర్‌లోని భగత్‌నగర్‌కు చెందిన ఎలగందుల పద్మది ఈ దయనీయ పరిస్థితి.నగరపాలక సంస్థ పరిధిలోని 30వ డివిజన్ భగత్‌నగర్ చౌరస్తా సమీపంలో నివసించే ఎలగందుల నర్సయ్య లాండ్రీషాపు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా డు. అరకొర సంపాదనే అయినా భార్య, ఇద్దరు కుమారులు, కూతురుతో హాయిగా సాగిపోతున్న జీవనంలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. నర్సయ్య భార్య పద్మ(52) గతేడాది అక్టోబర్‌లో రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. నాలుగుసార్లు కీమో థెరపీ చేశాక సర్జరీ చేస్తామని వైద్యులు తెలిపారు. కానీ రెండుసార్లు చేశాకే ఆమె శరీరం తట్టుకోలేని స్థితికి చేరింది. ఆసుపత్రికి తీసుకెళ్తే ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణాశయంలో అల్సర్ తయారై ఇన్ఫెక్షన్ సోకిన ట్లు వైద్యులు నిర్ధారించారు. పెడిసిటీ తీసుకో వాలని హైదరాబాద్‌కు పంపించారు. పరీ క్షించిన అక్కడి వైద్యులు కీమో థెరపీ ద్వారానే మిగతా అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకినట్లు వెల్లడించారు. ఈక్రమంలోనే ఆమె మూడుసార్లు గుండె జబ్బుకు గురైంది. బరువు తగ్గడంతో కీమో థెరపీ, సర్జరీ చేసే పరిస్థితి లేదని వైద్యులు చేతులెత్తేశారు. దీంతో ఆమె నెల రోజులుగా ఇంట్లోనే మంచానికి అంకితమైంది. ఆయుర్వేదమే దిక్కు.. అల్లోపతి వైద్యానికి పద్మ శరీరం సహకరించదని తేలిపోయింది. ఆయుర్వేదం ద్వారా బతికించేందుకు కొద్దిగా చాన్స్ ఉందని వైద్యులు చెప్పడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ప్ర తి నెలా రూ.15 వేల ఖర్చు అవుతోందని, త మకు అంత స్థోమత లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. దాతలు స్పందించి, పద్మను బతికించాలని వేడుకుంటున్నారు. « దాతలు సంప్రదించాల్సిన చిరునామా : ఎలగందుల నర్సయ్య, ఫోన్ : 96181 79595 ఆంధ్రాబ్యాంకు అకౌంట్ నంబర్ : 159110100118360 ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఏఎన్‌డీబీ0001591 -
తల్లీ కూతుళ్లకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు
చదువు ఆపేసిన పన్నెండేళ్లకు తిరిగి ప్రారంభించి ఏకంగా లెక్చరర్ ఉద్యోగం సాధించిన ఘనత తల్లిది. చిన్న వయసులో చైల్డ్ డవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగం తెచ్చుకున్న ఘనత కూతురిది. ఇద్దరూ ఒకే ఏడు పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్నతల్లి రౌతు పద్మ, కూతురు అలేఖ్య పటేల్ సక్సెస్ ఇది.. తల్లీ కూతుళ్లు పోటీ పడి చదువుకోవడం ఈ రోజుల్లో పెద్ద వింతేమీ కాకపోవచ్చు. కానీ ఇద్దరూ ఒకే ఏడు పోటీ పరీక్షలు రాసి, ఉత్తీర్ణత సాధించడం ఒక ఎత్తు అయితే .. విజయవంతంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం మరో ఎత్తు. పెద్ద కుటుంబంలో చిన్న కోడలు పెళ్లయిన 12 సంవత్సరాల తరువాత తిరిగి చదువును కొనసాగించాలనుకుంది పద్మ. అలా మొదలు పెట్టి.. రాసిన ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. డిగ్రీ పాసై అటు పైన పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడి, ఎంఈడీ, నెట్ అర్హతలు సాధించి అంతిమంగా టీఎస్పీఎస్సీ ద్వారా గురుకుల కళాశాలలో పీజీటీగా ఎంపికైంది. ఇపుడు సిరిసిల్ల జిల్లా చిన బోనాలలోని రెసిడెన్షియల్ కాలేజ్‌లో పీజీటీగా బాధ్యతలు నిర్వహిస్తోంది. తన విజయం గురించి పద్మ మాట్లాడుతూ – ‘మాది మంథని దగ్గరి రామకృష్ణాపూర్. పదో తరగతి పూర్తయ్యాక వివాహం అయింది. ఎనిమిది మంది సంతానం గల పెద్ద కుటుంబానికి చిన్న కోడలుని. మా అమ్మాయి అలేఖ్య ఆరో తరగతి వచ్చే వరకు ఇంటి పనులు చక్కదిద్దడం, పిల్లల్ని స్కూల్‌కి పంపడం, వంటా వార్పుతోనే సరిపోయేది. పాప తన పనులు తాను చేసుకునే స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో చూస్తుండగానే 12 ఏళ్లు గడిచిపోయాయి. చాలా సార్లు చదువు పైన నాకు ఇష్టం ఉందని గ్రహించిన మా వారు తిరిగి చదువుకొమ్మని ప్రోత్సహించారు. అలా అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష ద్వారా డిగ్రీ పూర్తి చేశాను. తొలి ప్రయత్నంలోనే పాసవడంతో మరింత ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత రెగ్యులర్‌గా బీఈడి, ఆ పైన ఎంఈడి పూర్తి చేశాను. ఎంఈడిలో నాది రాష్ట్రంలో 9వ ర్యాంకు. జాతీయ పరీక్ష నెట్లో కూడా అర్హత సాధించాను. తొలి ప్రయత్నంలోనే రెసిడెన్షియల్ టీచర్‌గా ఎంపికయ్యాను. టీజీటి, పీజీటి స్థాయి పోస్టుల్లో రెండేసి సబ్జక్టుల్లో తెలుగు, సోషల్‌కు ఎంపికయ్యాను. ఫైనల్‌గా పీజీటి తెలుగులో జాయిన్ అయ్యాను’ అని వివరించింది పద్మ. అమ్మతో పోటీ పడిన కూతురు తనేమీ తక్కువ కాదనుకున్న కూతురు అలేఖ్య మరింత ఎక్కువగా శ్రమ పడి టీఎస్ పీఎస్సీలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకును సాధించింది. ఇప్పుడు శిశు సంక్షేమ శాఖలో రాజన్న సిరిసిల్ల జిల్లా సీడీపీవో(చైల్డ్ డవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్)గా బాధ్యతలు నిర్వహిస్తోంది. తన విజయం గురించి అలేఖ్య మాట్లాడుతూ –‘చిన్నప్పటి నుంచి చదువులో అమ్మా, నాన్నల ప్రోత్సాహం చాలా గొప్పది. నాన్న బాగా ఎంకరేజ్ చేశారు. çపది, ఇంటర్మీడియోట్ 95 శాతం మెరిట్‌తో పాసయ్యాను. అప్పట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్మితా సభర్వాల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్‌గా ఉండేవారు. పరిపాలనలో మేడమ్ డైనమిజం చూసి చాలా ఆకర్షితురాలినయ్యాను. నేను కూడా కలెక్టర్ కావాలనుకునేంతగా స్ఫూర్తి పొందాను. అందుకే ఐఏఎస్ అకాడమీలో చేరి మూడేళ్ల డిగ్రీ పూర్తి చేశాను. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగం కోసం టీఎస్పీఎస్సీ పరీక్ష రాసి స్టేట్ ఫస్ట్‌లో మెరిట్ సాధించాను. ఉద్యోగంలో చేరేనాటికి 21 ఏండ్ల 10 నెలల వయసు. చిన్న వయసులోనే పెద్ద ఉద్యోగంలో చేరిపోయానని ఇంట్లో అందరూ మెచ్చుకున్నారు. రాష్ట్రంలోని అతి పెద్ద ప్రాజñ క్ట్ను మానిటర్ చేసే హోదాలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇంతటితో ఆగిపోకుండా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. సాధించగలననే నమ్మకం ఉంది’ అని తెలిపింది. ఇంట్లో స్నేహితులం తల్లీ కూతుళ్లుగా బంధం నిర్ణయించినప్పటికీ ఇంట్లో ఇద్దరం మంచి స్నేహితులం. ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటాం. ‘ఇవి పెద్దవాళ్లు మాట్లాడుకునే మాటలు’ అని అమ్మ అనదు, ‘ఇది నాకు మాత్రమే సంబంధించిన విషయం’ అని నేను అనుకోను. చదువు, ప్రిపరేషన్ గురించే కాదు ఇంటి పనుల్లోనూ పక్కా ప్లానింగ్‌తో చేసేవాళ్లం. మా చుట్టుపక్కల వీళ్లు తల్లి కూతుళ్లు అనే కన్నా ఇద్దరినీ మంచి స్నేహితులు అంటుండేవారు. ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో రూపొందించుకున్న టైమ్ టేబుల్‌ను అనుసరిస్తూ పరస్పరం ప్రోత్సహించుకుంటాం. అదృష్ట్టవశాత్తు ఇద్దరికీ ఒకే జిల్లాలో పోస్టింగ్ రావడం చాలా సంతోషాన్నిస్తోంది. మా ఇద్దరి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని తెలిస్తే చాలా గర్వంగా ఉంటుంది’ అని తెలిపింది అలేఖ్య. తల్లీ కూతుళ్లుగా తాము సాధించిన విజయాల వెనుక రౌతు రమేశ్ పాత్ర కీలకమైంది. పద్మ భర్త రమేశ్ సింగరేణి కాలనీలో చిరుద్యోగి. పెద్ద కుటుంబంలో చిన్నవాడు. అయితేనేం అర్థాంగి మనస్తత్వాన్ని, ఆమె అంతరంగాన్ని సరిగ్గా అర్థం చేసుకుని చదువుకోవాలని ప్రోత్సహించాడు. ఈ వయసులో చదువెందుకు అని ప్రశ్నించిన వారికి చిరునవ్వుతో సమాధానమిస్తూనే ఉన్నత విద్య విషయంలో రాజీ పడలేదు. అందుకే తాము సాధించిన ఈ విజయాలకు సంబంధించిన క్రెడిట్ మొత్తం రమేశ్‌కే దక్కుతుందని తల్లీ కూతుళ్లిద్దరూ ఆనందంగా చెబుతారు.– గెంట్యాల భూమేశ్, సిరిసిల్ల కల్చరల్ఫొటో: వంకాయల శ్రీకాంత్ -
భర్త చేతిలో లైంగిక దాడికి గురైన వివాహిత మృతి
సాక్షి, చిత్తూరు : భర్త చేతిలో లైంగిక దాడికి గురైన పద్మ (32) బుధవారం మృతి చెందారు. చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు రోజుల కిందట ఆమెపై భర్త నంద లైంగికదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. బిడ్డకు జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్న సమయంలో తన లైంగిక వాంఛ తీర్చాలంటూ పద్మను నంద తీవ్రంగా వేధించడం.. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో బలవంతంగా ఆస్పత్రి మిద్దెపైకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించడం తెలిసిందే. ఈ ఘటనలో అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు రక్తస్రావం ఎక్కువయ్యి పద్మ కోమాలోకి వెళ్లిపోయింది. గత మూడు రోజులుగా ఐసీయూలో పద్మను కాపాడటానికి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పద్మను చంపడానికి ఆమె చీరతోనే గొంతుకు బిగించడంతో మెదడుకు రక్త సరఫరా అయ్యే నాళాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. పద్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడిపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా హత్య కేసు కూడా నమోదు చేశారు. -
‘దానం’ అన్నను గెలిపించండి: లగడపాటి పద్మ
సాక్షి, హైదరాబాద్(ఖైరతాబాద్) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత వాతావరణం, ప్రజానాడి హస్తానికే మొగ్గు ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత లగడపాటి రాజగోపాల్ చెబుతుంటే మరోవైపు ఆయన సతీమణి పద్మ టీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ సతీమణి అనితతో కలిసి ఆమె మంగళవారం రాత్రి ఖైరతాబాద్ డివిజన్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. దానం నాగేందర్ అన్నను గెలిపించాలని కోరారు. ఏ ప్రభుత్వమూ ఐదేళ్లలో పనులన్నీ పూర్తి చేయలేదన్నారు. పదేళ్లలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి దానం నాగేందర్‌ను గెలిపించాలని కోరారు. -
అదిగో మూజలెల్లి!
నాకు ఏ పండుగ వచ్చినా ఇద్దరు అక్కలను, ఒక చెల్లెను తీసుకురావడం మళ్లీ పండుగ తరువాత వారిని తొలి రావడం, వాళ్లు ఉన్న అయిదు, ఆరురోజులు ఇల్లంతా సందడి సందడిగా ఉండి వాళ్లు వెళ్లగానే అంతా నిశ్శబ్దంగా ఉండటం, ఏమితోచక పోవడంతో నాకు కూడా పండుగలు కాని ఏదైనా కార్యక్రమాలు కాని ఎప్పుడెప్పుడు జరుగుతాయా! అక్కలను ఎప్పుడు తీసుకరావాలి అనిపించేది. అది 1994 సంవత్సరం సంక్రాంతి పండుగ. మా అక్కలు యశోదక్క, సత్తెక్క మరియు చెల్లి నర్సవ్వను తీసుకొని వచ్చాను. ఇంట్లో వాళ్ళు వారి వారి పిల్లలతో సందడిగా, ఆటలు మాటలతో హుషారుగా ఉంటే నేను అలా బయటికి వెళ్లొస్తా అని వెళ్లి ఒక అయిదారుగంటలు స్నేహితులతో మాట్లాడి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా గొడవ గొడవ జరుగుతోంది.ఏందబ్బా ఇంతమంది కూడిండ్రు, ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటూ లోపలికి పోయేసరికి ‘‘ఇంకోసారి నన్ను పండుగకు తీసుకురావద్దు. నేను రాను’’ అన్నది మా సత్తెక్క. ‘‘మేము ఏమన్నా అన్నామా! నీ బిడ్డే ఆ ముసలామెను అంటే ఆమె మనల్ని తిట్టబట్టే’’ అని అమ్మ అంటుంది. ‘‘ఏదో చిన్నపిల్ల తెల్వక అన్నది అని చెప్పొచ్చు కదా. మీరు కూడా తిట్టబడ్తిరి. అందుకే ఇంకోసారి నేను రాను’’ అంటోంది అక్క ‘‘ఏ! ఆగండి, అసలేం జరిగింది?’’ అని నేను అడిగేసరికి–‘కాదురా తమ్మీ! మన పక్కింటి ఎల్లవ్వను మన పద్మ (అక్క బిడ్డ) ముసలెల్లి ముసలెల్లి అన్నదట. అందుకే ఆమెతో పాటు మన అమ్మ నన్ను నా బిడ్డను తిడుతున్నరు. నేనింకోసారి రాను’’ ఏడుపందుకుంది అక్క ‘‘మరి గా ముసలిదాని జోలి గీ పిల్లకెందుకు, మనింట్లో మనముండక’’ అంటోంది అమ్మ.‘‘నా బిడ్డకు తెలుసా! చెప్పరా తమ్మీ’’ అన్నది అక్క. ‘‘అట్లగాదక్కా! గా పక్కింటి ముసలామె జోలి మన పద్మకెందుకొచ్చింది. ఆ ముసలామె కోపానికెందుకొచ్చింది, నాకేమి అర్థం అయితలేదుగని ఒకసారి పద్మను పిలువు అడుగుదాం’’ అన్నాను. ‘‘పద్మా... పద్మా నువ్వెమన్నవు బిడ్డా? మామయ్యకు చెప్పు’’‘‘నేను మా చెల్లిని అంటే గామె నన్ను కొట్టింది మామయ్యా’’‘‘మరి ముసలెల్లి అంటే కోపం రాదారా పద్మా. తప్పు కాదా’’‘‘మూజలెల్లిని అంటే ఆమెకేంది?’’‘‘ఆమె పేరు పెట్టి అనుకుంట ఆమెకేంది అంటవేమిరా. ఆమెకు కోపం రాదా?’’‘‘నేనామెనెందుకన్నా. మూజలెల్లిని అన్నా’’‘‘అరే! పరేశాను చేస్తందేమిరో, ఇదేదో తిరకాసు ఉన్నట్లుంది’’నాకు ఏదో అనుమానమొచ్చి ‘‘ఏదీ ఏ ముసలెల్లిని అన్నవో చూపిద్దువురా’’ అన్నాను.గబగబా నన్ను బయటికి వేలుపట్టుకొని తీసుకొచ్చి ఇంటిపక్కన ఎల్లవ్వ గోడపైకి చూపిస్తూ...‘‘అగ్గో గా మూజలెల్లి’’అన్నది.అటు చూసిన నాకు, అక్కలకు, అమ్మకు అక్కడ పోగైన మందికి, తిట్టిన ఎల్లవ్వకు నవ్వు ఆగుతలేదు.‘‘ఓసినీ పోరీ! అప్పుడే చూపెడితే అయిపోయేది కదా’’ అంటుంది ఇటుపక్క ఇంటిఅయిలమ్మ.అందరి నవ్వుకు కారణం అక్కడ ఉన్నది....ఊసరవెల్లి! అది జరిగి ఇన్ని సంవత్సరాలయినా ఇప్పటికీ బాగా నవ్వుకుంటాం. – మినుముల భిక్షపతిగౌడ్, సముద్రాల, జనగామ జిల్లా -
పద్మను విచారించిన పోలీసులు..ఆసక్తికర అంశాలు
కృష్ణా, హనుమాన్‌జంక్షన్ రూరల్ : బ్యూటీషియన్ పద్మపై హత్యాయత్నం కేసులో పలు అంశాలు మిస్టరీగా మారాయి. విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బాధితురాలు పల్లె పద్మను పోలీసులు మంగళవారం కొద్ది సమయం విచారించారు. ఈ సందర్భంగా పద్మ పలు అంశాలను వెల్లడించింది. అయితే కత్తిపోట్లతో విపరీతంగా రక్తం పోవటం, మెడపై తీవ్ర గాయం కావటంతో పద్మ ఎక్కువ సేపు మాట్లాడలేదని తెలుస్తోంది. అసలు హత్యాయత్నం రాత్రి నూతనకుమార్, పద్మ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని పోలీసులు స్పష్టంగా రాబట్టేందుకు యత్నించారు. నూతన్ ఒక్కడే దాడి చేశాడు.. ఈ నెల 23వ తేదీ రాత్రి జరిగిన తీవ్ర వివాదంలో పద్మను నూతనకుమార్ విచక్షణ రహితంగా కొట్టినట్లు ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఆమెపై జరిగిన హత్యాయత్నంలో నూతనకుమార్ ఒక్కడే ఉన్నాడని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకూ హత్యాయత్నం ఘటనలో సుబ్బయ్య అనే మూడో వ్యక్తి ఉన్నట్లు వచ్చి ఊహాగానాలకు తెరపడ్డట్లైంది. తొలుత నూతనకుమార్ తీవ్రంగా కొట్టిన దెబ్బలతో ఓపిక పూర్తిగా నశించిందని, ఆ తర్వాతే తన కాళ్లు కట్టేసి, నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి కత్తితో దాడి చేశాడని ఆమె పేర్కొంది. సోమవారం పద్మ రెండు చేతులకు శస్త్రచికిత్సలు చేయటం, ఆపరేషన్ నిమిత్తం అనస్తీషియా ఇవ్వటంతో మత్తుతో ఉందని, నూతనకుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మంగళవారం కుటుంబ సభ్యులు పద్మకు చెప్పారు. ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించారా?! నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న నూతనకుమార్, పద్మ మధ్య ఏడాదిగా తరుచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పెదపాడు, హనుమాన్‌జంక్షన్ పోలీస్ స్టేషన్లులో పద్మ ఫిర్యాదు కూడా చేసింది. నూతనకుమార్‌కు ఏలూ రులో ఉన్న ఇల్లు విక్రయించగా వచ్చిన రూ.35 లక్షలు వివాదానికి కారణమా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. కాగా 23వ తేది రాత్రి పద్మ తన భర్త వద్ద ఉంటున్న పెద్ద కుమార్తెకు ఫోన్ చేసి నూతనకుమార్‌తో కలిసి ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పినట్లు భర్త సూర్యనారాయణ ఇప్పటికే మీడియాతో వెల్లడించాడు. ఇదే విషయాన్ని పద్మ కూడా ఆస్పత్రిలో పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకోవాల్సి వచ్చిందనే విషయం మిస్టరీగా మారింది. ఆత్మహత్యకు పద్మ అంగీకరించిందా? లేక నూతనకుమార్ బలవంతం చేశాడా? పద్మను ఆత్మహత్య చేసుకుందామని నమ్మించి ముందుగా మత్తు ఇచ్చి, ఆపై దాడి చేశాడా? అనే విషయాలు పద్మ పూర్తిగా కోలుకుంటేగానీ తెలిసే అవకాశం లేదు. -
భర్తకు మళ్లీ దగ్గరవుతోందన్న అనుమానంతోనే..
హనుమాన్‌జంక్షన్ రూరల్(గన్నవరం): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన బ్యూటీషియన్ పద్మపై హత్యాయత్నం కేసులో నిందితుడు బత్తుల నూతనకుమార్ విక్టర్ ఆత్మహత్య చేసుకోవటంతో దర్యాప్తు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. పద్మపై అత్యంత పైశాచికంగా దాడి చేసిన అనంతరం ఈ నెల 24 నుంచి అదృశ్యమైన నూతన కుమార్ గుంటూరు జిల్లాలోని నాదెండ్ల మండలం నుదురుపాడు వద్ద రైల్వే పైవంతెన కింద ఆదివారం సాయంత్రం శవమై తేలడం తెలిసిందే. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పల్లె పద్మ ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తొలుత హైదరాబాద్‌కు పరారీ.. పద్మపై కర్కసంగా హత్యాయత్నం చేసిన నూతనకుమార్ వెంటనే ఘటనాస్థలాన్ని విడిచిపెట్టి తన బైక్‌పై హైదరాబాద్‌కు పరారైనట్లుగా తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడం, నాలుగు ప్రత్యేక బృందాలను నియమించటం, అతని స్నేహితులను విచారించటం, మీడియాలో అతని పేరు, ఫొటో సంచలనం కావటంతో నూతనకుమార్‌కు గత్యంతరం లేక బలవ్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నూతనకుమార్ హైదరాబాద్‌లో ఉన్నట్లు శనివారం రాత్రి నిర్ధారణకు వచ్చిన హనుమాన్‌జంక్షన్ ఎస్ఐ వి.సతీష్ నేతృత్వంలోని పోలీసు బృందం హుటాహుటిన అక్కడికి బయలుదేరింది. దీంతో పోలీసుల చేతికి చిక్కక తప్పదనే భయంతో నూతనకుమార్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త దగ్గరికి వెళ్లిపోతుందనే అక్కసుతోనే.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని వెన్నవల్లి వారి పేటకు చెందిన బత్తుల నూతన కుమార్ విక్టర్ ఎంబీఏ చదివాడు. ఏలూరులోని ద్విచక్ర వాహనాల షోరూంలో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న అతనికి అక్కడే పనిచేస్తున్న పల్లె పద్మతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతను భార్యను విడిచిపెట్టి, పద్మతో సహజీవనం ప్రారంభించారు. నాలుగేళ్లుగా వీళిద్దరూ కలిసి ఉంటున్నప్పటికీ గత కొంతకాలంగా మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో పెదపాడు, హనుమాన్‌జంక్షన్ పోలీస్స్టేషన్లలో నూతనకుమార్పై పద్మ ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా పద్మ తిరిగి తన భర్త దగ్గరకు వెళ్లిపోవటానికి నిశ్చయించుకోవటంతో నూతనకుమార్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నెల 23వ తేది రాత్రి ఇదే విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుందని స్ధానికులు చెబుతున్నారు. భార్యను సైతం విడిచిపెట్టి పద్మ కోసం వస్తే, మళ్లీ ఆమె భర్త సూర్యనారాయణ దగ్గరకు వెళ్లిపోతుందనే అక్కసుతోనే ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏలూరులో నూతనకుమార్‌కు తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిని సైతం ఇటీవలే విక్రయించి, తద్వారా వచ్చిన రూ.35 లక్షలు కూడా పూర్తిగా ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పద్మ వెళ్లిపోవటం, తన ఆస్తిని కూడా పూర్తిగా కోల్పోవటంపై నూతన కుమార్ విచక్షణ కోల్పోయి ప్రతీకార చర్యకు ఉపక్రమించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పద్మ చేతులకు శస్త్రచికిత్స.. విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్యూటీషియన్ పద్మకు వైద్యులు సోమవారం శస్త్రచికత్స నిర్వహించారు. ఆమె రెండు చేతులు మణికట్టు పైభాగంలో కత్తిపోట్ల కారణంగా తీవ్రంగా దెబ్బతినటంతో తొలుత చేతులు తొలగించాలని వైద్యులు భావించారు. కానీ పూర్తిస్థాయిలో ఆమెకు నిర్వహించిన టెస్ట్ రిపోర్టుల ఆధారంగా మణికట్టు పైభాగంలో శస్త్రచికిత్స చేస్తే సరిపోతుందని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపధ్యంలో ఆమె రెండు చేతులకు ఆపరేషన్ చేసి రాడ్లు వేశారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. మెడ వద్ద తీవ్ర గాయం కావటంతో హత్యయత్నం వివరాలను వెల్లడించే స్థితిలో లేదని తెలుస్తోంది. నాభర్త ఆత్మహత్యకు పద్మే కారణం తన భర్త ఆత్మహాత్యకు పద్మే కారణమని నూతన్‌కుమార్ భార్య సునీతకుమారి పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడిన నూతన కుమార్ విక్టర్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం నరసరావుపేట రైల్వే పోలీసులు ఆతని భార్య బత్తుల సునీతకుమారికి అప్పగించారు. ఆ సమయంలో పోలీసులకు సునీత ఇచ్చిన వాగ్మూలంలో తన భర్త మంచి వాడని, పద్మ వేసిన ఉచ్చులో పడి దారుణంగా మోసపోయాడని, తన భర్త మరణానికి పద్మే కారణమని ఆరోపించినట్లుగా తెలుస్తోంది. 2014 వరకు తనతో ఎంతో అన్యోన్యంగా ఉండే వాడని, బైక్ షోరూంలో మేనేజర్‌గా పని చేశాడని చెప్పినట్లు సమాచారం. పద్మపై వ్యామోహాంతో ఆస్తిని సైతం నాశనం చేసుకున్నాడని చెప్పినట్లు తెలుస్తోంది. -
బ్యూటీషియన్‌పై దాడి కేసు మరో మలుపు
-
బ్యూటీషియన్‌పై దాడి కేసులో ట్విస్ట్
విజయవాడ: బ్యూటీషియన్ పద్మపై దాడి కేసు మరో మలుపు తిరిగింది. పద్మపై హత్యాయత్నం చేశాడని అనుమానిస్తున్న నూతన్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో ఊహించని మలుపు తిరిగింది. గుంటూరు నుంచి నరసరావుపేట వెళ్లే దారిలో రైలు పట్టాల వద్ద ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నూతన్ కుమారేనని తెలిసింది. అక్కడ లభించిన ఆధార్ కార్డు ద్వారా మృతదేహం నూతన్ కుమార్‌దిగా రైల్వేపోలీసులు, నూతన్ భార్య గుర్తించారు. అయితే నూతన్ కుమార్ మరణంపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నూతన్ కుమార్‌ని ఎవరైనా హత్య చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. మరో నిందితుడు సుబ్బయ్య మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పోలీసులు ఇంతవరకు అదుపులోకి తీసుకోకపోవడంతో కేసును చేధించడం క్లిష్టంగా మారింది. బ్యూటీషియన్ పద్మ వాగ్మూలంలో చెప్పిన ఆ సుబ్బయ్య ఎవరనేది మిస్టరీగా మారింది. వెలుగు చూస్తున్న కొత్త విషయాలు పద్మ ఎడమ చేతిపై 'ఎన్' అనే అక్షరంతో టాట్టూ ఉంది. నూతన కుమార్ గుర్తుగా ఎన్ అక్షరంతో టాట్టూ వేయించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ 'ఎన్' అనే అక్షరాన్నే మృతుడు నూతన కుమార్ కత్తితో నరికివేశాడు. అలాగే పద్మ నుదుటి మీద 'ఎస్' అక్షరం రాసింది కూడా నూతన కుమారేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న నూతన కుమార్, పద్మ మధ్య ఏడాదిగా తీవ్ర విభేదాలు తలెత్తాయి. పశ్చిమగోదావరి జిల్లా పెడపాడులో ఇప్పటికే నూతన కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదై ఉంది. హనుమాన్ జంక్షన్ పోలీసులకు గతంలో నూతన్‌పై పద్మ ఫిర్యాదు కూడా చేసింది. ఆపై పద్మ రాజీ పడింది. గతంలో ఒకసారి నూతన్ కుమార్ ఆత్మహత్యా యత్నం కూడా చేసుకున్నట్లు విచారణలో తేలింది. పద్మ భర్త పేరు సూర్యనారాయణ కాబట్టి 'ఎస్' అనే అక్షరం బ్లేడ్‌తో రాసి, 'ఎన్' అనే అక్షరం కోసేస్తే అది పద్మ భర్తే చేశాడని భావిస్తారని నూతన కుమార్ అలా చేసి ఉండవచ్చునని పోలీసులు నిర్దారణకు వచ్చారు. -
టీఆర్ఎస్ నుంచి నాకు ప్రాణహాని ఉంది
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తనకు భద్రతను ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అధికార టీఆర్ఎస్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. తనకు గతంలో ఉన్న 1+1 భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపే అవకాశముంది. నా భర్తకు ప్రాణహాని హైకోర్టును ఆశ్రయించిన న్యూడెమోక్రసీ నేత మధు భార్య పద్మ సాక్షి, హైదరాబాద్: పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న తన భర్త సీపీఐ–ఎంఎల్ (న్యూడెమోక్రసీ) ప్రాంతీయ కార్యదర్శి ఎ.నారాయణస్వామి అలియాస్ మధుకు ప్రాణహాని ఉందని, వెంటనే కోర్టులో హాజరుపరిచేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన భార్య పద్మ హైకోర్టును ఆశ్రయించారు. పద్మ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను బుధవారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ విషయంపై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన ధర్మాసనం విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. -
దుర్గగుడి పాలకమండలి సమావేశం
సాక్షి, విజయవాడ: విజయవాడలో దుర్గగుడి పాలక మండలి సమావేశం బుధవారం జరిగింది. ఈవో పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. దుర్గగుడికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. అదే విధంగా ఈ సమావేశంలో ప్రసాదం టెండర్లకు పాలకమండలి ఆమోదం తెలిపింది. పాడైపోయిన పాత బస్సులను వేలం వేయాలని సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఏపీ ప్రత్యేక హోదా కోసం మే 3 నుంచి 7 వరకు అతిరుద్రమహా చండీయాగం నిర్వహించనున్నట్టు ఈవో పద్మ తెలిపారు. -
న్యాయ వ్యవస్థపై నమ్మకముంది..
సాక్షి, ఆదిలాబాద్: ‘ఈరోజు సంతోషాన్నిచ్చింది.. అంతిమంగా న్యాయం గెలుస్తుందన్న ఆశ కలుగుతుంది. న్యాయ వ్యవస్థపై నమ్మకం బలపడింది. ఆజాద్‌ను ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు శిక్ష పడుతుందని ఆశిస్తున్నాను. ఆజాద్ ఎన్కౌంటర్ తర్వాత 2013 నుంచి కోర్టుకు విచారణ నిమిత్తం ఆదిలాబాద్‌కు 30 మార్లకు పైగా వచ్చాను. కేసులో ఈ మలుపు కీలకంగా భావిస్తున్నాను..’ అని మావోయిస్టు అగ్రనేత, 2010లో ఆదిలాబాద్ అడవుల్లో ఎన్కౌంటర్లో మృతిచెందిన ఆజాద్ సహచరిణి పద్మ అన్నారు. గురువారం ఆదిలాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎదురు కాల్పుల్లో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఆజాద్ మృతిచెందారని పోలీసులు చెప్పడాన్ని ఆమె మొదటి నుంచి తప్పుబడుతున్నారు. ఆజాద్‌ను పట్టుకొని తీసుకెళ్లి కాల్చి చంపారని చెబుతూ వస్తోంది. తాజాగా గురువారం ఈ కేసును పునర్విచారణ చేపట్టాలని జిల్లా అదనపు సెషన్స్ జడ్జి(ఎస్సీ/ఎస్టీ కోర్టు) భారతిలక్ష్మి కింది కోర్టు(జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టు)ను ఆదేశించినట్లు పద్మ తరపున న్యాయవాది సురేష్‌కుమార్ తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 29 మంది పోలీసులపై న్యాయ విచారణ ప్రారంభించాలని ఉత్తర్వు ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
ఉ'త్తరం' మారాలి
తరం మారి తరం వచ్చింది. తరం మారి తరం వస్తుంది కూడా. అప్పుడు కూడా.. ఇలాంటి ఉత్తరమే వస్తుంది. సరస్వతీదేవి, లక్ష్మీదేవి కటాక్షించిన ఒక అమ్మాయికి కల్యాణమే బలిదేవత కాబోయింది!ఏ మారుమూల గ్రామంలోనో కాదు.. వైజాగ్‌లో. ఎంత చదువుకున్నా ఏం లాభం? ఎంత గొప్ప ఉద్యోగం సంపాదించుకున్నా ఏం లాభం? ఇష్టం లేని పెళ్లిచూపులు.. కెరటాల్లా వచ్చి తాకుతుంటే!! డియర్ ఫ్రెండ్! ఒక అత్యవసర సందర్భంలో నీకీ లేఖ రాయాల్సి వస్తోంది. నన్నీ అంధకారంలోంచి బయటపడేసేది నీవు చేయబోయే ఈ చిన్ని సాయమే. లేదంటే నా కథకీ ఉత్తరమే ముగింపు కావొచ్చు. ఎందుకో చెపుతాను! చిన్నప్పటినుంచి అంతా నా ప్రతిభకు అచ్చెరువొందుతోంటే చాలా ఆనందించేదాన్ని. క్లాసులో ఫస్టొచ్చిన ప్రతిసారీ బళ్లో నాకొచ్చిన ప్రశంసల జల్లులని మదిలో ఒంపుకుని అంతులేని ఆనందాలను మూటకట్టుకొని ఇంటికి మోసుకొచ్చేదాన్ని. కానీ ఇంటి గడపకివతలే ఆ ఆనందాన్ని విడిచిపెట్టాలి. లేదంటే ఆ రోజుకిక అమ్మకీ నాకూ ప్రశాంతంగా రాత్రి గడవదు. ఇరుగు పొరుగుకి తెలియకుండా గుంభనంగా గడిపిన ఎన్నో నిద్రలేని రాత్రులింకా నా జ్ఞాపకాల కంటిపాపల్లోనే దాగున్నాయి. నా ఆకాంక్షలనీ, నేనధిరోహించాలనుకున్న ఎన్నెన్నో విజయపుటాశయాల ఆశలకెరటాలనూ మూతలు పడని ఆ కళ్లే మోస్తున్నాయింకా. నిజానికి టెన్త్‌తోనే నా చదువు ఆపేయాలన్న నాన్న ఆదేశాన్ని అమ్మ ధిక్కరించలేకపోయినా, ‘‘కనీసం డిగ్రీ అయినా లేకపోతే ఎవరు పెళ్లి చేసుకుంటారు?’’ అన్న మాటలకు లొంగి నాన్న నన్ను కనాకష్టంగా ఇంజనీరింగ్‌లో జాయిన్ చేశారు. నా ఫ్రెండ్స్ ఎందరికో బ్యాక్‌లాగ్స్ ఉండిపోతే, నేను మాత్రం థర్డ్ ఇయర్లో 86 పర్సంట్‌తో క్లాస్‌లో ఫస్ట్ ఉన్నాను. ఇంజనీరింగ్ కంప్లీట్ కాకుండానే హైదరాబాద్‌లో క్యాంపస్ సెలక్షన్స్‌లో ఓ మంచి కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించినా నాన్న ఒప్పుకోరేమోనన్న దిగులు.. నన్ను చాలా రోజులు అమ్మతో కూడా ఈ సంతోషాన్ని పంచుకోకుండా నివారించింది. చివరకు చాలా పెద్ద రాద్ధాంతం తరువాత నేను ఈ ఉద్యోగంలో చేరాను. ఆరు నెలలు కూడా కాలేదు నేనీ ఉద్యోగంలో చేరి. చేరినప్పటినుంచి నాన్న పెళ్లి చూపులకోసం పదే పదే వైజాగ్ రప్పిస్తున్నారు. ఆయన చెప్పిన అన్నింటికీ తలొగ్గి పెళ్లి చూపులకు ఒప్పుకున్నా, వృత్తిని కొనసాగిస్తూ, అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న నా ఆకాంక్షను ప్రతి పెళ్లికొడుక్కీ చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ ఏ పెళ్లికొడుక్కీ అతనికన్నా ఎక్కువ స్థాయిలో ఉండడం ఇష్టం ఉంటేనా? అందుకే ఇప్పటికి నలుగురైదుగురు పెళ్లికొడుకులు నా అందాన్ని సైతం కాదనుకుని వెనక్కెళ్లిపోయారు. చివరకు లక్షల కట్నం మానాన్న ఆశపెట్టినా నా ఉద్యోగం వాళ్లకు అడ్డంకిగా మారింది. ‘‘ఆడపిల్లలకు పెళ్లయ్యాక ఉద్యోగం ఎందుకన్నారొకరు. మీ నాన్న ప్రభుత్వోద్యోగిగా బాగానే సంపాదించారు. నీకెందుకీ శ్రమ అన్నారింకొందరు. అసలు ఉద్యోగం చేయాల్సిన ఖర్మ నీకెందుకు, మా అబ్బాయే అమెరికాలో లక్షలు సంపాదిస్తోంటే , ఏదో అందమైన అమ్మాయివనీ, మంచి ఇంగ్లీషు మాట్లాడతావనీ మా చుట్టాలు చెపితే నిన్ను చూశాం కానీ ఇలా ఏదో ఎదిగిపోవాలని ఉద్యోగాలు చేసే ఆలో^è న ఉన్నట్టు మాకు తెలియదు’’ అన్నారింకొకరు. అప్పుడు నా ఉద్యోగం మాన్పించాలన్న మానాన్న పోరు పరాకాష్టకి చేరింది. అయినా ఇన్నాళ్లూ నెట్టుకొచ్చాను. ఇప్పుడిప్పుడే నా డిపార్ట్మెంట్లో నాకు కొత్త బాధ్యతలప్పగించారు కదా? యిప్పుడప్పుడే ఊరికి రావడం కుదరదని నాన్నకి ఫోన్లో చెప్పాను. అంతే! నిన్న నాన్నే స్వయంగా దిగిపోయారు హైదరాబాద్‌లో. ఇప్పుడు నన్ను వెంటబెట్టుకెళుతున్నారు. అక్కడేం జరుగుతుందో తెలియదు. శని ఆదివారాలు కలుపుకుని మొత్తం నాలుగు రోజులు సెలవు పెట్టాను. మా బాస్‌కి సూచనప్రాయంగా చెప్పాను. ఏదో పెళ్లి గోలని. ఆయనప్పుడే అన్నారు. అందుకే పెళ్లిళ్లు కాని అమ్మాయిలకు ఉద్యోగాలివ్వడం చాలా పెద్ద తప్పని. లీవ్ లెటర్ ఇవ్వడానికెళితే హెచ్ఆర్లో ప్రవీణ్ కూడా అననే అన్నాడు ఎందుకు మేడం మీరు హాయిగా పెళ్లి చేసుకుంటే మీ స్థానంలో ఎవరైనా మగాళ్లకి అవకాశమిచ్చినట్టుంటుంది కదాని! అసలు అందరికీ నా ఉద్యోగంపైనే ఎందుకీ ఆక్షేపణ! బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. నేనీ మాటలు మానాన్న ముందు అంటే నిజంగానే మా నాన్న ఆ పని చేసేస్తారు కూడా. నన్నింటికి తీసుకెళ్ళి ఏం చేస్తారో తెలియదు. పెళ్లికయితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఆ తరువాతేం జరుగుతుందో చూద్దాం. నాకు మీరు చేయాల్సిన సాయం ఒక్కటే.. నా నాలుగు రోజుల లీవ్ అయిపోయినా నేను రాకపోతే పోలీసులకు కానీ, మీడియాకి కానీ నా నంబర్, అడ్రస్ ఇవ్వండి. - ఇట్లు మీ స్నేహితురాలు ఐదు రోజులు ఎదురుచూసి, ఆరవ రోజు మీడియాకిద్దామనుకున్న లేఖని రెండోసారి చదివాడు వాసు. ఆ అమ్మాయి వాళ్లింట్లో జరగబోయే విపత్తుని ముందుగానే ఊహించి రాసిన ఉత్తరం నేరుగా ‘చేతన’ మహిళా సంఘం నాయకురాలు పద్మ చేతిలో పడింది. అంతే! మరో గంటలో మీడియాతో సహా పద్మ, మరికొందరు మహిళా సంఘాల వాళ్లు ఆ అమ్మాయి యింటికెళ్లి చూసి అక్కడ జరుగుతున్న దారుణానికి అవాక్కయ్యారు. ఓ జంతువుని కట్టేసినట్టు గొలుసులతో చేతులను కట్టేసి, ఇంటి వెనుకనున్న స్టోర్ రూంలో దాచేసిన ఆ అమ్మాయిని విడిపించిన ఘటన వైజాగ్‌లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆమె స్వతంత్రంగా బతుకుతోంది. అమ్మాయిలకు అంతిమ లక్ష్యం పెళ్లి కాదని నిరూపిస్తూ, పెళ్లి చేసుకోకుండా స్వతంత్రంగా జీవిస్తోంది. స్వతంత్రంగా నా కాళ్లపై నేను నిలబడి నలుగురికీ ఆదర్శంగా ఉండాలన్నదే నా లక్ష్యం. పెళ్లి, పిల్లలూ.. ఇవన్నీ నాకిప్పుడు సెకండరీ అంటోందా అమ్మాయి. – అత్తలూరి అరుణ చదువు, ఉద్యోగం, వివాహం.. అన్నింటా వివక్షే అవును. లేఖలో ఆమె ఊహించిందే జరిగింది. ఆడపిల్లలకు అంతిమ లక్ష్యం పెళ్లి అన్నది ఈ సమాజం భావన. ఉద్యోగం కూడా రాబోయే వాడి కోసమే తప్ప తనకోసం కాదు. చదువుకుంటే ఒక సమస్య. చదువు లేకపోతే మరో సమస్య. ఒకరికి చదువుకున్న అమ్మాయి కావాలి. ఒకరికి పెద్దగా చదువుకోని అమ్మాయే కావాలి. ఇలా ఏదీ ఆ అమ్మాయికోసం కాదు. అన్నీ తన జీవితాన్ని శాసించే ఓ పురుషుడి కోసం. అతడి కోసం ఆమెను పోతపోసిన బొమ్మలా తయారు చేస్తారు. ఇది దుర్మార్గం. దీన్ని ప్రతిఘటించే చైతన్యం ఇప్పుడిప్పుడే వస్తోంది. ఈ కేసే అందుకు ఉదాహరణ. ఆ లేఖ రాసిన అమ్మాయి యిప్పుడు స్వతంత్రంగా బతుకుతోంది. తనకు నచ్చిన ఉద్యోగం చేస్తోంది. ఆడపిల్లల పుట్టుకను, చదువును, ఉద్యోగాన్నీ.. అన్నింటినీ ఆమె నుంచి దూరం చేయాలనే ఆలోచన. ఆస్తి కూడా ఆడపిల్లల పేరున ఉండకూడదనే ఎన్నో కేసులు నేను చూశాను. స్త్రీల పట్ల ఈ భావజాలం ఇప్పటిది కాదు. ఇది తరతరాలుగా కొనసాగుతూ వస్తోన్న మనువాద పురుషాధిపత్య భావజాలం. ఎన్నో అననుకూల పరిస్థితుల నుంచి ఆమె ఎదిగివచ్చినా చివరకు పెళ్లి అనే ఒక పరిధిలో కుదించేస్తారు. అక్కడితో ఆమె ఆలోచనలూ, ఆకాంక్షలూ చెరిగిపోతాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఎక్కడెక్కడైతే ఆమె ఎదుగుదలను నియంత్రించే పరిస్థితులున్నాయో అక్కడే ఆమె స్థిరంగా నిలబడే పరిస్థితి రావాలి. సమాజం నుంచి ఎదురౌతోన్న వివక్షనీ, అణచివేతనీ ఇక సహించబోమంటోంది నేటితరం స్త్రీ. అన్ని అవరోధాలను, అడ్డంకులను దాటుకొని తమకు తాముగా ఎదిగివస్తోన్న యువతులే ఈ అసమానతలను ఛేదించగలరు. – కత్తి పద్మ, ప్రధాన కార్యదర్శి, ‘చేతన’ మహిళా సంఘం, వైజాగ్ -
దుర్గమ్మ చెంతకు ఆర్జిత సేవలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమం): దుర్గగుడి ఈవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి మొవ్వ పద్మ తనదైన శైలిలో మార్పులకు శ్రీకారం చుట్టారు. మహా మండపంలో జరుగుతున్న పలు ఆర్జిత సేవలను ఆలయ ప్రాంగణంలో నిర్వహించేందుకు పాలకమండలి సభ్యుల ఆమోదాన్ని పొందారు. బుధవారం మాడపాటి సత్రంలో పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. దుర్గగుడిపై త్వరలోనే కీలక మార్పులు చేసేందుకు రంగం సిద్ధమైంది. మహా మండపంలోని, 3, 4 అంతస్తులోకి దేవస్థాన పరిపాలనా విభాగాన్ని తీసుకువచ్చేందుకు ఈవో పద్మ తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు శివరాత్రికి మల్లేశ్వరాలయ పనులు పూర్తికానందున ప్రత్యేక పూజలు, కల్యాణాన్ని నిలిపివేయాలని వైదిక కమిటీ నిర్ణయించింది. దీనిపై పాలకమండలి కూడా ఆమోదం తెలిపింది. కెనాల్‌రోడ్డులో జరిగే రథోత్సవంలో గంగా పార్వతి సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులు యధావిథిగా పాల్గొంటాయని పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి 26వ తేదీ మల్లేశ్వరస్వామి ఆలయ కళాన్యాస కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించేందుకు కమిటీ ఆమోదముద్ర తెలిపింది. ఆలయ పరిసరాలలోనే ఆర్జిత సేవలు శాంతి కల్యాణాన్ని రాజగోపు రం ఎదురుగా ఉన్న ఆశీర్వచన మండపంలోని, ఆశీర్వచన మం డపాన్ని ఆలయ ప్రాంగణంలోని కొబ్బరికాయలు కొట్టే ప్రదేశంలోకి, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాన్ని జై గంట వద్దకు, అష్టోత్తర, సహస్రనామార్చన పూజ లను అన్నదానం క్యూకాంప్లెక్స్లోకి, నటరాజ స్వా మి ఆలయ సమీ పంలోని యాగశాలలో రుద్రహోమం నిర్వహించాలని నిర్ణయించారు. అన్న ప్రా సనలు, అక్షరాభ్యాసాలు, నామకరణాలను ఇకపై నటరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న మండపంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. మల్లికార్జున మహామండపం తూర్పు భాగా న షెడ్డు నిర్మాణం చేయాలని దేవస్థానం నిర్ణయించింది. పాలకమండలి సభ్యులు ఆమోదం తెలపడంతో ప్రతిపాదనలను దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపనున్నారు. అంతరాలయ టికెట్ ధర తగ్గింపునకు ప్రతిపాదన అంతరాలయ టికెటు ధరను రూ.300 నుంచి రూ.250కి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పాలకమండలి మరో మారు ప్రభుత్వాన్ని కోరింది. అంతరాలయంలో జరిగే త్రికాల అర్చనలో మూడు షిప్టులలో రెండు షిప్టులను మాత్రమే అంతరాలయంలో నిర్వహిం చాలని, ఉదయం 11 గంటలకు జరిగే త్రికాల అర్చనను ఆల య ప్రాంగణంలో నిర్వహిస్తే భక్తుల దర్శనానికి ఇబ్బందులు ఉండబోవని పాలక మండలి భావిస్తుంది. దాతలకు మరిన్ని సదుపాయాలు ఆలయ అభివృద్ధితోపాటు అన్నదానానికి విరాళాలు ఇచ్చే దాతలకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని పాలక మండలి నిర్ణయించింది. రూ.లక్ష పైబడి రూ. 2లక్షలలోపు విరాళం ఇచ్చిన దాతలకు ఏడాదిలో రెండు పర్యాయాలు అమ్మవారి దర్శనం చేసుకునేఅవకాశం కల్పిస్తున్నామన్నారు. కుటుంబంలో ఆరుగురు సభ్యులకు మాత్రమే ఈ అవకాశాన్ని 10 ఏళ్లపాటు కల్పిస్తామన్నారు. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు విరాళం ఇచ్చిన దాతలకు ప్రతినెలా ఒకసారి అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా అనుమతిస్తామ న్నారు. రూ. 5 లక్షలు పైబడి విరాళం ఇచ్చిన దాతలకు ప్రత్యేక పాస్‌ను మంజూరు చేసి ఎప్పుడైనా అమ్మవారి దర్శనం చేసుకునే వీలు కల్పిస్తామన్నారు. టెండర్ నిబంధనలకు సవరణ ప్రస్తుతం దేవస్థానానికి సరుకులు పంపిణీ చేసేందుకు నిర్వహించే టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు ఆయా సంస్థలకు రూ.10 కోట్లు టర్నోవర్ ఉండాలనే నిబంధనలను పాలకమండలి సవరించింది. ఏడాదికి టర్నోవర్‌ను రూ.10 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గించడం వల్ల మరింత మంది వ్యాపారులు టెండర్ల పక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుందని పాలకమండలి సభ్యులు భావిస్తున్నారు. ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కమిషనర్‌కు పంపడం జరిగింది. -
బతికొచ్చింది
హైదరాబాద్.. శంషాబాద్ ఎయిర్పోర్ట్.. ఇంటర్నేషనల్ అరైవల్స్. గుంపులు గుంపులుగా జనం.. ట్రాలీలు ట్రాలీలుగా లగేజ్‌తో బయటకు వస్తున్నారు. వాళ్లలో ఓ నడివయసు స్త్రీ కూడా ఉంది. ఆకుపచ్చ రంగు సల్వార్ కమీజ్‌తో బేలగా ట్రాలీని తోసుకుంటూ వచ్చింది. ఆ మొహంలో అలసట కనిపిస్తోంది. ఇంతలో ఆమెను చేరుకోవాల్సిన వాళ్లు చేరుకున్నారు. అక్కున చేర్చుకున్నారు. నీళ్ల సీసా అందివ్వగానే ఒక్క గుక్కన ఆ నీళ్లను తాగేసింది. ఆ ఒక్క గుక్కతో.. గొంతు దప్పికే కాదు, సొంతగడ్డను చేరాలనే పద్మ ఏడేళ్ల దాహమూ తీరినట్టయింది. ‘‘టిఫిన్ ఏం తింటారు?’’ అంటే.. ‘‘మనసు, కడుపు నిండినట్టయింది. ఏమొద్దు’’ అంది కళ్లనిండా నీళ్లతో. ‘‘కాస్త ఎంగిలి పడండి’’ అని బలవంతం చేస్తే.. ‘‘ఏడేళ్ల నుంచి ఇడ్లీ తినలేదు. అది ఇప్పించండి’’ అంది మొహమాటంగా. ఎప్పుడో.. బిడ్డకు ఏడేళ్ల వయసున్నప్పుడు బతుకుతెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లింది పద్మ. దాదాపు ఏడేళ్లు ‘చెర’లో ఉంది. బిడ్డను గుండెకు హత్తుకొని తనివి తీరా ఏడ్వాలి. అదే ఇప్పుడు ఆమె తొందర. నాలుగు రాళ్ల కోసం ఎడారికి బల్ల పద్మ పాండే స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం, బల్లపేట. ఒక్కతే కూతురు. పెయింటర్ అయిన శ్రీనివాస్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఓ కూతురు పుట్టింది. శ్రీనివాస్‌కు ఊళ్లో పెద్దగా పనిలేదు. ‘దుబాయ్‌లో పని ఉంది. రూపాయల్లో కంటే దీరమ్స్‌లో బాగా సంపాదించొచ్చు’ అని బల్లపేటలో అప్పటికే గల్ఫ్‌లో ఉంటున్నవాళ్లు చెప్పారు. అతడికి ఆశ కలిగింది. దుబాయ్ వెళ్లాడు. అలాగే పద్మ. అంతకుముందే ఆ ఊరి నుంచి డొమెస్టిక్ వర్కర్స్‌గా (పనిమనుషులుగా) ఎడారిబాట పట్టిన వాళ్లు అక్కడ సంపాదన బాగా ఉంటుందని ఆమెకు చెప్పారు. భూమి కొనుక్కుందాం.. ఇల్లు కట్టుకుందాం.. బిడ్డను బాగా చదివిద్దాం.. అనుకున్నారు పద్మ, శ్రీనివాస్‌లు. భార్యను బెహ్రెయిన్ వెళ్లమని చెప్పాడు భర్త. వెళ్లి రెండేళ్లు ఉండి వచ్చింది. కొంచెం సంపాదించుకుంది. ఓ ఆర్నెల్లకు దుబాయ్‌కి అవకాశం వస్తే దుబాయ్‌కీ వెళ్లింది. కాని బెహ్రెయిన్లా లేదు.. అక్కడ తను ఉంటున్న షేక్ ఇంట్లో పరిస్థితి. హింసపెట్టేవాళ్లు. ఉండలేక ఇండియా వచ్చేసింది. మళ్లీ ఆర్నెల్లకి కువైట్‌కు వెళ్లే చాన్స్ దొరికింది. వెళ్లింది. వేధింపులు సాధింపులే జీతం! కువైట్‌లో ఓ బాబా (షేక్) ఇంట్లో పనిమనిషిగా కొలువు. బాబా చాలా మంచివాడు. ఏడాదిన్నర పాటు జీతం బాగానే ఇచ్చాడు. బాగా చూసుకునేవాడు కూడా. కాని కాలం అలా సాగలేదు. బాబా చనిపోయాడు. పద్మ పరిస్థితి తలకిందులైంది. నిజానికి ఆమెకు రెండేళ్లే ఆ ఇంట్లో వర్క్ పర్మిట్ వీసా ఉంది. బాబా చనిపోయేనాటికి రెండేళ్లు పూర్తికావొచ్చాయి. ఆమెను తిరిగి ఇండియాకు పంపించేయాలి. అయితే బాబా భార్య అలా చేయలేదు. పద్మను పంపించకపోగా ఆమెను వేధించడం మొదలుపెట్టింది. జీతం ఇవ్వడం మానేసింది. రోజుకు ఒక్కపూటే తిండి. ఇండియా నుంచి తనవాళ్లు ఫోన్ చేసినా.. తనకు ఫోన్ చేయాలనిపించినా ఫోన్ ఇచ్చేది కాదు. యజమాను రాలు ఇంకో పెళ్లి చేసుకుంది. ఆమె పెట్టే టార్చర్‌కు కొత్తగా వచ్చిన షేక్, యజమానురాలి కొడుకూ తోడయ్యారు. కొట్టేవాళ్లు. తిట్టేవాళ్లు. ఇంట్లోంచి బయటకు వెళ్లనీయకుండా కాపలా కాసేవారు. కూరలు కోసే చాకును వేడి చేసి ఒంటి మీద వాతలు పెట్టేవాళ్లు. అలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా అయిదేళ్లు గడిపింది. కూతురుని, భర్తను, తన తల్లిదండ్రులు, అత్తమామలను తలచుకుంటూ ఏడ్చేది. పద్మ మీద బెంగతో వాళ్ల నాన్న మంచం పట్టి కన్నుమూశాడు. ఈ విషయమూ ఆమెకు తెలియదు. తాళం చెవి బతికించింది! ఓ రోజు బట్టలు ఆరేసి వచ్చిన పద్మకు టీపాయ్ మీద బయటి గుమ్మం తాళంచెవి పడేసి తన గదిలోకి వెళ్తున్న యజమానురాలి కూతురు కనిపించింది. ఆ అమ్మాయి గది తలుపేసుకోగానే.. చివికిపోయిన నాలుగు జతల దుస్తులను తన బ్యాగ్‌లో కుక్కేసుకొని ఆ తాళంచెవితో గుమ్మం తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది. అప్పటికే ఒంటినిండా గాయాలతో, నీరసంగా ఉంది. ఏ దారో తెలియదు. ఎక్కడికి చేరుకోవాలో అంతకన్నా తెలియదు. పరిగెత్తి పరిగెత్తి అలసి సొమ్మసిల్లిపోయింది ఒకచోట. దారినపోయే వాళ్లు తట్టిలేపి పలకరించారు. అక్కడికి వచ్చిన ఓ కువైట్ మహిళ ఆమె గురించి తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులకు తన వివరాలు.. యజమాని వేధింపులు అన్నీ చెప్పింది. వాళ్లు కంప్లయింట్ రాసుకున్నారు. తన వాళ్ల నంబర్ ఇచ్చింది. మాట్లాడారు. పద్మను చికిత్స కోసం హాస్పిటల్‌కు పంపారు. ఆ తర్వాత అక్కడున్న ప్రవాసీ భారతీయ సామాజిక కార్యకర్తల సహాయమూ పద్మకు అందింది. వాళ్లందరి సహకారంతోనే చివరికి ఇలా ఇండియాకు వచ్చింది. తన వాళ్లను కలుసుకుంది. దూరపు ఎడారి ఎండమావులతో భ్రమింప చేస్తుంది. కాసుల పంట పండుతుందని ఆశ పుట్టిస్తుంది. వెళితే ఒయాసిస్సు జాడా కూడా కనపడనివ్వక దాహంతో గొంతు పిడుచకట్టుకు పోయేలా తిప్పుతుంది. ఉన్న సొమ్ము ఏజెంట్ చేతిలో పెట్టి సొమ్మసిల్లి ఇల్లు చేరుతారు. కొండంత పేరుకుపోయిన అప్పుల భయంతో మళ్లీ పాత భ్రమతో ఇంకో ఎడారి దేశం పయనం అవుతారు. ఇది నిరంతర ప్రక్రియ. గల్ఫ్ గల్లా గలగలలు వలస బాట పొమ్మని పోరుతుంటాయి. మంచిదే. కానీ ఆచితూచి.. మంచిచెడులు ఆలోచించి.. అన్నీ తెలుసుకుని వెళితేనే లాభమూ.. క్షేమమూ! మళ్లీ ఇక ఏ దేశానికీ పోను! నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. నా మీద బెంగతో మానాన్న చనిపోయాడు. చివరిచూపు కాదు కదా, చివరి మాట మాట్లాడే భాగ్యానిక్కూడా నేను నోచుకోలేదు. ఏడేళ్లు బందిఖానాలో ఉన్నా. నా పని నచ్చకపోతే నన్ను పంపించేయండి అని మొత్తుకున్నా. అయినా పంపలేదు. జీతం ఇవ్వలేదు. నా వాళ్లకు దూరమయ్యా. ఆరోగ్యం పాడైంది. ఇక ఎప్పుడూ ఏ దేశానికీ వెళ్లను. నా కూతురు, అమ్మ, మా అత్తమామలు, నా భర్త.. ఇదే నాలోకం. వాళ్లను చూసుకుంటూ ఉంటా. పనిమనుషులుగా గల్ఫ్‌కి వెళ్లేవాళ్లు ముందే ఆ చట్టాలు, ఆ పద్ధతులు, ఆ భాష పట్ల అవగాహన కల్పించుకోవాలి. అన్నీ తెలుసుకునే వెళ్లాలి. – బల్ల పద్మ పాండే – సరస్వతి ర -
ఏడేళ్ల నరకానికి విముక్తి...
రాజోలు: ఉపాధి కోసం కువైట్ వెళ్లిన మహిళ ఏడేళ్లపాటు నరకం చూసింది సఖినేటిపల్లి బళ్లపేటకు చెందిన నల్లి పద్మపాండే. ఎట్టకేలకు నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చొరవతో శనివారం భారత దేశానికి తిరిగి వచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పద్మను నేషనల్ వెల్ఫేర్ ట్రస్ట్ కో–ఆర్డినేటర్ లిస్సీ జోసఫ్ చొరవతీసుకొని ప్రత్యేక వాహనంలో స్వగ్రామం పంపించే ఏర్పాటు చేశారు. వివరాలిలా ఉన్నాయి...సఖినేటిపల్లి బళ్లపేటకు చెందిన బళ్ల పద్మపాండేకు మలికిపురం మండలం పడమటిపాలెం గ్రామానికి చెందిన నల్లి శ్రీనుతో వివాహమైంది. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ఉపాధి కోసం పద్మ కువైట్ వెళ్లింది. అంతే ఆమె జీవితంలో నరకం ప్రారంభమైంది. కువైట్ వెళ్లిన రెండేళ్లపాటు కుటుంబ సభ్యులతో ఫోన్, ఉత్తరాల ద్వారా ‘తాను చాలా ఇబ్బందులు పడుతున్నాని, ఇండియాకు వచ్చేస్తా’నని చెప్పేది. తరువాత ఫోన్ కాని, ఉత్తరం కాని ఆమె నుంచి రాకపోవడంతో చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. సుమారు ఆరు నెలల క్రితం కువైట్‌లో తీవ్ర కాలిన గాయాలు, దెబ్బలతో ఓ మహిళ రోడ్డు పక్కన పడి ఉండడాన్ని ఉపాధి కోసం వెళ్లిన తెలుగువారు గుర్తించారు. తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉంటారని ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. సోషల్ మీడియా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ చిత్రాన్ని సఖినేటిపల్లి మండలం బళ్లపేటలోని పద్మ మేనమామ నక్కా రామారావు గుర్తించారు. మేనకోడలను ఎలాగైనా స్వదేశానికి తీసుకుని రావాలని రాజోలులో ఉన్న నేషనల్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యుడు, న్యాయవాది నల్లి శంకర్‌ను సంప్రదించారు. కువైట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మను భార త రాయబార కార్యాలయం ద్వారా స్వగ్రామానికి తీసుకుని వచ్చేందుకు కృషి చేశారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావులు ఇచ్చిన సిఫార్సు లేఖలు ద్వారా ఎట్టకేలకు కువైట్ నుంచి హైదరాబాదు ... అక్కడ నుంచి గురువారం రాత్రి 10 గంటలకు స్వగ్రామానికి చేరుకోగలిగిందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అన్ని విధాలా నష్టపోయిన పద్మను ప్రభుత్వం ఆదుకోవాలని, ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. -
ప్లాస్టిక్ ఫ్రీ టెంపుల్‌గా దుర్గగుడి
విజయవాడ: ప్లాస్టిక్ ఫ్రీ టెంపుల్‌గా విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాన్ని తీర్చిదిద్దుదామంటూ నూతన ఈవో పద్మ సలహా ఇచ్చారు. దుర్గ గుడి నూతన ఈవోగా నియమితులైన ఎం.పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాడపాటివారి సత్రంలో దుర్గగుడి పాలకమండలి సమావేశం ఏర్పాటు చేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె అద్యక్షతన మొట్టమొదటి పాలకమండలి సమావేశం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఫిబ్రవరి చివరి వారంలో శివాలయం తెరుద్దామని అనుకుంటున్నామని చెప్పారు. దుర్గ గుడిలో రేట్లు గురించి కూడా చర్చించామని వెల్లడించారు. త్వరలో ఈ విషయం గురించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శివరాత్రికి శివాలయ దర్శనం ఇవ్వాలని అనుకున్నాం..కానీ మూహూర్తలు లేనందువల్ల ఫిబ్రవరిలో నెలాఖరులో శివాలయం దర్శనం కల్పించేలా చూస్తామని చెప్పారు. భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా, అగమ శాస్త్రం అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటానని వెల్లడించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా, దుర్గగుడి ఈవోగా రెండు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారని, దేవస్థానంలో ఆఫీసు ఏర్పాటు చెయ్యాలని ప్రతిపాదించారు..అలా చెయ్యటం వల్ల దేవాలయంలో అవినీతి తగ్గి భక్తులకు మెరుగైన సేవలు అందుతాయని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న కార్యక్రమాలు అధ్యయనం చేసి ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ పారదర్శకంగా ఉండే విధంగా అమలు చేయ్యటం జరుగుతుందన్నారు. ప్రతి నెల మొదటి వారంలో పాలకమండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. -
సమస్యలు.. సవాళ్లు!
సాక్షి, విజయవాడ : దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా ఐఏఎస్ అధికారి ఎం.పద్మ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమెకు అనేక సమస్యలు, సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. గత ఈఓలు నిష్క్రమించిన తీరును చూస్తే ఆలయ ఈఓ పదవి ముళ్ల కిరీటం వంటిదని అర్థమవుతుంది. ఆలయంలోని సమస్యలనే కాదు, రాజకీయ ఒత్తిళ్లనూ ఎదుర్కోక తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రి లోకేష్ కోసం గత ఈఓ సూర్యకుమారి తాంత్రిక పూజలు నిర్వహించారన్న ఆరోపణలు రావడంతో బదిలీకాక తప్పలేదు. దేవస్థానంలో దీర్ఘకాలంగా తిష్టవేసిన అధికారులు, ఉద్యోగులు, పాలకమండలి నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవినీతి సర్వాంతర్యామి! దుర్గగుడిలో అవినీతి సర్వాంతర్యామిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. అన్నదానం, ప్రసాదాలు తయారీ, అకౌంట్స్, స్టోర్స్, టికెట్ విక్రయాలు, ఇంజినీరింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ అవినీతిని విజిలెన్స్ అధికారులు గత ఏడాది ఎండగట్టారు. అటెండర్లు టికెట్లను రీసైక్లింగ్ చేస్తుండగా భక్తులు పట్టుకుని అధికారులకు అప్పగించారు. అన్నదానంలో భోజనం చేసిన భక్తుల కంటే ఎక్కువ మందిని లెక్క చూపించడం, అకౌంట్ విభాగంలో అడ్వాన్సులు తీసుకోవడం, ప్రసాదాల తయారీ దిట్టంలో హస్తలాఘవం, అడ్డగోలు నిర్మాణాలు చేపట్టడం, వాటిని కూల్చివేయడం వంటివి సర్వ సాధారణమయ్యాయి. దేవస్థానంలో దీర్ఘకాలంగా తిష్టవేసిన అధికారులకు ఎన్నిరకాలుగా అవినీతి చేయాలో తెలుసన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ఈఓ దేవస్థానంలో తిష్టవేసిన అవినీతిపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. తరిగిపోతున్న అమ్మవారి మూలధనం దేవస్థానంలో అభివృద్ధి పేరుతో అనేక భవనాలను కూల్చివేశారు. కొత్తకొత్త నిర్మాణాలు చేపట్టారు. ఇటీవల అన్నదానం కోసం తాత్కాలిక భవనం నిర్మించారు. అర్జున వీధిలో అందం కోసం పర్గోలా నిర్మిస్తున్నారు. ఘాట్‌రోడ్డుకు తరుచూ మరమ్మతులు చేస్తున్నారు. భవానీమండపం, అన్నదానం భవనం కూల్చిన చోట నూతన నిర్మాణాలు చేయాల్సి ఉంది. అభివృద్ధి పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు ఆలయ మూల నిధులు తరిగి పోతున్నాయి. రూ.125 కోట్ల మూలధనం రూ.60 కోట్లకు తగ్గిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న పనులకు ఉన్న మూలధనం చాలదు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సాయంగా అందనందునే ఈ పరిస్థితి నెలకొంది. కొత్త ఈఓ మూలధనం పెంచాల్సిన అవసరం ఉంది. రాజకీయ నేతల ఒత్తిళ్లు దుర్గగుడిలో అర్చకుల నుంచి సిబ్బంది వరకు జిల్లాలో ఎవరో ఒక నాయకుడితో సంబంధాలు ఉన్నాయి. గుడిలో చీమ చిటుక్కుమన్నా, జిల్లాకు చెందిన ఒక మంత్రికి, ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి చేరిపోతాయి. వెంటనే వారి నుంచి ఈఓకు ఆదేశాలు అందుతాయి. లడ్డూ ప్రసాదాల రేట్లు పెంచుతూ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను ఓ మంత్రి ఆదేశాల మేరకు తగ్గించారు. అధికార పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తరుచుగా ఈఓలకు ఏదోఒక సిఫార్సు చేస్తూనే ఉంటారని సమాచారం. కొత్తగా వచ్చే ఈఓ వీటన్నింటినీ తట్టుకుని ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. పాలకమండలిలో కొందరు సభ్యులు అత్యుత్సాహంతో అధికారులకు ఆదేశాలు ఇస్తూ, పాటించకుంటే ఆగ్రహం వ్యక్తంచేస్తుంటారు. భక్తులకు సౌకర్యాలు నిల్ రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఆలయమైనప్పటికీ భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. ఒకటి రెండు రోజులు అమ్మవారి సన్నిధిలో ఉండేందుకు కాటేజీలు అసలే లేవు. ఘాట్ రోడ్డును తరుచు మూసివేస్తూ ఉం టారు. లిప్టులు ఉన్నా.. సామాన్య భక్తులకు అందుబాటులో ఉండవు. దీంతో ఏడంతస్తులూ ఎక్కి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందే. అన్నదానం కోసం గంటలుతరబడి వేచి ఉండాలి. వారాంతంలోనూ, పర్వదినాల్లో ప్రసాదాలు అం తంత మాత్రంగానే లభిస్తాయి. దసరా ఉత్సవాలు, భవానీదీక్షలప్పుడు కనీసం నాలుగు కిలో మీటర్ల దూరం నడిస్తే కానీ అమ్మవారి దర్శన భాగ్యం కలగదు. భక్తులకు వాహనాల పార్కింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ సమస్యలను పరిష్కరిస్తే దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగి మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. -
మళ్లీ ఐఏఎస్ అధికారి
సాక్షి, విజయవాడ: జిల్లాలోని మొవ్వ మండలానికి చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ మొవ్వ పద్మ దుర్గగుడి కార్యనిర్వహణాధికారి(ఈఓ) గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పద్మ ప్రస్తుతం ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లదేవస్థానం (దుర్గగుడి) ఈఓ బాధ్యతలతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. దుర్గగుడిలో జరిగిన తాంత్రిక పూజలకు బాధ్యురాలిని చేస్తూ తొలి మహిళా ఐఏఎస్ అధికారి ఎ.సూర్యకుమారిని ఈఓ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. మళ్లీ ఈఓగా మహిళా ఐఏఎస్ అధికారినే నియమించింది. ఆధార్ అనుసంధానంలో.... పద్మ కృష్ణాజిల్లాలో జన్మించినా విద్యాభాసం తిరుపతిలోనే జరిగింది. ఎస్వీ యూనివర్పీటీలోనే పీజీ, పీహెచ్డీ చేశారు. 1993లో గ్రూపు–1 అధికారిగా ఉద్యోగంలో చేరారు. 2004 బ్యాచ్‌లో ఐఏఎస్ అధికారిగా మారారు. దశాబ్ద కాలంగా ల్యాండ్ రికార్డ్స్, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమశాఖ, పౌరసరఫరాలశాఖలో వివిధ హోదాల్లో పద్మ బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగ విద్యార్థులకు ఉపకారవేతనాలు సక్రమంగా అందేందుకు వీలుగా సెంట్రర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కింద ప్రత్యేక ఆన్లైన్ అప్లికేషన్ తయారీలో ఆమె కీలక పాత్ర పోషించారు. వివిధ పథకాలను ఆధార్‌తో అనుసంధానం చేయడంలో కృషి చేశారు. గిరిజన సంక్షేమ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఆమె భర్త వి.వి.ఆర్.ప్రసాద్ ఈసీఐఎల్‌లో డీజీఎం గాపని చేసి ఉద్యోగవిరమణ పొందారు. అమ్మవారి దయతో అన్నీ చక్కదిద్దుతా ఈఓగా నియమితులైన పద్మ ‘సాక్షి’తో మాట్లాడారు. అమ్మవారి దయతో దుర్గగుడిలోని అన్ని సమస్యలను చక్కదిద్దుతానన్నారు. వచ్చేవారం ఈఓగా బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు. కనకదుర్గమ్మకు సేవ చేసే అవకాశం రావడంతో సంతోషంగా ఉందన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధే తనకు ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. -
దుర్గగుడి నూతన ఈవోగా పద్మ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. విజయవాడ దుర్గ గుడి ఆలయ నూతన ఈవోగా ఐఏఎస్ అధికారిణి డాక్టర్ ఎం.పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పద్మ ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2004 బ్యాచ్‌కు చెందిన ఆమె మరో రెండు రోజుల్లో ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే రోడ్డు భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రశాద్, పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది, (జీఏడీ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు), ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్‌ను ప్రభుత్వం రిజర్వ్‌లో ఉంచింది. ఆయనను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. -
ఆ పుకార్లు నమ్మొద్దు
సాక్షి, సిటీబ్యూరో: కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్), జర్నలిస్టు హెల్త్ స్కీం(జేహెచ్ఎస్) లబ్దిదారులకు వైద్యసేవలు నిలిచిపోయినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఈహెచ్ఎస్ సీఈఓ డాక్టర్ పద్మ అన్నారు. నెట్వర్క్ పరిధిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు సహా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పూర్తిస్థాయి వైద్యసేవలు అందుతున్నాయన్నారు. వైద్యసేవలు అందడం లేదని వస్తున్న పుకార్లను నమ్మవద్దని లబ్దిదారులకు సూచించారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. కార్పొరేట్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, అత్యవసర పరిస్థితుల్లో నేరుగా ఆయా ఆస్పత్రులకు వెళ్లి చికిత్సలు పొందవచ్చునని సూచించారు. వైద్య ఖర్చుల విషయంలో ఎలాంటి పరిమితి లేదని, లబ్దిదారుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే చాలు ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ లబ్దిదారులు వైద్యసేవలు అందించేందుకు నెట్వర్క్ పరిధిలో 269 ప్రైవేటు, 65 ప్రభుత్వ, 18 కార్పొరేట్ ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. 12 లక్షల మంది లబ్డిదారులు ఉండగా ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల మంది ఓపీ సేవలు వినియోగించుకున్నారు. 1.70 లక్షల మందికి పైగా ఇన్ పేషెంట్ సర్వీసులు పొందారు. అత్యవసర పరిస్థితుల్లో లబ్దిదారులు ఆయా ఆస్పత్రులకు నేరుగా వెళ్లి అడ్మిట్ కావొ చ్చు, రోగి వివరాలు ఆయా ఆస్పత్రులు ఆన్ లైన్ ద్వారా ట్రస్ట్‌కు చేరవేస్తాయి. సర్జరీ అనివార్యమైతే ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే సరి పోతుంది. త్వరలో బయోమెట్రిక్ విధానంః ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో రోజు సగటు ఓపీ 1100 నుంచి 1200 నమోదు అవుతుండగా, వనస్థలిపురంలో 600 నుంచి 700, వరంగల్ సెంటర్లో 300 నుంచి 400 నమోదు అవుతుంది. రోజుకు 200 మంది ఇన్‌పేషంట్లుగా చేరుతున్నారు. ఆయా కేంద్రాల్లో రోగుల నిష్ప త్తికి తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొంత ఇబ్బ ందులు ఎదురవుతున్నాయి. వచ్చిన రోగి ఎక్కువ సేపు నిరీ క్షించాల్సిన అవసరం లేకుండా బయోమెట్రిక్ విధానం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించాం. కూకట్పల్లి, పాతబస్తీ వెల్నెస్ సెంటర్లను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాం’ అని సీఈఓ డాక్టర్ పద్మ పేర్కొన్నారు. -
వీడని వివక్ష.. తప్పని కష్టం
ద్వారకాతిరుమల: ఆడపిల్లను కన్నందుకు అత్తింటి వివక్షతతో బతుకీడుస్తున్న గురజాల పద్మ కథ మళ్లీ మొదటికొచ్చింది. అత్తింటి ఆదరణ నోచుకోక పలుమార్లు తిరస్కారానికి గురై బిడ్డతో సహా రోడ్డున పడ్డ పద్మ మరోసారి అత్తింటి నుంచి గెంటివేయబడింది. శనివారం ఉదయం పద్మను ఆమె అత్త ఆదిలక్ష్మి కొట్టి, బిడ్డతో సహా ఇంటి నుంచి నెట్టేసింది. విషయం తెలి సిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, గోపాలపురం ని యోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు తదితరులు బాధితురాలు పద్మకు వెన్నుదన్నుగా నిలిచారు. పద్మ ఉంటున్న మలసానికుంట గ్రామంలో ఆమె అత్తింటికి వెళ్లి అత్త ఆదిలక్ష్మికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో బలవంతంగా ఇంటి తలుపులు తెరిచి పద్మను, ఆమె బిడ్డను ఇంటిలోకి పంపిం చారు. అనంతరం బాధితురాలు పద్మ వైఎస్సార్ సీపీ నేతల అండతో ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌కు చేరుకుని అత్తమామలు ఆదిలక్ష్మి, ఆంజనేయులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. నచ్చజెప్పినా వినలేదు వైఎస్సార్ సీపీ నేతలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, తలారి వెంకట్రావు, పార్టీ మండల కన్వీ నర్ ప్రతాపనేని వాసు, నేతలు బుసనబోయిన సత్యనారాయణ, సర్పంచ్ బత్తు ల విజయ్‌శేఖర్, అఖిలభారత యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు సాయిల స్వాతి, జిల్లా యాదవ సంఘ ఉపాధ్యక్షుడు ఉక్కుసూరి గోపాలకృష్ణ తదితరులు పద్మ అత్త ఆదిలక్ష్మితో మాట్లాడారు. అయినా ఆదిలక్ష్మి వినకపోవడంతో బలవంతంగా తలుపులు తెరిచారు. వెంటనే చర్యలు తీసుకోవాలి పసిబిడ్డతో సహా పద్మను చిత్రహింసలకు గురిచేస్తున్న అత్తమామలు, పట్టించుకోని భర్తను వెంటనే అరెస్ట్ చేయాలని పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, తలారి వెంకట్రావు డిమాం డ్ చేశారు. తమ పార్టీ తరఫున పద్మకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. చంటి బిడ్డతో ఒంటరిగా ఇంట్లో ఉంటున్న తనను అత్తింటి వారు తన్ని తరిమేస్తున్నారని పద్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్త, అత్తమామలు తమను కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతోంది. కేసులు పెడితే ఎలా ఉండనిస్తాం కేసులు పెట్టిన అమ్మాయి మా ఇంట్లో ఉండటానికి కుదరదని పద్మ అత్త ఆదిలక్ష్మి అంటోంది. తమను ఇష్టానుసారంగా తిడుతూ, మీ అంతు చూస్తానని బెదిరి స్తోందని ఆదిలక్ష్మి ఆరోపించింది. పెట్టిన కేసులు తేలకుండా ఇంట్లో ఎలా ఉం టుందని ఆదిలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
బంగారు కాదు.. బందీల తెలంగాణ
హన్మకొండ: రాష్ట్రంలో పరిస్థితిని చూస్తే మరో నిజాం, రజాకార్ల పాలన సాగుతున్నట్లుగా కనిపిస్తోందని, ఇది బంగారు తెలంగాణ కాదు.. బందీల తెలంగాన అని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ధ్వజమెత్తారు. నిరుద్యోగ సమస్యలపై బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గుండమీది శ్రీనివాస్‌తో పాటు నాయకులను మంగళవారం సుబేదారి పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్లో రావు పద్మ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పౌరహక్కులను హరిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలు కుమ్మరించి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలుచేయకుండా టీఆర్ఎస్ మోసం చేస్తోందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా వారిని దగా చేసిందని విమర్శించారు. ఇచ్చిన మాట నిలుపుకోవాలని ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్న వారిని నిర్భంధించిడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తారని భావించి జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచే బీజేపీ, బీజేవైఎం నాయకులను అరెస్టు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. స్వరాష్ట్రం కోసం పోరాడితే అరెస్ట్ చేశారని, సాధించుకున్న తెలంగాణలో ఆకాంక్షలు నెరవేర్చాలని కోరితే కూడా అరెస్టులు కొనసాగిస్తున్నారని ఆమె అన్నారు. అరెస్టయిన వారిలో బీజేపీ అర్బన్ జిల్లా కార్యదర్శి సంతోష్‌రెడ్డి, బీజైవైఎం, బీజేపీ నాయకులు వంశీచంద్‌రెడ్డి, రాంకీయాదవ్, తాళ్ల శ్యాం, హరీష్, దినేష్, రాజు, శ్రీహరియాదవ్, హరీష్ ఉన్నారు. -
పాపం పద్మ!
వీడని అత్తింటి వివక్ష పోరాడుతున్నా కనికరించని వైనం తల్లీబిడ్డలను పట్టించుకోని కుటుంబం దేవరపల్లి : అమ్మాయి పుట్టిందన్న సాకుతో భర్త, అత్తమామలు చూపుతున్న వివక్షపై పోరాడుతున్న ఆ తల్లికి మోక్షం కలగడం లేదు. పోలీసు కేసు నమోదై బాధితురాలికి మహిళా సంఘాలు, న్యాయస్థానం అండగా నిలిచినా ఆ కుటుంబం మాత్రం కనికరం చూపడం లేదు. మూడు రోజులుగా వర్షం పసిబిడ్డతో తడుస్తూ వారి ఇంటి ముందే ఎదురుచూస్తున్న ఆమెను చూసి గ్రామస్తులు చలించిపోయారు. శనివారం సర్పంచ్ సాయంతో ఆమె అత్తింటి తలుపు తెరిచి తల్లీబిడ్డలను లోనికి పంపారు. అయితే తానకు, బిడ్డకు పోషణ ఎలా అని ఆ తల్లి రోదిస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. ద్వారకాతిరుమల మండలంలోని మలసానికుంటలో ఆడబిడ్డ పుట్టిందని గురజాల పద్మను భర్త సత్యనారాయణ, అత్తమామలు ఆదిలక్ష్మి, ఆంజనేయులు పట్టించుకోకుండా అదే గ్రామంలోని తమ పొలంలోని ఇంట్లో ఉంటున్న విషయం తెలిసిందే. పద్మ అత్తింటి ముందు ఈనెల 5 నుంచి మౌనపోరాటం చేస్తుండగా 9న విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా న్యాయమూర్తి గంధం సునీత సైతం స్పందించడంతో ఈనెల 10న బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్టేషన్లో భర్త, అత్తమామలపై కేసు నమోదైంది. పద్మకు మహిళా సమాఖ్య, దళిత హక్కుల పోరాట సమితి, మహిళా ఛైతన్య సమాఖ్య సంఘాలు అండగా నిలిచాయి. భర్త, అత్తమామలకు కౌన్సెలింగ్ నిర్వహించి ఆమెను వారికి అప్పగించారు. ఇంత జరిగినా అయితే అత్తింటి వారిలో ఏమాత్రం మార్పు రాలేదు. మళ్లీ పద్మను ఇంటిబయటే వదిలేసి, వారంతా పొలంలోని ఇంటికి వెళ్లిపోయారు. పద్మ మాత్రం తన బిడ్డతో ఇంటి బయటే మౌనపోరాటం చేస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆరుబయట పసిపాపతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పద్మను చూసి చలించిన స్థానికులు గ్రామ సర్పంచ్ బత్తుల విజయశేఖర్‌కు విషయాన్ని తెలిపారు. దీంతో ఆయన, పలువురు పెద్దలు వారి ఇంటికి చేరుకుని, ఇంటి తలుపులు తెరచి తల్లీబిడ్డలను లోనికి పంపారు. తనకు, బిడ్డకు న్యాయం చేయాలని పద్మ వేడుకుంటోంది. -
ముగ్గురి ఆత్మహత్య
∙అమలాపురంలో తిరుపతికి చెందిన వైద్య విద్యార్థి ∙కాణిపాకంలో యువకుడు ∙పలమనేరు మండలంలో వివాహిత ∙ఉరి వేసుకుని మృతి వేర్వేరు కారణాలతో జిల్లా వాసులు ముగ్గురు ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చదువుతున్న తిరుపతికి చెందిన వైద్య విద్యార్థి, ఐరాలలో ఓ యువకుడు, పలమనేరు మండలంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక ఒత్తిడితో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అక్కడి విద్యార్థులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అమలాపురం రూరల్: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న తిరుపతికి చెందిన బండారం వివేక్ (23) కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడి వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని తోటి విద్యార్థులు, పోలీసులు అనుమానిస్తున్నారు. మానసిక ఒత్తిడి తగ్గటానికి వివేక్ మందులు వాడుతున్నట్లు తోటి విద్యార్థులు తెలిపారు. క్రమశిక్షణతో ఉండే వివేక్ చదువులో చురుగ్గానే ఉంటాడని, మితభాషి అని స్నేహితులు చెప్పారు. వివేక్ బుధవారం కళాశాలకు వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉండిపోయాడు. మధ్యాహ్నం కళాశాల నుంచి హాస్టల్‌కు వచ్చిన రూమ్మేట్స్ సాయికృష్ణ, శ్రీకాంత్ తలుపు గడియ వేసి ఉండటంతో ఎంత పిలిచినా స్పందించకపోవటంతో తలుపులు పగులగొట్టారు. వివేక్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతుండటం చూసి దిగ్భ్రాంతి చెందారు. వివేక్‌ను కిందికి దింపి కిమ్స్ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, తాలూకా ఎస్సై ఎం.గజేంద్రకుమార్ వివేక్ మృతదేహాన్ని, హాస్టల్ గదిని పరిశీలించారు. ఈనెల 21 నుంచి నాలుగో సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉండడంతో ఎక్కువగా చదువుతున్నాడని స్నేహితులు చెబుతున్నారు. వివేక్ తండ్రి భాస్కరరెడ్డి తిరుపతిలోని ఎస్బీఐలో అధికారిగా పనిచేస్తున్నారు. డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ, వివేక్ మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. వివేక్ ఆత్మహత్యకు ముందు తన వ్యక్తిగత ట్యాబ్‌లో ఉరి వేసుకోవడానికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు ఆధారాలు కనిపించాయన్నారు. కిమ్స్ వైస్ చైర్మన్ మోహనరాజు వివేక్ మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు. లాడ్జిలో ఉరి వేసుకుని యువకుడి మృతి కాణిపాకం: స్థానికంగా ఒక లాడ్జిలో యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఏఎస్ఐ యతిరాజులు కథనం మేరకు.. తిరుపతిలోని రైల్వే కాలనీకి చెందిన చంద్రారెడ్డి (29) మంగళవారం రాత్రి ఇక్కడ లాడ్జిలో రూము తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు రూము తలుపులు తెరవకపోవడంతో లాడ్జి సిబ్బంది అనుమానించారు. కిటికీలోంచి రూములోకి చూడగా ఉరి వేసుకుని ఉన్న యువకుడు కనిపించాడు. అనంతరం పోలీసులకు సమాచారమివ్వడంతో వారు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడు ఐరాల మండలం ఎం.జంగాలపల్లెకు చెందినవాడని, ప్రస్తుతం తిరుపతిలో నివాసం ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పోలీసులు చెప్పారు. ఏ కారణాల చేత ఆత్మహత్య చేసుకున్నాడో దర్యాప్తులో తేలాల్సి ఉంది. పలమనేరు మండలంలో వివాహిత.. గంగవరం: వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పలమనేరు మండలం తొప్పనపల్లెలో బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాలు..గ్రామానికి చెందిన సుబ్రమణ్యం, ఆయన భార్య పద్మ(35) తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆమె పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి వంటచేసింది. కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు, 108కు సమాచారం చేరవేశారు. అయితే మృతికి కారణాలేమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
'పద్మ' చెంతకు దాసరి..
మొయినాబాద్: ప్రముఖ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు అంత్యక్రియలు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు మొయినాబాద్ మండలం తోల్కట్ట సమీపంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నారు. దాసరికి ఇక్కడ 18 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉంది. నాలుగేళ్ల క్రితం ఆయన భార్య దాసరి పద్మ అంత్యక్రియలను ఇక్కడే నిర్వహించారు. ఆనాటి నుంచి ఫామ్‌హౌస్‌ను పద్మాగార్డెన్ అని పిలుస్తున్నారు. అంతేకాకుండా దాసరికి ఈ గార్డెన్తో చాలా అనుబంధం ఉందని తెలిసింది. అందుకే భార్య అంత్యక్రియలను ఇక్కడే నిర్వహించారు. దాసరి నారాయణరావును ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కలిసేవాడినని, ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడని తోల్కట్ట మాజీ సర్పంచ్, రైతు శంకర్ ముదిరాజ్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. -
ఒక పద్మ తల్లి
సందర్భం తన చైతన్యంతో పద్మ ఒక జీవితాన్ని ఎంచుకున్నది. న్యాయమో.. అన్యాయమో ఈ దోపిడీ వ్యవస్థ వేసే సవాళ్లను, శిక్షలను ఆమె స్వీకరించాలి. స్వీకరిస్తుంది. మరి ఆ తల్లి మరణానికి, ఆ అక్క జీవితానికి ఈ సమాజం బాధ్యత పడవద్దా?! పద్మ తల్లి చనిపోయింది. ఏప్రిల్ 29 ఉదయం బాత్రూంలోకి వెళ్లి పడిపోయింది. మెదడులో నరాలు చిట్లి చనిపోయినట్లు ఆ తరువాత వైద్యుడు చెప్పాడు. అప్పటికామె వారం రోజులుగా నలతగా ఉన్నదని, ఇంక తన పని అయిపోయిందని అంటూ ఉండేదని ఆమె కూతుళ్లు చెప్పారు. నలభై ఏళ్లు ఏడుగురు సంతానానికి సేవలు చేసి ఎవరితో చేయించుకోకుండా వెళ్లిపోయింది. యాభై ఏళ్ల నుంచి మానసికంగా ఎదగని కూతురును దగ్గర పెట్టుకొని ఆమె కోసమే ఒక గది, తనదైన ఒక సంసారం ఏర్పాటు చేసుకొని హైదరాబాద్‌లో ఎక్కడో మారుమూలలో ఉంటున్నది. ఆ కూతురును చంటిపాపలా చూసుకుంటున్నది. పద్మ కోసం ఆమె పదేళ్ల నిరీక్షణ ముగిసింది. బహుశా శనివారం ఏప్రిల్ 29 నుంచే ఆమె మట్టిపొరల్లో శాశ్వతంగా నిద్రపోతుంటుంది. ఈ పదేళ్లూ ఎప్పుడూ కంటి మీద కునుకు లేకుండా ఆ కూతురు కోసం నిరీక్షణ. హైదరాబాద్‌లో 1990ల ఆరంభంలో ఆమె మూడో కూతురు పద్మకు విప్లవ రాజకీయాలు అబ్బాయి. చైతన్య మహిళా సంఘంలో తొలి నాయకత్వంలో ఆమె ఉన్నారు. వాళ్లు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రతి పోరాటంలో ఆమె ఉన్నది. ఎక్కువ కాలం బహిరంగ ప్రజా ఉద్యమాల్లోనే పనిచేసింది. హైదరాబాద్‌లో బస్తీల్లో, విద్యార్థుల్లో, హాస్టల్స్‌లో ఆమె మహిళల్లో పనిచేసిన మేర తలలో నాలుకగా పనిచేసింది తన మెత్తటి నవ్వుతో మృదువైన మాట లతో ఎందరి స్నేహాలనో పొందింది. 1994 డిసెంబర్ నుంచి 1995 మార్చి వరకు జైలులో ఉన్న నక్సలైటు ఖైదీల, జీవిత ఖైదీల విడుదల కోసం చేసిన పోరాటానికి బయట వెల్లువెత్తిన సంఘీభావంలో చైతన్య మహిళా కెరటం కూడా ఉన్నది. 1999 సెప్టెంబర్‌లో ఈ జైలు పోరాటానికి నాయకత్వం వహించిన రాజకీయ ఖైదీ మోడెం బాలకృష్ణ విడుదలయ్యాడు. బహుశా 2000లో పద్మ బాలకృష్ణ సాహచర్యాన్ని ఎంచుకోవడమే ఆమె చేసిన పెద్ద నేరం అయింది. ఆ సహచర్యంలో ఆమె కొద్ది రోజు లైనా గడిపిందో తెలియదు. అప్పటికామె విశాఖపట్నంలో మహిళా ఉద్యమంలో పనిచేస్తున్నది. పదేళ్ల క్రితం భిలాయిలో ఒక సహచరితో పాటు ఆమె ఒక ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు ఏపీ ఎస్ఐబీ పోలీ సులు ఆమెను అరెస్టు చేశారు. అప్పటికే అనుమానంతో ఏపీహక్కుల సంఘాల నేతలకు ఫోన్లు చేసింది కాబట్టి ఆమె తన ప్రాణాలు కాపాడుకుంది. పోలీసులకు ఆ కక్ష ఉన్నది. రెండు రోజుల క్రితమే ఏప్రిల్ 27న పద్మ తల్లి ఫోన్ చేసింది. ‘‘పద్మను ఈరోజు కోర్టుకు తీసుకువచ్చారట. ఆమె లాయర్ ఫోన్ చేసి పద్మ విడుదలవుతుంది, ఎవరినైనా పంపించి తీసుకువెళ్లండి’’ అని. తన చిన్న కూతురు, మనమడు వెళ్తారని, ఎక్కడైనా తల తాకట్టు పెట్టయినా కారు ఏర్పాటు చేస్తానని, వెంట ఎవరైనా లాయరు వెళ్తారా అని అడిగింది. మాకు ఆశ్చర్యం అయింది. మాకు ఎవరికీ తెలియని సమాచారం. ఇంకా రెండు కేసులున్నాయి. ఒక కేసులో వాదనలు ముగిసి మే 15న తీర్పు ఉంది. మరో కేసు ట్రయల్‌కు ఎంత సమయం పడుతుందో తెలియదు. కాకపోతే కొన్నాళ్లుగా జడ్జి.. బంధువులు వచ్చి బెయిల్ పెట్టి, జమానత్ పెట్టి బంధువులే తీసుకుపోతే బెయిల్ ఇస్తానని అంటున్నాడట. కొన్నేళ్ల క్రితం తల్లి తప్ప బంధువులు ఎవరూ ఆమెను చూడ్డానికి రాలేదని అతనికి తెలుసు. ఇటీవల కాలంలోనైతే ఆమె లాయర్లు కూడా ఆమెను చాలా అరుదుగా కలుస్తున్నారు. ఆ తరువాత మరో హైసెక్యూరిటీ జైలు జగదల్పూర్కు ఆమెను పంపారు. అక్కడ సుదీర్ఘ కాలపు విచారణ తరువాత కేసులన్నీ కొట్టేసి విడుదలవుతాననుకున్న రోజు. తెలంగాణ నుంచి ఇద్దరు న్యాయవాదులు వెళ్లారు. కోర్టులో కేసు కొట్టేసి, విడుదల ఉత్తర్వులు ఇచ్చి అందుకోసం జైలుకు తిరిగి తీసుకువెళ్లే సమయానికి మరో రెండు కొత్త కేసుల్లో రెండు వారెంట్లు. ఆమె లోపలికి. కోర్టులో నోరు నొచ్చేలా వాదించిన న్యాయవాదులు అసహాయంగా బయటికి. ఈ తంతు నడుస్తూనే ఉంది. ఇంతకూ ఈ పద్మ పదేళ్లుగా ఎదుర్కొంటున్న కేసులు తన మీదివి కావు. ఆమె రాయ్‌పూర్ జైలు నుంచి విడుదలైనప్పుడు మిగిలిన కేసులు చూసినప్పుడు అర్థమైంది ఏమిటంటే ఈమె మొదటి అరెస్టు కన్నా ఎంతో ముందే ఆదిలాబాద్ అడవుల్లో ఎన్కౌంటర్లో అమరురాలైన ఒక పద్మ మీద నమోదయి ఉన్న ఎఫ్ఐఆర్ను ఈ పద్మ మీద చూపుతున్నారు. రాస్తున్నంత సేపూ నా భయ సందేహాలు ఏమిటంటే చైతన్య మహిళా సంఘం పది మంది నాయకత్వాన్ని మావోయిస్టులని రుజువు చేయడానికి పోస్టర్లు వేసినట్లుగా ఇప్పుడు వాటికి పద్మ ఫొటో కూడా జోడిస్తారేమోనని! అంతకన్నా తన కష్టాల నుంచి, నిరీక్షణ నుంచి విముక్తమైన ఆ తల్లి గురించి కాదు, ధైరాయిడ్తో, అనారోగ్యంతో జైలే చిరునామాగా మారిన పద్మ గురించీ కాదు. ఆ తల్లి వదిలి వెళ్లిన ఆ మానసికంగా ఎదగని మధ్యవయస్కురాలైన కూతురు శేషజీవితానికి ఆలనా, పాలనా ఏమిటి?. తన చైతన్యంతో పద్మ ఒక జీవితాన్ని ఎంచుకున్నది. న్యాయమో.. అన్యాయమో ఈ దోపిడీ వ్యవస్థ వేసే సవాళ్లను, శిక్షలను ఆమె స్వీకరించాలి. స్వీకరిస్తుంది. ఆమె రాజకీయాలను, ఆమె విశ్వాసాలను ప్రేమించే వాళ్లు, గౌరవించే వాళ్లు ఆమెకు అండగా ఉన్నారు. ఉంటారని ఆశిద్దాం. మరి ఆ తల్లి మరణానికి, ఆ అక్క జీవితానికి ఈ సమాజం బాధ్యత పడవద్దా?! వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు -
రైతులను తీవ్రవాదుల్లా చూస్తున్న ప్రభుత్వం
► బీజేపీ వరంగల్ అర్భన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ హన్మకొండ : రైతుల మార్కెట్లోనే రైతులను తీవ్రవాదుల్లా చిత్రీకరించి రాష్ట్ర ప్రభుత్వం నిర్భంధనాలు విధిస్తుందని బీజేపీ వరంగల్ అర్భన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. ఆదివారం హన్మకొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతులకు మార్కెట్లో మద్దతు ధర అందించక పోవడం టీఆర్ఎస్ ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లిన వారు పాస్‌పోర్టు, వీసాలతో వెళ్ళినట్లు రైతులు మార్కెట్‌కు ఆథార్ కార్డు, పహాణీనకల్ తీసుకురావాలని ఆంక్షలు విధించడం దుర్మార్గమన్నారు. రైతులు చేస్తున్న ఉద్యమాలను టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు. కందులు, పెసర్లకు బోనస్ ఇవ్వాలని రైతులు కోరితే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే రైతుకు కనీసం రూ.30 వేలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మిరప పంటకు బోనస్ ఇచ్చి ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వచ్చే ఏడాది నుంచి ఎకరాలకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు చొప్పున చెల్లిస్తామని చెప్పుతున్న ప్రభుత్వం మార్కెట్లో అన్యాయానికి గురవుతున్న రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులకు మేలు చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం మినహా ఆచరణలో ఏమి కనపడదని దుయ్యబట్టారు. ఉట్టి ఎక్కనోడు స్వర్గంకు నిచ్చెన వేసినట్లుగా సీఎం కేసీఆర్ రైతులకు మేలు చెసే రాజ్యం అంటు గొప్పలు చెప్పుకుంటున్నారని తూర్పారబట్టారు. ఇప్పటికైన మార్కెట్లో నిర్భందాలు ఎత్తివేసి, రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రైతులను సంఘటితం చేసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. రైతులకు బీజేపీ అండగా నిలుస్తుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పుల్యాల రవీందర్‌రెడ్డి, నాయకులు మారెపల్లి రాంచంద్రారెడ్డి, కొలను సంతోష్‌రెడ్డి, సంగాని జగదీశ్వర్, దామెర సదానందం, దొంతి మాదవరెడ్డి, రఘుపతి, ములుగు కృష్ణ పాల్గొన్నారు. -
ఏసీటీవో పద్మ హల్చల్
విజయవాడ: కృష్ణా జిల్లా తిరువూరులో ఏసీటీవో పద్మ హల్చల్ చేశారు. ఓ సిమెంట్ షాప్ వద్ద తనిఖీలు చేయాలంటూ హంగామా సృష్టించారు. సిమెంట్ షాపు నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పద్మ వారిపై రాళ్లు రువ్వడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. అయితే గత కొంతకాలంగా పద్మ మానసిక పరిస్థితి సరిగా లేదని బంధువులు వెల్లడిస్తున్నారు. గతంలో హైదరాబాద్ నుంచి అమరావతికి సైకిల్ తొక్కి ఆంధ్రా ఉద్యోగుల్లో పద్మ స్పూర్తి నింపిన విషయం తెలిసిందే. -
ఏసీటీవో పద్మ హల్చల్
-
తల్లి, కుమారుడిపై కత్తితో దాడి
విజయవాడ: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్ లో పనిచేసే పద్మ, ఆమె కుమారుడు నరేంద్ర సోమవారం ఉదయం బైక్‌పై వెళ్తుండగా శంకర్ అనే వ్యక్తి వారిపై కత్తితో దాడి చేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో తల్లీ,కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా కుమారుడు మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. పద్మతో గతంలో శంకర్ కు సన్నిహిత సంబంధాలు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల వీరిమధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని, అవే హత్యాయత్నానికి దారి తీసి ఉంటాయని అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
ఆశా కార్యకర్త అనుమానాస్పద మృతి
పెగడపల్లి: జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం వెంగళాయిపేటలో ఓ ‘ఆశ’ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మోకెనపెల్లి పద్మ ‘ఆశ’ కార్యకర్తగా పనిచేస్తున్నది. అయితే ఆమె గొంతు కోసి ఉండి రక్తపుమడుగులో మృతిచెంది ఉంది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేక ఎవరైనా హత్య చేశారా అనేది తెలియలేదు. భర్త వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎస్సై వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
మానవత్వం పరిమళించింది
బెహ్రయిన్‌లో తాటిపాక మహిళకు చిత్రహింసలు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో నాలుగు నెలలు దాతల సాయంతో స్వస్థలానికి మలికిపురం : ఉపాధి కోసం విదేశానికి వెళ్లిన ఆ మహిళను యజమానురాలైన తోటి మహిళే చిత్ర హింసలు పెట్టిన వైనమిది. చావు బతుకుల మధ్య సుమారు నాలుగు నెలలు కొట్టుమిట్టాడిన ఆమె దాతల సాయంతో ప్రాణాలతో స్వదేశంలోని ఇంటికి చేరింది. వివరాలిలా ఉన్నాయి. రాజోలు మండలం తాటిపాక గ్రామానికి చెందిన అనచూరి పద్మ సఖినేటిపల్లి మండలం శృంగవరప్పాడులోని తన అక్క ఇంటి వద్ద ఉండేది. ఇక్కడ నుంచి సుమారు రెండేళ్ల క్రితం ఉపాధి కోసం బెహ్రయిన్ దేశం వెళ్లింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో స్వస్థలం చేరుకుని, తిరిగి జూన్ 24న బెహ్రయిన్ చేరుకుంది. మొదటిసారి బాగానే చూసిన ఆ దేశంలోని యజమానురాలు రెండో దఫా వచ్చిన అనంతరం చిత్రహింసలు పెట్టడం ప్రారంభించింది. వెళ్లిన తరువాత 20 రోజుల పాటు కనీసం భోజనం కూడా పెట్టకుండా పద్మ పట్ల శాడిజంగా వ్యవహరించేది. ఇలాగైతే తాను బతికేది ఎలా? అని ప్రశ్నించిన పద్మను ఆ యజమానురాలు పొత్త కడుపుపై తన్నింది. స్పృహ కోల్పోయిన పద్మను ఆసుపత్రిలో చేర్చగా ఆపరేషన్ జరిగింది. ఆసుపత్రిలో కోలుకుంటున్న పద్మతో యజమానురాలు ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించుకుని వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచీ పద్మ అదే ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. ఫోన్ రాకపోవడంతో.. పద్మ నుంచి ఫోన్ రాకపోవడంతో శృంగవరప్పాడులోని ఆమె సోదరీమణులు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించడం ప్రారంభించారు. తాటిపాకలోని కేతా శ్రీను అనే వ్యక్తి ద్వారా మలికిపురం జీఎన్నార్ ట్రస్టు అధ్యక్షుడు, ప్రవాస భారతీయ వైద్యుడు గెద్డాడ నాగేశ్వరరావుకు విషయం చెప్పి సాయం చేయమని కోరారు. ఆయన బెహ్రయిన్లోని తెలుగు వారైన గేదెల సురేష్, పాస్టర్ నవీన్, పొన్నమండ శ్రీను, గాడి శ్రీనుల ద్వారా పద్మ ఆచూకీ కోసం ప్రయత్నించి రెండు నెలలుగా ఒక ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు గుర్తించారు. వారంతా చందాలు వేసుకుని ఆమెకు వైద్యం చేయించారు. దాదాపు నాలుగు నెలలపాటు ఆమె ఆసుపత్రిలో ఉంది. ఆరోగ్యం క్షీణించిన పద్మ స్వస్థలం రావాలంటే ఆమెకు విమానంలో మరో వైద్యుడి సహకారం అవసరం. దీంతో వీరంతా రూ.1.20 లక్షలు సమకూర్చి ఇండియాకు తీసుకు వచ్చారు. ఎట్టకేలకు గురువారం శృంగవరప్పాడు చేసుకున్న పద్మ తన వారికి చూసుకుని కన్నీరు మున్నీరైంది. ఆ దేశ మహిళ తనను తీవ్రంగా హింసించడమే గాక,అక్కడి ఎంబసీ కూడా కరుణించలేదని ఈ సందర్భంగా పద్మ వాపోయింది. దాతలు లేకుంటే ఈ రోజు తాను లేనంటూ కృతజ్ఞతలు తెలిపింది. -
కుషాయిగూడలో మహిళ దారుణ హత్య
హైదరాబాద్: పది రోజుల క్రితం అదృశ్యమైన మహిళ.. శవమై కనిపించింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అశోక్‌నగర్‌కు చెందిన పద్మ(40) గత పది రోజులుగా కనిపించకుండాపోయింది. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం డీఏ కాలనీలోని నిర్మానుష్య ప్రదేశంలో ఆమె శవమై కనిపించింది. స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన కుటుంబసభ్యులు పద్మగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను చంపి అక్కడ పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
జీవన ప్రమాణాలను మెరుగుపర్చండి
రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ పద్మ నెల్లూరు(పొగతోట): యానాదుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ పద్మ పేర్కొన్నారు. గోల్డెన్ జూబ్లీ హాల్లో బుధవారం నిర్వహించిన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (యానాదులు) ఏడో గవర్నింగ్ బాడీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో యానాదులకు జీవనోపా«ధులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి జిల్లాకు ఐటీడీఏ అధికారిని నియమించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపుతామని తెలిపారు. గిరిజన కాలనీల్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని, గిరిజనుల అభివృద్ధికి చేపడుతున్న నిర్మాణాల్లో నాణ్యత ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. యానాదుల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. సంక్షేమ పథకాలను యానాదులు సద్వినియోగం చేసుకునేలా ప్రతి జిల్లాలో వర్క్‌షాపులను నిర్వహించాలని కోరారు. గిరిజన మత్స్యకార సంఘాలకు పథకాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. కార్పొరేట్‌కు దీటుగా గిరిజన వసతిగృహాల్లో సౌకర్యాలను కల్పించాలని సూచించారు.æవిద్యార్థులు మధ్యలో చదువులను నిలిపేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించాలి పదో తరగతి చదివిన విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. అర్హులైన యానాదులకు ఏఏవై రేషన్‌కార్డులను మంజూరు చేసి సక్రమంగా రేషన్‌ను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న యానాదుల గృహాల స్థానంలో నూతన ఇళ్లు నిర్మించేలా చర్యలు చేపడతామన్నారు. సబ్‌ప్లాన్ నిధులను సమర్థంగా వినియోగించాలని సూచించారు. గిరిజన యువత అభివృద్ధి చెందేలా ఆటోలు, మేకలు, తదితర యూనిట్లను మంజూరు చేయాలని ఆదేశించారు. బ్యాంక్ అధికారులతో చర్చించి రుణాలను మంజూరు చేయించాలని తెలిపారు. యానాదుల కోసం ప్రత్యేక డ్రైవింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అనంతరం కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడారు. యానాదుల గృహనిర్మాణాల విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. పదో తరగతి ఫెయిలైన విద్యార్థినులను గుర్తించి వారిని పాఠశాలలు, హాస్టళ్లలో చేర్పించి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. యానాదుల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా జాయింట్ కలెక్టర్ అధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్సీ చెంగల్రాయుడు మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రతి జిల్లాలో సమావేశాలను నిర్వహించాలని కోరారు. అనేక అంశాలపై తీర్మానాలు చేశారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఐటీడీఏ పీఓ కమలకుమారి, సూపరింటెండెంట్ ఇంజినీర్ ప్రసాదరావు, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి, వ్యవసాయ, మత్స్య, పశుసంవర్థక శాఖల జేడీలు హేమమహేశ్వరరావు, సీతారామరాజు, శ్రీధర్‌బాబు, నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన గిరిజనాభివృద్ధి సంస్థ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
మహిళా హోంగార్డు హల్చల్
కరీంనగర్ రామగుండం ఎన్టీపీసీలో మహిళా హోంగార్డు హల్చల్ చేసింది. భవనం పైకి ఎక్కి దూకుతానని బెదిరించడంతో స్థానికంగా కలకలం రేగింది. స్థానికంగా నివాసముంటున్న మామిడి పద్మ హోంగార్డుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్ చిట్ లో తన చిట్టికి సంబంధిచి గడువు ముగిసినా డబ్బు చెల్లించడం లేదని.. మనస్తాపానికి గురై చిట్‌ఫండ్ భవనం పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆమెను కిందకు దించేందుకు యత్నిస్తున్నారు. -
వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు
ఓ మహిళనుకులం పేరుతో దూషించిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మన్సూరాబాద్‌కు చెందిన బానోతు పద్మ (32) నగరంలోని తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్లో స్టోర్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. ఇక్కడే రవాణా విభాగంలో పనిచేసే గజానన్ కొన్ని రోజుల క్రితం పద్మ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని పద్మ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా గజానన్ను పనిలో నుంచి తొలగించారు. ఇది మనసులో పెట్టుకున్న గజానన్ ఈ నెల 13వ తేదీన మద్యం సేవించి పద్మ ఇంటికి వచ్చి బెదిరించి కులం పేరుతో దూషించాడు. దీంతో బాధితురాలు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు గజానన్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డిప్యూటీ స్పీకర్‌కు మెుక్కలతో స్వాగతం
సిరిసిల్ల : అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఓ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సిరిసిల్లకు వచ్చారు. ఆమెకు టీఆర్ఎస్ నాయకులు బైపాస్ రోడ్డులో టీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. టీఆర్ఎస్వీ నాయకులు మొక్కలు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, వైస్ చైర్మన్ తవుటు కనకయ్య, ఏఎంసీ చైర్మన్ జిందం చక్రపాణి, కౌన్సిలర్లు దార్నం అరుణ, గుండ్లపల్లి పూర్ణచందర్, రిక్కుమల్ల సంపత్, వెంగల లక్ష్మీనర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు సామల దేవదాస్, గూడూరి ప్రవీణ్, సబ్బని హరీశ్, దిడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆడపిల్ల భారం అనుకున్నారు..
మూడోసారీ ఆడపిల్లే పుట్టిందని ఆ తల్లిదండ్రులు ఆమెను వదిలించుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం కొర్ర తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన నెహ్రూ, పద్మ దంపతులకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలున్నారు. మూడో కాన్పులో నెల క్రితం ఆడపిల్ల పుట్టింది. పేద కుటుంబమైనందున పోషించే స్తోమత లేక ఆ దంపతులు మూడో కుమార్తెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు గురువారం ఆ శిశువును జిల్లా కేంద్రంలోని శిశువిహార్ తరలించారు. -
కాంపౌండ్ రైలింగ్ కూలి మహిళ మృతి
మర్పల్లి: రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామంలో ఎదురింటి కాంపౌండ్ వద్ద కూర్చుని ఉన్న మహిళలపై రైలింగ్ కూలింది. ఈ ఘటనలో పద్మ(30) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే మరో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. గమనించిన స్థానికులు గాయపడిన లక్ష్మమ్మను ఆస్పత్రికి తరలించారు. మృతురాలు పద్మకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
భార్యను గడ్డపారతో కొట్టి చంపిన భర్త
వరంగల్ : వరంగల్ జిల్లా నర్సంపేట శివారులోని కాకతీయ నగర్‌కు చెందిన బైరగోని ఎల్లయ్య గౌడ్ తాగిన మత్తులో భార్య పద్మను గడ్డపారతో కొట్టి హతమార్చాడు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎల్లయ్యగౌడ్, పద్మలకు 23 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. తాగుడుకు బానిసైన ఎల్లయ్యగౌడ్ తరుచూ భార్యతో ఘర్షణ పడేవాడు. ఆ క్రమంలో ఎప్పటిలాగే శనివారం అర్థరాత్రి కూడా తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పక్కనే ఉన్న గడ్డపారతో పద్మ తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో కుప్పకూలింది. కుటుంబసభ్యులు ఆమెను వెంటనే నర్సపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతిచెందింది. భార్య మృతి చెందిన విషయం తెలిసిన ఎల్లయ్యగౌడ్ భవనంపైకి ఎక్కి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో రెండు కాళ్లు విరిగాయి. అతనిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై నర్సపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య అలా అన్నందుకు...
నార్సింగి (మహబూబ్‌నగర్): మద్యం మానేయమని భార్య చెప్పిందనే కోపంతో ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎల్లప్ప(35), పద్మ దంపతులు జీవనోపాధి కోసం వచ్చి పీరంచెరువు ప్రాంతంలో నివసిస్తున్నారు. పద్మ స్థానికంగా ఇళ్లలో పని చేస్తుండగా ఎల్లప్ప ఎలక్ట్రీషియన్ పనులు చేసేవాడు. మద్యానికి బానిసగా మారిన ఎల్లప్పను పద్మ తాగవద్దంటూ హెచ్చరిస్తోంది. ఈ విషయమై శుక్రవారం రాత్రి వారి మధ్య గొడవ జరిగింది. శనివారం ఉదయం పద్మ కుమారుడిని తీసుకోని ఇళ్లలో పని చేసేందుకు వెళ్ళింది. మధ్యాహ్నం ఇంటికి రాగా ఎల్లప్ప ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
న్యాయం కోరుతున్న పోలీసు భార్య
► ఏడాది నుంచి పట్టించుకోని వైనం ► ఓ ఎమ్మెల్యే గన్‌మన్ నిర్వాకం కాకినాడ: నాలుగేళ్ల క్రితం తనను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న ఓ ఎమ్మెల్యే గన్‌మన్.. బిడ్డ పుట్టాక అదనపు కట్నం కోసం పుట్టింట వదిలేశాడని ఆరోపిస్తూ ఓ గిరిజన మహిళ బుధవారం స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించింది. పెదమల్లాపురానికి చెందిన బాధితురాలు చింతోజు పద్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అడ్డతీగలకు చెందిన చింతోజు వెంకటరమణతో 2012 ఏప్రిల్ 25న పెద్దల సమక్షంలో పద్మ పెళ్లి జరిగింది. అతడికి రూ.1.10 లక్షల కట్నం, బంగారపు గొలుసు, ఉంగరం, ఆడపడుచుకు లాంఛనాలు, రూ.30 వేల నగదు ఇచ్చారు. ఆరు నెలలు భార్యాభర్తల కాపురం సజావుగా సాగింది. అనంతరం అదనపు కట్నం కావాలని, ఇల్లు అమ్మి సొమ్ము తెమ్మని ఆమె భర్త, అత్తమామలు వెంకటేశ్వరరావు, లక్ష్మి, ఆడపడుచు ప్రియారాణి, మరిది మల్లికార్జున వేధించారు. గర్భిణిగా ఉన్న ఆమెకు భోజనం పెట్టకుండా, దూషించారు. గదిలో బంధించి వెంకటరమణ బెల్టుతో కొట్టాడు. దీంతో పుట్టిన మగబిడ్డ మూడో రోజే కన్నుమూశాడు. ఓసారి ఆమెపై హత్యాయత్నం కూడా జరిగింది. కాగా ఆమె భర్త వివాహేతర సంబంధాలు నెరపుతూ, ఓసారి సస్పెన్షన్‌కు కూడా గురయ్యాడు. గ్రామ పెద్దలు మందలించినా.. వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆమెకు ఆడబిడ్డ పుట్టగా, బాలింతరాలని కూడా చూడకుండా వెంకటరమణ కొట్టేవాడు. ఏడాది క్రితం ఆమెను ఇంటికి పంపేసి, భర్త పట్టించుకోవడం మానేశాడు. తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీకి, అన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొంది. -
మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని...
నకిరేకల్ : ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ఓగోడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం... నకిరేకల్ మండలం ఓగోడు గ్రామానికి చెందిన అక్కనపల్లి పిచ్చయ్య-సోమక్క దంపతులకు నలుగురు కుమార్తెలు. చిన్న కుమార్తె అయిన అక్కనపల్లి పద్మ (23) గత రెండు సంవత్సరాల క్రితం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. మొదటి పోస్టింగ్ కట్టంగూర్ పోలీస్‌స్టేషన్‌కు కెటాయించారు. అక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె స్వగ్రామమైన ఓగోడులో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పద్మ ప్రేమలో పడింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయానికి వచ్చారు. అయితే ఏమైందో ఏమోకాని సదరు యువకుడు నాలుగు రోజుల క్రితం మరో అమ్మాయితో వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన పద్మ ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో ఇంట్లో ఉన్న పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలో పడి ఆమెను కుటుంబ సభ్యులు నకిరేకల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి పిచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. అనంతరం పద్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. గ్రామంలో జరిగిన పద్మ అంత్యక్రియలలో నల్లగొండ డీఎస్పీ సుధాకర్, శాలీగౌరారం, నకిరేకల్ సీఐలు ప్రవీణ్‌కుమార్, వెంకటేశ్వరరావు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రు, మహిళా పోలీసు సంఘం జిల్లా ప్రతినిధి సైదాభి, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మాయమాటలు చెప్పి ...
పెళ్లి చేసుకోమని ప్రియురాలి మౌనదీక్ష సుందరాడ(తెర్లాం రూరల్): ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో ఒప్పుకొని ముఖం చాటేశాడొక ప్రేమికుడు. దీంతో దగాపడిన ప్రేమికురాలు సుందరాడలోని ప్రేమికుని ఇంటి ముందు బుధవారం మౌనదీక్ష ప్రారంభించింది. బాధితురాలు పద్మ విలేకరులకు అందించిన వివరాలివి. సుందరాడ గ్రామానికి చెందిన ముత్తా పెదలక్ష్మణ, సీతల కుమార్తె పద్మ(19) అదే గ్రామానికి చెందిన సిగిరికోట గణపతి, కృష్ణవేణిల కుమారుడు శివాజీతో ఏడాదికి పైగా ప్రేమ వ్యవహారం నడిచింది. కానీ పద్మకు 2015లో పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామానికి చెందిన శంకర్‌తో తల్లిదండ్రులు వివాహం చేశారు. పద్మ, శంకర్లు హైదరాబాద్‌లోని సనత్‌నగర్ లో హాయిగా కాపురం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో శివాజీ హైదరాబాద్ వెళ్లి పద్మకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఇది భర్త శంకర్‌కు తెలియడంతో ఉభయుల తల్లిదండ్రులు, రెండు గ్రామాల పెద్దల ముందు సమస్య పెట్టాడు. శివాజీని ఇరు గ్రామాల పెద్దలు నిలదీయగా పద్మ అంటే తనకు ఇష్టమని, భర్తతో విడాకులు తీసుకుంటే పెళ్లి చేసుకుంటానన్నాడు. దీంతో ఇరు గ్రామాల పెద్దలు పద్మ, శంకర్లకు విడాకుల అగ్రిమెంట్లు రాయించి పద్మను సుందరాడకు తీసుకొచ్చారు. సుందరాడ వచ్చాక శివాజీ పెళ్లికి నిరాకరిస్తున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసు స్టేషన్లో కేసులు పెట్టనని, శివాజీ పెళ్లి చేసుకొనేంత వరకు అతని ఇంటి ముందు నుంచి కదిలే ప్రసక్తి లేదని పద్మ స్పష్టం చేసింది. ఆమె చెప్పిన విషయాలన్నీ వాస్తవమని గ్రామస్తులు చెప్పారు. పద్మ ప్రేమ వ్యవహారంపై ప్రియుడు శివాజీని ప్రశ్నించగా తనకెలాంటి సంబంధం లేదని, కావాలనే నిందలు వేస్తున్నారన్నాడు. పద్మ, శివాజీ ప్రేమ వ్యవహారంపై ఫిర్యాదు అంద లేదని తెర్లాం ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. శివాజీపై కేసు నమోదు చేయవద్దని, అతనితో పెళ్లి చేయించమని పద్మ కోరిందన్నారు. సమస్యపై గ్రామపెద్దలతో మాట్లాడుకోవాలని సూచించినట్టు తెలిపారు. నా కుమార్తెకు న్యాయం చేయండి నా కుమార్తె ప్రేమించిన శివాజీతో వివాహం చేయించి న్యాయం చేయండి. కుమార్తెకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే శివాజీ వే ధించాడు. భర్తతో తెగతెంపులు చేయించాడు. పెళ్లి చేసుకుంటానని గ్రామ పెద్దల ఎదుట చెప్పి ఇప్పుడు కాదనడం ఎంతవరకు న్యాయం. - ముత్తా పెదలక్ష్మణ -
బైక్ ఢీకొని మహిళ మృతి
నిద్రిస్తున్న మహిళను బైక్ ఢీకొనడంతో ఆమె తీవ్ర గాయాలతో మృతి చెందింది. ఖమ్మం జిల్లా బయ్యారం మండలం కారుకొండ వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే పెసరకుప్ప వేసుకుని బానోతు పద్మ (36) నిద్రిస్తోంది. ఓ బైక్ వచ్చి ఆమెను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్
హైదరాబాద్ లో చైన్ స్నాచర్ లు మరో సారి రెచ్చి పోయారు. సరూర్ నగర్ ప్రాంతంలో శనివారం ఉదయం చైన్ స్నాచింగ్ ఘనట చోటు చేసుకుంది. స్థానిక మహిళ పద్మ(25) ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా.. బైక్ పై వచ్చిన యువకులు ఆమె మెడలో ఉన్న గొలుసు తెంచుకెళ్లారు. చోరీ అయిన బంగారం నాలుగున్నర తులాలు ఉంటుందని బాధితులు తెలిపారు.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో ఘటనలో సైదాబాద్ పరిధిలోని రెడ్డి కాలనీ కి చెందిన శాంతి లత ఉదయం పాల కోసం రోడ్డు పై నడిచి వెళుతుండగా.. వెనక నుంచి బైక్ పై వచ్చిన అగంతకులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్
-
నాగిని ఏం చేసింది?
కేయస్ నివాస్, సందీప్తి, పద్మ హీరో హీరోయిన్లుగా శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వంలో కె. సంధ్యారాణి నిర్మించిన చిత్రం ‘నాగిని’. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సంధ్యారాణి మాట్లాడుతూ - ‘‘వైవిధ్యమైన కథ, కథనాలతో ఈ చిత్రం ఉంటుంది. నాగినీ ఎవరు? ఏం చేసింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. కేయస్ నివాస్ స్వరపరచిన పాటలు ఓ హైలైట్’’ అన్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు: సంధ్యారాణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌కుమార్ గుర్రం, -
మహిళ లాకప్ డెత్
► అసిఫ్‌నగర్ పోలీసుల విచారణ సమయంలో కుప్పకూలిన పద్మ ► ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి ► మృతురాలి ఒంటిపై గాయాలున్నట్టు చెబుతున్న పోస్టుమార్టం నివేదిక ► ఇన్స్పెక్టర్తో సహా ఏడుగురిని సస్పెండ్ చేసిన హైదరాబాద్ సీపీ సాక్షి, హైదరాబాద్ సిటీబ్యూరో: నగరంలో మరో లాకప్ మరణం. ఈ నెల తొలివారంలో మారేడ్‌పల్లి స్టేషన్లో బన్నప్ప అనే వ్యక్తి పోలీసుల దెబ్బలకు మృతి చెందిన ఘటన మరువకముందే... తాజాగా ఆసిఫ్‌నగర్ పోలీసు స్టేషన్లో ఖాకీ లాఠీల దెబ్బకు మరో మహిళ బలయింది. అయితే ఈ కేసులో ఫిర్యాదు నుంచీ మరణం దాకా అన్నీ గందరగోళంగానే ఉండటం చర్చనీయాంశమైంది. శుక్రవారం మెహిదీపట్నం అయోధ్యనగర్‌కు చెందిన దీప్తిరాజ్.. సిరి బ్యూటీ పార్లర్ వద్ద తన బ్యాగు పోయిందని ఆసిఫ్‌నగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బ్యూటీ పార్లర్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో బ్యాగ్ తీసుకుంది మంజుల, లక్ష్మీలుగా గుర్తించారు. వారిని శనివారం ఉదయం పిలిపించి విచారించగా నక్కల పద్మ ఇంట్లో దాచిపెట్టామని చెప్పారు. అక్కడికి వెళ్లి సోదా చేయగా ఆభరణాలు దాచే డబ్బాలు దొరికాయి. కానీ అందులో విలువైన వస్తువులేవీ లేవు. దీంతో నక్కల పద్మను పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. ఎక్కువ సమయం పోలీసు స్టేషన్లో పెట్టడం వల్ల అస్వస్థతకు గురవడంతో శని వారం రాత్రి 11.30 గంటలకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె తెల్లవారుజామున 4 గంటలకే మృతి చెందిందని తెలుస్తోంది. అయితే 6.30 గంటలకు చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు. షుగర్ లెవల్స్, పల్స్ రేట్ పడిపోవడంతో కోమాలోకి వెళ్లి మరణించిందని అంటున్నారు. మృతురాలి శరీరంపై గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. అయితే, పద్మ మరణంపై పోలీసులు మరోరకంగా చెబుతున్నారు. ఆమెకు కల్లు తాగే అలవాటు ఉందని, ఆరోగ్య స్థితి బాగాలేదని భోజగుట్ట శివాజీనగర్‌కు చెందిన నక్కల రాజు తెలిపినట్టు పోలీసులు తెలిపారు. భోజగుట్టకు చెందిన పద్మ (38) అంత్యక్రియలను ఆసిఫ్‌నగర్ దేవునికుంట శ్మశానవాటికలో నిర్వహించారు. ఆమెకు ఇద్దరు కుమారులు సాయి(15), రవి(14). ఫంక్షన్ హాళ్లల్లో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. పద్మ మృతితో కుమారులు రోదించడం అందరినీ కంటతడిపెట్టించింది. దీప్తిరాజ్ ఫిర్యాదు ఏంటంటే... కుమార్తెకి అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం మెహిదీపట్నంలోని అపూర్వ ఆస్పత్రికి తీసుకెళ్లానని దీప్తిరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే సమయంలో పక్కనే ఉన్న సిరి బ్యూటీ పార్లర్‌కు వెళ్లానని, బ్యాగ్‌ను మరిచిపోయానని తెలిపారు. తిరిగి వచ్చి చూడగా ఆ బ్యాగ్ కనిపించలేదన్నారు. అందులో డైమండ్ చెవి దుద్దులు, నెక్లెస్, పట్టాగొలుసులు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే కుమార్తెను ఆస్పత్రికి తీసుకెళ్తున్నప్పుడు బ్యాగ్‌లో ఆభరణాలు తీసుకెళ్లాల్సిన అవసరమేంటనేది ప్రశ్నగా మారింది. దీప్తి భర్త చంద్రశేఖర్‌తో గొడవపడి కోపంతో సొమ్ములు బ్యాగ్‌లో పెట్టుకుని వచ్చిందని భావిస్తున్నారు. సిరి బ్యూటీ పార్లర్ సిబ్బంది పరిచయస్తులు కావడంతో బ్యాగ్ అక్కడ పెట్టి... పుట్టింటికి వెళ్లేందుకు ఆటో కోసం వెళ్లింది. ఈ సమయంలోనే బ్యాగ్ పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వాస్తవం దాచి మరో రకంగా ఎందుకు ఫిర్యాదు చేశారనేది అయోమయంగా ఉంది. సీపీ సీరియస్.. ఏడుగురిపై వేటు: ఓ మహిళను అర్ధరాత్రి వరకు పోలీసు అదుపులో ఉంచుకుని విచారించడంపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. మహిళను సాయంత్రం 6 గంటల వరకే విచారించాలన్న నిబంధనను మరిచి అర్ధరాత్రి వరకు ఉంచి, ఆమె అనారోగ్యానికి కారకులైన ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో ఆసిఫ్‌నగర్ ఇన్స్పెక్టర్ కె.శ్రీకాంత్, ఎస్ఐ హృషీకేశ్, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ ఎస్కే చాంద్ బాషా, హెడ్‌కానిస్టేబుల్ మహమ్మద్ నాదర్ ఆలీ, కానిస్టేబుళ్లు ఎస్.ప్రతాప్, మహమ్మద్ ఖాజా, మహమ్మద్ మంజూర్ అహ్మద్‌లు ఉన్నారు. ఈ కేసుకు సీసీఎస్ ఏసీపీ సోమేశ్వరరావును విచారణాధికారిగా నియమించారు. పద్మ శరీరంపై తీవ్ర గాయాలు: సీఎంవో శంకర్ ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ నుంచి తీసుకువచ్చిన పద్మ శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని ఉస్మానియా ఆస్పత్రి క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) శంకర్ తెలిపారు. పద్మ రెండు చేతులు, కాళ్లతోపాటు శరీరంలోని అనేక ప్రాంతాల్లో పోలీసులు తీవ్రంగా కొట్టిన దెబ్బలు ఉన్నాయన్నారు. క్యాజువాలిటీకీ తెచ్చినప్పుడు బీపీ, షుగర్ తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఆమెకు అయిన గాయాలు ఆస్పత్రికి తీసుకురావడానికి సుమారు ఐదారు గంటలకు ముందు అయినట్లుగా తెలుస్తోందని తెలిపారు. రాత్రి ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో పద్మను ఏఎంసీ వార్డుకు తరలించారని, పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం 6:15 గంటల సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహానికి వీడియో చిత్రీకరణ ద్వారా డాక్టర్ రమేష్, సుధలు పోస్ట్‌మార్టం నిర్వహించారు. -
సీఐతో సహా ఆరుగురి సస్పెన్షన్
హైదరాబాద్: నగరంలో కలకలం రేపిన పద్మ అనే మహిళ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సీఐతో సహా ఆరుగురు పోలీసులను సీపీ మహేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు ప్రధాన కారణమైన సీఐ శ్రీకాంత్ , ఎస్సై రుషికేశ్, ఏఎస్సై చాంద్ పాషాలతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు ఖాజా, ప్రతాప్ , మంజూర్ ఆలీలను సీపీ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ఆదివారం పూర్తి విచారణ జరిపిన తరువాత వారిపై చర్యలు తీసుకున్నారు. ఆసిఫ్ నగర్ కు చెందిన పద్మ అనే మహిళను విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. అయితే పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా బాధిత మహిళను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. పోలీసుల విచారణలోనే పోలీస్ స్టేషన్లో పద్మ మృతి చెందిందని.. అనంతరం ఉస్మానియాకు తరలించారని తెలుస్తోంది. అయితే.. పద్మది లాకప్ డెత్ కాదని, సహజ మరణమేనని పోలీసులు వాదించారు. కాగా, ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా విచారణ చేపట్టిన సీపీ.. దీనికి కారణమైన ఆసిఫ్ నగర్ పోలీసులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
మహిళ అనుమానాస్పద మృతి
మిర్యాలగూడ: అనుమానాస్పద స్థితిలో ఒక మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఇందిరమ్మకాలనీలో లేఆవుట్-1లో బుధవారం జరిగింది. వివరాలు.. పట్టణానికి చెందిన శ్రీనివాస్ ఒక ప్రైవేట్ కళాశాలలో క్లర్క్ గా పని చేస్తున్నాడు. కాగా, అతని భార్య పద్మ(30) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే, భర్త, ఆడపడుచులే తమ కుమార్తెను హత్య చేసి ఉరి వేసి ఉంటారని పద్మ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీ ఎలక్షన్స్‌ని కాస్ట్లీ ఎలక్షన్స్ చేశారు
-
పెళ్లి కోసం యువతి పోరాటం
గంటావారిగూడెం (నల్లజర్ల రూరల్):ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడి ఇంటి వద్ద ఓ యువతి మంగళవారం ఆందోళనకు దిగింది. గంటావారిగూడెంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడేనికి చెందిన సిరిబత్తుల పద్మ గంటావారిగూడెంలో తన తాతయ్య ఇంట్లో ఉంటూ జీడిగింజల ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. ఇదే గ్రామానికి చెందిన మట్టా రాంబాబుతో ఆమె ప్రేమలో పడింది. రెండేళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామని పెళ్లి ప్రసక్తి తీసుకువస్తే రాంబాబు మొహం చాటేశాడని పద్మ తెలిసింది. ఈ విషయమై ఈనెల 15న అనంతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువర్గాల వారిని పిలిపించి మాట్లాడారు. పెద్దలు సర్దుబాటు చేస్తారని చెప్పినా వినకుండా మంగళవారం ఉద యం రాంబాబు ఇంటి ఎదుట బైఠాయించి నిరసన చేపట్టింది. విషయం తెలుసుకున్న ఎస్సై రాంబాబు అక్కడికి వెళ్లి పద్మ తో మాట్లాడారు. పద్మ మేనమామ మాట్లాడుతూ బుధవారం విషయూన్ని సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
తిరుమలః తిరుమలలో బుధవారం ఓ ప్రేమజంట ఆత్మహత్యయత్నంకు పాల్పడింది. వీరిని 108 అంబులెన్స్‌లో స్ధానిక అశ్విని ఆస్పత్రిలో వైద్యం అందజేసారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్ధితి స్ధమితంగానే ఉంది. వివరాల్లోకి వెళ్లగా.. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం సమీపంలోని ఈడిగపల్లెకు చెందిన రవికుమార్(28),పద్మా (25) వేరు వేరు కులాలు అయినప్పటికీ గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ పెద్దలకు విషయం తెలిస్తే పెళ్లికి ఒప్పుకోరనే ఉద్దేశ్యంతో గత రెండు రోజుల క్రితం తిరుమలకు వచ్చారు. స్ధానిక వరాహస్వామి కాటేజి -1 లో 314 నెంబరు గదని అద్దెకు తీసుకున్నారు. సోమవారం సాయంత్రం శ్రీవారి ఆలయం ముందున్న అఖిలాండం వద్ద నిలబడి శ్రీవారిసాక్షిగా రవికుమార్ పద్మా మెడలో తాళికట్టాడు. పెళ్లి చేసుకున్న విషయాన్ని బుధవారం ఉదయం ఇరు కుటుంబ పెద్దలకు సమాచారం ఇచ్చారు. అయితే వారి పెద్దలనుండి సానుకూల స్పందన లభించలేదు. దీంతో మనస్తాపానికి గురైయిన రవికుమార్, పద్మాలు తిరుమలలోనే చనిపోవాలని నిర్ణయించుకున్నారు. తిరుపతికి వెళ్లి పురుగుల మందు తెచ్చుకుని అతిధిగృహంలో తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతరం వారే , తమను రక్షించాలంటూ 108కు కాల్ చేసారు. ఈ మేరకు హుటాహుటిన ఘటన ప్రాంతానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది రవికుమార్, పద్మాలను అశ్విని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయాకు తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్ధితి బాగానే ఉందని వైద్యులు మీడియాకు తెలిపారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ మేరకు పద్మా మీడియాతో మాట్లాడుతూ కులాలు వేరనే కారణంతో మా పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని, పెళ్లిచేసుకున్న విషయాన్ని తెలియజేస్తే తిరిగి మళ్లితిట్టారని తెలిపింది. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది.