- సమన్వయానికి ప్రతిపక్ష పార్టీలు ఓకే..
- టీఆర్‌ఎస్‌కు ఆరు, టీడీపీకి ఒకటి
- సభ్యుల స్థానాలతోనే కాంగ్రెస్ సంతృప్తి
- నేడు జెడ్పీ స్థాయి సంఘాల ఎన్నికలు
జిల్లా పరిషత్ : జిల్లా పరిషత్‌లో కీలకమైన స్థాయి సంఘాల్లో సభ్యుల నియామకంలో అధికార పార్టీదే హవా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరిన 60 రోజుల్లో స్థాయి సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ గడువు వచ్చే నెల 5వ తేదీతో ముగియనుండగా, జిల్లా పరిషత్ సమావేశంలో ఆదివారం స్థాయి సంఘాల ఎన్నికల కో సం ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అధికార పార్టీకి చెందిన మంత్రులతో పాటు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొనే అవకాశం ఉంది.
జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు రాజ్యసభ సభ్యు లు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ముగ్గురు రాజ్యసభ, ముగ్గురు లోక్‌సభ మొత్తం ఆరుగురు ఎంపీలు ఉన్నారు. అధికార పా ర్టీకి చెందిన వారిలో ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఐదుగురు ఎమ్మె ల్యేలు ఉండగా ప్రతిపక్షాలకు చెందిన వారిలో ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. జిల్లా పరి షత్ పీఠాన్ని టీడీపీ, కాంగ్రెస్‌లోని తిరుగుబాటు సభ్యులతో టీఆర్‌ఎస్ దక్కించుకున్నప్పటికీ సభ్యులందరికీ కమిటీల్లో స్థా నం కల్పించడంలో ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.
వారం రోజులుగా చర్చలు
స్థాయి సంఘాల ఎన్నిక విషయమై వారం రోజులుగా టీఆర్‌ఎస్ నాయకులు తమ జెడ్పీటీసీ సభ్యులతో సమావేశమై ఏ సభ్యుడు ఎందులో ఉండాలనే విషయమై చర్చించారు. పంచాయతీరాజ్ చట్ట ప్రకారం జెడ్పీ స్థాయి సంఘాల్లోని నాలుగు కమిటీలకు చైర్‌పర్సన్, ఒక కమిటీకి వైస్ చైర్మన్ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. మిగిలిన రెండు కమిటీలపై కొద్దిపాటి సందిగ్ధత నెలకొన్నా అధికార పార్టీ ముఖ్యనేతలు చర్చల ద్వారా పరిష్కరించినట్లు తెలిసింది. మహిళా, శిశు సంక్షేమం ఉన్న 5వ కమిటీకి సంగెం, రఘునాథపల్లి జెడ్పీటీసీల పేర్లు పరిశీలనలో ఉండగా 6వ కమిటీ అయిన సోషల్ వెల్ఫేర్‌కు పర్వతగిరి జెడ్పీటీసీ పేరు ఖరారైనట్లు సమాచారం.
టీడీ పీకి చెందిన చెట్టుపల్లి మురళీధర్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున ఆయన వ్యవసాయం ఉన్న మూడో కమిటీకి నేతృత్వం వహిస్తారు. దీంతో ఆరు కమిటీలకు టీఆర్‌ఎస్, ఒక కమిటీకి టీడీపీ నేతలు ప్రాతిని థ్యం వహిస్తారు. కాంగ్రెస్ సభ్యులు మెజార్టీగా ఉన్నప్పటికీ చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా వారు రెండు వర్గాలుగా చీలిపోయారు.
దీంతో వారికి కమిటీలను కైవసం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. చైర్‌పర్సన్, వైస్ చైర్మన్లు ప్రాతినిథ్యం వహించే కమిటీలు మినహా మిగిలిన రెండు కమిటీల్లో ఒక కమిటీలో చైర్మన్‌గా తమకు అవకాశమివ్వాలని కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యు లు చైర్‌పర్సన్‌తో పాటు టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్లగా.. వారు తిరస్కరించారని సమాచారం.
ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనాయకులతో చర్చించినా టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నందున చేసేదేం ఉండదని చెప్పినట్లు తెలుస్తోంది. చివరకు ముఖ్య కమిటీల్లో తమకు సభ్యులుగానైనా అవకాశం కల్పించాలన్న కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుల ప్రతిపాదనలకు అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు ఒకటి, ఏడో కమిటీల్లో వారికి స్థానం దక్కనున్నట్లు తెలిసింది. కాగా, స్టాండింగ్ కమిటీల్లో ఎవరెవరెకి ఏయే కమిటీల్లో స్థానం కల్పించాలన్న నిర్ణయం జరిగిపోవడంతో ఆదివారం నాటి సమావేశం మొక్కుబడిగానేసాగే అవకాశం కనిపిస్తోంది.
ఏర్పాట్లలో జెడ్పీ అధికారులు...
జెడ్పీ స్టాండింగ్ కమిటీల ఎన్నికలకు పో టీ జరుగుతుందని ప్రచారం కావడంతో వారం రోజులుగా జెడ్పీలోని మీటింగ్ విభాగం ఉద్యోగులు కసరత్తు ప్రారంభిం చారు. పంచాయతీరాజ్ చట్టం పుస్తకాల ను చదివి వడపోసి నిబంధనలను పరిశీ లించారు. అలాగే, ఎన్నికలు నిర్వహిం చాల్సి వస్తే అవసరమయ్యే ఫార్మాట్లను రూపొందించుకుని, బ్యాలెట్లు కూడా సిద్ధం చేశారు. చివరకు సంఘాలన్నీ ఏకగ్రీవం కానున్నట్లు తేలడంతో ఉద్యోగులు ఊనిరి పీల్చుకున్నారు.